Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
క్రీస్తు ఉపమాన ప్రబోధాలు - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    పరిశోధన ప్రతిఫలం

    తాము సంపాదించాల్సిన జ్ఞానం ఇక లేదని ఎవరు తలంచకుందురో గాక, మానవ మేధస్సు లోతులు కొలవవచ్చు. మానవ గ్రంథకర్తల గ్రంథాలు విలువ కట్టవచ్చు. కాని మిక్కిలి ఎత్తయిన మిక్కిలి లోతైన, మిక్కిలి విశాలమైన ఆలోచన దేవుని కనుక్కోలేదు. మనం అవగాహన చేసుకోగల దాన్ని మించి ఉన్నది అనంతం. దేవుని మహిమ ఆయన అనంతానంత జ్ఞాన వివేకాల మినుకు మినుక మాత్రమే మనం చూస్తున్నాం. తవ్వకం చేపట్టే కార్మికుడికి గని అడుగు భాగంలో బంగారు ఖనిజం అందుబాటులో ఉంటే దాని కోసం పై భాగంలో తవ్వుతున్నట్లు ఉంటుంది. తవ్వకపు యంత్రం గనిలోకి చొచ్చుకుపోయి లోతుగా దిగాలి. ఫలితంగా బంగారు ఖనిజ నిక్షేపాలు బయలుపడ్డాయి. నిర్దుష్ట విశ్వాసం ద్వారా దైవ జ్ఞానం మానవ జ్ఞానమవుతుంది.COLTel 83.3

    క్రీస్తు స్పూర్తితో లేఖనాల్ని పరిశోధించే వారెవ్వరూ ప్రతిఫలం పొందకుండా ఉండరు. మనుష్యుడు చిన్న పిల్లవాడిలా నేర్చుకోవటానికి సమ్మతంగా ఉన్నప్పుడు దేవునికి తన్నుతాను సమర్పించుకున్నప్పుడు అతడు దైవ వాక్యంలోని సత్యాల్ని కనుగొంటాడు. మనుష్యులు విధేయులై నివసిస్తే వారు దేవుని ప్రభుత్వ ప్రణాళికను అవగాహన చేసుకోగలుగుతారు. వారు పరిశోధించటానికి పరలోకం తన కృపా మహిమల ద్వారా తెలుస్తుంది. సత్యమనే బంగారు గనుల్ని పరిశోధించటం ద్వారా మనుషుల మనసులు సమున్నతమౌతాయి. గనుక ఇప్పుడున్నట్లుగాక వారు ఎంతో వ్యత్యాసంగా ఉంటారు. రక్షణ మర్మం, క్రీస్తు నరావతారం,ఆయన ప్రాయశ్చితార్ధ ప్రాణ త్యాగం వారికి ఇప్పటిలా అస్పష్టంగా ఉండవు. వారు వాటిని మెరుగుగా అవగాహన చేసుకోవటమే కాదు ఎంతగానో అభినందిస్తారు కూడా.COLTel 83.4

    తండ్రికి చేసిన ప్రార్ధనలో లోకం మనష్యుల మీద ఆత్మ మీద ముద్రించుకోవలసిన పాఠాన్ని క్రీస్తు ఇచ్చాడు. “అద్వితీయ సత్యదేవుడనైన నిన్ను ను, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవము” అని క్రీస్తు అన్నాడు. యోహా 17:3 ఇదే నిజమైన విద్య. అది మానవుడికి ఆత్మ నిగ్రహ శక్తినిచ్చి క్షుద్ర స్వభావానికి సంబంధించిన ఉద్రేకాన్ని ఉద్వేగాల్ని నియంత్రించి అతణ్ణి ఉన్నత మానసిక శక్తుల అదుపులో ఉంచుతుంది. ఇవి కలిగిన వ్యక్తిని ఇది దేవుని కుమారుడుగాను పరలోక వారసుడుగాను తీర్చి దిద్దుతుంది. అనంతుడైన దేవుని మనస్సుతో అతడికి సన్నిహిత్యం కలిపించి, విశ్వంలోని ధననిధుల్ని అతడికి తెరిచి ఉంచుతుంది. COLTel 84.1

    ఇది దేవుని వాక్య పరిశోధన వల్ల లభించిన జ్ఞానం. దాన్ని పొందటానికి తనకున్నదంతా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్న ప్రతీ ఆత్మ ఈ ధన నిధిని కనుగొనవచ్చును.COLTel 84.2

    ” జ్ఞానమునకు నీ చెవి యెగ్గి హృదయపూర్వకముగా వివేచన నభ్యసించిన యెడల తెలివికై మొట్ట పెట్టిన యెడల వివేచనకై మనవి చేసిన యెడల వెండిని వెదకినట్లు దాని వెదకిన యెడల దాచబడిన ధనమును వెదకినట్లు దాని వెదకిన యెడల యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట యెట్టిదో నీవు గ్రహించెదవు”. సామె2:3-5COLTel 84.3

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents