Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
క్రీస్తు ఉపమాన ప్రబోధాలు - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    9—ముత్యం

    ఆధారం :13:14,46

    విమోచనకూర్చే ప్రేమను మన రక్షకుడు విలువైన ముత్యంతో పోల్చాడు. మంచి ముత్యాలు కొనటానికి వెదకుతున్న వర్తకుడి ఉపమానం ద్వారా ఆయన తన పాఠాన్ని ఉదహరిస్తున్నాడు. “అతడు అమూల్యమైన యొక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాని కొనెను”. ఈ అమూల్య ముత్యం క్రీస్తు. ఆయన యందు తండ్రి మహిమ త్రిత్వం తాలూకు సంపూర్ణత సమీకరించబడ్డాయి. తండ్రి మహిమకు ప్రకాశం అయనే. ఆయన త్రిత్యమునందు తండ్రి స్వరూపి, దేవుని గుణగణాల మహిమ ఆయన ప్రవర్తనలో వ్యక్తమవుతున్నది. పరిశుద్ధ లేఖనాల్లోని ప్రతీ పూట ఆయన వెలుగుతో ప్రకాశిస్తుంది. క్రీస్తు నీతి స్వచ్చమైన తెల్లని ముత్యం వంటిది. దానిలో లోపం గాని కళంకంగాని లేదు. దేవుడిచ్చిన ఈ ప్రశస్తమైన వీటికి ఏ మానవ కృషి మెరుగులు దిద్దలేదు. దానిలో ఏ లోపమూ లేదు క్రీస్తు. “బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు గుప్తములైయున్నవి. ” కొలో 2:3 ఆయన “మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనము నాయెను”. 1 కొరి 1:30 ఈ లోకపరంగాను వచ్చే లోక సంబంధముగాను మానవాత్మ అవసరాల్ని ఆకాంక్షల్ని తృప్తిపర్చగలిగినదంతా క్రీస్తులో ఉంది. మన రక్షకుడు ప్రశస్తమైన ముత్యం. ఆయనతో పోల్చినపుడు తక్కినవన్నీ గొప్ప స్పష్టంగా కనిపిస్తాయి.,COLTel 85.1

    క్రీస్తు “తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు”. యోహా 1:11 దేవుని వెలుగు లోకంలోని చీకటిలో ప్రకాశించింది. కాని “చీకటి దాని గ్రహింపకుండెను”. యోహా 1:5 దేవుడిచ్చిన వీటి పట్ల అందరూ నిర్లక్ష్యంగా లేరు. ఉపమానంలోని వర్తకుడు చిత్తశుద్ధితో సత్యాన్ని ఆకాంక్షిస్తున్న ఒక తరగతి ప్రజల్ని సూచిస్తున్నాడు. వివిధ దేశాల్లో చిత్తశుద్దిగల ఆలోచన వరులైన మనుష్యులున్నారు. తమ ఆత్మకు పెన్నిధిగా పొందగలదాని కోసం వారు అన్యమత సాహిత్యంలోను, విజ్ఞాన శాస్త్రంలోను, మతాల్లోను వెదికారు. తమకు లేని దాని కోసం వెదకుత్ను వారు యూదుల్లో కొందరున్నారు. లాంచన బద్దమైన మతంలో అసంతృప్తి చెంది, వారు ఆధ్మాత్మికమైంది. ఉన్నతమైంది ఏది ఉందోదాని కోసం ఎదరు చూసారు. క్రీస్తు ఎంపిక చేసు కున్న శిష్యులు ఈ రెండో తరగతికి చెందినవారు. కొర్నేలి, ఇతోయోపియా నపుంసకుడు మొదటి తరగతికి చెందినవారు. వారు పరలోకం నుండి వెలుగకోసం ఆశగా ఎదరుచూస్తున్నారు. తమకు క్రీస్తు బయలు పర్చ బడ్డప్పుడు వారు ఆయన్ని సంతోషంగా స్వీకరిస్తారు.COLTel 85.2

    ఉపమానంలో ముత్యాన్ని వరంగా సూచించలేదు. వర్తకుడు తనకున్నదంతా పెట్టి కొన్నాడు. లేఖనాలు క్రీస్తుని వరంగా సూచిస్తుండటం చేత అనేకులు దీని ఆర్ధాన్ని ప్రశ్నిస్తున్నారు. ఎవరు తమ ఆత్మను శరీరాన్ని ప్రాణాన్ని ఏమిమినహాయంపు లేకుండా ఆయనకు సమర్పించుకుంటా వారికే ఆయన వరం. మనల్ని మన క్రీస్తుకి సమర్పించుకోవాలి. ఆయన ఆజ్ఞాలన్నిటికి మనస్పూర్తిగా విధేయులమై నివసించటానికి ఆయనకి సమర్పించుకోవాలి. మనం, మన వరాలు, మన ప్రతిభాపాటవాలతో ప్రభువ వారం, ఆయన సేవకు అంకితం కావలసివున్నాం. ఈ విధముగా మనల్ని మనం సంపూర్తిగా సమర్పించుకున్నప్పుడు క్రీస్తు తన పరలోక సౌభాగ్యమంతటితో తన్ను తాను మనకు సమర్పించుకుంటాడు. అపారమైన విలువ గల ఆ ముత్యాన్ని మనం సంపాదిస్తాం.COLTel 86.1

    రక్షణ ఉచితవరం. అయినా దాన్ని కొనాల్సి ఉంది. ఆమ్మాల్సి ఉంది. దైవ కృపా యాజమాన్యంలో నడిచే విపణిలో ఈ ప్రశస్తమైన ముత్యాన్ని డబ్బు లేకుండా ధర చెల్లించకుండా కొంటున్నట్లు సూచించటం జరగుతుంది. ఈ వ్యాపారం పరలోక వస్తువులన్ని అందరూ పొందవచ్చు. సత్య ముత్యాల ఖాజానా అందరికి తెరిచే ఉంటుంది. ప్రభువిలా అంటున్నాడు. “ఇదిగో తలుపు నీ యెదుట తీసియుంచియున్నాను; దాని ఎవడును వేయనేరుడు” ఈ తలుపు గుండా వెళ్ళే మార్గాన్ని ఏ ఖడ్గమూ కాపడలేదు. లోపలి స్వరాలు తలుపు వద్ద స్వరాలు రమ్మంటున్నాయి. “నీవు ధనవృద్ధి చేసికొనట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును... కొనుమని నీకు బుద్ది చెప్పుచున్నాను” అంటూ రక్షకుని స్వరం ప్రేమతో ఆహ్వానిస్తుంది. ప్రక.3:8,18COLTel 86.2

    క్రీస్తు సువార్త ఒక దీవెన. దాన్ని అందరూ పొందవచ్చు. ధనవంతులు కొనగలిగినట్లు నిరు పేదలు రక్షణను కొనవచ్చు. ఎందుకంటే ఎంతటి లోక భాగ్యమైన దాన్ని కొనలేదు. మన:పూర్వక విధేయత వల్ల మనల్ని మనం క్రీస్తుకి ఆయన కొనుక్కున్న స్వాస్థ్యంగా సమర్పించుకోవటం వల్ల దాని పొందగలం. అత్యున్నత స్థాయి విద్య సయితం మనుషుణ్ని దేవుని దగ్గరకు తీసుకురాలేదు. పరిసయ్యులికి ప్రతీ లౌకికమైన ప్రతీ ఆధ్యాత్మికమైన లాభం కలిగింది. వారు అతిశయంతో మేము “ధనవృద్ధి చేసి” ఉన్నాము. మా” కేమియు లోటు” లేదని ప్రగల్బాలు పలికారు. కాని వారు “దరిద్రు”లు “గ్రుడ్డి” వారు “దిగంబరు'లు ప్రక.3:17 క్రీస్తు వారికి అమూల్యమైన ముత్యాన్ని ఇవ్వజూ పాడు. కాని వారు దాన్ని నిరాకరించారు. వారితో ఆయన “సుంకరులును వేశ్యలును మీకంటే ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించుదురు” అన్నాడు మత్త 21:31COLTel 87.1

    మనం రక్షణను సంపాదించలేం. కాని దాని కోసం లోకంలో మనకున్న సమస్తాన్ని విడిచి పెట్టటానికి సిద్ధమయ్యేటంత ఆసక్తితో సహనంతో దాన్ని అన్వేషించాల్సి ఉన్నాం.COLTel 87.2

    మనం ఈ అమూల్యమైన ముత్యం కోసం వెదకాల్సి ఉన్నాం. కాని లోకంలోని మండీలు అంగళ్ళలో కాదు లేక లోకసంబంధమైన మార్గాల్లో కాదు. మనం చెల్లించాల్సిన మూల్యం బంగారం వెండి కాదు. అవి మనవి కావు దేవునివి. లౌకిక లేక ఆధ్యాత్మిక లాభం మీకు రక్షణ తెస్తుందన్న భిప్రాయాన్ని విడిచి పెట్టండి. దేవుడు మీ మన:పూర్వక విధయేతను కోరుతున్నాడు. మీ పాపాల్ని విడిచి పెట్టాలని మిమ్మల్ని కోరుతున్నాడు. “నేను జయించి నా తండ్రితో కూడ ఆయన సింహాసనమందు కూర్చుండి యున్న ప్రకారం జయించువానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చెదను” అని క్రీస్తు వెల్లడి చేస్తున్నాడు. ప్రక 3:21.COLTel 87.3

    పరలోక ముత్యాన్ని ఎల్లప్పుడు వెదకుతున్నట్లు కనిపించేవారు కొందరున్నారు. అయితే వారు తమ చెడ్డ అలవాట్లు అభ్యాసాల్ని పూర్తిగా ప్రభువుకి సమర్పించుకోరు. క్రీస్తు తమలో నివసించేందుకు గాను తమ స్వార్ధం విషయంలో మరణించరు. అందుచేత వారు ఆ ఆమూల్య ముత్యాన్ని కనుగొలేరు. దురాశను లౌకికాకర్షణలను జయించరు. క్రీస్తు సిలువనెత్తుకుని ఆత్మ నిరసన. త్యాగం మార్గంలో క్రీస్తును వెంబడించరు. వారు దాదాపు క్రైస్తవులే కాని పూర్తిగా క్రైస్తవులు కారు. దేవుని రాజ్యానికి దగ్గరలో ఉన్నట్లు కనిపిస్తారు కాని అందులో ప్రవేశించలేరు. దాదాపు రక్షణ పొందినవారు అంటే దాదాపు నశించినవారు కాదు. పూర్తిగా నశించినవారు.COLTel 87.4

    మంచి ముత్యాలు వెదకుతున్న వర్తకుడి ఉపమానం రెండు రెట్లు ప్రాధాన్యం గలది. పరలోక రాజ్యాన్ని వెదకుతున్న రీతిగా మనుషులకే కాదు. నశించిన తన స్వార్థాన్ని వెదకుతున్నట్లుగా క్రీస్తుకు కూడా అది వర్తిస్తుంది. మంచి ముత్యాలు వెదకుతున్న పరలోక వర్తకుడైన క్రీస్తు నశించిన మానవుడిలో అమూల్య ముత్యాన్ని చూసాడు. అపవిత్రుడై నశించిన మావనుడిలో విమోచనకు అవకాశాల్ని చూసాడు. సాతానుతో పోరాటానికి ప్రాంగణమైన క్రీస్తు తన ప్రేమశక్తితో విమోచించన హృదయాలు ఎన్నడు పడిపోనిపరిశుద్ధులకన్నా విమోచకునికి ఎంతో అమూల్యమైనవి. దేవుడు మానవాళిని దుష్టులుగాను, పనికిరాని వారిగాను పరిగణించలేదు. క్రీస్తును దృష్టిలో ఉంచుకొని పరిగణించాడు. రక్షించే ప్రేమ వల్ల వారు ఎలా రూపొందగలరో ఆయన చూసాడు. విశ్వంలో ఉన్న ఐశ్వర్యమంతా పోగు చేసాడు. ఆ ముత్యాన్ని ఖరీదు చెయ్యటానికి, ముత్యాన్ని కనుగొన్న క్రీస్తు దాన్ని తన కిరీటంలో తిరిగి అమర్చుకుంటాడు. “నా జనులు యెహోవా దేశములో కిరీటమందలి రత్నములవలెనున్నారు.”జెక 9:16 “నేను నియమింపబోవు దినము రాగా వారునావరైనా స్వకీయ సంపాద్యమై యుందురు.. సైన్యములకధిపతియగు యెహోవా సెలవిచ్చు చున్నాడు.” మలా. 3:17.COLTel 88.1

    అయితే ఏ పరలోక భాగ్యాన్ని సంపాదించటం మన విశేషాదిక్యతో ఆ అమూల్య ముత్యమైన క్రీస్తు మనం ఎక్కువగా ధ్యానించాల్సిన అంశం. ఈ మంచి ముత్యం ప్రశస్థతను పరిశుద్దాత్మ మనకు వెల్లడి చేస్తాడు. పరిశు ద్దాత్మ అందుబాటులో ఉన్న కాలమే ఈ పరలోక ముత్యాన్ని వెదకి కనుగొనవలసిన కాలం. క్రీస్తు దినాల్లో అనేకమంది సువార్తను విన్నారు. కాని తప్పుడు భోదనల వల్ల వారి మనసులు చీకటిమయమయ్యాయి. గలిలయవాడైన ఈ దీన బోధకుడిలో వారు మెస్సీయాని గుర్తించలేదు. అయితే ఆయన ఆరోహణం తరువాత పరిశుద్దాత్మ కుమ్మరింపు ద్వారా ఆయన తన మధ్యవర్తిత్వ సింహాసనాన్ని అధిష్టించటాన్ని సూచించటం జరిగింది. పెంతెకొస్తునాడు పరిశుద్దాత్మ కుమ్మరింపు జరిగింది. తిరిగి లేచిన రక్షకుని శక్తిని మనుష్యులు చూసారు. క్రీస్తు శత్రువల వల్ల మోసపోయిన వారి మనసుల్లోని చీకటిని పరలోకం నుంచి వచ్చిన వెలుగు పారదోలింది. వారిప్పుడు “ఇశ్రాయేలునకు మారుమనస్సును పాప క్షమాపణను దయచేయుటకై దేవుడాయనను అధిపతిని గాను రక్షకునిగాను ” హెచ్చించటం చూసారు. అ.కా 5:31 COLTel 88.2

    తమ తిరుగుబాటు విడిచి పెట్టి తిరిగి వచ్చేవారందరికి ఇవ్వటానికి ఆయన అనంత ధననిధులు చేత పట్టుకొని పరలోక మహిమతో ఆవరించబడి ఉన్నట్లు వారు చూస్తారు. అపొస్తలులు మహిమగల దేవుని అద్వితీయ కుమారుణ్ణి ప్రజల ముందుంచినప్పుడు మూడు వేల మంది మారుమనస్సు పొంది విశ్వసించారు. వారు తాము పాపులం కలుషితులం అని గుర్తించి తమ పరిస్థితిని యథాతథంగా గ్రహించేటట్లు చేసి క్రీస్తుని తమ నేస్తంగాను విమోచకుడుగాను వారి ముందుంచారు పరిశుద్ధాత్మ వారి మీదికి రాగా వారు క్రీస్తుని ఘనపర్చి మహిమపర్చారు. తాము నశించక నిత్యజీవం పొందేందుకు ఆయన్ని అవమానం భరించిన వానిగా, గ్రహించారు. పరిశుద్దాత్మ క్రీస్తుని వెల్లడి చెయ్యటం ఆయన శక్తిని గురించి, ఔన్నత్యాన్ని గురించి వారిలో గుర్తింపు కలిగించింది. అప్పుడు వారు నమ్ముచున్నాను’ అంటూ విశ్వాసంతో ఆయనకు చేతులు చాపారు.COLTel 89.1

    అంతట తిరిగి లేచిన రక్షకుణ్ని గూర్చిన ఆనందవార్త లోకమంతటా ప్రచురమయ్యింది. అన్ని పక్కల నుండి విశ్వాసులు వచ్చి సంఘములో చేరారు. విశ్వాసులు తిరిగి మారుమనస్సు పొంది బాప్తిస్మం పొందారు. పాపులు అమ్యూలమైన ముత్యాన్ని వెదకటంలో క్రైస్తవులతో ఏకమయ్యారు. శక్తి హీనులు “దావీదు వంటి వారుగాను” దావీదు సంతతి వారు “దేవుని వంటివారు గాను” ఉంటారు అన్న ప్రవచనం నెరవేరింది. జెక 12:8 ప్రతీ క్రైస్తవుడు దేవుని వంటి దాతృత్వాన్ని, ప్రేమను తన సూదరుడిలా చూసాడు. వారి ఆసక్తి ఒకటే. వారి ఉద్దేశం ఒకటే.వారి హృదయాలు సమా రస్యంతో స్పందించాయి. విశ్వాసులు ఒకే ఒక ఆశ క్రీస్తువంటి ప్రవర్తనను కలిగి ఉండటం. ఆయన రాజ్య విస్తరణకు పాటు పడటం. ““విశ్వసంచిన వారందరును ఏక హృదయమును ఏకాత్మయి గలవారై యుండిరి... అపొస్తలులు బహు బలముగా ప్రభువైన యేసు పునరుత్థాన మును గూర్చి సాక్ష్యమిచ్చిరి”. అ.కా 4:32,33 మరియు ప్రభువు రక్షణ పొందుచున్నవారిని అనుదినము వారితో చేర్చుచుండెను”అ.కా 2:47 క్రీస్తు ఆత్మ సర్వ సమాజాన్ని చైతన్యవంతం చేసింది. ఎందుకంటే వారు అమ్యూలమైన ముత్యాన్ని కనుగొన్నారు.COLTel 89.2

    ఈ దృశ్యాల్ని పునరావృతం చెయ్యాలి. ఇతోధిక శక్తితో పునరావృతం చెయ్యాలి. పెంతెకోస్తు వాటి పరిశుద్దాత్మ కుమ్మరింపు తొలకరి వర్షం. కడవరి వర్షం ఇంకా సమృద్ధిగా ఉంటుంది. మనం అడిగి పొందదవచ్చు. అందుకు పరిశుద్దాత్మ సిద్ధంగా ఉన్నాడు. పరిశుద్దాత్మ శక్తి ద్వారా క్రీస్తు మళ్ళీ సంపూర్తిగా వెల్లడికానున్నాడు. ఈ అమూల్యమైనముత్యం విలువను మనుషులు గ్రహిస్తారు. అపొస్తలుడైన పౌలుతో గళం కలసి వారిలా అంటారు. “ఏవేవి నాకులాభకరములై యుండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నాప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతిశ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను”. ఫిలి 3:7,8.COLTel 90.1

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents