Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
పితరులు ప్రవక్తలు - Contents
 • Results
 • Related
 • Featured
No results found for: "".
 • Weighted Relevancy
 • Content Sequence
 • Relevancy
 • Earliest First
 • Latest First
  Larger font
  Smaller font
  Copy
  Print
  Contents

  68—సిక్లగులో దావీదు

  దావీదు అతడి మనుషులు ఫిలిష్తియులతో కలసి యుద్ధభూమికి వెళ్ళినప్పటికి ఫిలిప్తీయులు సౌలుతో చేసిన యుద్ధంలో పాలు పొందలేదు. ఆ రెండు సైన్యాలు యుద్దానికి మొహరించి ఉన్నప్పుడు యెష్సయి కుమారుడు సందిగ్ధంలో పడ్డాడు. తాను ఫిలిప్తీయుల తరపునే యుద్ధం చేస్తాడన్నది అందరి ఊహ. యుద్ధంలో తనకు నిర్దేశించి స్థానాన్ని విడిచి పెట్టి వెళ్ళిపోతే పిరికివాడు అన్న ముద్ర వేసుకోవటమే గాక తనకు రక్షణనిచ్చి తనను నమ్మిన ఆకీషు పట్ల కృతజ్ఞత, నమ్మక ద్రోహానికి పాల్పడ్డాడన్న అపఖ్యాతి ఒడిగట్టుకొనేవాడు. ఆంలాటిపని అతణ్ణి అప్రష్టలు పాలు చేసి సౌలుకన్నా భయంకరమైన శత్రువుల ఆక్రోశానికి అతణ్ణి గురిచేసేది అలాగని అతడు ఇశ్రాయేలీయులికి వ్యతిరేకంగా యుద్ధమూ చేయ్యలేడు. అదే చేస్తే మాతృ దేశానికి ద్రోహం చేసినవాడవుతాడు. “దేవునికి దేవుని ప్రజలకి విరోధి అవుతాడు. అతడు ఎన్నటికి ఇశ్రాయేలీయుకి రాజుకాకుండా ఆ క్రియ అతణ్ణి బహిష్కరించేది.PPTel 698.1

  తాను దారి తప్పాను అన్న గుర్తింపును దావీదుకి దేవుడు పుట్టించాడు. యెహోవా శత్రువులవద్ద ఆయన ప్రజల శత్రువుల వద్ద ఆశ్రయం పొందేకన్నా దేవుని కొండల్లో బలమైన ఆశ్రయ స్థానాల్లో తలదాచుకోవటం దావీదుకు ఎంతో మేలుగా ఉండేది. కృపగల ప్రభువు తన సేవకుడి ఈ దోషం గురించి శిక్షించలేదు. తనకు కలిగిన దు:ఖంలోను, ఆందోళనలోను అతణ్ణి తన మానాన తనని విడిచి పెట్టాడు. దైవ శక్తిని నిర్లక్ష్యం చేసి నీతి నిజాయితీల నిర్దుష్ట మార్గం నుంచి తప్పుకున్నప్పటికి దేవునికి నమ్మకంగా నిలవాలని దావీదుతన మనసులో నిర్ధారించుకున్నాడు. దేవుని విడిచి పెట్టిన ఒక రాజుకు చేయూత నివ్వటానికి సాతాను అతడి అనుచర గణాలు తల మునకలై ఉన్న తరుణంలో దావీదు ఇరుక్కున్న అపాయంలోనుంచి అతణ్ణి విడిపించటానికి దేవుడూ ఆయన దూత గణాలు కృషి చేస్తున్నారు. తమ ముందున్న యుద్ధంలో తమతో కలసి దావీదు అతడి బలగం ఉండటాన్ని ఫిలిప్తీయుల సర్దారులు వ్యతిరేకించటానికి పరలోక దూతలు వారిని ప్రేరేపించారు.PPTel 698.2

  ఫిలిప్తీయుల సర్దారులు ఆకీషు చుట్టూ మూగి, “ఈ హెబ్రీయులు ఏల రావలెను”? అని అరిచారు. అంత ప్రాముఖ్యమైన మిత్రుణ్ణి విడిచి పెట్టుకోవటానిక ఇష్టంలేని ఆకీషు ఇలా బదులిచ్చాడు. “ఇన్ని దినములు ఇన్ని సంవత్సరములు నా యొద్ద నుండిన ఇశ్రాయోలీయుల రాజైన సౌలునకు సేవకుడగు దావీదు ఇతడే కాడా? ఇతడు నా యొద్ద చేరిన నాటి నుండి నేటి వరక ఇతని యందు తప్పేఏమియు నాకు కనపడలేదు”.PPTel 698.3

  అయితే ఆ సర్దారులు ఈ విధంగా డిమాండు చేశారు. “ఈ మనుష్యుని నీవునిర్ణయించిన స్థలమునకు తిరిగిపోనిమ్ము, అతడు మనతో కలసి యద్దుమునకు రాకూడదు. యుద్దమందు అతడు మనకు విరోధియవునేమో, దేవునిచేత అతడు తన యాజమానునితో సమాధాన పడును? మనవారి తలను చేధించి తీసుకొనిపోవుటచేతనే గదా తన యాజమానునితో సమధానపడును? సౌలు వేల కొలది ఆను దావీదు పదివేల కొలదిగాను హతము చేసిరని వారు నాట్యమాడుచు గాన ప్రతిగానము చేయుచు పాడిన దావీదు ఇతడే కాడా”? ఆ ప్రసిద్ధివీరుడి కధ, ఆసమయంలో ఇశ్రాయేలీయుల విజయం ఫిలిప్తీయుల సర్దారుల మనసుల్లో ఇంకా తాజాగా ఉన్నాయి. దావీదు తన ప్రజలకు వ్యతిరేకంగా పోరాడాడంటే వారికి నమ్మకం చిక్కలేదు.నువ్వా నేనా అన్న తీరుగా యుద్ధం సాగుతున్నప్పుడు దావీదు ఇశ్రాయేలీయుల పక్కకు వెళ్లే సౌలు సైన్యమంతా కలసి కలిగించే నష్టం కన్నా అతడొక్కడే ఎక్కువ నాశనం కావించగలడు అన్నారు.PPTel 699.1

  ఆకీషు వారికెలా లొంగిపోవాల్సి వచ్చింది. కనుక అతడు దావీదును పిలచి ఇలా అన్నాడు. ” యెహోవా జీవము తోడు నీవు నిజముగా యధార్ధ పరుడనై యున్నావు. దండులో నీవు నాతో కూడా సంచరించుట నాదృష్టికి అనుకూలమే. నీవు నా యొద్దకు వచ్చిన దినము నుండి నేటి వరకు నీయందు ఏ దోషమును నాకు కనపడలేదు గాని సర్దారులు నీయందు ఇష్టము లేక యున్నారు. ఫిలిప్తీయుల సర్దారుల దృష్టికి నీవు ప్రతికూలమైన దానిని చేయకుండునట్లు నీవు తిరిగి నీ స్థలమునకు సుఖముగా వెళ్ళుము”.PPTel 699.2

  తన యథార్ధ మనోభవాల్ని బయలు పెట్టుకుంటానేమోనన్న భయంతో దావీదు ఇలా సమాధానమిచ్చాడు. “నేనేమి చేసితిని? నా యేలిన వాడవగు రాజా, నీ శత్రువుతో యుద్ధము చేయుటకై నేను రాకుండునట్లు నీ యొద్దకు వచ్చిన దినము నుండి నేటి వరకు నీ దాసుడనైన నాయందు తప్పేమి కనబడెను”? యెహోవా నా సేవకుడైన తాను పాల్పడ్డ మోసాల గురించి తలంచినప్పుడు ఆకీషు ఇచ్చిన సమాధానం దావీదు హృదయాన్ని సిగ్గుతోను, పశ్చాత్తాపంతోను నింపి ఉండవచ్చు. “దైవదూతవలె నీవు నా దృష్టికి కనబడుచున్నావని నేనెరుగుదును గాని ఫిలిప్తీయుల సర్దారులు - ఇతడు మనతో కూడ యుద్ధమునకు రాకూడదని చెప్పుచున్నారు. కాబట్టి ఉదయమున నీవును నీతో కూడా వచ్చిన నీ యజామాని సేవకులును త్వరగా లేవవలెను; ఉదయమున లేచి తెల్లవారగానే బయలుదేరి పోవలను”. అని అకీషు ఆదేశించాడు. తాను చిక్కుకున్న ఉచ్చులో నుంచి దావీదు ఇలా బయటపడ్డాడు. PPTel 699.3

  మూడు రోజులు ప్రయాణం అనంతరము దావీదు అతడి అరువందల మంది మనుషులు ఫిలిప్తీయుల దేశంలో సిక్లగులో ఉన్న తమ గృహం చేరుకొన్నారు. అయితే వారి ముందున్నది నాశన దృశ్యం. జనులు లేని దృశ్యం. దావీదు అతడి మనుషులు లేని పరిస్థితిని అసరాగా తీసుకొని దావీదు పాల్పడ్డ చొరబాట్లకు ప్రతీకారంగా అమాలేకీయులు తమ భూభాగంలో దాడి జరిపారు. ఆ పట్టణాన్ని కావలికాయని సమయంలో ఆకస్మిక దాడి జరిపారు. పట్టణాన్ని దోచుకొని కాల్చివేసి మహిళల్ని, పిల్లల్ని చెరగొని దోపిడి సొమ్ముతో వెళ్ళిపోయారు. దావీదు అతడి సహచరులు అవాక్కై మసిబూసి కాలుతూ ఉన్న శిధిలాల వంక చూస్తూ నిలిచిపోయారు. జరిగిన భయంకర నాశనం దిశగా ఆ యుద్ధ శూరులు మేల్కొన్న తరువాత “ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చిరి”.PPTel 700.1

  దేవుని పై విశ్వాసం లేకుండా ఫిలీప్రియుల నడుమ ఉండటానికి వెళ్ళిపోయినందుకు ఇక్కడ కూడా దావీదు మందలింపుకు గురి అయ్యాడు. దేవునికి దేవుని ప్రజలికి విరోధులైన ప్రజల మధ్య ఎంత క్షేమం ఉంటుందో తెలుసుకోవటానికి దావీదుకు ఒక తరుణం కలిగింది. తమ బాధలకు తానే కారణమంటూ దావీదు మనుషులు అతణ్ణి దుయ్యబట్టారు. అమాలేకీయుల పై దాడి చెయ్యటం ద్వారా వారిలో పగ పుట్టించాడంటూ విమర్శించారు. అంతమంది శత్రువులుండగా రక్షణ లేకుండా పట్టణాన్ని విడిచి పెట్టటం పొరపాటన్నారు. కట్టలు తెంచుకు వస్తున్న దు:ఖంతోను, కోపంతోను దావీదు సైనికులు ఇప్పుడు ఏ తీవ్ర చర్యకైనా సిద్ధంగా ఉన్నారు. తమ నాయకుణ్ణి రాళ్ళతో కొట్టటానికి సైతం సన్నద్ధమయ్యారు.PPTel 700.2

  దావీదుకు మావన మద్దతు యావత్తు ఆగిపోయినట్లు కనిపించింది. ఈ లోకంలో తాను ప్రియంగా పరిగణించినదంతా తనకు దూరమయ్యింది. సౌలు తనను దేశం నుంచి తరిమివేశాడు. ఫిలీప్రియులు శిబిరం నుంచి తనను తరిమివేసారు. తన నగరాన్ని అమాలేకీయులు దోచుకున్నారు. తన భార్యలు, బిడ్డల్ని ఖైదీలుగా తీసుకుపోయారు. తన ఆప్త మిత్రులే తనకు వ్యతిరేకంగా జట్టుకట్టి చంపుతామని బెదిరించారు. ఈ క్లిష్ట సమయంలో తానున్న భయంకర పరిస్థితులు గురించి ఆలోచించేకన్నా సహాయం కోసం దావీదు దేవుని పై దృష్టి పారించాడు. అతడు “తన దేవుడైన యెహోవాను బట్టి దైర్యము తెచ్చుకొనెను”. దావీదు తన చరిత్రాత్మక జీవితాన్ని నెమరు వేసుకున్నాడు. ప్రభువు తనను ఏ విషయంలో విడిచి పెట్టాడు ? దేవుడు తనకు మేళ్ళు ఉపకారాలు చేసిన అనేక సందర్బాల్ని గుర్తు చేసుకున్నప్పుడు అతడి హృదయం తెప్పరిల్లింది. దావీదు సందర్బాల్ని గుర్తు చేసుకున్నప్పుడు దావీదు సహచరులు తమ అసంతృప్తి, అసహనం మూలంగా తమ శ్రమల్ని మరింత కష్టతరం చేసుకున్నారు. కాని వారికన్నా ఎక్కువ శ్రమలు దు:ఖం అనుభవిస్తున్న దైవ భక్తుడు దావీదు వాటిని ధృడచిత్తంతో భరించాడు. “నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను”. (కీర్తనలు 56:3) అన్నది అతడి అంతరంగా మాట్లాడిన భాష, ఆ సమస్యకు పరిష్కారం తనకు కనిపించకపోయినా అది దేవునికి తేటతెల్లమే. ఏం చెయ్యాలో తనకు బోధిస్తున్నాడు.PPTel 700.3

  యాజకుడు అహీమెలేక కుమారుడు అయిన అబ్యాతారుని పంపి “నేను ఈ దండును తరిమిన యడెల దాని కలిసికొందునా? అని యెహోవా వద్ద దావీదు విచారణ చేయగా” “తరుము, నిశ్చయముగా నీవు వారిని కలిసికొని తప్పక నీ వారందరిని దక్కించుకొందువని సెలవిచ్చెను”,.. 1 సమయేలు 30:8PPTel 701.1

  ఈ మాటలతో దు:ఖం ఆవేదన మాయమయ్యాయి. దావీదు అతడి సైనికులు పారిపోతున్న శత్రవుని తరిమి పట్టుకోవటానికి వెంటనే బయలుదేరారు. వారి ప్రయాణం ఎంత వేగవంతంగా సాగిందంటే గాజా వద్ద మధ్యధరా సముద్రంలో కలిసే బేసోరు వాగు వద్దకు వచ్చేసరికి రెండు వందల మంది సైనికులు అలసిపోయి అక్కడ మిగిలిపోవలసి వచ్చింది. కాగా మిగిలిన నాలుగు వందల మందితో దావీదు నిర్భయంగా ముందుకి సాగాడు.PPTel 701.2

  దారిలో వారు ఒక ఐగుప్తు దేశపు బానిసను కనుగొన్నారు. అతడు అలసటలోతను ఆకలితోను మరణించటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆహారం తిని నీళ్ళు తాగిన తరువాత అతడు తేరుకున్నాడు. దాడి జరిపిన అమాలేకీయుల సైన్యానికి చెందిన తన యాజమాని మరణించటానికి తననక్కడ వదిలి పెట్టి వెళ్ళిపోయాడని ఆ బానిస చెప్పాడు. వారు జరిపిన దాడిని గురించి కొల్లగొట్టుకున్న సొమ్మును గురించ అతడు వివరించాడు. తనను చంపమని తన యాజానికి తనను అప్పగించమని వారు వాగ్దానం చేసిన అనంతరము శత్రువుల శిబిరానికి తనను నడిపిస్తానని దావీదుకి అతడు వాగ్దానం చేశాడు.PPTel 701.3

  వారు ఆ శిబిరాన్ని సమీపించినప్పుడు శత్రువులు తింటూ తాగుతూ వినోదిస్తున్న దృశ్యం వారికి కనిపించింది. విజయం సాధించిన ఆ సైనికకులు గొప్ప ఉత్సవం జరుపుకుంటున్నారు. “ఫిలిప్తీయుల దేశములో నుండియు యూదా దేశములో నుండియు తాము దోచి తెచ్చుకొనిన సొమ్ముతో తులదూగుచు, వారు ఆ ప్రదేశమంతట చెదిరి అన్న పానములు పుచ్చుకొనుచు ఆట పాటలు సలుపుచుండిరి”. తక్షణ దాడికి ఆదేశం జారీ కావటంతో దావీదు సైనికులు శత్రువుల పై పడ్డారు. ఆ దాడికి అమాలేకీయులు సిద్ధంగా లేకపోవడంతో వారి పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది. ఆరాత్రంతా ఆ మరుసటి దినమంతా యుద్ధం కొనసాగింది. శత్రు సైన్యం దాదాపు పూర్తిగా నిర్మూలమయ్యింది. నాలుగు వందలంమది యువకులు ఒంటెల మీద ఎక్కి తప్పించుకు పారిపోయారు. దేవుని మాట నెరవేరింది. “ఈలాగున దావీదు అమాలేకీయులు దోచుకొని పోయిన దానంటిని తిరిగి తెచ్కుకొనెను. మరియు అతడు తన ఇద్దరు భార్యలను రక్షించుకొనెను. కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తికొని పోయిన దానంతటిలో కొద్దిదేమి గొప్పదేమి యేదియు తక్కువ కాకుండా దావీదు సమస్తము రక్షించెను”.PPTel 701.4

  అమా లేకీయుల పై దాడి సల్పినప్పుడు తన చేతికి దొరికిన అమాలేకీయులందర్ని దావీదు సంహరించాడు. తమను దేవుడు నియంత్రించకుండా ఉంటే సిక్లగు ప్రజల్ని నాశనం చేయటం ద్వారా అమాలేకీయులు ప్రతీకారం తీర్చుకొనేవారు. తమ బంధీల్ని తరువాత బానిసలుగా విక్రయించాలన్న ఉద్దేశంతోను పెద్ద సంఖ్యలో బందీల్ని తమ వెంట పెట్టుకొని రావటం ద్వారా తమ విజయం తాలూకు ఖ్యాతిని ఇనుమడింపజేయాలన్న ఆకాక్షంతోను అమాలేకీయులు తాము చెరపట్టిన వారిని చంపకుండా ఉంచాలని తీర్మానించారు. ఇలా వారు ఎలాంటి గ్రహింపు లేకుండానే దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చారు. బందీల్ని చంపకుండా వారి భర్తలకు తండ్రులకు వారిని తిరిగి అప్పగించారు.PPTel 702.1

  లోకాధి కారాలన్నీ అనంత శక్తి గల దేవుని నియంత్రణ కింద కొనసాగుతుంటాయి. శక్తిమంతుడైన పరిపాలకుడికి క్రూర నియంతకూ ఆయన ఆదేశం ఇది, “నీవు ఇంతవరకే గాని మరి దగ్గరకు రాకూడదు. యోబు 38:11 దుష్టశక్తుల్ని నిలువరించటానికి దైవ శక్తి అనునిత్యం పనిచేస్తుంటుంది. తన మనుషుల మధ్య ఆయన నిరంతరం పని చేస్తుంటాడు. ఆయన ఉద్దేశం వారిని నాశనం చేయంటం కాదు. వారిని సరిదిద్ది సంరక్షించటమే.PPTel 702.2

  విజేతలు ఆనందోత్సాహాలో తిరిగి ఇళ్ళకు వస్తున్నారు.మధ్యదారిలో ఉండి పోయిన మిత్రుల వద్దకు వచ్చినప్పుడు యుద్ధంలో పౌలు పొందకుండా అక్కడే ఉ ండిపోయిన వారి దోపుడు సొమ్ము పంచటానికి లేదని ఆ నాలుగు వందల మంది లోను ఎక్కువ స్వార్ధపరులు అవిధేయులు అయిన ఆ సైనికులు పట్టుపట్టారు. వారితో తమ భార్యాల్ని పిల్లల్నీ తిరిగి ఇచ్చేయటంతో సరి పెట్టుకోవాలని వాదించారు. అయతే దావీదు అలాంటి ఏర్పాటుకు సమ్మతించలేదు. “నా సహోదరులారా, యెహోవా ... మనకప్పగించి మనకు దయచేసిన దాని విషయములో మీరు ఈలాగున చేయకూడదు.. యుద్ధమునకు పోయినవాని భాగమెంతో సామాను వద్ద నిలిచినవాని భాగము అంతే అని వాడుక మాట. అందరు సమానముగానే పాలుపంచుకొందురు గదా”. ఆ విషయం ఇలా పరిష్కారమయ్యింది. అనంతరం అది ఇశ్రాయేలు దేశంలో ఒక నిబంధన అయ్యింది. ఒక సైనిక దండయాత్రతో సంబంధమున్నూ వారందరూ ప్రత్యక్షంగా యుద్ధం చేసిన సైనికులతో సరిసమానంగా దోపుడు సొమ్మును పంచుకోవాలని ఆ నిబంధన స్పష్టం చేసింది.PPTel 702.3

  సిక్లగు నుంచి తాము దోచుకున్న వాటిని మాత్రమే గాక అమాలేకీయులకి చెందిన విస్తారమైన గొర్రెలు పశువుల మందల్ని దావీదు అతడి సైనిక బృందం తోలుకొచ్చారు. వాటిని “దావీదుకు దోపుడు సొమ్ము” అని వ్యవహరించారు. సిక్లగుకు వచ్చిన తరువాత తన దోపుడు సొమ్ములో ఉంచి యూదాలో తన గోత్రంలోని పెద్దలకు బహుమతులు పంపాడు దావీదు. ప్రాణాలు కాపాడుకోవటానికి ఒక స్థలం నుంచి ఇంకొక స్థలానికి పారిపోతూ తాను తన సహచరులు కొండ గుహల్లోను బండలమాటున తలదాచుకొంటున్న తరుణంలో తమ పట్ల సహృదయత ప్రదర్శించిన వారందరిని ఈ బహుమతుల ప్రదానంలో దావీదు జ్ఞాపకం చేసుకున్నాడు. వేటకు గురి అయి పారిపోతున్న తమకు ఎంతో ఆదరణ కూర్చిన వారి దయను సానుభూతిని ఈ విధంగా గుర్తించాడు దావీదు,PPTel 703.1

  దావీదు అతడి అనుచరలు సిక్లగుకు తిరిగి వచ్చినప్పటి నుండి అది మూడో రోజు, ధ్వంసమైన తమ గృహాల్ని తిరిగి నిర్మించుకోవటంలో నిమగ్నులై ఉన్న వీరు ఇశ్రాయేలీయులికి ఫిలిపీయాలుకి మధ్య జరుగుతున్న యుద్ధం గురించిన వార్తల కోసం ఉత్కంఠంతో ఎదరు చూస్తున్నారు. “బట్టలు చింపుకొని తల మీద బుగ్గి పోసుకొని” ఒక వార్తహరుడు ఆకస్మాత్తుగా పట్టణంలో ప్రవేశించాడు. అతణ్ణి తక్షణమే దావీదు వద్దకు తీసుకువచ్చారు. దావీదు ముందుకి వచ్చిన వెంటనే అతడు వినయంగా వంగి దావీదుని గొప్ప అధిపతిగా గుర్తించాడు. అతడి ప్రసన్నతను అభిలాషించాడు. యుద్ధ సమాచారం ఏంటని దావీదు అతృతగా అతణ్ణి అడిగాడు. పలాయితుడైన అతడు సౌలు ఓటమిని, సౌలు యోనాతానుల మరణాల్ని నివేదించాడు. అంతేకాడు వాస్తవాల కథనాన్ని మంచి ఒకడుగు ముందుకు వెళ్ళాడు. అలు పెరగని తన విరోధిపట్ల దావీదు కక్షగా ఉంటాడని భావించి సౌలును చంపినవాడిగా గౌరవం సంపాదించాలని ఆ పరదేశి ఆశించాడు. యుద్ధం సాగుతున్న సమయంలో ఇశ్రాయేలీయుల రాజు గాయపడి ఉండటం, శత్రువులు అతణ్ణి చుట్టుముట్టటం తాను చూసినట్లు రాజు విజ్ఞప్తి మేరకు తానే రాజుని చంపినట్లు అతడు గొప్పగా చెప్పుకున్నాడు. సౌలు శిరస్సు మీది కిరీటాన్ని హస్త కంకణాల్ని అతడు దావీదుకి సమర్పించాడు. ఆ వార్తను దావీదు హర్షంతో అంగీకరించి తాను నిర్వహించిన పాత్రకు తనకు గొప్ప పారితషికంతో సన్మానిస్తాడని కలలుకన్నాడు. PPTel 703.2

  అయితే ” దావీదు ఆ వార్త విని తన వస్త్రములు చింపుకొనెను. అతని యెద్ద నున్న వారందరు అలాగున చేసి సౌలును యోనాతానును యెహోవా జనులును ఇశ్రాయేలు ఇంటివారును యుద్ధములో కూలిరని వారిని గూర్చి దు:ఖపడుచు ఏడ్చుచు సాయంత్రంము వరకు ఉపవాసముండిరి”.PPTel 704.1

  ఆ వార్తని నిశ్చేష్టితుడైన తేరుకున్న తరువాత ఆ వార్త తెచ్చిన పరదేశి మీదికి తన మాటల ప్రకారం అతడు చేసిన నేరం మీదికి దావీదు ఆలోచనలు పోయయి. “నీవెక్కడ నుండి వచ్చితివి”? అని అడిగాడు దావీదు. “నేను ఇశ్రాయేలు దేశమున నివసించు అమాలేకీయుడగు ఒకని కుమారుడననెను. అందుకు దావీదు భయపడక యెహోవా అభిషేకించిన వానిని చంపుటకు నీవెల అతని మీద చెయ్యి ఎత్తితివి? అన్నాడు. దావీదు వశంలో సౌలు రెండుసార్లు ఉన్నాడు. సౌలుని చంపవలసినదిగా దావీదును తన అనుచరులును ప్రోత్సహించగా ఇశ్రాయేలీయుల్ని పరిపాలించటానికి దేవుడు అభిషేకించిన వ్యక్తి పై చెయ్యి ఎత్తటానికి అతడు నిరాకరించాడు. అయినా ఇశ్రాయేలీయలు రాజును చంపానంటూ హెచ్చులు పలకటానికి ఈ అమాలేకీయుడు భయపడలేదు. తన నేరం మరణ శిక్షార్హడని అతడే ప్రకటించుకొన్నాడు. ఆ శిక్ష వెంటనే అమలయ్యింది. ” యెహోవా అభిషేకించిన వానిని నేను చంపితినని నీవు చెప్పితివే, నీ నోటి మాటయే నీ మీద సాక్ష్యము గనుక నీ ప్రాణమునకు నీవే ఉత్తరాదివి అని దావీదు అన్నాడు.PPTel 704.2

  సౌలు మరణం విషయంలో దావీదు దు:ఖం యధార్ధమైనది. ప్రగాఢమైంది. అది అతడి ఔదార్యాన్ని ఉదాత్త స్వభావాన్ని వ్యక్తం చేసింది. తన శత్రువు పతనమవ్వటానికి అతడు హర్షించలేదు. తాను ఇశ్రాయేలీయుల సింహాసనాన్ని అధిష్టించకుండా ఆపిన ప్రతిబంధకం తొలగిపోయింది. కాని దాన్ని గురించి అతడు సంతోషించలేదు. తన పట్ల సౌలు ప్రదర్శించిన అవిశ్వాసాన్ని, కాఠిన్యాన్ని మరణం తుడిచి వేసింది. ఇప్పుడు సమున్నతమైనది రాజుగా స్పూర్తిదాయకమైనది తప్ప మరేది దావీదు ఆలోచనల్లోకి రాలేదు. సౌలు పేరు యోనాతాను పేరుతో ముడిపడి వున్నది. దావీదుతో యోనాతాను స్నేహం యధార్ధమైనది స్వార్ధరహితమైంది.PPTel 704.3

  దావీదు ఈ దిగువ కీర్తనలో తన భావోద్వేగాల్ని వ్యక్తం చేసాడు ఈ కీర్తన ఇశ్రాయేలు జాతికి ఆ తర్వాతి యుగాలలోని దైవ ప్రజలకు స్వాస్థ్యంగా రూపొందింది.PPTel 705.1

  “ఇశ్రాయేలూ నీకు భూషణమగువారు
  నీ ఉన్నత స్థలముల మీద హతులైరి
  అహహా బలాడ్యులు పడిపోయిరి
  ఫిలిప్తీయుల కుమార్తెలు సంతోషింపకుండునట్లు
  సున్నతలేనివారి కుమార్తెలు జయమని చెప్పకుండుటన్లు
  ఈ సమాచారము గాతులో తెలియజేయకుడి
  అష్కెలోను వీధులలోన ప్రకటన చేయకుడి
  గిల్బోవ పర్వతములారా
  మీ మీద మంచైనను వర్షమునైనను
  ప్రథమ ఫలార్పణకు తగిన పైరుగల చేలైనను
  లేకపోవును గాక
  బలాఢ్యుల డాళ్ళు అవమానముగ పారవేయబడెను
  తైలము చేత అభిషేకింపబడని వారిదైనట్టు
  సౌలు డాలును పారవేయబడెను
  హతుల రక్తములొలికింపకుండ
  బలాడ్యుల క్రొవ్వును పట్టకండ
  యోనాతాను విల్లు వెనుక తియ్యలేదు
  ఎవరిని హతము చేయకుండ సౌలు కత్తి వెనుక తీసినది
  కాదు
  సౌలును యోనాతానును తమ బ్రతుకు నందు సరసులు గాను నెనరు గల వారుగాను ఉండిరి
  తమ మరణమందైనను వారు ఒకరినొకరు ఎడబాసిన
  వారు కారు
  వారు పక్షిరాజువలె కంటే వడిగలవారు
  సింహములకంటే బలము గలవారు
  ఇశ్రాయేలీయుల కుమార్తెలారా; సౌలున గూర్చి
  యేడ్వుడి
  అతడు మీకు ఇంపైన రక్తవర్ణపు వస్త్రములు ధరింప
  చేసినవాడు
  బంగారు నగలు మీకు పెట్టినవాడు
  యుద్ధరంగమునందు బలాఢ్యులు పడియున్నారు
  నీ ఉన్నత స్థలములో యోనాతాను హతమాయెను
  నా సూదరుడా, యోనాతానా
  నీవు నాకు అతి మనోహరుడవై యుంటివి
  నీ నిమిత్తము నేను బహు శోకము నొందుచున్నాను
  నాయందు నీకున్న ప్రేమ బహు వింతైనది
  అయ్యయ్యో బలాఢ్యులు పడిపోయిరి
  యుద్ధ సన్నద్దులు నశించిపోయిరి”.
  PPTel 705.2

  2 సమూయేలు 1:19-27

  Larger font
  Smaller font
  Copy
  Print
  Contents