Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
క్రీస్తు ఉపమాన ప్రబోధాలు - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    ఆ ఒక్క తలాంతు

    ఒక్క తలాంతు పొందిన మనిషి “వెళ్ళి భూమి త్రవ్వి తన యాజమాని సొమ్ము దాచి పెట్టెను”.COLTel 303.3

    మిక్కిలి స్వల్పమైన వరం ఉన్న మనిషి తన తలాంతును వృద్ధిపర్చ కుండా దాచి పెట్టాడు. వరాలన్నటిలోను తమకున్నది చిన్న వరమే గనుక క్రీస్తు సేవ నుంచి తమకు మినహాయింపు ఉంటుందని భావించే వారందరికి ఇందులో ఒక హెచ్చరిక ఉన్నది. తాము ఏదో గొప్ప కార్యం చెయ్యగలిగితే వారు దాన్ని ఎంత ఆనందంగా చేపట్టేవారు. అయితే తాము చిన్న చిన్న వాటి ద్వారా మాత్రమే సేవ చెయ్యాలి గనుక తాము ఏమి చెయ్యకుండా నిష్క్రియాపరులవ్వటాన్ని సమర్ధించుకోజూస్తారు. ఇందులో వారు పొరపాటు చేస్తున్నారు.తన వారల పంపకం ద్వారా ప్రభువు ప్రవర్తనను పరీక్షిస్తున్నాడు. తన తలాంతుని వృద్ధిపర్చటానికి నిరాకరించిన వ్యక్తి అపనమ్మకస్తుడైన సేవకుడుగా నిరూపించుకున్నాడు. అతడికి అయిదు తలాంతులు ఇచ్చి ఉంటే వాటిని కూడా ఆ ఒక్క తలాంతుని పాతి పెట్టినట్లు పాతి పెట్టేవాడు.ఆ ఒక్క తలాంతును అతడు దుర్వినియోగపర్చటం అతడు దేవుని వరాల్ని తృణీకరిస్తున్నట్లు సూచిస్తుంది.COLTel 303.4

    “మిక్కిలి కొంచెముతో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోను నమ్మకముగా ఉండును”. లూకా 16:10 చిన్నవి కాబట్టి తరుచు చిన్న విషయాల ప్రాముఖ్యాన్ని అంతగా గుర్తించం. కాని జీవితం అసలు క్రమశిక్షణను ఈ చిన్న చిన్న విషయాలే సమకూర్చతాయి. నిజానికి క్రైస్తవ జీవితంలో అవసరం లేనివంటూ ఏవీలేవు. చిన్న చిన్న విషయాలు ప్రాముఖ్యాన్ని తక్కువ చేస్తే మన ప్రవర్తన నిర్మాణం ప్రమాదంలో పడుతుంది.COLTel 304.1

    “మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కవ లోను అన్యాయంగా ఉండును. మిక్కిలి స్వల్పమైన విధుల్లో అపనమ్మకంగా ఉండేవాడు. తన సృష్టికర్తకు చెందే సేవ విషయంలో ఆయన్ని దోచుకుంటున్నాడు. ఈ అపనమ్మకం అతనికే చోటు చేస్తుంది. మినహాయింపు లేకుండా దేవునికి సమర్పించుకోవటం ద్వారా మాత్రమే పొందగల కృప, శక్తి ప్రవర్తన బలిమిన పొందటంలో అతడు విఫలు డవుతాడు. క్రీస్తుకి దూరంగా నివసిస్తున్న అతడు సాతాను శోధనలకు గురి అవుతాడు. అతడు రక్షకునికి చేసే సేవలో తప్పులు చేస్తాడు. చిన్న చిన్న విషయాల్లో సరి అయిన నియమాల నడుపుదల లేనందు వల్ల అతడు తన ప్రత్యేక సేవగా పరిగణించే గొప్ప విషయాల్లో దేవునికి విధేయత చూపటంలో విఫలుడవుతాడు. జీవితంలోని ఆప్రాముఖ్య విషయాలు సందర్భంగా వ్యవహరించేటప్పుడు అతడు రహస్యంగా ప్రేమించే లోపాలు మరింత ప్రాముఖ్యమైన విషయాల్లోకి ప్రవేశిస్తాయి. తాను ఏ సూత్రాలను అలవాటు పడ్డాడో వాటి ప్రకారం క్రియలు చేస్తాడు. ఈ రకంగా పునరావృతమై క్రియలు చేస్తాడు. ఈరకంగా పునరావతృతమై క్రియలు అలవాట్లుగాను అలవాట్లు ప్రవర్తనగాన పరివర్తన చెందుతాయి. ప్రవర్తనను బట్టి మన ప్రస్తుత భవిష్యత్తు నిత్యజీవానికి సంబంధించిన భవిష్యత్తు నిర్ధారితమౌతుంది.COLTel 304.2

    చిన్న చిన్న విషయాల్లో నమ్మకంగా ఉండటం ద్వారానే విశాల బాధ్యతల్లో నమ్మకంగా ఉండటానికి ఆత్మ శిక్షణ పొందుతుంది. బబులోనులోని అన్యులైన ప్రముఖ వ్యక్తులు యధార్ధ మత నియామల్ని తెలుసుకునేందుకు దేవుడు దానియేలు అతడి అనుచరుల్ని వారితో సంబంధములోకి నడిపించాడు. విగ్రహారాధక జాతి నడుమ దానియేలు దేవుని ప్రవర్తనను సూచించాల్సి ఉన్నాడు.COLTel 305.1

    అంత నమ్మకం గౌరవం గల హోదాకి అతడు ఎలా సిద్ధం చెయ్యబడ్డాడు? చిన్న చిన్న విషయాల్లో అతడు కనపర్చిన నమ్మకమే తన యావజ్జీవితానికి వన్నె కూర్చింది. మిక్కిలి చిన్న వీధుల్లో సయితం దానియేలు దేవుని ఘనపర్చాడు. అలాగే ప్రభువు అతడితో సహకరించాడు. దానియేలు అతడి సహచరులికి దేవుడు “జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించును. మరియు దానియేలు సకల విధములగ దర్శనములను స్వప్న భావములను గ్రహించు తెలివిగలవాడై యుండెను”. దాని 1:17. బబులోనులో తనకు సాక్షిగా ఉండేందుకు దేవుడు దానియేలుని ఎలా పిలిచాడో అలాగే నేడు ప్రపంచంలో తనకు సాక్షులుగా ఉండటానికి దేవుడు మనల్ని పిలుస్తన్నాడు. జీవితంలోని చిన్న చిన్న విషయాల్లోను అత్యున్నత వ్యవహారాల్లోను తన రాజ్య నియామల్ని మనుషులకు మనం వెల్లడించాలని దేవుడు కోరుతున్నాడు.COLTel 305.2

    లోకంలో క్రీస్తు నివసించినప్పుడు చిన్న చిన్న విషయాలపై శ్రద్ధ చూపించాలన్న పాఠం బోధించాడు.విమోచన మహాకార్యం నిత్యం ఆయన మనసులో ఉన్న పెద్దభారం ఆయన బోధనలోను స్వస్తపర్చే పరిచర్యలోను ఆయన మానసిక, శారీరక శక్తులు తీవ్ర శ్రమకు గురి అయ్యేవి. అయినా జీవితంలోని ప్రకృతిలోని చిన్న చిన్న విషయాల్ని ఆయన గుర్తించాడు. ప్రకృతిలోని చిన్న చిన్న విషయాల్ని తీసుకొని దేవుని రాజ్యానికి సంబంధిం చిన మహత్తర సత్యాల్ని విశదీకరించటానికి వాటిని సాదృశ్యాలుగా వినియోగించి ఉపదేశ పూరితమైన పాఠాలు బోధించాడు.COLTel 305.3

    తన సేవకుల్లో మిక్కిలి దీనుల లేమిని ఆయన విస్మరించలేదు. లేమిని గూర్చిన ప్రతీ మొరను ఆయన విన్నాడు. జన సముహంలో ఉన్న వ్యాధి బాధితురాలైన స్త్రీ స్పర్శను ఆయన గుర్తించాడు. విశ్వాసంతో నిండిన చిన్న స్పర్శకు ఆయన స్పందించాడు. యాయూరు కుమార్తెను మరణం నుంచి లేపినప్పుడు ఆమె తినటానికి ఏమైనా ఇవ్వాల్సిందిగా ఆమె తల్లితండ్రులకు సూచించాడు. తన సొంత శక్తి చేత ఆయన సమాధి నుండి లేచినప్పుడు, తనకు చుట్టబడ్డ బట్టలు మడత పెట్టి వాటిని జాగ్రత్తగా సరైన స్థలంలో పెట్టటానికి ఆయన వెనుదియ్యలేదు.COLTel 306.1

    క్రైస్తవులుగా మనం చెయ్యటానికి పిలుపు పొందుతున్న పని ఆత్మల రక్షణార్ధం క్రీస్తుతో సహకరించటం. ఈ పని చెయ్యటానికి మనం ఆయనతో నిబంధన చేసుకున్నాం. ఆ వనిని నిర్లక్ష్యం చెయ్యటం క్రీస్తుకి అపనమ్మకంగా ఉన్నట్లు నిరూపించుకోవటమే అయితే ఈ కార్యసాధనకు ఆయన ఆదర్శాన్ని అనుసరించి చిన్న చిన్న విషయాలపై శ్రద్ధ పెట్టాలి. ప్రతీ క్రైస్తవ సేవాశాఖ కృషిలోను ప్రభావంలోను విజయ రహస్యం ఇదే.COLTel 306.2

    ఆయన ఇవ్వటానికి సంసిద్ధంగా ఉన్న సామర్ధ్యాన్ని కలిగి ఉండటం. ద్వారా ఆయన్ని మహిమపర్చేందుకు తన ప్రజలు నిచ్చెన చివరి మెట్టుకు చేరాలని ప్రభువు కోరుతున్నాడు. లోకం అచరించే ప్రణాళికల కన్నా మనం మెరుగైన ప్రణాళికల్ని ఆచరిస్తున్నామని వెల్లడి చెయ్యటానికి దేవుని కృప ద్వారా మనకు ప్రతీ ఏర్పాటు చేయ్యబడింది. మనం దేవున్ని విశ్వసిస్తున్నాం. గనుక తన శక్తి పరంగాను, అవగాహన విషయంలోను నిపుణత జ్ఞానం విషయలోను మనం ఆధిక్యతను కనపర్చవలసి ఉన్నాం.COLTel 306.3

    కాగా ఎక్కువ వరాలు లేనివారు నిరాశ చెంల్సిన అవసరం లేదు. తమ ప్రవర్తనలో ప్రతీ బలహీనత విషయలోనూ జాగ్రత్తగా ఉంటు దైవ కృప ద్వారా దాన్ని అధిగమించి బలపడూ వారు తమకున్న దాన్ని ఉప యోగించుకోవాలి. జీవితంలోని ప్రతీ కార్యంలోకి నమ్మకాన్ని విశ్వసనీయతను అల్లుకుంటూ దేవుని సేవ ముగింపుకు తోడ్పడే గుణగణాల్ని పెంచుకోవాలి.COLTel 307.1

    అలక్ష్యపు అలవాట్లును దృఢ చిత్తంతో అధిగమించాలి. అతి ఘోర తప్పిదాల క్షమాపణకు అది మంచి సాకుగా అనేకులు భావిస్తారు. అయితే వారికి ఇతరులకి మానసిక శక్తులు లేవా ? అప్పుడు వారు జ్ఞాపకశక్తిని పెంచుకునేందుకు తమ మనసుల్ని క్రమశిక్షణలో పెట్టుకోవాలి. మర్చిపోవటం పాపం నిర్లక్ష్యం చెయ్యటం, పాపం, మీకు నిర్లక్ష్యం చేసే అలవాటు ఉంటే మీ సొంత రక్షణనే నిర్లక్ష్యం చేసి చివరికి మీరు దేవుని రాజ్యంలో ప్రవేశించటానికి సిద్ధంగా లేనట్లు తేలవచ్చు. COLTel 307.2

    గొప్ప సత్యాల్ని చిన్న చిన్న విషయాల్లోకి తేవాలి. దిన దిన సామాన్య వీధుల్లోకి ప్రయోగాత్మక మతాన్ని తేవాలి. ఏ మనుషుడికైన ఉండాల్సిన అత్యున్నత అర్హత దైవ వాక్యాన్ని తిరుగలేని విధేయతతో ఆచరించటమే.COLTel 307.3

    తాము ప్రత్యక్షంగా మతపరమైన పనిలో లేరు గనుక తమ జీవితాలు నిరుపయోగమని, తాము దేవుని రాజ్యాభివృద్ధికి ఏమి చెయ్యటం లేదని అనేకులు భావిస్తారు. ఇది పొరపాటు. తాము చేసే పని ఇతరులు చెయ్యాల్సిన పని అయితే దేవుని గృహమంతటిలో తాము ఉపయోగం లేనివారమని తమ్ముని తాము నిందించుకోకూడదు. మిక్కిలి దీనమైన విధుల్ని అలక్ష్యం చెయ్యకూడదు. నమ్మకంగా చేసే ఏపనైనాదీవెనకరమే దానిలో నమ్మకం ఉన్నత సత్యాలకు శిక్షణ కావచ్చు. అది ఎంత సాదాసీదా పని అయినా సంపూర్ణ సమర్పణతో చేసినట్లయితే దేవునికి చేసే ఏ పని అయినా, ఆయనకు అత్యున్నత సేవ ఎంత అంగీకృతమో ఇదీ అంత అంగీకృతం.చిత్తశుద్ధితో సంతోషంగా అర్పిస్తే ఏ కానుకా చిన్న కానుక కాదు.COLTel 307.4

    మనం ఎక్కడున్నా మనకు నియమితమయ్యే విదిని చేపట్ట వలసిందని క్రీస్తు ఆదేశిస్తున్నాడు. ఇది గృహంలో అయితే ఇష్టపూర్వకంగా దాన్ని చేపట్టి గృహాన్ని ఆనందదాయకం చెయ్యండి.COLTel 308.1

    మీరు ఒక తల్లి అయితే మీ బిడ్డల్ని క్రీస్తు విశ్వాసంలో పెంచండి. బోధకుడు ప్రసంగ వేదిక నుండి చేసే సేవలాగ ఇది నిజమైన దైవ సేవ. మీది వంటశాలలో చేసే పని అయితే పరిపూర్ణమైన వంటకత్తె కావటానికి కృషి చెయ్యండి. ఆరోగ్యవంతమైన, పౌష్టికమైన, రుచికరమైన ఆహారం తయారు చెయ్యండి. ఆహారం తయారీలో శ్రేష్ఠమైన దినుసుల్ని ఉప యోగించేటప్పుడు మీ మనసులో ఉత్తమ తలంపులికి తావివ్వాలని జ్ఞాపకముంచుకోవాలి. నేల దున్నటం లేక ఏదైనా వ్యాపారం చెయ్యటం మీ పని అయితే ఆ పనిని విజయవంతంగా చెయ్యండి. మీరు చేస్తున్న పని మీద మనసు పెట్టండి. మీ పని అంతటిలో క్రీస్తు ప్రతినిధిగా వ్యవహరించండి. మీ స్థానంలో ఉంటే ఆయన చేసి ఉండేటట్లు మీ పని చెయ్యండి.COLTel 308.2

    మీ తలాంతు ఎంత చిన్నదైనా దేవుడు దానికోస్థానం ఉంచాడు. తెలివిగా వినియోగిస్తే ఆ ఒక్క తలాంతు దాని నిర్దిష్ట కార్యాన్ని నెరవేర్చుతుంది. చిన్న చిన్న విధుల్ని నమ్మకంగా నెరవేర్చటం ద్వారా మనం కూడిక ప్రణాళిక ప్రకారం పని చెయ్యాలి. దేవుడు మన పక్షంగా గుణకారం ప్రణాళిక ప్రకారం పనిచేస్తాడు. ఆయన సేవలో ఈ చిన్న చిన్నవి అతి ప్రశస్తమైన ప్రభావాలవుతాయి.COLTel 308.3

    అతి సామాన్యమైన విధుల నిర్వహణ నుంచి బంగారు దారమల్లే సజీవ విశ్వాసాన్ని కనపర్చండి అప్పుడు ఆ దినం పని అంతా క్రైస్తవ పెరుగుదలను ప్రోది చేస్తుంది. నిత్యం యేసు వంక చూడటం జరుగుతుంది. ఆయన పట్ల ప్రేమ ఆ పని అంతటికి చోదక శక్తి అవుతుంది. ఇలా మన తలాంతుల సక్రమ వినియోగం ద్వారా మనం బంగారు గొలుసు మూలంగా ఉన్నత ప్రపంచంతో అనుసంధానపడతాం. దేవుని చిత్తానికి పరిపూర్ణ విదేయతతో నెరవేర్చటం ఇమిడి ఉంది.COLTel 308.4

    అయితే అనేకమంది క్రైస్తవులు ఎవరో తమకు గొప్ప పనిని తేవాలని కనిపెడ్తుంటారు. తమ అత్యాశను తృప్తిపర్చటానికి విశాలమైన స్థలం దొరకటంలేదు. గనుక జీవిత సామన్యా విధులన్ని నమ్మకంగా నిర్వర్తించటంలో విఫలులువతున్నారు. ఇవి వారికి నిరాసక్తంగా కనిపిస్తాయి. దేవునికి తమ విశ్వసనీయను చూపించటానికి వారు దిన దినం అవకాశాల్ని జారవిడుస్తారు.వారు గొప్ప పని కోసం కని పెడుతున్న సమయంలో జీవితం గతించిపోతుంది. అది దాని ఉద్దేశం నెరవేరకుండా మిగిలిపోతుంది. దాని పని అసంపూర్తిగా ఉండిపోతుంది.COLTel 309.1