Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
అంత్యకాల సంఘటనలు - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    7 అధ్యాయము - దేశములో జీవించుట

    దైవిక ఆదర్శం

    దేవుడు సృష్టి అంతటిని సౌందర్య పరిపూర్ణతలో చేసినప్పటికిని, ఆదాము మరియు హవ్వను సంతోషం కలిగించటానికి దేవుడు సమస్తము వారి కొరకు సృష్టించినాడు ఇక చుడడానికి కొదువంటు ఏమిలేదు, అయునను వారి కొరకు ప్రత్యేకముగా ఆయన ఉన్నతమైన ప్రేమను కనపర్చేందుకు ఏదేను వనములో వృక్షములను నాటేను, ఆ తోటను అందముగా అలంకరించే పనిలో సంతోషముతో వారు నిమగ్నమై ఉండుటకు కొంత సమయము కేటయుంచుకున్నారు మరియు దేవదూతల సందర్శనలను స్వీకరించడం, వారి ఆదేశములను వినడం మరియు సంతోషంగా ద్యానం చేయటం వంటి వాటిలో కొంత భాగాన్ని ఆక్రమించుకున్నారు. వారి శ్రమ అలసట కానే కాదు, కానీ ఆహ్లాదకరమైనది మరియు ఉత్తేజపరిచేది, ఈ మంచి తోటలయిన ఇల్లు, వారికి ప్రత్యేక నివాసం. - స్పిరుచల్ గిఫ్ట్ 3:34 (1864).LDETel 65.1

    అనంతమైన ప్రేమగల తండ్రి తన కుమారుని కోసం ఎన్నుకున్న పరిస్థితులు ఎటువంటివి చూడండి? గలిలయ కొండలలో ఒంటరి ఇల్లు; నీతి యదార్ధతలో కొనసాగుచున్న కుటుంభము, గౌరవనీయమైన సొంత కృషీ; సరళమైన జీవితం; కష్టాలు మరియు సమస్యలతో ప్రతి దినము పోరాటం; ఆత్మ త్యాగము, ఆర్థిక వ్యవస్థ, మరియు సహనము, ఆనందభరితమైన సేవ, ప్రశాంమైన ప్రాత:కాలము లేక సందెచీకటిగా వుండే పచ్చిక లోయలో కొంత సమయము అతని తల్లి యొద్ద లేఖనాలను అద్యయనం చేయుట; ప్రకృతిని గూర్చిన పవిత్ర పరిచర్య, సృష్టి మరియు భవిష్యత్తు జాగ్రత్త గూర్చి అద్యయనం; మరియు దేవునితో ఆత్మ సహవాసము; ఇది యేసు యొక్క ప్రారంభ జీవితపు పరిస్థితులు మరియు అవకాశాలు. - హీలింగ్ మినిస్ట్రీ, 365, 366 (1905). +LDETel 65.2

    నగరాల నుండి దూరముగా

    వీలైనంత త్వరగా నగరాల నుండి బయట పడండి మరియు మీ పిల్లలు పుష్పాలను చూడటం మరియ వాటి నుండి సరళత మరియు స్వచ్చత పాఠాలు నేర్చుకోగలిగే ఒక తోటను కలిగి ఉన్న ఒక చిన్న స్థలాన్ని కొనుగోలు చేయండి.. సెలెక్ట్డ్ మెసెజన్స్ 2: 356 (1903).LDETel 65.3

    ఈ కాలములకు నా సందేశము, నగరాల నుండి దూరముగా వుండండి, పెద్ద నగరాల నుండి మైళ్ళుకోలది. దూరమున గుర్తించి వెళ్లిపోవాలని ప్రజలకు పిలుపు ఇవ్వబడినది అని రూడిగా చెప్పవలేను, శాన్ ఫ్రాన్సిస్కోకు నేడు జరిగిన దానిని గూర్చి విచారించడి మీ జ్ఞానముగల మనసులతో మీకు మీరు మాట్లాడుకొండి, మనము నగరాల నుండి బయటపడవలసిన అవసరాన్ని చూపుతుందికదా? .... యెహోవా తన ప్రజలను పట్టణాల నుండి దూరంగా ఉండమని పిలుస్తాడు, అటువంటి గడియలో మీరు ఆలోచించకపోయిన యెడల ఈ పట్టణాల మీదకి అగ్ని మరియు గందకం పరలోకము నుండి కురుపించును. వారి పాపాలకు అనుగుణంగా వారికి వచ్చిన పరీక్ష, ఒక నగరం ధ్వంసం అయినప్పుడు, మన ప్రజలు ఈ విషయాన్ని తేలికగా తీసుకొనకూడదు, ఇది అనుకూలమైన అవకాశం కల్పించుచున్నది అని అనుకొని, విధ్వంసమైపోయిన అదే నగరంలో తాము గృహాలు నిర్మించుకొనుచున్నారు........ ఈ విషయాల యొక్క భావములను అర్ధం చేసుకునేవారందరు, ప్రకటన పదకొండవ అధ్యాయం చదవండి. ప్రతి వచనమును చదవండి, పట్టణాలలో ఇంకా జరగబోయే విషయాలుగూర్చి తెలుసుకోండి. అదే పుస్తకములో పద్దెనిమిదవ అధ్యాయంలో చిత్రీకరించిన సన్నివేశాలను కూడా చదవండి. -ఎంన్ ఆర్ 1518 (మే 10, 1906). .LDETel 65.4

    చిన్న స్థలము మరియు సౌకర్యవంతమైన ఇల్లు కలిగివున్న తల్లితండ్రులు వారే నిజమైన రాజులు మరియు రాణులు.-ది అడ్వెంటిస్ట్ హోమ్, 141 (1894).LDETel 66.1

    నగరాలు వెలుపల నుండి పనిచేయవలెను

    దేవుని ఆజ్ఞను గైకొనుచున్న ప్రజలుగా మనము పట్టణాలను విడిచి వెళ్లాలి. హానోకు చేసిన విదాముగా, మనము నగరాల్లో పని చేయాల్సివుంది, కాని వాటి సంప్రాదాయలలో నివసించకూడదు. ఎవాంజలిజం, 77,78 (1899).LDETel 66.2

    నగరాలు వెలపల నుండి మనము నగరములు కొరకు పని చేయాలి. “పట్టణాలను హెచ్చరింపకూడదా? హెచ్చరించాలి, దేవుని ప్రజలు అందులో జీవిస్తున్నారని కాదు కాని ప్రజలను దర్శించి,భూమిమీదకి రానైయున్న విపత్తును గూర్చి చెప్పి హెచ్చరించ వలేను,దేవుని యొక్క దూత ఇలా చెప్పాడు. సెలెక్ట్డ్ మెసెజన్స్. 2:358 (1902). నగరాల్లో మన పనికి కేంద్రంగా ఉండకూడదని కొన్ని సంవత్సరాల క్రిందట ఈ ప్రత్యేకమైన దర్శనము నాకు ఇవ్వబడినది. ఈ పట్టణాలు సంక్షోభం మరియు గందరగోళ ముతో నిండియున్నది, కార్మిక సంఘాలు మరియు సమ్మెలు తీసుకువచ్చిన పరిస్థితులు మన పనికి గొప్ప ఆటంకం అని నిరూపిస్తాయి.సంఘమునకు ఉపదేశములు 7:84 (1902).LDETel 66.3

    ఒక దేశంలో అన్యాయం సంభవించినప్పుడు, తప్పకుండ హెచ్చరికను గూర్చిన వార్తను లక్ష్యము చేయాలి, ఏ విదముగా లోతు సొదొమలో దేవుని హెచ్చరిక ద్వని వినియున్నాడో అరీతిగానే, హెచ్చరిక మరియు ఉపదేశమును గూర్చిన ద్వని వినబడును, అయినప్పటికీ, లోతు అనేక దుష్టత్వముల నుండి తన కుటుంబాన్ని కాపాడుకొ లేకపోయాడు అయిన ఈ దుష్ట కలుషితమైన పట్టణంలో తన ఇంటిని స్థాపించు కొనలేదు. లోతు, ఆయన కుటుంబమంతా సొదొమలో వారు ఏమి చేసియున్నారో వారు నగరం నుండి కొంత దూరంలో నివసించినప్పటికీ అదే చేసి ఉండేవారు. - ఎవాంజలిజం, 78 (1903).LDETel 66.4

    ప్రస్తుతం కొందరు చికాగోలో కష్ట పడుటకు బద్దులైయున్నారు, కానీ వారు ఈ నగరములో పనిని చేయుటలో గ్రామీణ జిల్లాల్లో పని కేంద్రాలుగా సిద్ధం చేయచున్నారు. యెహోవా తన ప్రజలను తనకు విదేయులై బద్రముగా వుండుటకు వారి కొరకు పని చేసుకొనే కేంద్రాలు చవకైన స్థలంలోవుండాలని చూస్తూవున్నాడు. ఎప్పటికప్పుడు పెద్ద స్థలాలు వారి విచారణలోనికి వుస్తువుండేవి అయితే అవి ఆశ్చర్యకరంగా తక్కువ ధరకే కొనుగోలు చేయగలిగియున్నారు. -ఎవంజిలీజం 402 (1906).LDETel 67.1

    సహజ వాతావరణంలో ధనిక దీవెనలు

    పట్టణాల నుండి బయటకు వెల్లండి” అని మేము మళ్ళీ మళ్ళీ చెపుతున్నాము, సహజ వాతావరణములో విస్తారమైన అశీర్వాదములువున్నాయి, మీరు కొండలు మరియు పర్వతాలలోకి వెళ్లుటకు గొప్పలేమికి కారణమౌతుందని నీవు అనుకోవద్దు, అయితే మీరు దేవునితో ఒంటరిగా గడుపుచు, అతని సంకల్పం మరియు మార్గము నేర్చుకోవడం కోసం అన్వేషించవలెను......... క్రీస్తు తలుపు నోద్దనే ఉన్నాడు మన ప్రజలను ఆధ్యాత్మికత కోసం వెతకడం జీవిత కృషి అయివుండాలి, అందుకే నేను మన ప్రజలకు చెపుతున్నాను, “మీరు నగరాలను విడిచిపెట్టి, గ్రామీణ ప్రాంతమునకు వెళ్ళటకు తెలివి తక్కవ పని అని మీరు భావించకూడదు, ఎవరైతే ఆ ప్రాంతవనరులు సోంతము చేసుకుంటారో వారి కొరకు సంమృద్ధిగల ఆశీర్వాదములు వేచియున్నవి, దేవుని సృష్టికార్యము, ప్రకృతి అందాల దృశ్యాలను తిలకించుటం, దేవుని చేతి పనిని గూర్చి అద్యయనం చేయుటం ద్వారా నీలో నిష్కళంకమైన మనస్సుకలిగి అదే స్వభావములోనికి నీవు మార్చబడతావు. ” సెలెక్ట్డ్ మెసెజన్స్ 2 : 355, 356 (1908).LDETel 67.2

    దేశంలో ప్రవర్తన అభివృద్ధి సులభం

    తల్లిదండ్రులు తమ కుటుంబాలను పట్టణాలకు తరలిస్తారు. ఎందుకంటే వారు గ్రామాలు కంటే జీవనోపాధిని సులువుగా సంపాదించవచ్చునుకుంటున్నారు. పిల్లలు, పాఠశాలకు వెళ్లని రోజు ఇంటి దగ్గర వుంటే వీధి పాఠాలు నేర్చుకుంటారు, దుష్ట సహవాసుల నుండి వారు తప్పుడు మార్గాలు మరియు పోకిరచేష్టలు లాంటి చెడు అలవాట్లను నేర్చుకుంటారు. సంఘమునకు ఉపదేశములు 5: 232 (1882) 326 (1894). పిల్లలను నగరంలో ఉన్న పాఠశాలలకు పంపించినప్పుడు, ప్రతీ దశలోవున్న శోధనలు వారిని ఆకర్షించి, నైతికంగా భష్టునిగా చేయుటకు వేచియున్నవి. అయితే ప్రవర్తన నిర్మాణానికి సంబందించిన పని తల్లిదండ్రులు మరియు పిల్లలకు పదింతలు కష్టతరమవుతుంది. ఫండమెంటల్ క్రిస్టియను ఎడ్యుకేషన్ 326 (1894).LDETel 67.3

    నగరాలు శోధనలతో నిండి ఉన్నాయి. ఈ కలుషితమైన ప్రాంగణం నుండి సాధ్యమై నంతవరకు మన యువతను కాపాడుకోవడనికి మనము ప్రణాళికలు రచించాలి... అడ్వెంటిస్ట్ హోమ్, 136 (1902).LDETel 67.4

    మన ప్రజలు వారి కుటుంబాన్ని పట్టణాల నుండి మరింత ఏకాంత ప్రాంతాలకు తీసుకువెళ్ళడానికి సమయము ఇదే. యౌవ్వనంలోని అనేక మంది, మరియు వయస్సు ముదిరిన పెద్దవాళ్ళు చాలామంది శత్రువైన సాతను చేతిలో చిక్కుకొని వారిని చెడు మార్గములోనికి తీసుకొని పోవడం కాయం. సంఘమునకు ఉపదేశములు 8: 101 (1904).LDETel 68.1

    నగరంలో నివసిస్తున్న వంద మందిలో ఒక్క కుటుంభముకూడ, శారీరక, మానసిక, లేదా ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుటలేదు.. విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ, ఆనందం, ఏకాంతమైన స్థలాలలో లబించును, ఎక్కడ పొలాలు, కొండలు మరియు చెట్లు ఉన్నాయి అక్కడ బాగా అభివృద్ధి పొందవచ్చు, నగరం యొక్క దృశ్యాలు మరియు శబ్దాల నుండి మరియు, రకరకాల ధ్వని నుండి మరియు, వీధి కార్లు మోత మరియు గందరగోళం చెడు సహవాసం నుండి మీ పిల్లలను దూరంగా వుంచండి. అప్పుడు వారి మనసు మరింత ఆరోగ్యకరమైనదిగా వుంటాయి. ఆ విధముగా వారు దేవుని వాక్యపు సత్యముతో నింప బడినప్పుడు వారి హృదయ సమీపమునకు అట్టి గృహమును యొద్దకు సులభంగా తీసుకొనిరావటం వీలైతుంది. ది అడ్వెంటిస్ట్ హోమ్, 137 (1905).LDETel 68.2

    పటణ వాతావరంలో మంచి శారీరక ఆరోగ్యము

    నిరంతరం సంక్షోభం మరియు గందరగోళం ఉన్న నగరాల్లో ప్రజలు స్థిరముగా ఉండాలని దేవుని సంకల్పం కాదు. వారి పిల్లలు తప్పించబడాలి, ఎందుకంటే మొత్తం వ్యవస్థ ఆతురుతలో మరియు తొందరపాటులో మరియు శబ్దాలతో నిరంతరం నిరుత్సాహ పరుస్తుంది. సెలెక్ట్డ్ మెసెజన్స్ 2: 357 (1902).LDETel 68.3

    చాల మంది నగారలలో నివాసముంటున్నా వారు కాని వారికి కాలు మోపడానికి పచ్చ గడ్డి వున్న చిన్న స్థలము లేదే, సంవత్సరలు వెంబడి సంవత్సరం మురికి వాడులు మరియు ఇరుకైన సందులు, ఇటుక గోడలతోను మరియు కాలి బాటలతోను మరియు వాతవరణము కలుషుతమై ధూళి మరియు పొగలతో కప్పబడుయున్న ప్రాంతలలో జీవిస్తున్నారు, అయితే పచ్చని పొలాలు, అడవులను, కొండలు, నదులను, నిర్మలమైన ఆకాశము మరియు శుద్ధిగల వాతవరణము, స్వచ్ఛమైన గాలి చుట్టూ ఉన్న వ్యవసాయ ప్రాంగణము, తీసుకొని వెళ్ళాలి ఇది దాదాపుగా పరలోకము లాగానే కనిపించును. -ది మినిస్ట్రీ అప్ హీలింగ్, 191, 192 (1905).LDETel 68.4

    నగరాల్లో భౌతిక పరిసరాలు తరచుగా ఆరోగ్యానికి ప్రమాదకరమైనవి. వ్యాదులు సోకులకు ఎక్కవ అవకాశావున్నయి, విస్తారముగా వ్యాపించిన కల్మషమైన గాలి, అపరిశుభ్రమైన నీరు, మలినాలతో కూడిన ఆహారం, రద్దీగా ఉడడం, చీకటియిల్లు, అనా రోగ్యకరమైన నివాస స్థలాలు,అనేక దుష్కార్యములు ఎదుర్కోవటము. ప్రజలు నగరాల్లో రద్దీగా కిక్కిరిసుకొ నివశించటం, కలుగూరగంపగా ఒకటి మీద ఒకటి మిద్దెయిల్లులో వుండటం దేవుని యొక్క ఉద్దేశము కాదు. - ది మినిస్ట్రీ అఫ్ హీలింగ్ 365 (1905).LDETel 68.5

    మీ స్వంత నిబంధనలను పెంచుకోండి.

    ప్రభువు తన ప్రజలను గ్రామీణ ప్రాంతమునకు తరలి వెళ్లాలని కోరుకుంటాడు, వారక్కడా భూమి మీద స్థిరపడి మరియు వారి స్వంత పంటలు మరియు కూరగాయలు పండించుకోవడానికి మరియు ప్రకృతిలో దేవుడు చేసిన కార్యములను వారి పిల్లలు ప్రత్యక్ష అవగాహనము చేసుకొనుటకు, మీ కుటుంబాలను పట్టణాల నుండి దూరంగా తీసుకోని వెళ్లండి ఇదే నా సందేశము. -సెలెక్ట్డ్ మెసెజన్స్-2: 357, 358 (1902).LDETel 69.1

    ప్రభువు మళ్ళీ, మళ్ళీ అదేశించెను మన ప్రజలు తమ సొంత పట్టాణాలు విడిచి దూరముగా వారి కుటుంబాలు తీసుకుని పల్లెటూరుకు వెళ్లి అక్కడ వారి సొంత వ్యవస్థను స్థాపించుకొనాలి, ఎందుకంటే భవిష్యత్తులో కొనుగోలు మరియు అమ్మకం యొక్క సమస్య చాలా తీవ్రమైనదిగా ఉంటుంది. ఇప్పుడే మళ్లీ మనకు ఇవ్వబడిన ఆదేశాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి: నగారాలలో నిరంతరం రద్దీగ కిక్కరిసుకుని వున్న యిల్లు విడిచి మరియు శత్రువుల జోక్యంచేసుకోకుండా స్వేచగా వుండుటకు నగారముల నుండి బయటపడి గ్రామీణ ప్రాంతమునకు వెళ్లుటకు త్వరపడవలెను. సెలెక్ట్డ్ మెసెజన్స్ 2: 141 (1904).LDETel 69.2

    పెద్ద నగరాల బయట నుండి కేవలం సంస్థలను గుర్తించు

    న్యాయమైన తీర్పు ఇవ్వగల వ్యక్తులు ఎన్ను కొందాము, అయితే వారి ఉద్దేశములు హెచ్చించబడేటట్టు వారు ప్రకటన చేసుకొనకూడదు, కాని వారు గ్రామీణ ప్రాంతాలలో ఇటువంటి ఆస్టులను వారు వెతకాలి, సంబందము సులువుగా వుండుటకు, చిన్న శిక్షణా పాఠశాలలోవున్న పనివారులకు అనుగుణంగా వుండుటకు, అనారోగ్యముగా వున్న వారికి చికిత్స కోసం సదుపాయాలు కల్పించడము కొరకు, సత్యము ఎరుగకా వున్న అలసిన ఆత్మలకు, ఉపయోగపడే స్థలాల కొరకై వారు ప్రయత్నంచాలి. ఎక్కడైతే తగిన భవనాలు భద్రపరచబడతాయో అటువంటి స్థలాలు పెద్ద నగరాల వెలుపల చూడాలి, అయితే అది యజమానుల నుండి బహుమతిగానైనను లేదా మన ప్రజల బహుమతులు ద్వారా నైన లేదా ఒక సరసమైన ధర వద్ద కొనుగోలు చేయబడాలి. ఎప్పుడు శబ్దాలతో నిండియున్న నగరాల్లో భవనాలను నిర్మించనవసరము లేదు.ఎవాంజలిజం, 77 (1909).LDETel 69.3

    కోరన్బాంగ్, న్యూ సౌత్ వేల్స్

    మన ఆస్ట్రేలియన్ బైబిలు పాఠశాల ఎక్కడు స్థాపించాలి?........ పాఠశాలలు నగరాల్లో లేదా కొన్ని మైళ్ల దూరంలో ఉండటం వలన నిష్పలమౌతుంది, ఎందుకనగా సెలవులుదినాలు వచ్చినప్పుడు వారికి ఉన్న అనుసంధానమైన అభ్యాసాలు లాంటివి, గుర్రం పందాలు, జూదం, మరియు బహుమతులు సమర్పచుటం విషయములో విద్యార్థులు పొందిన పూర్వ విద్య యొక్క ప్రభావాన్ని ప్రతిఘటించడానికి చాలా కష్టంగాLDETel 69.4

    ఉంటుంది..... కాబట్టి మన పాఠశాలలు, నగరాలు బయట, మరియు దూరంగా స్థాపించడం అవసరమైయున్నదని మనము కనుగొన్నాము, మరియు వాటితో ఏ సంబంధము పెట్టుకోకుండ దూరముగా ఉన్నటైతే వారికి మంచి చేసిన వారమౌతాము కాబట్టి వారిని నైతిక అందకారము మద్య వెలుగు ప్రకాశింపనీయుడి. ఫండమెంటల్స్ అఫ్ క్రిస్టియన్ ఎడ్యుకేషన్, 310,313 (1894).LDETel 70.1

    ఈ స్థలం గురించి ఎన్నో విషయాలు నన్ను బాగా ఆకట్టుకున్నాయి, అయితే మనము దూరముగా అవతలికి వెళ్లపొవలసినా గొప్ప ప్రయాణాం గూర్చిన ఆలోచన తప్ప అంతా అనుకూలముగానే ఉంది. ఈ మహా నగరాలలో పీనుగు వంటి మరణాలు నైతిక అందకారముతో కప్పివేస్తుంది, అందుచేత మనకు కలిగియున్న సత్యమైన వెలుగును ప్రకాశింప చేసే అవకాశము లేక పోతున్నది. ఇది ఒక్కటే నా మనస్సుకు అభ్యంతరకరముగా కనిపిస్తుంది, కనుక మన పెద్ద నగరాల్లో మన పాఠశాలను స్థాపించడం అనేది అంత మంచి సలహా కాదు. .-మాన్యుస్క్రిప్ట్ రిలీజ్ 8: 137 (1894).పాఠశాలకు అనువైన స్థలము ఇదేనని నేను ఎంతగానోన మ్మియున్నాను.మాన్యుస్క్రిప్ట్ రిలీజ్ 8: 360 (1894).LDETel 70.2

    హంట్స్విల్లే, అలబామ

    [గ్రేస్విల్లేలో ఉన్న ఆస్తి టెన్నిస్సీ కి 50 కిలోమీటర్ల దూరంలో చట్టనూగా అనే ఉత్తర బాగమున వున్నది, అ స్థలము ఒక గ్రామమునకు సమీపంలో తొమ్మిది ఎకరాల భూమి ఉంది, అక్కడ 200 మందికి పైగా ప్రజలు జీవిస్తున్నారు, గ్రేస్విల్లేలో పాఠశాల పని బాద్యతలు నిర్వహిస్తున్నారు. ఈ పాఠశాల 1916లో కొలిగిడేల్ స్థలమునకు తరలించ బడినది, ప్రస్తుత అక్కడనే వుంది.) మరియు ఈ సంస్థల ద్వారా ఎలాంటి పరిశ్రమలను స్థాపించబడుటకు మరియు ఏమి చేయాలన్నది (స్విల్లే చూచుకోవాలి, కాబట్టి మన ప్రజలు నగరాలు వదిలి, పెద్దగా విన్యాసము, విలాసవంతమైన విధానములో కాక అణుకువగల గృహాలను నిర్మంచుకోవటానికిని మరియు ఉద్యోగం కూడా సంపాదించు కోవడానికి హండ్స్యిల్లే పాఠశాల కోసం వ్యవసాయం భూమిని కొనుగోలు చేయబడుటం దేవుని యొక్క ఏర్పాటైయున్నది. ఇది మంచి ప్రాంతములో వుంది. దీనికి దగ్గర పెద్ద నర్సరీలు అంటే నారువేసి అమ్మేతోటలు ఉన్నాయి మరియు ఈ నర్సరీలలో హండ్స్యల్లే పాఠశాల విద్యార్థులు వేసవికాలములో పని చేసుకొని పీజులు సంపాదించుకొనే అవకాశము కూడ ఉంది. -ఎస్పిటి-బి (12) 11 (1904).LDETel 70.3

    హంట్స్యిల్లే పాఠశాల వ్యవసాయమునకు చాలా అందమైన ప్రదేశం, మరియు దాని మూడు వందల ఎకరాల భూమి, పారిశ్రామిక శిక్షణకు మరియు పంటలు పండించుటకు ఉపయోగించాలి .-ఎస్పిటి-బి (12x) 13 (1904).LDETel 70.4

    ఇటీవలే ఒక ప్రశ్న నన్ను అడిగారు, “చిన్న స్థలాన్ని కొనుగోలు చేయయుటకు ఈ హంట్స్యిల్లేలోని పాఠశాల భూములను అమ్మివేసినటైయితే మంచిగా వుంటాదికదా? అప్పుడు నేను ఈ పోలము అమ్మ కూడదని నాకు అదేశము ఇవ్వబడినది ప్రస్తుతము వున్న పరిస్థితిలో పాఠశాల అందముగా తీర్చిదిద్దుటకు ఇప్పుడు అన్ని విధాలుగా ప్రయోజనాలు కలిగి ఉన్నాయని అన్నాను. - స్పాల్డింగ్ అండ్ మగన్ కలెక్షన్, 359 (1904)...LDETel 71.1

    బెర్రిస్ స్ప్రింగ్స్, మిచిగాన్

    మిచిగాన్ యొక్క నైరుతీ ప్రాంతంలోని బెర్రియన్ స్పింగ్స్లో పాఠశాలను గురించి ఆలోచన చేస్తున్నారని నేను విన్నాను. నేను ఈ స్థలం యొక్క వర్ణన వినగానే చాలా సంతోషించాను........ బెర్రిన్ స్పింగ్స్ వంటి ప్రదేశంలో ఒక (ఐ టి ఐ) పాఠశాల, ఏర్పాటు చేయుటకు అనువైన స్థిలముగా ఉంది మరియు ఈ పనిని ముందుకు తీసుకెళ్లేందుకు ఎవరూ అడ్డుకొనుటకు జోక్యము చేసుకొనరని నేను ఆశిస్తున్నాను.. మాన్యుస్క్రిప్ట్ రిలీజ్ 4: 407 (జూలై 12, 1901). LDETel 71.2

    పాఠశాల కోసం ఒక స్థలం ఎంపికచేయుటములో దేవుని యొక్క ప్రసస్తమైన హస్తము మన ప్రజలకు తోడుగా వుంది. ఈ పాఠశాలకు స్థలం ఎక్కడ ఏర్పాటు చేయలో నాకు ఇచ్చిన ప్రతి విద్యాలకు అనుగుణంగా ఉంది. ఇది నగరాల నుండి దూరంగా ఉంది, మరియు వ్యవసాయ ప్రయోజనాల కోసం భూమిని సమృద్ధిగా కలిగి ఉంది, మరియు గృహలు ఒక దాని ప్రక్కన మరో కటి కట్టనవసరము లేదు. విద్యార్థులను విద్యాభ్యాసము తో పాటు వ్యవసాయము నేర్చకొనుటకు స్థలం పుష్కలంగా ఉంది..-ది రివ్యూ అండ్ హెరాల్డ్, జనవరి 28, 1902.LDETel 71.3

    బ్యాటిల్ క్రీక్ నుండి కళాశాలను తరలించి, బెర్రియన్ స్పింగ్స్, బ్రెగ్లెన్ మగన్ మరియు సదర్లాండ్లు, స్థాపించుటకు దేవుడు ఇచ్చిన ఆదేశములకు అనుగుణంగా వ్యవహరించారు. వారు అనేక ఇబ్బందులలో చాల కష్టపడి పనిచేశారు.......అయితే దేవుడు వారితో ఉన్నాడు. ఆయన వారి ప్రయత్నాలను ఆమోదించాడు. మాన్యుస్కిప్ట్ రిలీజ్ 4: 260, 261(1904)LDETel 71.4

    స్టోన్స్టమ్, మసాచుసెట్స్

    దేవుని యొక్క అమోగమైన కాపుదలలో ఆయన సేవకులకు అభివృద్ధి పదములో సాగుటకు న్యూ ఇంగ్లాండ్ లో మంచి మార్గము తెరిచాడు,---ఆప్రాంతములో చాలా ప్రత్యేక పని చేయవలసియుంది. అక్కడ వున్న సోదరులు ఆరోగ్య కేంద్రము సౌత్ లాంకాస్టర్ నుంచి బోష్టస్కు దగ్గరలోనున్న స్థలము మెట్రోస్సకు మార్చాలని వారు అన్ని ఏర్పాటు చేసినారు, ఇంకా బిజీగా ఉన్న నగరం నుండి తరలి వెళ్లడం మంచిది, ఎందువలన అంటే రోగుల ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి అత్యంత అనుకూలమైన పరిస్థితులను అక్కడLDETel 71.5

    ఉంటాయి. న్యూ ఇంగ్లాండ్ ఆరోగ్య కేంద్రము బస్తన్ బయోటోన్ నగరానికి చాలా సౌకర్యవంతంగా ప్రదేశానికి బదిలీ చేయుటము దేవుని యొక్క ముందు జగ్రాత్త అయున్నది, దేవుడు మనకు మార్గం సిద్ధం చేయుటకు ఆయన దక్షిణ హస్తము తోడుగానుండెను, ఎవరైన వెనక్కి వుండిపోయినను, ముందుకు వెళ్లేవారి యొక్క విజ్ఞానమును ప్రశ్నించడం, లేదా ప్రోత్సాహించుకుండా అడ్డగించటం మరియు సహాయం చేయుటకు నిరాకరించటం చేసే వారిని దేవుడు విసర్జించును. సౌత్ లాంకాస్టర్ నుండు మెట్రోస్కు న్యూ ఇంగ్లాండ్ ఆరోగ్య కేంద్రమ బదిలి చేయుటం అది దేవుని యొక్క ఆదేశము ప్రకారము నేను దానిని అమలుపరిచినాను. ఎస్పిటి-బి (13)3 (1902).LDETel 72.1

    టాకోమా పార్క్, వాషింగ్టన్, డి.సి

    ఆశించిన ప్రకారము మన పాఠశాల మరియు ఆరోగ్య కేంద్రమునకు సంబంధించిన స్థలమును సురక్షితముగా వుంచబడినది. అది ప్రభువు నాకు చూపించిన స్థలము యొక్క ఆకారము అలాగే పోలి ఉన్నది, ఇది దేని కొరకు ఉపయోగపడుటకు ఉద్దేశించబడిదో దానికి తగ్గట్టుగా సరిపోయినది. సంస్థ బాగ రద్దీగా కిక్కిరిసి వుంకుండా పాఠశాలకు మరియు ఆరోగ్య కేంద్రమునకు తగినంత గదులువున్నాయి. వాతావరణం పరిశుభ్రముగా వుంది మరియు మీరు కూడ స్వచ్ఛమైనది. ఒక అందమైన ప్రవాహం ఉత్తరం నుంచి దక్షిణానికి మన స్థలము నడము నుంచి ఒక సెలయేరు ప్రవహిస్తుంది, ఈ సెలయేరు బంగారం లేదా వెండి కంటే విలువైనదిగా ఉంది. అంతేకాదు చక్కని డ్రైనేజీలతో భవనం ఎతైన స్థలములో అద్భుతముగా కట్టబడియున్నవి. LDETel 72.2

    ఒక రోజు మేము టకోమా పార్క్ లో వివిద స్థలాలకు సుదీర్ఘ ప్రయణముచేసాము.. పట్టణములో వున్న ఎక్కువ భాగం సహజమైన అటవీ ప్రాంతము, ఇళ్ళు చిన్నవిగా ఉండవు మరియు రద్దీగా కూడ వండవు, కానీ గదులు విశాలముగాను మరియ సౌకర్యవంతమైనవిగా వున్నాయి, అక్కడ పొదుపుగల, రెండో పంట వృద్ధి చెందిన ఓక్స్, మాపుల్స్, దేవదారు వృక్షములు, మరియు ఇతర అందమైన చెట్లుతో నిండియున్నాయి. ఈ గృహ యజమానులు ఎక్కువగా వ్యాపారవేత్తలు, వాషింగ్టన్లోని ప్రభుత్వ కార్యా లయాలలో చాలా మంది ఉద్యోగస్తులు, వారు రోజు నగరానికి వెళ్ళి, సాయంత్రం వారి నిశ్శబ్ద గృహాలకు తిరిగివస్తారు.LDETel 72.3

    ముద్రణ కార్యాలయం కోసం ఒక మంచి స్థలము ఎంపిక చేయబడింది, పోస్టాఫీసుకి సులభంగ వెళ్లి రావటానికి దగ్గరలోనే వున్నది,, మరియు ఒక సమావేశ గృహం కోసం ఒక స్థలము కూడ కనుగొనబడింది. టకోమా పార్కు ప్రత్యేకంగా మన కోసం సిద్ధం చేయబడినట్లుగా ఉంది, అది మన సంస్థలు మరియు దాని పనివారులు ఆక్రమించు కోవడానికి వేచి ఉంది. -సైన్స్ ఆఫ్ ది టైమ్స్, జూన్ 15, 1904. ప్రభువు ఈ విషయం నాకు నిర్ణయాత్మకంగా తెలియజేసారు. బాటిల్ క్రీక్లో ముద్రాలయములో ప్రచురించ బడవలసిన పని ప్రస్తుతం వాషింగ్టన్ సమీపంలో నిర్వహించబడాలి. ఒకవేళ ప్రభువు చెప్పినప్పుడు, ఇక వెచివుండకుండ కదళాలి, వాషింగ్టన్ నుండి దూరంగా వెళ్లావలసినదే.-ది రివ్యూ అండ్ హెరాల్డ్, ఆగష్టు 11, 1903.LDETel 72.4

    మాడిసస్, టేనస్సీ

    దక్షిణాన ప్రాంతములో వారు పని చేయాలని ఆశక్తి కలిగియున్నారని వారు మాట లాడుకుంటుంటే నాకు అశ్చర్యము వేసింది, నాష్విల్లే నుండి కొంత దూరమున ఒక పాఠశాలను ఏర్పాటు చేయడం గురించి మాట్లాడినారు, నాకు ఇవ్వబడిన దర్శనము బట్టి చూస్తే వారు చేస్తున్నది సరైనదికాదు, అయిన నేను వారికి చేప్పాను, [ఇ.ఎ సదర్లాండ్ మరియు పి. టి. మగాన్] ఈ సహోదరులు పని చెయ్యవచ్చు, ఎందుకనగా నాష్విల్లెలో లబించే అనుభవం కారణంగా నాష్విల్లెకు సులభంగా వారు పనిని కొనసాగించవచ్చు. అయితే నాష్విల్లేలో పని జరగవలసిన రీతిలో జరగలేదు, అక్కడ ఉన్న పనివారు యొక్క సలహా తీసుకొని నాష్విల్లే దగ్గరలో పని చేయగలిగినట్లైయితే పాఠశాలలో పనిచేస్తున్న పని వారికి ఎంతో ఆశీర్వాదముగా వుంటుంది. స్కూల్ నిర్మించుటకు వారు స్థలముకోసం సోదరులు వెతుకుతున్నప్పుడు, నష్విల్లె నుండి తొమ్మిది మైళ్ళ దూరమున నాలుగు వందల ఎకరాల వ్యవసాయా భూమిని కనుగొన్నారు. వ్యవసాయ పరిమాణం, దాని పరిస్థితి, నష్విల్లె నుండి వచ్చిన దూరం మరియు అది కొనగలిగి మొత్తం, అది పాఠశాలకు చాలా అనువైన స్థలాముగా వుంటుంది, అయితే ఈ స్థలం కొనుగోలు చేయాలని మేము సూచించాము. చివరికి మొత్తం భూమి అవసరమౌతాదని నాకు తెలుసు.-ది రివ్యూ అండ్ హెరాల్డ్, ఆగష్టు 18, 1904LDETel 73.1

    కాలిఫోర్నియా కొండల ప్రాంతము

    ఓక్లాండ్ నుండి పసిఫిక్ ముద్రాలయము కూడా తరలించాలన్న సూచన కూడా ఇవ్వబడింది. సంవత్సరాలు గడిచిన కొలది నగరం బాగా పెరిగింది, మరియు ఇప్పుడు అది మరింత గ్రామీణ ప్రాంతాలలో ప్రచురణచేసే ముద్రాలయములు స్థాపించడం అవసర మైనది, అంతేకాదు ఇక్కడ ఉద్యోగులు, గృహాలకు భూమిని కూడ భద్రపరచవచ్చు. మన ప్రచురణ కార్యాలయాలతో సంబందము వున్న వారు రద్దీగా ఉన్న నగరాల్లో జీవించ కూడదు. వారు అవకాశం కలిగి ఉండాలి, వారు అధిక వేతనాలు లేకుండా జీవించగలిగే గృహాలను పొందవచ్చు. పండమెంటల్స్ ఆప్ క్రిస్టియన్ ఎడ్యుకేషన్.492 (1904).LDETel 73.2

    పట్టణము కొండల ప్రాంతములతో వుంటే అనేక ప్రయోజనాలు వున్నాయి. దాని చుట్టు అందమైన పలవృక్ష తోటలు వుంటాయి. వాతావరణం ఎంతో అనువుగా వుంటుంది కాబట్టి అక్కడ అన్ని రకాల పండ్లు మరియు కూరగాయలు పెంచవచ్చు. పట్టణం పెద్దది కాదు, అయితే అది విద్యుత్ దీపాలువున్నాయి, తపాల సౌకర్యము వున్నాది, మరియు అనేక ఇతర ప్రయోజనాలు సాదారణంగా నగరాల్లో మాత్రమే చూడ బడినవి ఇక్కడ వున్నవి-లెటర్ 141, 1904. మా ప్రచురణ కార్యాలయం ఓక్లాండ్ నుంచి కొండల ప్రాంతానికి ఎందుకు మార్చాలి అని కొందరు ఆలోచిస్తున్నారు. అయితే దేవుడు తన ప్రజలను నగరాలను విడిచిపెట్టమని పిలుపునిచ్చాడు. మన సంస్థలతో అనుసందానించబడిన యువత పెద్ద నగరాలలో శోదనలకు మరియు అవినీతికి పాల్పడుటకు ఎక్కవుగా కనిపిస్తుంది కాబట్టి వారు బహిర్గతం కాకూడదనే మా ఉద్దేశము కాబట్టి ప్రచురణ కార్యాలయము కొసం కొండల ప్రాంతము అనుకూలమైన ప్రదేశంగా ఉంది. కంట్రీ లివింగ్, 29 (1905).LDETel 73.3

    లోమా లిండా, కాలిఫోర్నియా

    సాన్ డిగ్మ నుంచి ఏడు మైళ్ళ దూరంలో మాకు పారడైజ్ వ్యాలీ వద్ద మంచి ఆరోగ్య కేంద్రము కలిగియున్నందుకు, లాస్ ఏంజిల్స్ నుండి ఎనిమిది మైళ్ళ దూరంలో గ్లెన్డేల్ వద్ద ఒక ఆశుపత్రి ఉన్నందుకు, లాస్ ఏంజిల్స్ తూర్పు బాగము నుండి 60 కిలోమీటర్ల దూరంలో లో మలిండా నందు ఎంతో విశాలమైన అందమైన స్థలము మరియు అది రెడ్లాండ్స్, రివర్సైడ్, మరియు సాన్ బెర్నార్డినోలకు సమీపమున వున్నందుకు మేము దేవునికి కృతజ్ఞతలు చెల్లింస్తున్నాము, నేను ఎన్నడు చూడనిది, లోమా లిండా ఆస్తిలో వున్న ఆరోగ్య కేంద్రం చాలా అందమైన స్థలములలో ఒకటి.. లోమాలిండా మెసేజస్, 141 (1905). లోమాలిండా స్థలము దేవుడు ముఖ్యంగా వైద్య సేవకె మిషనరీలకు శిక్షణ కోసం కేంద్రంగా నియమించబడిన ఒక స్థలం. లెటర్ 188,1907.LDETel 74.1

    ఇక్కడ ఒక పాఠశాల కోసం అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. వ్యవసాయ, పలవృక్షతోటలు పచ్చికతో వున్న భూమి, పెద్ద భవనాలు, పుష్కలమైన మైదానాలు. ఎంతో అందంగావున్నవి, ఇవి అన్ని గొప్ప ఆశీర్వాదం. -లోమా లిండా మెసెజన్స్ 310 (1907).LDETel 74.2

    లోమా లిండాలోవున్న ఈ స్థలం అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి, మరియు ఇక్కడ ఉన్న వారు నిజ వైద్య కార్యసాదకులుగా మారడానికి లాభదాయకమైన ప్రయోజనాలను పొందుతారు, వారు చుట్టూ ఉన్న వారికి వెలుగును ప్రకాశింపజేసేలా వుంటారు, మనము జ్ఞానము సంపాదించుకొనుటకు ప్రతిరోజూ దేవుణ్ణి కోరుకోవాలి. లెటర్ 374, 1907.LDETel 74.3

    ఇక్కడ పాఠశాలకు మరియు ఆరోగ్య కేంద్రమునకు మాకు ఆదర్శ ప్రయోజనాలు ఉన్నాయి. ఇక్కడ విద్యార్థులకు మరియు రోగులకు గొప్ప ప్రయోజనాలు ఉన్నాయి. ఇక్కడ ప్రవక్తల ప్రాచీన పాఠశాలలు సూత్రాలపై నిర్వహించమని నాకు ఆదేశము ఇవ్వబడియున్నది..... వైద్యులు వారి విద్యను ఇక్కడ పొందుతారు. -మెడికల్ 75, 76 (1907).LDETel 74.4

    యాంగ్విస్, కాలిఫోర్నియా

    ఈ ఆస్తిని గూర్చి నేను ఆలోచన చేసినప్పుడు అనేక విధాలుగా ఉన్నత పదవిలో గౌరవించబడుతుందని తెలియజేసినాను, గొప్ప పలుకుబడి వున్న ప్రదేశములలో పాఠశాలలు వుండవసరలేదు.. ఇది సెయింట్ హెలెనా నుండి ఎనిమిది మైళ్ళ దూరంలో వున్న పాఠశాల మరియు అది నగరం శోదనల నుండి ప్రశాంతముగా వుంది. తగిన సమయమందు విద్యార్థుల కోసం ఎక్కువ కుటీరాలు నిర్మించటం అవసరమైయున్నాది, ఈ విద్యార్థులు తాము సామర్థ్యంగల ఉపాద్యాయుల బోధనలో నిలకడగా నిలుచి యుందురు, ఆ స్థలములో అనేక వృక్షాలు వున్నాయి కాబట్టి నిర్మించే ఈ పని కోసం అక్కడే విద్యార్థలు దూలాలు తయారిచేయవచ్చు, మరియు విద్యార్థులకు మేలైన పద్ధతిలో ఎలా నిర్మించాలో నేర్పిస్తారు మనము అపరిశుద్ధమైన నీరు త్రాగుటకు భయపడటం అవసరము లేదు ఎందుకంటే దేవుడు తన దన నిదిలో నుండి మనకు స్వేచ్చగా సరఫరా చేయబడుతుంది. మనకు అనేక ప్రయోజనాలు మన కోసం అనుగ్ర హించిన దేవునికి ఈ విషయములో ఏ రీతిగా కృతజ్ఞతలు తెలియజేయ లో నాకే తెలియటం లేదు.....మనకు ఏది అవసరమైయున్నాది ప్రభుకి తెలుసు అనే విషయము మనము గ్రహించియున్నాము, మరియు ఇది ఆయన యొక్క అనుగ్రహమువలనే మనలను ఆయనే ఇక్కడకు తీసుకొనివచ్చేను, మనము ఇక్కడ వుండాలని దేవుడు కోరుకున్నాడు మరియు అందుకే ఆయన మనలను ఇక్కడ ఉంచాడు. ఈ మైదానంలో నేను వచ్చాను కనుక ఇది ఖచ్చితంగా అయుంటుమది.... ఈ మైదానంలో నడిచి నప్పుడు మీరు అదే నిర్ణయానికి వస్తారు- దేవుడు ఈ స్థలాన్ని మన కోసం రూపొందించాడు. -మాన్యుస్క్రిప్ట్ రీలీజ్ 1: 340, 341, 343 (1909).LDETel 75.1