Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
క్రీస్తు ఉపమాన ప్రబోధాలు - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    ముండ్ల పొదలలో

    “ముండ్ల పొదలలో విత్తబడినవాడు వాక్యము వినువాడే గాని ఐహిక విచారమను ధనమోసమును ఆ వాక్యమును అణిచివేయును గనుక వాడు నిష్పలుడుగును”.COLTel 29.3

    సువార్త విత్తనం తరుచు ముండ్ల పొదల్లోను హానికరమైన కలుపు మొక్కలలోను పడుతుంటుంది. మానవుడి హృదయంలో నైతికమైన మార్పు చోటుచేసుకోకపోతే, మునుపటి పాపజీవితపు అలవాట్లు ఆచారాలు అతడు విడువకోతే, సాతాను గుణ లక్షలణాలు విసర్జించకపోతే గోధుమ పైరు అణగారి పోతుంది. ముళ్ళ పొదలే మిగిలి గోధుమ పంటను నాశనం చేస్తాయి.COLTel 29.4

    ప్రశస్త సత్య విత్తనాలికి నిత్యం సిద్ధం చేయబడుతున్న హృదయంలోనే కృప వృద్ధి చెందుతుంది. పాపపు ముళ్ళ పొదలు ఏ నేలలోనైనా పెరుగుతాయి. వాటికి సేద్యం అవసరం లేదు. అయితే కృపకు జాగ్రత్తగా సేద్యం చేయ్యాలి. కలుపు మొక్కలు ముళ్ళపొదలు మొలవటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. అందుచేత శుద్ధి ప్రక్రియ నిత్యం కొనసాగాలి. హృదయాన్ని దేవుని అదుపులో ఉంచకపోతే, ప్రవర్తనను శుద్ధి చేయటానికి పరిశుద్ధాత్మ నిరంతరం పని చేయ్యకపోతే పాత అలవాట్లు మళ్ళీ తలెత్తుతాయి. సువార్తను నమ్ముతున్నామని మనుషులు చెప్పవచ్చు. కాని సువార్త వారిని పవిత్రపర్చితే తప్ప వారి క్రైస్తవం వ్యర్ధం. వారు పాపాన్ని జయించకపోతే పాపం వారిని జయిస్తుంది. వేళ్ళతో పెరికి వేయటానికి కేవలం నరికివేసిన ముళ్ళ పొదలు ఆత్మఅంతటా విస్తరించేంతవరకు వేగంగా పెరుగుతాయి.COLTel 29.5

    ఆత్మకు ఏవి ప్రమాదకరమో వాటిని క్రీస్తు పేర్కొన్నాడు. మార్కు దాఖలు చేసినట్లు ఐహిక విచారాలు, దనమోసాలు, ఇతర లోక విషయాల పై ఆశను ఆయన ప్రస్తావిస్తున్నాడు. పెరుగుతున్న ఆధ్మాత్మిక విత్తనాన్ని అనగా వాక్యాన్ని అణిచివేసేవి ఇవే. ఆత్మ క్రీస్తు నుంచి పోషణ పొందటానికి మానేస్తుంది. ఆది ఆధ్మాత్మికంగా మరణిస్తుంది.COLTel 30.1

    “ఐహిక విచారములు”. ఐహిక విషయాల సందర్భముగా శోధనకు గురికాని ప్రజావర్గం ఒక్కటి కూడా ఉండదు. బీదవారికి శారీరక శ్రమ, వంచన లేమిని గూర్చిన భయం, అందోళన మనోవ్యధ కలిగిస్తాయి. పొలంలోని పువ్వుల నుండి మనం నేర్చుకోవాల్సిందిగా క్రీస్తు కోరిన పాఠాన్ని ఆయన అనుచరుల్లో అనేకమంది మర్చిపోతున్నారు. ఆయన నిత్య శ్రద్ధాసక్తులికి వారు తమ్ముని తాము అప్పగించుకోరు., క్రీస్తు వారి భారాల్ని మోయలేడు. ఎందుకంటే వారు తమ భారాన్ని ఆయన మీద మోపటం లేదు. అందుచేత సహాయం కోసం ఓదార్పు కోసం తమను రక్షకుని వద్దకు విడిపించాల్సిన విచారాలు చింతలు వారిని ఆయననుంచి విడదీస్తున్నాయి.COLTel 30.2

    దైవ సేవలో ఫలభరితంగా ఉండగలిగే అనేకులు ధన సంపాదనలో నిమగ్నమవుతున్నారు. వ్యాపార వ్యవహారలు వారి సర్వశక్తినీ హరించి వేస్తుండటంలో వారు ఆధ్మాత్మిక విషయాల్ని ఆశ్రద్ధ చెయ్యడం జరగుతుంది. వారు ఇలా దేవునికి దూరమవుతున్నారు. వ్యాపార విషయంలో “మాంద్యులు కాక” మొలగాలని లేఖనాలు మనల్ని హెచ్చరిస్తున్నాయి. రోమా 12:11 ఉపదేశం అవసరమైన వ్యక్తికి ఉపదేశమిచ్చేందుకు మనం కృషి చేయాలి. క్రైస్తవులు పనిచేయ్యాలి. వ్యాపారం చెయ్యాలి. పాపం చెయ్యకుండా వీటిని నిర్వహించవచ్చు. కాని అనేకులు ప్రార్ధించటానికి బైబిలు చదువుకోవటానికి దేవున్ని పూజించటానికి సమయంల లేనంతగా వ్యాపార విషయాల్లో తలమునకలై ఉంటారు. కొన్నిసార్లు వారి ఆత్మ పరిశు ద్దతను పరలోకాన్ని వాంఛిస్తుంది. అయితే దేవుని ఆత్మ గంభీర, అధికారపూరిత వాక్కుల్ని వినటానికి లోకం గోల నుంచి సందడి నుండి పక్కకు తప్పుకోవటానికి వారికి సమయం ఉండదు. నిత్యత్వానికి సంబంధించిన వాటిని పక్కన పెట్టి ఐహికమైన వాటికి పెద్దపీట వేయడం జరుగుతున్న. వాక్య విత్తనం ఫలాలు ఫలించటం ఆసాధ్యం. ఎందుచేత నంటే ఆత్మ ప్రాణం ఐహికత ముళ్ళ పొదల పోషణకు ధారపోయడం జరుగుతున్నది.COLTel 30.3

    వేరే ఉద్దేశ్యంతో పనిచేసే అనేకమంది అలాంటి పొరపాటులోనే పడతారు. వారు ఇతరులు మేలు కొరకు పనిచేస్తుంటారు. వారి విధులు కష్టతరమైనవి. వారి శ్రమ జీవితం భక్తి భావానికి భక్తి కార్యాలికి సమయం మిగల్చదు. ప్రార్ధన వాక్యపఠనం ద్వారా దేవునితో మాట్లాడం వారు నిర్లక్ష్యం చేస్తారు. “నాకు వేరుగా ఉండి మీరేమియు చేయలేరు” అని క్రీస్తు అన్న సంగతి వారు మర్చిపోతారు. యోహా 15:5 వారు క్రీస్తుని విడిచి పెట్టి విడిగా నడుస్తారు. ఆయన కృప వారిని ఆవరించదు,స్వార్ధంతో నిండిన వారి గుణ లక్షణాలు బయలుపడతాయి. అధిక్యం కోసం వాంఛ వలన, పరివర్తనలేని, ఎటువంటి లక్షణాలు గల హృదయం వలన వారి సేవ భ్రష్టుపడుతుంది. క్రైస్తవ సేవ వైఫల్యానికి ప్రధాన రహస్యాల్లో ఒకటి ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇందు వలననే దాని ఫలితాలు అంతంతమాత్రంగా ఉంటున్నాయి.COLTel 31.1

    “ధన మోసము”. ధనాశకు మొహించే మోసగించే శక్తి ఉంది. ఐహిక సిరిసంపదలు గలవారు తమకు ధనం సంపాదించే శక్తిని దేవుడే ఇస్తున్నాడని తరుచు మర్చిపోతారు. “మా సామర్ధ్యమును మా బాహుబలమును ఇంత భాగ్యము మాకు కలుగజేసెను” అని వారనుకుంటారు. ద్వితి 8:17 దేవునికి కృతజ్ఞతలు తెలపటానికి బదులు వారి భాగ్యం ఆత్మ ఔనత్యానికి దారి తీస్తుంది. వారు దేవుని మీద ఆధారపడటం విస్మరిస్తారు. సాటి మానవుల పట్ల తమ బాధ్యతను వారు మర్చిపోతారు. భాగ్యాన్ని దేవుని మహిమ కోసం వినియోగంచే తలాంతుగా భావించే బదులు తమ కోసం ఉపయో గించుకొనే సాధనంగా పరిగణిస్తారు.ఆవిధముగా వాటిని ఉపయో గించటం వలన సిరులు మనిషిలో దైవ గుణ లక్షణాల్ని వృద్ధి పర్చే బదులు సాతాను గుణగణాల్ని పెంపొదిస్తాయి. ముళ్ళపొదలు వాక్య విత్తనాన్ని అణిచివేస్తాయి.COLTel 31.2

    “ఈ జీవిత సంబంధమైన..... ధన భోగములు”. కేవలం ఆత్మ సంతృప్తి కోసం వినోదాన్ని అన్వేషించడంలో ఆపాయం పొంచి ఉంది. శారీరక శక్తుల్ని బలహీనపర్చి మనసును మసకబార్చే లేక ఆధ్యాత్మిక స్పృహను మొద్దుబార్చే వినోదాలు “ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలు.” 1 పేతు 2:11COLTel 32.1

    “ఇతర వాంఛలు”. ఇవి పాప కార్యాలు కానక్కరలేదు. కాని ఇవి దేవుని రాజ్యానికన్నా మనం అగ్రస్థానం ఇచ్చే విషయాలు మనసును దేవుని నుంచి ఏదైతే ఆకర్షిస్తుందో, అనురాగాన్ని ఏదైతే క్రీస్తు నుంచి మళ్ళిస్తుందో అది ఆత్మకు శత్రువు.COLTel 32.2

    మనసు నవయవ్వనంతో బలంతో వేగంగా వృద్ధి చెందే అవకాశంతో కళకళలాడుతున్నప్పుడు స్వార్ధ ప్రయోజనాల సాధనకు స్వార్ధాశల తృప్తికి గొప్ప శోధన కలుగుతుంది. లోక సంబంధమైన పథకాలు విజయవంతమైతే, మనస్సాక్షిని మొద్దుబార్చి ఉద్రిక్త ప్రవర్తన ఎలా ఏర్పడుతుందోన్న దాని వాస్తవంగా అంచనా వేసే ప్రక్రియకు అడ్డు తగిలే తత్వం కొనసాగుతుంది. ఈ అభివృద్ధికి పరిస్తితులు అనుకూలంగా ఉన్నప్పుడు పెరుగుదల దైవకావ్యం నిషేధిస్తున్న దిశలో సాగుతున్నట్లు కనిపిస్తుంది. COLTel 32.3

    తమ బిడ్డలు పెరిగే సంవత్సరాల్లో తల్లితండ్రుల బాధ్యత ఎక్కువగా ఉంటుంది. వారు బాగా యోచించి తమ బిడ్డల చుట్టూ సరియైన ప్రభావాల్ని ఉంచాలి. అవి జీవితాన్ని గూర్చి జీవిత వాస్తవ జయాన్ని గూర్చి సరియైన దృక్పదం ఇచ్చే ప్రభావాలయ్యుండాలి. ఇది చేసే బదులు ఎంతమంది తల్లితండ్రులు తమ బిడ్డలకి ఐహికాభివృద్ధిని చేకూర్చటానికి తహతహ కనపర్చుతారు! అనేకమంది తల్లితండ్రులు పెద్ద నగరాల్లో స్థిరపడి తమ బిడ్డల్ని వినోదాలు విలాసాలతో నిండిన సమాజానికి పరిచయం చేస్తున్నా ఐహికతను డంబాన్ని ప్రోత్సహించే ప్రభావాల్ని వారి చుట్టు ఉంచుతారు. ఈ వాతావరణంలో మనసు, ఆత్మ క్షీణిస్తాయి. జీవిత ఉన్నత లక్ష్యాలు ఆదర్శాలు మరుగున పడిపోతాయి. దైవ కుమారులు కుమార్తెలు నిత్యత్వ వారసులు అయ్యే ఆదిక్యతను ఐహిక ఉపకారానికి మారకం చేసుకుంటారు.COLTel 32.4

    వినోదాల పట్ల తమ పిల్లలు కొర్కెల్ని తీర్చడం ద్వారా వారిని సంతోష పెట్టడానికి పెక్కు మంది తల్లితండ్రులు తాపత్రయ పడుతుంటారు. క్రీడల్లో పాలు పొందటానికి పార్టీలకు హాజరు కావటానికి అనుమితిచ్చి విచ్చలవిడి ప్రదర్శనకు తిని తాగటానికి వారికి డబ్బు ఇస్తారు. వినోదం కోసం కోరిక అధికమయ్యే కొద్ది అది మరింత బలోపేతమౌతుంది. వినోదమే జీవితంలో సాధించాల్సిన గొప్ప ధ్యేయంగా యువత పరిగణించే స్థితికి చేరే వరకు దాని పై ఆశక్తి ఇంతలంతలవుతుంది. వారు సోమరులు సుఖభోగప్రియులు అవుతారు. వీటి వల్ల వారు స్థిరత గల క్రైస్తవలవ్వటం ఆసాధ్యమవుతుంది.COLTel 33.1

    సత్యానికి స్థంబం కావలసిన సంఘం సయితం వినోదాల పట్ల మోజును ప్రోత్సహిస్తున్నట్లు కనిపిస్తుంది. మత సంబంధిత కార్యకలాపాలకు ద్రవ్యం సమకూర్చాల్సి వచ్చినపుడు పెక్కుమంది సంఘ సభ్యులు ఏ సాధనాల్ని వినియోగిస్తున్నారు? బజార్లు, రాత్రి బోజనాలు, ఫెన్సి పెయిర్స్, లాటరీలు మొదలైన వాటిని నిర్వహిస్తున్నారు. దైవరాధనకు ప్రత్యేకించిన మందిరాన్ని తరచు తిని తాగటానికి కొనటానికి అమ్మటానికి తుళ్ళుతూ గంతులు వెయ్యటానికి తరచుగా ఉపయోగించడం జరుగుతుంది. యువత మనసుల్లో దేవుని మందిరమన్నా ఆయన ఆరాధనన్నా గౌరవం భక్తి భావం తగ్గుతున్నాయి. ఆత్మ నిగ్రహ నియమాలు నిర్వీర్యమౌతున్నాయి. స్వార్ధపరత్వం, భోజన ప్రీతి, అడంబరతపట్ల మక్కువ పెరుగుతున్నాయి. వాటి ఆచరణ వాటి పెరుగుదలకు దోహదపడుతుంది.COLTel 33.2

    ఆటలు పాటలు వినోదాలు విందులు నగరాల్లో కేంద్రీకృతమయి ఉంటాయి. తమ బిడ్డలకు మంచి భవిష్యత్తు ఉండాలన్న ఉద్దేశ్యంతో నగర జీవితాన్ని ఎంపకి చేసుకొనే తల్లితండ్రులు ఆశాభంగానికి గురి అవుతున్నారు. తమ పొరపాటుకి ఆలస్యంగా పశ్చిత్తాపపడతారు. ఈనాటి నగరాలు వేగంగా సాదొమ గొమొర్రాలుగా మారుతున్నాయి. ఎక్కువ సెలవు దినాలు సోమరితనాన్ని ప్రోత్సహిస్తున్నాయి. సినిమాలు, గుర్రపు పందాలు, జూదం తాగి గంతులు వెయ్యటం వంటి వినోదాలు ఉద్రేకాలు రెచ్చగొట్టి తీవ్ర చర్యలకు నడిపిస్తాయి. సమకాలీన పరిస్థితులు యువతకు తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. వినోదం కోసమే వినోదాన్ని ప్రేమించటం నేర్చుకున్న వారు వరదలా వచ్చే శోధనకు లాకులు తెరుస్తారు. వారు తుళ్ళుతూ గంతు లేస్తూ అడ్డు అదుపూ లేకుండా ఆనందిస్తారు. వినోద ప్రియులతో వారి సంబంధాలు మనసు పై మత్తును కొలిపే ప్రభావం చూపిస్తాయి. విచ్చిన్నకరమై జీవితం జీవించాలన్న కోరికనూ సామార్థ్యాన్ని కోల్పోతారు. వారి మతపరమైన ఆకాంక్షలు చల్లబడిపోతాయి. వారి ఆధ్మాత్మిక జీవితం చీకటిమయమౌతుంది. ఆత్మ తాలూకు ఉన్నత శక్తులు మనిషిని ఆధ్మాత్మిక లోకానికి అనుసంధానపర్చే మానసిక శక్తులు భ్రష్టమవుతాయి.COLTel 33.3

    కొందరు తమ పొరపాటు గుర్తించి పశ్చాత్తాప పడవచ్చునన్నది నిజమే. దేవుడు వారిని క్షమించవచ్చు. అయితే వారు తమ ఆత్మల్ని గాయపర్చి తాము బతికి ఉన్న కాలమంతా తమ మీదికి ప్రమాదాన్ని తెచ్చుకుంటారు. తప్పొప్పుల్ని గ్రహించటానికి నిత్య నిశితంగా ఉంచుకోవాల్సిన గ్రహన శక్తి చాలామట్టుకు నాశనమౌతుంది. నడిపించే పరిశుద్ధాత్మ స్వరాన్ని వారు త్వరగా గుర్తించలేరు. సాతాను కుతంత్రాల్ని గ్రహించలేరు. ఆపాయము ఎదుర్కుంటున్న సమయంలో శోధనకు లొంగి పడిపోతారు. దేవునికి దూరమౌతారు. వినోదాల్ని ప్రేమించి వారి జీవితం ఈ లోకానికి పనికిరాదు. వచ్చే లోకానికి పనికిరాదు.COLTel 34.1

    మానవాత్మ కోసం సాతాను ఆడే జీవిత ఆటలో విచారాలు సిరులు వినోదాల్ని వినియోగిస్తాడు. మనకు ఈ హెచ్చరిక వస్తున్నది “ఈ లోకము నైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. లోకములో ఉన్న దంతయు అనగా శరీరాశయు నేత్రాశయ జీవపుడంబ మును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే”.1 యోహా 2:15,26 మానవహృదయాల్ని తెరచిన పుస్తకంలా చదవగలిగిన ఆ ప్రభు ఇలా అంటున్నాడు.“మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తువలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము ఆకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి.”. లూకా 21:34 పరిశుద్ధాత్మ ఆవేశం వల్ల ఆపొస్తలుడైన పౌలు ఇలా రాస్తున్నాడు. “ధనవంతులగుటకు ఆ పేక్షించవారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తమైన హానికరము లైన అనేక దురాశలోను పడుదురు. అట్టి మనుష్యులను నష్టములోను నాశనము లోను మంచి చేయరు ఎందుకనగా ధనా పేక్ష సమస్తమైన కీడులకు మూలము కొందరు దానినాశించి విశ్వాసము నుండి తొలగి పోయి నానా బాధలతో తమ్మును తామే పాడు చేసికొనిరి. 1 తిమో 6:9, 10.COLTel 34.2

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents