Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
పితరులు ప్రవక్తలు - Contents
 • Results
 • Related
 • Featured
No results found for: "".
 • Weighted Relevancy
 • Content Sequence
 • Relevancy
 • Earliest First
 • Latest First
  Larger font
  Smaller font
  Copy
  Print
  Contents

  61—విసర్జితుడైన సౌలు

  గిల్గాలులో జరిగిన విశ్వాస పరీక్షలో సౌలు విఫలుడయ్యాడు. దేవుని సేవకు అపకీర్తి తెచ్చాడు. అయినా అతడి డోషాలు దిద్దుకోలేనేమికాదు. తన వాక్యాన్ని ఆచంచల విశ్వాసంతో నమ్మిన తన ఆజ్ఞల్ని తు.చ. తప్పకుండా ఆచరించటానికి దేవుడు అతడికి మరో తరుణం ఇచ్చాడు.PPTel 631.1

  గిల్గలులో ప్రవక్త తనను మందలించినప్పుడు తాను చేసిన పనిలో తప్పేమీ లేదని సౌలు భావించాడు. తనకు అన్యాయం జరిగిందని నిర్ధారించుకొని, తన క్రియల్ని సమర్ధించుకొని ఆ తప్పుడు పనులకు సాకులు చెప్పాడు. అప్పటి నుండి ప్రవక్తతో ఎలాంటి సంబంధమూ పెట్టుకోలేదు. సమూయేలు సౌలును తన సొంత కుమారునిలా ప్రేమించగా సాహసం, పట్టుదల తత్వం గల సౌలు సమూయేలుని అమితంగా గౌరవించాడు. కాని సమూయేలు గద్దించటాన్ని నిరసించాడు. అప్పటి నుండి అతణ్ణి తప్పించుకుతిరిగాడు.PPTel 631.2

  ఇలాగుండగా సౌలుకి ప్రభువు మరో వర్తమానం పంపాడు. విధేయత ద్వారా తన విశ్వసనీయతను, ఇశ్రాయేలీయుల ముందు నడవటానికి తన యోగత్యను నిరూపించుకోవచ్చునని సమూయేలు సౌలుకి చెప్పాడు. రాజు ఆ ఆజ్ఞాచరణ ప్రాముఖ్యాన్ని గుర్తించే నిమిత్తం ఏ అధికారం సౌలుకు సింహాసనం మీద ఉంచిందో ఆ దైవాధికాంర ఆదేశం మేరకే తాను మాట్లాడున్నట్లు సమూయేలు చెప్పాడు. ప్రవక్త ఇలా అన్నాడు. “సైన్యముల కధిపతియగు యెహోవా సెలవిచ్చుదనదేమనగా - అమాలేకీయలు ఇశ్రాయేలీయులకు చేసినది నాకు జ్ఞాపకమే.వారు ఐగుప్తులో నుంచి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదికి వచ్చిరిగదా. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులకు హతము చేయుము. పురుషులనేమి, స్త్రీలనేమి, బాలురననేమి, పసిపిల్లనేమి, యెద్దులనేమి, గొట్టెలనేమి, ఒంటెలనేమి గార్దభములనేమి అన్నంటిని హతము చేసి వారికి కలిగిన దంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలము చేయుము.PPTel 631.3

  ఇశ్రాయేలీయులతో ఆమాలేకీయులు మొదటగా యుద్ధం చేసారు. దీనితోపాటు దైవధిక్కారం విగ్రహారాధన పాపాల నిమిత్తం ప్రభువారి పై మోషే ద్వారా తీర్పు ప్రకటించాడు. ఇశ్రాయేలీయుల పట్ల వారి క్రూరత్వ చరిత్ర ప్రభువు ఆదేశం మేరకు ఈ ఆజ్ఞతో దాఖలయ్య ఇంది,. “ఆకాశము క్రింద నుండి అమాలేకీయలు పేరు తుడిచివేయవలెను. ఇది మరిచపోవద్దు.” ద్వితి 25:19 ఈ తీర్పు అమలు నాలుగు వందల సంవత్సరాలు నిలిచి ఉంది. అయినా అమాలేకీయులు తమ పాపాల నుండి వైదొలగలేదు. సాధ్యపడితే ఈ దుష్ట జనులు తన ప్రజల్ని తన ఆరాధనను లోకంలోనుంచి తుడిచివేస్తారని ప్రభువుకు తెలుసు. ఇంతకాలము అమలుకాకుండా నిలిచివున్న ఈ తీర్పు అమలుకు సమయం ఇప్పుడు వచ్చింది.PPTel 631.4

  దుష్టుల విషయంలో దేవుడు కనపర్చే సహనం పాపం చెయ్యటంలో మనుషుల్ని ధైర్యపర్చుతుంది. అయితే జాప్యం జరిగినా వారికి శిక్ష తప్పదు. దాని తీవ్రత తగ్గదు. “నిజముగా తన కార్యమును తన ఆశ్చర్యకరమైన కార్యమును చేయుటకు అపూర్వమైన తన కార్యముననురించుటకు ఆయన పెరాజీము అనుకొండ మీద లేచినట్లు యెహోవా లేచును. గిబియాను లోయలో ఆయన రేగినట్లు రేగును”. యెషయా 28:21 కృపామయుడైన మన దేవునికి శిక్షించటం అశ్చర్యకరమైన కార్యం. “నాజీవముతోడు దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషము లేదు. దుర్మార్గము తన దుర్మార్గము నుండి మరలి బ్రదుకుట వలన నాకు సంతోషము కలుగును”. యెహజ్కేలు 33:11 యెహోవా “కనికరకము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడు... దోషమును అపారధమును పాపమును క్షమించును”. నిర్గమ 34:67 పగతీర్చుకోవటంలో ఆయన సంతోషించకపోయినా తన ధర్మశాస్త్రాన్ని అతిక్రమించేవారికి ఆయన తీర్పు తీర్చుతాడు. మానువుల్ని నాశనం నుంచి కాపాడేందుకు ఆయన ఈ కార్యం నిర్వహించి తీరాలి. కొంతమందిని రక్షించేందుకోసం పాపంలో కరుడుగట్టిన వారిని తీసివేయ్యటం ఆవశ్యం. “యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలము గలవాడు, ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు” నహూము 1:3 భయంకరమైన అనేక విషయాల ద్వారా తృణీకారానికి గురి అవుతున్న తన ధర్మశాస్త్రం అధికారాన్ని ఆయన పునరుద్ధరిస్తాడు. తన తీర్పుల అమలుకు దేవుడు వెనకాడటం శిక్షార్హమైన పాపాల విస్తారతను, అపరాధికి వేచి ఉన్న శిక్ష తీవ్రతను సూచిస్తున్నది.PPTel 632.1

  కాగా శిక్ష అమలులో దేవుడు కృపను మర్చిపోలేదు. అమాలేకీయులు సర్వనాశనం కావాల్సి ఉండగా వారి మధ్య నివసిస్తున్న కేయులు మినహాయింపు పొందాల్సి ఉన్నారు. విగ్రహారాధనకు సంపూర్తిగా దూరంగా ఉండకపోయినా వీరు దేవుని ఆరాధించేవారు. ఇశ్రాయేలీయులతో స్నేహ సంబంధాలు కలిగి నివసించేవారు. మోషే బావమర్ధి హోబాబు ఈ గోత్రీయుడే. ఇశ్రాయేలీయులు ఆరణ్య ప్రయాణంలో ఇతడు వారితో వెళ్ళాడు. ఆ దేశాన్ని గూర్చిన తన పరిజ్ఞానాన్ని ఇశ్రాయేలీయులతో పంచుకొని వారికి విలువైన సేవలందించాడు.PPTel 632.2

  మిక్మషులో, ఫిలిప్తీయుల పరాజయం నాటి నుండి మోయాబు, ఆమ్మోను, ఏదోము దేశాలతో, అమాలేకీయులు ఫిలిప్తీయులతో సౌలు యుద్ధం చేసాడు. అతడు ఎక్కడకు దండెత్తి వెళ్తే అక్కడ కొత్త విజయాలు సాధించాడు. అమాలేకీయుల పై యుద్దానికి ఆ దేశం వచ్చిన వెంటనే యుద్ధం ప్రకటించాడు. తన అధికారానికి తోడుగా ప్రవక్త మద్దతు లభించింది. యుద్ధ ప్రకటనకు స్పందిస్తూ ఇశ్రాయేలు ప్రజలు సౌలు జెండా వెనుక బారులు తీరారు. అది వ్యక్తిపరమైన ప్రగతికి ఉద్దే శించిన దండయాత్ర కాదు, కాకూడదు, ఆ విజయంలోని గౌరవం గాని శత్రవుల కొల్లధనంలో భాగం గాని ఇశ్రాయేలీయులకి ఉండదు. వారు దేవునికి విధేయులుగా యద్దుంలో పాలు పొందాల్సి ఉన్నారు. అమాలేకీయుల పై దేవుని తీర్పులు అమలు జరపటమే వారి విధి. అన్ని జాతుల ప్రజలు తన సౌర్వభౌమాధికారాన్ని ధిక్కరించిన ప్రజల నాశనాన్ని చూసి వారు ఏ ప్రజల్ని తృణీకరించారో ఆ దైవ ప్రజలే వారిని నాశనం చేసారని తెలుసుకోవాలన్నది దేవుని ఉద్దేశం.PPTel 633.1

  “సౌలు అమాలేకీయులను హావీలానుండి ఐగుప్తు దేశపు మార్గమున నున్న షూరు వరకు తరిమి హతము చేసి అమాలేకీయుల రాజైన అగగును ప్రాణముతో పట్టుకొని జనులందరిని కత్తి చేత నిర్మూలము చేసెను. సౌలును జనులును కూడా అగగును. గొట్టెలలోను, ఎడ్లలోను, క్రొవ్విన గొట్టె పిల్లలు మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలము చేయక కడగా నుంచి పనికిరాని నీచ పశువులన్నింటిని నిర్మూలము చేసిరి”.PPTel 633.2

  అమాలేకీయుల పై ఈ విజయం సౌలు సాధించిన విజయాలన్నింటిలోను మిక్కిలి తేజోవంతమైంది. అది అతడి గుండెల్లో దురహంకారాన్ని రగిలించటానికి తోడ్పడింది. అదే అతడి ముందున్న పెను ప్రమాదం. దేవుని శత్రువుల్ని నిశ్శేషంగా నాశనం చేయాలన్న దైవాజ్ఞను పాక్షింగానే నెరవేర్చాడు. చుట్టు ఉన్న రాజ్యాల్లోని అచారాన్ననుసరించి, విజయంతో తిరిగివస్తున్న తన ఖ్యాతిని తాను చెరపట్టిన రాజు సముఖం ద్వారా ఇనుమడింపజేసుకోవాలన్న ఆకాంక్షతో అమాలేకీయుల రాజు అగగును సౌలు చంపకుండా ఉంచాడు. ప్రజలు మేకలు, గొర్రెలు, పశువులు గాడిదల్లో శ్రేష్టమైన వాటిని బలి అర్పించటానికని అట్టి పెట్టుకున్నారు. తమ పశు వులను కాపాడుకోవటానికి వీటిని ప్రత్యామ్నాయ బదులుగా ఉపయోగించాలన్నది వారి అసలు ఉద్దేశం.PPTel 633.3

  సౌలుకి ఇప్పుడు చివరి పరీక్ష జరిగింది. దురహంకారంతో దేవున్ని లెక్క చెయ్యకపోవటం, స్వతంత్ర రాజుగా పరిపాలించాలని నిశ్చయించుకోవటం, దేవుని ప్రతినిధిగా రాజ్యా ధికారం చేపట్టటానికి అతడు అర్హుడు కాడని నిరూపించాయి. విజయోత్సాహంతో సౌలు అతడి సైన్యం తిరిగి వస్తుండగా ప్రవక్త సమూయేలు గృహంలో తీవ్ర మనస్తాపం చోటు చేసుకొంది. రాజు నిర్వాకాన్ని నిరసిస్తూ దేవుని వద్ద నుండి సమూయేలుకి వర్తమానం వచ్చింది. సౌలు నన్ను అనుసరింపక వెనుతీసి నా ఆజ్ఞను గైకొనక పోయెను గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను”. రాజు అవిధేయ వ్యవహరణను గూర్చి సమూయేలు క్షోభించాడు. తన తీర్పును మార్చమంటూ విలపిస్తూ రాత్రంతా దేవునికి ప్రార్ధన చేసాడు.PPTel 634.1

  దేవుని పశ్చాత్తాపం మానవుడి పశ్చాత్తాపం వంటిది కాదు. “మరియు ఇశ్రాయేలీయులకు ఆధారమైనవాడు నరుడు కాడు. ఆయన అబద్దమాడడు, పశ్చాత్తాపడడు”. మానవుడి పశ్చాత్తాపం మనసు మార్చుకోవటాన్ని సూచిస్తుంది. దైవ ప్రసన్నత పొందటానికి గల షరతుల్ని ఆచరించటం ద్వారా మనావుడు దేవునితో తన సంబంధాల్లో మార్పు తెచ్చుకోవచ్చు. లేదా తన సొంత చర్య ద్వారా ఆయన దయకు తన్ను తాను దూరం చేసుకోవచ్చు. కాని ప్రభువు “నిన్న, నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు; అవును యుగయుగములకును ఒక్కటే రీతిగా ఉండును”. హెబ్రీ 13:8 సౌలు అవిధేయత ప్రభువుతో అతడి బాంధవ్యాన్ని మార్చివేసింది. అయితే ఏ షరతుల పై దేవుడు మనల్నీ స్వీకరిస్తాడో అని మార్పులేనివి. దేవుని షరతులు ఇప్పటికి అవే. “ఆయనయందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయయైనను లేదు”. యాకోబు 1:17PPTel 634.2

  భిస్తున్న హృదయంతో ప్రవక్త రాజును కలుసుకోవటానికి మరుసటి ఉదయం బయలుదేరాడు. సావధానంగా ఆలోచించిన మీదట సౌలు తాను చేసిన పాపాన్ని గుర్తించి వినయ మనసుతో పశ్చాత్తాపపడి తిరిగి ప్రభువు కటాక్షాన్ని పొందుతాడని సమూయేలు భావించాడు. అయితే అతిక్రమంలో మొదటి మెట్టు ఎక్కినప్పుడు మార్గం సులభతరమౌతుంది. అవిధేయతతో దిగి జారిపోయిన సౌలు సమాయూలును అబద్దంతో కలుసుకవోటానికి వచ్చాడు. ” యెహోవా వలన నీకు అశీర్వదాము కలుగును గాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చితిని” అన్నాడు.PPTel 634.3

  ప్రవక్త చెవికి వినిపిస్తున్న శబ్దాలు రాజు చెబుతున్నది అబద్ధమని చాటుతున్నాయి, “అలాగైతే నాక వినబడుచున్న గొట్టెల అరుపులు ఎడ్లరంకెలును ఎక్కడివి”? అన్న ప్రవక్త ప్రశ్నకు సౌలు ఇలా బదులిచ్చాడు. “అమాలేకీయల యొద్ద నుండి జనులు వీటిని తీసుకొని వచ్చిరి. నీ దేవుడైన యెహోవాకు బలలుర్పించుటకు జనులు గొట్టెలలోను, ఎడ్లలోను మంచివాటిని ఉండనిచ్చిరి. మిగిలిన వాటిని మేము నిర్మూలము చేసితిమి” ప్రజలు సౌలు ఆదేశాలను లోబడ్డారు. తనపై నింద పడకుండా ఉండేందుకు తన అవిధేయత పాపాన్ని ప్రజల నెత్తిన రుద్దటానికి పౌలు సిద్ధమయ్యాడు,PPTel 634.4

  సౌలు విసర్జన వర్తమానం సమూయేలు హృదయాలన్ని క్షోభింపజేసింది. తమ రాజు పరాక్రమం వల్ల యుద్ధ నైపుణ్యవల్ల - ఇశ్రాయేలీయుల ఈ విజయంలో దేవునికి మహిమ ఘనత సౌలు చెల్లించలేదు. - తమకు కలిగిన విజయానికి ఇశ్రాయేలు ప్రజలు అతిశయంతో నిండి సంబరపడుతున్న తరుణంలో సమూయేలు ఈ వర్తమానాన్ని వారికి వెల్లడించాల్సి ఉన్నాడు. సౌలు అవిధేయత నిదర్శనాల్ని చూసినప్పుడు సమూయేలు అగ్గి మీద గుగ్గిలమయ్యాడు. దేవుని అనుగ్రహాన్ని విశేషంగా పొందని సౌలు ఆయన ఆజ్ఞను ఉల్లఘించి ఇశ్రాయేలీయుల్నీ పాపంలోకి నడిపించటం సమయేలుకి ఎంతో మనస్తాపం కలిగించిది. రాజు ఎత్తులు, జిత్తులు సమూయేలుని మోసగించ లేకపోయాయి. దు:కం అగ్రహం కలబోసిన సర్వంతోను ప్రవక్త ఇలా అన్నాడు. “నీవు మాటలాడ పనిలేదు. యెహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేతును వినుము.... నీ దృష్టికి నీవు అల్పుడవుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీయుల గోత్రములకు శిరస్సునైతివి. యెహోవా నిన్ను ఇశ్రాయేలీయుల మీద రాజుగా అభిషేకించును. అమాలేకీయులను గూర్చి దేవుని నిన్ను ఇశ్రాయేలీయుల మీద రాజుగా అభిషేకించెను”. అమాలేకీయులను గూర్చి దేవుని ఆజ్ఞను ప్రస్తావించి దాన్ని నిర్వర్తించలేకపోవటానికి కారణమేంటని నిగ్గదీశాడు.PPTel 635.1

  తాను చేసిన పనిని సమర్ధించుకోవటానికి సౌలు పదే పదే ప్రయత్నించాడు. “నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమున పోయి అమాలేకీయుల రాజైన అగగును తీసుకొని వచ్చితిని కాని అమాలేకీయులను నిర్మూలము చేసితిని. అయితే గిలులో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకై జనులు శపితములగు గొట్టెలలోను ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకొని వచ్చిరి”.PPTel 635.2

  కఠిన గంభీర పదజాలంతో అతడి అబద్దాల్ని తోసిపుచ్చి తిరుగులేని తీర్పును వెలిబుచ్చాడు సమూయేలు ‘తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించునట్లు ఒకడు దహన బలులును, అర్పించుటవలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుటకంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ళ క్రొవ్వు అర్పించుటకంటే మాట వినుటయు శ్రేష్టము, తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటయును పాపముతో సమానము. మూర్ఖతను ఆగపర్చుట మాయా విగ్రహము గృహదేవత పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జింతివి గనుక నీవు రాజుగా ఉండకుండ ఆయన నిన్ను విసర్జించెను”.PPTel 635.3

  భీకరమైన ఈ తీర్పు వినగానే అతడిలా విలపించాడు. “జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకొంటిని”. ప్రవక్త చేసిన ప్రకటన విని భయపడి సౌలు తన దోషాన్ని అంగీకరించాడు. తాన ఏ పాపం ఎరుగనని దానికి ముందే చెప్పాడు. అయినా తాము ప్రజలకు జడిసి పాపం చేసాశనంటూ ఆ నిందను ప్రజల మీదికి నెట్టేశాడు.PPTel 636.1

  ఇశ్రాయేలు రాజు సమూయేలుని ఈ విధముగా బతిమాలటం పాపం నిమిత్తం కలిగిన పశ్చాత్తాపం వల్ల గాక ఆ పాప పర్యవసాన భయంవల్లనే, “కాబట్టి నీవు నా పాపమును పరిహరించి నేను యెహోవాకు మ్రొక్కునట్లు నాతో కూడా తిరిగి రమ్ము” సౌలు నిజంగా పశ్చాత్తాపం పొంది ఉంటే తన పాపాన్ని బహిరంగంగా ఒప్పుకొనేవాడు. అయితే అతడికి తన అధికారాన్ని కొనసాగించటం ప్రజల విశ్వాసాన్ని పొందటమే ముఖ్యం దేశంలో తన ప్రాబల్యాన్ని కొనసాగించేందుకు తనతో సమూయేలు ఉండాల్సిందిగా కోరాడు.PPTel 636.2

  “నీతో కూడా నేను తిరిగి రాను. నీవు యెహోవా నా ఆజ్ఞను విసర్జించితివి గనుక ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండ యెహోవా నిన్ను విసర్జించెను.” అన్నది ప్రవక్త సమాధానం. సమూయేలు తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు అతణ్ని ఆపటానికి అతడి వస్త్రాన్ని పట్టుకొనగా అది చినిగి సౌలు చేతిలో మిగిలింది. అంతట ప్రవక్త ఇలా ప్రకటించాడు. “నేడు యెహోవా ఇశ్రాయేలీయుల రాజ్యమును నీ చేతిలో నుంచి లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి దానిని అప్పగించి యున్నాడు”.PPTel 636.3

  దేవుని అగ్రహం కన్నా సమూయేలు ఎడబాటు సౌలును ఎక్కువ కలతపర్చింది. తన మీదకన్నా ప్రవక్త సమూయేలు మీదే ప్రజలకు ఎక్కువ విశ్వాసం ఉన్న సంగతి సౌలుకు బాగా తెలుసు. దేవుని ఆజ్ఞ చొప్పున ఇప్పుడు వేరొక వ్యక్తిని రాజుగా అభిషేకించటం జరిగితే తన అధికారాన్ని కొనసాగించటం ఆసాధ్యమని సౌలు భావించాడు. తనను ఇప్పుడు సమూయేలు పూర్తిగా విసర్జించినట్లయితే తక్షణ తిరుగుబాటు తథ్యమని భయపడ్డాడు. బహిరంగ ఆరాధనలో తనతో కలసి పాలు పొందటం ద్వారా పెద్దలముందు ప్రజలముందు తనను మన్నించాల్సిందిగా సౌలు ప్రవక్తను బతిమాలాడు. తిరుగుబాటును నివారించేందు కోసం ప్రభువు. ఆదేశం మేరకు సమూయేలు రాజు కోరికను మన్నించాడు. కాని ఆ ఆరాధన తతంగాన్ని సమూయేలు నిశ్శబద్ద సాక్షిగా మాత్రమే వీక్షించాడు.PPTel 636.4

  కఠినమైన, భీకరమైన న్యాయకార్యం జరగాల్సి ఉన్నది. సమూయేలు దేవుని ఔన్యత్యాన్ని బహిరంగంగా ధ్రువపర్చి సౌలు మార్గాన్ని ఖండించాల్సి ఉన్నాడు. అమాలేకీయుల రాజును తన మందు ప్రత్యక్ష పర్చాల్సిందిగా సమూయేలు ఆదేశించాడు. ఇశ్రాయేలీయుల ఖడ్గానికి ఆహుతి అయిన వారందరికన్నా అగగు మిక్కిలి కఠినాత్ముడు తీవ్రమైన నేరస్తుడు. దైవ ప్రజల్ని ద్వేషించి నాశనం చేయాలని చూసినవాడు. విగ్రహారాధన ప్రాబల్యానికి గట్టిగా కృషి చేసినవాడు. మరణ భయం తొలగిపోయందన్న ధీమాతో ప్రవక్త ఆదేశం మేరకు వచ్చాడు. సమూయేలు ఇలా అన్నాడు. “నీ కత్తి స్త్రీలను సంతులేకుండా చేసినట్లు నీ తల్లిని స్త్రీలలో సంతులేక పోవునని అతనితో చెప్పి.... యెహోవా సన్నిధిని అగగును తుత్తునియలుగా నరికెను”. ఆ తరువాత సమూయేలు రామాలోని తన గృహానికి సౌలు గిబియాలోని తన గృహానికి వెళ్ళిపోయాడు. ఇది జరిగిన తరువాత వీరు ఒకరితో ఒకరు ఒకసారి మాత్రమే సమావేశమయ్యారు.PPTel 637.1

  సింహాసనానికి వచ్చినప్పుడు సౌలు తన ప్రతిభా ప్రావీణ్యాల గురించి సీదాసాదాగా తలంచేవాడు. నేర్చుకోవటానికి సంసిద్ధంగా ఉండేవాడు. జ్ఞానంలోను అనుభవంలోను ఎన్నో లోటులు ఉండేవి. ప్రవర్తన విషయంలో ఎన్నో లోపాలుండేవి. అయితే ప్రభువు అతడికి మార్గదర్వకుడుగాను సహాయకుడుగాను పరిశుద్దాత్మను అనుగ్రహించి ఇశ్రాయేలీయుల పరిపాలకుడిలో అవసరమైన గుణలక్షణాల్ని పెంపొందించటానికి అనువైన స్థానంలో ప్రభువు అతణ్ణి నియమించాడు. నిత్యం దేవుని నడుపుదలను కోరుతూ అణుకువగా నిలిచి ఉంటే ఆ ఉన్నత స్థానం విధులు బాధ్యతల్ని విజయవంతంగా గౌరవ ప్రధంగా నిర్వహించే సామర్ధ్యాన్ని దేవుడు అతడికిచ్చేవాడు. దేవుని కృప ప్రభావం వల్ల ప్రతీ సద్గుణం బలపడి దుర్గాణాలు తమ ప్రాబాల్యాన్ని కోల్పోయేవి. ఎవరు తమ్ముని తాము దేవునికి అంకితం చేసుకొంటారో వారిలో ఈ కార్యాన్ని నిర్వహిచంటం దేవుని సంకల్పం., అనేకమంది సాత్వికులై నేర్చుకోవటానికి సంసిద్దులుగా ఉన్నారు. గనుక తన సేవలో ఉన్నత స్థానాలు ఆక్రమించటానికి దేవుడు వారిని పిలిచాడు. తనను గూర్చి నేర్చుకోవటానికి అనువైన స్థానాల్లో వారిని ఆయన ఉంచుతాడు. తమ ప్రవర్తనలో లోపాల్ని వారికి బయలుపర్చుతాడు. తన సహాయం అర్ధించే వారందరికీ తమ తప్పులు దిద్దుకోవటానికి ఆయన శక్తినిస్తాడు.PPTel 637.2

  అయితే సౌలు తన ఉన్నత స్థానాన్ని చూసుకొని అవిశ్వాసం ఆవిధేయతలతో నిండి దేవుని అగౌరవపర్చాడు. సింహాసనానికి వచ్చిన తొలిదినాల్లో వినయ విధేయతలు దండిగా కలిగి స్వశక్తి మీద ఆధారపడకపోయినప్పటికి విజయం అతడిలో ఆత్మ విశ్వాసం పెంచింది. తన పరిపాలనలో మొట్టమొదటి విజయం తనకు పెద్ద ముప్పుగా పరిణమించి తనలో అహంకారాన్ని రగిలించింది. యాబేఫిలాదు విడుదలలో సౌలు ప్రదర్శించిన సాహసం యుద్ధ కౌశలం యావజ్జాతి ప్రశంసల్ని అందుకొన్నాయి.అతడు దేవుని చేతిలోని సాధనమే అన్న విషయం మర్చిపోయి ప్రజలు తమ రాజును ఘనపర్చారు. ఆరంభంలో సౌలు దేవునికి మహిమ చెల్లించినప్పటికి తర్వాత ఆ గౌరవ మహిమల్ని తానే సొంతం చేసుకున్నాడు. దేవుని పై ఆధారపడటాన్ని విస్మరించాడు. తన హృదయంలో దేవున్ని విడిచి పెట్టేశాడు. ఆయనకు చోటివ్వలేదు. గిల్గాలులో తాను చేసిన దురభిమాన పాపానికి ఇలా సుగమమయ్యింది. అదే గుడ్డి ఆత్మ విశ్వాసం సమూయేలు మందలింపును తోసిపుచ్చటానికి అతణ్ణి నడిపించింది. సమూయేలుని దేవుడు ఏర్పాటుచేసుకొన్న ప్రవక్తగా పౌలు అంగీకరించాడు. అందుకే తాను పాపం చేసినట్లు తనకు కనిపించకపోయినా సమూయేలు మందలింపును పౌలు అంగీకరించి ఉండాల్సింది.PPTel 638.1

  తమ పాపాన్ని గుర్తించి దాన్ని ఒప్పుకొని ఉంటే ఈ చేదు అనుభవం అతడికి భవిష్యత్తులో కాపుదలనిచ్చేది.PPTel 638.2

  ప్రభువు సౌలుని అప్పుడు పూర్తిగా విడిచి పెట్టి ఉంటే సమూయేలు ద్వారా అతడితో మళ్ళీ మాట్లాడేవాడు కాదు. సౌలు తన గత దోషాల్ని సరిచేసుకొనేందుకు గాను సమూయేలు నిర్వర్తించవలసిన నిర్దిష్టమైన పాత్రను దేవుడు సమూయేలుకు నియమించేవాడు కాదు. దేవుని బిడ్డనని చెప్పుకొంటున్న ఒక వ్యక్తి దైవ కార్యాన్ని నిర్వర్తించటంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి తద్వారా దేవుని ఉపదేశాల పట్ల లెక్కలేనితనంగా ఆమార్యదగా వ్యవహరించేటట్లు ఇతరుల్ని ప్రభావితం చేసినట్లయితే అతడి అపజయాల్ని విజయాలుగా దేవుడు మార్చటం ఇంకా సాధ్యమే. అతడు నిజమైన పశ్చాత్తాపంతో మందలింపును స్వీకరించి అణుకువతో విశ్వాసంతో దేవుని వద్దకు వస్తే అది సాధ్యమవుతుంది. ఓటమిలోని కించపాటు తరుచు దీవెనగా పరిణమిస్తుంది. దేవుని చూయూత లేకుండా దేవుని చిత్తాన్ని నెరవేర్చటానికి మనకు శక్తి లేదని ఇది సూచిస్తుంది.PPTel 638.3

  దేవుని పరిశుద్దాత్మ పంపిన మందలింపుని తిరస్కరించి సౌలు తన స్వనీతిని సమర్ధించుకొన్నప్పుడు తనను కాపాడటానికి దేవునికున్న ఒకే ఒక సాధనాన్ని అతడు నిరాకరించాడు. తను కావాలనే దేవుని నుంచి వేరయ్యాడు. తన పాపాన్ని ఒప్పుకొని దేవుని వద్దకు తిరిగి వచ్చేంతవరకు అతడికి దేవుని చేయూత గాని మార్గదర్శకత్వం గాని లభించవు.PPTel 639.1

  రిల్గాలులో ఇశ్రాయేలీయుల సైన్యం ముందు నిలిచి దేవునికి బలి అర్పిస్తూ సౌలు గొప్ప పాప భీతిని నటించాడు. కాని అది నిజమైన దైవ భక్తి కాదు. దేవుని ఆజ్ఞకు విరద్దుంగా జరిపిన మతాచారం సౌలుని బలహీనపర్చి తనకు దేవుడు అందించాలనుకొన్న సహాయానికి అతణ్ణి దూరం చేసింది.PPTel 639.2

  అమాలేకీయుల పై దాడిలో తనకు ప్రభువిచ్చిన ఆదేశంలోని ప్రధాన కార్యాల్ని నిర్వర్తించానని సౌలు భావించాడు. అయితే పాక్షిక విధేయతతో ప్రభువు తృప్తి చెందడు. అలాంటి తేలికపాటి ఉద్దేశంతో జరిగే నిర్లక్ష్యాన్ని ప్రభువు ఉపేక్షించాడు. తన ధర్మశాసనాన్ని ఉల్లుంఘించే స్వేచ్ఛను ప్రభువు మనషులకివ్వలేదు. ఇశ్రాయేలీయులతో ప్రభువు ఇలా ఖండితంగా చెప్పాడు. మీలో ప్రతి మనుష్యుడు తన కంటియి యుక్తమైనదంతయు చేయకూడదు”.... కాని “నీకును నీ తరువాత నీ సంతతి వారికిని మేలు కలుగునటు ప్లే నేను ఆజ్ఞాపించుచున్న యీ మాటలన్నింటిని నీవు జాగ్రత్తగా వినవలెను” ద్వితి 12:8 28. ఒక కార్యాచరణ పూనిక వహించేటప్పుడు అది ఏ దుష్పలితాలకు దారితీస్తుందా అని ఆలోచించక అది దేవుని చిత్తానికి అనుగుణంగా ఉన్నదా అని మనం యోచన చెయ్యాలి “ఒకని యెదుట సరియైనదిగా కనబడు మార్గము కలదు. అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును” సామె 14:12PPTel 639.3

  “బలులు అర్పించుకటంటే.... మాట వినుట శ్రేష్టము” వట్టి బలి అర్పణలకు దేవుని దృష్టిలో ఎలాంటి విలువా లేదు. అర్పించే వ్యక్తి పక్షంగా అవి పాపం విషయమై పశ్చాత్తాపాన్ని క్రీస్తు పై విశ్వాసాన్ని వ్యక్తం చేసి భవిష్యత్తులో దైవ ధర్మశాస్త్రానికి విధేయత వాగ్దానం చేయటానికి అవి ఏర్పాటయ్యాయి. కాగా పశ్చాత్తాపం, విశ్వాసం విధేయ హృదయం లేకుండా అర్పణలు నిరర్థకాలు. దేవుడు దేన్ని నాశనం చేయటానికి ప్రత్యేకించాడో దాన్ని దేవుని ఆజ్ఞకు విరుద్ధంగా అర్పణగా సౌలు ప్రతిపాదించినపడు అతడు దేవుని అధికారాన్ని బహిరంగంగా ధిక్కరించినట్లు కనపర్చుకొన్నాడు. ఆ అర్పణ దేవునికి గొప్ప అవమానంగా పరిణమించేంది. సౌలు పాపం దాని పర్యవసానం మన కళ్ళముందే ఉండగా ఎందరు అదే రీతిగా వ్యవహరిస్తున్నారు! ప్రభువు ఆజ్ఞను నమ్మి ఆచరించటానికి నిరాకరిస్తూనే వారు యధావిధి అర్పణలు అర్పించి మతాచారాల్ని ఓపికగా ఆచరిస్తారు. అట్టి ఆరాధనలో దేవుని ఆత్మ స్పందన ఉండదు. దైవజ్ఞాల్లో దేనినైనా మీరుతూ మనుషులు మతాచారాల్ని ఎంత ఉద్రేకం నిష్టగా ఆచరించినా వాటిని దేవుడు అంగీకరించడు.PPTel 639.4

  “తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటయను పాపముతో సమానము. మూర్ఖతను ఆగపర్చుట మాయా విగ్రహము గృహదేవుతలను పూజించుటతో సమానము”. తిరుగుబాటు సాతానుతో ప్రారంభమయ్యింది. దేవుని పై జరిగి తిరుబాటంతా ప్రత్యక్షంగా సాతాను ప్రభావం వల్ల జరిగేదే. దైవ ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వారందరూ భ్రష్టాధినేత సాతానుతో మైత్రి ఒప్పందము చేసుకుంటారు. అతడు మనసుల్ని చెరగొని అవగాహనను తప్పుదారి పట్టించటానికి తన శక్తియుల్ని వినియోగిస్తాడు. అతడు సమస్తాన్నీ అబద్దంగా కనపర్చతాడు. మన మొదటి తల్లితండ్రులు అదామవ్వల్లా అతడి ఇంద్రజాలానికి లోనయ్యే వారందరూ ఉల్లంఘన ఫలితంగా లభించే గొప్ప లాభాల్నే పరిగణిస్తారు.PPTel 640.1

  సాతాను ప్రాబల్యం క్రింద నివసించే అనేకులు తాము దేవుని సేవ చేస్తున్నామని నమ్ముతూ ఆత్మ వంచన చేసుకుంటారు. వంచించటానికి సాతానుకున్న శక్తికి ఇంతకన్నా బలమైన నిదర్శనం దొరకదు. కోరహు దాతానను అబీరాములు మోషే పై తిరుగుబాటు చేసినప్పుడు వారు తమలాంటి మనుషుడి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నామని అపోహ పడ్డారు. నిజంగా ఆ రీతిగా దైవ సేవ చేస్తున్నామని భావించేవారు. అయితే దేవుడు ఎంపిక చేసుకొన్న వ్యక్తిని నిరాకరించటం ద్వారా వారు క్రీస్తుని నిరాకరించారు. దేవుని ఆత్మను కించపర్చారు. అలాగే క్రీస్తు దినాల్లో దేవుని పట్ల గొప్ప భక్తి గౌరవాలున్నట్లు చెప్పుకొన్న యూదు శాస్త్రులు పెద్దలు దైవ కుమారుణ్ణి సిలువవేశారు. దేవుని చిత్తాన్ని ఖాతరు చెయ్యకుండా తమ చిత్తాన్నే అనుసరించేవారి హృదయాల్లో ఇదే స్వభావం కొనసాగుతుంది., PPTel 640.2

  సమూయేలు దైవాత్మ పూరితుడనటానికి సౌలుకి కావలసినంత నిదర్శనం ఉంది. ఆ ప్రవక్త ద్వారా దేవుడిచ్చిన ఆజ్ఞను బేఖాతరు చెయ్యటానికి అతడు సాహిసించటం. హేతుబద్దము కాదు విజ్ఞత కాదు. ప్రాణాంతకమైన అతడి దురభిమానం సాతానుపరమైన గారడి ఫలితమే అనవచ్చు. విగ్రహారాధనను మంత్రివిద్యను అణిచివేయటంలో సౌలు ఎంతో ఉద్రేకాన్ని ప్రదర్శించాడు. అయినా దైవా ఉదేశాన్ని మీరటం విషయంలో అదే స్వభావం అతణ్ణి దేవునికి వ్యతిరేకంగా నడిపించింది. గారడీ చేసేవారిని అవేశపర్చే సాతానే నిజానికి సౌలునీ ఆవేశపర్చాడు. సమూయేలు మందలించినప్పుడు సౌలులో మొండితనంతో పాటు తిరుగుబాటు స్వభావం పుట్టుకొచ్చింది. అతడు బహిరంగంగా విగ్రహారాధకులతో చేతులు కలిపి ఉంటే అది దేవుని ఆత్మను ఇంతకన్నా ఎక్కువ భింపజేసది కాదు.PPTel 640.3

  దేవుని వాక్యం లేదా దేవుని ఆత్మ గద్దింపుల్నీ హెచ్చరికల్ని ఆలక్ష్యం చేయటం ప్రమాదకరం. సౌలుకు మల్లే అనేకులు శోధనలకు లొంగి లొంగి చివరికి పాపం నిజ స్వరూపాన్ని కానలేనంత గుడ్డివారవుతారు. తమ ముందేదో గొప్ప ఆదర్శం ఉన్నదని దైవ విధులకు విరుద్ధంగా కొత్త పుంతలు తొక్కటంలో తాము తప్పు చేయటం లేదని అతిశయపడుతూ ఉంటారు. వారు ఇలా కృపకు మూలమైన ఆత్మను గాయపర్చుతారు. తుదకు ఆత్మ స్వరం ఇక వినిపించదు. తాము ఎంచుకున్న మోసాలకు ఆహుతి కావటానికి మిగిలిపోతారు.PPTel 641.1

  ఇశ్రాయేలీయుల రాజ్యం గిలులో సౌలుకు ధ్రువీకృతమైనప్పుడు సమూయేలు ప్రజలనుద్దేశించి “మీరు కోరి యేర్పరచుకొనిన రాజు ఇతడే. యెహోవా ఇతనిని మీ మీద రాజుగా నిర్ణయించియున్నాడు” (1 సమూయేలు 12:13) అన్నట్లు దేవుడు సౌలులో ఇశ్రాయేలీయులు ఏరికోరికున్న రాజునే ఇచ్చాడు. అతడు అందగాడు అంగసౌష్టవం గలవాడు. రాజలక్షణాలు ఉట్టిపడున్నవాడు. అతడి శౌర్యం, సైన్యాన్ని నడిపించటంలో అతడి ప్రతిభ ఇతర జాతుల గౌరవాభిమానాల్ని సంపాదించగల లక్షణాలని ప్రజలు విశ్వసించారు. తమను న్యాయంగాను నిష్పక్షపాతంగాను పరిపాలించేందుకు అవసరమైన ఉన్నత లక్షణాలు అతనికి ఉండాలన్న ఆకాంక్ష వారిలో ఏ కోశానా కనిపించలేదు. దేవుని పట్ల ప్రేమ భయభక్తులు గల సత్ప్రవర్తనుడు కావాలని వారు కోరలేదు. దేవునిచే ఎంపికైన జనాంగంగా తమ విలక్షణతను పరిశుద్ధ ప్రవర్తనను కాపాడగల పరిపాలకుడిలో ఎలాంటి గుణలక్షణాలుండాలన్న అంశము పై వారు దేవున్ని సంప్రదించలేదు. వారు దేవున్ని మార్గాన్ని కాదు తమ సొంత మార్గాన్నే అవలంభించారు. అందుకే తాము కోరుకున్న రాజునే దేవుడు వారికిచ్చాడు. అతడి ప్రవర్తన వారి ప్రవర్తనలాంటిదే. వారి మనసులు దేవునికి విధేయంగా లేవు. వారి రాజు కూడా దేవుని కృప వలన మార్పు చెందలేదు. ఈ రాజు పరిపాలనలో వారు తమ తప్పును గ్రహించి దేవుని వద్దకు తిరిగి వచ్చి నమ్మకంగా ఉండేందుకు అవసరమైన అనుభవాన్ని పొందమన్నారు.PPTel 641.2

  కాగా రాజ్య భార బాధ్యతల్ని సౌలు పై పెట్టిన ప్రభువు అతణ్ణి ఏకాకిగా విడిచి పెట్టలేదు. సౌలుకి తన బలహీనతల్ని బయలుపర్చి దైవ కృప అవసరాన్ని తెలియపర్చటానికి సౌలు పైకి పరిశుద్ధాత్మను పంపించాడు. సౌలు దేవుని పై ఆధారపడి ఉంటే దేవుడు అతడితో ఉండేవాడు. అతడి చిత్తాన్ని దేవుని చిత్తం నియంత్రించినంతకాలం, అతడు దైవాత్మ క్రమశిక్షణ లొంగినంతకాలం దేవుడు అతడికి విజయం ఇవ్వగలిగేవాడు. అయితే సౌలు దేవుని మాటల వినకుండా స్వతంత్రంగా వ్యవహరించినపుడు ప్రభువు అతడికి మార్గదర్శకుడు కాలేకపోయాడు. అతణ్ణి విడిచి పెట్టాల్సి వచ్చింది. అప్పుడు ప్రభువు “తన చిత్తానుసారమైన మనస్సు గల యొకనిని” (1 సమూయేలు 13:14) సింహాసనానికి పిలిచాడు. అతడు ప్రవర్తన దోషాలు లేనివాడేమి కాదు. కాని అతడు తన్ను తాను నమ్ముకొనేవాడు కాక దేవుని మీద ఆధారపడి ఆయన ఆత్మ దిశానిర్దేశాన్ని అనుసరించే వాడు. పాపం చేసినప్పుడు గద్దింపుకు లొంగి దిద్దుబాటుకు అంగీకరించేవాడు.PPTel 641.3

  Larger font
  Smaller font
  Copy
  Print
  Contents