Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
అంత్యకాల సంఘటనలు - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    6 అధ్యాయము - శేషించిన వారి జీవనశైలి మరియు కార్యములు

    సేవ దృపదం మరియు ఆత్మత్యాగం

    సంపు మంతయు సేవా దృపదము కలిగిన స్థానము తీసుకొను వరకు ప్రభువు వేచియున్నాడు కనక ప్రతి వారు తన కున్న సామర్ధ్యత కొలది ఆయన కొరకు పని చేయవలెను. సువార సేవా పరిచర్యను నెరవేర్చుటలో, దేవుని సంఘములో నున్న సభ్యులు వారు నియమించిన పనిని ఇంట్లో మరియు విదేశాలలో అవసరమైన నియమాలలో చేసే, త్వరలోనే ప్రపంచమంత హెచ్చరించబడుతుంది, మరియు ప్రభువైన యేసు ఈ భూమ్మీదకి శక్తితోను మరియు గొప్ప మహిమతో తిరిగి వస్తాడు - అపొస్తలుల కార్యములు, 111 (1911).LDETel 51.1

    ప్రతి చోటా వ్యక్తిగత ప్రయత్నం కోసం సంస్థల పనిని ప్రత్యామ్నాయంగా ఉంచే దోరణి ఉంది. మానవ జ్ఞానం ఒకే కేంద్రముగా ఉండుటకు, గొప్ప సంఘములు మరియు సంస్థలను నిర్మించడానికి కృషి చేస్తుంది. ఎందరో ప్రజలు సంస్థలోను మరియు సేవా సంఘలోను మర్యాదపూర్వకమైన కార్యమునలో నిమగ్నమైయున్నారు. అయితే వారు ప్రపంచముత సంబందము లేకుండ దూరంగా ఉంటున్నారు. కనుక వారి హృదయలు క్షినించిపోయినవి, మరియు స్వయంగ్రహీత మరియు ప్రభావితము చేయలేనివారు దేవుని యెడల ప్రేమైతే ఉంది కాని మనుష్యుని యెడల వారి ఆత్మ నశించిపోయింది. క్రీస్తు తన అనుచరులకు వ్యక్తి గతమైన పని అప్పగిస్తాడు- ఇది మనుష్యుని బదులుగా మరోకరు చేయపలసిన పని కాదు, ఇది పేదలకు మరియు అనారోగముతోవున్న వారికి పరిచర్యచేయుట, నశించినవారికి సువార్తను ప్రకటించుట, ఈ పని సంఘమునకుగాని లేక సంస్థకిగాని విడిచిపెట్టకూడదు, అది వ్యక్తిగత బాధ్యత, వ్యక్తిగత కృషి, వ్యక్తిగత త్యాగం, సువార్త యొక్క అవసరమైయుంది. -ది మినిస్ట్రీ అఫ్ హీలింగ్ , 147 (1905LDETel 51.2

    నేను వచ్చువరకు పని ధ్యాస కలిగివుండు.

    క్రీస్తు ఇలా అనేను “నేను వచ్చువరకు వ్యాపారము చేయుడని వారితో చెప్పెను, (లూకా 19:13). అవును మన జీవిత చరిత్ర ఇక కొన్ని సంవత్సరాలలో మగిసిపోవచ్చు, అయితే అంతవరకు పనికలిగివుందాము. -ది రివ్యూ అండ్ హెరాల్డ్, ఏప్రిల్ 21, 1896LDETel 51.3

    ప్రతి ఒక్కరూ ఆయన రెండవ రాకడను గూర్చి ప్రశాంతముగా అవగాహన కలిగే విదముగా క్రీస్తు భోదించవచ్చు అయితే దేవుని వాక్యమును అనుదినము పరిశోదించాలి కాని ప్రస్తుత విదులను నిర్లక్ష్యం చేయకూడదు. లెటర్స్-28, 1897LDETel 51.4

    క్రీస్తు తిరిగివచ్చినప్పుడు కొంతమందికి వ్యాపార లావా దేవీలలో నిమగ్న మయ్యదరు అని ఆయనే ప్రకటించెను. కొందరు పోలములలో విత్తనము విత్తెదరుLDETel 51.5

    ఇతరులు పైరులను కోయుదురు మరియు పంటను సమకూర్చేదరు, మరియు ఇతరులు మిల్లులో మరపెట్టుటకు తీసుకొని వెళ్లెదరు, అయన ఎన్నుకొన ప్రజల, జీవితం విధానములో విధులు మరియు బాధ్యతలను విడిచిపెట్టి ఒంటరిగా ఆలోచనలో జీవిచవలేనని దేవుని చిత్తమేమీ కాదు-ఎంమ్స్ 188, 1901.LDETel 52.1

    ఈ జీవితములో నీకు సాద్యమయ్యేవరకు మంచి కార్యములన్ని సమకూర్చుము. సంఘమునకు ఉపదేశములు.5: 488 (1889)LDETel 52.2

    ప్రతి రోజు మన చివరి రోజుగా ఉంది

    ఈ రోజే మనకి అఖరి దినముగా అనుగ్రహింపబడినదని అనుకోని మనము పని చేయుచు మరియు కనిపెట్టుకొని ప్రార్ధించవలెను. సంఘమునకు ఉపదేశములు..5: 200 (1882)LDETel 52.3

    ప్రతిరోజూ వస్తున్న మాదిరిగానే మన పని మనమే చేయడమే కేవలం శ్రేయస్కరం ప్రతిరోజు వస్తున్న మాదిరి మన కొసం ఎవరైతే చనిపోయేను మరియు ఎవరు సమాదినుండి తిరిగిలేచేను ,ఎవరు నిరంతరము జీవిస్తున్నాడు వానియందు విశ్వాసముంచుచు ప్రతిక్షణము పనిచేయచు, కనిపెట్టుకొనుచు, ఎదురుచూచుచు ఆయన బలము మీద అధారపడుదము.-లెటర్ 66, 1894.LDETel 52.4

    ఆ దినము కొరకు ప్రతి ఉదయం మీరు మీ పిల్లలు దేవునికి ప్రతిష్టించుకొనిడి. నెలలు లేదా సంవత్సరాలు గూర్చి లెక్కించకండి; ఇవి మీవి కావు, మనకు ఇవ్వబడినది ఒక పూర్తి దినము. అదే భూమిమీద చివరిదినమైనట్లుగా ఆ అగడియలోనే యమానుని కొరకు పని చేయుదము, నీ ప్రణాళికలన్నియు, మందుకు కొనసాగించుటకు లేక విరమించుకొనుటకు దేవుని ఎదుట పెట్టుము అప్పుడు ఆయన ముందు జాగ్రత్తలు తెలియజేయును . సంఘమునకు ఉపదేశములు 7:44 (1902).LDETel 52.5

    న్యాయబద్ధమైన సబ్బాత ఆచరణ

    [సంఘమునకు సాక్ష్యాలు6: 349-368 “సబ్బాతు యొక్క ఆచారము” చూడండి.) సబ్బాతు దినమును మనము ఆచరించుట ద్వారా మన పరలోకపు తండ్రి, ఆయన జ్ఞానాన్ని మానవులలో బద్రము చేయవలేనని ఆయన ఆశించుచున్నాడు. సబ్బాతును ఆచరించుట వలన ఆయన సజీవుడైన నిజదేవుడని ఎరుగుటకు మన మనస్సులు ఆయన యొద్దకు నడిపించగలుగుతుందని ఆయన ఆశించుచున్నాడు మరియు ఆయనను ఎరుగుట ద్వారా జీవితం మరియు శాంతి మనకు దొరుకును.. సంఘ మునకు ఉపదేశములు: 349 (1900)LDETel 52.6

    వారములో సబ్బాతు మనకి వున్నదని మన మనసులకు తెలిసినప్పటికిని ఆజ్ఞు ప్రకారము ఆచరించడానికి సిద్దబాటుచేసుకొంటాము. కేవలం చటపరమైన విషయముగా మనము సబ్బాతును ఆచరించాడానికిలేము, గాని మన జీవిత విధానమైన వ్యవహా రములలో అధ్యాత్మికము పొందుకొనుటకు అని మనము అర్ధము చేసుకొన వలెన........ సబ్బాతును మనము జ్ఞాపకము చేసుకోనినప్పుడు తాత్కాలికమైన విషయాలు ఆద్యాత్మికం మీద చొరబడి ఆక్రమించుకొనుటకు అనుమతించకూడదు, ఆరు పని దినములకు సంబందించి బాద్యత సబ్బాతు దినము కొరకు ఏది కూడ విడిచిపెట్ట బడలేదు. — సంఘమునకు ఉపదేశములు 6: 353, 354 (1900)LDETel 52.7

    జీవిత అవసరాలను తీర్చుటకు సిద్ధముగావుండాలి, అనారోగ్యముతో వున్న వారి కోసం శ్రద్ధ తీసుకోవాలి, అక్కరలో నున్న వారికి అవసరాలను తీర్పుటకు సహాయ చేయాలి, సబ్బాతు దినమందు వేధన నుండి ఉపశమనము కలుగించుటకు ఎవరైతే నిర్లక్ష్యం చేస్తారో వారు నిర్దోషిగా వారు పరిగనిపబడరు, దేవుని యొక్క పవిత్ర విశ్రాంతి దినము మనిషి కోసం ఏర్పాటు చేయబడింది, మరియు దయను కనపరిచే పక్రియ దాని ఉద్దేశ్యంతో పరిపూర్ణ సామరస్యంగా ఉన్నాయి. సబ్బాతు లేదా ఇతర దినమందైనను ఆయన సృజించిన జీవులు ఒక గడియైనను బాధ అనుభ వించాలని దేవుడు కోరుకోనుటలేదు.. యుగయుగాల ఆకాంక్ష. 207 (1898).LDETel 53.1

    దశాంశములు మరియు అర్పణలయందు నమ్మకము

    దశమ బాగములు పవిత్రమైనది. దేవుడు తన కొరకు కేటాయించినాడు, సువార్త సేవకుల పరిచర్య నిమిత్తము ఉపయోగపడుటకు ఆయన ఖజనాలోనికి తీసుకొని రావలెను... మలాకీ మూడవ అద్యాయాన్ని జాగ్రత్తగా చదవండి మరియు దశమ బాగములను గురించి దేవుడు ఏమి చెప్పాడో చూడండి. సంఘమునకు ఉపదేశములు 9: 249 (1909). కొత్త నిబంధన దశమబాగములు గూర్చియు అలాగే సబ్బాతు దినమును గూర్చియు కూడ నియమము కొట్టివేయబడలేదు, ఈ రెండింటి యొక్క విలువ ఆరోపించదగినది మరియు వాటిని గూర్చి లోతైన ఆద్యాత్మిక లాబాలు వివరించబడింది.- కౌన్సల్స్ ఆఫ్ స్టీవోడ్ సిప్ -66 (1882).LDETel 53.2

    దేవుడు ఇప్పుడు ప్రతి ప్రాంతంలోని ఉన్న సెవెంతు డే అడ్వెంటిస్టులు తనను తాను సమర్పించుకొనుటకు మరియు వారి పరిస్థితులకు అనుగుణంగా, తన పనిలో సహాయ పడటానికి వారి ఉత్తమమైన వాటిని చేయమని పిలుపునిచ్చెను. బహు మతులు, అర్పణలు ఉదాసీనతో ఇచ్చుట ద్వారా ఆయన తన ఆశీర్వాదాల గురించిన మెప్పును, ఆయన కనికరం కోసం ఆయనకు కృతజ్ఞతలను వెల్లడి చేయాలని ఆయన కోరుకుంటు న్నాడు.- సంఘమునకు ఉపదేశములు 9: 132 (1909)LDETel 53.3

    దర్మకార్యలు అంతరించిపోతున్నప్పుడు ఉపకారములు పెంపొందించుటకు బడులు పేదరికం పెరుగును.- సంఘమునకు ఉపదేశములు 5: 155 (1882) అత్య దినముల సమయము సమీపిస్తున్న కొలది వాంచలు గూర్చిన కోరిక నిరంతరంగా పెరుగుతుంది.సంఘమునకు ఉపదేశములు 5: 156 (1882LDETel 53.4

    భవిష్యత్ జీవితంలో మన దృఢత్వాన్ని నిర్ధారించుటకు లేక నిరూపిచుటకు మనలను ఈ ప్రపంచంలో పరీక్షించబడుటకు ఉంచబడియున్నాము. ఎవరి గుణము కల్మషముతోను మరియు స్వార్ధముతోను మలినమై పోయినదో అట్టివారు ఎవరైనను పరలోకానికి ప్రవేశములేదు, అందుచేత మనకి తాత్కాలికమైన హోదాలు మరియు అధికారములు కట్టబెట్టి వాటిని ఉపయోగించడములో మనము శాశ్వతమైన ధనముకై ప్రాకులాడుచున్నామా లేదా అని చూచుటకు ఇక్కడ దేవుడు మనము పరీక్షిస్తున్నాడు. కౌన్సల్స్ ఆఫ్ స్టీవోడ్ సిప్ 22 (1893). -LDETel 54.1

    నూతన సంస్థలను స్థాపించుట

    ప్రభువు త్వరలో వస్తే, పాఠశాలలు, ఆసుపత్రులు మరియు ఆహార కర్మాగారాలు స్థాపించడములో ఏమైన అవసరము వుందా అని కొందరు అలా అనవచ్చు. మన యువతకు వర్తకాలు నేర్చుకోవాల్సిన అవసరం ఏమిటి? ప్రభువు ఇచ్చిన తలాంతులను ప్రతిభల కోసం నిరంతరం మెరుగు పర్చుకోవాలని ఆయన ఉద్దేశం. మనము వాటిని ఉపయోగించకపోతే మనం దేన్ని చేయలేము. క్రీస్తుత్వరలోనే రానైయున్నాడనే సూచన మనలను ఒంటరి తనమునకు నడిపించకూడదు. దానికి బదులుగా మానవులందరు ఆశీర్వదించబడి మరియు ప్రయోజనం పొందాలంటే మనం చేయగలిగినదంతా చేయాల్సిన అవసఁగమునకు నడిపించబడాలి. మెడికల్ మినిస్ట్రీ 268 (1902).LDETel 54.2

    ప్రపంచమంతా గొప్ప పని చేయవలసి ఉంది, అంతిమ కాలము సమీపంలో ఉన్నది కాబట్టి, వివిధ సంస్థలను నిర్మించటానికి ఎన్ని కారణలు ఒత్తిడి చేస్తున్ప్పటికిని, ప్రత్యే మైన కృషి అవసరం లేదు అని ఎవ్వరు కూడా ఒక నిర్ధాణకు రాకూడదు ..... ప్రభువు మనకు సమాజమందిరములను నిర్మంచుట, పాఠశాలలు స్థాపించుట, ఆసుపత్రులు మరియు ముద్రాలయములు నెలకొల్పుటలో కృషి చేయుడం ఎటువంటి ప్రయత్నములు ఇక చేయవద్దని ఆజ్ఞఇచ్చినప్పుడు,అసమయమందు మన చేతులు ముడుచుకొనివుందాము అప్పుడు ఆయనే పనిని మూసివేస్తాడు. కానీ దేవుని కోసం ఆశక్తి మరియు మానవుని యెడల ప్రేమను కనపర్చుటకు ఇప్పుడు మన కున్న అవకాశములు .-సంఘమునకు ఉపదేశములు 6: 440 (1900).LDETel 54.3

    దేశంతర వైద్య సేవ

    మన దేశం యొక్క స్వేచ్చలను మతపరమైన దౌర్జన్యాలు నాశనం చేస్తుండగా, మనస్సాక్షి స్వేచ్ఛ కోసం నిలబడగలవారు ప్రతికూల స్థానాల్లో ఉంచబడతారు. వారి కోసమే, వారి స్వంత ప్రయోజనం కోసం, వారు అవకాశం కలిగి ఉండగా, వ్యాధి, దాని కారణాలు, నివారణ మరియు చికిత్సను సంబంధించి మేధోవంతులై ఉండాలి ఎవరైతే అలా చేస్తారో వారు ఎక్కడైన్న పని చేసుకొనే స్థలము దొరుకుతుంది, మన విశ్వాసములో కలసియున్నవారే కాదు, సత్యం తెలియకుండా ఉన్న వారిలో చాలామంది బాధలు అనుభవిస్తున్న అనేకులకు సహాయం అవసరమైయున్నది. కౌన్సల్ ఆన్ హెల్త్ 506 (1892). నేను ఒక విషయము తెలియజేయుదును ఇకత్వరలోనే సువార్త సేవా విభాగములో పనులు జరగవు కాని వైద్యపరమైన సేవకొనసాగుతుంది. కౌన్సల్ ఆన్ హెల్త్ 533 (1901)LDETel 54.4

    దేవుని ప్రజలు తమ ఆరోగ్యాన్ని విలువైనదిగా పరిగణిస్తారు

    ఆరోగ్య సంస్కరణ గూర్చినాకు చూపించబడెను, ఇది మూడ దూతల సందేశానికి చెందినది మరియు ఇది మానవ శరీరంలో చేయి మరియు మోచెయ్యకు ఎంత దగ్గర వున్నదో అట్టి సంబందము వుంది. -సంఘమునకు ఉపదేశములు 1: 486 (1867)LDETel 55.1

    టీ, కాపీ, పొగాకు మరియు మద్యం మనము పాపాత్మకమైన అనుబంధంగా వున్నవని తెలియజేయాలి, మనము ఏ బల్ల మీదైతే మాంసం, గుడ్లు, వెన్న, జున్ను లాంటి పదార్ధములు వుంచామో ఆ స్థలమందు వీటితో పాటు వాటిని సమానముగా వుంచకూడదు. అటువంటివి మన పనికి భారం కాకుండుటకు వాటిని మన మందుకు తీసుకొని రాకూడదు. టీ, కాఫీ, పొగాకు, బీరు, కల్లు సారయి ఇవన్ని ఘాటుగావుండే ద్రవక మద్యములు- కాబట్టి వాటిని తొలిగించవలేను.. సెలెక్ట్డ్ మెసేజన్స్ 3: 287 (1881).LDETel 55.2

    నిజమైన మితనుబావము ప్రతి విషయమందు హృదయపూర్వకంగా నడిపించును మరియు ఎదైతే ఆరోగ్యకరముగానువున్నదో దానిని వివేకముగా ఉపయోగించును. పితరులు - ప్రవక్తలు,562 1890). పవిత్ర గాలి, సూర్యకాంతి, మిత భోజనము, విశ్రాంతి, వ్యాయామం , సరైన ఆహారం, నీటి వినియోగం, దైవిక శక్తిపై నమ్మకం - ఇది నిజమైన పరిష్కారాలు. మినిష్టి అఫ్ హీలింగ్ 127 (1905). ఆరోగ్యము ఏవిధముగానైన దెబ్బతినిదంటే భౌతిక శక్తిని తగ్గిస్తుంది. అంతే కాదుకాని మానసిక మరియు నైతిక శక్తులను బలహీనపరుస్తుంది. ఆరోగ్యమును పాడు చేసే అలవాట్లు ఏమైనవుంటే, తప్పు ఒప్పుల మద్య వున్న విచక్షణ జ్ఞానము కొల్పోవడమే కాదు గాని చెడును విసర్జించుటకు చాలా కష్టమవుతుంది. హీలింగ్ 0 గ్ 128, 1905.LDETel 55.3

    పూర్వ ఆహారమునకు వెళ్లెదము

    దేవుడు ఆదిలో సంకల్పించిన ఉద్దేశమును క్రమ క్రమముగా మనలను మునుపటి స్థితికి ఆయన నడిపించుచున్నాడు, మనుష్యుడు భూమియొక్క సహజ ఉత్పత్తులమీద జీవించవలెను. ప్రభువు రాకడ కోసం ఎదురుచుస్తున్న వారిలో మాంసం తినేవారు చివరికి దానిని దూరంగా చేసుకొందురు, మాంసం వారి ఆహారం బాగంలోనుంచి ఎడముగా ఉంచుతారు. ఈ విషయము చివరివరకు దృష్టిలో ఉంచుకొని, దాని పట్ల క్రమంగా పని చేయడానికి కృషి చేయాలి.-కౌన్సల్ ఆనైల్డ్, 450 (1890).LDETel 55.4

    క్రీస్తు అతి త్వరలో రానైయున్నాడని కనిపెట్టుకొని ఎదురుచూస్తున్నాము అని ప్రకటించుకొను వారిలో నుండి గొప్ప సంస్కరణలు చూడాలి. అది ఇంకా చేపట్టని పని కాబట్టి ఆరోగ్యం సంస్కరణ మన ప్రజల మధ్య జరగాలి, మాంసాహారులు ఇంకా జంతువుల మాంసం తింటున్నవారు శారీరకముగాను, మానసికముగాను, మరియు ఆద్యాత్మికముగా ఆరోగ్యాన్ని క్షినింపచేయు అపాయమువున్నది కాబట్టి రానైయున్న ఈ ప్రమాదమును గుర్తించుటకు మనము మెలకువగా వుండవలసియుంది. ఇప్పుడు మాంసం తినటం గురించి కేవలం సగం మార్పు చెందిన చాలామంది దేవుని ప్రజలను విడిచి వెళ్లిపోతారు ఇక వారితో ఏ మాత్రం నడవలేరు. .- ది రివ్యూ అండ్ హెరాల్డ్,మే 27, 1902LDETel 56.1

    ఉపవాసం మరియు ప్రార్థనకు సమయం

    ఇప్పుడు మరియు ఇకముందు కాలము, అంతమునకు వచ్చువరకు దేవుని ప్రజలు మరింత నిశ్చయముగావుండాలి, మరింత చురుకైనవారిగా వుండి, మెలకువగా ఉండాలి, వారి స్వంత జ్ఞానము మీద నమ్ముకము పెట్టుకోకుండ వారి నాయకుని జ్ఞానముమీద ఆదారపడలి. వారు ఉపవాసమునకు మరియు ప్రార్ధనకు రోజులు కేటాయుంచుకొని ఎర్పాటుచేసుకోవాలి. ఆహారం పూర్తిగా నిషేదించనవసరము లేదు, కానీ వారు అల్ప ఆహారమువలె చాలా సాధాణరమైన ఆహారము తీసుకోవాలి.-కౌన్సల్ అన్ అండ్ డైట్ అండ్ ఫుడ్స్ 188, 189 (1904).LDETel 56.2

    ప్రతి విదమైనవి నోరురించే రకరకలా ఆహారం నుండి, మితముగా ముండడమే నిజమైన ఉపవాసముగా సలహా ఇవ్వవలెను, మరియు సాదారణ ఆహారము దేవుడు సమృద్ధిగా అనుగ్రహించువాటిని పరిపూర్ణముగా ఉపయోగించుము.మగవారు ఐహికమైన అహారము విషయములో ఏమి తినాలి ఏమి త్రాగాలి అని కొంచెము తక్కువుగా ఆలోచనచేయాలి, అయితే మతపరమైన అనుభవానికి క్రమము మరియు విలువనిచ్చే పరలోకము నుండి వస్తున్న ఆహారము గూర్చి ఎక్కువుగా లక్ష్యముంచుము. మెడికల్ మినిస్ట్రీ, 283 (1896).LDETel 56.3

    దైవభక్తి పులిసిన పిండివలే వున్నది అది ఇంక పూర్తిగా దాని శక్తిని కోల్పోలేదు. సంఘములో ప్రమాదం మరియు ఒత్తిడులు ఎక్కువైన కొలది ఆ సమయంలో వెలుగు కలిగియున్న చిన్న సంఘము ఏదైతే ఉనికిలో ఉన్నదో ఆ దేశంలో జరుగుతున్న అసహ్యమైన కార్యములు చూచి ఏడుస్తూ వున్నది. అయితే సంఘ సభ్యులు ప్రార్థనలు ఎంతో ప్రత్యేకమైనవి ఎందుకంటే ఆ సభ్యులు ప్రపంచ విదానము అనుసరించక వారు చేస్తున్నారు కాబట్టి అవి పైకి ఎత్తబడుతాయి.- సంఘమునకు ఉపదేశములు 5: 209, 210 (1882)LDETel 56.4

    దేవునిపై పూర్తి విశ్వాసం

    సమార్పణలేని పనివారు కారణంగా, కొన్ని సార్లు తప్పులు జరుగుతాయి. మీరు ఇతరుల తప్పుడు విధానములో వచ్చిన ఫలితంగా మీరు ఏడ్వవచ్చు, కానీ చింతింపడుకుడి.ఆశీర్వాదమునకు కర్తఅయినమన యజమానుడు యొక్క పర్యవేక్షణలో పనిసాగుతుంది. ఆయన ఆదేశాల కోసం మరియు ఆయన మార్గమునకు విదేయులై పనివారులుగా ఉండుటకు తనయొద్దకు పిలుచుచున్నాడు, సంఘమునకు సంబధించిన సబ్బాతు పాఠశాలలో బోధించటం, సంస్థలలో పనిచేయటం ఆయన మన హృదయలో అట్టి ఆశక్తి పెట్టియున్నడు. ఎందుకు ఆందోళన? జీవముతో నింపబడిన సంఘమును చూడాలన్న తీవ్రమైన కోరిక దేవునిపై పూర్తిగా నమ్మకంతో ఉండాలి. ప్రభు యొక్క పనిని మరింత వేగవంతం చేయటానికి ప్రయత్నంగా ఎవరూకూడ దేవుడిచ్చిన అధికారాలను అధిగమించకూడదు. మనిషి యొక్క శక్తివలన పనిని వేగవంతంచేయ లేడు,పరలోక మేదస్సులు యొక్క శక్తితో తప్పక ఎకమవ్వలి........ పనివారందరు ఇప్పుడు తీవ్ర భారాలను మోసినప్పటికీ ఆ పనిని ప్రక్కనపెట్టి దేవుని పని ముందుకు సాగిపోవలెను. సంఘమునకు ఉపదేశములు 7: 298 (1902)LDETel 57.1

    కుటుంబ ఆరాధన

    ఉదయం సాయంత్రం మీ పిల్లలతో కలిసి దేవుని ఆరాధించుము, ఆయన వాక్యాన్ని చదవడం మరియు ఆయనకు స్తుతిగీతములు పాడటం. దేవుని ఆజ్ఞలను ఉచ్చరించ మని వారికి బోధించుము.-ఇవాంజలిజం, 499 (1904).LDETel 57.2

    కుటుంబ ఆరాధన సమయము తక్కువుగాను మరియు ఉత్సాహంగా ఉండాలి. మీ పిల్లలు లేదా మీ కుటుంబ సభ్యులలో ఎవరైన విసుకుగావున్న లేదా ఆశక్తి లేకున్న వారిని భయపెట్టవద్దు. సుదీర్ఘ అద్యాయం చదివి మరియు వివరించి మరియు సుదీర్ఘ ప్రార్ధన చేసినప్పుడు, అ విలువైన ప్రార్ధన సమయము విసుగావున్న, అది ముగిసినప్పుడు ఉపశమనంకలిగించును......... ఆసక్తికరమైనది మరియు సులభంగా అర్థంచేసుకొనే వాక్యభాగాన్ని కుటుంబ యజమానుడు ఎంచాలి, ఆ రోజంతా అద్యయనం మరియు సాధన చేయుటకు గాను కొన్ని వచనాలతో ఒక పాఠం సిద్ధం చేసినటైయితే సరిపోతుంది. ప్రశ్నలను అడగవచ్చు, కొన్ని గంబీరమైన, ఆసక్తికరమైన వ్యాఖ్యలు, లేదా [ఒక] సంఘటన, మరియు ఉదాహరణ ద్వారా చిన్న విషయమును తీసుకొని చెప్పవచ్చు. ఉత్సాహ భరితమైన పాటలో కొన్ని చరణాలు పాడవచ్చు, మరియు ప్రార్థన చిన్నదిగాను సందర్భమును బట్టి ఉండాలి. ప్రార్థనను నడిపించే వ్యక్తి ప్రతి విషయము గురించి ప్రార్థించ కూడదు, కానీ సాదారణ వాక్యలతో తన అవసరాలను వ్యక్తంచేయాలనీ మరియు దేవుణ్ణి కృతజ్ఞతాపూర్వకంగా స్తుతించాలి.-చైల్డ్ గైడెన్స్, 521, 522 (1884).LDETel 57.3

    ప్రపంచములో రక్షణ సహవాసం

    [ప్రకటన 18: 1-3, చెప్పుచున్నాది] ఈ సందేశం ధ్వనిస్తున్నప్పుడు, ఈ సత్యమును ప్రత్యేకమైన పనిని ప్రకటిస్తున్నప్పుడు, దేవుని యొక్క నమ్మకమైన కాపర్లుగా మనము మన నిజమైన స్థానము ఏమైయున్నదో గ్రహిస్తాము. మనము ఐహిక సంబందమైన నిషయలలో ఏకీభవించక మనము ఆత్మతో నింపబడాలి, మనము ఆద్యాత్మిక వివేచన గందరగోళంగావుండినప్పుడు, క్రైస్తవ సంఘములలో వున్న ప్రజలు ఎవరైతే ప్రభువు యొక్క సత్య సందేశాన్ని ప్రకటిస్తున్నారో వారిని మనము చూస్తాము. అదే సమయంలో మనము దూరముగా వెళ్లపోయు పరిసయ్యులువలే ఉండకూడదు. ఇజి డs’88 1161 (1893).LDETel 58.1

    ఆకాశ మేఘాలలో క్రీస్తు ఆగమనము కొరకు కనిపెట్టుకొని ఎదురుచూస్తున్న వారు, సుఖసౌకర్యముగల సమాజములతోను కలసిపోవుటముగాని మరియు సొంత వినోద కార్యక్రమాలలో పాలుపంచుకోవటముగాని చేయరు.- ఎంఎస్4, 1898. ఒప్పందములు ద్వారా లేదా భాగస్వామ్యాల ద్వారా మరియు విశ్వాసము లేనివారితో వ్యాపార భాగస్వామ్యములో మనం కట్టుబడి వుండకూడదు. అది దేవుని యొక్క క్రమము కాదు,.-రివ్యూ, హెరాల్డ్, ఆగస్టు 4,1904.మనము ఇతర ప్రజలతో ఐక్యమగావుండు టము మంచిదే గాని మన సిద్ధాంతము త్యాగం చేయకూడదు, వారితో బస చేయకూడదు మరియు సమాజముతో కలసివుండకూడదు అనే బావముకాదుకాని మేము హృదయ పూర్వకంగ మితనుబావముగల అభిమానులము అని వారికి తెలిసేటట్లు చేయవలేను. - టెంపరేన్స్, 220 (1884). -LDETel 58.2

    క్రీస్తు ఆమోదించిన వినోదం

    క్రైస్తవులు వారి ఉత్సహమును మరల బలపర్చుకోవడం మరియు వారి శారీరక మరియు మానసిక శక్తులను దేవుని మహిమకై ఉపయోగించుకునే ఉద్దేశ్యంతో వారి శరీరాలను అమాయక వినోదం ద్వారా ఉత్సాహపరిచేందుకు అది వారికి హక్కు మరియు విధిఅయున్నది, యువతకు వర్తమానాలు 364 (1871).LDETel 58.3

    క్రైస్తవులు తమ ఆధీనంలో అనేక ఆనందకరమైన మార్గాలు కలిగి ఉన్నారు, మరియు ఎటువంటి ఆనందకరమైన అంటే ఏది చేయవచ్చు ఏదిచేయకూడదో వారు భయములేకుండ స్పష్టముగా చెప్పగలరు, అలాంటి వినోదాలకు వారు సంతోషించవచ్చు అయిన అవి మనసును చెదరగొట్టవు లేక ఆత్మను క్షీణింపచేయదు మరియు అవి నిరాశకు రావు, స్వీయ గౌరవాన్ని నాశనం చేయడానికి చేదు అనుభవముమిగల్చదు లేదా ఉపయోగమైన మార్గమును అడ్డగించదు, వారు ఆత్మ ప్రేరణ కలిగించే ప్రార్ధనను అవలంబించుచు మరియు యేసుని వారితోపాటు తీసుకొని వెళ్లినటైయితే వారు ఎంతగానో సురక్షితంగా ఉంటారు.- యువతకు వర్తమానాలు, 38 (1884).LDETel 58.4

    మన సమావేశాలను చాలా చక్కగా నిర్వహించాల్సిన అవసరం ఉంది, మరియు మన ప్రవర్తనను మనకి మనము సరిచేసుకొని కొనసాగించాలి, మన గృహాలకు తిరిగి వచ్చినప్పుడు మనము దేవునికి మరియు మానవులకు అభ్యంతరమైనవి ఏదైన వున్నయా అని నిర్మల మనస్సాక్షిని పరీక్షించుకుంటాము, మనము ఎవరితో సహవాసమ కలగియున్నమో వారిని మనము ఏవిధముగానైన గాయపరచలేదు లేదా హానిచేయలేదు లేదా హానిచేయుటకు నాప్రతాపము వారిపై చూపలేదనే భావము వుండాలి మనము ఏ వినోదములోనైన నిమగ్నమై వుంటే విశ్వాసంతో దేవుని ఆశీర్వాదము కొరకు అడిగితే ప్రమాదకరమైనది ఎది వుండదు, ఏ వినోదమైన మన రహస్య ప్రార్థనకి, మన గృహప్రార్ధనకి ధ్యానానికి లేదా ప్రార్ధనా కూడికలో నీకు బాగమున్న దానిలో పాల్గోకుండవున్న టైయితే అది సురక్షితం కాదు, ప్రమాదకరమైనది -- యువతకు వర్తమానాలు, 386 (1913.LDETel 59.1

    హెచ్చించబడిన సంగీతం

    ఇజ్రాయేలు ప్రజలు అరణ్యలో నుండి ప్రయాణిస్తున్నప్పుడు వారు మార్గములో సంగీతముతో పవిత్ర పాటలతో ఉల్లసించిరి కాబట్టి నేడు దేవుని పిల్లలు వారి జీవిత యాత్రలో వేడుకగా సాగాలని ఆయన కోరుకొనుచున్నాడు. ఆయన మాటలు ప్తికి తెచ్చుకొని మళ్లి మళ్లి పాడుకొనులాగున ఇంక ప్రయోజనకరమైన మార్గాలు కొన్నివున్నాయి, మరియు ఆ పాటలలో అద్భుతమైన శక్తి ఉంది. మూర్ఖత్వము మరియు అనాగరికమైన స్వభావాన్ని జయుంచే శక్తి కలిగివుంది, ఈ శక్తి చురుకైన తలంపులను మరియు సానుభూతిని మేల్కోల్పు సామరస్యతను ప్రోత్సహించడము మరియు వ్యకులనును నిర్బందించును, నాశనము చేసే బలమును అడ్డగించును మరియు బలహీనమైన ప్రయత్నమును అణిచి వేయును. పరలోకములో దేవుని ఆరాధించుటకు సంగీతం ఒక భాగమైయున్నది, మరియు పరలోకములో గాయక బృందం యొక్క సామరస్యతకు సాధ్యమైనంతవరకు చేరుకోవటానికి మన స్తుతి గీతములతో ప్రయత్నముచేయాలి........ మతపరమైన సేవలో భాగంగా పాడటం చాలా ఎక్కువ ప్రార్ధన వంటి ప్రార్ధనా చర్య.- పితరులు - ప్రవక్తలు, 594 (1890).LDETel 59.2

    సంగీత వాయిద్యాల ఉపయోగం ఏ మాత్రము అభ్యంతరకరమైనది కాదు. ప్రాచీన కాలంలో మతపరమైన సేవల్లో ఇవి ఉపయోగించబడినవి, ఆరాదించువారు దేవుణ్ణి వీణతోను మరియు చేతాళములతో స్తుతించేవారు, మన ఆరాదన కారక్రమములో సంగీతమునకు దాని స్థానమును దానికివుంది. ఎవాంజలిజం, 500, 501 (1898).LDETel 59.3

    దూరదర్శని మరియు చలన చిత్ర ప్రదర్శనశాలలు

    ఆనందం కోసం అత్యంత ప్రమాదకరమైన స్థలము దియేటర్లు, నైతిక విలువలు మరియు దర్మనికి ఒక్క పాఠశాలగా ఉండటానికి బదులు, ఇది అనైతికతకు అనువైన ప్రదేశముగా వుందని తరచూ పేర్కొనబడినది, చెడ్డ అలవాట్లు మరియు పాపాత్మకమైన స్వభావములు వినోదాలచే బలపరిచడానికి ధృవీకరించబడినవి. హీనమైన పాటలు, కామాతురత హావభావాలు, వ్యక్తీకరణలు మరియు దృక్పదాలు, నీతి బావములను చెరుపును మరియు నైతిక విలువలను తగ్గించును. ఇటువంటి ప్రదర్శనలు అలవాటు పడిన ప్రతి యువకుడూ సూత్రప్రాయంగా చెడిపోతారు, మంచి భావమునను విష పూరితం చేయడం, మతపరమైన ప్రభావాలను నాశనం చేయటం మరియు శాంతి కరమైన సంతోషములో నున్న కలయకను బలహీనపరచడం, మరియు జీవితము యొక్క ప్రశాంతమైన సంబందము కన్న దియేటర్లులోనే ఎక్కువ పొంచియుంది, వీటి కన్న మన ప్రపంచములో పాడుచేయుటకు ప్రభావితము చేసే శక్తులు మరేదిలేదు.. మత్తు పదార్థాల పానీయ కోరిక దాని ఉపయోగంతో బలపడుతున్నందున ఈ దృశ్యం పట్ల ప్రేమ ప్రతి వ్యక్తిలో సంతృప్తి పెంచుతుంది. -సంఘమునకు ఉపదేశములు 4: 652, 653 (1881).LDETel 59.4

    సినిమా థియేటర్లో లేదా నృత్యహాల్లోగాని గడిపిన గడియలోనే దేవుని ఆశీర్వాదం అభ్యర్ధించలేము, అలాంటి స్థలంలో మరణించటానికి ఏ క్రైస్తవుడు కోరుకోడు. క్రీస్తు వచ్చినప్పుడు అక్కడ కనిపించాలని కోరుకోరు. - యువతకు వర్తమానాలు398 (1882). తీవ్రమైనది మరియు మతపరమైన ఆలోచనలు బహిష్కరించబడని వంటివి మాత్రమే సురక్షిత వినోద, మనతోపాటు యేసును తీసుకు వెళ్లగలిగే స్థలమే సురక్షితమైనది. మా హై కాలింగ్, 284 (1883).LDETel 60.1

    దుస్తుల మరియు అలంకరారము.

    మీ మతం యొక్క ప్రధాన విషయములోదుస్తలనుగూర్చి ప్రశ్నించనవసరములేదు, దీనికన్న ఘనముగా మాట్లడుకొనుటకు వున్నది. క్రీస్తుని గూర్చి సంభాషించు, మరియు ఎప్పుడైతే హృదయము మార్పు చెందుతుందో అప్పుడు దేవుని యొక్క వాక్యముతో వున్న ప్రేమ అనురాగమును బట్టి నిషిద్ధమైనది అన్నింటినీ వదిలివేస్తావు. ఎవాంజిలిజం, 272 (1889).LDETel 60.2

    మనము క్రైస్తవులమైతే, మనము నడిచే దారిలో సహజంగా మనము ఇష్టపడే వాటికి అడ్డముగా ఏది ఎదురుగా వచ్చినప్పటికిని మనము క్రీస్తునే అనుసరిస్తాము. నీవు ఇది లేదా అది ధరించకూడదు అని నీకు చెపడం ఎటువంటి ఉపయోగము వుండదు, ఎందుకంటే ఇటు వంటి వ్యర్ధమైన విషయాలు యెడల ప్రేమ అనునది మీ హృదయంలో ఉన్నట్లయితే, మీ అలంకారమునకు అడ్డువేయుడము అనేది ఎదిగిన చెట్టు నుండి ఆకులను తుంచే విధముగా ఉంటుంది. సహజ హృదయపు కోరికలు మళ్లీ అవస్థిరముగా ఉద్భవిస్తాయి. మీరు మీ స్వంత మనస్సాక్షిని కలిగి ఉండాలి.-చైల్డ్ గైడెన్స్, 429, 430 (1892).LDETel 60.3

    దేవుని ముందు జాగ్రత్తగా మరియు మెలుకవుగా నడవాలని నేను మన ప్రజలను వేడుకోనుచున్నాను. వారు ఆరోగ్య సూత్రాలకు అనుగుణంగా వుండే దుస్తులు ధరించే ఆచారాలను అనుసరించండి, చాలా మంది వారి వయస్సుకు తగ్గట్టుగా మంచిగా మన్నిన దుస్తులు ధరించే విధముగా మన సోదరీమణులు సాధారణమైన దుస్తులు దరించనివ్వండి, మరియు దుస్తుల విషయములో ప్రశ్న మనస్సులోనికి రానియ కూడదు, మా సోదరీమణులు సరళతతో దుస్తులు ధరించాలి. బిడియముతో మరియు నెమ్మదితనముతో అనుకువగల వస్త్రములు వారు దరించవలెను, మరియు దేవుని కృప చేత మీరు అలంకరిచబడియున్నారని ప్రపంచమునకు ఒక సజీవమైన నిదర్శనము చూపించవలెను. సెలెక్ట్డ్ మెసెజన్స్ 3: 242 (1897). వెలుపల ప్రదర్శన హృదయానికి సూచికగా ఉంది. సంఘమునకు ఉపదేశములు 1: 136 (1856)LDETel 60.4

    ప్రచురణలు అవసరము

    ప్రచురణలు సాధారణమైన, సరళమైన బాషలో రాయబడి ప్రాముఖ్యమైన ఆసక్తినిచ్చే విషయాలను వివరిస్తూ, ప్రపంచానికి రాబోయే విషయాలను గూర్చి తెలియ జేయాలి.-హోంమ్ మిషనరీ, ఫిబ్రవరి 1, 1890.LDETel 61.1

    మొదటిది మరియు రెండవ దూత వర్తమానము1843 మరియు 1844 లో ఇవ్వ బడినవి మరియు ఇప్పుడు మూడవది ప్రకటించవలసియుంది, అయునను మూడు దూతల సందేశము ఇంకను ప్రకటించాలి... ఈ సందేశాలు ప్రచురంచి ప్రపంచానికి అందించవలేను. ఉపన్యాసాలలో, ప్రవచనార్ధకముగా చరిత్రలో క్రమముగా జరిగిన విషయాలు మరియు జరగబోయేవి చూపించవలెను. కౌంసల్ టూ -రైటర్స్ అండ్ ఎడిటర్స్ 26, 27 (1896)LDETel 61.2

    పత్రికలు మరియు కరపత్రాలు నిత్య సత్యం గూర్చి మాట్లాడాలి, మరియు అవి ఆకులు రాలే కాలములో ఆకులు వలే వెదచెల్లబడాలి.- సంఘమునకు ఉపదేశములు 9: 230 (1897) ఇంతకు మునుపు లేని విధముగా దానియేలు మరియు ప్రకటన గ్రందములు మరియు పితరులు- ప్రవక్తలు, మహా సంఘర్షణ, గ్రందములు వివరించ వలేను. ఎందుకంటే ఈ సత్యములు అనేక మంది ఆదకారములోనున్నవారి కళ్లు తెరిపించుటక విస్తృతంగా పంపిణీ చేయాలి, - కోల్పోర్ట్ మినిస్ట్రీ, 123 (1905).కృపకాలం కొనసాగినంత కాలం గ్రంధ విక్రయసేవ కోసం అవకాశం ఉంటుంది. సంఘమునకు ఉపదేశములు 6: 478 (1900).LDETel 61.3

    మన పత్రికలో బలవంతముచేయవు

    మన కోసం పత్రికలు వ్రాసేవారు లేనిపోని బలవంతముచేసేవి గాని లేదా అకర్షించేవిగాని వ్రాయనీయకండి, అవి తప్పకుండ ప్రమాదములు తీసుకొని వచ్చును ప్రమాదము ఉంది మరియు అది మార్గమునకు కంచివేయును, మరియు మనము అన్ని తరగతుల వారికి కాథలిక్కులతో సహా, అందుబాటులో వుండి ఒక క్రమములో మనము చేయవలసిన పనిని చేయకుండ అడ్డగించును. ప్రేమతో మనము సత్యము మాట్లాడటం మన విధి మరియు సహజ హృదయంతో అపవిత్రమైన అంశాలు సత్యముతో మాలిన్యము చేయ కూడదు మరియు విరోదులకు కలిగియున్న గుణము లాంటి స్వభావముతో మనము మాటలాడకూడదు. మనము కఠినమైనవి మరియు తుంచే మాటలు ఉపయోగించ కూడదు. వ్రాసిన ప్రతి వ్యాసంలో వాటిని గుర్తించండి, ఇచ్చిన ప్రతి చిరునామకు పంపించండి, తుంచడంగాని గద్దించడంగాని దేవుని వాక్యము పనైయున్నది, పరిమితిగల మనుష్యడు మరుగుచేయబడి యేసుక్రీస్తులో నివసించ వలెను. సంఘమునకు ఉపదేశములు. 9: 240, 241, 244 (1909)LDETel 61.4

    మన రచనల్లో ప్రతి వ్యక్తీకరణను మనం కలుపుతాము, మన ఉచ్చరణ దానికది స్వయంగా తీసుకున్న టైయితే, అది తప్పుగా అర్ధముచేసుకొనే అవకాశము వుంది, కాబట్టి వాటిని గ్రహించుటకు ఆజ్ఞలకు మరియు క్రమమునకు విరుద్దముగా వుందా లేదా అనేది చూడాలి, మనము ఉచ్చరించే ప్రతిమాట ఎవరికి అభ్యంతరము కలగుకుండ ప్రతి విషయము జాగ్రత్తగా పరిశీలన చేయవలెను లేదంటే మన దేశమునకును మరియు దేశ చట్టమునకు ద్రోహము చేసిన వారమౌతాము.- లెటర్ 36,1895. దుర్వినియోగ ఆరోపణలు మరియు ఖండించేవి కనపరిచేది కాదు క్రైస్తవ్యము. సంఘమునకు ఉపదేశములు 6: 397 (1900).LDETel 62.1

    పక్కనుండి నుంచి వస్తున్న సమస్యలకు జాగ్రత్త.

    దేవుడు ఒంటరిగా ఇక్కడున్న వ్యక్తిని మరియు ఎక్కడో ఉన్న వ్యక్తిని ఎంపిక చేసుకొన్న, తన సత్య సువార్తను ప్రకటించే బాద్యత అప్పగించిన వారసులైన తన ప్రజలను విడిచి పెట్టి ఆయన ఎన్నడు వెళ్లిపోడు. ఒక స్థిరపడిన విశ్వాసం నెలకొల్పుటకు క్రొత్త వ్యక్తికి కొత్త వెలుగు విరుద్ధముగా ఆయన ఎన్నడు ఇవ్వడు. ప్రతి సంస్కరణలలో ఒకొక్క వ్యక్తి తన సొంత వాధనలు తెలుపుచున్నారు.... దేవుడు తమ సోదరుల కంటే ప్రత్యేకమైన కాంతిని వారికి ఇచ్చియున్నాడని ఎవరూకూడ తనకు తోచినది సరైనదని స్వీయ-విశ్వాసం కలిగి ఉండకూడదు.... సత్యంతో వివాదాస్పదంగా కనిపించని కొన్ని క్రొత్తవి మరియు అసలైన ఉద్దేశములు ఒకరు తప్పక అంగీకరిస్తారు. అది మదురము గాను మరియు విషేశముగా దరింపచేయు చున్నదని తాను గమనించు వరకు అతడు దాని మీద ఆధారపడును. అయితే సాతనుడు ఈ తప్పుడు ప్రదర్శన ఇవ్వాగల శక్తి అతనికి వుంది. కబట్టి చివరగా ఇది అన్ని శోషించు నేపద్యం అవుతుంది, ఒక గొప్ప విషయము చుట్టు సమస్థము కేంద్రీకరించబడియున్నది, మరియు హృదయను నుంచి సత్యము మెలకెత్తుతుంది.... పక్కనుంచి వచ్చే ఇటువంటి సమస్యల గురించి జాగ్రత్త వహించమని నేను మిమ్మల్ని హెచ్చరించాను, దాని దోరణి సత్యము నుండి మనస్సును మళ్ళించును, లోపం ప్రమాదకరం కాదు. అయితే ఇది ఎప్పుడూ పవిత్రత చేయదు అయితే ఎల్లప్పుడూ గందరగోళం మరియు విరోదము తెస్తుంది- సంఘమునకు ఉపదేశములు 5: 291, 292 (1885)LDETel 62.2

    బేధములు లేవు ఐక్యతను గూర్చి వివరించుట

    సత్యామైన వెలుగు ఉన్నవారికి వేలకొలది శోధనలు మారు వేషములో తరస పడతాయి మరియు మనకు ఏదైనా కొత్త సిద్ధాంతాము లేద లేఖమములు బాగము నుండి కొత్త వివరణ పొందినప్పుడు అది మొదటి సారిగా అనుభవజ్ఞులైన సోదరులకు సమర్పించకుండ ఉండడమె శ్రేయసకరము. మనము వినయముతోను, బోధింపదగిన ఆత్మతోను, యదార్ధమైన ప్రార్థనతో వారికి ముందుగా ఉంచండి మరియు అందులో సత్యము లేదు అని వారు చూచినటైయితే వారి తీర్పుకు విడిచిపెట్టివేయండి, ఎందుకంటే” సలహాదారులకు సమూహములో విడిచిపెట్టడం భద్రత ఉంది. పూర్వము హద్దలువున్న విశ్వాసములో నిలువలేని వారు వైకరి, మరొక కొత్త సత్యము లేదా కొత్త ప్రత్యక్షత మాకు వున్నదని పురుషులు మరియు మహిళలు ఒక క్రొత్త మత విశ్వాసమును లేపుదరు. దేవుని యొక్క వాక్య పరిశోదనలో వారి సిద్ధాంతాలు కలిగియుండవు, అయునను అనేక ఆత్మలు మోసగించబడతాయి. తప్పుడు సందేశ ములను వారు పంపిణీ చేస్తునేవున్నారు, మరి కొందరు వారి ఉచ్చిలో పడవేసి లాగుకొని పోతారు.....ప్రతి విదమైన లోపమునకు వ్యతిరేకముగా అన్ని సార్లు చూస్తూ వుండ కూడదు, అయితే సాతాను నిరంతరము సత్యము నుండి మనుష్యులను దూరము చేయుటకు చూస్తునేవున్నాడు.. సంఘమునకు ఉపదేశములు 5: 293, 295, 296 (1885)LDETel 63.1

    మనము ఐక్యమవ్వటానికి విశేషమైనదేదో కనిపించాలి, ఇతరులు మన ఆలోచనలోనికి రావలని కోరడంలేదు, అయితే క్రీస్తు యొక్క సాత్వికము మరియు దీనత్వము ప్రతి ఒక్కరు వెతికినట్లయితే వారు క్రీస్తు మనస్సును కలిగి ఉంటారు. అప్పుడు ఐక్యత కలిగిన స్పూర్తివుంటుండి, లేటర్ 15, 1892. సత్యాము మేము కలిగియున్నమిని చెప్పుకొనే సహోదరులతో ఐక్యంగా నడిచుకొనవలేనని మిమ్ములను బ్రతిమిలాడుచున్నాను, మనము అతివాదము అని ప్రపంచము చెప్పుకొనే సందర్దము తీసుకొచ్చుటకు మనము చూడకూడదు, అది మనకు ఐక్యతకాదు, ఒకరు ఒకటి చెప్పుతారు మరొకరు మరోకటి చప్పతారు అనే విరోదాన్ని మనము నివారించెదము.టెస్టమోనిస్ టూ మినిస్టస్ అండ్ గాస్పల్ వర్కస్ 57 (1893). LDETel 63.2

    ఏ విధముగా విమర్శలను వదులుకోగలము

    మన విశ్వాసాన్ని విడిచిపెట్టినవారు మన సంఘాలకు వచ్చి, దేవుడు చేసిన పని నుండి మన గమనములను మళ్లించెదరు. నీవు సత్యము నుండి కల్పిత కథలను వినుటకు మీ చెవులను అప్పగించకుము. మీ పని విషయమై ఎవరైన వ్యతిరేకముగా మాట్లాడే వ్యక్తిని మార్చేందుకు ప్రయత్నించకండి, కాని యేసు క్రీస్తు యొక్క ఆత్మ ద్వారా మీరు ప్రేరేపించబడియున్నరని కనపర్చుము, మరియు వ్యతిరేకముగా వున్న వారి హృయములోనికి మాటలు జోచ్చుకొని పోవుటకు దేవుని దూతలు నీ పెదవులకు మాటలు అందించును, ఈ మనుష్యులు తమ ప్రవర్తనను అడ్డుకోగలిగితే, సంఘంలో సంపూర్ణ మనస్సుగలవారైతే, మీ యొక్క ఉన్నత ప్రమాణం అని గ్రహిస్తారు. కాబట్టి యేసు క్రీస్తు మీ ద్వారా మాట్లాడుతున్నాడని మీ మాటలు వారికి తెలియజేయుము. సంఘమునకు ఉపదేశములు 9: 148, 149(1909).LDETel 63.3

    దేవుని వాక్యమును హెచ్చించుము

    మనము ఉత్సాహమును సృష్టించేందుకు కృషి చేస్తే, మనకు కావలసిన అన్నియు కలిగిఉండాలి మరియు ఇంక మనం ఎలా నిర్వహించాలో బహుశా మనకు తెలిసి ఉండాలి, ప్రశాంతంగా స్పష్టంగా వాక్యమును ఏలా బోధించండి, మనము చేస్తున్న పని ఉత్సాహాన్ని పుటించేందుకు చూడకూడదు, దేవుని యొక్క పవిత్ర ఆత్మ మాత్రమే ఒక ఆరోగ్యకరమైన ఉత్సాహాంన్ని కలుగజేయును, దేవుని పని చేయనీయండి మరియు ప్రతినిధులైన మనుష్యులు తన ముందు మర్యాదగా నడుచుకొనవలేను, ప్రతిక్షణము క్రీస్తుని చూస్తు కనిపెట్టుకుంటు, ప్రార్ధన చేస్తు సాగి పోవలెను జీవము మరియు వెలుగు కలిగియున్న పరిశుదాత్మ ద్వారా తన వశములోనుంచుకోని నడిపించును.. - సెలెక్టేడ్ మెసెజన్స్ 2:16, 17 (1894).LDETel 64.1

    దేవుని యొక్క విలువైన వాక్యముతో మనము ప్రజల యొద్దకు వెళ్ళాలి, మరియు వారు వాక్వము స్వీకరించినప్పుడు, పరిశుద్దాత్మ రావచ్చు, నేను ముందు చెప్పినట్లుగా, ప్రజల తీర్పును గూర్చి ప్రకటించుటకు పరిశుదాత్మడు ఎల్లప్పుడూ వస్తాడు. మనం మాట్లాడేటప్పుడు, మనము పాడుచున్నప్పుడు, మన ఆద్యాత్మిక కార్యములందు, దేవుని యొక్క నిజమైన బిడ్డవలే ప్రతి ఒక్కరు నడుచుకొనుచు, ప్రశాంతత, గౌరవం మరియు దైవిక భయాన్ని కనపర్చవలేను.- సెలెక్ట్డ్ మెజన్స్ :43 (1908).LDETel 64.2

    ఉత్సుకతను బట్టి లేక అబిప్రాయములు భట్టి కాదు గాని దేవుని వాక్యము ద్వారానే, ప్రజలు సత్యమునకు విదేయులకావలేనని ప్రభావితము చేయగలము మరియు దేవుని వాక్యమనే పునాదిపైన మనము భద్రముగా నిలవగలము.- సెలెక్ట్డ్ మెసెజన్స్ 3: 375 (1908).LDETel 64.3