Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
క్రీస్తు ఉపమాన ప్రబోధాలు - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    బలం

    పూర్ణ హదృదయంతోను పూర్ణ మనసుతోను పూర్ణ ఆత్మతతోను మాత్రమే కాదు పూర్ణ బలంతో కూడా మనం దేవున్ని ప్రేమించాల్సి ఉన్నాం. శక్తులన్నింటి సంపూర్ణమైన జ్ఞానయుతమైన వినియోగాన్ని ఇది ప్రస్తావిస్తున్నది.COLTel 296.1

    లౌకిక కార్యాలు ఆధ్యాత్మిక కార్యాల నిర్వహణలో క్రీస్తు వాస్తవిక కార్మికుడు. తన కార్యాచరణ అంతటిలోను తన తండ్రి చిత్తం నెరవేర్చాలన్న ధృడ సంకల్పాన్ని అనుసరిచాడు. పరలోక ఐహిక నియమాలు అనేకమంది గుర్తించే దానికన్నా ఎక్కువ పరస్పర సంబంధం కలిగి ప్రత్యక్షంగా క్రీస్తు పర్యవేక్షణ కింద ఉన్నాయి. భూమిపై మొట్టమొదటి గూడారినికి ప్రణాళిక రూపొందించింది క్రీస్తే. సొలోమెను దేవాలయ నిర్మాణానికి సంబంధించిన ప్రతీ వివరాన్ని ఇచ్చింది ఆయనే. తన భూలోక జీవితంలో నజరేతు గ్రామంలో వడ్రంగిగా పనిచేసిన ఆయన ఆ పరిశుద్ధ ఆలయంలో రూపకల్పనకు ప్రణాళిక ఇచ్చిన భవన శిల్పి ఆయనే. అందులో ఆయన నామం ఘనత పొందాల్సి ఉంది,.COLTel 296.2

    గూడార నిర్మాతలు గూడారాన్ని గొప్ప నైపుణ్యంతోను చక్కని పనితనంతోను నిర్మించేందుకు వారికి వివేకం ఇచ్చింది క్రీస్తే. ఆయన ఇలా అన్నాడు “నేను యూదా గోత్రములోహురు మనుమడును. ఊరు కుమారుడునైన బెసలేలు అను పేరు గల వానిని పిలిచితిని... జ్ఞాన విద్యా వివేకములును సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మపూర్ణునిగా చేసియున్నాను. మరియు ఏను దాసు గోత్రములోని అహీసామాకు కుమారుడైన అహెలీయాబును, అతనికి తోడు చేసితిని”. నిర్గ 31:2-6COLTel 296.3

    ప్రతీ శాఖలోనూ పనిచేసే తన పనివారు తమకున్న సమస్తాన్నీ ఇచ్చేవానిగా తన మీదనే ఆధారపడాలని దేవుడు కోరుతున్నాడు. సరి అయిన సమస్త ఆవిష్కరణలకు అభివృద్ధికి అద్భుతమైన ఆలోచనకర్త, విశిష్ట కార్యకర్త అయిన ప్రభువే మూలం. నిపుణత గల వైద్యుడి చేతి స్పర్శ, నరాలు కండారాల మీద అతడి శక్తి దేహంలోని సున్నితమన అంగక్రమ నిర్మాణాన్ని గూర్చిన జ్ఞానం అంతా దైవ జ్ఞానం శక్తే. దీన్ని బాధపడుతున్న వారి బాధ నివారణకు ఉపయోగించాలి. వడ్రంగి సుత్తి ఉపయోగించగంలో నిపుణత, నాగలి పై ఇనుము సాగొగొట్టటానికి కుమ్మరి వినియోగించే శక్తి దేవుడిచ్చేవే. ఆయన మనుషులికి తలాంతు లిస్తాడు. మనుషులు ఆలోచన కోసం తనను సంప్రదించాలిని ఆయన కోరుతున్నాడు. మనం ఏ పని చేస్తున్నా ఏ శాఖలో నియక్తులమైనా సంపూర్ణమైన పనిని చేసేందుకు మన మనసుల్ని ఆయన నియంత్రించగోరుతున్నాడు.COLTel 297.1

    మతం వ్యాపారం రెండూ వేరు కావు. ఆ రెండు ఒక్కటే మన చేసే లేకచెప్పే సమస్తంతో బైబిలు మతాన్ని మిళితం చెయ్యాలి. లౌకిక, ఆధ్యాత్మిక సాధనాల్లో దైవ మానవ ప్రతినిధులు ఐక్య కృషి చెయ్యాలి. మానవ వృత్తులన్నిటలో యాంత్రిక వ్యవసాయ పనుల్లో, వ్యాపార, వైజ్ఞానిక కార్యకలపాల్లో వారు కలసి పనిచెయ్యాలి. క్రైస్తవ కార్యకలపాల పరిధిలోని సమస్త విషయాల్లో సహకారం ఉండాలి.COLTel 297.2

    ఏ నియమాల అనుసరణమై మాత్రమే ఈ సహకరాం సాధ్యమౌ తుందో వాటిని దేవుడు వెల్లడించాడు. ఆయన మహిమఅన్నదే ఆయన తోటి పనివారైన వారి గురి కావాల్సి ఉంది. దేవుని పట్ల మన ప్రేమను బట్టి ఆయన చిత్తాన్ని బట్టి మన సేవ అంతా జరగాలి,COLTel 297.3

    మతారాధనలో పాల్గొనేటప్పుడు దేవుని చిత్తాన్ని జరిగించటం ఎంత అవసరమో ఒక కట్టడాన్ని కట్టేటప్పుడు ఆయన చిత్తాన్ని జరిగించటం అంతే అవసరం. పనివారు తమ ప్రవర్తన ఏర్పర్చుకోవటంలో సరి అయిన నియామల్ని అనుసరించి ఉంటే అప్పుడు ప్రతీ నిర్మాణం విషయంలో వారు కృపలోను జ్ఞానంలోను పెరుగుతారు.COLTel 297.4

    స్వార్ధాన్ని సజీవయాగంగా బలిపీఠం మీద పెడితే గాని అత్యున్నత వరాల్ని గాని మిక్కిలి శ్రేష్టమైన సేవను గాని దేవుడు అంగీకరించడు. వేరు పరిశుద్ధంగా ఉండాలి. లేకపోతే దేవునికి అంగీకృతమైన ఫలాలు ఫలించటం అసాధ్యం దేవుడు దానియేలుని యోసేపుని నిపుణులైన పరిపాలకుల్ని చేసాడు. ఆయన వారి ద్వారా పనిచెయ్యలగిగాడు. ఎందుకంటే వారు తమ సొంత కోర్కెల్ని తీర్చుకోవటానికి గాక దేవుని చిత్తాన్ని నెరవేర్చుటానికికి నివసించారు.COLTel 298.1

    దానియేలు ఉదంతంలో మనకో పాఠం ఉంది. ఒక వ్యాపారి చతురురడు, జిత్తులమారి కానక్కరలేదు అన్న వాస్తవాన్ని అది వెల్లడి చేస్తుంది. అతణ్ణి దేవుడు అడుగడున ఉపదేశిస్తాడు. దానియేలు బబులోను రాజ్యప్రధానమంత్రిగా ఉంటున్న కాలంలో పరలోకం నుంచి వెలుగును పొందుతూ దేవుని ప్రవక్తగా సేవ చేసాడు. అత్యాశతో నిండిన రాజనీతిజ్ఞుల్ని గడ్డిగాను ఎండిపోయే గడ్డిపువ్వుగాను దైవ వాక్యంలో సూచిచంచటం జరుగుతున్నది. అయినా తన సేవ చెయ్యటానికి తెలివిగలవారు వివిధ పనులకు అర్హతలున్న వారిని దేవుడు కోరుకుంటున్నాడు.COLTel 298.2

    తమ వ్యాపారంలో సత్యం తాలూకు నియమాల్ని ఉపయోగించే వ్యాపారుల అవసరం ఎంతో ఉంది. వారు తమ వరాల్ని పఠనం ద్వారా శిక్షణ ద్వారా పరిపూర్ణం చేసుకోవాలి. ఏ శాఖలో పనికైనా మనుషులు తమ జ్ఞానాన్ని సమర్ధతల్ని వృద్ధిపర్చుకుని సమర్దులవ్వాల్సిన అవసరం ఉంటే అది మన లోకంలో తమ సమర్ధతల్ని వినియోగించి దేవుని రాజ్యాన్ని నిర్మించటానికి పాటు పడేవారి విషయంలోనే అని చెప్పాలి. తమ సమస్త వ్యాపార విషయాల్లో తీవ్ర పరీక్ష చోటు చేసుకున్నప్పుడు అతడిలో ఒక పొరపాటుగా తప్పిదం గాని కనపడలేదని దానియేలు గురించి మనకు వెల్లడవుతుంది. ప్రతీ వ్యాపారి ఎలా ఉండగలడు అన్నదానికి అతడు ఒక మచ్చుతునక. తన మానసిక శక్తి, ఎముకలు కండలబలాన్ని, హృదయాన్ని మనసును దేవుని సేవకు సమర్పించుకునే ఒక్క వ్యక్తి ఏమి సాధించగలడో దానియేలు చరిత్ర చాటి చెప్పుతున్నది.COLTel 298.3

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents