Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
పితరులు ప్రవక్తలు - Contents
 • Results
 • Related
 • Featured
No results found for: "".
 • Weighted Relevancy
 • Content Sequence
 • Relevancy
 • Earliest First
 • Latest First
  Larger font
  Smaller font
  Copy
  Print
  Contents

  47—గిబియోనీయులతో నిబంధన

  ఇశ్రాయేలీయులు షెకెము నుంచి గిల్లాలెలోరి తమ శిబిరానికి తిరిగి వచ్చారు. తిరిగి వచ్చిన వెంటనే వారికి ఒక ప్రతినిధి బృందం సందర్శించింది ఇశ్రాయేలీయు లతో సంధి చేసుకోవాలని ఆ బృందం ఆకాంక్షించింది. తాము ఎంతో దూరం నుంచి వచ్చినట్లు ఆ ప్రతినిధులు చెప్పారు. వారి వేషభాషలు తాము దూరదేశం నుంచి వచ్చినట్లు చెప్పాయి. వారి దుస్తులు పాతవై చినిగిపోయాయి. చెప్పులు అరిగిపోయాయి. తెచ్చుకొన్న ఆహారం ఎండిపోయి బూజు పట్టింది. ద్రాక్షరసం తిత్తులు చినిగిపోయి హడావుడిగా దారిలో అతుకులు వేసినట్లు ఉన్నాయి.PPTel 499.1

  పాలస్తీనా పొలిమేరలకు ఎంతో దూరంలో ఉన్న తమ దేశంలో తమ దేశవాసులు దేవుడు తన ప్రజల నిమిత్తం చేసిన మహత్కార్యాన్ని గురించి విని ఇశ్రాయేలీయులతో సంధి చేసుకోటానికి తమను పంపారని చెప్పారు. విగ్రహారాధకు లైన కనానీయులతో ఎలాంటి నిబంధన చేసుకోకూడదని హెబ్రీయులికి దేవుడు హెచ్చరిక చేశాడు. ఆ పరదేశుల మాటలు నిజమో కాదో అన్న సందేహం నాయకుల మనసుల్లో పుట్టింది. “మీ మా మధ్యను నివసించచున్నవారేమో” అనగా ఆ ప్రతినిధులు “మేము నీ దాసులము” అని మాత్రం బదులుపలికారు. కాని “మీరు ఎవరు? ఎక్కడ నుండి వచ్చితిరి?’ అని యెహోషువ నిలదీసినప్పుడు ముందు పలికిన మాటలే వారు మళ్ళీ పలికి తమ కథనానికి నిదర్శనంగా వారిలా అన్నారు, “మీ యొద్దకు రావలెనని బయలుదేరిన దినమున మేము సిద్ధపరచుకొని మా యిండ్ల నుండి తెచ్చుకొనిన మా వేడి భక్ష్యములు ఇవే, యిప్పటికి అవి యెండి ముక్కలాయెను. ఈ ద్రాక్షారసపు సిద్దెలను మేము నింపినప్పుడు అవి క్రొత్తవే, యిప్పటికి అవి చినిగిపోయెను. బహు దూరమైన ప్రయాణము చేసినందున ఈ మా బట్టలును, చెప్పులున పాతగిలిపోయెను”.PPTel 499.2

  వారి మాటల్ని ఇశ్రాయేలీయుల నమ్మారు. “ఇశ్రాయేలీయులు యెహోవా చేత సెలవు పొందకయే.. యెహోషువ ఆ వచ్చిన వారితో సమాధానపడి వారిని బ్రదుకనిచ్చుటకు వారితో నిబందన చేసెను. మరియు సమాజ ప్రధానులు వారితో ప్రమాణము చేసిరి”. ఈ విధంగా సంధి జరిగింది. మూడు దినాల అనంతరం అసలు సత్యం బయటపడింది. “వారు తమ పొరుగువారు, తమ నడుమను నివసించువారేయని తెలిసికొనిరి”. హెబ్రీయుల్ని ప్రతిఘటించటం అసాధ్యమని తెలుసుకొని తమ ప్రాణాలు రక్షించుకోటానికి గిబియోనీయులు ఈ కపట నాటకం ఆడారు .PPTel 499.3

  జరిగిన మోసం వెలుగులోకి వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులు కోపాద్రిక్తులుయ్యారు. మూడు రోజుల ప్రయాణం అనంతరం ఆ దేశం మధ్యలో గిబియోనీయుల పట్టణాల్ని చేరినప్పుడు వారి ఆగ్రహం ఆకాశాన్నంటుకొంది. “సమాజమంతయు ప్రధానులకు విరోదముగా మొట్ట పెట్టిరి. కాని ఆ సంధి మోసం వల్ల జరిగిన దైనప్పటికీ దాన్ని రద్దు పర్చటానికి ప్రధానులు ఒప్పుకోలేదు. ఎందుకంటే “ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా తోడని వారితో ప్రమాణము చేసి యుండిరి”. గనుక ఇశ్రాయేలీయులు వారిని హతము చేయలేదు. గిబియోనీయులు విగ్రహారాధనను విడిచి పెట్టి యెహోవాను సేవిస్తామని ప్రమాణం చేశారు. కనుక వారిని బతకనీయటం విగ్రహారాధకులైన కనానీయుల్ని నాశనం చేయాల్సిందిగా దేవుడిచ్చిన ఆజ్ఞను మీరటమవ్వదు. కాబట్టి హెబ్రీయులు చేసిన ప్రమాణం పాపం చేయటానికి చేసిన ప్రమాణం కాదు. గిబియోనీయులు ఆ నిబంధనను వంచనద్వారా సాధించనప్పటికి దాన్ని బేఖాతరు చేయటానికి లేదు. ఒక వ్యక్తి ఒక కర్తవ్య నిర్వమణకు మాట ఇచ్చిన తర్వాత, అది అతణ్ని ఒక తప్పుడు కార్యం చేయటానికి బాధ్యుణ్ని చేస్తే తప్ప, అతడు దాన్ని పవిత్ర విధిగా భావించాలి. “అబద్ద మాడు పెదవులు యెహోవాకు హేయములు” సామెతలు 12:22. “యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడు”. “ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగినవాడు”, “ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట” తప్పనివాడే. కీర్తనలు 24:3, 15:4. PPTel 500.1

  గిబియోనీయులు బతకటానికి అనుమతి పొందారు. అయితే వారు ఆలయ సంబంధమైన చిన్న చిన్న పనులు చేసే సేవకులుగా ఏర్పాటయ్యారు. “సమాజము కొరకును యెహోవా ఏర్పరచుకొను చోటు నుండి బలిపీఠము కొరకును, కట్టెలు నరకువారిగాను, నీళ్లు చేదువారుగాను యెహోషువ ఆ దినమందే వారిని నియమించెను.” తాము తప్పు చేశామన్న గుర్తింపుతోను, షరతులు ఎలాటివైనా చనిపోకుండా బతికి ఉంటున్నామన్న సంతోషంతోను ఈ షరతుల్ని వారు అంగీకరించారు. “మేము నీ వశముననున్నాము. మాకేమి చేయుట నీ దృష్టికీ న్యాయమోయేది మంచిదో అదే చేయుము” అని యెహోషువకు ఉత్తరమిచ్చారు. వారి సంతతి వారు ఎన్నో శతాబ్దాల వరకు ఆలయ సంబంధిత సేవలు చేశారు.PPTel 500.2

  గిబియోనీయుల భూభాగమంతా నాలుగు పట్టణాలు. ప్రజలు రాజు పరిపాలనకింద లేరు. వారిని పెద్దలు పరిపాలించారు. వారి పట్టణాల్లో మిక్కిలి ప్రాముఖ్య పట్టణమైన గిబియోను “గొప్ప పట్టణమై రాజధానులలో ఎంచబడినది”. “అక్కడి జనులందరును శూరులు” అలాంటి పట్టణ ప్రజలే తమ ప్రాణాలు దక్కించుకోటానికి ఇశ్రాయేలీయులికి అణిగి మణిగిన ఉనికిరి అంగీకరించటం కనాను దేశ ప్రజల్లో ఇశ్రాయేలీయులంటే ఉన్న భయానికి ప్రజల నిదర్శనం.PPTel 500.3

  అయితే గిబియోనీయులు ఇశ్రాయేలీయులతో నిజాయితీగా వ్యవహరించి ఉంటే వారి పరిస్థితి మెరుగుగా ఉండేది. యెహోవాకు విధేయులవ్వటం వల్ల వారి ప్రాణాలకి భద్రత లభించినా తమ వంచనవల్ల వారు అపకీర్తి మూటకట్టుకొని దాస్యానికి గురి అయ్యారు. అన్యమతాన్ని విడిచి పెట్టి ఇశ్రాయేలీయుల్లో కలిసే వారందరూ నిబంధన ఉపకారాలు పంచుకోటానికి దేవుడు మార్గం ఏర్పాట చేశాడు. వారు “మీలో నివసించు పరదేశి”గా పరిగణన పొందారు. ఈ తరగతి మినహా యింపులు లేకుండా ఇశ్రాయేలీయులతో సమానంగా ఉపకారాలు, ఆధిక్యతలు పొందుతారు. ప్రభువు ఇలా ఆదేశించాడు:PPTel 501.1

  “మీ దేశమందు పరదేశి నీ మధ్య నివసించునప్పుడు వానిని బాధింపకూడదు. మీ మధ్య నివసించు పరదేశిని మీలో పుట్టిన వానివలె ఎంచవలెను. నిన్ను వలె వానిని ప్రేమింపవలెను”. లేవీయకాండము 19:33,34. పస్కా పండుగ బలి అర్పణల గురించిన ఆదేశం ఇది, “సంఘంమునకును, అనగా మీకును, మీలో నివసించు పరదేశికిని ఒకటే కట్టడ.. యెహోవా సన్నిధిని మీరున్నట్లే పరదేశియు ఉండును”. సంఖ్యా 15:15.PPTel 501.2

  గిబియోనీయులకి ఈ ప్రతిపత్తి లభించి ఉండేది. కాని తమ వంచనవల్ల వారు ఆ స్థితికి పోగొట్టుకొన్నారు. “రాజధానులలో ఎంచబడిన” ఆ పట్టణ “శూరులు” కట్టెలు నరుకు వారిగాను, నీళ్లు చేదువారుగాను” తరతరాలుగా నివసించటమన్న పరాభవం అల్పవిషయం కాదు. ఇశ్రాయేలీయుల్ని వంచిచంచటానికి వారు పేదల వేషం ధరించారు. నిత్య దాస్య చిహ్నంగా వారు దాన్ని ధరించాల్సి వచ్చింది.. ఆ విధంగా తమ తరతరాల దాస్య స్థితిలో వారు అసత్యమంటే దేవునికి హేయమన్న విషయానికి సాక్షులుగా ఉన్నారు.PPTel 501.3

  ఇశ్రాయేలీయులకు గిబియోను లొంగుబాటు కనాను రాజులకు ఆశాభంగం కలిగించింది. ముట్టడిదారులతో సంధి చేసుకొన్న వారి పై ప్రతీకారం తీర్చుకోడానికి వెంటనే చర్యలు చేపట్టారు. యెరుషలేము రాజైన ఆదోని సెదకు నేతృత్వం కింద గిబియోనుకు వ్యతిరేకంగా అయిదుగురు కనాను రాజులు ఒక కూటమిగా ఏర్పడ్డారు. వారి కదలికలు వేగం పుంజుకొన్నాయి. గిబియోనీయులు స్వీయ రక్షణకు సంసిద్ధంగా లేరు. గిల్గాలులో ఉన్న యెహోషువకు వారు ఈ వర్తమానం పంపించారు. “మన్యములో నివసించు అమోరీయుల రాజులందరు కూడి మా మీదికి దండెత్తి వచ్చియున్నారు గనుక నీ దాసులను చెయ్యి విడవక త్వరగా మా యొద్దకు వచ్చి మాకు సహాయము చేసి మమ్మను రక్షించుము”. ఆ బెదిరింపుల ముప్పు కేవలం గిబియోను ప్రజలకే కాదు, అది ఇశ్రాయేలీయులకు కూడా. కేంద్ర పాలస్తీనా దక్షిణ పాలస్తీనాల ప్రవేశ మార్గాలు ఈ పట్టణం ఆధీనంలోనే ఉన్నాయి. ఇశ్రాయేలీయులు ఆ దేశాన్ని జయించాలంటే గిబియోను పట్టణాన్ని కాపడటం అవసరం.PPTel 501.4

  గిబియోనుని ఆదుకోటానికి యెహోషువ తక్షణమే సమాయత్త మాయ్యాడు. ముట్టడిలో ఉన్న గిబియోను ప్రజలు తాము చేసిన మోసాన్ని మనసులో ఉంచుకొని తమ వినతిని యెహోషువ మన్నిచండని భయపడ్డారు.అయితే వారు ఇశ్రాయేలీయుల అదుపాజ్ఞలకు లొంగి దైవారాధకులుగా మారారు గనుక వారిని పరిరక్షించటం ఇశ్రాయేలీయుల విహిత కర్తవ్యమని యెహోషువ భావించాడు. ఈ సారి దేవున్ని సంప్రదించకుండా ఈ కార్యానికి నడుం బిగించలేదు. ఆ కార్య నిర్వహణలో దేవుడు యెహోషువను బలపర్చాడు. “వారికి భయపడకుము, నీ చేతికి వారిని అప్పగించి యున్నాను. వారిలో ఎవడును నీ యెదుట నిలువడు”. “యెహోషువయు అతని యెద్దనున్న యోధులందరును పరాక్రమము గల శూరలందరును గిల్గాలు నుండి బయలు దేరిరి”.PPTel 502.1

  రాత్రంతా నడిచి ఉదయానికి సైన్యంతో గిబియోనుకు వచ్చాడు. కూటమి ప్రధానులు తమ తమ సేనల్ని పట్టణం చుట్టూ మోహరించటం పూర్తికాకముందే యెహోషువ వారిపై దాడి చేశాడు. ఆ దాడి ముట్టడిదారుల్ని కలవరపర్చింది. విస్తారమైన శత్రు సైన్యం యెహోషువ ముందు నిలువలేక పర్వత మార్గం గుండా బెత్ హోరోనుకు పారిపోయింది. కొండయెక్కిన ఇశ్రాయేలు సైన్యం నిటారుగా ఉన్న ఆ కొండ అవత పక్కకు దిగింది. ఇక్కడ శత్రువులు పారిపోతుండగా వారి మీద పెద్ద పెద్ద వడగండ్లు కురిశాయి యెహోవా ఆకాశము నుండి గొప్ప వడగండ్లను వారి మీద పడవేసెను. ఇశ్రాయేలీయులు కత్తివాత చంపిన వారికంటె ఆ వడగండ్ల చేత చచ్చినవారు ఎక్కువ మంది యుండిరి”.PPTel 502.2

  అమోరీయులు పర్వతాల్లో తల దాచుకోటానికి వెనక్కి చూడకుండా పలాయనం చిత్తగిస్తున్నప్పుడు యెహోషువ కొండకొన నుంచి చూస్తూ తన కర్తవ్యాన్ని ముగించటానికి దినం సరిపోదని బేరీజు వేసుకొన్నాడు. అప్పుడు శత్రువుల్ని శేషం లేకుండా నాశనం చేయకపోతే వారు మళ్లీ పుంజుకొని మళ్ళీ పోరాటం ప్రారంభిస్తారని భావించాడు. “ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను -- సూర్యుడా, నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొను వరకు సూర్చుడు నిలిచెను. చంద్రుడు ఆగెను.. సూర్చుడు ఆకాశ మధ్యమున నిలిచి యించుమించు ఒకనాడెల్ల అస్తమింప త్వరపడలేదు”. PPTel 502.3

  దేవుడు యెహోషువకు చేసి వాగ్దానం ఆ రోజు సాయంత్రం కాక ముందు నెవవేరింది. శేషం లేకుండా శత్రు సైన్యాన్ని దేవుడు యెహోషువకు అప్పగించాడు. ఆ రోజు చోటు చేసుకొన్న ఘటనలు ఇశ్రాయేలీయుల స్మృతిలో సుదర్షీకాలం నిలిచి ఉన్నాయి. “యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినమువంటి దినము దానికి ముందేగాని దానికి తరువాతే గాని యుండలేదు. నాడు యెహోవా ఇశ్రాయేలీయుల పక్షముగా యుద్ధము చేసెను”. “నీ ఈటెలు తళతళలాడగా సంచరించు నీ బాణముల కాంతికి భయపడి సూర్యచంద్రులు తమ నివాసములలో ఆగిపోవుదురు. బహు రౌద్రము కలిగి నీవు భూమి మీద సంచరించుచున్నాడు. మహోగ్రుడవై జనములను అణగదొక్కుచున్నావు. నీ జనులను రక్షించుటకునీవు బయలు దేరుచున్నావు” హబక్కూకు 3:11-13.PPTel 503.1

  ఇశ్రాయేలీయుల దేవుడు శక్తిమంతుడని మళ్లీ వెల్లడియ్యేందుకుగాను పరిశు ద్దాత్మ మార్గదర్శకత్వం కిందనే యెహోషువ ఆ ప్రార్థన చేశాడు. కాబట్టి ఆ మనవి ఆ మహానేత ఊహను సూచించటం లేదు. ఇశ్రాయేలీయుల శత్రువుల్ని హతమార్చు టానికి దేవుడు యెహోషువకు వాగ్దానం చేశాడు. అయినా కేవలం ఇశ్రాయేలీయుల సైన్యం మీదనే విజయం ఆధారపడి ఉన్నదో అన్నట్లు అతడు తన శక్తివంచన లేకుండా కృషి చేశాడు. మానవుడుగా తాను చేయగలిగినదంతా చేసి ఆ మీదట విశ్వాసంతో దైవ సహాయం కోసం ప్రార్థన చేశాడు. దైవశక్తితో కలిసిన మానవ కృషే విజయ రహస్యం. సర్వోన్నతుని మీద సంపూర్తిగా ఆధారపడే వారు అపూర్వ ఫలితాల్ని సాధించగలుగుతారు. “సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము. చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము” అని ఆజ్ఞాపించిన మనిషే గిల్గాలు శిబిరంలో నేలమీద పడి గంటలకొద్దీ ప్రార్థన చేసిన వ్యక్తి. ప్రార్థన చేసే మనుషులు శక్తిని పొందే మనుషులు.PPTel 503.2

  సృష్టి సృష్టికర్త అదుపాజ్ఞ కింద ఉన్నదని ఈ మహత్కార్యం సాక్ష్యమిస్తున్నది. భౌతిక ప్రపంచంలో పనిచేస్తున్న దైవశక్తిని మానవ దృష్టికి మరుగుపర్చటానికి సాతాను ప్రయత్నిస్తున్నాడు. ఆదిలో సృష్టికి మూలమై నిర్విరామంగా పనిచేసే శక్తిని మెరుగుపర్చటానికి అతడు కృషి సల్పుతున్నాడు. సృష్టికర్తకన్నా సృష్టిలో ఉన్నతంగా పరిగణించే వారికి ఈ అద్భుతం చెంప పెట్టు.PPTel 503.3

  తన శత్రువుల బలాన్ని నిర్వీర్యం చేయటానికి ప్రకృతి వైపరీత్యాలను దేవుడు వినియోగిస్తాడు -- “అగ్నీ, వడగండ్లారా, హిమమా, ఆవిరీ, ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫానూ” కీర్తనలు 148:8. ‘తన ఉద్దేశాల్ని ప్రతిఘటించేందుకు అన్యులైన అమోరీయులు పూనుకొన్నప్పుడు “ఆకాశము నుండి గొప్ప వడంగండ్లను” వారి మీద కురిపించాడు. లోక చరిత్ర చివరి దశకు వస్తున్న కాలంలో ఇంకా పెద్ద యుద్ధం ఒకటి వస్తుందని అప్పుడు “యెహోవా తన ఆయుధశాలను తెరచి కోపము తీర్చు తన ఆయుధములను వెలుపలికి తెచ్చుచున్నాడు” అని వాక్యం చెబుతున్నది. యిర్మీయా 50:25, “నీవు హిమము యొక్క నిధులలోనికి చొచ్చితివా? అపత్కాలము కొరకును యుద్ధము కొరకును యుద్ధ దినముల కొరకును నేను దాచియుంచిన వడగండ్ల నిధులను చూచితివా?” అని ఆయన అడుగుతున్నాడు. యోబు 38:22,23.PPTel 504.1

  “గొప్ప స్వరము గర్భాలయములో ఉన్న సింహాసనమునుండి” “సమాస్తమైనది” అని ప్రకటించగా సంభవించనున్న నాశనాన్ని ప్రకటన గ్రంథ రచయిత అభివర్ణిస్తున్నాడు. రచయిత ఇలా అంటున్నాడు, “అయిదేసి మణుగుల బరువు గల పెద్ద వడగండ్లు ఆకాశము నుండి మనుష్యుల మీద పడెను”. ప్రకటన 16:17, 21.PPTel 504.2

  Larger font
  Smaller font
  Copy
  Print
  Contents