Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
క్రీస్తు ఉపమాన ప్రబోధాలు - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    22—ఉచ్చరణ, ఆచరణ

    ఆధారం : మత్తయి 21:23-32

    ఒక మనుష్యునికి ఇద్దరు కుమారులుండిరి, అతడు మొదటి వాని యొద్దకు వచ్చి - కుమారుడా, నేను పోయి ద్రాక్ష తోటలో పనిచేయుమని చెప్పగా-వాడు పోను అని యుత్తరమిచ్చెను గాని పిమ్మట మనస్సు మార్చు కొనిపోయెను. అతడు రెండవ వాని యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు ఆయ్యా పోదుననెను గాని పోలేదు. ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారము చేసినవాడని వారినడిగెను.అందుకు వారు మొదటి వాడే అనిరి.COLTel 225.1

    కొండమీది ప్రసంగంలో క్రీస్తు ఇలాగన్నాడు. “ప్రభువా, ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపబడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును” మత్త 7:21 చిత్తశుద్ది పరీక్ష మాటల్లో కాదు చేతల్లో, ఇతరులకన్నా నీవు ఏమి ఎక్కువ చెప్పగలవు? అని అడగడు గాని మీరు ఎక్కువ చేయుచున్నదేమి?” అని క్రీస్తు అడుగుతాడు. మత్త 5:47 ఆయన పలికిన ఈ మాటలు ఎంతో భావయుక్తమైనవి. “ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసిన యెడల మీరు ధన్యులగుదురు”. యోహా 13:17 మాటల వెనుక సరి అయిన క్రియలుంటే తప్ప వాటికి విలువ ఉండదు. ఇద్దరు కుమారుల ఉపమానం బోధించే పాఠం ఇదే.COLTel 225.2

    తన మరణానికి ముందు క్రీస్తు యెరూషలేమును చివరిసారిగా సందర్శించినపుడు ఈ ఉపమానం చెప్పాడు.కొనే వారిని అమ్మేవారిని ఆలయంలో నుంచి వెళ్లగొట్టాడు.ఆయన స్వరం వారి హృదయాలతో దేవుని శక్తితో మాట్లాడింది.సాకుగాని ప్రతిఘటన గాని లేకుండా వారు ఆయన ఆజ్ఞను శిరసావహించారు. వారిని భయాశ్చర్యాలు ముప్పిరిగొన్నాయి.COLTel 225.3

    తన భయంపోయిన తరువాత, యాజకులు పెద్దలు ఆలయానికి తిరిగి వచ్చినప్పడు క్రీస్తు వ్యాధిగస్తుల్ని మరణిస్తున్నవారిని బాగు చెయ్యటం చూసారు. వారు సంతోషగానం, స్తుతిగానం చేస్తున్న స్వరాల్ని విన్నారు. స్వస్తత పొందిన చిన్న పిల్లలు ఈత మట్టలు ఊపుతూ దావీదు కుమారునికి హోసన్నా అంటూ ఆ ఆలయంలోనే పాటలు పాడారు.చిన్న పిల్లలు నంగి నంగి పలుకులు ఆ మహావైద్యుణ్ణి స్తోత్రించాయి. అయినా యాజకులు, పెద్దల్లో తిష్టవేసిన దురభిమానం అసూయాల్ని తొలగించా టానికి చాలలేదు మరుసటి దినం క్రీస్తు దేవాలయంలో బోధిస్తుండగా ప్రధానయాజకులు ప్రజలు పెద్దలు ఆయన వద్దకువచ్చి “ఏ అధికారము వలననీవు ఈ కార్యములు చేయుచున్నావు ? ఈ అధికారమెవడు నీకిచ్చెను”? అని ప్రశ్నించారు.COLTel 225.4

    క్రీస్తు శక్తి విషయమై యాజకులికి పెద్దలికి తిరుగులేని నిదర్శనం ఉ 0ది. ఆయ శుద్ధీకరణ చర్యలో ఆయన ముఖంలో పరలోకాధికారం మెరుపులా ప్రకాశించటం వారు చూసారు. ఆయన ఏ శక్తితో మాట్లాడాడో దాన్ని వారు ప్రతిఘటించలేకపోయారు. ఆద్భుతమైన స్వస్థతకార్యాల్లో వారి ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పాడు. తన అధికారానికి నిదర్శనం ఇచ్చాడు. అది తిరుగులేని నిదర్శనం. అయితే వారికి కావసినది నిదర్శనం కాదు. క్రీస్తు తన్ను తాను మెస్సియాగా ప్రకటించుకోవటం. దానికి అపార్ధాలు కల్పించి, ఆయన మాటల్ని తప్పుగా అన్వయించి ఆయన మీదికి ప్రజల్ని రెచ్చగొట్టాలన్నది యాజకులు పెద్దల ఎత్తుగడ, ఆయన ప్రభావాన్ని నాశనం చేసి ఆయన్ని మట్టు పెట్టాలన్నది వారి కోరిక.COLTel 226.1

    తనలో వారు దేవున్ని గుర్తించలేకపోతే,లేక తన కార్యాల్లో తన దివ్య ప్రవర్తన నిదర్శనాన్ని చూడకపోతే, తాను క్రీస్తునన్న తన సొంత సాక్ష్యాన్ని వారు నమ్మరని యేసు ఎరుగును. వారు ఎత్తాలని నిరీక్షించిన సమస్యను ఆయన తన జవాబులో దాటవేసి, ఖండనను వరి మీదికే తిప్పాడు.COLTel 226.2

    “నేనును మిమ్మునొక మాట అడుగుదును. అది మీరు నాతో చెప్పిన యెడల నేనును ఏ అధికారము వలన ఈ కార్యములు చేయుచున్నానో అది మీతో చెప్పుదును. యోహాను ఇచ్చిన బాప్తిస్మము ఎక్కడ నుండి కలిగినది ? పరలోకము నుండి కలిగినదా, మనుష్యుల నుండి కలిగినదా?COLTel 226.3

    యాజకులు అధికారులు ఆందోళన చెందారు. ‘వారు - మనము పరలోకము నుండి అని చెప్పితిమా, ఆయన - అలాగైతే మీరెందుకు అతని నమ్మలేదని మనలనడుగును. మనుష్యుల వలనని చెప్పితిమా, జనులకు భయపడుచున్నాము. అందరు యోహాను ప్రవక్త అని నమ్ముచున్నారని తమలో తాము ఆలోచించుకొని మాకు తెలియదని యేసునకుత్తరమిచ్చిరి అందుకాయన - ఏ అధికారము వలన ఈ కార్యములు నేను చేయుచున్నావో అదియు మీతో చెప్పెను'.COLTel 227.1

    “మాకు తెలియదు” ఇది అబద్దం. అయితే యాజకులు తాము పరిస్తితిని చూపి మన లోపాన్ని కప్పిపుచ్చుకోవటానిక అబద్దమాడారు. బాప్తిస్మమిచ్చే యోహాను తాము ఎవరి అధికారిన్ని ఇప్పుడు ప్రశ్నిస్తున్నారో ఆయన్ని గూర్చి సాక్ష్యమివ్వటానికి జన్మించాడు. “ఇదిగో లోక పాపమును మోసికొనిపోవు దేవుని గొట్టెపిల్ల ” అంటూ ప్రకటించాడు. (యోహా 1:29) యోహాను ఆయనకు బాప్తిస్మమిచ్చాడు. బాప్తిస్మం అనంతరం క్రీస్తు ప్రార్ధిస్తున్నప్పుడు ఆకాశం తెరవబడింది. దేవుని ఆత్మ పావురం రూపంలో ఆయన మీద వాలింది. పరలోకం నుంచి ఒక స్వరం “ఈయనే నా ప్రియకుమారుడు ఈయన యందు నేనానదించుచున్నాను” అనటం వినిపించింది (మత్త 3:17)COLTel 227.2

    మెస్సీయాని గూర్చిన ప్రవచనాన్ని యోహాను ఎలా వర్ణించాడో గుర్తుకు తెచ్చుకొని యేసు బాప్తిస్మమప్పటి సన్నివేశాన్ని జ్ఞానం తెచ్చుకొని యాజకులు, పెద్దలు యోహాను బాప్తిస్మం పరలోకం నుంచి కలిగిందని చెప్పటానికి భయపడ్డారు. తాము నమ్మినట్లు వారు యోహానుని ప్రవక్తగా గుర్తిస్తే నజరేయుడైన యేసు దేవుని కుమారుడన్న అతని సాక్ష్యాన్ని వారు ఎలా కాదనగలరు?అయినా యోహాను బాప్మితస్మం మనుషుల వలన కలిగిందన లేరు, ఎందుచేతనంటే యోహాను ప్రవక్త అని ప్రజలు నమ్మారు. అందుచేత యాజకులు “మాకు తెలియదు” అన్నారు.COLTel 227.3

    అప్పుడు క్రీస్తు, తండ్రి అతడి ఇద్దరు కుమారుల ఉపమానాన్ని చెప్పాడు. తండ్రి మొదటి కుమారుడి వద్దకు వెళ్ళి “నేడు పోయి ద్రాక్షతోటలో పని చేయుము” అన్నాడు. అతడు వెంటనే “పోను “అన్నాడు. విధేయు డవ్వలేదు. అతడు దుర్మార్గాల్లో దుష్ట సేవల్లో కొనసాగాడు కాని తరువాత మనస్సు మార్చుకొని ఆ పిలుపుకు విధేయుడయ్యాడు.COLTel 227.4

    తండ్రి రెండో కుమారుడి వద్దకు వెళ్ళి “నేడు పోయి ద్రాక్షతోటలో పనిచేయుము” అన్నాడు ఈకుమారుడు, ‘అయ్యా పోదును’ అన్నాడు గాని వెళ్ళలేదు.COLTel 228.1

    ఈ ఉపమానంలో తండ్రి దేవుని సూచిస్తున్నాడు. ద్రాక్షతోట సంఘం ఇద్దరు కుమారులూ రెండు తరగతులు ప్రజల్ని సూచిస్తున్నారు. ‘పోను’ అని చెప్పి తండ్రి ఆజ్ఞకు అవిధేయుడైన కుమారుడు బాహాటపు అతిక్రమంలో నివసించని వారిని, దైవ భక్తులమని చెప్పుకొనని వారిని దైవ ధర్మశాస్త్రం మోషే ఆంక్షలు, విధేయత కాడిని ఎత్తుకోవటానికి నిరాకరించిన వారిని సూచిస్తున్నాడు. అయితే వీరిలో అనేకమంది ఆతరువాత పశ్చాత్తాపపడి దేవుని పిలుపుకు లోబడ్డారు. ‘పరలోకరాజ్యము సమీపించియున్నది. మారుమనస్సు పొందుడి” అంటూ బాప్తిస్మమిచ్చే యోహాను వర్తమానంలో తమకు సువార్త వచ్చినప్పుడు వారు పశ్చాత్తాపపడి తమ పాపాల్ని ఒప్పుకున్నారు (మత్త 3:2)COLTel 228.2

    “అయ్యా పోదును” అని చెప్పి వెళ్ళని కుమారుడిలో పరిసయ్యుల ప్రవర్తన వెల్లడయ్యింది. ఈ కుమారుడిలాగ యూదు నాయకులు మారుమనస్సు పొందకుండా, స్వయం సమృద్ధత కలిగి నివసించారు. యూద జాతి ఆధ్యాత్మిక జీవితం ఒక నటనగా మారింది సీనాయి కొండ మీద దేవుడు తన ధర్మశాస్త్రాన్ని ప్రకటించినపుడు ప్రజలందరు విధేయులమై ఉంటామని ప్రమాణం చేసారు. వారు “అయ్యా పోదుము” అన్నారు గాని వెళ్ళలేదు. క్రీస్తు స్వయంగా వచ్చి ధర్మశాస్త్ర సూత్రాల్ని వారి ముందుంచినప్పుడు వారు ఆయన్ని నిరాకరించారు. తన దినాల్లోని యూద నాయకులను తన అధికారాన్ని శక్తిని గూర్చి ఆయన చాలా నిదర్శనాల్నిచ్చాడు. ఆయన అధికారాన్ని గురించి దివ్యశక్తి గురించి వారికి నమ్మిక కలిగినప్పటికి ఆ నిదర్శనాన్ని వారు అంగీకరించలేదు. తమకు విధేయ స్వభావం లేదు గనుక తాము అవిశ్వాసం కలిగి ఉన్నారని క్రీస్తు వారికి తెలిపారు. ఆయన వారికిలా వెల్లడించాడు. “మీరు మీ పారంపర్యాచారము నిమితము దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు... మనుష్యులు కల్పించిన పద్దతులను దైవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్ధముగా ఆరాధించుచున్నారు”. మత్త 15:6,9COLTel 228.3

    క్రీస్తు ముందున్న సభలో శాస్త్రులు పరిసయ్యులు యాజకులు అధికారులు ఉన్నారు. ఇద్దరు కుమారుల ఉపమానం చెప్పిన తరువాత క్రస్తు తన శ్రోతలను “ఈ యిద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారము చేసినవాడు”? అని ప్రశ్నించాడు. తమ్మును తాము మర్చిపోయిన పరిసయ్యులు “మొదటివాడే” అని జవాబిచ్చారు. తాము తమకు వ్యతిరేకంగా తీర్పు కటించుకుంటున్నామని గుర్తించకుండా ఈ జవాబు చెప్పారు. అప్పుడు క్రీస్తు ఈ ఖండనను వెల్లడించారు. “సుంకరులను వేశ్యలును మీ కంటే ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను నీతిమార్గమున మీ యొద్దకు వచ్చెను మీరతనిని నమ్మలేదు. అయితే సుంకరులు అతనిని నమ్మిరి; మీరు అది చూచియు అతనిని నమ్మనట్లు పశ్చాత్తాపపడకపోతిరి”.COLTel 229.1

    బాప్తిస్మమిచ్చే యోహాను సత్యాన్ని ప్రకటిస్తూ వచ్చాడు. అతడి భోధల వల్ల పాపులు మారుమనస్సు పొంది విశ్వాసులయ్యారు. గంభీర హెచ్చరికను స్వనీతితో ప్రతిఘటించిన వారికన్నా ముందు వీరు పరలోక రాజ్యంలో ప్రవేవిస్తారు. సుంకరులు వేశ్యలు అజ్ఞానులు, అయితే విద్యావంతులైన మీరు సత్యమార్గాన్ని ఎరిగినవారు. అయినా దేవుని పరదైసుకు నడిపే మార్గములో నడవటానికి వారు నిరాకరించారు. వారికి జీవార్ధమైన జీవపు వాసనగా ఉండాల్సిన సత్యం మరణార్ధమైన మరణపు వాసనయ్యింది. తమ్మును తాము అసహ్యించుకుంటున్న బహిరంగ పాపులు యోహాను చేతుల మీదుగా బాప్తిస్మం పొందారు. అయితే ఈ యాజక భోధకలు దొంగ భక్తులు, సత్యాన్ని అందుకోవటానిక వారి మంకు హృదయాలో ప్రతిబంధకం. దేవుని ఆత్మ కలిగించే నమ్మకాన్ని వారు ప్రతిఘటించారు. దేవుని ఆజ్ఞల్ని ఆచరించటానికి నిరాకరించారు. మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరని క్రీస్తు వారితో చెప్పలేదు. కాని ప్రవేశించటానికి వారికి ఆటంకముగానిలిచింది. తమ స్వయంకృతమేనని చెప్పాడు. యూదు నాయకులు ప్రవేశించేందుకు తలుపు ఇంకా తెరిచ ఉంది. ఆహహ్వానం అంగీకరించటానికి ఇంకా సమయం ఉంది. మారు మనస్సు పొంది తనను విశ్వసించాలనిక్రీస్తు అశగా ఎదురుచూస్తున్నాడు.COLTel 229.2

    “నీవు యాకోబు కుటుంబముతో.. తెలుపువలసినదేమనగా... మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన ననుసరించి నడిచిన యెడల మీరు సమస్త దేశజనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదేగదా మీరు నాకు యాజకరూపమైన రాజ్యముగాను పరిశద్దుమైన జనముగాను ఉందురు”. నిర్గ 19:3-6COLTel 230.1

    ఇశ్రాయేలు యాజకులు పెద్దలు తమ జీవితాలు మతపరమైన ఆచారకర్మల్లో గడిపారు. ఆ కర్మలు అతి పవిత్రమైనవి వాటిని లౌకిక వ్యాపారంతో కలపకూడదని భావించేవారు. కనుక తమ జీవితాలు పూర్తిగా మతానికి అంకితం కావాలని తలంచేవారు. అయితే లోకంచే భక్తిపరులు నీతిమంతులు అనిపిచంకునేందుకు వారు తమ ఆరాచకల్ని మనుష్యులికి కనిపించేటట్లు ఆచరించేవారు దైవ విధుల్ని ఆచరిస్తున్నట్లు చెప్పుకుంటూనే వారు దేవునికి అవిధేయులై నివసించారు. తాము ఉచ్చరించే సత్యాల్ని వారు ఆచరించలేదు.COLTel 230.2

    బాప్తిస్మమిచ్చే యోహాను ప్రవక్తలందరికన్నా అత్యధికుడని క్రీస్తు ప్రశంసిచారు. యోహాను దేవుని ప్రవక్త అని సూచించే ఎన్ని నిదర్శనాల్ని తన శ్రోతలకు సమర్పించాడు. ఆ ఆరణ్య బోధకుడి మాటలు గొప్ప శక్తి గలవి. అతడు తన వర్తమానాన్ని స్వేచ్చగా ప్రకటించాడు. యాజకులు అధికారుల పాపాల్ని మందలించి పరలోక రాజ్యకార్యాలు చేయాల్సిందిగా ఉద్బోదించాడు. తమకు నియమితమైన పనిని చెయ్యటానికి నిరాకరిం చటంతో తమ తండ్రి అధికారాన్ని ఆలక్ష్యం చేసి పాపం చేశారని వారిని ఖండించాడు. అతడు పాపంతో రాజీపడలేదు. అనేకులు తమ దుర్మార్గం విడిచి పెట్టి సన్మార్గాన్ని ఆవలంబించారు.COLTel 230.3

    యూదు నాయకులు చెప్పుకునేది వాస్తవమేతే వారు యోహాను బోధించిన సత్యాన్ని అంగీకరించి యేసును మెస్సీయగా స్వీకరంచేవారు. వారు పశ్చాత్తాప ఫలాన్ని చూపించలేదు. తాము ఎవరిని తృణీకరించి చి పెట్టి సన్మారాలు పాపంతో రాజీపలక్ష్యం చేసి పాపం ద్వేషిస్తున్నారో వారు వీరికన్నా ముందు దేవుని రాజ్యంలోకి తీసుకుంటూ వెళ్తున్నారు.COLTel 230.4

    ఉపమానంలో “అయ్యా పోదును” అన్న కుమారుడు తన్ను తాను నమ్మకమైన విధేయమైన వాడిగా చూపించుచున్నాడు. అయితే కొద్ది వ్యవధిలో అతడు చెప్పుకున్నది నిజం కాదని తేలింది. తండ్రి పట్ల అతడికి నిజమైన ప్రేమ లేదు. అలాగే పరిసయ్యులు తమ పరిశుద్ధతను గురించి అతిశయించారు. పరీక్షకు గురి అయ్యినప్పుడు అది కొదవగా కనిపించింది. తమకు కలసి వచ్చినప్పుడు ధర్మశాస్త్ర విధుల్ని వారు కఠినాతికఠినం చేసారు. అయితే వాటిని వారే ఆచరించాలి వచ్చినపుడు యుక్తితో కూడిన కుతంత్ర ముల ద్వారా వారు దేవుని ధర్మ శాస్త్రాల శక్తిని కుంటుపర్చారు. వారిని గురించి క్రీస్తు ఇలా అన్నాడు. “వారి క్రియల చొప్పున చేయకుడి; వారు చెప్పువారే గాని చేయరు”. మత్త 23:3 క్రీస్తు పట్ల గాని లేక మనుష్యుల పట్ల గాని వారికి ప్రేమలేదు. లోకానికి దీవెనగా ఉండటానికి తనతో కలిసి పనిచేయమని దేవుడు వారికి పిలుపునిచ్చాడు. అయితే ఆ పిలుపును అంగీకరించినట్లు చెప్పుకున్నా క్రియల్లో వారు అవిధేయులయ్యారు. వారు తమ్మును తాము నమ్ముకున్నారు. తాము మంచివారమని అతిశయంగా చెప్పుకున్నారు. కాని దేవుని ఆజ్ఞల్ని ఉల్లంఘించారు. తమకు దేవుడు నియమించిన పనిని చెయ్యటానికి నిరాకరించారు. తమ అతిక్రమం కారణంగా ఆ అవిధేయ జాతితో దేవుడు తెగతెంపులు చేసుకోవాటానికి సిద్ధంగా ఉన్నాడు.COLTel 231.1

    స్వనీతి నిజమైన నీతి కాదు. దాన్ని అంటిపట్టుకుని ఉండేవారు. ప్రాణాంతక వంచనను పట్టుకుని ఉన్నందు వల్ల కలిగే పర్యవసానాలు అనుభవించటానికి మిగిలిపోతారు. అనేకమంది తాము దేవుని ఆజ్ఞాలకు లోబడి నివసిస్తున్నట్లు చెప్పుకుంటారు. కాని తమ నుంచి ఇతరులికి ప్రవహించాల్సిన ప్రేమ వారికి లేదు. లోకాన్ని రక్షించటానికి తనతో కలసి పనిచెయ్యటానికి రావలసినదిగా క్రీస్తు వారిని పిలుస్తున్నాడు. కాని వారు “అయ్యా పోదును” అనటంతోనే తృప్తి చెందుతారు. కాని వెళ్ళరు. దేవుని సేవ చేస్తున్న వారితో సహకరించరు వారు సోమరులు, అపనమ్మకమైన కుమారడిలాగ వారు దేవునికి తప్పుడు వాగ్దానాలు చేస్తారు. సంఘం తాలూకు గంభీర నిబంధనను అంగీకరించటంలోను దేవుని వాక్యాన్ని స్వీకరించి అనుసరిస్తామని తమ్ముని తాము దేవుని సేవకు సమర్పించకుంటామని ప్రమాణం చేస్తారు.కాని ఆ పనిచెయ్యరు. తాము దేవుని బిడ్డలమని చెబు తారు గాని జీవితంలోను ప్రవర్తనలోను ఆయనతో తమకు సంబంధము లేదని చూపించుకుంటారు. వారు తమ ఇష్టాన్ని దేవుని ఇష్టం అదుపులో ఉంచరు వారిది బూటకపు జీవితం. COLTel 231.2

    తమ విధేయతలో ఎలాంటి త్యాగం లేనప్పుడు విధేయతా వాగ్దానాన్ని నెరవేర్చటానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తారు. కాని ఆత్మోపేక్ష ఆత్మత్యాగం అవసరమైనప్పుడు ఎత్తుకోవటానికి సిలువ ఉన్నట్లు చూసినప్పుడు వారు వెనకంజ వేస్తారు., ఈరకంగా విధి నిర్వహణాశక్తి క్షీణిస్తుంది. తెలిసిన దైవాజ్ఞాల ఉల్లంఘన అలవాటుగా మారుతంది. ఆధ్యాత్మిక పరమైన గ్రహణ శక్తి నశిస్తుం. హృదయం కఠినమౌతుంది మనస్సాక్షి అచేతనమౌతుంది.COLTel 232.1

    క్రీస్తు పట్ల మీరు వైరుధ్యం కనపర్చటంలేదు. గనుక మీరు ఆయన సేవచేస్తున్నట్లు భావించవద్దు. మనం మన ఆత్మల్ని ఇలాగే మోసం చేసుకుంటాం.తన సేవలో ఉపయోగించేందకు దేవుడిచ్చిన దాన్ని అది సమయమే గాని, ద్రవ్యమే గాని లేక ఇంకే ఇతర వరమేగ ఆని అట్టి పెట్టుకోవటం వల్ల మనకు మనం హాని చేసుకుంటాం.COLTel 232.2

    తన బలగాల్ని బలపర్చుకుని ఆత్మల్ని తన పక్కకు తిప్పుకునే ప్రయత్నంలో వారు సాతాను నిద్రమత్తులు సోమరిపోతులు అయిన నామమాత్రపు క్రైస్తవుల్ని వినియోగించుకుంటాడు. తాము క్రీస్తుకి వని ఏమి చెయ్యకపోయినా ఆయన పక్క ఉన్నామని తలంచే అనేకులు స్థలాన్ని ఆక్రమించి అధిక్యం సాధించేందుకు శత్రువుకి సాయం చేస్తారు. ప్రభువుకి నమ్మకంగా పనిచెయ్యటంలో తమ పరాజయం వల్ల విధులు పూర్తి చేయకుండా మాటలు మాట్లాడకుండా మౌనం దాల్చటం వల్ల క్రీస్తుని అంగీకరించవలసిన ఆత్మలు సాతాను అదుపులోకి వెళ్ళటానికి వారు దోహదపడతారు.COLTel 232.3

    మనం సోమరులం నిష్క్రియాపరులం అయితే మనకు రక్షణ ఉండదు. నిజంగా మారు మనస్సు పొందిన వ్యక్తి నిస్సహాయ, నిరర్ధక జీవితం వెళ్ళదియ్యటమన్నది లేదు. మనం పరలోకంలోకి అలా కొట్టుకు వెళ్ళటం అసాధ్యం. పరలోకంలోకి సోమరి ప్రవేశించటం జరగదు. మనం పరలోకం లోకి ప్రవేశించటానికి ప్రయాస పడకపోతే, దాని విధులు నిబంధనలు ఏమిటో వాటికి తెలుసుకోవటానికి చిత్తశుద్ధితో కృషి చెయ్యకపోతే దేవునితో సహకరించటానికి నిరాకరించే వారు పరంలోకంలో ఆయనతో సహకరించరు. వారిని పరలోకంలోకి తీసుకువెళ్ళటం క్షేమం కాదు.COLTel 233.1

    దేవుని వాక్యం తెలిసినా దాని ప్రకారం నివసించటానికి నిరాకరించే వారికన్నా సుంకరులికి పాపులికి ఎక్కువ నీరిక్షణ ఉంటుంది. తన పాపాన్ని కప్పిపుచ్చకుండా తన్ను తాను పాపిగా గుర్తించేవాడు. తన ఆత్మ శరీరం స్వభావం దుష్టతతో నిండి ఉన్నాయని గుర్తించేవాడు. తాను పరలోకం నుంచి నిత్యం వేరైపోతేనెమోనని ఆందోళనతో నిండి ఉంటాడు. అతడు తన వ్యాధిగ్రస్త పరిస్థితిని గుర్తించి “నా యొద్దకు వచ్చువానిని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయును” (యెహా 6:37) అన్న మహా వైద్యుడి స్వస్తతను అన్వేషిస్తాడు. ఈ ఆత్మల్ని ప్రభువు తన ద్రాక్షాతోటలో పనికి పెడ్తాడు. COLTel 233.2

    తండ్రి ఆజ్ఞకు విధేయుడవ్వటానికి కొంత సేపు నిరాకరించిన కుమారుణ్ణి క్రీస్తు ఖండించలేదు. ప్రశంసించలేదు కూడా. విధేయతను తిరస్కరించటంలో మొదటి కుమారుడి పాత్ర పోషించే తరగతి అలా వ్యవహరించినందుకు ప్రశంస పొందకూడదు. అది సత్యం వలన పరిశు ద్దత వలన పవిత్రమైతే క్రీస్తుకి సాక్షులుగా మనుషుల్ని ధైర్యంతో నింపుతుంది. కాని పాపి ఉపయోగించేటట్లు దాన్ని ఉపయోగిస్తూ అది పరాభవించటానికి ధిక్కరించటానికి దేవదూషణకు వినియోగమౌతుంది. ఒక వ్యక్తి వేషధారి కాకపోయినంత మాత్రాన అది అతణ్ణి తక్కువ పాపిని చెయ్యదు. పరిశు ద్దాత్మ విజ్ఞాపనలు వచ్చినపుడు వాటికి మనం వెంటనే సానుకూలంగా స్పందించటమే మనకు క్షేమం. “నేడు పోయి ద్రాక్షతోటలో పనిచేయుము” అన్న పిలుపు వచ్చినపుడు ఆ ఆహ్వానాన్ని తిరస్కరించవద్దు “నేడు మీరాయన మాట వినని యెడల మీ హృదయమను కఠినపర్చుకొనకుడి. హెబ్రీ 4:7 విధేయతను ఆలస్యం చెయ్యటం ప్రమాదకరం. ఈ ఆహ్వానాన్ని మళ్ళీ మీరెన్నడు వినకపోవచ్చు.COLTel 233.3

    దీర్ఘకాలంగా ప్రేమించిన పాపాల్ని కాలక్రమంలో సులభంగా మర్చిపోవచ్చునని ఎవరూ గొప్పల చెప్పుకుందురు గాక. ఇది జరగని పని. మనసులో తిష్టవేసిన ప్రతీ పాపం ప్రవర్తనను బలహీనపర్చి అలవాటును బలపర్చుతుంది.పర్యవసానంగా శారీరక, మానసిక, నైతిక భ్రష్టత చోటు చేసుకుంటుంది. మీరు చేసిన అపరాధం గురించి మీరు పశ్చాత్తాపపడి, మీ పాదాల్ని సన్మార్గంలో మోపవచ్చు. కాని మీ మూస ఆలోచన సరళి, దుష్టతతోను మీ పరిచయం తప్పొప్పల్ని గుర్తించటం కష్టతరం చేస్తుంది. మీరు నేర్చుకున్న చెడు అలవాట్లు ద్వారా సాతాను మీ పై పదే పదే దాడులు జరుపుతాడు.,COLTel 234.1

    “నేడు పోయి ద్రాక్ష తోటలో పనిచేయుము” అన్న ఆజ్ఞలో ప్రతీ ఆత్మకూ చిత్తశుద్ది పరీక్ష వస్తుంది. చేతలు మాటలకు దీటుగా ఉంటాయా? పిలువబడ్డవారు తమకున్న జ్ఞానాన్నతంటిని ద్రాక్షతోట యాజమానుడి కోసం నమ్మకంగా, స్వార్ధరహితంగా వినియోగిస్తారా?COLTel 234.2

    మన పని ప్రణాళికను గురించి అపోస్తలుడైన పేతురు ఉపదేశిస్తూ ఇలా అంటున్నాడు. “తనమహిమను బట్టియు, గుణాతిశయమును బట్టి మనలు పిలిచినవాని గూర్చిన అనుభవజ్ఞానమూలంగా ఆయన దైవశక్తి జీవమునకు భక్తి కిని కావలసినవాటిన్నిటిని మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టియు మన ప్రభువైన యేసును గూర్చినట్టియునైన అనుభవజ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించును గాక, ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్య ములును అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించియున్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వము ఈ వాగ్దానముల మూలంగా మీరు తప్పించుకొని దేవ స్వభావము నందు పాలివరగునట్లు వాటిని అనుగ్రహించెను.COLTel 234.3

    “ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై, మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును జ్ఞానముందు అశానిగ్రహమును, ఆశనిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తియందు సహోదర ప్రేమను, సహోదరి ప్రేమ యందు దయను అమర్చుకొనుడి”. 2 పేతు 1:2-7.COLTel 234.4

    మీ ఆత్మ ద్రాక్ష తోటను మీరు నమ్మకంగా సేద్యం చేస్తే మిమ్మల్ని దేవుడు తన జత పనివాణ్ని చేసుకుంటాడు. మీకోసమే కాకుండా ఇతరుల కోసం చెయ్యటానికి మీకొక పని ఉంటుంది. సంఘాన్ని ద్రాక్షతోటగా సూచించటంలో మనం మన సానుభూతిని సేవల్ని మన సంఘ సభ్యులికే పరిమితం చెయ్యాలని క్రీస్తు ప్రబోధించటం లేదు. ప్రభువు ద్రాక్షతోటనూ విస్తరింపజెయ్యాల్సి ఉంది. సంఘములోని అన్ని విభాగాల్ని విస్తరించాల్సి ఉంది. మనం దేవుని ఉపదేశాన్ని కృపను పొందే కొద్ది, విలువైన మొక్కల్ని ఎలా శ్రద్ధగా పెంచాలో ఇతరులికి మనం ఉపదేశించాలి. ఈ విధముగా మనం ప్రభువు ద్రాక్షతోటను విస్తరించవచ్చు. మన విశ్వాసం, ప్రేమ, ఓర్పులకు నిదర్శనాన్ని చూడటానికి దేవుడు ఆశగా ఎదురుచూస్తున్నాడు. అతిక్రమం అదామవ్వలు ఏ ఏదెను గృహంనుంచి తొలగించబడ్డారో ఆ పరదైసులో మనం ప్రవేశించేందుకు గాను లోకంలోని తన ద్రాక్ష తోటలో పనిచెయ్యటానికి నిపుణత గల పనివారు కావటానికి మనం ప్రతీ ఆధ్యాత్మిక వనరును వినియోగించుకుంటున్నామో లేదో ఆయన పరిశీలనగా చూస్తున్నాడు.COLTel 235.1

    తన ప్రజల పట్ల దేవుడు తండ్రి బాంధవ్యంతో వ్యవహిస్తారు. తండ్రిగా ఆయన మన నమ్మకమైన సేవల్ని కోరుకుంటున్నాడు. క్రీస్తు జీవితాన్ని పరిగణించండి. మానవజాతికి శిరసుగా నిలిచి ఆయన తండ్రికి సేవ చేస్తున్నాడు. ప్రతీ కుమారుడు ఎలాగుండాలి. ఎలాగుండవచ్చును అన్నదానికి ఆయన మనకు మాదిరి. క్రీస్తు చూపించిన విధేయత నేడు మనుషులు చూపించాల్సి ఉన్నారు. ఆయన ప్రేమతో, ఇష్టపూర్వకంగా స్వేచ్చగా తండ్రికి సేవ చేస్తాడు. “నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము నీ ధర్మశాస్త్రము నా అంతర్యములో నున్నది “(కీర్త 40:8) అని వెల్లడించాడు. తాను ఏ పని చెయ్యటానికి వచ్చాడో ఆ పనిని చెయ్యటానికి ఏ త్యాగము అతి గొప్పదిగాను, ఏ శ్రమ అతి కఠినమైందిగాను ఆయన పరిగణించలేదు. పన్నెండేళ్ళు ప్రాయమప్పుడు “నేను నా తండ్రి పనులు మీద నుండవలెనని మీరెరుగరా”? అన్నాడు. లూకా 2:49 ఆయన పిలుపును విన్నాడు. తన కర్తవ్యాన్ని చేపట్టాడు. నన్ను పంపినవాని చిత్తము నేరవేర్చుటయు, ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమైయున్నది” అన్నాడు యోహా 4:34COLTel 235.2

    దేవునికి మనం ఇలా సేవ చెయ్యాలి. అత్యున్నత ప్రమాణం గల విధేయత గలిగి పనిచేసినవాడు మాత్రమే ఆయనకు సేవ చేస్తాడు. దేవుని కుమారులు కుమార్తెలు అయిన వారందరూ దేవునితో క్రీస్తుతో పరలోక దూతలతో జతపనివారుగా నిరూపించుకోవలసి ఉన్నారు. ప్రతీ ఆత్మకు ఇది పరీక్ష. తన సేవ నమ్మకంగా చేసేవారి గురించి ప్రభువిలా అంటున్నాడు. ” నేను నియమింపబోవు దినము రాగా వారు నా వారై, నా స్వకీయ సంపాద్యమై యుందురు. తండ్రి తన్ను ప్రేమించు కుమారుని కనికరించునట్లు వారిని కనికరింతును “. మలా 3:17COLTel 236.1

    దేవుని కృపా సంకల్పం పరమోద్దేశం ఏమిటంటే మనుషుల్ని పరీక్షించి ప్రవర్తనను తీర్చి దిద్దుకోవటానికి వారికి తరుణం ఇవ్వటం. వారు తన ఆజ్ఞలకు విధేయులో అవిధేయులో ఇలా పరీక్షించి తెలుసుకుంటాడు. మంచి పనులతో దేవుని ప్రేమను కొనలేం. కాని మంచి పనులు మనం ఆప్రేమను కలిగి ఉన్నామని వెల్లడి చేస్తాయి. మనం మన చిత్తాన్ని దేవునికి సమర్పిస్తే దేవుని ప్రేమను సంపాదించటానికి క్రియలు చేయం. ఆయన ప్రేమను ఉచితపరంగా ఆత్మలోకి స్వీకరిస్తాం. అంతట ఆయనపట్ల ప్రేమ వలన ఆయన ఆజ్ఞల్ని గైకొనటానికి ఆనందిస్తాం.COLTel 236.2

    లోకంలో నేడు రెండు తరగతుల ప్రజలే ఉన్నారు. తీర్పులో రెండు తరగతులు మాత్రమే గుర్తింపు పొందుతాయి. దేవుని ధర్మశాస్త్రాన్ని అతిక్రమించేవారు. దానికి విధేయులై నివసించేవారు. మన నమ్మకాన్ని అపనమ్మకాన్ని పరీక్షించటానికి క్రీస్తు పరీక్ష పెడతాడు. ఆయన అంటున్నాడు. “మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు.. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేను వాని ప్రేమించి, వానికి నన్ను కనబరచుకొందును.. నన్ను ప్రేమింపనివాడు నా మాటలు గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాటకాదు, నన్ను పంపిన తండ్రిదే” “నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచియున్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనిన యెడల నా ప్రేమయందు నిలిచియందురు”. యెహా 14:15-24 15:10COLTel 236.3

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents