Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
క్రీస్తు ఉపమాన ప్రబోధాలు - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    యూదు జాతికి వర్తింపు

    క్రీస్తు ధనవంతుడు లాజరు ఉపమానం చెప్పినప్పుడు ఆ ధనవంతుడున్న దయనీయ పరిస్థితిలోనే యూదుజాతిలో అనేకులున్నారు. వారు ప్రభువు వనరుల్ని తన స్వార్థ ప్రయోజనాలికి వినియోగించుకుంటూ “ఆయన నిన్ను సులో తూచగా నీవు తక్కువగా కనపడితివి” (దాని 5:27) అన్న మాటలు వినటానికి సిద్ధపడుతున్నారు. ధనవంతుడు శారీరకమైన, ఆధ్యాత్మికమైన దీవెనల్ని అందుకున్నాడు. కాని ఆ దీవెనల్ని వినియోగించటంలో దేవునితో కలసి పని చెయ్యటానికి నిరాకరించాడు. యూదు జాతి చేసినపనీ ఇదే. దేవుడు యూదుల్ని తన పవిత్ర సత్య సంపదకు ధర్మకర్తల్ని చేసాడు. తన కృపకు వారిని నిర్వాహకులుగా నియమించాడు. వారికి ఆధ్యాత్మికమైన, లౌకికమైన దీవెనలిచ్చి వాటిని ఇతరులికి పంచమని ఉపదేశించాడు. పతనమై నశించిపోతున్న తమ సహోదరుల పట్ల తమ ఆవరణలో ఉన్న పరదేశుల పట్ల తమ మధ్య నివసిస్తున్న పేదవారి పట్ల తమ బాధ్యతల గురించి వారికి ప్రత్యేక ఉపదేశం ఇచ్చాడు. వారు ప్రతీ విషయంలోనూ స్వార్ధ ప్రయోజనం పొందటానికి చూడకూడదు. లేమిలో ఉన్నవారిని గుర్తించి తమకున్నది వారితో పంచుకోవాలి అన్నాడు. తాము ప్రేమ మూలంగా కరుణతో చేసే కార్యాల ప్రకారం వారిని దీవిస్తానని దేవుడు వాగ్దానం చేసాడు. అయితే ఆ ధనవంతుడిలా వారు బాధలు శ్రమలు అనుభవిస్తున్న వారి లౌకిక, ఆధ్యాత్మిక లేమిని తీర్చటానికి తమ చెయ్యి చాపలేదు. తాము దేవుడు ఎంపిక చేసుకున్న ప్రజలమని భావించి గర్వాంధులయ్యారు. అయినా వారు దేవుని సేవించలేదు లేదా ఆరాధించలేదు. తాము అబ్రాహాము పిల్లలం అన్న విషయ పైనే వారు ఆధారపడ్డారు. “మేము అబ్రాహాము సంతానము” (యోహా 8:33) అని గర్వంగా చెప్పుకున్నారు. క్లిష్ట పరిస్తితి ఏర్పడ్డప్పుడు వారు దేవుని విడిచి పెట్టేశరని, అబ్రాహామే దేవుడైనట్లు అతడి పైనే నమ్మిక ఉంచారని వెల్లడయ్యింది.COLTel 221.1

    యూదుల చీకటి మనసుల్లోకి వెలుగును ప్రసరింపజెయ్యాలని క్రీస్తు ఆకాంక్షించాడు. ఆయన వారితో “మీరు అబ్రాహాము పిల్లలైతే అబ్రాహాము చేసిన క్రియలు చేతురు. దేవుని వలన సత్యము మీతో చెప్పిన వాడైనను నన్ను మీరినప్పుడు చంపవెదుకున్నారే, అబ్రాహాము అట్లు చేయలేదు” అన్నాడు. యోహా 8:39,40COLTel 222.1

    వంశావళి పవిత్రతను క్రీస్తు గుర్తించలేదు. స్వాభావిక బాంధవ్యం కన్నా ఆధ్యాత్మిక బాంధవ్యం మిన్న అని క్రీస్తు బోధించాడు. యూదుల తాము అబ్రాహము సంతతివారమని చెప్పుకునేవారు గాని అబ్రాహాము చేసిన పనులు చెయ్యలేదు. తాము అబ్రాహాముకి నిజమైన పిల్లలం కామని నిరూపించుకున్నారు. దేవుని స్వరానికి లోబడటం ద్వారా ఆధ్యాత్మికంగా అబ్రాముతో ఒకటై ఉన్నారని నిరూపించుకునేవారు మాత్రమే నిజమైన వారసులుగా గుర్తింపు పొందుతారు. ఆ పేదవాడు తక్కువవాడుగా మనుషులు పరిగణించే తరగతికి చెందినా క్రీస్తు అతణ్ణి అబ్రాహాముకి అతి సన్నిహితుడుగా గుర్తించాడు.COLTel 222.2

    ఈ ధనవంతుడు జీవిత సుఖభోగాల నడుమ ఉన్నప్పటికి అబ్రాహముని దేవుని స్థానంలో పెట్టేంత అజ్ఞాని. అతడు తన ఉన్నతమైన ఆధిక్యతల్ని అభినందించి, తన మనసును హృదయాన్ని తీర్చిదిద్దటానికి పరిశుద్దాత్మకు అవకాశం ఇచ్చినట్లయితే అతడి పరిస్థితి ఎంతో వ్యత్యాసంగా ఉండేది. అతడి జాతి పరిస్థితి అలాగే వ్యత్యాసంగా ఉండేది. ఆ జాతి ప్రజలు దేవుని పిలుపుకు అనుకూలంగా స్పందించి ఉంటే వారి భవిష్యత్తు ఎంతో వ్యత్యాసంగా ఉండేది. వారికి వాస్తవమైన ఆధ్యాత్మిక అవగాహన ఉండేది. వారికి సాధనాలున్నాయి. వీటిని దేవుడు ప్రపంచాన్నంతటిని చైతన్యపర్చి దీవెనలతో నింపటానికి చాలేంతగా వృద్ధిపర్చేవాడు. కాని వారు దేవున్ని విడిచి పెట్టి దూరంగా వెళ్ళిపోయారు. వారి జీవితమంతా వక్రమార్గాన పడింది. దేవుని గృహ నిర్వాహకులుగా వారు తమ వరాల్ని సత్యాన్ని నీతిని అనుసరించి వినియోగించుకోవటంలో విఫలులయ్యారు. నిత్యజీవం వారి ఆలోచనల్లోకి రాలేదు. వారి అపనమ్మకం పర్యవసానంగా అదంతా నాశనమయ్యింది.COLTel 222.3

    యెరూషలేము నాశనమప్పుడు యూదులు తన హెచ్చరికను జ్ఞాపకం చేసుకుంటారని క్రీస్తుకి తెలుసు. అదే జరిగింది. యెరూషలేము మీదికి విపత్తు వచ్చిపడ్డప్పుడు ప్రజలు ఆకలితోను అనేక శ్రమలు ఇక్కట్లతోను బాధపడుతున్నప్పుడు, క్రీస్తు చెప్పిన మాటల్ని అవగాహన చేసుకున్నారు. ఆఉపమానాన్ని గ్రహించారు. దేవుడిచ్చన వెలుగును లోకానికి ప్రకాశింపజేయ్యటం నిర్లక్ష్యం చెయ్యటం ద్వారా వారు ఆకష్టాల్ని బాధల్ని తమ మీదికి తెచ్చుకున్నారు.COLTel 223.1

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents