Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
పితరులు ప్రవక్తలు - Contents
 • Results
 • Related
 • Featured
No results found for: "".
 • Weighted Relevancy
 • Content Sequence
 • Relevancy
 • Earliest First
 • Latest First
  Larger font
  Smaller font
  Copy
  Print
  Contents

  55—బాల సమూయేలు

  ఎఫ్రాయిము పర్వత ప్రాంతం వాడు, లేవియుడు అయిన ఎల్కానా ధనికుడు పలుకుబడి కలవాడు. అతడు దేవుని పట్ల ప్రేమ భక్తి వైరాగ్యాలున్నవాడు. అతని బార్య హన్న గొప్ప భక్తురాలు. అణుకువ, సమత, యధార్ధత ప్రగాఢ విశ్వాసం ఆమె ప్రవర్తనకు వన్నె కూర్చాయి.PPTel 571.1

  హెబ్రీయుల్లో ప్రతీవారు కోరుకొనే దీవెన దైవ భక్తి గల ఈ దంపతులకు కరవైయింది. వారి గృహాన్ని ఆనందంతో నింపటానికి పిల్లలు లేరు. తన పేరు కొనసాగాలి అన్న కోరిక ప్రబలమవ్వటంతో భర్త రెండో పెళ్ళి చేసుకున్నాడు. కాని దేవుని పై విశ్వాసం లోపించటం వల్ల జరిగిన ఈ క్రియ గృహ సమారస్యాన్ని నాశనం చేసింది. కుటుంబంలోకి కుమార్లు, కుమార్తెలు వచ్చారు. అయినా పరిశుద్ద వివాహ వ్యవస్థలోని ఆనందం సౌందర్యం లోపించాయి. కుటుంబమంలోని శాంతి సమాధానాలకు విఘాతం కలిగింది. రెండో భార్య పెనిన్నా ఆసూయతోను సంకుచిత భావాలతోను దురహంకారంతోను మెలగేది. హన్నాకు ఆశలు అడుగంటినట్లు బతుకు బరువైనట్లు కనిపించింది. అయినా సణుగుకోకుండా ఎవర్నీ నిందించకుండా తన శ్రమల్ని భరిస్తున్నది.PPTel 571.2

  ఎల్కానా దేవుని నిబంధనల్ని నమ్మకంగా ఆచరించాడు. షిలోహులోని ఆరాధానల్లో సేవలందించేవాడు. కాని అక్క ఆరాధన క్రమంగా జరగని కారణంగా గూడారంలో అతని సేవల అవసరం ఏర్పడేది కాదు. లేవీయుడైన ఎల్కానా అలాంటి సేవలు అందించాల్సి ఉన్నాడు. అయిన కుటుంబముతో కలసి ఆరాధనలకు బలులర్పించటానికి నియమిత సమావేశాలకు వెళ్తుండేవాడు.PPTel 571.3

  దైవారాధనకు సంబంధించిన పరిశుద్ద పండుగలో సైతం అతడి కుటుంబ సామరస్యాన్ని హరించిన కొద్ది బుద్ది దర్శనమిచ్చింది. సంప్రదాయం ప్రకారం , కృతజ్ఞతార్పణలు సమర్పించిన తరువాత కుటుంబమంతా కలసి సంతోషంగా విందు భోజనంలో పాలు పొందాల్సి ఉంది. ఈ సందర్భాల్లో భార్యకు ఒక భాగం ఆమె కుమారులకు ఒక్కో భాగం ఎల్కానా ఇచ్చేవాడు. మర్యాదకు హన్నాకు రెండు భాగాలిచ్చేవాడు ఇస్తూ ఒక కొడుకుంటే తనపై ఎంత అమరి ఉండేదో అంతే ప్రేమానురాగాలు తనపై ఉన్నాయని ఆమెకు చెప్పేవాడు. అంతట అతడి రెండో భార్య అసూయతో నిప్పులు చెరుగుతూ తానంటేనే దేవునికి మహా ప్రేమని హాన్నకు సంతానం లేకపోవటం అమె పట్ల దేవుని అసంతుష్టికి నిదర్శమని ఎగతాళి చేసేది. ఏటేటా ఇలాగే జరుగుతూ వచ్చింది. హన్నా ఇక సహించలేకపోయింది. ఇక తన విచారాన్ని దాచుకోలేకపోయింది. పెల్లుబుకుతున్న దు:ఖంతో వెక్కి వెక్కిరోధించింది. పండుగలో పాలు పొందకుండా నిలిచిపోయింది. ఆమెను ఓదార్చేందుకు భర్త విఫలయత్నం చేసాడు. “నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనము మానుట ఏల ? నీక మనోవిచారమెందుకు కలిగినది పదిమంది కుమార్లకంటే నేను నీకు విశేషమైనవాడునుకానా? అన్నాడుPPTel 571.4

  హన్నా ఎవర్నీ నిందించలేదు. ఏ మానవ మిత్రుడితోను పంచుకోలేని తన భారాన్ని దేవుని మీద మోపింది. తన మీద గొడ్రాలు ముద్రను చెరిపవేసి తన కోసం పెంచి తన సేవార్ధం తర్పీదు చేసేందు కోసం ఒక కుమారుణ్ణి వరంగా దయచేయ మని చిత్తశుద్ధితో ప్రార్ధించింది. తన ముద్దు చెల్లించినట్లయితే పుట్టిన నాటి నుండి ఆ బిడ్డను తనకు అంకితం చేస్తాని దేవునితో గంభీర ప్రమాణం చేసింది. గుడారం గుమ్మం వద్ద చేరి బరువెక్కిన హృదయంతో హన్నా “ప్రార్ధన చేయుచు బహుగా ఏడ్చేది”. ఏమి మాట్లాడకుండా నిశ్శబ్దంగా దేవునితో విజ్ఞాపన చేసేది. దుర్మార్గతంతో నిండిన ఆ దినాల్లో పూజా సన్నివేశాలు చాలా అరుదు. మత పరమైన పండగల్లో సైతం తిని తాగి అమర్యాదగా ప్రవర్తించటం ఆసాధారణం కాదు. హాన్నాను పరిశీలిస్తున్న ప్రధాన యాజకుడు ఏలీ ఆమె తాగి మత్తిల్లిన బాపతని భావించాడు. తగురీతిలో మందలించాలని ఉద్దేశించి తీసివేయుము” అన్నాడు కఠినంగా PPTel 572.1

  హృదయ వేదనలో ఉన్న హన్నా ఉలిక్కపడి ఇలా వినమ్రంగా బదులు పలికింది. “అదికాదు, నా యేలినవాడా, నేను మనో దుఃఖము గలదాననైయున్నాను. నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదుగాని నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. నీ సేవకారులనైన నన్ను పనికిమాలిన దానిగా ఎంచవద్దు. అత్యంతమైన కోపకారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీని చెప్పుకొనుచుంటిని”.PPTel 572.2

  అది విన్న ప్రధాన యాజకుడు చలించిపోయాడు. అతడు దైవభక్తుడు మందలిపుకు బదులు ఆమెనిలా దీవించాడు, “నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలీయుల దేవునితో నీవు చేసికొనిన మనవిని ఆయన దయచేయును గాక” PPTel 572.3

  హాన్నా ప్రార్ధన ఫలించింది. ఆమె ఆశించిన వర ప్రసాదం లభించింది. ఆ బిడ్డను చూసి అతడికి సమూయేలని పేరు పెట్టింది. “వీనిని అడిగితిని” అని దీని అర్ధం. తల్లిని విడిచి ఉండగలిగే వయసు వచ్చినప్పుడు ఆ బిడ్డ విషయంలో తాను దేవునితో చేసిన ప్రమాణాన్ని నెరవేర్చింది. హన్నా. ఆమె తనకుమారుణ్ణి బహుగా ప్రేమించింది. ఆ బాలుడు దినదిన వృద్ధి చెందటం చూసినప్పుడు ఆ బిడ్డ నంగినంగిగా పలికు పలుకులు విన్నప్పుడు ఆమె ప్రేమ ఇంతలంతలయ్యింది. అతడు ఆమెకు ఏకైక కుమారుడు. దేవుడు తనకిచ్చిన ప్రత్యేక వరం. అయితే ఆమె ఆ బాలుణ్ణి దేవునికి అంకితమైన నిధిగా పొందింది. దాతకు చెందిన ఆ నిధిని ఆమె అట్టి పెట్టుకోదు.PPTel 572.4

  భర్తతో కలసి హన్నా మరోమారు షిలోహుకు వెళ్ళి ఈ మాటలతో తన ప్రశస్తమైన వరాన్ని ప్రధాన యాజకుడి దేవుని పేర సమర్పించింది. “ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకనుగ్రహించెను. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్టించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటిను వాడు యెహోవాకు ప్రతిష్ఠితతడు” ఈ ఇశ్రాయేలు మహిళ విశ్వాసానికి భక్తికి ఏలీ ముగ్ధుడయ్యాడు. ఏలీ అమిత ప్రేమ గల తండ్రి. దేవుని సేవకు అంకితమయ్యేందు నిమిత్తం తన ఒక్కగాని ఒక కుమారుణ్ణి త్యాగం చేస్తున్న ఆ తల్లిని చూసి ఏలీ విస్మయం చెంది వినమ్రుడయ్యాడు. తన స్వార్ధపూరిత ప్రేమ నిమిత్తం మందలింపు పొందాడు. సిగ్గుతోను భక్తిభావంతోను దేవుని ముందు వంగి ఆయనకు నమస్కరించాడు.PPTel 573.1

  ఆ తల్లి హృదయం ఆనందంతో దైవస్తుతితో వెల్లువెత్తింది. దేవునికి తన కృతజ్ఞతల్ని వెలిబుచ్చింది. పరిశుద్దాత్మ ఆవేశం మీదికి వచ్చింది. “హన్నా విజ్ఞాపన చేసి యీలాగనెను:PPTel 573.2

  “నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది. యెహోవా యందు నాకు మహాబలము కలిగెను. నీ వలన రక్షణను బట్టి సంతోషించు చున్నాను. నా విరోధుల మీద నేను అతిశయ పడుదును. యెహోవా వంటి పరిశుద్ద దేవుడు ఒకడును లేడు. నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు. మన దేవుని వంటి ఆశ్రయ దుర్గము లేదు. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు. అయనే క్రియలను పరీక్షించువాడు. ఇకను అంత గర్వముగా మాటలాడకుడి. గర్వపు మాటలు మీ నోట రానియ్యకుడి ప్రఖ్యాతినొందిన విలుకాండ్రు ఓడిపోవుదురు. తొట్రిల్లినవారు బలము ధరించుదురు. తృప్తిగా భుజించినవారు అన్నముకావలెనని కూలికి పోవుదురు. ఆకలిగొనినవారు ఆకలితీర తిందురు. గొడ్రాలు ఏడుగురు పిల్లలను కనును. అనేకమైన పిల్లలను కనినది కృషించిపోవును. జనులను సజీవులుగా, మృతులుగా చేయువాడు యెహోవాయే పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించువాడు ఆయనే. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయువాడు, కృంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే. దరిద్రులను అంధకారులతో కూర్చుండబెట్టటకును మహిమ గల సింహాసనమున స్వతంత్రిపంజేయుటకు వారిని మంటిలో నుండి యెత్తువాడును ఆయనే. లేమిగలవారిని పెంటకుప్ప మీది నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్థంభములు యెహోవా వశము లోకమునకు వాటి మీద ఆయన నిలిపియున్నాడు. తన భక్తులు పాదములు తొట్రిల్లకుండా ఆయన వాటిని కాపాడును. దుర్మార్గులు అంధకారమందు మాటు మణుగుదురు. బలము చేత ఎవడును జయమునొందడు. యెహోవాతో వాదించువారు నాశనమగుదురు. పరమండలములో నుండి ఆయన వారి పైన ఉరములెవలె గర్జించును. లోకపు సరిహద్దులలో నుండు వారికి ఆయన తీర్పు తీర్చును. తాను నియిమంచిన రాజునకు ఆయన బలమిచ్చును. తాను అభషేకించిన వానికి అధిక బలము కలుగజేయును”.PPTel 573.3

  ఇశ్రాయేలీయుల రాజుగా పరిపాలించనున్న దావీదును గూర్చి అభిషిక్తుడైన మెస్సీయను గురించి హన్న అన్న ఈ మాటలు ప్రవచనంగా పలికిన మాటలు” మొదట గర్వాంధురాలు జగడాలకోరు అయిన ఒక స్త్రీని గురించి ప్రస్తావిస్తూ ఈ గీతం దేవుని శత్రువుల నాశనాన్ని గూర్చి విమోచితులైన దేవ ప్రజల అంతిమ విజయాన్ని గర్చి ప్రస్తావిస్తున్నది. ప్రధాన యాజకుడి ఉపదేశం కింద దైవ సేవకు శిక్షణ పొందేందు కోసంసమూయేలుని విడిచి పెట్టి హన్నా షిలోహ నుంచి రామాలోని తన గృహానికి తిరిగి వెళ్ళిపోయింది. గ్రహణ శక్తి ఉదయించిన చిన్న ప్రాయం నుంచి ఏదేవుని గౌరవించి ప్రేమించటం దేవుని వాడిగా తన్ను తాను పరిగణించుకోవటం ఆమె తనకుమారుడికి నేర్పిచింది. అతడి పరిసరాల్లో ఉన్న ప్రతీ వస్తువు ఆధారంగా ఆ బాలుడి ఆలోచనల్ని సృష్టికర్తను గూర్చిన ధ్యానానికి నడిపించింది. కుమారుడుకి దూరంగా ఉన్నప్పుడు కూడా ఆ మాతృమూర్తి అతణ్ణి గూర్చి ఆందోళన చెందటం మానలేదు. ఆమె అనుదిన ప్రార్ధనాంశం అతడే. ప్రతీ ఏటా అతడికి సేవా వస్త్రాన్ని తన సొంత చేతులతో తయారు చేసి భర్తతో కలసి దైవారాధన నిమిత్తం షిలోహకు వెళ్ళినప్పుడు తన అనురాగ సూచిక అయిన ఆ వస్త్రాన్ని కుమారుడికిచ్చేది. అతడు పవిత్రంగా ఉదాత్తంగా నిజాయితీగా నివసించాలన్న ప్రార్ధనతో ఆమె ఆ వస్త్రం ప్రతీ వసూలును నేసేది. తన కుమారుడికి లోకపరమైన ఔన్నత్యం కావాలని కోరలేదు. పరలోక సంబంధమైన గొప్పతనం అనగా దేవుని గౌరవించంటం తన తోటి మానవులకు ఆశీర్వాదకరంగా నివసించటం అన్న గొప్పతనం కావాలని ప్రార్ధించింది.PPTel 574.1

  ఆమెకు కలిగి ప్రతిఫలం ఎంతో మహోన్నతమైనంది! విశ్వసనీయత విషయంలో ఆమె అదర్శం ఎంత స్పూర్తిదాయకం! విలువైన అవకాశాల్ని ప్రశస్తమైన అనంతమైన ఆసక్తుల్ని ప్రతీ తల్లి ఆధీనంలోనూ దేవుడుంచాడు. ప్రతీ మహిళా బహు ఆయాస కరమైన శ్రమగా పరిగణించే సామాన్య రోజువారీ విధుల్ని ఉదాత్తమైన కర్తవ్యంగా పరిగణించాలి. లోకాన్ని తన ప్రభావంతో శ్రేయోదాయకం చేయటమన్న విశేషా వకాశం తల్లికున్నది. ఈ పని చేయటంలో ఆమెకు లభించే సంతోషం అంతా ఇంతా కాదు. వెలుగు నీడలలో ఆమె తన బిడ్డల మార్గాల్ని తిన్నగా తీర్చిదిద్ది వారని ఉన్నత మైన మహిమకరమైన మార్గాల్లో నడిపించవచ్చు. అయితే ఆమె తన స్వీయ జీవనంలో క్రీస్తు బోధనల్ని అవలంభించినప్పుడే ఆ దైవ దర్శనానికి అనుగుణంగా ఆమె తన బిడ్డల ప్రవర్తనను తీర్చి దిద్దగలుగుతుంది. లోకం దుర్మార్గతను ప్రోత్సహించే ప్రభావాలతో నిండి ఉంది. శైలి ఆచారాలు యువతరాన్ని బహుగా ఆకట్టుకొంటు న్నాయి. భోధించటం, దిశానిర్దేశం చేయటం, నియంత్రించటంలో తల్లి తన విధిని నిర్వహించలేకపోతే ఆమె బిడ్డలు స్వాభావికంగా చెడును అంగీకరించి మంచిని విసర్జిస్తారు. ప్రతీ తల్లి తరుచుగా రక్షకుని వద్దకు ఈ ప్రార్థనతో వెళ్ళాలి. “బిడ్డకు మేము ఏమేమి చేయవలెనో దానిని మాకు నేర్పుము”.దేవుడు తన వాక్యంలో ఇచ్చిన ఉపదేశాన్ని ప్రతీ తల్లి పాటించాలి. అప్పుడు ఆమెకు అవసరమైన జ్ఞానోదయం కలుగుతుంది.PPTel 575.1

  సమూయేలు ఏలీ ఆలనపాలన కింద ఉన్నాడు. ఆ బాలుడి గుణ బౌందర్యం ఆ వృద్దదైవ సేవకుడి ప్రేమావాత్సల్యాన్ని చూరగొన్నది. అతడు కారుణ్యం. ఔదర్యం విధేయత మర్యాద వంటి సలక్షణాతో శోభిల్లాడు. కుమారుల దుర్మార్గత వల్ల హృదయ వేదన చెందుతున్న ఏలీకి తన సహాయకుడైన సమూయేలు ఉనికి విశ్రాంతిని ఆదరణను గొప్ప దీవెనను ప్రసాదించింది. ఆ దేశపు ప్రధాన న్యాయాధికారికి సామన్యమైన ఒక బాలుడుకి మధ్య అంతటి ప్రేమానుబంధం ఉండటం విశేషం. ముదిమి వయసు బలహీనతలు పైబడటంతోను, కుమారుల దుర్వర్తన వల్ల ఆందోళన దు:ఖం అధికమవ్వటంతోను ఏలీ సమూయేలు సహ వాసంలో ఎంతో ఓదార్పు స్వాంతన కనుగొన్నాడు.PPTel 575.2

  మతపరమైన ప్రత్యేక బాధ్యతల నిర్వహణకు ఇరవై అయిదేళ్ళు వయసు వచ్చేవరకు చేపటం లేవీయుల సాంప్రదాయం కాదు. కాని ఈ నిబంధననకు సమూయేలు మినహాయింపు. ఏటేటా మరిన్ని ముఖ్య బాధ్యతలు అతడికి అప్పజెప్పటం జరిగేది. ఇంకా చిన్న ప్రాయంలో ఉండగానే గుడార సేవలకు తాను అంకితం కావటానికి ప్రతీకగా నారతో వేసిన ఏఫోదు అతడికి వేశారు. గుడార సేవ నిమిత్తం తీసుకొని వచ్చినప్పుడు సమూయేలు బాలుడే అయినా తన శక్తిమేరకు దేవునికి సేవలందించాడు. ఆదిలో ఈ సేవలు అతి సామాన్యమైనవి. అవి ఎల్లప్పుడూ నచ్చేవి కావు. ఆకిన సమూయేలు వాటిని తన శక్తి మేరకు సంతోషంగా చేసవాడు. జీవిత విధుల నిర్వహణలో తన మతాన్ని ప్రదర్శించాడు. తాను దేవుని సేవకుడుగాను తాను చేస్తున్ననని దేవుని సేవగాను ఆ బాలుడు పరిగణించాడు. అతడి కృషికి స్పూర్తి దేవుని పై తనకున్న ప్రేమ ఆయన చిత్రాన్ని జరిగించాలన్న ఆకాంక్షే గనుక దాన్ని దేవుడు అంగీకరించాడు. సమూయేలు ఈ విధంగా భూమ్యాకాశాలకు ప్రభువుతో తోటి పనివాడయ్యాడు. ఇశ్రాయేలీయుల క్షేమాభివృద్ధి కోసం గొప్ప కార్యాలు సాధించటం కోసం దేవుడతణ్ణి సమర్థుడుగా తీర్చిదిద్దాడు. పాఠశాలలో శిక్షణ పొందే మాదిరాగానే తర్ఫీదు పొందేందుకు పిల్లలు తాము దిన దిన చేయాల్సిన సామాన్య విధుల్ని నమ్మకంగానుసమర్ధంగాను సేవ చేసేందుకు గాను దేవుడు వాటిని తమకు నియమించాడని వారికి నేర్పినట్లయితే మరెంత అనందదాయకంగా మరెంత గౌరవ ప్రదంగా ఉండేది! ప్రతినిధిని దేవుని నిమిత్తం చేస్తున్నట్లు భావించి నిర్వహించినట్లయితే మిక్కిలి సామన్యామైన విధి ప్రాధాన్యం సంతరించు కొంటుంది... అంతేకాదు, పరలోకంలో దేవుని చిత్తాన్ని జరిగించే పరిశద్దులతో లోకంలోని దైవ సేవకులను అది అనుసంధానపర్చుతుంది.,PPTel 575.3

  ఈ జీవితంలో విజయం నిత్య జీవ సంపాదనలో విజయం చిన్న చిన్న విషయాలపై శ్రద్ధ చూపటం మీద ఆధారపడి ఉంటుంది. దేవుని సృష్టిలో మిక్కిలి గొప్ప కార్యాల్లోనే గాక అత్యల్ప కార్యాల్లోనూ సంపూర్ణత్వం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. అంతరిక్షంలో లోకాల్ని నిలిపిన హస్తమే సున్నితమైన అడవి పువ్వుల్ని నైపుణ్యంతో రూపుదిద్దింది. దేవుడు తన పరిధిలో పరిపూర్ణడై ఉన్నట్లే మనమూ మన పరిధిలో పరిపూర్ణులమ్వాలి. ధృడమైన సుందరమైన ప్రవర్తన నిర్మాణం ఒక్కొక్క విధిని నిర్వహించటం ద్వారా రూపొందుతుంది. మన జీవితంలో పెద్ద పెద్ద అంశాల్లోనే గాక చిన్న చిన్న విషయాల్లోను విశ్వసనీయ నిజాయితీ చోటుచేసుకోవాలి. చిన్న చితక విషయాల్లో నిజాయితీగా వ్యవహరించటం, చిన్న చిన్న పనుల్ని నమ్మకంగా చేయటం, చిన్న చిన్న ధర్మకార్యలు చేయటం జీవితమార్గాన్ని అనందమయం చేస్తాయి., లోకం మన పని పూర్తి అయిన తరువాత మనం నమ్మకంగా నిర్వహించిన ప్రతీ చిన్న విది మంచిని పెంచటానికి ఎన్నటికి నశించని ప్రభావాన్ని చూపటానికి తోడ్పడిందని వెల్లడవుతుంది.PPTel 576.1

  సమూయేలు వలె నేటి యువత కూడా దేవుని దృష్టిలో విలువైన వ్యక్తులు కావచ్చు. క్రైస్తవులుగా వారు తమ విశ్వసనీయతను నమ్మకంగా కాపాడుకోవటం ద్వారా దిద్దుబాటు కృషిని బలంగా ప్రభావితం చేయగలుగుతారు. ఈనాడు అలాంటి వ్యక్తులు అవసరం. వారిలో ప్రతీ ఒక్కరికి దేవుడు ఒక పనిని ఏర్పాటు చేసాడు. దేవుడు అప్పగించిన పనిలో నమ్మకంగా కృషి చేసే వారి సేవలు సాధించనున్న ఫలితాలకు మించిన ఫలితాలు గతంలో ఎవరూ సాధించలేదు.PPTel 577.1

  Larger font
  Smaller font
  Copy
  Print
  Contents