Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
క్రీస్తు ఉపమాన ప్రబోధాలు - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    ప్రభావం

    క్రీస్తు ఈ జీవితం నిత్యం విశాలమౌతుపోయే ప్రభావం. అది ఆయన్ని దేవుని సర్వ మానవ కుటుంబానికి అనుసంధానపర్చే ప్రభావం. మానవుడు తనక కోసం తాను నివసించటం అసాధ్యపరిచే ప్రభావాన్ని క్రీస్తు ద్వారా దేవుడు అతడికి అనుగ్రహించాడు. దేవుని గొప్ప సమూహంలో భాగంగా మనం వ్యక్తిగతంగా మన తోటి మనుషులతో అనుసంధానపడి ఉన్నాం. మనం పరస్పరం బాధ్యతలు కలిగి ఉన్నాం. ఏ మనుషుడూ సాటి మనిషితో సంబంధము లేకుండా స్వతంత్రంగా ముడిపడి ఉంటుంది. ప్రతీ ఒక్కరు ఇతరుల క్షేమాభివృద్ధికి అసవరమని భావించి ఇతరుల సంతోషాన్ని ప్రొది చెయ్యలన్నది దేవుని ఉద్దేశం.COLTel 286.3

    ప్రతీ ఆత్మనూ దాని వాతావరణం ఆవరించి ఉంటుంది. అది ప్రాణాన్నిచ్చే విశ్వాసపు శక్తి, ధైర్యసాహసాలు, నీరీక్షణ, ప్రేమ, పరిమళంతో నిండిన వాతావారణం కావచ్చు లేదా అతి అసంతృప్తి అంధకారంతో, స్వార్ధంతో, లేదా విడిచి పెట్టకుండా ప్రేమించే పాపం తాలూకు ప్రాణాంతకమైన కళంకం కలిగించే హృదయ భారం, ధు:ఖంతో నిండిన వాతవారణం కావచ్చు. మనల్ని ఆవరించే వాతావారణం మనం కలసి ప్రతీ వ్యక్తిని మనం గుర్తించగలిగేటట్లో గుర్తించలేనట్లో ప్రభావితం చేస్తుంది.COLTel 287.1

    ఇది మనం తప్పించుకోలేని బాధ్యత. మన మాటలు, మన క్రియలుమనం వేసుకొనే బట్టలు, మన ప్రవర్తన, చివరికి మన ముఖవైఖరి వాటి ప్రభావాన్ని ప్రసరిస్తాయి. ఇలా ఏరప్రడ్డ ప్రభావాల మీద మేలుకో కీడుకో సంబంధించే ఫలితాలు ఆధారపడి ఉంటాయి. వాటిని ఏ మానవుడూ కొలవలేడు. ఈవిధంగా సంక్రమించే ప్రతీ వృత్తి విత్తనంలా పనిచేసి దాని పంటను పండుతుంది. మానవ సంఘటనల గొలుసులో అది ఒక లింకు అవుతుంది. ఆ పొడవాటి గొలుసు ఎంతలెక్క వెళ్తుందో ఎవరికి తెలియదు. మన ఆదర్శం ద్వారా మంచి నియామలు నేర్చుకోవటానిక మనం ఇతరులికి సహాయపడితే మంచి చెయ్యటానికి వారికి శక్తినిస్తాం. వారు తిరిగి అదే ప్రభవాన్ని చూపిస్తారు. వారు తిరిగి దాన్ని ఇంకా ఇతరులపై చూపిస్తారు. ఇలా మనకు తెలియకుండా మనం చూసే ప్రభావం వేలమందికి మేలు చెయ్యవచ్చు.COLTel 287.2

    చెరువులోకి ఒక రాయి విసిరితే ఒకదాని తరువాత ఒకటిగా కెరటాలు ఏర్పడతాయి. అవి పెరిగే కొద్ది వాటి వృత్తం తీరాన్ని తాకేవర్కూ విశాలమవుతుంది. మన ప్రభావము అలాగే మన జ్ఞానాన్ని నియంత్రణను దాటిపోయి అది ఇతరుల్ని మేలుకో కీడుకో ప్రభావితం చేస్తుంది.COLTel 287.3

    ప్రవర్తనా శక్తి, నిజమైన, స్వార్ధరహితమైన భక్తి జీవిత మౌన సాక్ష్యం దాదాపు ప్రతిఘటించలేని ప్రభావాన్ని చూపుతుంది. మన జీవితంలో క్రీస్తు ప్రవర్తనను కనపర్చటం ద్వారా ఆత్మల రక్షణ పరిచర్యయలో ఆయనతో మనం సహకరిస్తాం. మన ప్రభావ పరిధి ఎంత విశామైందయితే మనం అంత ఎక్కువ మేలు చేయవచ్చు., దైవ సేవ చేస్తున్నట్లు చెప్పుకునేవారు తమ జీవితాల్లో ధర్మశాస్త్ర సూత్రాల్ని అనుసరిస్తూ క్రీస్తు ఆదర్శానుసరాంగా జీవించినప్పుడు తాము దేవున్ని సమున్నతంగా ప్రేమిస్తున్నట్లు తమ పొరుగువారిని తమ వలె ప్రేమిస్తున్నట్లు వారి ప్రతీ క్రియీ సాక్ష్యం ఇచ్చినప్పుడు అప్పుడు లోకాన్ని కదలించే శక్తి సంఘానికి దఖలుపడుతుంది.COLTel 288.1

    చెడును చెయ్యటానికి ప్రభావం కున్న శక్తి ఏమాత్రం తక్కువది కాదని ఎన్నడూ మరువకూడదు. ఒకడు తన ఆత్మను పొగొట్టుకోవడం భయంకర విషయం. కాని ఇతరులు ఆత్మలు నాశనమవ్వటానికి కారణమవ్వటం ఇంకా భయంకరం. మన ప్రభావం మరణార్ధమైన మరణపు వాసన అవ్వటమన్నది భయంకరమైన ఆలోచన. అయినా అది సాధ్యమే క్రీస్తుతో కలసి సమకూర్చతున్నామని చెప్పే అనేకమంది ఆయన నుంచి జనుల్ని చెదరుగొడుతున్నారు. సంఘం ఇంత బలహీనంగా ఉండ టానికి కారణం ఇదే. చాలామంది విమర్శంచటంలోను ఆరోపణలు చెయ్యటంలోను నిమగ్నమై ఉన్నారు. అనుమానం, ఆసూయ, అసంతృప్తిని వెలిబుచ్చటం ద్వారా వారు సాతాను సాధనాలుగా పరిణమిస్తారు. తాము ఏమి చేస్తున్నారో గుర్తించకముందే వారి ద్వారా సాతాను తన లక్ష్యాన్ని సాధించుకుంటాడు. దుష్టత్వం ముద్ర నీడ పడ్డాయి. సాతాను బాణాలు గురిని చేరాయి అవిశ్వాసం , అపనమ్మకం, నమ్మద్రోహం - ఇవి క్రీస్తుని తమ రక్షకుడుగా అంగీకరించి ఉండేవారిని పట్టి పీడిస్తున్నాయి. తాము ఎవరిని శంకిచంటానికి సందేహించటనికి నడిపించారో, ఇప్పుడు ఎవరు గద్దింపును విజ్ఞాపననను వినకుండా తమ హృదయాల్ని కఠినపర్చు కుంటున్నారో వారి వంక సాతాను సేవకులు సంతృప్తితో చూస్తున్నారు. ఈ ఆత్మలతో పోల్చి చూచుకున్నప్పుడు., తాము సత్యమైన నీతిమంతులు అవి ఉప్పొంగిపోతారు. శీలహీనులైన ఈ మనుషులు అదుపులేని తమ నాలుకలు, తిరుగుబాటుతో నిండిన తమ హృదయాలు చేసిన పని ఫలితమిది అని వారు గుర్తించరు. వారి ప్రభావం మూలంగానే శోధితులైన ఈ మనుషులు పతనమవుతున్నారు. నామమాత్రపు క్రైస్తవుల్లో కనిపిస్తున్న చాపల్యం,స్వార్ధక్రియలు, ఉదాసీనత అనేక ఆత్మల్ని జీవిత మార్గం ఉంచి మళ్ళిస్తున్నాయి. తమ ప్రభావ ఫలితాల గురించి దేవుని న్యాయపీఠాన్ని ఎదుర్కోవటానికి భయకంపితులు కావలసినవారు చాలామంది ఉన్నారు.COLTel 288.2

    ఈ వరాన్ని దేవుని కృపద్వారా మాత్రమే మనం సరి అయిన విధంగా వినియోగించుకోగలుగుతాం. మనం ఇతరుల్ని మంచి వ్యక్తులుగా నివసించేలా ప్రభావితం చెయ్యటానికి మనలో ఏమి లేదు. మన నిస్సహయాతను, దైవశక్తిని, అవసరాన్ని మనం గుర్తించినట్లయితే మన శక్తి మీద మనం ఆధారపడం, మనల్ని మనం నమ్ముకోం. ఒక దినం, ఒక గంట లేక ఒక నిమిషం ఏమి నిశ్చయిస్తుందో మనకు తెలియదు. మన జీవితాల్ని మన మార్గాల్ని మన పరలోక తండ్రికి సమర్పించుకోకుండా దినాన్ని ప్రారంభించకూడదు. దేవదూతలు మనల్ని కాపాడటానికి నియుక్తులయ్యారు. మనం వారి కాపుదలకు మనల్ని మనం సమర్పించు కుంటే మనకు అపాయం వాటిల్లే ప్రతిసారి వారు మన కుడిపక్క ఉంటారు. తెలియకుండా మనం చెడ్డ ప్రభావాన్ని చూపే ప్రమాదంలో ఉన్నప్పుడు దేవదూతలు మన పక్క ఉండి, మంచి మార్గంలో నడవటానికి మనల్ని ప్రోత్సహిస్తూ మనం పలకాల్సిన మాటల్ని మనకు ఎంపకి చేసి, మన కార్యాల్ని ప్రభావితం చేస్తారు. ఈ రీతిగా మనం ప్రభావం మౌనమైనది, తెలియకుండా ప్రసరించేది కావచ్చు. అయినా అది ఇతరుల్ని క్రీస్తుకు ఆకర్షించటంలో గొప్ప శక్తి కలది కావచ్చు.COLTel 289.1

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents