Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
పితరులు ప్రవక్తలు - Contents
 • Results
 • Related
 • Featured
No results found for: "".
 • Weighted Relevancy
 • Content Sequence
 • Relevancy
 • Earliest First
 • Latest First
  Larger font
  Smaller font
  Copy
  Print
  Contents

  57—ఫిలిప్తీయుల చేజిక్కిన మందసం

  ఏలీ వంశీయులకి మరో హెచ్చరిక చేయాల్సి ఉన్నది. ప్రధాన యాజకుడితో గాని అతడి కుమారులతో గాని దేవుడు సంప్రదించలేకపోయాడు. నల్లని మబ్బులాంటి వారి పాపాలు పరిశుద్దాత్మను తరిమివేశాయి. కాని ఆ దుర్మార్గత మధ్య సయితం చిన్నారి సమూయేలు దేవునికి నమ్మకంగా ఉన్నాడు. ఏలీ వంశస్తుల్ని రానున్న శిక్షను గూర్చిన వర్తమానం అందిచంటమన్నది సర్వోన్నతుని ప్రవక్తగా సమూయేలుకు వచ్చిన దైవాజ్ఞPPTel 585.1

  “ఆదినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు. ప్రత్యక్షముగా తరుచుగా తటస్థించటులేదు. ఆకాలమందు ఏలీ కన్నులు మంద దృష్టిగల వాడైనందున అతడు చూడలేక తన స్థలమందు పండుకొని యుండగా దీపము అరిపోకమునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరములో పండుకొని యుండగాను యెహోవా సముయేలును పిలిచెను”. అది ఏలీ స్వరమని భావించి “చిత్తము నీవు నన్ను పిలిచితివిగదా నేను వచ్చినాను. అంటూ ఆ బాలుడు ఏలీ వద్దకు వెళ్ళాడు. “నాకుమారుడా, నేను నిన్ను పిలువలేదు. పోయి పండుకొనుము” అని ఏలీ బదులు పలికాడు. ఆ స్వరం మూడుసార్లు సమూయేలుని పిలువగా సమూయేలు మూడుసార్లు అలాగే స్పందించాడు. ప్పుడు ఆ విచిత్రమైన పిలుపు దేవుని స్వరమని ఏలీ గ్రహించాడు. తలపండి వృద్ధుడైన తన సేవకుణ్ని అధిగమించి ప్రభువు బాలుడైన సమూయేలును ఎంపిక చేసుకొన్నాడు. ఏలీకి అతడి కుటుంబానికి ఇది తీవ్రమైన మందలింపు.PPTel 585.2

  ఏలీ హృదయంలో ఈర్ష్య అసూయలు చోటుచేసుకోలేదు. మళ్ళీ ఆ స్వరం పిలిచినప్పుడు, “యెహోవా, నీ దాసుడు అలకించుచున్నాడు. ఆజ్ఞ ఇమ్ము” అని సమధానం ఇమ్మని సమూయేలుతో చెప్పాడు. ఆ స్వరం మళ్ళీ వినిపించింది. “నీ దాసుడు అలకించుచున్నాడు. ఆజ్ఞనిమ్ము” అని ఆ చిన్నారి సమాధానం చెప్పాడు. సర్వోన్నత దేవుడు తనతో మాట్లాడటాన్ని గురించి భయక్రాంతులవ్వటం వల్ల ఏలీ అడిగినప్పుడు తనతో దేవుడన్న మాటలు సమూయేలుకిజ్ఞప్తికి రాలేదు.PPTel 585.3

  “అంతట యెహోవా సమూయేలుతో ఈలాగు సెలవిచ్చెను. ఇశ్రాయేలులో నేనొక కార్యము చేయబోవుచున్నాను.దానిని వినువారందరి చెవులు గింగురుమనును. ఆ దినము ఏలీ యొక్క ఇంటివారిని గురించి నేను చెప్పినదంతయు వారి మీదికి రప్పింతును. దాని చేయు మొదలు పెట్టి దాని ముగింతును. తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసికొనుచున్నారని తానెరిగియు వారిని అడ్డగిం చేలేదు. గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియ జేయుచున్నాను. కాబట్టి ఏలీ ఇంటి వారి దోషమునకు బలి చేతనైనను నైవేద్యము చేతనైనను ఎన్నటికిని ప్రాయశ్చిత్తము చేయబడుదని ప్రమాణపూర్వకముగా అజ్ఞాపించితిని”.PPTel 585.4

  దేవుని వద్ద నుంచి ఈ వర్తమానాన్ని అందుకోకపూర్వం “సమూయేలు అప్పటికి యెహోవాను ఎరుగకుండెను, యెహోవా వాక్కు అతనికి ఇంక ప్రత్యక్షము కాలేదు”. అంటే దేవుని సముఖం ప్రవక్తలకు ప్రత్యక్షమయ్యే రీతిగా దేవుని ప్రత్యక్ష సన్నిధి ప్రదర్శనతో అతడికి అనుభవం లేదు. అనుకోని రీతిగా తన్ను తాను ప్రత్యక్షపర్చుకో వాలన్నది ప్రభువు ఉద్దేశం. విభ్రాంతి చెందిన బాలుడు వేసే ప్రశ్నల ద్వారా ఏలిదాన్ని గురించి తెలుసుకోవాలన్నది దేవుని ఆలోచన.PPTel 586.1

  అంత భయానకమైన వర్తమానం తాను అందించటమన్న విషయం సమూయేలుని భయంతోను విస్మయంతోను నింపింది. ఉదయం యధావిధిగా తన పనులు చేసుకొంటున్నాడు. గాని ఆ చిన్నారి హృదయం ఎంతో భాదతో నిండింది. ఖండనమండనలతో కూడిన ఆ వర్తమానిన్ని ఏలీకి అందించమని ప్రభువు ఆదేశించలేదు. గనుక నోరు విప్పకుండా ఉన్నాడు. ఏలీని తప్పించుకొని తిరుగుతున్నాడు.PPTel 586.2

  తాను ఎంతగానో ప్రేమించి గౌరవిస్తున్న ఏలీకి వ్యతిరేకంగా వచ్చిన తీర్పుల్ని ఏదో సందర్భములో బయలు పెట్టిస్తానేమోనని అతడు బితుకు బితుకుగా ఉన్నాడు. ఆ వర్తమానం తనకు తన కుటుంబానికి సంభవించనున్న గొప్ప విపత్తును గూర్చిందే నన్నది ఏలీ ధృడనమ్మకం. సమూయేలుని పిలిచి ప్రభువు చెప్పిందేంటో దాపరికం లేకుండ వివరించాల్సిందిగా ఆదేశించాడు. సమూయేలు ఆ ఆజ్ఞను పాటించాడు. ఆ వృద్దుడు వినమ్రంగా వంగి ఆ భయంకర తీర్పును అంగీకరించాడు. “సెలవిచ్చిన వాడు యెహోవా, తన దృష్టికి అనుకూలమైన దానిని ఆయన చేయునుగాక” అన్నాడు.PPTel 586.3

  అయినా ఏలీలో నిజమైన పశ్చాత్తాపం చోటు చేసుకోలేదు. తన దోషాన్ని ఒప్పుకొన్నాడు గాని ఆ దోషాన్ని విడిచి పెట్టలేదు. తాను ప్రవచించిన శిక్షను అమలు పర్చకుండా ఏటికేడాది ప్రభువు జాప్యం చేస్తూ వచ్చాడు. గతంలోని వైఫల్యాన్ని సరి చెయ్యటానికి ఆ సంవత్సరాల్లో ఎంతో కృషి చేసి ఉండవచ్చును. కాని దైవ గూడారాన్ని అపవిత్రపర్చుతూ వేలాది ఇశ్రాయేలు ప్రజల్ని నాశనం చేస్తున్న పాపాల్ని సరిదిద్దటానికి ఆ వృద్ధ యాజకుడు గట్టి చర్య తీసుకోలేదు. దేవుని సహనశీలత సూఫ్నీ ఫీనెహాసుల హృదయాల్ని కఠినపర్చింది. పాపం చేయటానికి వారు భయపడలేదు. తన కుటుంబానికి వచ్చిన హెచ్చరికల్ని మందలింపుల్ని గూర్చిన వర్తమానాల్ని ఏలీ ఇశ్రాయేలీయలు జాతి మొత్తానికి ప్రకటించాడు. గతంలో తన ఉదాసీనత వల్ల సంభవించిన కీడును ఈ విధంగా కొంతమేరకు తొలగించవచ్చునని భావించాడు. అయితే తమ యాజకుల్లాగే ప్రజలు కూడా ఆ హెచ్చరకిల్ని బేఖాతరు చేసారు. ఇశ్రాయేలీయులు దేశంలో పెచ్చరిల్లుతున్న దుర్మార్గతను చూసిన చుట్టుపట్ల రాజ్యాల ప్రజలు తమ విగ్రహారాధానలోను దుర్మార్గతలోను మరింత బలపడ్డారు. ఇశ్రాయేలీయులు దేవునికి నమ్మకంగా నివసించి ఉన్నట్లయితే వారికి కలిగి ఉండే పాప పశ్చాత్తాపం ఇప్పుడు వారికి లేదు. అయితే వారు శిక్ష అనుభవించే దినం వస్తున్నది. వారు దేవుని అధికారాన్ని తోసిపుచ్చారు. ఆయన ఆరాధనను తృణీకరించారు. కనుక తన నామ ఘనత కొనసాగేందుకు గాను ఆయన కలుగజేసు కోవటం అవసరమయ్యింది.PPTel 586.4

  “ఇశ్రాయేలీయుల ఫిలిపీయులతో యుద్ధము చేయుటకై బయలుదేరి ఎబెనెజరులో దిగగా ఫిలీప్తీయులు ఆ ఫెకులో దిగిరి” దేవునితో సంప్రదించకుండా ప్రధాన యాజకుడు లేదా ప్రవక్త సమ్మతి లేకుండా ఈ దండయాత్రకు ఇశ్రాయేలీయులు సమాయత్తమాయ్యరు. “ఫిలీప్తీయులు ఇశ్రాయేలీయులమీద తమ్మును యుద్ధ పంక్తులుగా తీర్చుకొనగా వారు యుద్ధములో కలిసినప్పుడు ఇశ్రాయేలీయులు ఫిలిప్తీయుల యెదుట ఓడిపోయి యుద్ధభూమిలోనే యెక్కువ తక్కువ నాలుగు వేల మంది హతులైరి” గుండె ధైర్యం చెడి నిస్పృహతో నీరుగారుతున్న సైన్యం తమ శిబిరానికి తిరిగి రాగా ఇశ్రాయేలీయుల పెద్దలు యెహోవా నేడు మనకు ఫిలిప్తీయుల ముందర ఎందుకు ఓడించెను”? అని ప్రశ్నించారు. ఇశ్రాయేలీయుల జాతి దేవుని తీర్పుల్ని అనుభవించటానికి సమయం వచ్చినా తమ పాపాలే ఆ భయవానక పరాజయానికి హేతువని గుర్తించలేదు. “షిలోహులో నున్న యెహోవా నిబంధన మందసమును మనము తీసుకొని మన మధ్యనుంచుకొందుము రండి! అది మన మధ్యనుండిన యెడల అది మన శత్రువుల చేతిలో నుండి మనలను రక్షించును” అని అన్నారు. మందసం సైన్యంలోకి తేవలిసిందిగా ఆజ్ఞగాని అనమతిగాని దేవుడు ఇవ్వలేదు. అయినా తమకు జయం కలుగుతుందని ఇశ్రాయేలీయుల విశ్వసించారు. ఏలీ కుమారులు మందసాన్ని సైన్యంలోకి మోసుకొని వచ్చినప్పుడు పెద్దకేక వేసారు.PPTel 587.1

  ఫిలిప్తీయుల మందసాన్ని ఇశ్రాయేలీయుల దేవునిగా పరిగణించారు. యెహోవా తన ప్రజల పక్షంగా చేసిన మహాత్కార్యాలిన్న మందసం శక్తిమూలంగానేనని వారు భావించారు. అది సైనిక శిబిరంలోకి వచ్చినప్పుడు ప్రజలు వేసిన కేకలు విన్నప్పుడు వారిలా అన్నారు. “హెబ్రీయుల దండులో ఈ గొప్ప కేకల ధ్వని యేమని అడిగి యెహోవా నిబంధన మందసము దండులోకి వచ్చెనని తెలిసికొని జడిసి దేవుడు దండులోనికి వచ్చెనని అనుకొని - అయ్యో మనకు శ్రమ, ఇంతకు మునుపు వారీలాగు సంభవింపలేదు. అయ్యోయ్యో మహా శూరుడగు ఈ దేవుని చేతిలో నుంచి మనలను ఎవరు నడిపింపగలరు? అరణ్యముందు అనేకమైన తెగుళ్ళ చేత ఐగుప్తీయులను హతము చేసిన దేవుడు ఈయనే గదా ఫిలీప్రియులారా, దైర్యము తెచ్చుకొని వారు మీకు దాసులైనట్టు మీరు హెబ్రీయులకు దాసులు కాకుండా బలాడ్యులై యుద్ధము చేయుడి”.PPTel 588.1

  ఫిలిప్తీయులు బీభత్సమైన దాడి చేసారు. ఇశ్రాయేలీయులు ఘోర పరాజయం పాలయ్యారు. వేలాది మంది హతులయ్యారు. యుద్ధరంగంలో ముప్పయి వేలమంది నేలకూలారు.ఫిలిషీయులు మందసాన్ని పట్టుకుపోయారు.మందసాన్ని కాపాడుకోవటానికి జరిగిన పోరాటంలో ఏలీ కుమారులిద్దరూ హతులయ్యారు.దేవుని ప్రజలుగా చెప్పుకునేవారి పాపాలకు శిక్ష తప్పక వస్తుందని భావియుగాల ప్రజలు తెలుసుకొనేందుకు ఇలా చరిత్ర పుటలల్లో సాక్ష్యందాఖలవుంది. దేవుని గూర్చి ఎంత ఎక్కువ జ్ఞానముంటే దాన్ని లక్ష్య పెట్టకపోవటం అంత పెద్ద పాపమౌతుంది. PPTel 588.2

  ఇశ్రాయేలీయులకు అతి భయంకరమైన విపత్తు సంభవించింది శత్రువులు దేవుని పరిశుద్ద మందసాన్ని పట్టుకొని దాన్ని తమ స్వాధీనంలో ఉంచుకున్నారు. యెహోవా సన్నిధికి శక్తికీ సంకేతమైన మందసం తమ మధ్య నుంచి వెళ్ళిపోయిన తర్వాత నిజానికి ఇశ్రాయేలీయుల మధ్య నుండి గొప్ప మహిమ వెళ్లిపోయింది. ఈ పరిశుద్ధ మందసంతో దేవుని ఆశ్చర్యకరమైన సత్యప్రత్యక్షతలు, శక్తి ముడిపడి ఉన్నాయి. గతించినర దినాల్లో మందసం కనిపించినప్పుడల్లా ఘన విషయాలు చోటచేసు కొన్నాయి. అతి పరిశుద్ధస్థలంలో ఉండే ఆ మందసం బంగారు కెరూబుల రెక్కల నీడలో ఉండేది. సర్వోన్నతుని ప్రత్యక్ష సన్నిధికి చిహ్నమైన షెకీన మహిమ దాని పై నిలిచి ఉండేది. కాకపోతే ఇప్పుడది విజయం చేకూర్చలేదు. అది పరిరక్షించే శక్తి అని ఈ తరుణంలో నిరూపించుకోలేదు. ఇశ్రాయేలు దేశమంతటా దు:ఖం వెల్లువెత్తింది.PPTel 588.3

  తమ విశ్వాసం నామమాత్రపు విశ్వాసమని అది దేవుని ప్రభావితం చేసే శక్తి కోల్పోయిందని వారు గుర్తించలేదు. మందసంలో నిక్షిప్తమైవున్న దైవ ధర్మశాస్త్రం కూడా ఆయన సన్నిధికి చిహ్నం. అయితే వారు దేవుని ఆజ్ఞల్ని తృణీకరించారు. పరిశుద్దాత్మను దు:ఖపర్చి తరిమి వేసారు. ప్రజలు తన ధర్మవిధుల్ని ఆచరించినప్పుడు తమపక్షంగా పనిచేయటానికి ప్రభువు వారితో ఉన్నాడు. అయితే వారు మందసాన్ని చూచి దాన్ని దేవుని శక్తిగా గుర్తించినప్పుడు లేదా ఆయన ఆజ్ఞలకు అవిధేయులు కావటం ద్వారా ఆయన చిత్తాన్ని గౌవరించినప్పుడు వారికి ఆ మందసం విలువ సామాన్యమైన పెట్టె విలువ కన్నా ఎక్కువగా ఉండదు. విగ్రహారాధకులు తమ విగ్రహాల్ని పరిగణించిన పంథాలోనే ఇశ్రాయేలీయులు దేవుని మందసాన్ని పరిగణించారు. దానిలోనే గొప్ప శక్తి రక్షణ ఉన్నాయో అన్నట్లు దాన్ని పరిగణించారు. మందసంలో ఉన్న ఆజ్ఞల్ని వారు అతిక్రమించారు. వారు మందసాన్ని పూజించటం నామమాత్రపు మతానికి, దొంగాటకానికి, విగ్రహారాధనకు దారి తీసింది. తమ పాపం వారిని దేవుని నుంచి విడదీసింది. తమ పాపం గురించి పశ్చాత్తాపం పొంది దాన్ని విడిచి పెట్టేవరకు ఆయన వారికి విజయం చేకూర్చలేదు.PPTel 589.1

  మందసం, గూడారం ఇశ్రాయేలీయుల నడుమ ఉండటం మాత్రమే చాలదు. యాజకులు బలలుర్పించటం, ప్రజలు దేవుని బిడ్డలుగా గుర్తింపు పొందటం మాత్రమే చాలదు. ఎవరైతే పాపాన్ని ప్రేమిస్తారో వారి మానవుల్ని దేవుడు అలకించడు. “ధర్మశాస్త్రము వినబడకుండ చెవిని తొలగించుకొను వాని ప్రార్థన హేయము” అని వాక్యం చెబుతున్నది సామెతలు 28:9PPTel 589.2

  సైన్యం యుద్ధానికి బయలుదేరి వెళ్ళినప్పుడు అంధుడు వృద్దుడు అయిన ఏలి షిలోహులో నిలిచిపోయాడు. యద్ద ఫలితం ఎలాగుంటుందోనని భయాంఛనలతో ఉన్నాడు. “ఏలీ మందసము విషయమై గుండె అవియుచు.. ఎదరు చూచుచుండెను.” గూడారం గుమ్మం వెలుపల మార్గం పక్క పీఠం మీద కూర్చోని యుద్ధ భూమి నుంచి వార్త తెచ్చేవాడి రాక కోసం ఎదురు చూస్తున్నాడు.PPTel 589.3

  తుదకు సైన్యం నుంచి బెన్యామీనీయుడొకడు “చినిగిన బట్టలతోను తల మీద ధూళితోను” హుటాహుటిగా వచ్చి పట్టణంలో ప్రవేశిస్తున్నాడు. దారి పక్కనే ఉన్న వృద్ధుణ్ని దాని పట్టణంలోకి వెళ్ళి ఉత్కంఠతో కని పెడుతున్న జనసమూహానికి ఇశ్రాయేలీయుల ఓటమిని నష్టాన్ని గూర్చిన వార్త చెప్పాడు.PPTel 589.4

  గుడారం సరసన దారి పక్కన కని పెడుతున్న ఏలీ చెవికి ఏడ్పు వినబడిండి. వార్తాహరుణ్ణి అతని వద్దకు తీసుకు వచ్చారు. అతడు ఏలీతో ఇలా చెప్పాడు. “ఇశ్రాయేలీయులు ఫిలీప్తీయులముందర నిలువలేక పోయిరి. జనులో అనేకులు హతులైరి. సూఫ్ని ఫీనెహాను అను నీ యిద్దరు కుమారులు మృతులైరి”ఇవి ఎంతో భయంకర విషయాలైనప్పటికిని ఏలీ వీటిని తట్టుకోగలిగాడు. ఎందుకంటే అవి తాను ఊహించిన ఘటనలే. కాగా “మరియు దేవుని మందసము పట్టబడెను” అని వార్తాహరుడు చెప్పినప్పుడు అతడి ముఖంలో చెప్పనవికాని బాధ వ్యక్త మయ్యింది. తన పాపం దేవున్ని అగౌరవపర్చి తన సన్నిధిని ఇశ్రాయేలీయుల మధ్య నుండి ఉపసంహరించుకొనేటట్లు చేసిందన్న తలంపును భరించలేకపోయాడు. అతడి శక్తి క్షీణించింది. అతడు “పడి మెడ విరిగి చనిపోయెను”.PPTel 590.1

  భర్త ఫీనెహాసు భ్రష్టుడైనప్పటికి అతడి భార్య దేవునికి భయపడి నివసించిన మహిళ. మామగారి మరణం భర్త మరణం మరీ ముఖ్యంగా మందసం శత్రువుల హస్తగతమయ్యిందన్న దుర్వార్త వీటికి తట్టుకోలేక ఆమె మరణించింది. ఇశ్రాయేలీ యుల చివరి నిరీక్షణ పోయిందని ఆమె భావించింది. ఈ కష్ట సమయంలో తనకు జన్మించిన బిడ్డకు ఈ కాబోదు - “ప్రభావము పోయెను” అన్న పేరు పెట్టింది... దు:ఖిస్తూ తన చివరి శ్వాసతో “దేవుని మందసము పట్టుబడి పోయినందున ప్రభావము ఇశ్రాయేలీయులలో నుండి చెరపట్టబడి పోయెను” అన్నది.PPTel 590.2

  ప్రభువు తన ప్రజల్ని సంపూర్తిగా విసర్జించలేదు. అన్యులు ఉత్సహించటం ఆయన సహించడు. ఇశ్రాయేలీయుల్ని శిక్షించటానికి ఫిలిప్తీయుల్ని సాధానంగా ఉపయోగించాడు. అంతే అయితే ఫిలిప్తీయుల్ని శిక్షించటానికి దేవుడు మందసాన్ని ఉపయోగించాడు. విధేయులైన తన ప్రజల బలం మహిమగా ఉండేందుకు గతకాలంలో దేవుని సముఖం దానిలో ఉండేది. తన పరిశుద్ధ ధర్మశాస్త్రాన్ని అతిక్రమించేవారికి నాశనం కలిగించేందుకు ఆయన అదృశ్య సన్నిధి ఇప్పుడు సయితం దానితో ఉంటుంది. దైవ ప్రజలమని చెప్పుకొనే వారి వంచనను శిక్షించటానికి ప్రభువు తరుచు తన బద్ద శత్రువుల్ని సాధనంగా ఉపయోగిస్తాడు. దేవుడిచ్చే శిక్షననుభవిస్తూ ఇశ్రాయేలీయుల బాధలు పడుతున్న సమయంలో దుష్టులు వియం సాధించవచ్చు. కాని వారు కూడా పరిశద్దుడు పాప ద్వేషి అయిన దేవుని శిక్షను అనుభవించ సమయం వస్తుంది. ఎక్కడ పాపాన్ని ప్రేమించటం ఉంటుందో అక్కడ దేవుని నిర్దుష్టమైన తీర్పు చోటు చేసుకొంటుంది.PPTel 590.3

  ఫిలీప్తీయుల విజయ ప్రదర్శనతో మందసాన్ని తమ అయిదు ప్రధాన నగరాల్లో ఒకటైన అష్టాదుకు తీసుకువెళ్ళి అక్కడ తమ దేవత దాగోను గుడిలో దాన్ని ఉంచాడు. అంతవరకు మందసం వలన ప్రదర్శితమై శక్తి ప్రభావాలు తమ సొంతమవుతాయని అది దాగోను శక్తితో ఏకమైనప్పుడు తాము ఎవరూ జయించలేని శక్తిగారూపొందుతామనివారు భ్రమపడ్డారు. ఇలా ఉండగా, మర్నాడు దేవాలయంలోకి వెళ్ళినప్పుడు వారి కళ్ళకు కట్టిన దృశ్యం వారిని ఆశ్చర్యపర్చింది. యెహోవా మందసం ముందు దాగోను విగ్రహం బోర్లపడి ఉంది. పూజార్లు దాన్ని సౌగౌరవంగా లేపి యథాస్థానంలో ప్రతిష్టించారు. కాగా మరుసటి ఉదయం అది మందసం ముందు ముక్కలై పడి ఉండటం చూశారు. ఈ విగ్రహం పై భాగం మానవాకృతి కింద భాగం చేప ఆకృతి కలిగి ఉన్నది. ఇప్పుడు మానవాకృతిలోని ప్రతీ భాగం ముక్కలైపోగా చేప ఆకృతి మాత్రం మిగిలి ఉంది. పూజరులేంటి ప్రజలేంటి అందరూ భయభ్రాంతులయ్యారు. అగోచరమైన ఈ ఘటనను అపశకునంగా భావించారు. దాన్ని తమకు తమ విగ్రహాలకు హెబ్రీయులు దేవుని మూలంగా నాశనానికి సూచనగా భావించారు. మందసాన్ని దేవాలయంలోనుంచి తీసివేసి దాన్ని ఒక ప్రత్యేకమైన కట్టడంలో ఉంచారు.PPTel 591.1

  అష్టాదు ప్రజల్ని ఒక ప్రాణాంతక వ్యాధి మొత్తింది. ఇశ్రాయేలీయులు దేవుడు ఐగుప్తీయుల మీదికి పంపిన తెగుళ్ళను గుర్తు చేసుకొని తమ బాధలన్నీ మందసం తమ మధ్య ఉండటం వల్లనే అని నిర్ధారించాడరు. మందసాన్ని గాతకు పంపించెయ్యాలని తీర్మానించాడరు. అయితే అది చేరిన వెంటనే అక్కడ కూడా తెగులు ప్రారంభమయ్యింది. కనుక ఆ పట్టణ నివాసులు మందసాన్ని ఎక్రోనుకు పంపారు. ‘మందసం వచ్చినప్పుడు ఆ పట్టణ ప్రజలు “మలను మన జననులను చంపివేయవలెనని వీరు ఇశ్రాయేలీయుల దేవుని మందసమును మన యొద్దకు తీసుకొని వచ్చిరి” అని కేకలు వేశారు. గాతు అష్టాదు ప్రజలకు మల్లే వీరు కూడా కాపుదల కోసం తమ దేవతల్ని వేడుకొన్నారు. అయిన నాశన ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. చివరికి వారి కేకలు “ఆకాశము వరకు వినబడెను”. మనసుల నివాస గృహాల్లో ఉంచటానికి భయపడి వారు మందసాన్ని ఆరుబటయ పొలంలో ఉంచారు. అక్కడ ఎలుకల తెగులు బయలుదేరి దేశమంతా వ్యాపించి పొలాల్లోను కొట్లలోను ఉన్న భూఫలాల్ని నాశనం చేసింది. ఆ తెగులు వలన లేదా కరువు వలన దేశం నాశనమయ్యే ప్రమాదం ఏర్పడింది.PPTel 591.2

  మందసం ఏడు మాసాలు ఫిలిష్తియాలో ఉంది. ఈ కాలమంతటిను దాన్ని తిరగి సంపాదంచటానికి ఇశ్రాయేలీయులు ఎలాంటి ప్రయత్నమూ చేయేలేదు. అయితే దాన్ని సంపాదించటానికి ఎంత ఉద్రేకం చూపించారో దాన్ని తిరిగి ఇచ్చేయ్యటానికి ఫిలిప్తీయులు అంతే ఉద్రేకాన్ని ఇప్పుడు కనపర్చుతున్నారు. వారిని బలోపేతం చేసే బదులు అది వారి పట్ల పెనుభారంగా బాధకారమైన శాపంగా మారింది. వారికి ఏం చెయ్యాలో తోచలేదు. అది ఎక్కడికి వెళ్తే అక్కడికి దేవుని తీర్పులు వచ్చాయి. ప్రజలు దేశనాయకుల్ని, పూజారుల్ని, శకునగాండ్రిని పిలిపించి “యెహోవా మందసమును ఏమి చేయుదుము? ఏమి చేసి స్వస్థలమునకు దానిని పంపుదుమో తెలియజెప్పుడి” అన్నాడు. ఖరీదైన అపరాధ పరిహారార్థబలితో దాన్ని తిరిగి పంపించాలన్న సూచన వచ్చింది. “అప్పుడు మీరు స్వస్థతనొంది ఆయన హస్తము మీమీద నుండి యెందుకు తియ్యబడకయుండునో మీరు తెలుసుకొందురు” అని పూజార్లు చెప్పారు.PPTel 592.1

  ఓ తెగులు రాకుండా చేసుకోవటానికి లేదా తొలగించుకోవటానికి పూర్వం అన్యుల మద్య ఓ ఆచారం ఉండేది- నాశనం కలిగించిన దాని అకృతిని లేదా అది ఏ వస్తువుకు లేదా శరీరాభాగానికి హాని కలిగించదో దాని ఆకృతిని బంగారం, వెండి లేక ఇతర లోహాలతో విగ్రహం చేయటమన్న ఆచారం ఉండేది. ఆ విగ్రహాన్ని ఒక స్తంభం మీదో లేదా ఒక బహిరంగ స్థలములోనే పెట్టి ప్రదర్శించటం వాటి వల్ల సంభవించబోయే అరిష్టాల నుండి తమకు కాపుదల కలుగుతుందని ప్రజలకు నమ్మకం ఉండేది. కొంతమంది అన్యులవలె ఇలాంటి ఆచారం ఇప్పటికి ఉంది. వ్యాధితో బాధపడుతున్న ఓ వ్యక్తి స్వస్థత కోసం తన విగ్రహమున్న ఆలయానికి వెళ్ళేటప్పుడు తన శరీరంలోని ఏ అవయవానికి వ్యాధి సోకిందా దాని రూపాన్ని చేసి తీసుకువెళ్ళి దాన్ని తన దేవతలకు కానుకగా అర్పిస్తాడు. ఈ ఆచారాన్ని పురస్కరించుకొనే ప్రజలు తమను ఆతలాకుతలం చేసిన తెగుళ్ళను సూచించే విగ్రహాలు చేయాల్సిందిగా ప్రజలకు ఫిలిప్తీయ నేతలు ప్రతిపాదించారు. “మీ అందరి మీదను మీ సర్దారులందరి మీదను ఉన్న తెగులు ఒక్కటే గనుక, ఫిలీప్తీయుల సర్దారుల లెక్కచొప్పున అయిదు బంగారపు గడ్డల రూపములను, అయిదు బంగారపు పందికొక్కులను చెల్లింపవలెను” అని వారన్నారు.PPTel 592.2

  మందసం వెంట ఒక మర్మపూరితమైన, తమ జ్ఞానానికి అలవికాని శక్తి ఉన్నదని ఈ జ్ఞానులు గుర్తించారు. అయిన విగ్రహాల్ని విడిచి పెట్టి ప్రభువును సేవించవలసిందిగా వారు ప్రజలకు హితవు పలకలేదు. ప్రచండమైన తీర్పుల వల్ల తాము దేవుని అధికారానికి లొంగాల్సి వచ్చినప్పటికి వారు ఇశ్రాయేలీయుల దేవుణ్ణి ద్వేషించారు. దేవునికి వ్యతిరేకంగా పోరాడటం వ్యర్థమని ఈ విధముగా ఆయన తీర్పుల పర్యవసానంగా గ్రహించవచ్చు. ఆయన నియంత్రణ పై తిరుగుబాటు చేస్తుండగా వారు ఆయన అధికారినికి లొంగి ఉండవచ్చు. అలాంటి లొంగుబాటు పాపిని రక్షించలేదు. మానవుడి పశ్చాత్తాపం దేవునికి అంగీకృతం కావటానికి హృదయం దేవునికి సమర్పితం కావాలి. అది దైవ కృప వశం కావాలి.PPTel 592.3

  దుష్టుల పట్ల దేవుని ఎంత విస్తారమైనది! విగ్రహారాధలైన ఫిలిప్తీయులు భక్తిహీనులైన ఇశ్రాయేలీయులు ఒకే విధంగా దేవుని కృపావరల్ని అనుభవించిన వారే. కతృతజ్ఞతలేని, తిరుగుబాటు చేసే మనుషుల మార్గంలో గుర్తింపు పొందని పదివేల కృపావరాలు నిశ్శబ్దంగా పడి ఉన్నాయి. తీర్పు దీవెన దాని దాత ఎవరో బయలుపర్చింది. కాని వారు ఆయన ప్రేమ విషయంలో నిర్లిప్త ధోరణి అవలంభిం చారు. మానవుల పట్ల దేవుని సహనం చాలా గొప్పది. కాని వారు పశ్చాత్తాపపడ కుండా మొండిగా కొనసాగినప్పుడు వారిని పరిరక్షించిన హస్తాన్ని వెనక్కు తీసు కొన్నాడు. ప్రకృతి ద్వారా మాట్లాడుతున్న దేవుని స్వరాన్ని వారు వినిపించుకోలేదు. ఆయన వాక్యంలోని హెచ్చరికల్ని,PPTel 593.1

  హితోక్తుల్ని, మందలింపుల్ని వారు లెక్కచెయ్య లేదు. అందుచేత ఆయన వారితో తీర్పుల ద్వారా మాట్లాడాల్సిన అవసరం ఏర్పడింది. మందసం దాని దేశానికి తిరిగి వెళ్ళటానికి వ్యతిరేకించిన ఫిలిప్తీయులు కొందరు న్నారు. ఇశ్రాయేలీయులు దేవుడు బలంగలవాడని గుర్తించటం ఫిలిప్తీయులకు గౌరవభంగమని వారు భావించారు. తమ హృదయాల్ని కఠిన పర్చుకొన్న ఫరోని ఐగుప్తీయుల్నీ అనుకరించి అంతకన్నా కఠినమైన ఆపదల్ని తమ మీదికి తెచ్చుకోవద్దంటూ “యాజకులు మాంత్రికులు” ప్రజల్ని హెచ్చరించారు. అందరి అమోదాన్ని పొందిన ప్రణాళికను ప్రతిపాదించటం దాన్ని ఆమోదించి తక్షణమే అమలుపర్చటం జరిగింది. మందసాన్ని దానితో పాటు బంగారపు పాపపరిహారార్ధపు బలిని ఒక కొత్త బండి మీద పెట్టరు. అది అపవిత్రం కాకుండా ఇలా జాగ్రత్తలు తీసుకున్నారు. కాడి మోపని రెండు పాడి ఆవుల్ని ఈ బండికి కట్టారు. వాటి దూడల్ని ఇంటి వద్ద కట్టివేసి ఆ ఆవుల్ని స్వేచ్ఛగా విడిచి పెట్టారు. లేవీయులికి అతి సమీపంలో ఉన్న బేతైమెషు పట్టణం మీదుగా ఇశ్రాయేలీయులు దేవుని వల్ల కలిగిందే అనటానికి నిదర్శమని “ఆ మార్గమున పోని యెడల ఆయన మనలను మొత్తలేదనియు, మన అదృష్టవశముచేతనే అది మనకు సంభవించెనని తెలుసు కొందుము” అని పిలిప్తీయులు నిర్ధారించుకొన్నారు.PPTel 593.2

  ఆ ఆవులు దూడల్ని విడిచి పెట్టి అరుస్తూ తిన్నగా వెళ్లు బేతైమైషు మార్గం పట్టాయి. మానవ సహాయమేమి లేకుండా ఆ ఆవులు సూటిగా వాటి మార్గాన నడిచాయి. ఆ మందసం వెంట దైవ సన్నిధి ఉండి దాన్ని నిర్దిష్ట స్థలానికి చేర్చించింది.PPTel 594.1

  అది గోధమ పంట సమయం, బేలెమెషు మనుషులు లోయలో గోధము పంట కోస్తున్నారు. “వారు కన్నులెత్తి చూడగా మందసము వారికి కనపబడెను. దానిని చూచివారు సంతోషించిరి. ఆ బండి బేతైమెషు వాడైన యెహోషువ యొక్క పొలములోకి వచ్చి అక్కడున్న ఒక పెద్దరాతి దగ్గర నిలువగా వారు బండి యొక్క కర్రలను చీల్చి ఆవులను యెహోవాకు దహన బలిగా అర్పించిరి” మందసం వెనుక వాటి వెంట బెత్తెమెషు సరిహద్దు వరకు వెళ్ళి దాని స్వీకారిన్ని చూసిన ఫిలిప్తీయుల సర్దారులు ఏక్రోనుకు తిరిగి వెళ్ళిపోయారు. తెగులు అగిపోయింది. తమ విపత్తులన్నీ ఇశ్రాయేలీయుల దేవుని వల్ల కలిగిన తీర్పులేనని వారు నమ్మారు.PPTel 594.2

  బేలెమెషు ప్రజలు మందసం తమ ఆధీనంలో ఉందన్న వార్తను ప్రచురించటంతో చుట్టు ఉన్న ప్రాంతాల నుంచి ప్రజలు తండోపతండాలుగా వచ్చి మందసం తిరిగి రాకను స్వాగతించారు. ముందు బలిపీఠంగా ఉపయుక్తమైన రాతి మీద మందసాన్ని ఉంచారు. దానిముందు అదనపు బలులు ప్రభువుకి అర్పించారు. ఆ ఆరాధకులు తమ పాపాల నిమిత్తం పశ్చాత్తాపం పొంది ఉంటే వారి పై దేవుడు దీవెనలు కుమ్మరించేవాడు. అయినా వారు ఆయన ధర్మశాస్త్రాన్ని నమ్మకంగా ఆచరించటం లేదు. మందసం తిరిగి రావటం గురించి సంతోషిస్తూ దాన్ని శుభసూచనగా పరిగణిస్తుండగా అది పరిశుద్ధమైందన్న స్పృహ వారిలో కొరవడింది. మందసానికి అర్హమైన స్థలాన్ని ఏర్పాటు చేసే బదులు దాన్ని పంట పొలంలోనే ఉంచేశారు. ఆ పరిశుద్దమందనసం వంక చూస్తూ అది తిరిగి రావటాన్ని గూర్చిన అద్భుత ఉదంతాన్ని గూర్చి మాట్లాడుతూనే దాని విలక్షణ శక్తి ఎందులో ఉన్నదన్న విషయమై ఊహా గానాలకు దిగారు. చివరికి ఉత్సుకతను అదుపు చేసుకోలేక వారు తెర తొలగించి మందసాన్ని తెరిచారు.PPTel 594.3

  మందసాన్ని భయంతోను భక్తితోను పరిగణించటానికి ఇశ్రాయేలీయులందరూ నేర్చుకున్నాడు. దాన్ని ఒక స్థలం నుంచి మరో స్థలానికి తీసుకు వెళ్ళేటప్పుడు లేవీయులు దాని వంక చూసేవారు కాదు. ఏడాదికొక్కసారి మాత్రమే ప్రధాన యాజకడు దేవుని మందసాన్ని చూసేవాడు. అన్యులైన ఫిలీప్తీయుల సైతం దాని తెర తొలగించటానికి సాహసించలేదు. దాని ప్రయాణాలన్నిటిలోను అదృశ్యులైన దేవదూతలు దాన్ని కాపాడుతూ ఉండేవారు. బేతైమెషు ప్రజల భక్తిహీన క్రియకు వెంటనే శిక్ష వచ్చింది. అనేకమంది హఠాన్మరణానికి గురి అయ్యారు.,PPTel 594.4

  మరణించగా మిగిలిన వారు తమ పాపం నిమిత్తం పశ్చాత్తాపం చెందలేదు., మందసాన్ని మూఢనమ్మకంతో కూడిన భయంతో పరిగణించేవారు. దాన్ని తమ వద్ద లేకుండా చేసుకోవాలని వెళ్ళాల్సిందిగా కిర్యత్యారీమువారిని ఆహ్వానించారు. ఈ స్థలంలోని ప్రజలు మందసాన్ని అనందోత్సాహాల్తో స్వాగతించారు. దేవునికి నమ్మకంగాను విధేయులుగాను ఉన్న ప్రజలకు అది దేవుడు వాగ్దానం చేసిన కృప అని వారు గుర్తించారు. వారు ఆనందముతో దాన్ని తమ పట్టణంలలోకి తీసుకొని వచ్చి లేవీయుడైన అబీనాదాబు ఇంటిలో ఉంచారు. ఇతడు దాన్ని కాపాడటానికి తన కుమారుడు ఎలియాజరును నియమించాడు. మందసం అనేక సంవత్సరాలు అక్కడే ఉండిపోయింది. దేవుడు హన్నా కుమారుడికి తన్ను తాను మొదటగా ప్రత్యక్ష పర్చుకొన్న సంవత్సరాల్లో ప్రజలందరూ సమూయేలుని ప్రవక్తగా గుర్తించారు. బాధాకరం కష్టభరితం అయిన విధి నిర్వహణ అయినప్పటికి దేవుని హెచ్చరికను ఏలీ కుటుంబానికి నమ్మకంగా అందించటంద్వారా సమూయేలు యెహోవాకు విశ్వసనీయమైన దూతగా నిరూపించుకొన్నాడు. “కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడెనని దాను మొదలుకొని బెయేరైబా వరకు ఇశ్రాయేలీయులందరు తెలిసికొనిరి”.PPTel 595.1

  ఒక జాతిగా ఇశ్రాయేలీయులింకా మతమన్నది లేకుండా విగ్రహారాధకులుగానే ఉన్నారు. అందుకు శిక్షగా వారు ఫిలిప్తీయుల అధికారం కిందే మిగిలిపోయారు. ఈకాలంలో సమూయేలు ఆ దేశంలోని పట్టణాల్ని గ్రామాల్ని సందర్శించి ప్రజల హృదయాల్ని తమ తండ్రుల దేవుని తట్టు తిప్పటానికి కృషి చేశాడు.. అతడి కృషికి ఫలితాలు లభించకపోలేదు. ఇరవై సంవత్సరాలు శత్రువులు చేతుల్లో శ్రమలను భవించిన తరువాత ఇశ్రాయేలీయులు ” యెహోవాను అనుసరింప దు:ఖించారు. వారికి సమూయేలు ఈ హితవు పలికాడు. ” మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దక మీరు మళ్ళుకొనిన యెడల, అన్య దేవతలను అప్లోరోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి, పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయాలను త్రిప్పి ఆయనను సేవించుడి’. క్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు బోధించిన రీతిగా సమూయేలు ఇక్కడ ప్రయోగాత్మక భక్తి మార్గాన్ని హృదయస్పందన గల మత వైరాగ్యాన్ని ప్రభోదించటం మనం చూస్తున్నాం. క్రీస్తు కృప లేకుండా బాహ్య మతాచారాలు ఇశ్రాయేలీయులకి ఉపయోగం లేనివి. ఆధునిక ఇశ్రాయేలీయుల విషయంలోను అవి అంతే. పూర్వం ఇశ్రాయేలీయుల అనుభవంలోకి వచ్చిన వాస్తవిక మైన హృదయ స్పందన గల మతం నేడు పునరుజ్జీవం పొందటం ఎంతయినా అవసరం. దేవుని వద్దకు తిరిగి రావాలని వాంఛించే వారందరూ పశ్చాత్తాపం అనే మొదటి మెట్టు ఎక్కాలి. ఇది ఒకరు మరొకరి తరుపున చేయలేని పని. మనం వ్యక్తిగతంగా దేవుని ముందు వినయములమై మన విగ్రహాల్ని విడనాడాలి. మనకు సాధ్యమైనదంతా మనం చేశాక ప్రభువు తన రక్షణను మనకు కనపర్చతాడు. PPTel 595.2

  గోత్రాధిపతుల సహకారంతో మిస్సాలో ఒక పెద్ద సమావేశం ఏర్పాటయ్యింది. ఇక్కడ ఒక గంభీరమైన ఉపవాసం ఏర్పాటు చేసారు. ప్రజలు దీనమనసుతో తమ పాపాల్ని ఒప్పుకొన్నారు.తామువిన్న ఉపదేశాన్ని ఆచరించటానికి తమ కృత నిశ్చయానికి సూచికగా సమూయేలుని న్యాయాధిపతిగా అధికారికంగా నియమించారు.PPTel 596.1

  ఈ సమావేశాన్ని ఫిలీప్రియులు యుద్దకూటమిగా భావించి తమ ప్రణాళికలు కార్యాచరణ వరకు రాకముందే ఇశ్రాయేలీయుల్ని చెదరగొట్టటానికి పెద్ద సైన్యంతో బయల్దేరారు. ఫిలీప్తీయుల ఆగమన వార్త ఇశ్రాయేలీ యులికి వణుకు పుట్టించింది. “మన దేవుడైన యెహోవాను ఫిలీప్తీయుల చేతిలో నుండి మనలను రక్షించునట్లుగా మా కొరకు ఆయనను ప్రార్ధన చేయుట మానవద్దు” అని ప్రజలు సమూయేలుని వేడుకొన్నారు.PPTel 596.2

  దహనబలి అర్పించటానికి గొర్రెపిల్లను సిద్ధం చేస్తున్న తరుణంలో యుద్ధం చేసేందుకు ఫిలీప్తీయులు వారిని సమీపించారు. అంతట, మంటలు, పొగ, ఉరు ముల నడుమ సీనాయి మీదికి వచ్చిన సర్వశక్తుడు. ఇశ్రాయేలు ప్రజలకు మార్గం ఏర్పరించేందుకు ఎర్ర సముద్రాన్ని రెండు పాయలు చేసిన దేవుడు. యోర్దాను నదిగుండా దారి ఏర్పాటు చేసిన ప్రభువు తన శక్తిని మళ్ళీ ప్రదర్శించాడు. ముందుకు తోసుకు వస్తున్న శత్రు సైన్యంపై పెనుతుఫాను విరచుకుపడింది. అంతే, ఆ శూరుల మృత కళేబరాలు అంతటా చెల్లాచెదురుగా పడి ఉన్నాయి.PPTel 596.3

  ఇశ్రాయేలీయులు నిశ్శబ్దంగా నిలిచి చూస్తున్నారు. భయంతో ఆశాభావంతో నిరీక్షిస్తూ ఉన్నారు. శత్రువులు హతం కావటం చూసినప్పుడు దేవుడు తమ పశ్చాత్తాపాన్ని అంగీకరించాడని గ్రహించి సంతోషించారు. యుద్ధానికి సిద్ధంగా లేకపోయినప్పటికి మృతులైన ఫిలీప్తీయుల ఆయుధాలు ధరించి పారిపోతున్న ఫిలిప్తీయుల్ని ఇశ్రాయేలీయులు బేత్కాకు వరకూ తరిమారు. ఏ స్థలంలో ఇరవై ఏళ్ళ కిందట ఇశ్రాయేలీయుల ఫిలీప్తీయుల చేతిలో ఓడిపోవటం యాజకులు హతులవ్వటం మందసం పట్టుపడటం జరిగిందో ఆ స్థలంలోనే ఇప్పుడు ఈ ప్రసిద్ధ విజయం కలిగింది. దేవునికి విధేయులై నడుచుకోవటమే దేశాలకు విపత్తులకు పరాజయాలకు నడిపిస్తుంది. ఫిలీప్తీయులు ఇప్పుడు పూర్తిగా ఇశ్రాయేలీయుల వశంలో ఉన్నారు. ఇశ్రాయేలీయులు వద్ద నుంచి తీసుకున్న తోటల్ని తిరిగి వారికిచ్చేశారు. అనేక సంవత్సరాలుగా వారిపట్ల కావిస్తున్న దౌర్జన్యకాండను మానివేశారు. ఇతర దేశాలు కూడా వీరిమాదిరిని అనుకరించారు. సమూయేలు పరిపాలన చివరి వరకు ఇశ్రాయేలీయులు శాంతి సమాధానాలతో నివసించారు.PPTel 596.4

  ఈ సందర్భాన్ని ఎన్నడూ మరిచిపోకండా ఉండేందుకు గాను స్మృతి చిహ్నంగా ఒక పెద్దరాతిని మిస్సాకు షేనుకు మధ్య నిలబెట్టి “ఇంత వరకు యెహోవా మనకు సహాయము చేసెను” అంటూ దానికి ఎబనెజరు “సహాయపురాయి” అని పేరు పెట్టారు .PPTel 597.1

  Larger font
  Smaller font
  Copy
  Print
  Contents