Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
క్రీస్తు ఉపమాన ప్రబోధాలు - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    28—కృపాఫలం

    ఆధారం : మత్తయి 19:36-30, 20:1-16 మార్కు 10:17-31 లూకా 18:18-30

    యూదులు దైవ కృపను గూర్చిన సత్యాన్ని దాదాపు మర్చిపోయారు. దేవుని ప్రసన్నత సంపాదించుకోవలసిన వస్తువని రబ్బీలు బోధించారు. నీతిమంతుల ప్రతిఫలాన్ని తమ క్రియల ద్వారా సంపాదించటానికి ఎదురు చూసారు. అందుకోవాలన్న తత్వం కిరాయి వైఖరి ఇలా వారి ఆరాధనకు ప్రేరకాలయ్యాయి. శిష్యుల్లో నుంచి ఈ స్వభావం పూర్తిగా పోలేదు. వారికి తమ పొరపాటును చూపించటానికి రక్షకుడు ప్రతీ తరుణాన్ని వినయోగించు కోవటానికి ప్రయత్నించాడు. ఆయన పనివారిని గూర్చిన ఉపమానాన్ని చెప్పక ముందు చోటుచేసుకున్న ఒక సంఘటన సరి అయిన నియమాల్ని సూచించటానికి ఆయనకు మార్గం తెరిచింది.COLTel 339.1

    ఆయన దారిలో నడుస్తూ వస్తుండగా ఒక యువ అధికారి ఆయన వద్దకు పరుగెత్తుకుంటూ వచ్చి మోకరించి ఆయనకు వందనం చెల్లించి “బోధకుడా, నిత్యజీవము పొందుటకు నేను ఏమంచి కార్యము చేయవలెను”? అని మర్యాదగా అడిగాడు. ఆ అధికారి క్రీస్తుని గౌరవనీయు డైన బోధకుడిగానే సంబోధించాడు. గాని ఆయనలో దేవుని కుమారుణ్ణి గుర్తించలేదు. అందుకు రక్షకుడున్నాడు.“మంచి కార్యమును గూర్చి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడొక్కడే”. దీనిని బట్టి నీవు నన్ను మంచివాడంటున్నావు? దేవుడొక్కడే మంచివాడు. నీవు నన్ను అలా గుర్తిస్తే నీవు నన్ను దేవుని కుమారునిగాను ఆయన ప్రతినిధిగాను స్వీకరించాలి.COLTel 339.2

    ఆయన ఇంకా ఇలా అన్నాడు. “నీవు జీవములో ప్రవేశింపగోరిన యెడల ఆజ్ఞను గైకొనుము” దేవుని ప్రవర్తన ఆయన ఆజ్ఞల్లో వ్యక్తమౌతుంది. మీరు దేవునితో సామరస్యంగా ఉండటానికిగాను మీ ప్రతీకార్యానికి ఆయన ధర్మశాస్త్ర సూత్రాలు చోదక శక్తి కావాలి.COLTel 339.3

    ధర్మశాస్త్రం స్వాధికారంతో కోరే విధుల్ని క్రీస్తు తగ్గించటంలేదు. నిత్యజీవం పొందటానికి ధర్మశాస్త్ర విధేయత షరతని ఆయన స్పష్టంగా ఉన్నాడు. తన పతనానినికి ముందు ఆదాము ఇదే షరతును పాటించాల్సి ఉన్నాడు. పరదైసు ఓ మానవుడు నివసించి నప్పుడు మానవుణ్నించి కోరిన సంపూర్ణ విధేయత, నిష్కళంక నీతిని ఇప్పుడు మానవుణ్ణించి ఏ కొంచెం తక్కువగాకుండా దేవుడు కోరుతున్నాడు. కృపా నిబంధన కింద రూపొందిన ధర్మశాసనసం ఏదెనులోని ధర్మశాసనం ఎంత విశాలమైందో అంత విశాలమైంది పరిశుద్ధం, న్యాయం శ్రేయస్కరం అయిన దైవ ధర్మశాస్త్రానికి అది అనుగుణంగా ఉంది.COLTel 340.1

    “ఆజ్ఞలను గైకొనుము”అన్న మాటలకు ఆ యువకుడు “ఏ ఆజ్ఞలు”? అని బదులు పలికాడు. ఏదో ఆచారానికి సంబంధించిన నియమాన్ని గురించి ఆయన మాట్లాడుతున్నాడనుకున్నాడు. కాని సీనాయి కొండపై నుంచి ప్రకటించిన ధర్మశాస్త్రం గురించి క్రీస్తు మాట్లాడుతున్నాడు. రెండో పలక మీది ఆజ్ఞల్లో చాలా వాటిని పేర్కొని ఆ మీదట “నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను” అన్నదానిలో వాటన్నింటిని సంక్షిప్తపర్చాడు.COLTel 340.2

    “ఇవన్నీయు అనుసరించుచునేయున్నాను; ఇకను నాకు కొదువు ఏమి?” అని ఆ యువకుడు బదులు పలికాడు. ధర్మశాస్త్రాన్ని గూర్చి అతడి అభిప్రాయం బాహ్యమైనది, లోతులేనిది, మానవ ప్రమాణం ప్రకారం చూస్తే అతడు నిష్కళంక ప్రవర్తన కలవాడు. చాల మట్టుకు అతడి వెలుపలి జీవితం దోషరహిత. తన విధేయతలో ఎలాంటి లోటు లేదని అతడు ధృఢంగా నమ్మాడు. అయినా తన ఆత్మకూదేవునికి మధ్య అంతా సవ్యంగా సజావుగా లేదని అతడు భయపడ్డాడు. ఇది ‘ఇకను నాకు కొదువ ఏమి”? అని అడగటానికి అతణ్ణి ప్రేరేపించింది.COLTel 340.3

    క్రీస్తు ఇలా అన్నాడు. “నీవు సంపూర్ణడవగుటకు కోరిన యెడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించుము... అయితే ఆ యువకుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడి వెళ్ళిపోయెను”.COLTel 340.4

    స్వార్ధ ప్రియుడు ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘిస్తున్నవాడు. యేసు దీన్ని ఆ యువకుడికి చూపించగోరాడు. అతడికి తన మనసులోని స్వార్థాశను బట్టబయలు చేసే పరీక్ష పెట్టాడు. తన ప్రవర్తనలోని వ్యాధిగ్రస్తభాగాన్ని అతడికి చూపించాడు. ఆ యువకుడు ఇక అదనపు జ్ఞానాన్ని కోరలేదు. అతడు ఆజ్ఞల్ని గైకొంటున్నట్లు చెప్పుకున్నాడు. కాని వాటికి ఆత్మ ప్రాణం అయిన నియమాన్ని విడిచి పెట్టాడు. అతడికి దేవుని పట్ల గాని మానవుడి పట్ల గాని యధర్గాప్రేమ లేదు. ఈ కొదవే అతడు పరలోక రాజ్యంలో ప్రవేశించటానికి కావలసిన అర్హతలన్నిటిని రద్దు చేసింది. స్వార్ధప్రియత్వంలో, స్వప్రయోజన కోరికల్లో మునిగిన అతడి జీవితం పరలోక సూత్రాలకు అనుగుణంగా లేదు.COLTel 341.1

    ఈ యువకుడు యేసు వద్దకు వచ్చినప్పుడు అతడి యధార్ధత ఉత్సాహం రక్షకుణ్ణి అకట్టుకున్నాయి. “యేసు అతని చూసి అతని ప్రేమిం”చాడు. అతడిలో నీతి బోధకుడుగా సేవ చేయగల యువకుణ్ణి చూసాడు. తన్ను వెంబడించిన పేద జాలరల్ని అంగీకరించినట్లే ఇతణ్ణి మనస్పూర్తిగా అంగీకరించేవాడు. ఈ యువకుడు తన సామర్ధ్యాన్ని ఆత్మల రక్షణకు వినియోగించి ఉంటే క్రీస్తుకి శ్రద్ద గల, విజయశీలుడైన సేవకుడయ్యేవాడు.COLTel 341.2

    కాని ముందు అతడు శిష్యరికపు షరతుల్ని అంగీకరించాలి. తన్ను తాను సంపూర్తిగా దేవునికి సమర్పించుకోవాలి. రక్షకుని పిలుపు మేరకు యోహాను, పేతురు, మత్తయి వారి మిత్రులు “సమస్తమును విడిచి పెట్టి లేచి, ఆయనను వెంబడిం”చారు లూకా 5:28 ఈ యువ అధికారి నుంచి ఆయన అదే సమర్పణను కోరాడు. తాను చేసిన సమర్పణ కాన్నా ఎక్కువ సమర్పణ క్రీస్తు కొరవలేదు. ‘ఆయన ధనవంతుడై యుండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావలెనని మీ నిమిత్తము దరిద్రుడాయెను. “2 కొరి 8:9 క్రీస్తు నడిపించే మార్గంలోనే ఆ యువకుడు ఆయిన్న వెంబడించాల్సి ఉంది.COLTel 341.3

    ఆ యువకుడి వంక చూసి అతడి ఆత్మ కోసం ఆయన ఎంతో ఆశపడ్డాడు. మానవులకు దీవెనకూర్చే దూతగా అతణ్ణి లోకంలోకి పంపాలని ఎంతో ఆశపడ్డాడు. అతడు త్యాగం చెయ్యాల్సిందిగా తను కోరిన దాని స్థానంలో క్రీస్తు తనతో సహవాస భాగ్యాన్ని అతడికి ఇవ్వజూపాడు. ఆయన “నన్ను వెంబడించుము” అన్నాడు. పేతురు యాకోబు యోహానులు దీన్ని గొప్ప అధిక్యతగా పరిగణించారు. ఆ యువకుడు సయితం క్రీస్తుకు అభిమానంతో పరిగణించారు. ఈ యువకుడు సయితం క్రీస్తును అభిమానంతో పరిగణించి ప్రశంసించాడు. అతడి హృదయం రక్షకుడికి ఆకర్షితమైంది. కాని రక్షకుని ఆత్మత్యాగ సిద్ధాంతాన్ని అంగీకరించటానికి అతడు సిద్ధంగా లేడు. యేసుని కాదు అతడు తన సిరిని ఎన్నుకున్నాడు. నిత్యజీవాన్ని ఆకాక్షించాడు. గాని ఏది మాత్రమే జీవమో ఆ నిస్వార్ధ ప్రేమను అతడు హృదయంలోకి స్వీకరించలేదు. దు:ఖ హృదయంతో అతడు క్రీస్తును విడిచి పెట్టి వెళ్ళిపోయాడు.COLTel 342.1

    ఆ యువకకుడు వెళ్లిపోతున్నపడు యేసు తన శిష్యులతో “ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట దుర్లబము” అన్నాడు. ఈ మాటలు శిష్యుల్ని ఆశ్చర్యపర్చాయి. ధనవంతులు దేవునికి ప్రియులని వారు నేర్చుకున్నారు. మెస్సీయా రాజ్యంలో లోకాధికారం, భాగ్యభోగాలు సంపాదించాలని తామే ఆశించారు. ఆ రాజ్యంలో ప్రవేశించటానికి ధనవంతులే విఫలులైతే తక్కిన మనుషులికి నిరీక్షణ ఎక్కడిది?COLTel 342.2

    “యేసు తన శిష్యులను చూచి - ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇదిగాక ధనవంతుడు పరలోకరాజ్యములో ప్రవేశించుటకంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభమని మీతో చెప్పుచున్నాను అనెను.” ఆ గంభీర హెచ్చరిక తమకు కూడా వర్తిస్తుందని వారు ఇప్పుడు గుర్తించారు. రక్షకుని మాటల వెలుగులో అధికారం కోసం ధనం కోసం వారి రహస్య వాంఛ బట్టబయలయ్యింది. తమ సొంత విషయంలోనే నమ్మకం లేని స్థితిలో ఉన్న శిష్యులు “అలాగైతే ఎవడు రక్షణ పొందగలడు”? అని ప్రశ్నించారు.COLTel 342.3

    “యేసు వారిని చూచి- ఇది మనుష్యులకు అసాధ్యమేగాని దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పెను”.COLTel 343.1

    ధవనంతుడు ధనవంతుడుగా పరలోకంలో ప్రవేశించలేడు. అతడి ధనం అతడికి పరిశుద్దుల వారసత్వంలో ఎలాంటి హక్కునూ ఇవ్వలేదు. క్రీస్తు ఉచిత కృఫ ద్వారా మాత్రమే ఎవరికైనా దేవుని పట్టణంలోకి ప్రవేశం లభిస్తుంది.COLTel 343.2

    పరిశుద్దాత్మ పలికిన ఈ మాటలు ధనవంతులికి పేదవారికి ఒకలా వర్తిస్తాయి. “మీరు మీసొత్తు కారు. విలువ పెట్టి కొనబడినవారు” 1 కొరి 6:19,20 మనుషులు దీన్ని నమ్మినప్పుడు వారు తమ ఆస్తిని ఒక ట్రస్టుగా పరిగణించి, నశించిన ఆత్మ లరక్షణార్ధం దేవుని ఆదేశం ప్రకారం బాధితులు బీదల సహాయార్ధం దాన్ని ఉపయోగిస్తారు. ఇది మనుషులికి అసాధ్యమే ఎందుకంటే హృదయం ఐహిక ఐశ్వర్యాన్ని హత్తుకొని ఉంటుంది. సిరికి దాసి అయిన ఆత్మ మానవావసరాన్ని గూర్చిన రోదనను వినలేదు. కాని దేవునికి సమస్తం సాధ్యమే. సాటిలేని క్రీస్తు ప్రేమను చూడటం ద్వారా స్వార్ద హృదయం కలిగి విధేయమౌతుంది. పరిసయ్యుడైన సౌలులా “ఏవేవి నాకు లాభకరములైయుండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను” అనటానికి ధనవంతులు నడిపించబడతారు (ఫిలి 3:7,8) అప్పుడు తమకున్నదేదీ తమది కాదని పరిగణిస్తారు. దేవుని అనేక కృపలను తమను గృహ నిర్వాహకులుగా పరిగణించుకొని ఆయన నిమిత్తం మానవులందరికి తమ్ముని తాము సేవకులుగా ఎంచుకోవటానికి సంతోషిస్తారు.COLTel 343.3

    రక్షకుని మాటలు తమలో కలిగించిన అభిప్రాయాల్ని పేతురు మొట్టమొదటిగా వ్యక్తం చేసాడు. క్రీస్తు నిర్జిం తాను తన సహోదరులు ఎంత త్యాగం చేసారో అన్నదాన్ని గురించి అతడు ఆలోచించాడు. “ఇదిగో మేము సమస్తమును విడిచి పెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరకును” అన్నాడు. యువకుడైన అధికారికి “పరలోకమందు నీకు ధనము కలుగును” అన్నషరతులతో కూడిన వాగ్దానాన్ని గుర్తు చేసుకొని తాను తన మిత్రులు చేస్తున్న త్యాగాలకు ఏమి ప్రతిఫలం పొందుతామని అతడు అడిగాడు.COLTel 343.4

    రక్షకుని జవాబు ఈ గలిలియ జాలరులకి అమితానందం కలిగిం చింది. వారి కలలు నెరవర్చే గౌరవాన్ని అది చిత్రిస్తుంది. “పునర్జనన మందు మనుష్యకుమారుడు తన మహిమ గల సింహాసనము మీద ఆసీనుడైయుండునప్పుడు నన్ను వెంబడించినవారును పండ్రెండు సింహాసముల మీద ఆసీనులై ఇశ్రాయేలు పండ్రెండు గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు”. ఆయన ఇంకా ఇలా అన్నాడు. “నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్కచెల్లెండ్రునైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచి పెట్టక ప్రతివాడును నూరు రెట్లు పొందును. ఇది గాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును. “గనుక మాకేమి దొరుకును”? అన్న పేతరు ప్రశ్నCOLTel 344.1

    “ప్రభువు వలన స్వాస్థ్యమున ప్రతిఫలముగా పొందుదుమని యెరుగుదురు గనుక, మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తము మనస్ఫూర్తిగా చేయుడి”. కోలో.3:23,24 “ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వాని వాని క్రియల చొప్పున ప్రతివానికిచ్చుటకు నేను సిద్ధపర్చినజీతము నా యొద్ద ఉన్నది”. ప్రక 22:12COLTel 344.2

    కనపర్చిన స్వభావం దిద్దుబాటు కాకుంటే శిష్యుల్ని క్రీస్తు ప్రతినిధులుగా అనర్హుల్ని చేస్తుంది. ఎందుకంటే అది కిరాయి స్వభావం. యేసు ప్రేమకు ఆకర్షితులైనప్పటికి శిష్యులు పరిసయ్యుల మనస్తత్వం నుంచి పూర్తిగా బయటపడలేదు.తాము చేస్తున్న పనికి ఉచితమైన ప్రతిఫలం పొందాలన్న తలంపుతో వారు ఇంకా పనిచేస్తున్నారు. ఆత్మోన్నతి అసంతృప్తి స్వభావం పెరగటంతో వారు ఒకరితో ఒకరు సరిపోల్చుకోవటం మొదలు పెట్టారు. ఒకరు ఏవిషయంలోనైనా విఫలులైతే తక్కినవారు ఔన్నత్యభావంతో విర్రవీగేవారు.COLTel 344.3

    శిష్యులు సువార్త నియామల్ని విస్మరించకుండేందుకు క్రీస్తు వారికొక ఉపమానం చెప్పాడు. అది దేవుడు తన సేవకులతో ఎలా వ్యవహరిస్తాడో వారు ఎలాంటి స్వభావంతో పనిచెయ్యాలని తానుకోరతాడో ఉదహరించే ఉపమానం.COLTel 344.4

    “పరలోకరాజ్యము ఒక ఇంటి యాజమాని పోలియున్నది. అతడు తన ద్రాక్షతోటలో పనిచేయువారిని కూలికి పెట్టుకొనుటకు పొద్దున” బయలుదేరాడు. పని వెదక్కునేవారు సంత స్థలాల్లో వేచి ఉండటం పని అధికారి అక్కడకు పనివారి కోసం వెళ్లటం పరిపాటి. ఉపమానంలోని వ్యక్తిని అయా సమయాల్లో పనివారికోసం వెళ్లినట్లు సూచించటం జరిగింది.. ఉదయానే వచ్చినవారు ఒక నిర్దిష్ట కూలికి ఒప్పుకుని పనిచేస్తున్నారు. తరువాత పనికి వచ్చినవారు కూలీ విషయం గృహయాజమని విజ్ఞతకు విడిచి పెట్టారు.COLTel 345.1

    “సాయంకాలమైనప్పుడు ఆ ద్రాక్షతోట యాజమానుడు తన గృహనిర్వాహకుని చూచి - పనివారిని పిలిచి, చివర వచ్చినవారు మొదలుకొని మొదట వచ్చినవారి వరకు వారికి కూలీ ఇమ్మని చెప్పెను. దాదాపు అయిదుగంటలకు కూలికి కుదిరినవారు వచ్చి ఒక్కొక్క దేనారము చొప్పున తీసుకొనిరి. మొదటివారు వచ్చి తమకు ఎక్కువ దొరకునుకొనిరిగాని వారిని ఒక్కొక్క దేనారము చొప్పున దొరకెను”.COLTel 345.2

    ద్రాక్షతోట పనివారితో గృహ యాజమానుడు వ్యవహరించటం మానవ కుటుంబముతో దేవుడు వ్యవహరించటాన్ని సూచిస్తున్నది. అది మానవులు అనుసరించే ఆచారాలు అలవాట్లు విరుద్ధమైనది. ఐహిక వ్యాపారంలో పూర్తి చేసిన పనిని బట్టి జీతం చెల్లించటం జరుగుతుంది. పనివాడు తాను చేసిన పనికే చెల్లింపును ఆశిస్తాడు. కాని ఉపమానంలో క్రీస్తు ఈ లోక సంబంధము కాని తన రాజ్య సూత్రాల్ని ఉదహరిస్తున్నాడు. ఏ మానవ ప్రమాణం ఆయన్ని నియంత్రించదు. ప్రభువిలా అంటున్నాడు. “నా తలంపులు మీ తలంపులు వంటివి కావు... ఆకాశములు భూమికి పైన ఎంత యెత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటె నా మార్గములు మీ తలంపులకంటే నా తలంపులు అంతయెత్తుగా ఉన్నవి.” యెష 55:8,9.COLTel 345.3

    ఉపమానంలో మొదటి పనివారు ఒక నిర్దిష్ట కూలీకి పనిచెయ్యటానికి ఒప్పుకున్నారు. ఆ కూలినే పొందారు. అంతకన్నా ఎక్కువ కాదు. “ఏమి న్యాయమో అది మికిత్తును” అన్న యాజమానుడి వాగ్దానాన్ని తరువాత కూలికి వచ్చిన పనివారు నమ్మారు. కూలి విషయంలో ఎలాంటి ప్రశ్నలూ వెయ్యకుండా యాజమానుడి పై నమ్మకాన్ని ప్రదర్శించారు. ఆతడు న్యాయవంతుడు, పక్షపాతం లేనివాడు అని నమ్మారు. వారు తమ శ్రమను బట్టి కాక యాజమానుడి ఉదరాభావాన్ని బట్టి ప్రతిఫలం పొందారు.COLTel 346.1

    పాపుల్ని నీతిమంతులుగా తీర్చే గనను నమ్ముకోవలసిందని దేవుడు మనల్ని కోరుతున్నాడు. ఆయన ఇచ్చే ప్రతిఫలం మన యోగ్యతను బట్టి కాక “క్రీస్తు యేసు నందు చేసిన సంకల్పము చొప్పున”(ఎఫె 3:1) ఇవ్వటం జరుగుతుంది. “మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా గాక, తన కనికరము చొప్పుననే. ... మనలను రక్షించెను”. తీతు 3:5 తన పై విశ్వాసముంచే వారికి వారు “ఊహించిన వాటికంటెను అత్యధికముగా” ప్రతిఫలం ఇస్తాడు ఎఫె 3:20COLTel 346.2

    చేసిన పని పరిమాణంగాని దాని ఫలితంగాని కాక దాన్ని ఏ స్వభావంతో చేస్తామో దాన్ని బట్టి దేవుడు ఆ పనికి విలువనిస్తాడు. చివరలో వచ్చినవారు పనిచెయ్యటానికి అవకాశం కలిగింనందుకు ఎంతో కృతజ్ఞలై ఉన్నారు.COLTel 346.3

    వారి హృదయాలు తమను అంగీకరించిన వాని పట్ల కృతజ్ఞతతో నిండాయి. సాయంత్రం ఆ యాజమాని పూర్తి పనికి కూలి చెల్లించినప్పుడు వారికెంతో ఆశ్చర్యం కలిగింది. తాము అంత కూలి సంపాదించలేదని వారికి తెలుసు. తమ యాజమానుడి ముఖంలో వ్యక్తమైన కనికరం వారిని ఆనందంతో నింపంది. ఈ గృహ యాజమానుడి మంచితనాన్ని లేక దయాళు త్వాన్ని వారు ఎన్నడూ మరిచపోలేరు. తాము ఆయోగ్యులమని గుర్తించి పని చివరి గడియలో ద్రాక్షతోట యాజమానుడి పనిలో ప్రవేశించే పాపి పరిస్థితి అలాంటిదే. అతడి పని సమయం చాలా తక్కువ. తాను పొందే ప్రతిఫలానికి తాను అర్హుణ్నికానని అతడు భావిస్తాడు. COLTel 346.4

    అసలు దేవుడు తనను అంగీకరించనందుకే అతడు ఆనందపరవశు డవుతాడు తాను వాగ్దానం చేసిన దీవెనల్ని మనం అభినందించాలన్నది దేవుని కోరిక. అయితే మనం ప్రతిఫలాల కోసం ఆత్రపడటం లేక ప్రతీ విధి నిర్వహణకు తిరిగి ఏదో ఫలం అందుకోవాలని చూడటం దేవునికి సమ్మతం కాదు. లాభంతో నిమిత్తం లేకుండ న్యాయం చెయ్యటంలో చూపించేటంత ఆశక్తి శ్రద్ధ ప్రతిఫలం పొందటంలో మనం చూపించకూడదు. దేవుని పట్ల సాటి మానవుల పట్ల ప్రేమ మన లక్ష్యమై ఉండాలి.COLTel 347.1

    “వృద్ధి కలుగజేయు దేవునిలోనే గాని, నాటు వానిలోనైనను నీళ్ళు పోయువానిలోనైనను ఏమియు లేదు. నాటు వాడును నీళ్ళు పోయువాడను ఒక్కటే. ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొనును. మేము దేవుని జత పనివారమైయున్నాము.. వేయబడినది తప్ప మరియొక పునాది ఎవడును వేయనేరడు...వాని వాని పని కనపడును.. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన యెడల వాడు జీతము పుచ్చుకొనును”. 1 కొరి 3:7-14COLTel 347.2

    ఈ ఉపమానం పనికి మొదటి పిలుపును విన్నవారిని గాక ప్రభువు ద్రాక్షతోటలోకి ప్రవేశించటం నిర్లక్ష్యం చేసినవారిని క్షమిస్తుంది. గృహ యామానుడు చివరి గడిలో సంత స్థలంలోకి వెళ్ళి పనిలేకుండా ఉన్నవారిని కనుగొన్నప్పుడు “ఇక్కడ దినమంతయు మీరెందుకు ఊరకనే నిలిచియున్నారు”? అన్నాడు. వారు “ఎవడును మమ్మును కూలికి పెట్టుకొనలేదు. అన్నారు అనంతరం ఆ దినం పిలిచిన వారెవరూ ఉద యం అక్కడలేరు. ముందు నిరాకరించి తరువాత పశ్చాత్తాపపడేవారు. పశ్చాత్తాపపడటం మంచిదే. కాని కృపకు వచ్చిన మొదటి పిలుపు విషయంలో ఆషామాషీగా వ్యవహరించట క్షేమంకాదు.COLTel 347.3

    ద్రాక్షతోటలోని పనివారు “ఒక్కొక్క దేనారము చొప్పున” తీసుకున్నారు. ఉదయాన్నే పని మొదలు పెట్టినవారు అభ్యంతరపడ్డారు. తాము పన్నెండుగంటలు పనిచెయ్యలేదా?చల్ల పొద్దున ఒక గంట మాత్రమే పనిచేసిన వారి కన్నా తాము ఎక్కువ కూలి పొందటం న్యాయం కాదా ? అనివారు హేతువాదం చేసారు.“చివర వచ్చిన వీరు ఒక్క గంట మాత్రమే పని చేసినను, పగంలతయు కష్టపడి యెండ బాధ సహించిన మాతో వారిని సమానము చేసితివే ”? అని ప్రశ్నించారు.COLTel 347.4

    “స్నేహితుడా, నేను నీకు అన్యాయము చేయలేదు; నీవు నా యెద్ద ఒక దేనారమునకు ఒడబడలేదా? నీ సొమ్ము నీవు తీసుకొని సొమ్ము నీకిచ్చినట్టే కడపట వచ్చిన వీరికిచ్చటకు నాకిష్టమైనది. నాకిష్టము వచ్చినట్లు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయముకాదా? నేను మంచివాడనైనందున నీకు కడుపు మంటగా ఉన్నదా?” అని గృహ యాజమనుడు ఒక పనివాడితో అన్నాడుCOLTel 348.1

    “ఈ ప్రకారమే కడపటివారు మొదటివారగుదురు, మొదటివారు కడపటివారగుదురు”.COLTel 348.2

    ఉపమానంలోని మొదటి పనివారు తాము చేసిన సేవను బట్టి ఇతరులకన్నా ఉన్నతస్థాయిని కోరేవారిని సూచిస్తున్నారు. వారు తమ పనిని ఆత్మ స్తుతి స్వభావంతో చేపడ్డారు. ఆ పనిలో వారు ఆత్మ నిరసనను త్యాగస్పూర్తిని కనపర్చరు. వారు తమ జీవితమంతా దేవుని సేవలో గడిపినట్లు చెప్పుకోవచ్చు. వారు కష్టాలు, లేమి శ్రమలు భరించటంలో ముందుండవచ్చు. అందును బట్టివారు గొప్ప ప్రతిఫలం పొందటానికి అర్హులమని బావిస్తారు. క్రీస్తు సేవ చేసే అధిక్యతను గురించి కన్నా ప్రతిఫలం గురించి వారు ఎక్కువ ఆలోచిస్తారు. తమ సేవ తమ త్యాగాలు తాము ఇతరులకన్నా గొప్ప గౌరవ ప్రతిష్టల్ని పొందటానికి తమని అర్హుల్ని చేస్తాయని వారి అభిప్రాయం. ఈ గౌరవం ప్రతిష్ట దక్కనందుకు వారు ఎంతో నొచ్చుకుంటారు. బాధపడ్డారు. వారు తమ సేవలో ప్రేమను నమ్మకాన్ని ప్రదర్శించారా ? అది చేసే వారు మొదటివారుగా కొనసాగుతారు. కాని వారు పోట్లాడే, ఫిర్యాదులు చేసే తత్వం క్రీస్తును పోలింది కాదు. ఆ తత్వం గలవారు నమ్మదగినవారు కారు. అది వారి స్వయం ఉన్నతిని, దేవుని పై వారి అవిశ్వాసాన్ని తమ సోదరులపట్ల అసూయ, సహోదరులపై విసుగుకునే స్వభావాన్ని బయలుపర్చుతుంది. ప్రభువు, దయాళుత్వం, ఔదర్యం వారి విసుగుదలకు అవకాశం కల్పిస్తాయి.COLTel 348.3

    ఇలా వారుతమ ఆత్మలకు దేవునికి సంబంధంలేనట్లు చూపిస్తారు. ఆ అపూర్వ కార్యకర్తతో సహకరించటంలోని ఆనందాన్నివారెరుగరు. ఈ సంకుచిత స్వార్ధపర స్వభావాన్ని దేవుడు సహించడు. ఈ దుర్గణాల్ని కనపర్చే వారితో ఆయన పనిచెయ్యలేడు. వారు దేవుని ఆత్మకు స్పందించకుండా మొద్దుబారిపోతారు.COLTel 349.1

    యూదులు ప్రభువు ద్రాక్షతోటలో పనిచెయ్యటానికి మొట్టమొదటిగా పిలుపు పొందారు. అందుచేత వారు అహంకారులు స్వనీతిపరులు అయ్యారు. తమ సుదీర్ఘ సేవ ఫలితంగా ఇతరులకన్నా గొప్ప ప్రతిఫలం పొందే హక్కు తమకున్నదని భావించారు. దైవ సంబంధిత విషయాల్లో అన్యులు తమతో సమాన అధిక్యతలు హక్కులకి అర్హులన్న వార్తకన్నా వారిని ఎక్కువ ఆవేశపర్చింది. వేరొకటి లేదు.COLTel 349.2

    తన్ను వెంబడించాల్సిందిగా మొట్టమొదటిగా పిలుపు పొందిన శిస్యులు అదే దుష్ట స్వభావాన్ని కలిగి ఉంటారేమోనని క్రీస్తు వారిని హెచ్చరించాడు. స్వనీతే సంఘ బలహీనతగా సంఘానికి శాపంగా పరిణమిస్తుందని ఆయన చూసాడు. దేవుని రాజ్యంలో స్థానం సంపాదించటానికి తాము చేయగలది కొంత ఉందని మనుషులు తలస్తారు. తాము కొంత అభివృద్ధి సాధించినప్పుడు ప్రభువు కలుగజేసుకొని తమకు సహాయం చేస్తాడని వారు ఊహించుకుంటారు. ఈరకంగా స్వార్ధం విస్తారంగా పెరగి క్రీస్తుని నమ్మటం ఆయనపై ఆధారపడటం దాదాపు శూన్యమౌతుంది. కొంచెం అభివృద్ధి సాధించిన అనేకమంది అహంకారులై తాము ఇతరులకన్నా అధికుమలని తలస్తారు. మెప్పుకోసం పొగడ్త కోసం తెగబడ్డారు. మిక్కిలి ప్రాముఖ్యులుగా పరిగణన పొందకపోతే అసూయ పెంచుకుంటారు. ఈ అపాయంలో పడకుండా క్రీస్తు తన శిష్యుల్ని కాపాడటానికి ప్రయత్నిస్తున్నాడు.COLTel 349.3

    తమలో ఏదో యోగ్యత ఉందని ప్రగల్భాలు పలకటం అనుచితం. “జాని తన జ్ఞానమునుబట్టియు, శూరుడు తన శౌర్యమును బట్టియు అతియించకూడదు. ఐశ్వర్యమంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశ యింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింప వలెననగా, భూమి మీద కృప చూపుచూ నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనయని గ్రహించి నన్ను పరిశీలనగా తెలిసికొనుటను బట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలో తెలిసికొనుటకు బట్టియే అతిశయింఎ ‘ వలెను; అట్టి వాటిలో సేవానందించువాడనని యెహోవా సెలవిచ్చు చున్నాడు.” యిర్మీ 9:23,24COLTel 349.4

    ఎవరూ డంబాలు పలుకకుండటానికి గాను ఈ ప్రతిఫలం పనుల నిమిత్తం కాదు. అదంతా కృపను బట్టే. “శరీరము విషయమై మన మూల పురుషుడగు అబ్రాహామునకేమి దొరికెనని అందుము? అబ్రాహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన యెడల అతనికి అతిశయ కారణము కలుగును గాని అది దేవుని యెదుట కలుగదు. లేఖనమేమి చెప్పుచున్నది? అబ్రాహము దేవుని నమ్మెను; అది అతనికి నీతిగా ఎంచబడెను.పని చేయువానికి జీతము ఋణమే గాని దానమని యెంచబడదు. పని చేయక భక్తిహనుని నీతిమంతునిగా తీర్చువానియందు విశ్వాసముంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. ” రోమా 4:1-5 కాబట్టి ఒకడు తాను ఇతరులకన్నా అధికుణ్ణిని అతిశయపడటానికి హేతువేమి లేదు. ఒకడికి ఇంకొకడికి పైగా ప్రత్యేక అధికత్యలు లేవు. గౌరవాన్ని ఒక హక్కుగా ఎవరు కోరలేదు.COLTel 350.1

    “యోహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చితివి. ఆయ నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చును”. రూతు 2:12. “నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగును. “కీర్త 59:11 “నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము పొందును” సామె. 11:18COLTel 350.2

    ఆ గొప్ప నిత్యజీవ బహుమానాన్ని మొదటివారు కడపటి వారు పంచుకోవాలి. మొదటివారు కడపటి వారికి సంతోషంగా స్వాగతం పలకాలి. బహుమానాన్ని ఇంకొకరితో పంచుకోవటానికి ఇష్టపడనివాడు తాను కృపద్వారా మాత్రమే రక్షణ పొందామని మర్చిపోతాడు. పనివారిని గూర్చిన ఉపమానం అసూయను అనుమానాన్ని ఖండిస్తుంది. ప్రేమ సత్యాన్ని అభినందిస్తుంది గాని ఆసూయతో నిండిన సరి పోలికలు చెయ్యను. ప్రేమ ఉన్నవాడు లోపాలతో నిండిన తన ప్రవర్తనన క్రీస్తు సుందర ప్రవర్తనతో పోల్చుకుని లోపాలు సరిచేసుకోవటానికి ప్రయత్నిస్తాడు.COLTel 350.3

    ఈ ఉపమానం పనివారందరికి ఒక హెచ్చరిక. వారి సేవ ఎంత దీర్ఘమైందైనా, ఎంత విస్తారమైందైనా వారు తమ సహోదరుల పట్ల ప్రేమ దేవుని ముందు అణుకువ కలిగి నివసించకపోతే వారు ఏమి లేనివారే అన్నది ఆ హెచ్చరిక. స్వార్ధాన్ని సింహాసం ఎక్కించేది మతం కాదు. సొంత కీర్తె తన ధ్యేయంగా పెట్టుకున్నవాడు. తనను క్రీస్తు సేవలో సమర్ధుణ్ణి చేయగల ఆ కృపను పోగొట్టుకుంటాడు. అహంభావం ఆత్మ సంతృప్తి ప్రాధాన్యం పొందినప్పుడల్లా సేవ దెబ్బతింటుంది.COLTel 351.1

    మనం పని చేసే సమయం నిడివి కాదు. ఆ పనికి మన సంస్జిద్ధత. ఆ పనిలో మనం కనపర్చే నమ్మకం దాన్ని దేవునికి అంగీకృతం చేస్తాయి. మన సేవ అంతటిలో మనల్ని మనం పూర్తిగా దేవునికి సమర్పించుకోవటం అవసరం. స్వార్ధ ప్రయోజనంతో చేసిన అత్యున్నత కార్యం కన్నా చిత్తశు ద్దితో మనల్ని మనం మర్చిపోయి నిర్వహించే మిక్కిలి చిన్న విధి దేవునికి ఎంతో ఆనందాన్నిస్తుంది. మనలో క్రీస్తు స్వభావం ఎంత ఉందో, మన సేవ క్రీస్తుపోలికను ఎంతవరకు వెల్లడి చేస్తుందో తెలుసుకోవటానికి ఆయన పరిశీలనగా చూస్తున్నాడు. మనం సాధించే మొత్తం పనికన్నా దాన్ని మనం ఎంత ఇష్టంగా నమ్మకంగా చేస్తామో దానికి దేవుడు ఎక్కువ విలువనిస్తాడు.COLTel 351.2

    స్వార్ధం వచ్చినప్పుడు, ఆధిక్యపోరాటం అంతమైనప్పుడు హృదయాన్ని కృతజ్ఞత నింపినప్పుడు, జీవితాన్ని ప్రేమాపరిమళం నింపినప్పుడు అప్పుడు మాత్రమే క్రీస్తు ఆత్మలో నివసిస్తాడు. మనం దేవుని అప్పుడు మాత్రమే క్రీస్తు ఆత్మలో నివసిస్తాడు. మనం దేవుని జతపనివారంగా గుర్తింపు పొందుతాం.COLTel 351.3

    తమ పని ఎంత కష్టంగా ఉన్నా, యదార్ధమైన పనివారు దాన్ని భారమైన పనిగా భావించరు. వారు పని చెయ్యటానికి పని చేస్తూ మరణించటానికి సిద్ధంగా ఉంటారు. అయితే అది సంతోషంతో ఉత్సా హహృదయంతో చేసే పని. దేవునిలోని ఆనందం యేసు ద్వారా వ్యక్తమౌతుంది.వారి ఆనందం“నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు, ఆయన పని తుదముట్టించుటయు” అన్న కర్తవ్యాన్ని క్రీస్తు యందు పెట్టిన ఆంనదం (యోహా 4:34) వారు మహిమ ప్రభువతో సహకరించి పనిచేసేవారు. ఈ తలంపు వారి శ్రమను మధురం చేసి చిత్రాన్ని పటిష్టపర్చి ఏమి సంభవించినా దానికి ఆత్మను బలపర్చుతుంది. క్రీస్తు శ్రమల్లో పాలు పంచుకోవటం ద్వారా ఉదాత్త మనస్కులవుతూ ఆయన సానుభూతిని పంచుకుంటూ తన సేవలో ఆయనతో సహరకిస్తూ స్వార్ధ రహిత హృదయాలతో పనిచేస్తూ సంతోషనందాల ప్రవాహాన్ని పెంపుచేస్తూ వారు ఆయన ఘననామానికి ఘనత స్తుతి తెస్తారు.COLTel 351.4

    దైవ సేవ విషయంలో యధార్ధ సేవా స్పూర్తి ఇదే. ఈ స్పూర్తి లోపించిటం వల్ల మొదటివారుగా కనిపించే అనేకమంది కడపటివారు అది ఉన్నవారు కడపటి వారుగా లెక్కింపబడ్డప్పటికి మొదటివారు అవుతారు.COLTel 352.1

    క్రీస్తుకి తమ్మునితాము సమర్పించుకున్నవారు అనేకులున్నారు. అయినా విస్తృత సేవ చెయ్యటానికి లేక ఆయన సేవలో గొప్ప త్యాగాలు చెయ్యటానికి వచ్చే అవకాశాల్ని వారు చూడరు. దేవునికి మిక్కిలి అంగీకృతమైంది. హతసాక్షి ఆత్మార్పణ కానవసరం లేదన్న తలంపు వారికి ఆదరణ చేకూర్చవచ్చు ప్రతీ రోజు అపాయాన్ని మరణాన్ని ఎదుర్కునే మిషనెనీ పరలోక రికార్డుల్లో అత్యున్నత స్థాయిలో నిలువకపోవచ్చు. తన వ్యక్తిగత జీవితంలో అనుదినం తన్ను తాను దేవునికి సమర్పించుకోవటంలో.. కార్యదీక్షలో, పవిత్రాలోచనల్లో, కోపం పుట్టించే పరిస్థితుల్లో తొణకకుండా సాత్వికంగా ఉండటంలో, విశ్వాసంలో, భక్తిలో, అతి చిన్న విషయాల్లో నమ్మకంగా ఉండటంలో, తన గృహ జీవితంలో క్రీస్తులా ప్రవర్తించే క్రైస్తవుడు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మిషనెరీకన్నా లేక హతసాక్షికన్నా దేవుని దృష్టిలో ఎంత ప్రశస్తమైనవాడు.COLTel 352.2

    మనుషుల ప్రవర్తనను తూకం వేసేటప్పుడు దేవుడు, మనుషులు వినియోగించే ప్రమాణాలు ఎంత విభిన్నమైనవి! లోకానికి తెలయని, ఆ మాటకొస్తే సన్నిహిత మిత్రులకి తెలియని ఎన్నో శోధనల్ని గృహంలోని శోధనలు, హృదయంలోని శోధనలు దేవుడు చూస్తాడు. దాని బలహీనత దృష్ట్యా ఆత్మ తాలూకు దీనత్వాన్ని ఆయన చూస్తాడు. ఒక్క దుష్టతలంపును గూర్చిన పశ్చాత్తాపానికి ఆయన చూస్తాడు. ఆయన సేవకు హృదయపూర్వక అంకిత భావాన్ని చూస్తాడు. స్వార్ధంతో జరుపుతున్న తీవ్ర పోరాటాన్ని విజయం ఆధించిన పోరాటాన్ని ఆయన గుర్తిస్తాడు. ఇదంతా దేవునికి దూతలకు తెలుసు. ప్రభువుకి భయపడి ఆయన నామం గురించి తలంచేవారు కోసం ఆయన ముందు ఒక జ్ఞాపకార్ధ గ్రంథం రాయటం జరగుతున్నది.COLTel 352.3

    విజయ రహస్యం మన జ్ఞానంలో ఆని మన హోదాలోగాని మన సంఖ్యాబలంలోగాని లేక మనకు అప్పగించబడ్డ తలాంతుల్లో గాని మానవుడి చిత్తంలో గాని లేదు. మనం సమర్థుళం కామన్న విషయం గుర్తెరిగి మనం క్రీస్తు పై ధ్యానం నిలపాలి. సమస్త శక్తికి శక్తినిచ్చేవాడు. సమస్త ఆలోచనకు ఆలోచన అయిన ప్రభువు ద్వారా ఇచ్చయించి విధేయులయ్యేవారు విజయం మీద విజయం సాధిస్తారు.COLTel 353.1

    మన సేవ ఎంత స్వల్పకాలికమైందైనా లేక మన పని ఎంత సమాన్యమైందైనా మనం క్రీస్తును విశ్వాసంతో వెంబడించినట్లయితే ప్రతిఫలం విషయంలో మనం నిరాశచెందాల్సిన అవసరంలేదు. గొప్ప వ్యక్తులు గొప్ప జ్ఞానులు సంపాదించలేనిదాన్ని అతి బలహీనులు మిక్కిలి సామాన్యులు సాధించవచ్చు. ఆత్మోన్యతి కోరేవారికి పరలోకపు బంగారు గుమ్మాలు తెరచుకోవు. గర్విస్టులికి ఆ గుమ్మాలు పైకెత్తబడువు. కాని చిన్న పిల్ల వణుకుతున్న చేతులతో స్పృశించినప్పుడు నిత్యత్వపు గుమ్మాలు తెరుచుకుంటాయి. సామాన్య నిరాడంబర విశ్వాసంతోను ప్రేమతోను దేవునికి సేవ చేసేవారికి కలిగే ప్రతిఫలం ధన్యమైంది.COLTel 353.2