Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
అంత్యకాల సంఘటనలు - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    4 అధ్యాయము - దేవుని యొక్క చివరి సంఘము

    దేవుని ప్రజలు ఆయన ఆజ్ఞలను గైకొనును

    భూమిమీద దేవునికి సంఘము వుంది, అణగ దొక్కబడియున్న దేవుని ఆజ్ఞలను, పైకెత్తి చూపించుచు మరియు లోకపాపములు మోసుకును పోవు దేవుని గొర్రెపిల్ల అని ప్రపంచానికి ప్రకటిస్తున్నరు వారే ఆయన సంఘము. ప్రస్తుతకాలములో ప్రపంచంలో ఉనికిలో ఉన్న సంఘము ఆజ్ఞలను ఉల్లంగించుచున్నాది కాబట్టి వాటిని వెలుగులోనికి తీసుకొనివచ్చుటకు మరియు పాడైపోయిన పాత స్థానాలను కట్టుటకు నిలువ బడియన్నది....దేవుని ఆజ్ఞలను గైకొనుచు యేసు యొక్క విశ్వాసం కలిగియున్న శేషించిన ప్రజలను గూర్చి తెలియచేయబడిన ప్రవచనములను నెరవేర్చుచున్నారు, కనుక ప్రజలపై మనము వ్యతిరేకమైన గంభీర ద్వజము ఎత్తుటకు జాగ్రత్త పడుదము. దేవునికి విశేషమైన ప్రజలు కలికిన సంఘము భూమిమీద వున్నది. ఇక రెండవది ఉన్నది. అనేది లేదు, అయితే దేవుని ఆజ్ఞలను నిరూపించడానికి సత్యాన్ని బోదించ డానికి వారికి అన్ని ఆధారాలు కలిగియున్న ఉన్నతమైనవారు......నా సోదరుడా మీరు సెవెంత్-డే అడ్వెంటిస్ట్ సంఘము బబులోను అని నీవు గాని భోదిస్తునటైతే, అది తప్పు, టెస్టమోనిస్ టూ మినిస్ట్రీస్ అండ్ గాస్పల్ వర్కర్స్ 50, 58 59 (1893).LDETel 28.1

    [ప్రకటన గ్రంథం] రెండు తరగతులు కలిగిన దేవుని ప్రజల గూర్చి కేంద్రీకరించ బడినది, ఒకరు గమనించదగిన శేషించినవారు (12:17) మరియు బబులోనులోనా ప్రజలు (18:4) అంతేకాదు ఈ అద్యాయం మునుపు వున్న వారిని గూర్చి వివరిస్తుంది మరియు 14, వ అధ్యాయం గొప్ప స్వరముతో చెప్పుచు, తర్వాత వచ్చిన వారిని గూర్చి వివరించుచున్నది.LDETel 28.2

    యేసును గూర్చిన సాక్ష్యము వారికి కలద

    అంతిమ కాలము సమీపించినప్పుడు మనము ప్రపంచానికి చివరి హెచ్చరికను తెలియజేసే పని పొడిగించడబడినది, ప్రస్తుతము వున్న సత్యము ఎవరైతే అంగీకరించారో వారికి స్పష్టముగా అర్ధము చేసుకొనే స్వబావం మరియు సాక్ష్యము మీద వున్న స్పందన వారికి మరింత ముఖ్యమైయున్నది. అయితే అది దేవుని యొక్క విధిలో ప్రారంభము నుండి మూడవ దేవదూత యొక్క వర్తమానము ప్రకటించే పనితోనే ముడిపడివున్నది. సంఘమునకు ఉపదేశములు 5: 654 (1889)LDETel 28.3

    మనుష్యునికి ఉపాయము వెంబడి ఉపాయము రావచ్చును, అలాగే శత్రువు సత్యము నుండి ఆత్మలను మరలుగొల్పుటకు ఎదురుచూడవచ్చును, అయితే ప్రభువు సహాదరి ఎలెన్ వైట్ ద్వారా మాట్లాడి ఆమెకు వార్తమానము ఇచ్చినాడు అని విశ్వసించేLDETel 28.4

    వారందరు ఈ అంతిమ కాలములో వచ్చే అనేక మాయ తంత్రముల నుండి సురక్షితంగా తప్పించుకొందురు.-సెలేబ్రేడ్ మెజ3:83, 84 (1906). దర్శనములు మేము కలిగి ఉన్నామని చెప్పుకునేవారు లేకపోలేదు, దేవుడు నీకు స్పష్టమైన రుజువు ఇచ్చినప్పుడు అది దేవుని యొద్ద నుండి వచ్చిన దర్శనమేనని మీరు దానిని అంగీకరించవచ్చు, కాని దాన్ని ఏ ఇతర ఆదారంపై ఆమోదించకండి,ఎందు కంటే విదేశాల లోను మరియు మరి ముఖ్యముగా అమెరికాలోనూ ప్రజలను మరింత దూరంగా నడిపించే ఆస్కారమువుంది. సెలేబ్రేడ్ మెసెజ: 3: 72 (1905)LDETel 29.1

    బైబిలు సిద్ధాంతాలే వారి మైలురాయి.

    1844 సం, గడుస్తున్న సమయములను, గొప్ప సంఘటన జరిగిన కాలములని అంటాము, పరలోకములోని పరిశుద్ధ ఆలయము శుద్దీకరణ బయలుపర్బడినది మరియు భూమి మీద దేవుని ప్రజలకు సంబంధము నిర్ణయించబడినిది అనే విషయము చూడగా ఈ ఆశ్చర్యముమన కళ్లు తెరిపించింది మరియు గూడభావముతో వున్న మొదటి దూత రెండవ దూత మరియు మూడవ దూత, వార్తమానములు తెరవబడినవి. దేవుని ఆజ్ఞలను మరియు యేసుని గూర్చిన విశ్వాసం” ఇది మైలురాయిలో ఒకటి, ఈ వర్తమానములు పరలోకములోవున్న దేవుని ఆలయమును గూర్చియు మరియు మందసము లోపల ఉన్న దేవుని ధర్మశాస్త్రము గూర్చియు సత్యము ఎరిగిన-ప్రియమైన ప్రజలు చూచియున్నారు. మరియు దేవుని చట్టము అతిక్రమిస్తున్న వారి మార్గంలో నాలుగ్ వ ఆజ్ఞలో సబ్బాతు సత్యము ఒక బలమైన కిరణముగా ప్రకాశిస్తుంది. కాని మరణమగు దుష్టడు పాత పొలిమేర రాయి అయితే పాత మైలురాయిల అదిపత్యము కిందకు ఇక ఏది కూడ రాకపోవచ్చునని నా మనస్సుకు దృడముచేసెదను. కౌన్సిల్ టూ రైటర్స్ అండ్ ఎడిటర్స్, 30, 31 (1889).LDETel 29.2

    సెవెంత్-డే ఎడ్వెంటిస్ట్ ఒక విశిష్టమైన సంఘము

    సెవంతుడే అడ్వెంటిస్టులు దేవుని చేత ఎన్నుకోబడిన ఒక ప్రత్యేకమైన జనాంగము, ప్రపంచము నుండి వేరు చేయబడినారు, సత్యమనే గొప్ప ఆయుదము పట్టుకొనియున్న వీరు ఈ ప్రపంచ గని నుండి ఏర్పరచబడి ఆయనతో ఉన్నత సంబంధము కలుగి ఉన్నవారు. ఆయన వారిని తన ప్రతినిదులుగా చేసుకొనేను, మరియు కడవరి రక్షణ కార్యమునకు రాయబారులుగా పిలిచాడు. సత్యమైన ఈ గొప్ప సంపదను మరణమునకు లోనగువారికే అప్పగించెను, అత్యంత గంభీరమైనది మరియు భయము కలిగించే హెచ్చరికలు ప్రపంచమునకు అందించుటకు ఆయన కోరుకున్నాడు కాబట్టి దేవుడు మానవులకి శాశ్వతముగా ఈ బాద్యత ఇచ్చేను. సంఘమునకు ఉపదేశములు7: 138 (1902) ప్రత్యకమైన దృష్టితో సేవంతుడే అడ్వెంటిస్టులు కావలివారుగాను మరియు సత్యమును మోసుకొని వెళ్లేవారుగా ఈ ప్రపంచములో నియమించబడియున్నారు. నాశనమగు ఈ ప్రపంచమునకు చివరి హెచ్చరిక ప్రకటించే బాధ్యత వారికి అప్పగించ బడింది. వారిపైన దేవుని వాక్యమనే వెలుగు అద్భుతముగా ప్రకాశిస్తుంది. వారికి మొదటి, రెండవ మరియు మూడవ దేవదూతల అత్యంత గంభీరమైన వార్తమానములు ప్రకటించే పని ఇవ్వబడినది. ఇంత గొప్ప పనికన్న ప్రాముఖ్యమైనది మరోకటిలేదు. దీని యందు వారి దృష్టిని శోషించుటము తప్ప ఇక మద్యలో ఏది రావటానికి అనుమతిలేదు.- సంఘమునకు ఉపదేశములు...9:19 (1909).LDETel 29.3

    సెవెంత్-డే ఎడ్వాంటిస్ట్ సంఘము ఎర్పాడుటుకు కారణములు ఏమిటి

    మన సంఖ్య పెరగడంతో, సంస్థ రూపములో స్పష్టమైనది ఏదో ఒకటి లేకుండా వుంటే గొప్ప గందరగోళం ఏర్పడుతుంది, మరియు పనిని విజయవంతముగా ముందుకు కొనసాగించలేము, సువార్త సేవకు సహాయము అందించుటకు, నూతన ప్రాంతాలలో పరి చర్యను చేయుటకు, సంఘాలను మరియు సువార్త సేవను ఈ రెండింటిని అసమర్థలైన సభ్యుల నుండి రక్షించుకొనుటకు.సంఘనికి సంబందించిన ఆస్టులు కలిగి యుండుటకు, మరియు ముద్రాలయము ద్వారా సత్యమును ప్రకటించుటకు. ఇక అనేక ఇతర విషయముల కొరకు సంస్థ అవసరమైనది. సంఘములో క్రమ శిక్షణ వలన ఒక మంచి పద్ధతి అలవర్చుకొనుటకు పరిశుద్దాత్మ ద్వారా సత్యము ఇవ్వబడినది మరియు క్రమబద్ధమైన క్రమశిక్షణ ఉండాలంటే ఒక సంస్థ వుండడం ప్రాముఖ్యము. క్రమం మరియు విధానము ఈ విశ్వం అంతటిలో దేవుని యొక్క పనులలో స్పష్టంగా కనిపించుచున్నవి, పరలోకపు నియమావళి క్రమము, భూమిమీద వున్న దేవుని ప్రజలు ఇదే క్రమము కలిగియుండాలి..... (టెస్టమోనిస్ టూ మినిస్ట్రీస్ అండ్ గాస్పల్ వర్కర్స్ 26 (1902).LDETel 30.1

    సంస్థ ఎల్లప్పుడూ అవసరమైనది

    ఆలయాలు సరిగా నిర్వహించబడి క్రమబద్దముగా ఆదేశాన్ని ఇచ్చుచు ఉత్తర్వులు అమలు చేయకపోతే వారు భవిష్యత్తలో ఆశిస్తున్నది మరి ఏమి వుండదు.సంఘమునకు ఉపదేశములు.1: 270 (1862)LDETel 30.2

    క్రమము అలవరిచుకొనే ఇట్టి ప్రజలలో సాతాను ప్రవేశించి తన ప్రయత్నాలలో విజయవంతుడైనప్పుడును మరియు సమగ్రమైన సంస్థ అవసరమైన సమయంలో పనిని అణిచివేసినప్పుడును ఆహో అతడు ఏ విధముగా సంతోషించును కనుక ఇట్టి అవాస్తవికమైన వాటిమీద తిరుగుబాటు చేయుటకు మరియు దేవుని వాక్యము ఆమో దించని వాదనలు తిరస్కరించుటకు గొప్ప శక్తి కలిగియండాలి! సంస్థ యొక్క విధానము ఎక్కడ తప్పిపోకూడదని మరియు జ్ఞాన యుక్తముగాను మరియు శ్రమతో నిర్మించు కొన్న క్రమమును విచ్చిన్న ముకాకూడదని సమమైన ఒక విధానాన్ని అవలంబించుటకు ఇష్టపడుచున్నాము. ఇట్టి సమయంలో పనిని నియంత్రించడానికి ఉబలాటము కలిగి యున్న క్రమరహితముగల వారికి అధికారము ఇవ్వరాదు. కృప కాలము సమీపించి నప్పుడు దేవుని బిడ్డలైన ప్రతివారు ఏ మతమునకు సంబందించినప్పటికిని వారు సంస్థ మీద స్వతంత్రముగా వ్యహరించ వచ్చునని భవిష్యతు ఆలోచన కలిగియు న్నారు. కానీ ఈ పనిలో ప్రతి వ్యక్తి స్వతంత్రంగా ఉండటం లాంటిది ఏమీ లేదని ప్రభువు నాకు ఆదేశించియున్నారు. ( జనరల్ కాన్ఫరెన్స్ సెషన్, వాషింగ్టన్, D.C., 1909 మే 30న ప్రతినిధులు ముందు ఈ మాన్యుస్కిప్ట్ చదివిరి) సంఘమునకు ఉపదేశములు.9: 257, 258 (1909) మనము చివరి సంక్షోభం దగ్గరలో ఉన్నాము కాబట్టి ఐక్యమత్యముతో కూడిన కార్యము మరియు క్రమము కొంచెమే ఉండాలనే భావనకు బదులుగా మునుపు కంటే మనము మరింత వ్యవ స్థాత్మకంగా ఉండాలి. సెలెక్ట్డ్ మెసెజన్స్ 3:26 (1892).LDETel 30.3

    దేవుని సంఘమునకు ఒక ప్రత్యేక అధికారం.

    దేవుడు తన సంఘాన్ని ప్రత్యేక అధికారంతో మరియు బలముతో స్థాపించి యున్నాడు, ఇది నిరాకరించబడటానికి మరియు తృణీకరించటానికి ఎవ్వరికి న్యాయము తీర్చె అవకాశము ఇవ్వలేదు, అలాగ ఎవరైనా చేస్తే వారు దేవుని అధికార స్వరమును నిర్లక్ష్యము చేయుచున్నారు. సంఘమునకు ఉపదేశములు.3: 417 (1875). ఆకాశము క్రింద భూమిపై నున్న ఆయన సంఘమునకు దేవుని అత్యదిక శక్తిని అనుగ్రహించెను. ఇది దేవుని యొక్క స్వరము, సంఘ సామర్థ్యంలో ఐక్యత గలిగిన ఆయన ప్రజలు గౌరవించవలెను. సంఘమునకు ఉపదేశములు.3: 451 (1875)LDETel 31.1

    అంధత్వం మరియు ఆధ్యాత్మిక బలహీనత సమయం

    సంస్కరణలు సంఘములు ద్వారా వెళ్ళాలని నేను మిన్నియాపాలిస్లో చెప్పిన అన్ని విషయాల్లో నీను ధృవీకరించియున్నాను. గొప్ప సత్యం మరియు విలువైన అవకాశాలు మరియ ఆదిక్యతలు చేత ఆశీర్వదించబడినవారు గొప్ప ఆధ్యాత్మిక బలహీన తలు మరియు అందత్వములో ఉన్నారు కాబట్టి అట్టివారికి దిద్దుబాటు తప్పకుండ తీసుకొనిరావాలి. సంస్థలకు సంబందించిన సంఘముల నుండి సంస్కరణ కర్తలుగా బయటకు వచ్చారు కాని ఏ సంస్థల నుండి వచ్చారో దానికి సమానముగానే ప్రవర్తిస్తు న్నారు. ఇంకొకరు వచ్చి దిద్దబాటు చేయునవసరము ఉండదు అని మనము ఆశించాము. (ఎలెన్ వైట్ యొక్క కలము నుండి వచ్చిన ఏకైక ప్రకటన ఇదే.సెవెంత్-డే అడ్వెంటిస్ట్ సంస్థలో విశ్వాసం కోల్పోవచ్చునని ఆమే సూచించింది. ఆమె ఇక్కడ వ్యక్తం చేసిన సందేహం ఆమె జీవితంలోని మిగిలిన ఇరవై ఆరు సంవత్సరాలలో పునరావృతం కాలేదు.) మనము శాంతియుతమైన హద్దులలో ఐక్యతఉత్సహము కాపాడు కొనుచు న్నప్పుడు, మతమునకు వ్యతిరేకముగా కలము ద్వారాగాని లేక మాట ద్వారాగాని నిరసన వ్యక్తం చేయము..-ఇ జి డబ్ల్యు 88 356, 357 (1889).LDETel 31.2

    మాకు వెలుగు ఉన్నదని ఎవరైతే అతిశయంచుచు గాని యందు నడవని వారి కొరకు ప్రభు ఇట్లా అనేను, అయునను విమర్శకాలము నందు మీ గతికంటే తూరు సీదోను పట్టణముల వారి గతి ఓర్వదగినదైయుండును, ఓ కపిర్న హుమా, ఆకాశము మట్టుకు హెచ్చింపబడెదవ? (సెవంతుడే అడ్వెంటిస్ట్, ఎవరైన గొప్ప వెలుగువున్నదని] చెప్పుకొనుచు మరియు అర్హత విషయములో వారు ఆకాశము కంటే ఉన్నతముగా హెచ్చించుకుంటే నరకాగ్ని క్రిందకు పడవేయబడతావు. వారి కోసం గొప్ప పనులన్నీ చేసినవి అవి గాని సొదొమలో చేయబడివునధ్యితే నేటి రోజు వరకు ఉండి ఉండేది- ది రివ్యూ అండ్ హెరాల్డ్, ఆగష్టు 1, 189 [బ్రాకెట్లువున్న వాక్యలు ఎలెన్ వైట్ వ్యాఖ్యానాలు ] సంఘము లావొడిసియా స్థితిలో ఉంది. దేవుని ఉనికి ఆమల్లో లేదు.-1 ఎ న్యూ లైప్ [రివైవల్ అండ్ బియాండ్), 99 (1898)LDETel 31.3

    సంఘము యొక్క ప్రధాన కార్యాలయంలో అధికార దుర్వినియోగం

    జనరల్ కాన్ఫరెన్స్ కూడా తప్పుడు అభిప్రాయములతోను మరియు సూత్రాలతోను అవినీతికి పాల్పడుతుంది.....మనుష్యులు వారి అధికార పరిదిలో ఉండాలని భావించిన వారికి అన్యాయమైన ప్రయోజనము కొరకు పనికి తీసుకుంచున్నారు. ప్రతివ్యక్తి వారి నిబందనలను అనుకూలముగా వుండుటకు తీసుకోవాలని నిర్ణయించారు; అయితే వారు సరిగా పరిపాలిస్తారు లేదా పతనమునచేస్తారు గ్వరముతో గూడిన అదికారము అభివృద్ధి పొందుటవలన ఆ స్థానములో మనుష్యుడును దేవుడుగా వ్యహరిస్తున్నాడు. అయితే ఆ విషయము నన్ను భయపడేటట్లు చేస్తుంది, మరియు ఏదైన భయపడటానికి కారణ మైనది, ఇది ఎవరైనను మరియు ఎవరి ద్వారానైనను ఈ విధముగా జరిగించిన టైయితే అది శాపం.-( టెస్టమోనిస్ టూ మినిస్ట్రీస్ అండ్ గాస్పల్ వర్కర్స్ 59-361 (1895).LDETel 32.1

    కొందరు మనుష్యులకు భారముతో కూడిన అనేక బాధ్యతలు కలిగి ఉండుటవలన దేవుడును వారి సలహాదారుడిగా చేసుకోలేదు, ఈ మనుష్యులకు విదేశాల్లో పని అవస రాలను గురించి ఏమి తెలుసు? సమాచారము గూర్చిన ప్రశ్న వచ్చినప్పుడు వారి ఏది ఎలా నిర్ణయించుకోవాలో వారికి ఏమీ తెలుసు. అయిన వారు వ్రాసినది అలస్యము కాకపోయునప్పటికి, విదేశాల నుండి వారి ప్రశ్నలకు సమాదానము రావటానికి కనీసం మూడు నెలలైనపట్టును. (టెస్టమోనిస్ మినిస్టీప్లెండ్ గాస్సల్ వర్కర్స్ 321 (1896). మొదట బాటిల్ క్రీక్ అనుమతి కోసం పంపిస్తేనే తప్ప సుదూర దేశాల్లో నివసిస్తున్న వారికి ఆది న్యాయమేనని నిర్ణయించుకొనే వరకు వారు చేయరు, వారు త్వరపడక ముందే ఆ స్థలం కోసం, అవును లేదా అని ఎదురుచూస్తారు.- ఎస్ పి టి- ఎ (9) 32 (1896).- (టెస్టమోనిస్ మినిస్టీన్లాండ్ గాస్పల్ వర్కర్స్ 321 (1896).మొదట బాటిల్ క్రీక్ అనుమతి కోసం పంపిస్తేనే తప్ప సుదూర దేశాల్లో నివసిస్తున్న వారికి ఆది న్యాయమేనని నిర్ణయించుకొనే వరకు వారు చేయరు, వారు త్వరపడకముందే ఆ స్థలం కోసం, అవును లేదా అని ఎదురుచూస్తారు.- ఎస్ పి టి- ఎ (9) 32 (1896).LDETel 32.2

    జనరల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడిగా ఒక వ్యక్తిని ఎంచుకోవడం తేలికైనదిపని కాదు. జనరల్ కాన్ఫరెన్స్ పని విస్తరించింది, మరియు కొన్ని విషయాలు అనవసరంగా సంక్లిష్టంగా చేయబడ్డాయి. వివేచనగల కోరికలను గూర్చి చూపించబడింది. సువార్త సేవ కొరకు ఒక డివిజన్ తప్పక వుండాలి మరియు ప్రస్తుతం క్రమబద్ధముగా వున్న విషయములను బట్టి ఇతర ప్రణాళికను రూపొందించాలి.- ( టెస్టమోనిస్ మినిస్ట్రీస్ అండ్ గాస్పల్ వర్కర్స్, 1896 లో (సెవెంత్-డే అడ్వెంటిస్ట్ సంఘము 3,500 మంది సభ్యులతో ఆరు కాన్ఫరెన్స్ ప్రారంబించారు, దరిదాపు ముప్పై మంది సువార్త సేవకులు పని చేసినారు మరియ జనరల్ కాన్ఫరెన్స్ కమిటి సభ్యుల ముగ్గురు, జనరల్ కాన్ఫరెన్స్ అధ్యక్షులు మంచి నాయకత్వం అవలంబించవలెనంటే ఇటువంటి చిన్న కాన్ఫరెన్స్ యొక్క సలహా అవసరముంది. అతను ప్రతి ముఖ్యమైన సమావేశానికి వ్యక్తిగతంగా హాజరు కాగలడు మరియు అదనంగా ప్రచురణ పనులతో సంబంధం ఉన్న వ్యాపారంలో ఎక్కువ శ్రద్ధ చూపుతాడు. అయినప్పటికీ, 1896 నాటికి సంఘము యొక్క పని యునైటెడ్ స్టేట్లలో విస్తరించింది. మరియు ఐరోపా, ఆస్ట్రేలియా మరియు ఆఫ్రికాలకు విస్తరించింది. ఒక వ్యక్తి విస్తృతస్థాయిలో పని చేయడానికి తగినంత పర్యవేక్షణ మరియు ఆదేశములు ఇవ్వడానికి ఇది సాధ్యపడదు. ఎలెన్ వైట్ ఫీల్డ్ యొక్క ఒక డివిజన్ విభాగాన్ని కోరారు. తద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన సంఘ సభ్యులు కోసం కేవలం ఒకే వ్యక్తిని సలహ ఇవ్వడం కోసం చూడకూడదు. ఇది యూనియన్ కాన్ఫరెన్స్ మరియు ప్రపంచ డివిజనుల విభాగాలు ఏర్పాటుచేయుటము ద్వారా సాధించగలరు]LDETel 32.3

    తెలివిలేని నాయకులు దేవుని గూర్చి మాట్లాడరు

    బాటిల్ క్రీక్ నుండి వచ్చిన స్వరము, ఇది ఎలా పని చేయాలనేది సలహా ఇవ్వ డానికి అధికారం కలిగి ఉన్నది, ఇది ఇకపై దేవుని స్వరము కాదు. -మాన్యుస్క్రిప్ట్ రిలీజ్ 17: 185 (1896).కొన్ని సంవత్సరాల క్రితము నుండి నేను జనరల్ కాన్ఫరెన్స్ అంటే దేవుని స్వరముగా భావించిను.-మాన్యుస్క్రిప్ట్ రిలీజ్ 17: 216 (1898).LDETel 33.1

    ప్రజలకు దేవుని యొక్క స్వరముగా ఉండటానికి ఈ మనుష్యులు ఒక పవిత్ర స్థలంలో నిలబడాలి, ఒకప్పుడు జనరల్ కాన్ఫరెన్స్ అంటే గతములో ఈ విధముగా వుండేది అని విశ్వసించాము. జనరల్ కాన్ఫరెన్స్ బులెటిన్, ఏప్రిల్ 3, 1901, p. 25.LDETel 33.2

    నూతన సంస్థ అవసరం లేదు

    ముగిస్తున్న కృపకాలము గూర్చి మాట్లడుటకు సాక్ష్యములో నుంచి ఒక వచనము మీరు తీసుకొని, దేవుని ప్రజల మధ్య అలజడి రేగుతుంది. మరియ ప్రజల్లో నుండి పరిశుద్ధతవస్తుంది, పరిశుద్ధ జనాంగములేస్తారని మీరు మాట్లాడెదరు. ఇప్పుడు ఇవన్ని శత్రువుని సంతృప్తి పరుస్తున్నయి జాగ్రత్త.......... మీరు ముందుగానే చెప్పిన ఉద్దేశములు ఎందరో అంగీకరించెదరు మరియు వార దాని విషయమై మాట్లాడుచు, ప్రవర్తించే దరు, సెవెంత్-డే అడ్వెంటిస్ట్ నుండి మునుపెన్నడు చూడని ఓ గొప్ప అమితమైన ఉత్సాహ పూరితమైన సాక్ష్యము మనము ఒకటి చూడాలి. సాతాను కోరు కునేది కూడ అదే.. సెలెక్ట్డ్ మెసెజన్స్1: 179 (1890)LDETel 33.3

    సెవెంత్-డే అడ్వెంటిస్ట్ సంఘము బబులోను అని పిలవడానికి నీకు సందేశం ఇవ్వలేదు. అయితే దేవుని ప్రజలను దాని నుండి బయటికి రావాలని పిలుపునిచ్చుటకు నిన్ను ఎంచుకున్నాడు. అయితే మీరు అన్ని కారణాలు సమర్పించవచ్చు కాని ఈ అంశము విషయములో మీరు నాతో సరితూగ లేరు. ఎందుకనగా ఇటువంటి సందేశానికి వ్యతిరేకించుటకు నిర్ణయించే సత్యము దేవుడు నాకు ఇచ్చియున్నాడు. దేవుడు తన సంఘమును ప్రేమించుచున్నాడని తెలుసు. అయితే ఇది క్రమములేక పోవటముగాని లేక స్వతంత్రముగా చిన్న అనువువలే ముక్కలైపోవుటానికి కాదు ఉన్నది. ఇందులో కనీస స్థిరత్వం లేనిది అనేది వుండరాదు, అలాంటి ఒక విషయం ఉందని కనీసం నిదర్శనము కనిపించకూడదు. సెలెక్ట్డ్ మెసెజన్స్ 2:63, 68, 69 (1893).LDETel 34.1

    నా సోదరులారా నేను మీతో చెప్పుచున్నాను, ప్రభువు క్రమపర్చబడ్డ ఒక వ్యవ స్థాపక సంస్థను కలిగియున్నాడు. దాని ద్వారా పనిచేచున్నాడు....... ఈ వ్యవస్థాపక సంస్థకు చెందిన దేవుని ఆజ్ఞలను గైకొనుచున్న ప్రజలలోనుంచి ఎవరైన దూరముగా వెళ్లిపోయి నప్పుడు, అతడు మానవ ప్రమాణాల ప్రకారము సంఘ విలువ తూయ బడుటకు ప్రారంబించినప్పుడు అతను మీదకి తీర్పును ప్రకటించడం మొదలవుతుంది, అప్పుడు అతను తప్పు మార్గంలో ఉన్నాడు కాబట్టి దేవుడు ఆయనను నడిపించుట లేదని తెలుసుకోన వచ్చును. సెలెక్ట్డ్ మెసెజన్స్ 3:17, 18 (1893).LDETel 34.2

    దేవుడు అంతా క్రమపరుచును

    పని విజయవంతం కాదని భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు పనికి మూలమై యున్నాడు మరియు ఆయన ప్రతిది క్రమంలో పెట్టును. ఏ విషయాల్లోనైన సర్దుబాటు అవసరమైవుంటే పనికి మూలమైన దేవుడు హాజరు అవుతాడు మరియు ప్రతి తప్పిదమును సరిచేసి పని జరిగించును. దేవుని ప్రజలను సురక్షితంగా అద్దరికి చేర్చగలిగే గొప్ప నౌకను దేవుడు తీసుకొని రానైయున్నాడు కాబట్టి మనము విశ్వాసము కలిగి వుందుము.-ఎసెలెక్ట్డ్ మెసెజన్స్ 2: 390LDETel 34.3

    దేవునికి సజీవమైన సంఘము లేదా? దేవునికి ఒక సంఘము వుంది, అయితే అది సమరశీల సంఘమె, కాని అది విజయవంతమైన సంఘము కాదు. చాల విచార కరమైన విషయమది, అందులో లోపమున్న సభ్యులున్నారు, గోదుమల మద్య గురుగులు ఏలావున్నాయో ఆలగా ఉన్నది........ సంఘములో దుష్టత్వాలు ఉన్నప్పటికీ, ప్రపంచ యూగాంతమున ఐక్యపరుచును, పాపము మరియు దుర్నీతిచేత కలుషితమైన సంఘము ఈ కడవరి దినాలలో ఒక వెలుగుగా వుంటుంది, దుర్బలము మరియు లోపముచేత నిరుత్సాహపడుచున్న సంఘమునకు సలహాలు, హెచ్చరికలు మరియు ఉపదేశములు ఇవ్వవలసిన అవసరం ఉంది. క్రీస్తు యొక్క అత్యంతమైన అభిమానము ఒక్కటే భూమిమీద ఆయన దయచేయగలడు. - (టెస్టమోనిస్ టూ మినిస్ట్రీస్ఆండ్ గాస్పల్ వర్కర్స్ 45, 49 (1893).LDETel 34.4

    సాతాను యొక్క దళము విజయం సాధించదు. మూడవ దూత వార్తమానమే విజయము ప్రయత్నాలు చేస్తుంది, సైన్యములకధిపతియగు యెహోవా యెరికో గోడలను పడగొట్టును, అయితే ప్రభవు ఆజ్ఞలను గైకొనుచున్న ప్రజలు విజయవంతం అవుతారు, మరియు ప్రతి కూల ప్రత్యర్థులందరు ఒడిపోవుదురు. (టెస్టమోనిస్ టూ మినిస్ట్రీస్ అండ్ గాస్పల్ వర్కర్స్ 410 (1898).LDETel 35.1

    బాధ్యతలను అప్పగించాలనే అభ్యర్థన

    మనకి ఇప్పుడు కావలసినదెల పునర్వ్యవస్థీకరణ. మనము ప్రత్యేకమైన వేరే సూత్రము మీద పునాది వేసి నిర్మాణము ప్రారంభించాలని కోరుకుంటున్నాము..విద్యా సంబంధ ప్రయోజనాల కోసము మరియు వివిధ ప్రాంతాములోనున్న కాన్ఫరెన్స్ మరియు వివిధ రాష్ట్రాలకు సంబధంచిన వ్యక్తులు ఎవరైతే సంస్థల నాయకులగా వున్నారో వారు ఇక్కడ నిలబడియున్నారు.వీరు మనుష్యల పక్షముగా ప్రణాళికలను రచించడము మరియు రూపొందించి ముందుకు సాగించుటకు వీరందరు ప్రతినిధులుగా వున్నారు. మొత్తం విస్తారమైన భాగాన్ని పరిగణనలోకి తీసుకోవడానికి ఒకటి కంటే ఎక్కువ మంది రెండు లేదా ముగ్గురు ఉంటారు. విస్తారమైన పనివున్నది, మరియు పూర్తి చేయవలసిన పని కోసం ప్రణాళికలు రచించి అమలు పరచడానికి ఒక వ్యక్తి ఆలోచన చాలదు.... ఇప్పుడు నేను ఒక విషయమును చెప్పాలనుకుంటున్నాను ఈ పని విభాగాన్ని లేదా ఆ శాఖను నియంత్రించటానికి దేవుడు మన హోదాలో ఏ రాజ్యాది కారము పెట్టలేదు. ప్రతి విదమైన క్రమములో నియంత్రించే ప్రయత్నాలు పుండుటవలన పని బాగా నిర్బంద ముగావున్నది......... పునర్నిర్మాణము మరియు పునర్వ్యవస్థీకరణ ఉండాలి; ముఖ్య సభకు తప్పనిసరిగా అవసరమైన శక్తి మరియు బలం తీసుకోవాలి. (ఎలెన్ వైట్ యొక్క ప్రారంభ ప్రసంగం ఏప్రిల్ 2, 1901 న, బాటిల్ క్రీక్ జనరల్ కాన్ఫరెన్స్ సెషన్]. - ది జనరల్ కాన్ఫరెన్స్ బులెటిన్, ఏప్రిల్ 3, 1901, pp. 25, 26.LDETel 35.2

    కొత్త కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయాలి. దేవుని యొక్క ఆదేశమువలన యూనియన్ కాన్ఫరెన్స్ ఆస్టేలేసియాలో ఏర్పాటుచేయబడినది......... సమాదానం రావడము కోసం వారాల పాటు వేచి ఉండాలి కాబట్టి సలహా కోసము వేలాది మైళ్ళ దూరములోనున్న బాటిల్ గ్రీక్ పంపిచడం అంత అవసరములేదు. ఏస్థలములో ఉన్నవారు అస్థలములోనే ఏమి చేయుదము అని నిర్ణయుంచుకోవడం మంచిది. .-ది జనరల్ కాన్ఫరెన్స్ బులెటిన్, ఏప్రిల్ 5, 1901, పేజీలు 69, 70.LDETel 35.3

    1901 జనరల్ కాన్ఫరెన్స్ సమావేశాము యొక్క స్పందన

    కాన్ఫరెన్స్ ప్రారంభమైననాటి నుండి మనతో ఎవరు ఉన్నారని నీవు ఊహించి యున్నావు? అటువంటి సమావేశంలో సాదారణంగా కనిపించే అభ్యంతరకరమైన లక్షణాలను ఎవరు దూరంగా ఉంచుతారు? మరియు ఈ గుడారములో ఉన్న భాగములో ఎవరు పైకి క్రిందికి వెళ్ళారు? వారే పరలోకమందున్న దేవుడు మరియు అతని దేవదూతలు. మరియు వారు ఇక్కడికి వచ్చినది. మనలను తునాతునకలుగా చేయటానికి రాలేదు, కానీ నీకు అనుకూలమైనదియు మరియు శాంతిపూర్వక మనస్సు ఇవ్వడానికి వచ్చారు. దేవుని యొక్క కార్యములు నెరవేర్చుటకు, మరియు చీకటి శక్తులను వెనక్కి నెట్టివేసి దేవుని పనికి ఆటంకము కలగకుండా ఆయన రూపకల్పన చేసిన కార్యామును జరిగించుటకు మనతో కలసి పని చేయుటకు మన మద్యకు వచ్చారు. దేవుడు యొక్క దూతలు మనలో పని చేస్తున్నారు..... ఈ సమావేశంలో మలుపులు తీసుకొచ్చిన్న విషయములు చూస్తే నేనెన్నడు నా జీవితంలో ఇలాగ ఆశ్చర్యపోలేదు. ఇది మన పని కాదు. దేవుడే ఈ పనిని తీసుకొనివచ్చెను, దీనికి సంబంధించిన సూచన ఆదేశములు దేవుడు నాకు బయలుపర్చాడు. కానీ ఈ సమావేశంలో పని మొత్తాన్ని పూర్తి చేయబడిన వరకు నేను ఈ సూచనను గ్రహించలేక పోయాను. ఈ సమాజంలో దేవుని దూతలు ఇటు అటు నడుస్తూనే ఉన్నారు. మీలో ప్రతి ఒక్కరు ఈ విషయమును గుర్తుంచుకోవాలని నేను కోరుతున్నాను, అదేకాదు మరోక విషయమును కూడ జ్ఞాపకము చేస్తున్నాను, దేవుడు తన ప్రజల గాయాలను నయం చేస్తాడని ఆయన చెప్పియున్నాడు.- జనరల్ కాన్ఫరెన్స్ బులెటిన్, ఏప్రిల్ 25, 1901, pp. 463, 464.LDETel 35.4

    జనరల్ కాన్ఫరెన్స్ సమయంలో ప్రభువు తన ప్రజల కొరకు అద్భుతమైన కార్యము చేసాడు. ఆ సమావేశం గురించి నేను ప్రతిసారి ఆలోచిస్తాను, అప్పుడు ఎంతో దయగలిగిన పవిత్రత నన్ను ఆవరించినది మరియు నా ఆత్మకు కృతజ్ఞతా భావాన్ని పంపుయున్నది. మన విమోచకుడైన దేవుని యొక్క గంభీరమైన దశలను మేము చూశాము. ఆయన పవిత్ర నామాన్ని స్తుతిస్తున్నాము, ఎందుకంటే ఆయన తన ప్రజలకు విమోచనను అనుగ్రహించాడు. ది రివ్యూ అండ్ హెరాల్డ్, నవంబర్ 26, 1901.యూనియన్ కాన్ఫరెన్సు ఏర్పాటు చేయుడము ఎంతైనా అవసరముంది, ఎందుకంటే వేర్వేరు కాన్ఫరెన్సులు మీద జనరల్ కాన్ఫరెన్స్ యాజమాయిషీ చేయుటము సాద్యముకాదు. కాన్ఫరెన్సులో ఇవ్వబడిన అధికారమ కేవలం ఒకరు లేదా ఇద్దరు లేదా ఆరుగురు మీద కేంద్రీకృతమై ఉండకూడదు; వేర్వేరు డివిజన్ విభాగములో ప్రజల కూటమి వుంటుంది.- ఎమ్ఎస్ 26, ఏప్రిల్ 3, 1903. [ జనరల్ కాన్ఫరెన్స్ సెషన్లో సంస్థ నిర్మాణము గూర్చిన మార్పులు1901 లో జరిగింది. దీని గుర్ని మరింత సమాచారం కొరకు సెవెంత్- డే అడ్వెంటిస్ట్ ఎన్సైక్లోపెడియ చూడండి (వాల్యూమ్ 10 ది కామెంటరీ రిపరెన్స్ సిరీస్), రివైస్ ఎడిషన్, పుట 1050-1053.]LDETel 36.1

    సెవెంత్-డే ఎడ్వెంటిస్ట్ సంస్థ విశ్వసనీయతను నిర్ధారించబడింది

    దేవుడు నెలకొల్పిన పునాదిని ఇప్పుడు మనము స్థాపించలేము. మనము ఇప్పుడు ఏ కొత్త సంస్థలోకి ప్రవేశించలేము, ఎందుకంటే అది సత్యము నుండి మత భ్రష్టత్వములోనికి వెళ్లినట్లు అవుతుంది. సెలెక్టెడ మెసెజన్స్ 2: 390(1905)LDETel 36.2

    ప్రపంచమంతా సె వెంతుడే అడ్వెంటిస్టులేనని నాకు ఆజ్ఞాపించబడియుంది ఆయనకు ఒక ప్రత్యేకమైన ధన నిధి గలిగిన ప్రజలుగా ఉండుటకు దేవుడు మనలను పిలిచెను. భూమ్మీద ఉన్న ఆయన సంఘము, కాలము అంతమునకు వచ్చినప్పుడు ఆత్మలు పరిపూర్ణమైన ఐక్యత మరియు దేవుని యొక్క ఆదేశములలో నిలబడాలి అని ఆయన నియమించెను..-సెలెక్ట్డ్ మెసెజన్స్ 2: 397 (1908).LDETel 37.1

    ఒకా నొక సమయమందు జనరల్ కాన్ఫరెన్స్ పేరుతో, సాధారణ నిర్వాహకులు ఒక చిన్న పని సామాన్యమైన సమూహమునకు అప్పగించెన అయితే వారు దేవుని పనిని అటంకపరుచుటకు అజ్ఞానముగల ప్రణాళికలను వేయుటకు ప్రయత్నము చేసిరి. నేను ఇకపై ఈ కొద్దిమంది మనుష్యులు ప్రాతినిధ్యం వహించే జనరల్ కాన్ఫరెన్స్ అధికారము, దేవుని స్వరముగా నేను పరిగిణించలేదు, కానీ అన్ని సంఘములు మరియు అన్ని ప్రాంతాల నుండి వచ్చిన ప్రతినిధులు నియమించిన జనరల్ కాన్ఫరెన్స్ నిర్ణయము గౌరవించకూడదని చెప్పడం లేదు. దేవుడు తన సంఘము యొక్క ప్రతి నిధులు ప్రపంచ నలుమూలల నుండి వచ్చిన వారిని ఆయన అబిషేకించెను, వారు జనరల్ కాన్ఫరెన్స్ లో సమావేశమై ఉన్నప్పుడు వారికి అదికారం కలిగి ఉంటుంది. ఒక వ్యక్తి లేక చిన్న సమాహము యొక్క ఆదారమును బట్టి మనస్సు పెట్టడం మరియు తీర్పు ఇవ్వడం అనేది కొందరు చెస్తున్నది ప్రమాదకరమైన పోరపాటు, పూర్తి అధికారము యొక్క విలువ మరియు ప్రభావము దేవుని సంఘము మీద ఆయన పెట్టియున్నాడు, కాబట్టి ఆయన తీర్పు మరియు అధికార స్వరములో జనరల్ కాన్ఫరెన్స్ మీద బాధ్యత వున్నది కాబట్టి సంఘము యొక్క శ్రేయస్సు మరియు పురోగతి కోసం ప్రణాళిక సిద్ధం చేయచున్నది. సంఘమునకు ఉపదేశములులు. .9: 260,261 (1909)LDETel 37.2

    దేవుడు తన సంఘాన్ని ప్రత్యేక అధికారంతో మరియు బలముతో స్థాపించి యున్నాడు, ఇది నిరాకరించబడటానికి మరియు తృణీకరించటానికి ఎవ్వరికి న్యాయము తీర్చే అవకాశము ఇవ్వలేదు, అలాగ ఎవరైనా చేస్తే వారు దేవుని అధికార స్వరమును నిర్లక్ష్యము చేయుచున్నారు. —అపొస్తలుల కార్యములు 164 (1911). ఇశ్రాయేలీయుల దేవుడు ఇంకా తన ప్రజలను మార్గనిర్దేశం చేస్తున్నాడని నేను గ్రహించాను, అంతేకాదు అంతిమ కాలమువరకు ఆయన వారితో ఉంటాడని నేను గ్రహించినట్లుగా నేను ప్రోత్సహించబడి మరియు ఆశీర్వాదించబడియున్నాను. సెలక్టేడ్ మెసెజన్స్ 2: 406 (1913). [జనరల్ కాన్ఫరెన్స్ సెషన్లో సెవెన్-డే అడ్వెంటిస్ట్ సంఘము గూర్చి ఎలెన్ వైట్ 1913 మే 27 న ఇచ్చిన చివరి సందేశం ఇది, జనరల్ కాన్ఫరెన్స్ ప్రెసిడెంట్ ఎ. జి. డానియల్స్ ఈ అభయాన్నిచ్చే వాక్యాలు చదివి వినిపించారు. ]LDETel 37.3

    డబ్ల్యు . సి. వైట్ గారి ప్రకటన

    (శ్రీమతి. లిదా స్కాట్)అనే ఆమెతో నేను, శేషించిన సంఘము అనుభవము మరియ ఆమే సానుకూల బోధనతోను దేవుడు తల్లిగా లక్షపెట్టును అంతేగాని ఆయనLDETel 37.4

    మరొక సంఘము నుండి బయటికి వచ్చి పూర్తిగా మత భ్రష్టత్వమునకు పోవుటకు ఆయన అనుమతించడు అని చెప్పాను, డబ్ల్యు సి . వైట్ టు ఇ. ఇ. ఆండ్రోస్, మే 23, 1915, వైట్ ఎస్టేట్ కరస్పాండెన్స్ పైల్.LDETel 38.1

    ఆధ్యాత్మిక ఉజ్జీవనం ఇంక అవసరము

    ఒక రోజు మధ్యాహ్నం 1901] సంలో చివరిలో జనరల్ కాన్ఫరెన్స్ లో ఉన్న పురుషులు దేవుని ఇష్టానికి మరియు ఆయన మార్గం అనుసరించి పని చేసినప్పుడు అది ఎలా ముందుకు సాగునోనని దానిని గూర్చి నేను వ్రాస్తున్నాను. గొప్ప సత్యమైన వెలుగు కలిగిఉన్న వారు సత్యములో నడవలేదు. విరామము ఇవ్వలేదు. సమా వేశములు ముగిసినవి అయునను పురుషులు చేయవలసినది చేయక, దేవుని యందు వారు తగ్గించు కొనలేదు కాబట్టి పరిశుద్దాత్ముడు కూడ కలుగజేసుకొన లేదు....... నేను అంత వరకు వ్రాసి యున్నాను అంతలో నేను స్పృహ కోల్పోయాను అప్పుడు బాటిల్ క్రీక్ లో ఒక దృశ్యాన్ని చూస్తున్నాను. అది మేము గుడారము యొక్క ఆడిటోరియంలో సమావేశమయ్యాము, మేము ప్రార్థన చేసి పాటలు పాడినాము తర్వాత మళ్లీ ప్రార్థన చేసాము, మేము దేవునికి యదార్థమైన విజ్ఞాపనచేసియున్నాము, సమావేశములో పరిశుదాత్మ ఉనికి మా మద్యవుండడం గుర్తించాము..... హృదయ పూర్వక ఒప్పుకోలు చేయడానికి ఎవరు కూడ అతిశయించినట్లు కనిపించలేదు, మరియు ఈ పనిలో నాయకత్వం వహించిన వారు అనుభవము వున్నా వారే కానీ వారు ముందుకొచ్చి పాపాలు ఒప్పుకోవటానికి ధైర్యం లేదు. అంతకు ముందు అ గుడారంలో ఎన్నడు వినబడలేనంతగా సంతోషించుచున్నారు, అప్పుడు నేను నా స్పృహ నుండి బయటపడ్డాను, నేను ఎక్కడ ఉన్నాను అని ఆలోచించడానికి కొంత సమయము పట్టింది, నా కలం ఇంకను నా చేతిలో ఉంది నాతో మాట్లాడియున్న మాటలు ఈ విషయం ఉన్నాయి. ప్రభువు తన ప్రజలు కోసం కార్యముచేయుటకు వేచియున్నాడు, పరలోకమంతయు దయతో ఎదురు చూస్తున్నది, గత జనరల్ కాన్ఫరెన్స్ లో మేము ఎప్పుడు పూర్తిగా పనులను జాగ్రత్తగా చేసియున్నామోనని నేను ఆలోచించి యున్నాను. - సంఘమునకు ఉపదేశములు8: 104-106 (జనవరి 5, 1903)LDETel 38.2

    ఇటీవల రాత్రి సమయంలో నా ముందు వెళ్లిన దృశ్యాలు లోతుగా ఆకట్టుకున్నాయి. చాలా ప్రాంతాలలో ఉజీవమైన కారిక్రమములు ముందుకు కొనసాగుచున్నవి, చూచుటకు ఇది ఒక గొప్ప ఉద్యమం ఉజ్జీవమైన కార్యము, మన ప్రజలు దేవుని పిలుపునకు స్పందించి సరైన మార్గములో పయనిస్తున్నారు. ( టెస్టమోనిస్ మినిస్టీస్ అండ్ గాస్పల్ వర్కర్స్ 515 (1913). [1913 లో జనరల్ కాన్ఫరెన్స్ సెషన్ లో ఎలెన్ వైట్ యొక్క మొదటి సందేశం నుండి వెలువడినది]LDETel 38.3

    తన ప్రజలతో దేవుని యొక్క సహనం.

    దు:ఖకరమైన భంగపాటువలన విమోచకుని యొక్క ఆశయాలను అందుకో వడములో సంఘము విఫలమైనది, అయునను ప్రభువు ఇంకా తన ప్రజల నుండి తాను ఉపసంహరించుకోలేదు. వారిలో ఏదో మంచితనము కనిపించినందుకు కాదు, నీతియు మరియు సత్యమునకు వారది అయిన వారి యెదుట ఆయన నామము అగౌరవపరచకూడదని మరియు సాతను యొక్క ప్రతినిధులైన దుష్టశక్తులు దేవుని బిడ్డలను నాశనము చేయడములో వారు జయశీలులు కాకూడదని ఆయన ఇంకా సహించుచున్నాడు ఆయన వారి అవిధేయతకు,అపనమ్మకమునకు మరియు మూర్ఖత్వ మునకు దీర్ఘశాంతము వహిస్తున్నాడు, అద్భుతమైన సహనముతోను మరియు కరుణతోను ఆయన వారిని క్రమశిక్షణలో పెట్టెను, ఆయన బోధకు లక్ష్యముంచి నధ్యితే ఆయన వారి కథనమైన దోషములను శుద్దీకరిస్తాడు, శాశ్వతమైన జీవములోనికి వారిని రక్షించును, మరియు వారికి అనుగ్రహించిన కృప శక్తివలన శాశ్వతమైన జ్ఞాపక చిహ్నాలుగా తయారుచేస్తాడు. ది సైన్స్ ఆప్ ది టైమ్స్, నవంబర్ 13, 1901. దుర్బలమైనదిగాను మరియు లోపమైనదిగాను సంఘము వున్నప్పటికిని, క్రీస్తు తన సర్వోన్నతమైన గౌరవమును ఈ భూమిపై కనపరిచేది ఏకైక స్థలము ఇదేనని మనము గుర్తుంచుకొనవలేను. ఆయన నిరంతరం దృఢత్వాన్ని చూపిస్తూ, పరిశుద్ధాత్మ ద్వారా దాన్ని బలపరుస్తాడు.- సెలెక్ట్డ్ మెజన్స్.-2: 396 (1902).LDETel 39.1

    దేవుడు విశ్వాసముగా ఉన్న వారితోనే పనిని జరిగిస్తాడు

    ప్రభువైన యేసుని సేవించుటకు ఆయన ఎంపిక చేసుకొనిన ప్రజలు ఎప్పుడు ఉంటారు. జీవప్రదాత అయిన క్రీస్తును యూదు ప్రజలు తిరస్కరించినప్పుడు, దేవుని రాజ్యమును వారి యొద్ద నుండి తీసివేసి అది అన్యులకు ఇవ్వబడినది. దేవుని యొక్క ప్రతి శాఖలోవున్న పనిని ఈ సూత్రముతోనే కొనసాగించును. సంఘము దేవుని వాక్యమునకు అవిధేయత చూపుచున్నదని రుజువు అయునప్పుడు, వారు ఏ స్థానములో వున్నప్పటికిని, ఎంత ఉన్నతమైనదియు మరియు పవిత్రమైన పిలుపు వున్నప్పటికిని, ప్రభువు ఇకపై వారితో పని చేయడు. ఇతరులు ముఖ్యమైన బాధ్యతలను చేపట్టుటకు ఎంపిక చేయబడ్డారు. కానీ, వారు ప్రతివిదమైన తప్పిదము నుండి వారి జీవితములను పరిపూర్ణము చేయకపోతే, వారు తమ హద్దు లన్నిటిలో స్వచ్ఛమైన, పవిత్రమైన నియమాలను ఏర్పాటు చేయకపోతే, అప్పుడు ప్రభువు మిక్కిలి వేదనతో సంతాపముచెందును మరియు వారు వినయముగలవారై మరియు పశ్చాత్తాపము చెందకపోతే, వారు స్థానము నుండి తోలిగించబడి అవమానించ బడుదురు.మాన్యుస్కిప్ట్ రిలీజ్ 14: 102 (1903LDETel 39.2

    వెలుగు అనుగ్రహింప బడిన దానిని బట్టే తీర్పు

    గుడారము విషయములో సరిచూచినప్పుడు సెవెంత్-డే అడ్వెంటిస్ట్ సంఘము తూయబడినది, ఆమెకు ఉన్న ఉన్నత అధికారాలు మరియు ప్రయోజనాలు బట్టి ఆమెకు తీర్పుచేయును, క్రీస్తు ఆమెకు అనుగ్రహించిన అనంతమైన విలువు గల ప్రయోజనాలకు అనుగుణంగా ఆమె ఆధ్యాత్మిక అనుభవము లేనట్లైయితే, మరియు ఆమెకు అప్పగి బడిన పనిలో ఆమె యోగ్యరాలుకాకపోతే, ఆమేకున్న అశీర్వాదములు నిర్ధారణ చేసిన ట్రెయితే ఆమేకు తీర్పు ప్రకటించబడుతుంది, సత్యము వలన అనుగ్రహింపబడిన అవకాశాలు బట్టి ఆమెకు తీర్పు జరుగును......... గంబీరమైన మనోభావాలు గూర్చిన హెచ్చరిక, ప్రేమగా పోషంచబడ సదుపాయాలను నాశనం చేయడంలో స్పష్టంగా కనిపిస్తాయి [బ్యాటిల్ క్రీక్ సానిటరియం, ప్రపంచంలోనే అతి పెద్దది మరియు ప్రఖ్యాతి గాంచిన అడ్వెంటిస్ట్ సంస్థ, 1902 పిబ్రవరి 18న కాలిబుడిదైపోయినది. దాని తర్వత రివ్యూ హెరాల్డ్ పబ్లిషింగ్ అసోసియేషన్, 1902 డిసెంబరు 30 న అగ్ని ప్రమాదంతో కూడ గురైనది] మనము చెసే సేవకు ప్రతిపలము ఇలా అంటుంది, నీవు ఏస్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకముచేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదట క్రియను చేయుము” (ప్రకటన 2: 5)......... వెనక్కి జారిపోయిన భక్తిలో మిళితమైన సంఘము, పశ్చాత్తాపము మరియు మారుమనసు పొందక పోయినట్లైయితే ఆమె సొంతముగా విత్తుకున పంటనే బుజిస్తుంది, ఆమె చెడును నిరోదిస్తు మరియు మంచిని ఎంచుకు న్నప్పుడు, ఆమె వినయముతో దేవుణ్ణి వెదకుతున్నప్పుడు, క్రీస్తులోనికి పిలువబడిన ఉన్నతమైన పిలుపుకు చేరుకుంటుంది, శాశ్వతమైన సత్యము యొక్క వేదిక మీద నిలబడి మరియు విశ్వాసం ద్వారా ఆమె కోసం సిద్ధము చేసిన ప్రయత్నాలు పట్టుకొని యున్నప్పుడు, ఆమె నయం అవుతుంది. ఆమె దేవుడిచ్చిన సరళత మరియు పవిత్రతలో ఆమె భూలోక సంబందమైన చిక్కులలో నుండు వేరుపడి, సత్యము ఆమెను స్వేచ్ఛగా చేసింది అని చూపిస్తుంది. అప్పుడు ఆమె సభ్యులు నిజానికి దేవుని ఎంపిక, చేసిన ప్రతినిధులుగా ఉంటారు- సంఘమునకు ఉపదేశములు 8: 247-251 (ఏప్రిల్ 21, 1903).LDETel 40.1

    ఇశ్రాయేలీయుల చరిత్ర మనకొక హెచ్చరిక.

    ఈ అంత్యదినాల్లో పూర్వికులైన ఇశ్రాయేలీయులైన దేవుని ప్రజలు మాదిరిగానే ప్రమాదాలకు గురౌతారు. దేవుడు ఇచ్చే హెచ్చరికలను స్వీకరించని వారు పూర్వికులైన ఇశ్రాయేలీయులాగే చేసినట్లుగా అదే అపాయంలో పడిపోతారు మరియు అవిశ్వాసం ద్వారా విశ్రాంతిలోనికి ప్రవేశించుటకు అవకాశము కొల్పోయారు, పూర్వికులైన ఇశ్రాయేలీయులు వారికి శుద్ధహృదయాలులేకయు మరియు సమర్పణలేని కోరికలు ఉండుట వలన ఈ కష్టాలను ఎదుర్కొన్నారు. ఇక చివరికి ఒక దేశంగా ఉండుటకు వారు తిరస్కారించుటకు కారణమైనది వారి యొక్క స్వంత అవిశ్వాసం, స్వీయ నమ్మకం, అసహనం, మనస్సునందు అందత్వం, మరియు కటిన హృదయాలు. వారి చరిత్రను బట్టి మనకు ముందు ఎన్నో ప్రమాదాల సంకేతాలు ఉన్నాయి. సహోదరులారా, జీవముగల దేవుని విడిచి పోవునట్టి విశ్వాసములేని దుష్ట హృదయము మీలో ఎవనియందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి........... మనము క్రీస్తుతో పాలు పంచుకొనుచున్నాము గనుక మన విశ్వాసము ఆరంభము నుండి అంతము వరకు గట్టిగా పట్టుకోని నిలిచియుండునట్లు, స్థిరముగా ఉండుడి, (హెబ్రీయులు 3:12, 14) .లెటర్ 30, 1895.LDETel 40.2

    అసంపూర్ణమనైన సంఘ యుద్ధము సంఘ యుద్ధము

    సంఘ విజయం కాదు, మరియు భూమి పరలోకము కాదు. అపరాదులు మరియు అసంపూర్ణులైన స్త్రీ పురుషులతో వున్న సంఘము, క్రీస్తు యొక్క పాఠశాలలో క్రమశిక్షణ పొందుచు, ఈ జీవితం కొరకు మరియు రాబోయె నిత్య జీవము కొరకు విద్యాఅభ్యాము పొందుచున్నది. టైమ్స్ ఆఫ్ సైన్స్, జనవరి 4 , 1883. సభ్యులు కొందరు సంఘములో ప్రవేశించినప్పుడు తమ అంచనాలు తగ్గట్టుగా నెరవేరినవి ఆలోచన చేస్తారు, మరియు పరిపూర్ణముగాను మరియు యదార్ధముగాను ఉన్న వారితోనే సహవాసము పెంచుకుంటారు, వారి విశ్వాసములో భక్తిని కనపరిచె దరు, మరియు సంఘ సభ్యులలో ఎవరైన పొరపాటున తప్పు చేసినవారు, వారికంఠ కూడదనే ఈ ప్రపంచమును విడిచివచ్చామంటారు. కానీ చెడు ఇక్కడ కూడా ఉంది ఎక్కడ నుండి గురుగులు వచ్చినవి,? వారు ఉపమానంలో శిష్యులు అడిగిన విదముగా వారు అడిగెదరు,అయితే మనము నిరశపడిపోనవసరము లేదు. సంఘము సంపూర్ణ ముగా వున్నదని ప్రభువు అదికారముగా చెప్పలేదు, సంఘ యుద్ధము, సంఘ విజయము పొందినంతగా పరిపూర్ణముగా చేయకపోయిన యెడల మన ఆశక్తి విజయ వంతం కాదు.- (టెస్టమోనిస్ టూ మెనిస్ట్రీస్ అండ్ గాస్పల్ వర్కర్స్ 47 (1893).LDETel 41.1

    సంఘ విజయోత్సవము విశ్వాసముగాను మరియ క్రీస్తువలే ఉంటుంది

    పని త్వరలో మూసివేయబడుతుంది, సంఘ సభ్యులు విశ్వాస యుద్ధ వీరులుగా నిరూపించుకుంటేనే వారు జయుంచే సంఘమౌతుంది, ఎవాంజలిజం, 707 (1892). దేవుని ప్రేమ నిండిన దైవిక సందేశంతో కనపరిచే జీవితమే, క్రీస్తు జీవితం, ఈ ప్రేమను ఇతరులకు విస్తృతంగా పెంచాలని ఆయన ఎంతగానో ఆశించుచున్నాడు. దయ అతని ముఖములోనే ప్రకాశింస్తుంది, మరియు అతని స్వబావములో కృప, వినయం, సత్యము, మరియు ప్రేమ ద్వారా వర్ణించబడింది. ఒకవేళ సంఘ విజయములో చేరిన టైయితే, ప్రతిసభ్యుడు సంఘ యుద్ధమునకు కావలసిన లక్షణాలు ఉంటాయి. - పండమెంటల్స్ అఫ్ క్రిస్టియన్ ఎడ్యుకేషన్, 179 (1891) LDETel 41.2