Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
క్రీస్తు ఉపమాన ప్రబోధాలు - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    12—ఇయ్యమని అడగటం

    ఆధారం : లూకా 11:1-13

    మనకు అందించేందకు క్రీస్తు నిత్యం తండ్రి వద్ద నుంచి ఉపదేశం పొందుతాడు.“మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే” అని క్రీస్తు అన్నాడు. యోహ 14:24 “మనుష్యకుమారుడు పరిచారము చేయుంచుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకు వచ్చెను”.మత్త 20:28 తన కోసం కాదు ఇతరుల కోసం ఆయన నివసించాడు. ఆలోచించాడు ప్రార్ధించాడు. ఆయన ప్రతీ ఉదయం తండ్రితో గంటలకొద్ది సమయం గడిపి ప్రజలకు పరలోకపు వెలుగును అందించటానికి బయటకి వచ్చేవాడు. ఏ రోజుకారోజు పరిశుద్దాత్మ బాప్తిస్మం పొందేవాడు. ప్రతీ ఉదయం పెందలాడే ప్రభువు ఆయన్ని గాధ నిద్రలో నుంచి లేపి, ఇతరులకందించేందుకు ఆయన ఆత్మను పెదవుల్ని కృపతో అభిషేకించేవాడు. ఆయనకు మాటలు తాజాగా పరలోకం నుంచి అందించబడేవి. అవి అలసిన వారికి బాధితులకు సరియైన సమయంలో అయన చెప్పాల్సిన మాటలు ఆయన ఇలా అన్నాడు. “అలసిన వానిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసియున్నాడు. శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతియుదయమును నాకు విను బుద్ది పుట్టించుచున్నాడు”. యోష 50:4COLTel 103.1

    క్రీస్తు ప్రార్ధనలు, దేవునితో సంప్రదించే అలవాటు, ఆయన శిష్యుల్ని ఎంతో ఆకట్టుకున్నాయి. ఒకరోజు వారు ఆయనతో లేని స్వల్ప వ్యవధిలో తండ్రితో విజ్ఞాపన చెయ్యటంలో ఆయన నిమగ్నమై ఉన్నట్లు కనుగొన్నారు. వారి సముఖాన్ని గుర్తించినట్లు గట్టిగా ప్రార్ధన చెయ్యటం కొనసాగించాడు. శిష్యుల హృదయాలు చలించాయి. ఆయన ప్రార్ధించటం చాలించాక వారు “ప్రార్ధన చేయుట నేర్పుము” అంటూ ఆయన్ని వేడుకున్నారు.COLTel 103.2

    జవాబుగా తన కొండమీది ప్రంసంగంలో ఇచ్చిన పరలోక ప్రార్ధనను వారికి పునరుచ్చరించాడు. తదనంతరము తాను వారికి నేర్పించిన ఉద్దేశించిన పాఠాన్ని, ఓ ఉపమానం ద్వారా ఉదహరించాడు.COLTel 104.1

    ఆయన అన్నాడు. “మీలో ఎవనికైన ఒక స్నేహితుడుండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి స్నేహితుడా, నాకు మూడు రొట్టెలు బదులిమ్ము. నా స్నేహితుడు ప్రయానము చేయుచూ మార్గములో నా యొద్దకు వచ్చియున్నాడు. అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమియు లేదని అతనితో చెప్పిన యెడల అతడు లోపలనేయుండి - నన్ను తొందర పెట్టవద్దు, తలుపువేసియున్నది. నా చిన్న పిల్లలు నాతో కూడా పండుకొని యున్నారు, నేను లేచి ఇవ్వలేనని చెప్పనా? అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగట వలనైనను లేచి అతనికి కావలసినవన్నియు ఇచ్చును”.COLTel 104.2

    ఇక్కడ క్రీస్తు ఇవ్వమంటూ మళ్ళీ బతిమాలుతున్న మిత్రుణ్ణి సూచిస్తు న్నాడు. అతడికి రొట్టె అవసరం. లేకపోతే ఆలస్యంగా వచ్చిన ప్రయాణికుడి అవసరాన్ని తీర్చలేడు. తన పక్కింటి మిత్రుడు ఇబ్బందికి గురి అవ్వటానికి సముఖంగా లేకపోయినప్పటికి, తన మనవిని విరమించుకోలేదు. తన స్నేహితుడి ఆకలి తీర్చాలి. అతడు విడవకుండా చేసిన మనవికి తుదకు ప్రతిఫలం లభించింది. అతడి అవసరాలు తీరాయి.COLTel 104.3

    ఆ రీతిగానే శిష్యులు దేవుని దీవెనల్ని అడిగి పొందాలి. జనసమూహానికి ఆహారం పెట్టడంలోను, పరలోకం నుంచి వచ్చే ఆహారంపై ప్రసంగంలోను క్రీస్తు వారికి తన ప్రతినిధులుగా తాము చేయ్యాల్సిన పరిచర్యను వివరించాడు. వారు ప్రజలకి జీవాహారాన్ని ఇవ్వాల్సి ఉన్నారు. వారికి తమ కర్తవ్యాన్ని బోధించిన ఆయన వారి విశ్వాసం ఎంత తరుచుగా పరీక్షకు గురి కాబోతుందో చూసాడు. వారు అనుకొని పరిస్థితుల్ని ఎదుర్కొటం, తమ మావన అసమర్ధతతను గుర్తించటం తరుచు జరగవచ్చు. జీవాహారం కోసం ఆకలిగా ఉన్నవారి వారి వద్దకు వస్తారు. తాము దిక్కులేనివారమని, భవిష్యత్తులేనివారమని వారు భావిస్తారు. వారికి ఆధ్యాత్మిక ఆహారం అవసరం. తమకు లేకపోతే వారు ఇవ్వలేరు. ఒక్క ఆత్మను కూడా ఆహారం పెట్టకుండా పంపకూడదు. వారిని క్రీస్తు సర్వసమృద్ధిగల మూలానికి నడిపిస్తున్నాడు. ఎవరి మిత్రుడు ఆతిథ్యం కోసం అర్ధరాత్రిపూట, అనుకూల సమయంలో వచ్చాడో అతడు తన మిత్రుణ్ణి వెళ్ళిపొమ్మనలేదు. తన అతిథికి పెట్టటానికి అతడి వద్ద ఏమి లేదు. కాని అతడు హారం ఉన్న మరొకడి వద్దకు వెళ్ళి అతడు తనకవసరమైన దాన్నిచ్చే వరకు మానకుండా ఆర్దించాడు. ఆకలిగా ఉన్నవారికి ఆహారం పెట్టటానికి తన సేవకుల్ని పంపిన దేవుడు తన సొంత సేవ నిమిత్తం అవసరాల్ని తీర్చడా?COLTel 104.4

    ఉపమానంలోని స్వార్ధపరుడైన పొరుగువాడు దేవుని ప్రవర్తనను సూచించడం లేదు. ఇక్కడ సరిపోలిక నుంచి కాక బేధం నుండి పాఠం నేర్చుకోవటం అవసరం. ఒక స్వార్ధపరుడు తన విశ్రాంతికి అంతరాయం కలిగిస్తున్న వ్యక్తిని ఒదిలించుకునేందుకు అతడి అత్యవసర పనికి స్పందిస్తాడు. కాగా ఇవ్వటమే దేవునికి అమితానందం. ఆయన దయామయుడు. విశ్వాసంతో తన వద్దకు వచ్చేవారి మానవుల్ని ఆకాంక్షల్ని తీర్చటానికి ఆయన ఎదురుచూస్తాడు. మనం ఇతరులికి పరిచర్య చేసేందుకు ఆవిధముగా తన వలె ఉండేందుకు ఆయన మనకు ఈవులిస్తాడు.COLTel 105.1

    “అడుగుడి మీకియ్య బడును, వెదకుడి, మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివానికియ్యబడును. వెదకువానికి దొరకును, తట్టువానికి తీయబడును” అన్నాడు క్రీస్తు.COLTel 105.2

    రక్షకుడు ఇంకా ఇలా అంటున్నాడు “మీలో తండ్రియైనవాడు తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా? గుడ్డునడిగితే తేలునిచ్చునా? కాబట్టి మీరు చెడ్డవారైయుండియు, మీ పిల్లకు మంచి యూవులనియ్యనెరిగియు పరలోకముందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్దాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును”.COLTel 105.3

    దేవుని పై మన నమ్మకాన్ని పట్టిష్టపర్చటానికి తనను కొత్త పేరుతో పిలవటానికి క్రీస్తు మనకు నేర్పిస్తున్నాడు. అది మానవ హృదయానికి ఎంతో ప్రియమైన అనుబంధంతో ముడిపడ్డ పేరు, అనంతదుడైన దేవున్ని తండ్రి అని పిలవటానికి ఆయన మనకో ఆధిక్యత ఇస్తున్నాడు. ఆయన్ని సంభోధించే ఈ పేరు ఆయనపట్ల మన ప్రేమకు, మనపట్ల ఆయన వాత్సల్యానికి, బాంధవ్యానికి సంకేతం. ఆయన ప్రసన్నత కోసం లేక దీవెన కోసం వేడుకునేటప్పుడు మనం ఉచ్చరించే ఈ సంబోధన ఆయన చెవులకి సంగీతంలా ఉంటుంది. ఆయన్ని ఈ పేరుతో సంభంధించటం దురహంకారమని మనం భావించకుండేందుకు, దాన్ని ఆయన మళ్ళీ మళ్లీ ఉచ్చరించాడు. ఈ సంబోధనకు మనం అలవాటుపడాలని ఆయన ఆకాంక్షిస్తున్నాడు.COLTel 105.4

    మనల్ని దేవుడు తన పిల్లలుగా పరిగణిస్తాడు. మనల్ని ఆ జాగరుగా లోకంలో నుంచి విమోచించి రాచకుటుంబలో సభ్యులుగా పరలోక రాజు కుమారులు కుమార్తెలుగా ఉండటానికి ఎంపిక చేసుకున్నాడు. లోకంలో ఒక బిడ్డ తన తండ్రిని నమ్మేదానికన్నా మన నమ్మకం ఆయనై మరింత లోతుగా మరింత పటిష్టంగా ఉండాలని దేవుడు వాంఛిస్తున్నాడు. తల్లితండ్రులు తమ పిల్లల్ని ప్రేమిస్తారు. కాని దేవుని ప్రేమమానవ ప్రేమకన్నా మరింత విశాలంగా మరింత లోతుగా ఉంటుంది. అది కొలవటానికి సాధ్యపడనిది. అలాగైనప్పుడు, లౌకికమైన తల్లితండ్రులు తమ బిడ్డలకి మంచి ఈవులు ఇవ్వటం ఎరిగితే, ఎవరైతే తన్ను కోరతారో వారికి పరిశు ద్దాత్మను ఇవ్వటానికి దేవుడు ఎంతో సిద్ధంగా ఉంటారు.COLTel 106.1

    ప్రార్ధన విషయంలో క్రీస్తు బోదించిన పాఠాల్ని జాగ్రత్తగా పరిగణించటం అవసరం. ప్రార్ధనలో దైవికమైన విజ్ఞానశాస్త్రం ఉంది. ఆయన ఉదాహరణ అందరు గ్రహించాల్సిన సూత్రాల్ని మన దృష్టికి తెస్తున్నది. ప్రార్ధన వాస్తవిక స్వభావమేమిటో ఆయన చూపిస్తున్నాడు. మన మానవులను ఎడతెగకుండా దేవునికి విన్నవించుకోవటం అవసరమని, ఆయన మన ప్రార్ధనను విని ప్రతిఫలమివ్వటానికి సిద్ధంగా ఉన్నాడని క్రీస్తు బోధిస్తున్నాడు.COLTel 106.2

    మన ప్రార్ధనలు ఏ స్వార్ధ ప్రయోజనాలకు మనవులు కాకూడదు. అవి కేవలం మనకు లాభం చేకూర్చటానికి కాకూడదు. మనం మనవి చేసేవి ఇతరులకిచ్చేందుకై ఉండాలి. క్రీస్తు జీవిత సూత్రం మన జీవిత సూత్రం కావాలి. తన శిష్యుల గురించి మాట్లాడుతూ ఆయన “వారును సత్యమందు ప్రతిష్ట చేయబడునట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ట చేసికొనుచున్నాను” అన్నాడు. యోహా 17:19 క్రీస్తు కనపర్చిన అదే భక్తి, అదే ఆత్మ త్యాగస్పుర్తి, దైవవాక్యం నిర్దేశించే విధుల నిర్వహణ పట్ల అదే నిబద్ధత, ఆయన సేవకుల్లో కనిపించాలి. లోకంలో మన కర్తవ్యం స్వార్ధ ప్రయోజన సాధనగా ఆత్మ సంతృప్తి కాదు. పాపుల్ని రక్షించటంలో దేవునితో సహకరించటం ద్వారా దేవున్ని మహిమపర్చటం. ఇతరులికి ఇచ్చేందుకే మనం దేవుని దీవెనలకు మనవి చెయ్యాలి. ఇవ్వటం ద్వారానే అందుకునే సామర్ధ్యాన్ని కాపాడుకోగలుతాం. మన చుట్టుపట్ల ఉన్నవారికి ఇవ్వకుండా మనం పరలోక ఐశ్వర్యాన్ని అందుకోవటం కొనసాగించలేం.COLTel 106.3

    ఉపమానంలోని వినతిదారుడు మళ్ళీ మళ్ళీ తిరస్కతిని ఎదుర్కున్నాడు. కాని అతడు తన కర్తవ్యాన్ని విరమించుకోలేదు. అదే విధముగా మన ప్రార్ధనలకు తక్షణ ఫలం ఎల్లప్పుడు రాకపోవచ్చు. అయినా మనం ప్రార్ధించటం మానకూడదని క్రీస్తు బోధిస్తున్నాడు. ప్రార్థన దేవునిలో మార్పు తేవటానికి కాదు. దేవునితో మనకు సామరస్యం కూర్చటానికి మనం ఆయనకు మనవి చేసుకున్నప్పుడు, మన హృదయాల్ని పరిశోధించుకుని పాపం నిమిత్తం పశ్చాత్తాపపడటం అవసరమని ఆయన చూడవచ్చు. కనుక మనకు పరీక్షలు శ్రమలు రానిస్తాడు. మన ద్వారా పరిశుద్దాత్మ పనిచెయ్యటానికి ఏది అడ్డు తగులుతున్నదో మనం చూసేందుకు మనం పరాభవం సిగ్గు కలుగనిస్తాడు.COLTel 107.1

    దేవుని వాగ్దానాల నెరవేర్పుకి షరతులున్నాయి. విధి నిర్వహణ స్థానాన్ని ప్రార్ధన ఆక్రమించలేదు. “మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు”. అన్నాడు క్రీస్తు. “నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకనువాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేనును వానిని ప్రేమించి వానికి నన్నుకనపర్చకొందును.” యోహా 14:15,21 దేవుని వాగ్దానాలకు షరతులు నెరవేర్చకుండా వాటి నెరవేర్పు కోరుతూ తమ మనవులు ఆయన వద్దకు తెచ్చేవారు యోహావాను అవమానిస్తున్నారు. వాగ్దాన నెరవేర్పుకి తమకున్న అధికారంగా వారు క్రీస్తు నామాన్ని ఎత్తుతారు గాని క్రీస్తు పై తమ హక్కుగా విశ్వాసాన్ని సూచించే కార్యాలు చేయరు. ప్రేమను చూపించరు.COLTel 107.2

    తండ్రి అంగీకారానికి గల షరతును అనేకమంది నెరవేర్చలేకపోతున్నారు. మనం ఏ విశ్వాస క్రియను బట్టి దేవుని సమీపించగలుగుతామో దాన్ని మనం నిశితంగా పరీక్షించుకోవటం అసవరం. డబ్బు చెల్లింపుకి గల షరతుల్ని నెరవేర్చకుండా ప్రభు వద్దకు ఒక చెక్కును తెచ్చినట్లే ప్రభువు వద్దకు ఆయన వాగ్దానాల్ని తెచ్చి, వాటిని నెరవేర్చమని ఆర్ధిస్తాం. అయితే వాటిని నెరవేర్చటం వల్ల ఆయన తన నామాన్ని అగౌరవపర్చుకుంటాడు.COLTel 108.1

    ఆయన వాగ్దానం ఇది, “నాయందు మీరును మీయందు నా మాటలును నిలిచియుండిన యెడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును.” యోహా 15:7 యోహానిలా అంటున్నాడు. “మరియు మనమాయన ఆజ్ఞలను గైకొనిన యెడల దీని వలననే ఆయను ఎరిగియున్నామని తెలిసికొందుము. ఆయనను ఎరిగియున్నామని చెప్పుకొనుచు, ఆయన ఆజ్ఞాలను గైకొననివాడు లబ్ధికుడు, వానిలో సత్యము లేదు. ఆయన వాక్యము ఎవడు గైకనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను” 1 యోహా 2:3-5.COLTel 108.2

    క్రీస్తు తన శిష్యులికిచ్చిన వారి ఆజ్ఞల్లో ఒకటి “నేను మిమ్మును ప్రేమించినట్లే మీరును ఒకనినొకడు ప్రేమింపవలెను” అన్నది యోహను 13:34. ఈ ఆజ్ఞను మనం ఆచరిస్తున్నామా? ఏ రూపంలోనైనా మనం ఇతురుల్ని గాయపర్చినట్లయితే, మన పొరపాటును ఒప్పుకొని సమాధానం కోసం ప్రయత్నించటం మన విధి,. ఆయన దీవెనలు ఆర్థిస్తూ విశ్వాసపూర్వకంగా ప్రభువు సన్నిధికి రాకముందు జరగాల్సిన ముఖ్యమైన సిద్దబాటు ఇది.COLTel 108.3

    ప్రార్ధన ద్వారా ప్రభువుని అన్వేషించేవారు తరుచు నిర్లక్ష్యం చేసే అంశం ఇంకొకటి ఉంది. మీరు దేవునితో నిజాయితీగా వ్యవహరిస్తున్నారా? మలాకీ ప్రవక్త నోట ప్రభువిలా అంటున్నాడు. ‘మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని తోసివేసితిరి; అయితే మీరు నా తట్టు తిరిగిన యెడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకధిపతియగు యెహోవా సెలవియ్యగా- మేము దేని విషయంలో తిరుగుదుమని మీరందరు. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితిమని మీరందరు. పదియవ భాగమును ప్రతిష్టాతార్పణలను ఇయ్యక దొంగిలిరి”. 3:7,8.COLTel 108.4

    ప్రతీ దీవెనను ఇచ్చేవాడుగా దేవుడు మన ఆస్తి అంతటిలో కొంత భాగము తనదంటున్నాడు. సువార్త ప్రకటనకు పోషణకు ఇది ఆయన ఏర్పాటు. ఈ భాగం దేవునికి తిరిగి అప్పగించటం ద్వారా ఆయన ఈవుల్ని అభినంది స్తున్నట్లు మనం చూపించకుంటాం. కాగా ఆయనకు చెందేది ఇవ్వకుండా మనం అట్టి పెట్టుకుంటే, ఆయన దీవెనల్ని ఎలా పొందగలం? ఐహిక విషయాల్లో మనం అపనమ్మకమైన గృహ నిర్వాకులమైతే, ఆయన పరలోక విషయాలు మనకు అప్పగించాలని ఎలా ఎదురుచూడగలం? బహుశా విఫల ప్రార్ధన రహస్యం ఇక్కడుందేమో!COLTel 109.1

    అయితే ప్రభువు తన అపార కృపవల్ల క్షమించటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఇలా అంటున్నాడు.“నా మందరిములో ఆహరముండినట్లు పదియవ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి దీని చేసి మీరు నన్ను శోధించిన యెడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదను... మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించెదను. అవి మీ భూ పంటను నాశనము చేయవు. మీ ద్రాక్ష చెట్లు ఆకాలఫలములను రాల్పకయుండును.. అప్పుడు ఆనందకరమై దేశములో మీరు నివసింతురు గనుక అన్యజనులందరును మిమ్మును ధన్యులందురని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు”. మలా 3:10-12COLTel 109.2

    దేవుని నిబంధనలు ప్రతీ దాని విషయంలోను ఇలాగే. ఆయన వరాలన్ని విధేయత షరతుల పై వాగ్దానం చెయ్యబడ్డాయి. ఆయనతో సహకరించేవారికి ఇవ్వటానికి దేవునికి పరలోకం నిండా దీవెనలు ఉన్నాయి. ఆయనకు విధేయులై నివసించే వారందరు ఆయన వాగ్దానాల నెరవేర్పును ధైర్యంగా కోరవచ్చు.COLTel 109.3

    అయితే మనం దేవుని పై అంచలంచలమైన నమ్మకం కనపర్చాలి. మన విశ్వాసాన్ని పరీక్షంచటానికో లేక మన కోరిక నిజాయితీని నిగ్గు తేల్చటానికో మనకు జవాబివ్వటం ఆయన తరుచు ఆలస్యం చేస్తాడు. మన మనవులు ఆయన వాక్యానుసారంగా చేసిన తరువాత ఆయన వాగ్దానాలు నమ్మి ఆ మీదట మన మానవుల్ని కాదనలేనంత ధృడ నిశ్చయతతో సమర్పించాలి.COLTel 109.4

    ఒకసారి అడగండి మీరు పొందుతారు అనటంలేదు దేవుడు. మనల్ని అడగమంటున్నాడు. అలసిపోకుండా ప్రార్ధన చెయ్యండి. విడువకుండ ఆర్దించటం వినతిదారుడికి మరింత పట్టుదల గల వైఖరినిచ్చి తాను కోరిన వాటిని పొందటానికి బలమైన కోరికను నింపుతుంది. లాజరు సమాధి వద్ద మార్తాతో క్రీస్తు “నీవు నమ్మిన యెడల దేవుని మహిమను చూతువు” అన్నాడు యోహా 11:40COLTel 110.1

    కాని అనేకులకు నిజమైన విశ్వాసం లేదు. అందుకే వారికి దేవుని శక్తి ఎక్కువగా ప్రదర్శితమవ్వటంలేదు. వారి బలహీనతకు కారణం వారి అవిశ్వాసమే. దేవుడు తమ పక్షంగా పనిచెయ్యటం పై కాక తమ సొంత కృషి మీద ఆధారపడతారు. వారే తమ భధ్రత బాధ్యతను వహిస్తారు. వారు ప్రణాళికలు రచిస్తారు. పథకాలు తయారు చేస్తారు. కాని ప్రార్ధన చెయ్యరు దేవుని మీద నమ్మకం అసలే ఉంచరు. తమకు విశ్వాసమున్నదని అనుకుంటారు. కాని అది తాత్కలికమైన భావోద్రేకం మాత్రమే. తమ సొంత అవపరమేంటో గుర్తించి ఇవ్వటానికి దేవుని సంసిద్ధతను పరిగణించి తమ మానవుల్ని దేవునికి పట్టుదలతో సమర్పించరు.COLTel 110.2

    అవసరంలో ఉన్న స్నేహితుడి కోసం మధ్యరాత్రిలో రొట్టెలడిగిన వినతిదారుడి మనవిలా మన ప్రార్ధనలు చిత్తశుద్ది పట్టుదల కలిగి ఉండాలి. మనం ఎంత నిజాయితీగా నిలకడగా మనవి చేస్తామోక్రీస్తుతో మన ఆధ్యాత్మికానుబంధం, ఐక్యత అంత సన్నిహితంగా ఉంటుంది. మనకు ఎక్కవ విశ్వాసం ఉంది కాబట్టి మనం ఎక్కువ దీవెనలు పొందుతాం.COLTel 110.3

    మనం పోషించాల్సిన పాత్ర ప్రార్ధించటం విశ్వసించటం, మెళుకవగా ఉండి ప్రార్ధించటం, మెళుకవగా ఉండి ప్రార్ధన వినే దేవునితో సహకరిం చటం. మనం “దేవుని జతపనివారమైయున్నాము” (1 కొరింథి 3:9) అని గుర్తుంచుకోవటం, మీ ప్రార్ధనలకు అనుగుణంగా మాట్లాడాలి, ప్రవర్తించాలి. మీ విశ్వాసం యధార్ధమైందని మీ ప్రార్ధనలు కేవలం ఆచారబద్దమైనవి కావని ఆ పరీక్ష నిగ్గుతేల్చటం మీ విషయంలో ఎంతో ప్రాముఖ్యాన్ని సంతరించుచుకుంటుంది.COLTel 110.4

    మీకు ఆందోళనలు కష్టాలు కడగండ్లు ఎదురైనప్పుడు సహాయం కోసం మానవుల్ని ఆశ్రయించకండి. దేవుని మీద విశ్వాసముంచండి. మన కష్టాల్ని సమస్యల్ని ఇతరులికి చెప్పుకునే అలవాటు మనల్ని బలహీనపర్చతుంది. అది వారికి కూడా ఎలాంటి శక్తినివ్వదు. అది మన ఆధ్యాత్మిక బలహీనతల బరువును వారి మీద మోపుతుంది. ఆ బరువును వారు తీసివేయలేరు. మనకు ఎన్నడు పొరపాటు చేయునివాడు. నిత్యం జీవించేవాడు అయిన దేవుని మహాశక్తి బలాలు అందుబాటులో ఉండగా తప్పులు చేసే మనుష్యులు, మూర్కుల అండదండాల్ని బలాన్ని మనం వెదకుతుంటాం. COLTel 111.1

    జ్ఞానం కోసం మీరు భూదిగంతాలకి వెళ్ళనవసరం లేదు. ఎందుకంటే దేవుడు దగ్గరలోనే ఉన్నాడు. మీకు జయాన్నిచ్చేది ఇప్పుడు మీకున్న ప్రతిభావంతులు గాని లేక భవిష్యత్తులో మీకుండబోయే సామర్ధ్యాలు గాని కాదు దేవుడు మీకు ఏమి చెయ్యగలడో అది మీకు జయాన్నిస్తుంది. విశ్వసించే ప్రతీ ఆత్మకు మానవుడు ఏమి చెయ్యగలడు అన్నదానికన్నా దేవుడు ఏమి చెయ్యగలడు అన్నదాని మీద మరెక్కువ నమ్మకం ఉండాలి. మీరు ఆయన్ని విశ్వాసం ద్వారా వెంబడించాలన్నది దేవుని కోరిక, మీరు తన మంచి గొప్ప కార్యాలకు ఎదురు చూడాలన్నది ఆయన కోరిక. ఐహిక విషయాలపైన ఆధ్యాత్మిక విషయాల పైన మీకు అవగాహన కలిగించాలని ఆయన ఆశగా ఎదురుచూస్తున్నాడు. ఆయన మీ మానసిక శక్తుల్ని చైతన్యవంత చెయ్యగలడు. ఆయన నేర్పునిపుణతతో మీ వరాల్ని వినియోగించండి. జ్ఞానం కోసం దేవున్ని వేడుకొండి. ఆయన మీకు జ్ఞానాన్నిస్తాడు.COLTel 111.2

    క్రీస్తు మాటను భరోసగా తీసుకోండి తన వద్దకు రమ్మని ఆయన మిమ్మల్ని ఆహ్వానించలేదా? నీరీక్షణ లేనట్లు, ఆధైర్యపడ్డట్లు ఎన్నడు మాట్లాడవద్దు. అలా చేస్తే మీకు ఎక్కువ నష్టం కలుగుతుంది. కష్టాలు ఒత్తిడులు వచ్చినప్పుడు కనిపించే వాటిని చూసి ఫిర్యాదులు చెయ్యటం ద్వారా మీరు మీ వ్యాధిగ్రస్తమైన బలహీనమైన విశ్వాసాన్ని ప్రదర్శించు కుంటారు. మీ విశ్వాసం అజేయమయ్యిందిగా మాట్లాడండి. వ్యవహ రించండి ప్రభువుకి విస్తారమైన వనరులున్నాయి. ఆయన ప్రపంచానికి యాజమాని హక్కుదారుడు, విశ్వాసంతో కన్నులెత్తి ఆకాశంవైపు చూడండి వెలుగు అధికారం సామర్ధ్యం గల ఆ ప్రభువును వీక్షించండి.COLTel 111.3

    కాలం గాని శ్రమగాని బలహీనపర్చజాలని, ఉల్లాసం, నియమ నిశ్చలత, సంకల్ప ధృడత నిజమైన విశ్వాసంలో ఉన్నాయి. “బాలురు సొమ్ముసిల్లు దురు ఆలయుదురు యౌవనస్థులు తప్పక తొట్రిల్లుదురు. యెహెూవా కొరకు ఎదురు చూచువారు నూనత బలము పొందుదురు. వారు పక్షిరాజులవలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరుగెత్తుదురు. సొమ్మసిల్లక నడిచిపోవుదురు”. యెష 40:31,31 COLTel 112.1

    ఇతరులికి చేయూతనివ్వగోరేవారు చాలామంది ఉన్నారు. కాని ఇతరులికి ఇవ్వటానికి తమకు ఆధ్యాత్మిక శక్తిగాని, జ్ఞానం గాని లేదని భావిస్తారు. వారు తమ మనవుల్ని దైవకృపాసనం వద్ద పెట్టి పరిశుద్దాత్మకోసం విజ్ఞాపన చెయ్యాలి. తాను చేసిన ప్రతీ వాగ్దానం వెనుక దేవుడు నిలిచి ఉన్నాడు. మీ బైబిలు చేతిలో పట్టుకొని, నీవు చెప్పినట్లు చేసాను. “అడుగుడి మీ కియ్యబడును. వెదకుడి మీకు దొరకును; తట్టుడి మీకు తీయబడును” అన్న నీ వాగ్దానాన్ని నీకు సమర్పిస్తున్నాను.COLTel 112.2

    క్రీస్తు నామంలో మాత్రమే కాదు పరిశుద్దాత్మ ప్రేరణల వలన కూడా మనం ప్రార్ధించాలి. “ఉచ్చరింపశక్యము గాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు” అన్నప్పుడు దాని భావాన్ని ఇది విశదం చేస్తుంది. రోమా 8:26 అలాంటి ప్రార్ధనకు ఫలమివ్వటానికి దేవుడు ఆనందిస్తారు. క్రీస్తు నామంలో పట్టుదలతో ప్రగాఢతతో ప్రార్ధన చేస్తే “మనము అడుగుదానికంటెను, ఊహించువాటి కంటెను అత్యధిక ముగా” ఇవ్వటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడన్న హామీ ఆ ప్రగాఢతలోనే ఉన్నది (ఎఫ 3:20)COLTel 112.3

    “ప్రార్ధన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొందియున్నా మని నమ్ముడి; అప్పుడు అవి మీకు కలుగును”. మార్కు 11:24 “మీరు నా నామమున దేని నడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమ పర్చబడుటకై దానినే చేతును”. అని క్రీస్తు అన్నాడు. ప్రియతమ యోహాను, గొప్ప స్పష్టతోను నిశ్చయతతోను ఇలా అంటున్నాడు. “ఆయన చిత్తానుసారంగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించును... మనమేమి అడిగినను ఆయన మనవి ఆలకించునని మన మెరిగిన యెడల మనమాయనను వేడుకొనిన మనకు కలిగివని యెరుగుదము.” 1 యెహా 5:14, 15 మరి క్రీస్తు నామంలో మీ మనువుల్ని తండ్రికి అందజేయ్యెండి.COLTel 112.4

    దేవుని సింహాసనం చుట్టు ఉన్న ధనస్సు దేవుడు యధార్ధపరుడని, ఆయనలో చంచలత్వం గాని,గమనాగమనాల వల్ల కలిగే ఛాయగాని లేదు అన్న హమీని సూచిస్తుంది. ఆయనకు వ్యతిరేకంగా మనం పాపం చేసి ఆయన కృపకు అపాత్రలమయ్యాం .అయినా,“నీనామమునుబట్టి మమ్మును త్రోసివేయకుము. ప్రశస్తమైన నీ సింహాసనమును అవమానపరచకుము, మాతో నీవు చేసిన నిబంధనను జ్ఞాపకము చేసికొనుము”(యిర్మీ 14:21) అద్భుతమైన విజ్ఞాపనల్ని మన పెదాలమీద పెట్టింది ఆయనే.మన ఆయోగ్య తను, మన పాపాన్ని ఒప్పుకుంటూ ఆయన వద్దకు వచ్చినప్పుడు, మన మొర ఆలకిస్తానని ఆయన హామీ ఇచ్చాడు.మనకు ఆయన ఇచ్చిన మాటను నెరవేర్చటానికి ఆయన తన సింహాసనాన్ని ప్రత్యక్షంగా పెడుతున్నాడు.COLTel 113.1

    క్రీస్తును సూచించిన ఆహారోనులా, పరిశుద్ధస్థలంలో మన రక్షకుడు తన ప్రజలందరి పేర్లను తన హృదయం పై ధరించి మోస్తాడు. మన మహా ప్రధాన యాజకుడు విశ్వసించాల్సిందిగా మనల్ని ఉత్సాహపర్చుతూ పలికిన మాటల్ని జ్ఞాపకముంచుకుంటాడు.COLTel 113.2

    తన్ను వెదకే వారందరికి ఆయన దొరుకుతాడు. తట్టేవారందరికి తలుపు తెరుస్తాడు. నన్ను ఇబ్బంది పెట్టవద్దు. తలుపు వేసి ఉంది. దాన్ని తెరవటం నాకిష్టం లేదు అన్నసాకు చెప్పటం జరుగదు. నీకు సహాయం చెయ్యలేను అని ఒక్కరితో ఆనటం కూడా జరగదు. ఆకలిగా ఉన్న ఆత్మలకు ఆహారం పెట్టటానికి ఆర్ధరాత్రిపూట యూచించేవారు సఫలులవుతారు.COLTel 113.3

    ఉపమానంలో, పరదేశికోసం రొట్టెలు అడిగిన వ్యక్తి “కావలసిన వన్నియు” పొందడు మన ఇతరులికి ఇచ్చేందుకు మనకు దేవుడిస్తాడు? “క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున”. ఎఫె 4:7 మనుష్యులు సాటి మనుషుల్ని ఎలా చూస్తున్నారో వారిపట్ల ఎలా వ్యవహరిస్తు న్నారో తెలుసుకోవటానికి దేవ దూతలు తీవ్ర ఆసక్తితో చూస్తున్నారు. పొరపాట్లు చేసేవారిపట్ల ఒక వ్యక్తి క్రీస్తులా సానుభూతి చూపించటం చూస్తారు. ఆ వ్యక్తి పక్కకు వెళ్ళి అతడి ఆత్మతో జీవాహారం లాంటి మాటలు మాట్లాడటానికి అతడికి మాటల్ని గుర్తుకు తెస్తారు. కాగా “దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు నందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును.”. ఫిలి 4:19 స్వచ్చం వాస్తవం అయిన మీ సాక్ష్యాన్ని రానున్న జీవితపు శక్తితో ఆయన శక్తిమంతుడుగా చేస్తాడు. మీ నోట దైవ వాక్యం సత్యంగాను నీతిగాను ఉంటుంది.COLTel 113.4

    ఇతరుల నిమిత్తం వ్యక్తిగత కృషికి ముందు ఎంతో రహస్య ప్రార్ధన అవసరం. ఎందుచేతనంటే ఆత్మ రక్షణ విజ్ఞాన శాస్త్రాన్ని అవగాహన చేసుకోవాటానికి, ఎంతో వివేకం అవసరం. మనుషులతో మాటలాడక ముందు క్రీస్తుతో మాటలాడండి. ప్రజలకు పరిచర్య చెయ్యటానికి పరలోక సింహాసనం వద్ద సిద్ధపాటు పొందండి. దేవునిపట్ల జీవం గల దేవుని పట్ల ఆశతో మీ హృదయం బద్దలివ్వనివ్వండి. దైవ స్వభావంలో పాలు పొందటం ద్వారా మానవత్వం ఏమి సాధించగలదో క్రీస్తు జీవితం చూపించింది. దేవుని వద్ద నుంచి క్రీస్తు పొందినదంతా మనం కూడా పొందవచ్చు. మరి అడిగిపొందండి.దేవుడు చేసిన వాగ్దానాల నెరవేర్పుకు యాకోబువలె పట్టు విడవని విశ్వాసంతో, ఏలీయావలె సన్నగిల్లని పట్టుదలతో ప్రార్ధించండి.COLTel 114.1

    మీ మనసును దేవుని గూర్చిన పరిశుద్ద తలంపుతో నింపుకోండి. క్రీస్తు జీవితంలో మీ జీవితం కనపడని లింకులతో అల్లుకుపోనివ్వండి, చీకటిలో నుంచి వెలుగు ప్రకాశించాల్సిందిగా ఆజ్ఞాపించిన ఆయన క్రీస్తుముఖంలోని దేవుని మహిమా జ్ఞానపు వెలుగునివ్వటానికి మీ హృదయంలో ప్రకాశించటానికి సంసిద్ధంగా ఉన్నాడు. దేవుని విషయాల్ని తీసుకొని వాటిని మీకు చూపించి, విధేయ హృదయంలోకి సజీవ శక్తిగా పంపుతాడు. క్రీస్తు మిమ్మల్ని అనంతుని గడప వద్దకు నడిపిస్తాడు. మీరు తెర అవతల ఉన్న మహిమని వీక్షించి మన కోసం విజ్ఞాపన చెయ్యటానికి నిరంతరం నివసించే ఆ ప్రభువు సమృద్ధతను మనుషులికి వెల్లడించవచ్చు.COLTel 114.2

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents