Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
క్రీస్తు ఉపమాన ప్రబోధాలు - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    సమయం

    మన సమయం దేవునికి చెందుతుంది. ప్రతీ గడియ ఆయనదే. దాన్ని ఆయన మహిమార్ధ: వినియోగించాల్సిన గంభీర బాధ్యత, మన మీద ఉంది. ఆయన ఇచ్చిన తలాంతులన్నిటిలో సమయం గురించి ఆయన కోరేంత ఖచ్చితమైన లెక్క మరిదేన్ని గురించి కోరడు.COLTel 289.2

    సమయం విలువ లెక్కలకు అంచనాలకు మించింది. క్రీస్తు ప్రతి గడియను ఎంతో విలువ గల దానిగా పరిగణించాడు. మనం కూడా సమయాన్ని అలాగే పరిగణించాలి. మనం జీవించేది స్వల్పకాలమే. దాన్ని వ్యర్ధపుచ్చకూడదు. నిత్య జీవితానికి సిద్ధపడటానికి మనకు కొన్ని దినాల కృపకాలం మాత్రమే ఉంది. విలాసాలు వినోదాలు పాపక్రియలకు వ్యర్ధపుచ్చటానికి మనకు సహాయం లేదు. బావి అమర్త్య జీవితానికి మనం ప్రవర్తల్ని నిర్మించుకోవలసిన సమయం ఇదే. రానున్న ఆ మహా తీర్పుకు మనం సిద్ధపడాల్సిన సమయం ఇదే.COLTel 290.1

    మానవులు నివసించటానికి మొదలు పెడ్తారో లేదో మరణించటం మొదలవుతుంది. నిత్య జీవాన్ని గూర్చిన వాస్తవిక జ్ఞానాన్ని సంపాదిస్తే తప్ప లోకంలోకి అనంతమైన శ్రమ వ్యర్ధంగా అంతమొందుతుంది. సమయానికి విలువ ఇచ్చే వ్యక్తి తన పని సమయంలో పరిస్థితుల అనుకూలతను బట్టి అనంతకాలం సాగే జీవితంలో తనకో నివాసం కోసం తన్ను తాను సిద్ధం చేసుకుంటాడు. అతడు జన్మించటం మంచిదే.COLTel 290.2

    సమయాన్ని కాపాడుకోవాలన్న హితవు మనకు వస్తుంది. అయితే వ్యర్ధంగా ఖర్చయిన సమయం తిరిగి సంపాదించలేం. ఒక్క గడియ కూడా తిరిగిరాదు. మనం సమయాన్ని కాపాడుకునే ఒకే మార్గం దేవుని విమోచన ప్రణాళికలో ఆయనతో సహకరించటం ద్వారా మన శేష జీవితాన్ని వినియోగించటమే.COLTel 290.3

    ఈ పనిచేసే వ్యక్తి ప్రవర్తనలో మార్పు చోటు చేసుకుంటుంది. అతడు దేవుని కుమారుడు. రాచకుటుంబ సభ్యుడు, పరలోక రాజు బిడ్డ అవుతాడు. దేవదూతల సహవాసానికి యోగ్యుడవుతాడు.COLTel 290.4

    మన తోటి మానవుల రక్షణ కోసం పని చెయ్యటానికి సమయం ఇదే. తాము దేవుని సేవ నిమితం ద్రవ్యం ఇస్తే సరిపోతుందని భావించేవారు కొందరున్నారు. ఆయన కోసం వ్యక్తిగత సేవ చెయ్యటానికి ఉన్న ప్రశస్త సమయం వ్యర్ధంగా గడుస్తుంది. దేవుని సేవ చెయ్యటానికి ఆరోగ్యం బలం ఉన్నవారు క్రియాశీలంగా పనిచెయ్యటం విధిగా ఆధిక్యతగా పరిగణించాలి. అందరు ఆత్మల్ని రక్షించటానికి కృషి చెయ్యాలి. ద్రవ్యాన్నివ్వటం దీనికి ప్రత్యామ్నాయం కాదు.COLTel 290.5

    ప్రతీ గడియ నిత్య పర్యవసానాలతో నిండి ఉన్నది. మనం ఒక్క గడియ వ్యవధిలో పనిచెయ్యటానికి సిద్ధంగా ఉండే మనుషులం కావలెను. ఆధ్యాత్మికంగా అవసరంలో ఉన్న ఒక ఆత్మతో జీవ వాక్కుల్ని పంచుకోవటానికి ఇప్పుడు మనకున్న తరుణం మళ్ళీ రాకపోవచ్చు. ఆ వ్యక్తితో దేవుడు “ఈ రాత్రి నీ ప్రాణము నడుగుచున్నాను” (లూకా 12:20) అనవచ్చు. మన ఆశ్రద్ధ వల్ల అతడు సిద్ధంగా లేకపోవచ్చు. ఆ మహా తీర్పు దినాన దేవునికి మనం ఎలా లెక్క అప్పగిస్తాం.COLTel 291.1

    నిత్య జీవానికి సంబందించిన విషయాలతో పోల్చినపుడు కొరగాని భౌతికమైన ఐహికమైన ప్రయోజనాల కోసం ప్రయాసపడటం జరగకూడనంత విలువైంది జీవితం. అయినా జీవితం తాలూకు లౌకి విషయాల్లో తనకు సేవ చేసేందుకు దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. ఈ పనిలో నమ్మకం భక్తిలా మతంలో భాగం. బైబిలు సోమరితనాన్ని సమర్ధించదు. సోమరితనం మన లోకాన్ని పీడిస్తున్న శాపం. మారు మనసు పొందిన ప్రతీ పురుషుడు ప్రతీ స్త్రీ పట్టుదలతో పనిచేసే సేవకుడు సేవకురాలు అవుతారు.COLTel 291.2

    మన సమయాన్ని సద్వినియోగపర్చుకోవటం పై జ్ఞానం మానసిక సంస్కృతి సంపదించుకోవటంలో విజయం ఆధారితమై ఉంటుంది. పేదరిక,ం సామన్య ప్రారంభం లేదా అనుకూల పరిసరాలు మానసిక పెరుగుదలకు అడ్డుబండలు కానక్కరలేదు. ఆ గడియల్ని మరిచిపోకుండా మనసులో ఉంచుకోవటం మంచిది. ఇక్కడ కొన్ని గడియలు అక్కడ కొన్ని గడియయలు అర్ధంలేని మాటల్లో వ్యర్ధం కావచ్చు. తరుచుగా ఉదయం ఎన్నో గంటలు పడకలో వ్యర్థమౌతుంటాయి,. బస్సులో రైళ్ళల్లో ప్రయాణంలో లేదా స్టేషన్లలో వేచి ఉండటంలో భోజనానికి కని పెట్టే సమయం అన్న సమయానికి రాని వారి కోసం వేచి ఉండటంలో ఈ సమయాన్ని అధ్యయనంలో పుస్తక పఠనంలో లేక ఆలోచించటంలో సద్వినియోగం చేసకుంటే అది సాధించలేము! ధృడ సంకల్పం, పట్టుదలతో కూడిన పరిశ్రమ, సమయాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవటం జ్ఞానాన్ని సంపాదించటానికి మానసిక క్రమశిక్షణ సాధించటానికి మనుషులికి దోహదపడతాయి. ఇవి వారిని దాదాపు ఏముఖ్యమైన సూదాకైన అర్హుల్ని చేస్తాయి.COLTel 291.3

    క్రమం, సంపూర్ణత, సామర్ధ్యాన్ని అలవరుకోవటం ప్రతీ క్రైస్తవుడి విధి. ఏ పనిని అస్తవ్యస్తంగా చేయటానికి ఎలాంటి సాకులేదు.ఒక వ్యక్తి ఎల్లప్పుడు పనిలో ఉన్న వాని పూర్తి కాకపోతే దానికి కారణం మనసును హృదయాన్ని ఆ పనిలో పెట్టకపోవటమే. మెల్లగా పనిచేస్తూ ఎక్కువ సాధించలేకపోయే వ్యక్తి అవి సరిదిద్దుకోవలసిన తప్పిదాల్ని గుర్తించాలి. ఉత్తమ ఫలితాల సాధనకు తన సమయాన్ని ఎలా వినియోగించుకోవాలో అతడు ఆలోచించి వ్యవహరించటం అవసరం.COLTel 292.1

    ఇతరులు పదిగంటల్లో చేసే పనిని నేర్పు పద్ధతి వల్ల కొందరు అయిదు గంటల్లో పూర్తి చెయ్యగలుగుతారు. ఇంటి పనుల్లో నిమగ్నమయ్యే కొందరు దినమెల్లా పనిచేస్తున్నట్లే కనిపించటానికి కారణం వారు చెయ్యటానికి ఎంతో పని ఉండటం కాదు గాని వారు సమయాన్ని ఆదా చెయ్యటానికి ప్రయత్నించకపోవటం తమ మెల్లని, జాప్యం జరిగే మార్గాల మూలంగా వారు చిన్న పనినే పెద్దపనిని చేస్తారు. కాగా మార్పు కావాలని వాంచించే వారందరూ ఈ అలవాట్లును సరిదిద్దుకోవచ్చు. తమ పనిలో వారికి నిర్దిష్టమైన గురి ఉండాలి. ఒక పనికి ఎంత సమయం పడుతుందో నిర్ణయించుకొని నిర్దిష్ట సమయంలో దాన్ని పూర్తి చెయ్యటానికి శాయశక్తులా ప్రయత్నించాలి. చిత్తశక్తి వినియోగం చేతుల్ని నిపుణతో చలింపజేస్తుంది. తీర్మానించుకుని తమ్ముని తాము సంస్కరించుకోవటానికి ధృడ సంకల్పం లోపించినందున వ్యక్తులు పాత పంథానే అవలంభిస్తూ తప్పు మార్గంలో కొనసాగవచ్చు. లేదా మత శక్తుల్ని వృద్ధిపర్చుకోవవటం ద్వారా అత్యుత్తమ సేవ చెయ్యటానికి సామార్థ్యాన్ని సంపాదించుకోవచ్చు. అప్పుడు వారికి ఎప్పుడైనా ఎక్కడైనా గిరాకి ఉంటుంది. వారి విలువను అందరూ అభినందిస్తారు.COLTel 292.2

    అనేకమంది చిన్నారులు యువత గృహ విధుల్ని నిర్వర్తిస్తూ తద్వారా తమ తండ్రి పట్ల తల్లి పట్ల తమ ప్రేమాభిమానాల్ని వెల్లడించటంలో తమ తండ్రి పట్ల తమ ప్రేమాభిమానాల్ని వెల్లడించటంలో గడపవలసిన సమయాన్ని వ్యర్ధపుచ్చుతున్నారు. ఇంకొకరు మోయాల్సిన భారానికి యువత తమ బలీయమైన యౌవన భుజాల మీదికి తీసుకోవచ్చు.COLTel 293.1

    తన చిన్ననాటి నుండి క్రీస్తు జీవితం పట్టుదలతో పనిచెయ్యటలో గడిచింది. తన్ను తాను తృప్తిపర్చుకోవటానికి ఆయన నివసించలేదు. తాను అనంతుడైన దేవుని కుమారుడైనా, తన తండ్రి యోసేపుతో కలసి వడ్రంగి వృత్తిని చేపట్టి పనిచేసాడు. ఆయన వృత్తి ప్రాముఖ్యమైనది ఈ లోకంలోకి ఆయన ప్రవర్తన నిర్మాణకుడిగా వచ్చాడు. అందులో ఆయన పని అంతా పరిపూర్ణం నిర్దుష్టం అయినది. తన దివ్యశక్తితో ప్రవర్తనలను మార్పు చేసినప్పుడు ఆ పని సంపూర్ణతను తెచ్చాడో అదే సంపూర్ణతను ఆయన చేసిన లౌకికమైన పని అంతటిలోకి తెచ్చాడు ఆయనే మన ఆదర్శం.COLTel 293.2

    తల్లితండ్రులు తమ బిడ్డలకు సమయాన్ని సద్వినియోగపర్చటం నేర్పించాలి. దేవుని ఘనపర్చేది మానవులకు మేలు చేసేది ఏదైనా కృషి చేసి ఆసధించదగిందని వారికి నేర్పించండి. చిన్న వయసులో సయితం వారు దేవునికి మిషనెరీలు కావచ్చు.COLTel 293.3

    తమ పిల్లలికి ఏ పని చెప్పకుండా వారిని ఊరకే ఉంచే తల్లితండ్రుల కన్నా ఘోరమైన పాపం చేసేవారు ఎవరు ఉండరు. అలాంటి పిల్లలు సోమరితనాన్ని ప్రేమించటం నేర్చుకొని ఎలాంటి నిపుణత లేని సోమరులైన స్త్రీ పురుషులుగా పెరుగుతారు. ఉపాధి సంపాదించగల వయసు వచ్చినప్పుడు వారు సోమరితనంగా, పడుతూ లేస్తూ పనిచేస్తూ నమ్మకంగా పనిచేసేవారిలా జీతం పొందాలని కని పెడతారు. ఈ తరగతికి చెందిన పనివారికి, తాము నమ్మకమైన గృహ నిర్వాహకులుగా పనిచెయ్యాలన్న గుర్తింపుతో పనిచేసే వారికి మధ్య బోలెడు తేడా ఉంది.COLTel 293.4

    లౌకికమైన పనిలో అలవాటైన అజాగ్రత్త వంటి అలవాట్లు మత జీవితంలోకి తేవటం జరుగుతుంటుంది. అటువంటి అలవాట్లున్న వ్యక్తి దేవుని సేవలో సమర్ధంగా పనిచెయ్యలేడు. నమ్మకమైన పని ద్వారా లోక శ్రయానికి తోడ్పడి ఉండగలిగే అనేకమంది సోమరితనం వల్ల నాశనమౌతున్నారు. పనికి స్థిరమైన సంకల్పం లేకపోవటం అనేక శోధనలకు తలుపు తీస్తుంది. దుష్ట స్నేహితులు, చెడు అలవాట్లు మనసును ఆత్మను భ్రష్టం చేస్తాయి. పర్యవసానంగా ఈ జీవితం రానున్న నిత్యజీవితం రెండూ నాశనమౌతాయి.COLTel 293.5

    మనం ఏ పనిచేస్తున్నా “ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి” అంటూ దైవ వాక్యం ఉపదేశిస్తుంది. “చేయుటకు నీ చేతికి వచ్చిన యే పనినైనను నీ శక్తికి లోపము లేకుండా చేయము. “అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్పూర్తిగా చేయుడి; మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులైయున్నారు”. రోమా 12:11 ప్రస 9:10 కొలొ 3:34COLTel 294.1

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents