Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
క్రీస్తు ఉపమాన ప్రబోధాలు - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    తలాంతుల తిరిగి చెల్లింపు

    “బహు కాలమైన తరువాత ఆ దాసుల యామానుడు వచ్చి వారి యొద్ద లెక్కచూచుకొనెను”. ప్రభువు తన సేవకుల వద్ద లెక్కలు చూసుకున్నప్పుడు ప్రతీ తలాంతును జాగ్రత్తగా తనిఖీ చెయ్యటం జరుగుతుంది. చేసిన పని పనివాడి ప్రవర్తనను బయలుపర్చుతుంది. అయిదు తలాంతులు పొందినవారు రెండు తలాంతులు పొందినవారు వాటిని వాటి మీద వచ్చిన లాభాన్ని సమర్పించారు. ఇలా చెయ్యటంలో వారు తమలో ఏదో విశేషగుణమున్నట్లు చెప్పలేదు. వారికున్న తలాంతులు వారికి అప్పగించినవి. వారు ఇంకా తలాంతులు సంపాదించారు. అయితే డిపాజిట్ లేకపోతే వృద్ధి అనేది ఉండేది కాదు. తాము తమ విధిని మాత్రం నిర్వహంచినట్లు వారు గుర్తించారు. మూలధనం దాని మీద వృద్ధి అయనదే. రక్షకుడు తన ప్రేమను కృపను వారికి అనుగ్రహించి ఉండకపోతే వారు నిరంతరం దివాలా స్థితిలోనే ఉండేవారు.COLTel 309.2

    అయితే ప్రభువు తలాంతుల్ని లెక్క చూసి తీసుకునేటప్పుడు అది వారి ప్రతిభే అన్నట్లు సేవకుల్ని మెచ్చుకొని వారికి ప్రతిఫలం ఇస్తాడు. ఆయన ముఖం సంతోషానందాలు, తృప్తితో వికసిస్తుంది. వారిని దీవించగలుగుతున్నందుకు ఆయన సంతోషిస్తాడు. వారి నుంచి తాను కోరిన ప్రతీ సేవకు ప్రతీ త్యాగానికి వారిని దీవించగలిగినందుకు సంతోషిస్తాడు. అది వారికి తాను చెల్లించాల్సిన రుణంగా కాదు గాని తన హృదయం ప్రేమానురాగాలతో పొంగి పొర్లుతుంది గనుక.COLTel 309.3

    ఆయన ఇలా అంటాడు ‘భళా నమ్మకమై మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైనవాటి మీద నియమించెదను. నీ యాజమానుని సంతోషములో పాలుపొందుదుము”.COLTel 310.1

    విశ్వాసపాత్రత, విశ్వసనీయత, అనురాగపూరిత సేవ - ఇవే మనకు దేవుని ఆమోదాన్ని సంపాదించగలవు. మంచితనానికి, దేవుని వద్దకూ మనుషుల్ని నడిపించే పరిశుద్దాత్మ ప్రతీ ప్రేరణ పరలోకల గ్రంథాల్లో దాఖలవుతుంది. తాను ఎవరి ద్వారా పనిచేస్తాడో వారిని దేవుని దినమందు ఆయన అభినందిస్తాడు.COLTel 310.2

    తమ కృషి ద్వారా ప్రభువు రాజ్యంలో ఉన్నవారిని వారు చూసినప్పుడు వారు ప్రభువు సంతోషంలో పాలు పొందుతారు. ఇక్కడ ఆయన సేవలో పాలుపొందటం ద్వారా సంపాదించిన పాత్రల వల్ల వారు అక్కడ ఆయన పనిలో పాలు పొందే విశేషావకాశం పొందుతారు. ఇప్పుడు ఇక్కడ ప్రవర్తన పరంగాను పరిశుద్ధ పరిచర్యపరంగాను మనం ఎలాగున్నామో దాని ప్రతి రూపం కాగే పరలోకంలో ఉంటాం. క్రీస్తు తన్ను గూర్చి తాను ఇలా అన్నాడు. “మనుష్యు కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకు. వచ్చెను”. మత్త 20:28 భూమి పై ఈ పరిచర్యే పరలోకంలో ఆయన చేస్తున్నాడు. ఈలోకంలో ఆయనతో కలసి పనిచేసినందుకు మనకు కలిగే ప్రతిఫలం ఏంటంటే రానున్నన ఆయన రాజ్యంలో ఆయనతో కలసి పనిచసేందుకు మరింత శక్తి ఇంకా విశాలమైన ఆధిక్యత కలుగుతుంది.COLTel 310.3

    “తరువాత ఒక తలాంతు తీసుకొనిన వాడును వచ్చి అయ్యా నీవు విత్తనిచోట కోయువాడవును. చల్లని చోట వంకూర్చువాడవునైన కఠినుడవని నేనెరుగుదును గనుక నేను భయపడి, వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచి పెట్టితిని; ఇదిగో నీది నీవు తీసుకొనుమని చెప్పెను'. మనుషులు దేవుని వరాల్ని నిర్లక్ష్యం చెయ్యటానికి ఈ రకంగా సాకులు చెప్పుతారు. వారు దేవున్ని కఠినుడు నిరంకుశపాలకుడు తమను తప్పు పట్టాటానికి కని పెట్టి తీవ్ర శిక్షలు విధిచేవానిగా పరిగణిస్తారు. ఆయన తమకు ఎన్నడూ ఇవ్వనిదాన్ని తమ నుండి డిమాండు చేస్తాడని విత్తనిచోట వంట కూర్చుతాడని ఆరోపిస్తారు.COLTel 310.4

    ఆయన తమ సంపదను తమ సేవలను కోరుతున్నాడు. గనుక దేవుడు కఠినుడైన యాజమాని అని అనేకులు తమ హృదయాల్లో తలపోసుకుంటారు అయితే ఆయనకు లేనిది తనది కానిది ఆయనకు మనం ఏమి ఇవ్వలేం.“సమస్తమును నీ వలననే కలిగెనుగదా? నీవు స్వసంపాద్యములో కొంత మేము నీకిచ్చియున్నామ” అని దావీదు రాజన్నాడు (1 దినవృ 29:14) సమస్తం దేవునిదే - సృష్టిద్వారానే కాదు విమోచన ద్వారా కూడా. ఈ జీవితానికి నిత్యజీవితానికి మేలులన్నీ కల్వరి సిలువ ముద్రతో మనకు కూడా వస్తున్నాయి. కాబట్టి దేవుడు కర్కోటకుడైన యజామని విత్తని చోట పంటకూర్చేవాడు ఆన్న ఆరోపణ అబద్దం.COLTel 311.1

    దుష్టుడైన ఆ సేవకుడి అన్యాయపు ఆరోపణని తప్పు అని యాజమాని ఖండించలేదు. కాని అతడి పంథానే అనుసరించి, తన ప్రవర్తనకు ఎలాంటి సాకూ లేదని మాత్రం చూపించాడు. యాజమానికి లాభం చేకూర్చేందుకు మార్గాలు సాధనాలు ఏర్పాటయ్యాయి.“నీవు నా సొమ్ము సాహుకారుల యొద్ద ఉంచవలసియుండెను; నేను వచ్చి వడ్డితో కూడ నా సొమ్ము తీసికొనియుందునే” అన్నాడు యాజమాని.COLTel 311.2

    మనకు తానిచ్చిన శక్తి సామార్థ్యాలికి తక్కువ గాని, మించి గాని మన నుంచి మన పరలోకపు తండ్రి కోరాడు. తాము మోయలేని భారాన్ని తన సేవకుల మీద మోపడు. “మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసియేయున్నవి. మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసికొనుచున్నాడు.” కీర్త 103:14.COLTel 311.3

    “ఎవనికి ఎక్కువగా ఇయ్యబడెనో వాని యొద్ద ఎక్కువగా తీయజూతును”. లూకా 12:48 మనకున్న సామార్థ్యాన్ని ఒక్క వీసం తక్కువ కాకుండా పనిచెయ్యటానికి మనం వ్యక్తిగతంగా బాధ్యులమవుతాం. సేవకు ప్రతీ అవకాశాన్ని సాధ్యతను ప్రభువు ఖచ్చితంగా లెక్కలు వేస్తాడు. ఉప యోగించిన సామార్థ్యాల్ని లెక్క చూసినట్లే ఉపయోగించని వాటిని కూడా లెక్కజూస్తాడు. మన తలాంతులు సక్రమ వినియోగం ద్వారా మనం ఏమి కాగలమో దానికి దేవుడు మనల్ని బాధ్యుల్ని చేస్తాడు. మనం ఏమి చేయాల్సి ఉందో దేవుని మహిమపర్చటానికి మనకున్న శక్తుల్ని వినియోగించినందుకు ఏది చెయ్యలేకపోయామో దాని ప్రకారం మనం తీర్పు పొందుతాం. మనం మన ఆత్మల్ని పోగొట్టుకోకపోయినా, ఉపయోగం అవ్వని మన తలాంతులు పర్యవసానాల్ని నిత్యత్వంలో గుర్తిస్తాం.మనం సంపాదించగలిగి ఉండి సంపా దించని జ్ఞానం సామర్ధ్యం అంతటికి నిత్యకాలికమైన నష్టం ఉంటుంది.COLTel 311.4

    అయితే మనల్ని మనం దేవునికి సంపూర్తిగా అంకితం చేసుకొని మన పనిలో ఆయన సూచనల్ని అనుసరించినట్లయితే ఆ పని పూర్తికి ఆయనే బాధ్యత వహిస్తాడు. చిత్తశుద్ధితో మనం చేసే ప్రయత్నాల జయం విషయంలో మనం ఊహాగానాలు చేయనవసరం లేదని ఆయనంటున్నాడు. వైఫల్యం గురించి ఒక్క తలపంపు కూడా రాకూడదు. పరాజయం లేని ప్రభువుతో మనం సహకరించాలి.COLTel 312.1

    మనం మన ఆశక్తత అసమర్ధత గురించి మాట్లాడకూడదు. ఇది దేవున్ని శంకించటం ఆయన వాక్యాన్ని ఉపేక్షించటం అవుతుంది. మన కష్టాల గురించి విసుగుకున్నప్పుడు లేక మనం నిర్వహించాల్సిందిగా ఆయన ఇస్తున్న బాధ్యతల్ని నిరాకరించినప్పుడు, ఆయన కఠినమైన యాజమాని అని ఏ పని చెయ్యటానికి మనకు శక్తి నివ్వలేదో దాన్ని చెయ్యమని ఆదేశిస్తున్నాడని మనం నిజంగా చెబుతున్నాం.COLTel 312.2

    సోమరి సేవకుడి స్వభావాన్ని మనం తరుచుగా వినయం అంటాం. కాని యదార్ధ వినయం చాలా వ్యత్యాసమైనది. వినయ స్వబావుల మవ్వటమంటే మనం మానసికంగా మరుగుజ్జులం, ఆశలు, ఆశయాలు లేనివారం, మన జీవితాల్లో పిరికివారం, పరాజయం పాలుకాకుండేందుకు బాధ్యతల్నే నిరాకరించేవారం కావాలి అని అర్ధం కాదు. అసలైన వినయం దేవుని శక్తి పై ఆధారపడి ఆయన ఉద్దేశాల్ని నెరవేర్చుతుంది.COLTel 312.3

    దేవుడు తాను ఎంచుకున్న వారి ద్వారా పనిచేస్తాడు. కొన్నిసార్లు అత్యున్నత కార్యనిర్వహణకు ఆయన అతి దీనులైన ప్రతినిధుల్ని ఎంపిక చేసుకుంటాడు. ఎందుకంటే ఆయన శక్తి మానవుల బలహీనతల ద్వారా బయలుపర్చటం జరుగుతుంది. మనకు మన ప్రమాణం ఉంటుంది. దాని ప్రకారం మనం ఒకటి గొప్పదని ఇంకొకటి తక్కువదని ప్రకటిస్తాం. కాని దేవుడు మన నిబంధన ప్రకారం పరిగణించడు. మనకు గొప్పదిగా ఉన్నది దేవునికి గొప్పగా ఉంటుందని ఊహించకూడదు. మన తలాంతుపై తీర్పు ప్రకటించటం గాని లేక మన పనిని మనం ఎంపిక చేసుకోవటంగాని మన పని కాదు. మనకు దేవుడు నియమించిన భారాల్ని అంగీకరించి, వాటిని ఆయన నిమిత్తం భరిస్తూ నిత్యం ఆయన వద్దకు విశ్రాంతి కోసం వెళ్లాలి. మన పని ఏదైనా మనం హృదయపూర్వకంగా సంతోషంగా చేసే సేవ దేవున్ని ఘనపర్చుతుంది. తన తోటి సేవకులుగా పని చెయ్యటానికి పాత్రులుగా పరిగణన పొందినందుకు మనం కృతజ్ఞతతోను సంతోషంగా మన విధుల్ని చేపట్టినప్పుడు ఆయన ఆనందిస్తాడు.COLTel 312.4

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents