Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
క్రీస్తు ఉపమాన ప్రబోధాలు - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    21—“మహా అగాధముంచబడియున్నది”

    ఆధారం లూకా :16:91-31

    ధనవంతుడు లాజరు ఉపమానంలో మనుషులు ఈ జీవితంలోనే తమ నిత్య భవిష్యత్తును నిర్ణయించుకుంటారని క్రీస్తు చూపిస్తున్నాడు. కృపకాలంలో ప్రతీ ఆత్మకూ దేవుని కృప అందుబాటులో ఉంటుంది. కాని మనుషులు తమ్ముని తాము తృప్తిపర్చుకోవటంలో తమ అవకాశాల్ని వృధా చేయటం ద్వారా నిత్యజీవం కోల్పోతారు. వారికి మరొక కృపకాలమండదు. తమ సొంత ఎంపిక ద్వారా వారు తమకు దేవునికి మధ్య దాటలేని గొప్ప అగాధాన్ని సృష్టించుకుంటారు.COLTel 213.1

    ఈ ఉపమానం దేవుని పై ఆధారపడని ధనవంతులకు దేవుని పై ఆధారపడే పేదవారికి మధ్య వ్యత్యాసాన్ని సూచిస్తుంది. ఈ రెండు తరగతుల ప్రజల పరిస్థితి తారుమారయ్యే సమయం వస్తుందని క్రీస్తు సూచిస్తున్నాడు. దేవుని పై నమ్మిక ఉంచి శ్రమల్లో ఓర్పు కలిగి నివసించేవారు. లోక సంబంధమైన విషయాల్లో పేదవారైనా, లోకంలో అత్యున్నత స్థానాల్లో ఉండి తమ జీవితాన్ని దేవునికి సమర్పించుకొని వారికన్నా ఒకరోజున ఉన్నతంగా హెచ్చింపబడతారు.COLTel 213.2

    “ధనవంతుడొకడుండెను. అతడు ఊదారంగు బట్టలను సన్నపునార వస్త్రములు ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు, లాజరు అను ఒక దరిద్రుడుండెను. వాడు కురుపులతో నిండినవాడై ధనవంతుని ఇంటి వాకిట పడియుండి అతని బల్ల మీద నుండి పడు రొట్టెముక్కలతో ఆకలి తీర్చుకొనగగోరెను”. అని క్రీస్తు చెప్పాడు.COLTel 213.3

    ఈ ధనవంతుడు దేవున్ని మానవుణ్ణి బహిరంగంగా ఆలక్ష్యం చేసిన అన్యాయస్తుడైన న్యాయాధిపతి సూచించిన తరగతికి చెందినవాడు కాడు. అతడు తాను అబ్రాహాము కుమారుడైన్నాడు. అతడు భిక్షగాడితో దౌర్జన్యంగా ప్రవర్తించలేదు లేదా అతడి వాలకం అసహ్యంగా ఉన్నందుకు అతణ్ణి వెళ్లిపొమ్మనలేదు. తన గుమ్మంలోకి ప్రవేశించే హేయమైన పేదవాడు అతణ్ణి చూసి ఓదార్పు పొందితే చాలని ఆ పేదవాడు అక్కడ ఉండటానికి ఆ ధనవంతుడు సమ్మతించాడు. కాని స్వార్ధపరుడైన అతడు బాధపడుతున్న ఆ సహోదరుడి అవసరాల విషయంలో పట్టించుకోలేదు.COLTel 213.4

    ఆ కాలంలో వ్యాధిగ్రస్తులికి చికిత్స చెయ్యటానికి అసుపత్రులు లేవు. బాధల్లోను లేమిలోను ఉన్నవారికి సానుభూతి సహాయం అందించేందు కుప్రభువు ఎవరికి భాగ్యం ఇచ్చాడో ఆ ధనవంతు వద్దకు వారిని తీసుకు వచ్చేవారు. ఈ పేదవాడు ఈ ధనవంతుడి వద్ద ఉండటం ఇలా జరిగింది. లాజరు గొప్పలేమిలో ఉన్నాడు. అతడికి మిత్రులు లేరు. ఇల్లు లేదు. డబ్బులేదు. తినటానికి తిండి లేదు. పాపం అతడు ఆ స్తితిలోనే మిగిలిపోయాడు. ఆ ధనవంతుడైతే ఏ లోటు లేకుండా నివసిస్తున్నాడు.సాటి మనిషి శ్రమల్ని అతి సమర్ధంగా నివారించగలిగిన ఆ వ్యక్తి నేడు అనేకమందిలాగ తన కోసమే నివసించాడు.COLTel 214.1

    నేడు మనకెంతో దగ్గరలోనే ఆకలితో బాధపడుతున్నావారు బట్టలు లేనివారు, నిలువ నీడలేనివారు ఎందరో ఉన్నారు. లేమిలోను శ్రమల్లోను ఉన్నవారికి మనం ద్రవ్యం ఇవ్వకపోవడం మనల్ని అపరాదుల్ని చేస్తుంది. దానిని ఎదుర్కొవటానికి ఒకరోజున మనం భయంతో వణుకుతాం. అత్యాశ విగ్రహారధన వంటి దోషం, స్వార్ధం దేవుని దృష్టికి హేయం.COLTel 214.2

    తానిచ్చిన ధనానికి దేవుడు ఆ ధనవంతుణ్ణి తన గృహ నిర్వాహణకుణ్ని చేసాడు. ఆ పేద భిక్షగాడి వంటి అభాగ్యుల్ని అదుకోవటం అతడి విధి. ఆయన ఈ అజ్ఞ ఇచ్చాడు. “నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను” (ద్వితి 6:5) “నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమింపవలెను”. (లేవి 19:18) ఆ ధనవంతుడు యూదుడు. దేవుని ఆజ్ఞను గురించి అతడికి తెలుసు. దేవుడు తనకిచ్చిన ద్రవ్యానికి సమర్ధతలకి లెక్క అడుగుతాడని అతడు మర్చిపోయాడు. దేవుడు అతణ్ణి బహుగా దీవించాడు. కాని అతడు ఆ దీవెనల్ని తన స్వార్ధానికి , స్వీయ ప్రతిష్టతకు ఉపయోగించుకున్నాడు గాని తన సృష్టికర్తను ఘనపర్చటానికి కాదు. అతడు తనకు కలిగియున్నదాన్ని తన సమృద్ది నిష్పత్తిలో మానవాళి మేలుకోసం ఇవ్వాల్సి ఉన్నాడు. ఇది ప్రభువు ఆజ్ఞ. కాని ఈ ధనవంతుడు దేవునికి తన జవాబుదారీతనం గురించి ఆలోచించి ‘లేదు. అతడు అప్పిచ్చి దాని మీద వడ్డి తీసుకున్నాడు.కాని దేవుడు తనకు ఇచ్చిన అప్పుపై ఆయనకు వడ్డీ చెల్లించలేదు. అతడికి జ్ఞానముందు, వరాలున్నాయి. అయితే అతడు వాటిని అభివృద్ధి చేసకోలేదు. తాను దేవునికి జవాబుదారినన్న సంగతిని విస్మరంచి తన శక్తులన్నిటిని వినోదాల్లో వ్యర్ధం చేసాడు. తన చుట్టు ఉన్నదంతా అతడి వినోదాలు, స్నేహితుల ప్రసంశలు పొగడ్తలు అతడికి ఆనందాన్ని కూర్చుటానికి అతడి స్వార్ధ కోరికల్ని తీర్చటటానికి దోహదపడ్డాయి. స్నేహితుల సహవాసంలో తలమునకలై తన కృపా పరిచర్యలో దేవునికి సహకరించాలన్న స్పృహను కోల్పోయాడు. దైవ వాక్యాన్ని అవగాహన చేసుకోవటానికి దాని ఆచరణలో పెట్టటానికి అతడికి తరుణం ఉంది. కాని తను ఎంచుకున్న జల్సా రాయుళ్ళు సహవాసంలోనే అతడి సమయం గడిచిపోయింది. దేవున్ని పూర్తిగా మర్చిపోయాడు.COLTel 214.3

    ఆ ఇద్దరు మనుషుల పరిస్థితుల్లో మార్పు వచ్చింది. పేదవాడు రోజు కష్టాలు కడగండుల అనుభవించారు. అయితే అతడు వాటిని ఓర్పుతో సహనంతో భరించాడు. కాలక్రమంలో అతడు మరణించి సమాధి అయ్యాడు. అతణ్ణి గురించి విలపించేవారు లేరు. కాగా అతడు తన శ్రమల కాలంలో తన ఓర్పు సహనం ద్వారా క్రీస్తును గూర్చి సాక్ష్యమిచ్చాడు. తనకు వచ్చిన విశ్వాస పరీక్షలో నిలిచాడు. అతడు మరణించినప్పుడు దూతలు అతణ్ణి అబ్రాహాము రొమ్ముపై పెట్టినట్లు ఉపమానం సూచించింది.COLTel 215.1

    క్రీస్తుని విశ్వసిస్తూ బాధలు శ్రమలు సహించే పేద విశ్వాసుల్ని లాజరు సూచిస్తున్నాడు. బూర మోగినప్పుడు సమాధుల్లో ఉన్నవారందరూ క్రీస్తు స్వరం విని, సమాధుల్లో నుంచి సజీవులుగా లేచినప్పుడు వారు తమ ప్రతిఫలాన్ని పొందుతారు. ఎందుకంటే వారి విశ్వాసం కేవలం సిద్ధాంతం కాదు పచ్చి నిజం.COLTel 215.2

    “ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడతను పాతాళములో బాదపడుచు, కన్నులెత్తి దూరము నుండి అబ్రాహమును అతని రొమ్మున (అనుకొనియున్న) లాజరును చూసి తండ్రివైన అబ్రాహామా, నా యందు కనికరపడి తన వ్రేలికొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము.నేను ఈ అగ్నిజ్వాలలో యాతన పడుచున్నాని కేకలు వేసి చెప్పెను”.COLTel 215.3

    ఈ ఉపమానంలో క్రీస్తు ఆ ప్రజల్ని తమ వాదనతోనే ఎదుర్కుంటున్నాడు క్రీస్తు మాటల్ని వింటున్న ప్రజల్లో అనేకమంది మరణానికి పునరుత్థానానికి మధ్య కాలంలో ఆత్మకు స్పృహగల ఉనికి ఉంటుందన్న సిద్ధాంతాన్ని నమ్మారు. రక్షకుడికి వారి అభిప్రాయాలు తెలుసు కనుక తమ తప్ప అభిప్రాయాల్ని తొలగించి ప్రాముఖ్యమైన సత్యాల్ని వారికి భోదించే సాధనంగా ఈ ఉపమానాన్ని రూపొందించుకున్నాడు. తన శ్రోతలు దేవునితో తమ వాస్తవిక సంబంధాన్ని చూసుకునేందుకు వారి ముందు అద్దాన్ని పెట్టాడు. తన అభిప్రాయాన్ని ప్రాముఖ్యమైన దానిగా అందరికి సమర్పించేందుకు ఆయన అప్పుడు ప్రబలుతున్న అభిప్రాయాన్ని వినియోగించుకున్నాడు.ఆ అభిప్రాయమేంటంటే వ్యక్తికి విలువ తనకున్న సంపదను బట్టి రాదన్నది. ఎందుచేతనంటే అతడికున్నందంతా ప్రభువుతడికి ఇచ్చేందే. దేవున్ని ప్రేమించి ఆయన్ని విశ్వసించే మిక్కిలి దీనుడు. శ్రమలనుభవించే వాడికన్నా ఈ వరాల దుర్వినియోగం వ్యక్తిని తక్కువ స్థాయిలో ఉంచుతుంది.COLTel 216.1

    మరణించిన తరువాత మనుషుల ఆత్మకు రక్షణ కలగటం అసాధ్యమని తన శ్రోతలు గ్రహించాలని క్రీస్తు ఆకాంకక్షిస్తున్నాడు. సమాధానం చెబుతున్నట్లు చిత్రించబడుతున్న అబ్రాహాము “కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్లు సుఖము అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టము అనుభవించెనని జ్ఞాపకము చేసికొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు. నీవు యాతన పడుచున్నావు. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటి రాలేకుండునట్లు మాకును, మీకును మధ్య మహా ఆగాధముంచబడియున్నదని చెప్పెను. “రెండో కృపకాలం కొరకు చూడటం నిరర్ధకమని క్రీస్తు ఈరకంగా సూచించాడు. నిత్యజీవానికి సిద్ధపడటానికి మానవుడికి ఉన్నది. ఈ జీవితమే.COLTel 216.2

    తాను అబ్రాహము కుమారుణ్ణి కుమారుణ్ణి అన్న అభిప్రాయం ఈ ధనవంతుడికి ఉంది. కనుక తనకు కలిగిన దురవస్తలో సహాయం కోసం అబ్రాహాముకి మనవి చేసుకుంటున్నాడు. “తండ్రి వైన అబ్రాహామా, నాయందు కనికర” పడము అని వేడుకుంటు ఆన్నడు. అతడు దేవునికి ప్రార్ధన చెయ్యలేదు. అబ్రాహముకి చేసాడు. ఇలా అతడు అబ్రాహము దేవునికన్నా అధికుడని అబ్రాహాముతో తన సంబందము మీదే తన రొమ్ము ఆధారపడి ఉన్నదని సూచించాడు. సిలువ మీది దొంగ క్రీస్తుని “నీవు నీ రాజ్యముతో వచ్చునప్పుడు నన్ను జ్ఞాపకము చేసికొనుము” అని వేడుకున్నాడు.(లూకా 23:42) వెంటనే దానికి సమాధానం వచ్చింది. నీవు నాతో పరదైసులో ఉంటావని నేడు (సిలువ మీద అవమానాన్ని బాధను అనుభవిస్తూ వేలాడుతుండగా) నీతో నిశ్చయంగా చెబుతున్నాను. కాని ఆ ధనవంతుడు అబ్రహాముకి ప్రార్ధన చేసాడు. గాని అతడి మనవి సఫలం కాలేదు. “ఇశ్రాయేలునకు మారు మనస్సును పాప క్షమాపణ దయచే యుటకు...అధిపతినిగాను రక్షకునిగాను”క్రీస్తు మాత్రమే ఆధిక్యం పొందాల్సి ఉన్నాడు.అ.కా 5:31” మరి ఎవని వలన నురక్షణ కలుగదు” అ.కా 4:12COLTel 217.1

    ఈ ధనవంతుడు తన జీవితమంతా స్వార్థాశలు తీర్చుకోటానికే ప్రయాసపడి, నిత్యజీవానికి ఎలాంటి ఏర్పాట్లు చేసుకోలేదని చాల ఆసల్యంగా గుర్తించాడు. తన పొరపాటును గుర్తించి తన్ను తృప్తి పర్చుకోవటానికే తాను నివసించినట్లు తన సహోదరులూ అలాగే నివసిస్తారని భావించి వారి గురించి ఆలోచించి ఈ మనవి చేసాడు. “తండ్రీ అలాగైతే అయిదుగురు సహోదరులున్నారు. వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండ వారికి సాక్ష్యమిచ్చుటకై నా తండ్రి ఇంటిని వానిని (లాజరుని) పంపవలెనని నిన్ను వేడుకొనుచున్నాను”. అందుకు “అబ్రాహాము — వారి యొద్ద మోషేయు ప్రవక్తలును ఉన్నారు. వారి మాటలు వినవలెనని అతనితో చెప్పగా అతడు- తండ్రివైన అబ్రాహామా, అలాగే అనవద్దు, మృతులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన యెడల వారు మారుమనస్సు పొందుదురని చెప్పెను. అందుకతడు - మో షేయు ప్రవక్తలును (చెప్పిన మాటలు) వారు వినని యెడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని చెప్పెను”.COLTel 217.2

    ధనవంతుడు తన సహోదరుల నిమిత్తం అదనపు సాక్ష్యాన్ని అర్ధించినపుడు అది ఇచ్చినప్పటికి వారు నమ్మరని అతడికి స్పష్టంగా చెప్పటం జరిగింది. అతడి మనవి దేవుని మీద నిందమోపుతున్నది. నీవు నన్ను మరెక్కువగా హెచ్చరించి ఉంటే నేను ఇక్కడ ఉండేవాణ్నికాను అన్నట్లు ఉంది. ఈ మనవికి అబ్రహాము ఇచ్చినట్లు సూచించబడుతున్న సమాధానంలా ఇలాగుంది నీ సహోదరులికి కోకొల్లలుగా హెచ్చరిక అందింది. వారికి వెలుగు అందించటం జరిగింది. వారు దాన్ని చూడలేదు. వారికి సత్యాన్ని సమర్పించటం జరిగింది. వారు దాన్ని వినలేదు.COLTel 218.1

    “మోషేయు ప్రవక్తలును (చెప్పిన మాటలు) వారు వినని యెడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరు”. ఈ మాటలు యూదులు చరిత్రలో నిజమయ్యాయి. బేతనియువాడైన లాజరు మరణించిన నాలుగు రోజులు సమాధిలో ఉన్న తరువాత అతణ్ణి లేపటం క్రీస్తు అద్భుతాల్లో చివరిది. అద్భుతాలికి మకుటం వంటిది.రక్షకుని దైవత్వానికి నిదర్శనంగా యూదులికి ఈ అద్భుత నిదర్శనాన్ని చూపించాడు. లాజరు మృతుల్లో నుంచి లేచి వారి ముందు తన సాక్ష్యన్నిచ్చాడు. కాని వారు తమ హృదయాల్ని కఠినపర్చుకుని అతడి ప్రాణం తియ్యటానికి ప్రయత్నించారు. (యోహ 12:9-11) COLTel 218.2

    ధర్మశాస్త్రం, ప్రవక్తల వాక్కులు మానవ రక్షణకు దేవుడు నియమించిన సాధనాలు, మనుషులు ఈ నిదర్శనాన్ని శ్రద్ధగా పరిశీలించాలని క్రీస్తు చెప్పాడు. వాక్యంలోని దైవ స్వరాన్ని వినకపోతే మరణం నుంచి లేచిన వాని సాక్ష్యాన్ని సయితం వారు వినరు.COLTel 218.3

    మోషే మాటలు ప్రవక్తల మాటలు వినని వారికి దేవుని వద్ద నుండి మరింత వెలుగు అవసరం ఉండదు. మనుషులు వెలుగును నిరాకరంచి తమకు వచ్చే అవకాశాల్ని అభినందించకపోతే మరణించవారిలో ఒకడు లేచి తమకు వర్తమానం తెచ్చినా దాన్ని వారు అంగీకరించరు.ఈ నిదర్శనం సయితం వారికి నమ్మకం పుట్టించదు. ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని ప్రవక్తల మాటల్ని తోసి పుచ్చేవారు తమ హృదయాల్ని కఠినం చేసుకొని సమస్తజ్ఞానాన్ని విసర్జిస్తారు.COLTel 218.4

    అబ్రాహాము ధనవంతుడి మధ్య జరిగిన సంభాషణ ఉపమానరూపకం. ప్రతీ మనిషి తాను నిర్వర్తించాల్సిన బాధ్యతల్ని నిర్వహించటానికి చాలినంత వెలుగు పొందుతాడు అన్న పాఠాన్ని దీని నుంచి నేర్చుకోవాల్సి ఉంది. మానవుడి బాధ్యతలు అతడి అవకాశాలు అధికత్యల నిష్పత్తిలో ఉంటాయి . చిన్న వెలుగు తన విధిగా సూచించేదాన్ని ఆచరించడంలో ఒక వ్యక్తి విఫలుడైతే అతడికి మరింత వెలుగు వచ్చినా అది అతడికి వచ్చిన దీవెనల్ని వృద్ది పర్చుకోవటంలో చోటు చేసుకున్న అపనమ్మకాన్ని ఆశ్రద్ధను బయలుర్చుతుంది. “మిక్కిలి కొంచెములో నమ్మకంగా ఉండు వాడు ఎక్కవలోను నమ్మకముగా ఉండును. మిక్కిలి కొంచెములో నమ్మకమగా ఉండువాడు ఎక్కువలోను నమ్మకముగా ఉండును. మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోను అన్యాయముగా ఉండును'. లూకా 16:10 మోషే మాటల వలన ప్రవక్తల మాటల వలన వికాసం పొంటానికి నిరాకరిస్తూ ఏదో అద్భుతమైన సూచన క్రియను కోరేవారు ఆ కోరిక నెరవేరినా దాన్ని నమ్మరు.COLTel 219.1

    ధనవంతుడు లాజరు ఉపమానం ఈ ఇద్దరు మనుషులూ సూచించే తరగతుల ప్రజలను గూర్చి పరలోకంలో ఎలాంటి అంచాన ఉన్నదో చూచిస్తుంది. ధనం అక్రమంగా సంపాదించకపోతే ధవనంతుడై ఉండటం పాపం కాదు. సంపద కలిగి ఉన్నందుకు ధనికుణ్ణి తప్పు పట్టకూడదు. కాని తనకు దేవుడిచ్చన ధనాన్ని స్వార్ధ ప్రయోజనాల కోసం ఉపయో గించుకోవటం ఖండించాలి. అతడు తన ధనాన్ని మేలు చెయ్యటానికి ఉపయోగించటం ఎంతో మంచిది. ఇలా శాశ్వత సంపదను అన్వేషించివారి మరణం పేదల్ని చెయ్యలేదు. కాని ధనాన్ని అక్రమంగా కూడబెట్టి స్వార్ధానికి దాచుకునే వ్యక్తి దానిలో నుంచి ఏమీ పరలోకంలోకి తీసుకువెళ్ళలేడు. తాను అపనమ్మకమైన ధర్మకర్తగా నిరూపించుకుంటాడు. తన జీవిత కాలంలో అతడు తన కిష్టమైనట్లు సుఖాల్ని అనుభవించాడు కాని దేవుని పట్ల తనకున్న విధిని నిర్వహించటం మర్చిపోయాడు. పరలోకంలో ధనాన్ని కూర్చుకోవటంలో విఫలమయ్యాడు.COLTel 219.2

    అనేక అధిక్యతలున్న వ్యక్తిగా మనకు పరిచయమైన ధనవంతుడు, తన క్రియలు ఆ ఆనంత కాలానికి చేరి, మెరుగైన ఆధ్యాత్మిక దీవెనలు పొందేందుకు తన వరాల్ని వృద్ధిపర్చుకోవాల్సిన వ్యక్తిగా సూచించిబడు తున్నాడు. విమోచన ఉద్దేశం పాపాన్ని తుడిచివేయటమే కాదు. పాపం కలిగించే క్షీణత వల్ల నశించిన ఆత్మీయ వరాల్నిమోసుకుపోవటం కూడా సాధ్యాం కాదు. అక్కడ వాటి అవసరం ఉండదు. ఆత్మల్ని క్రీస్తు రాజ్యానికి సంపాదించటంలో చేసిన సత్కారాల్ని పరలోకంలోకి తీసుకువెళ్లాం. లేమిలో ఉన్న సాటి మనుషులికి సహాయం చెయ్యకుండా లోకంలో దేవుని పరిచర్య పురోగతికి ఏమి చెయ్యకుండా, దేవుడిచ్చిన వనరుల్ని తమ కోసం ఉప యోగించుకునేవారు తమ సృష్టికర్తను అవమానిస్తారు. పరలోక గ్రంథాల్లో వారి పేరులికి ఎదురుగా దేవున్ని దోచుకున్నట్లు రాయబడి ఉంటుంది.COLTel 220.1

    ధనవంతుడికి డబ్బు సంపాదంచగలిగినదంతా ఉన్నది గాని తన లెక్కలు దేవునితో సరిగా ఉంచగల ధనాన్ని అతడు సంపాదించలేదు. తనకున్నదంతా తనేదే అన్నట్లు నివసించాడు. అతడు దేవుని పిలుపును, శ్రమలను అనుభవిస్తున్న బీదవారి అవసరాల్ని లెక్క చెయ్యలేదు. తుదకు అతడు ఆలక్ష్యం చెయ్యలేని పిలుపు వచ్చింది. అతడు ప్రశ్నించలేని లేక ప్రతిఘటించలేని అధికారం అతణ్ణి తన గృహం విడిచి పెట్టాల్సిందిగా ఆదేశించింది. అతడు ఇక ఆ గృహ నిర్వాహకుడు కాడు. ఒకప్పుడు ధనవంతుడైన అతడు నిరు పేదగా మారాడు. పరలోక మగ్గాలపై వేసిన క్రీస్తు నీతి వస్త్రం అతణ్ణి కప్పలేదు. ఒకప్పుడు అతి విలువైన ఊదారంగు బట్టల్ని, సన్నపునార వస్త్రాల్ని ధరించిన అతడు దిగంబరిగా మారాడు. అతడి కృపకాలం అంతమయ్యింది. అతడు వస్తూ లోకంలోకి ఏమి తేలేదు. లోకంలో నుంచి వెళ్ళిపోతూ ఏమి పట్టుకు వెళ్లలేడు.COLTel 220.2

    తెరను తొలగించి యాజకులు, అధికారులు శాస్త్రులు, పరిసయ్యుల ముందు ప్రభువు ఈ చిత్రాన్ని సమర్పించాడు. లోక విషయాల్లోనే గాని దైవ సంబంధమైన విషయంలో ధనవంతులు కాని వారలారా, ఆచిత్రాన్ని వీక్షించండి. ఈ దృశ్యం గురించి మీరు ఆలోచించారా? మానవులు అతి ఘనమైన దానిగా అభిమానించేది దేవుని దృష్టికి హేయమైంది. క్రీస్తు ఇలా అంటున్నాడు. ‘ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పొగొట్టుకొనుట వానికేమి ప్రయోజము? మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలగును?” మార్కు 8:36,37COLTel 220.3

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents