Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
క్రీస్తు ఉపమాన ప్రబోధాలు - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    ధనం విలువ

    మనుషులు ధన సంపాదనలో మునిగిపోయి నిత్య సత్యాల్ని విస్మరిసు అన్నట్లు రక్షకుడు చూసాడు. ఈ చెడును సరిచెయ్యటానికి ఆయన నడుం బిగించాడు. ఆత్మను అచేతనం చేసే సమ్మాహన శక్తిని నాశనం చెయ్యటానికి పూనుకున్నాడు. గొంతు హెచ్చించి ఇలా అన్నాడు. “ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనకేమి ప్రయోజనము? ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా నేమి యియ్యగలడు?” మత్త 16:26 పడిపోయిన మానవాళి నిత్య సత్యాల్ని చూసేందుకు, వారు విస్మరించిన ఉన్నత లోకాన్ని వారికి సమర్పిస్తున్నాడు. దేవుని మహిమతో ప్రకాశిస్తున్న అనంతుని గుమ్మం వద్దకు తీసుకువెళ్ళి అక్కడున్న సిరుల్ని వారికి చూపిస్తున్నాడు.COLTel 76.3

    ఈ ధనం విలువ బంగారం కన్నా వెండికన్నా ఎంతో ఎక్కువయ్యింది. లోకంలోని గనులు సమర్పించే ధనరాశులు దీనితో సరితూగవు. COLTel 76.4

    “ఆగాధము - అది నాలో లేదనును
    సముద్రము - నా యొద్ద లేదనను
    సువర్ణము దానికి సాటియైనది కాదు
    దాని విలువ కొరకై వెండి తూచరాదు
    అది ఓఫీరు బంగారముకైనను విలువ గల గోమేదికమునకైనను
    నీలమునకైనను కొనబడునది కాదు
    సువర్ణమైనను స్పటికమైనను దానితో సాటికావు
    ప్రశస్తమైన బంగారు నగలకు ప్రతిగా అది ఇయ్యబడదు.
    పగడములు పేర్లు ముత్యముల పేర్లు దాని యెదుట ఎత్తనే కూడదు
    జ్ఞాన సంపాద్యము కెంపులకన్న కోరదగినది”.
    COLTel 76.5

    యోబు 28:14-18

    లేఖనాల్లో దొరికే ధనం ఇదే. బైబిలు దేవుని పాఠ్యపుస్తకం, బైబిలు గొప్ప ఉపదేశకుడు.నిజమైన విజ్ఞాన శాస్త్రానికి పునాది బైబిలులోల ఉంది. దేవుని వాక్యాన్ని పరిశోధించడం ద్వారా జ్ఞానంలోని ప్రతీ శాఖను కనుగొనవచ్చు. అన్నిటికన్నా ముఖ్యంగా విజ్ఞాన శాస్త్రాలన్నటి శాస్త్రం దేవుని వాక్యంలో ఉంది. అదే రక్షణ విజ్ఞాన శాస్త్రం. బైబిలు శోధించ శక్యం కాని క్రీస్తు ఐశ్వర్యానికి గని.COLTel 77.1

    దైవ వాక్యాన్ని పఠించి దానికి లోబడి నివసించుటం ద్వారానే వాస్తవమైన ఉన్నత విద్య లభిస్తుంది కాని దేవుని వద్దకు దేవుని రాజ్యా నికి నడిపించని పుస్తకాలు అధ్యయనం చెయ్యటానికి దైవ వాక్యాన్ని పక్కన పెట్టి గడించే విద్య వక్ర విద్య.COLTel 77.2

    ప్రకృతిలో అద్భుతమైన సత్యాలున్నాయి. భూమి, సముద్రం, ఆకాశం సత్యంతో నిండి ఉన్నాయి. అవి మనకు ఉపాధ్యాయులు, ప్రకృతి దైవ జ్ఞానాన్ని నిత్య సత్య పాఠాల్ని బోధిస్తూ తన స్వరం వినిపిస్తుంది.కాని పాప మానవడు దాని గ్రహించడు. పాపం అతడికి గుడ్డితనం కలిగించిది. అందువలన మానవుడు ప్రకృతిని దేవునికి పైగా ఎత్తకుండా దానికి భాష్యం చెప్పడు. దైవ వాక్యాన్ని నిరాకరించేవారిని స్వచ్చమైన నిర్దుష్టమైన పాఠాలు ఆకట్టుకోలేవు. ప్రకృతిని గుర్చిన వారి బోధన ఎంత వక్రమయ్యిందంటే అది మనసును సృష్టికర్త నుంచి దూరంగా నడిపిస్తుంది.COLTel 77.3

    మానవుడి వివేకం దేవుని వివేకం కన్నా మిన్న అని. దేవుని పాఠ్య పుస్తకమైన బైబిలు పాతబబడ్డ, పాడైన నిరాసక్తమైన పుస్తకమని అనేకులు భావిస్తున్నారు. అయితే పరిశుద్ధాత్మ వలన చైతన్యం పొందినవారు దాన్ని అలా పరిగణించరు. వారు అందులోని విలువైన ఐశ్వర్యాన్ని చూసి అది ఉన్న పొలాన్ని కొనటానికి తమకున్నదంతా అమ్మివేస్తారు. గొప్ప గ్రంధకర్తలుగా పేరుగడించినవారి ఊహాగానాలతో నిండిన పుస్తకాల బదులు వారు సర్వోత్తమ గ్రంథకర్త ప్రపంచం కనివిని ఎరుగని అత్యుత్తమ ఉపాధ్యాయుడు, మనకు నిత్య జీవం కలిగేందుకు ఎవరు తన ప్రాణాన్నిచ్చారో ఆ ప్రభువుని ఎంపిక చేసుకుంటారు.COLTel 77.4

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents