Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
క్రీస్తు ఉపమాన ప్రబోధాలు - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    తీసివేసిన తలాంతు

    ఆ సోమరి సేవకుడి పై వెలువరించిన తీర్పు ఇది: “ఆ తలాంతు వాని యొద్ద నుండి తీసివేసి, పది తలాంతులు గలవానికియ్యుడి”. నమ్మకంగా ఉన్న సేవకుడి ప్రతిఫలంలో లాగ చివరి తీర్పులో ప్రతిఫలమే కాకుండా ఈ జీవితంలోనూ క్రమేపీ కలిగే శిక్షా ప్రక్రయిను కూడా ఇక్కడ సూచించటం జరిగింది. స్వాభావిక ప్రపంచంలో లాగే ఆధ్యాత్మిక ప్రపంచంలోనూ జరగుతుంది. వినియుక్తం గాని ప్రతీ శక్తి బలహీనపడి నశిస్తుంది. క్రియాశీలత జీవితధర్మం . క్రియాశూన్యత మరణ కారకం. “అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింప బడుచున్నది.” 1 కొరి 12:7 ఇరుతల ప్రయోజనం కోసం ఉపయుక్తమైతే వరాలు వృద్ధి అవుతాయి. స్వార్ధ ప్రయోజనం కోసం దాచి ఉంచితే క్షీణిస్తాయి.. చివరికి వాటిని ఉపసంహరించుకోవటం జరుగుతుంది. తాను పొందినదాన్ని ఇవ్వటానికి నిరాకరించేవాడు. ఇవ్వటానికి చివరికి అతడికేమి మిగలదు. ఆత్మ తాలూకు మానసిక శక్తుల్ని పెరగకుండా చేసి తుదకు నిశ్చయంగా నాశనం చేసే ప్రక్రియకు అతడు సమ్మతిస్తున్నాడు.COLTel 313.1

    స్వార్ధ జీవితం జీవించి, తమ స్వార్ధాసక్తులు ప్రయోజానాల్ని సాధించుకొని ప్రభువు సంతోషంలో పాలు పొందగలమని ఎవరూ తలంచకుందురు గాక. స్వార్ధరహిత ప్రేమానందంలో వారు పాలు పొందలేరు. వారు పరలోక నివాసానికి యోగ్యులు కాలేరు. పరలోకమంతా వ్యాపించి ఉండే పరిశుద్ద ప్రేమ వాతావరణాన్ని వారు అభినిందించలేరు. దూతల స్వరాలు వారి వీణెల సంగీతం వారికి తృప్తినియ్యవు. వారి మనసులకు పరలోక విజ్ఞాన శాస్త్రం అర్ధం కాని మర్మంగా ఉంటుంది.COLTel 313.2

    క్రీస్తుకి సేవ చెయ్యనివారు, బాధ్యతలేమీ నిర్వర్తించకుండా, స్వార్దాలోచనల్లో మునిగిపోయి, తమ్మునితాము తృప్తి పర్చుకోవటానికి ప్రయత్నిస్తూ కాలగమనంలో పక్కకు తొలగిపోయేవారు. ఆ మహా తీర్పులో ఆ విశ్వన్యాయాధిపతి వీరిని దుష్టుల జాబితాలో చేరుతాడు. వారు అదే శిక్షను అనుభవిస్తారు.COLTel 314.1

    క్రైస్తవులుగా చెప్పుకునే అనేకులు దేవుని ఆజ్ఞల్ని నిర్లక్ష్యం చేస్తూ అందులో తప్పేమి లేదని భావిస్తారు. దేవ దూషకుడు, నరహంతుకుడు, వ్యబిచారి, శిక్షార్హులని వారికి తెలుసు. తమకు వచ్చేసరికి వారికి మతా రాధనలంటే ఎంతో ఇష్టం సువార్త ప్రసంగాలు వినటం ఇష్టం. కనుక తాము క్రైస్తవులమనుకుంటారు. తాము స్వార్ధ ప్రయోజానాల్ని సాధించు కోవటానికే జీవించినప్పటికి ఉపమానంలోని అపనమ్మకంగా ఉన్న సేవకుడిలా “ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసి” వేయండి అన్న తీర్పును విన్నప్పుడు విస్మయం చెందుతారు. యూదుల్లా వారు తామను భవిస్తున్న దీవెనలు తమ ప్రత్యేక హక్కుగా అపార్థం చేసుకుంటారు. అనేకమంది క్రైస్తవ సేవ నుంచి ఏదో సాకుతో తప్పించుకునే ప్రయత్నంలో ఆ పని చెయ్యటానికి తమకు సమర్ధత లేదని వేడుకుంటారు. అయితే దేవుడు వారిని అంత అసమర్దులుగా సృజించాడా;? లేదు ఆ అసమర్ధతత వారి సోమరితనం వల్ల కలిగి వారి సొంత ఎంపిక వల్ల కొనసాగుతుంది. అప్పటికే వారు “ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసి” వేయండి అన్న తీర్పును తమ ప్రవర్తనల్లో గుర్తిస్తున్నారు. తమ తలాంతుల దుర్వినియోగం కొనసాగింపు వారికి ఒకే వెలుగైన పరిశుద్దాత్మను అర్పివేస్తుంది. “పనికిమాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసి వేయుడి” అన్న తీర్పు వారు చేసుకున్న ఎంపిక మీద నిత్యకాలికంగా ముద్ర వేయటం జరుగుతుందిCOLTel 314.2