Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
ప్రవక్తలు - రాజులు - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    27 - ఆహాజు

    ఆహాజు సింహాసనానికి రావటంతో యూదా రాజ్యంలో మున్నెన్నడూ లేని తీవ్ర పరిస్థితులు యెషయాని అతడి సహచరుల్ని ఎదురుకున్నాయి. క్రితంలో విగ్రహారాధక ఆచారాల ప్రభావానికి లొంగని వారిని ఇప్పుడు ఒప్పించి, అన్యదేవతలకు మొక్కటంలో పాలుపొందేటట్లు చేయటం జరుగుతున్నది. ఇశ్రాయేలులోని అధికారులు నమ్మకద్రోహులుగా నిరూపించుకున్నారు. అబద్ద ప్రవక్తలు బయలుదేరి తమ వర్తమానాలతో ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారు. కొందరు యాజకులు సైతం అద్దెకు బోధ చేస్తున్నారు. అయినా మతభ్రష్టతలో నాయకత్వం వహిస్తున్నవారు దైవారాధన తతంగాన్ని ఆచరిస్తూ తాము కూడా దేవుని ప్రజలమేనని చెప్పుకుంటున్నారు.PKTel 218.1

    ఈ విపత్కర దినాల్లో తన సాక్ష్యసేవను నమ్మకంగా సాగించిన మికా ప్రవక్త, సీయోనులోని పాపులు “యెహోవాను ఆధారము చేసికొని” ఉన్నామంటూ, “యెహోవా మన మధ్యనున్నాడుగదా, యే కీడును మనకు రాదు” అని అతిశయంగా మాట్లాడ్తూ “నరహత్య చేయుటచేత సీయోనును ... కట్టుదురు దుష్టత్వము జరిగించుటచేత యెరూషలేమును ... కట్టుదురు” అని ప్రకటించాడు. మికా 3:11,10. ఈ పాపాల్ని ఖండిస్తూ యెషయా ఇలా గళమెత్తాడు, “సొదొమ న్యాయాధిపతులారా, యెహోవా మాట ఆలకించుడి. గొమొఱ్ఱ జనులారా, మన దేవుని ఉపదేశమునకు చెవియొగ్గుడి. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే - విస్తారమైన మి బలులు నాకేల? ... నా సన్నిధిని కనబడవలెనని మీరు వచ్చుచున్నారే నా ఆవరణములను తొక్కుటకు మిమ్మును రమ్మన్నవాడెవడు?”PKTel 218.2

    లేఖనం ఇలా అంటున్నది, “భక్తిహీనులు అర్పించు బలులు హేయములు. దురాలోచనతో అర్పించినయెడల అవి మరి హేయములు.” పరలోక దేవుని “కనుదృష్టి దుష్టత్వమును చూడలేనంత నిష్కళంకమైనది.” హబక్కూకు. 1:13. ఆయన అపరాధినుంచి తొలగిపోవటం క్షమించటానికి సమ్మతంగా లేనందుకు కాదు. తాను సమృద్ధిగా అందుబాటులో ఉంచిన కృపను వినియోగించుకో టానికి పాపి నికారించినందుకు దేవుడు పాప విముక్తి కలిగించలేక పోతున్నాడు. “రక్షింపనేరక యుండునట్లు యెహోవా హస్తము కురుచకాలేదు. విననేరక యుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మాకును మా దేవునికిని అడ్డముగా వచ్చెను. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను.” యెష. 59:1,2.PKTel 218.3

    సొలొమోను ఇలా రాశాడు, “దేశమా, దాసుడు (బాలుడు) నీకు రాజై యుండుట ... నీకు అశుభము!” ప్రసం. 10:16. యూదా పరిస్థితి ఇదే. అడ్డూ ఆపులేని అపరాధాలు చేస్తూ ఆ దేశ పరిపాలకులు చిన్నపిల్లల్లా తయారయ్యారు. లోకంలోని జాతుల నడుమ తమ బలహీన స్థానానికి యెషయా ఆ ప్రజల గమనాన్ని ఆహ్వానించి అదే ఉన్నత స్థలాల్లో ప్రబలుతున్న దుష్టత దుర్మార్ధతల ఫలితమని సూచించాడు. అతడిలా అన్నాడు, “ఆలకించుడి. ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా పోషణమును పోషణాధారమును అన్నోదకముల ఆధారమంతయు పోషణమంతయు శూరులను యోధులను న్యాయాధిపతులను ప్రవక్తలను సోదెగాండ్రను పెద్దలను పంచాధిపతులను ఘనత వహించినవారిని మంత్రులను శిల్పశాస్త్రములను ఎరిగినవారిని మాంత్రికులను యెరూషలేమునుండియు యూదా దేశములోనుండియు తీసివేయును.” “యెరూషలేము పాడైపోయెను. యూదా నాశనమాయెను.... వారి మాటలును క్రియలును ఆయనకు ప్రతికూలముగా ఉన్నవి.” యెష 3:1-4,8.PKTel 219.1

    ప్రవక్త ఇంకా ఇలా అన్నాడు, “మి నాయకులు త్రోవ తప్పించువారు. వారు నీ త్రోవల జాడను చెరిపివేయుదురు.” 12వ వచనం. ఆహాజు ఏలుబడిలో ఇది అక్షరసత్యం. అతణ్ని గురించి లేఖనం ఇలా అంటుంది, “అతడు ఇశ్రాయేలీయుల ముందర నిలువకుండ యెహోవా వెళ్లగొట్టిన జనులు చేసిన హేయమైన క్రియలు చేయుచు, తన కుమారుని అగ్నిగుండము దాటించెను.” 2 రాజులు. 16:3.PKTel 219.2

    ఎంపికైన జాతికి ఇది చాలా అపాయకరమైన కాలం. కొన్ని సంవత్సరాలు మాత్రమే. ఆ తర్వాత ఇశ్రాయేలువారి పదిగోత్రాలు అన్యజాతుల మధ్యకు చెదిరిపోనున్నాయి. యూదా రాజ్యంలోకూడా పరిస్థితులు ఏమంత బాగాలేవు. మంచిని ప్రోదిచేసే శక్తులు క్షీణిస్తున్నాయి. దుష్టశక్తులు తామరతంపరగా పెరుగుతున్నాయి. ఆ పరిస్థితుల్ని చూస్తున్న మికా ప్రవక్త ఇలా వాపోయాడు, “భక్తుడు దేశములో లేకపోయెను, జనులలో యధార్ధపరుడు ఒకడును లేడు. వారిలో మంచివారు ముండ్ల చెట్టువంటివారు . వారిలో యదార్థవంతులు ముండ్లకంచే కంటెను ముండ్లు ముండ్లుగా నుందురు.” మికా 7:2,4. యెషయా ఇలా అంటున్నాడు, “సైన్యములకధిపతియగు యెహోవా బహు కొద్దిపాటి శేషము మనకు నిలుపని యెడల మనము సొదొమ వలెను గొమొఱ్ఱ” వలెను ఉందుము. యెష. 1:9.PKTel 219.3

    ప్రతీ యుగంలోను, ఆయనకు నమ్మకంగా నిలిచిన వారి నిమిత్తం పాపులపట్ల ఆయనకు అపారమైన ప్రేమ ఉంది గనుక దేవుడు తిరుగుబాటుదారుల్ని దీర్ఘకాలం సహించాడు. తమ చెడుమార్గాన్ని విడిచిపెట్టి తనవద్దకు తిరిగి రావలసిందని వారికి విజ్ఞప్తి చేశాడు. తాను ఏర్పర్చుకున్న మనుషులద్వారా “ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ ... సూత్రము వెంబడి సూత్రము ... కొంత ఇచ్చట కొంత అచ్చట పాపులికి నీతి మార్గాన్ని బోధించాడు.” యెష 28:10.PKTel 220.1

    ఆహాజు ఏలుబడిలో ఉన్న పరిస్థితి ఇదే. తప్పులు చేస్తున్న ఇశ్రాయేలు యెహోవా వద్దకు తిరిగివచ్చి ఆయనకు నమ్మకంగా నివసించాల్సిందిగా ఆహ్వానం వెంట ఆహ్వానం పంపటం జరిగింది. ప్రవక్తలు ప్రేమతో విజ్ఞప్తులు చేశారు. పశ్చాత్తాపపడమంటూ దిద్దుబాటు చేసుకోమంటూ ప్రజలముందు నిలబడి హెచ్చరించినప్పుడు వారి మాటలు దేవుని మహిమార్థం ఫలాలు ఫలించాయి.PKTel 220.2

    మీకా ద్వారా ఈ చక్కని విజ్ఞప్తి వచ్చింది, “యెహోవా సెలవిచ్చు మాట ఆలకించుడి - నీవు వచ్చి పర్వతములను సాక్ష్యము పెట్టి వాజ్యెమాడుము. కొండలకు నీ స్వరము వినబడనిమ్ము. తన జనులమీద యెహోవాకు వ్యాజ్యెము కలదు. ఆయన ఇశ్రాయేలుమిద వ్యాజ్యెమాడుచున్నాడు. నిశ్చలములై భూమికి పునాదులుగా ఉన్న పర్వతములారా, యెహోవా ఆడు వ్యాజ్యెము ఆలకించుడి.”PKTel 220.3

    “నా జనులారా, నేను మీకేమి చేసితిని? మిమ్ము నేలాగు ఆయాస పరచితిని? అది నాతో చెప్పు.. ఐగుప్తు దేశములోనుండి నేను మిమ్మును రప్పించితిని. దాస గృహములో నుండి మిమ్మును విమోచించితిని. మిమ్మును నడిపించుటకై మోషే అహరోను మిర్యాములను పంపించితిని.”PKTel 220.4

    “నా జనులారా, యెహోవా నీతి కార్యములను మీరు గ్రహించునట్లు మోయాబు రాజైన బాలాకు యోచించిన దానిని బెయోరు కుమారుడైన బిలాము అతనికి ప్రత్యుత్తరముగా చెప్పిన మాటలను షిర్డీము మొదలుకొని గిల్లాలువరకును జరిగిన వాటిని, మనస్సునకు తెచ్చుకొనుడి.” మికా. 6:1-5.PKTel 220.5

    మనం సేవిస్తున్న దేవుడు దీర్ఘశాంతం గలవాడు. “ఆయన వాత్సల్యత యెడతెగక నిలుచునది.” విలాప. 3:22. కృపకాల వ్యవధిలో నిత్యజీవిత వరాన్ని అంగీకరించ వలసిందిగా మనుషులతో ఆయన ఆత్మ విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. “నా జీవముతోడు దుర్మార్గుడు మరణము నొందుటవలన నాకు సంతోషము లేదు. దుర్మార్గుడు తన దుర్మార్ధతనుండి మరలి బ్రదుకుటవలన నాకు సంతోషము కలుగును. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మనస్సు త్రిప్పుకొనుడి. మీ దుర్గార్ధతనుండి మరలి మనస్సు త్రిప్పు కొనుడి. మీరెందుకు మరణము నొందుదురు?” యెహె. 33:11. మనుషుల్ని పాపంలోకి నడిపించి, నిస్సహాయులుగా, నిరీక్షణ శూన్యులుగా క్షమాపణ కోరటానికి భయపడే వారిగా విడిచిపెట్టటం సాతాను ప్రత్యేక పన్నాగం. కాని “ఈలాగున జరుగకుండునట్లు జనులు నన్ను ఆశ్రయింపవలెను. నాతో సమాధానపడవలెను. వారు నాతో సమాధానపడవలెను.” అని ఆయనంటున్నాడు. యెష. 27:5. క్రీస్తులో ప్రతీ వనరు ప్రతీ ప్రోత్సాహం ఏర్పాటయ్యాయి.PKTel 220.6

    యూదాలోను ఇశ్రాయేలులోను మతభ్రష్టత చోటుచేసుకున్న రోజుల్లో అనేకులు “ఏమి తీసికొనివచ్చి నేను యెహోవాను దర్శింతును? ఏమి తీసికొనివచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును? దహనబలులను ఏడాది దూడలను అర్పించి దర్శించునా? వేలకొలది పొట్టేళ్లను వేలాది నదులంత విస్తార తైలమును ఆయనకు సంతోషము కలుగజేయునా? నా అతిక్రమమునకై నా జ్యేష్ఠ పుత్రుని నేనిత్తునా? నా పాప పరిహారమునకై నా గర్భ ఫలమును నేనిత్తునా?” అంటూ విచారణ చేశారు. దీనికి సమాధానం స్పష్టమైంది. నిర్దిష్టమయ్యింది : “మనుష్యుడా, యేది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి యున్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీనమనస్సు కలిగి నీ దేవునియెదుట ప్రవర్తించుటయు, ఇంతే యెహోవా నిన్నుడుగుచున్నాడు.” మికా. 6:6-8PKTel 221.1

    ప్రయోగాత్మక భక్తి విలువను గుర్తించమంటూ విజ్ఞప్తి చెయ్యటంలో శతాబ్దాలు ముందు దేవుడు ఇశ్రాయేలువారికిచ్చిన ఉపదేశాన్ని ప్రవక్త పునరుద్ఘాటిస్తున్నాడు. వారు వాగ్దత్త దేశంలో ప్రవేశించటానికి సిద్ధంగా ఉన్న తరుణంలో ప్రభువు వద్దనుంచి వచ్చిన వర్తమానం ఇది : “కాబట్టి ఇశ్రాయేలూ, నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు, ఆయనను ప్రేమించి, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణాత్మతోను సేవించి, నీ మేలుకొరకు నేను నీకాజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు?” ద్వితి. 10:12,13. ఆచారాల బండి బాటలో అలవాటు ప్రకారంపోతూ దయ చూపించటం మర్చిపోయే ప్రమాదంలో ఉన్నవారికి యుగాల పొడవునా యెహోవా సేవకులు ఈ హితోపదేశాన్ని పునరుచ్చరిస్తూ వచ్చారు. తన భూలోక సేవాకాలంలో క్రీస్తుని ఒక న్యాయ శాస్త్రవేత్త ఇలా ప్రశ్నించాడు, “బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏది?” అతడితో యేసు ఇలా అన్నాడు, “నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలె ననునదియే. అది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ. నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దానివంటిదే. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్ర మంతటికిని ప్రవక్తలకును ఆధారమై యున్నవి.” మత్త. 22:36-40. ప్రవక్తలూ, మన ప్రభువూ అన్న ఈ మాటల్ని ప్రతీ ఆత్మకు దేవుని స్వరంగా మనం స్వీకరించాలి. భారాలు మోస్తున్నవారికి, హింస అనుభవిస్తున్నవారికి కనికరం చూపించటానికి వచ్చే ప్రతీ తరుణాన్ని మనం వినియోగించుకోవాలి. దేవుని ఎరుగని వారికి మనం ఏమి చెయ్యలేకపోతే వారికి ఉత్సాహాన్ని నిరీక్షణను కలిగించే మాటలు చెప్పవచ్చు. వారిని సానుభూతి ప్రేమానురాగాల ద్వారా చేరటం సులభం.PKTel 221.2

    అవకాశం చూసుకుని, ఇతరులికి ఆనందాన్ని దీవెనలని అందించే వారికి చక్కని వాగ్దానాలున్నాయి. “ఆశించినదానిని ఆకలిగొనిన వానికిచ్చి శ్రమపడినవానిని తృప్తి పరచినయెడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును. అంధకారము నీకు మధ్యాహ్నమువలె నుండును. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. క్షామ కాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ యెముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోటవలెను ఎప్పుడును ఉబుకుచుండు నీటిఊటవలెను ఉండెదవు.” యెష. 58:10,11.PKTel 222.1

    ప్రవక్తలు విజ్ఞప్తులు చేస్తున్నప్పటికీ ఆహాజు విగ్రహారాధన వ్యవహార పర్యవసానం ఒక్కటే. “యెహోవా యూదావారిమీదను యెరూషలేము కాపురస్తులమిదను కోపించి ... వారిని ఆయన భీతికిని విస్మయమునకును నిందకును ఆస్పదముగా చేసెను.” 2 దిన వృ. 29:8. ఆ రాజ్యం త్వరిత గతిని క్షీణించింది. సైన్యాలు దాడి చెయ్యటంతో దాని అస్తికతే ప్రమాదంలో పడింది. “సిరియా రాజైన రెజీనును ఇశ్రాయేలు రాజైన రెమల్యా కుమారుడగు పెకహును యెరూషలేము మీదికి యుద్దమునకు వచ్చి అక్కడనున్న ఆహాజును పట్టణమును ముట్టడి వేసిరి.” 2 రాజులు 16: 5.PKTel 222.2

    ఆహాజు అతడి ప్రధానులు సర్వోన్నతుని యధార్ధ సేవకులై ఉంటే అంత అసహజమైన ఆ కూటమికి భయపడేవారు కారు. కాని పదేపదే చేస్తున్న అతిక్రమాలవల్ల వారి బలం నశించింది. ఆగ్రహించిన దేవుడు విధించే శిక్షలకు భయపడిన రాజు హృదయం “గాలికి అడవి చెట్లు కదలినట్లు ... జనుల హృదయమును కదిలెను.” యెష. 7:2. ఈ విపత్కర సమయంలో దేవుని వాక్యం యెషయాకు వచ్చి భయపడున్న రాజుకి ఈ వర్తమానం అందించమని ఆదేశించింది:PKTel 222.3

    “భద్రముసుమి, నిమ్మళించుము.... సిరియాయు, ఎఫ్రాయిమును, రెమల్యా కుమారుడును అనువారి కోపాగ్నికి జడియకుము. నీ గుండె అవియనీయకుము. సిరియాయు, ఎఫ్రాయిమును, రెమల్యా కుమారుడును నీకు కీడు చేయవలెనని ఆలోచించుచు మనము యూదా దేశము మీదికిపోయి దాని జనులను భయపెట్టి.... టాబేయేలను వాని కుమారుని దానికి రాజుగా నియమించెదము రండని చెప్పుకొనిరి.... అయితే ప్రభువైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు - ఆ మాట నిలువదు, జరుగదు.” ఇశ్రాయేలు రాజ్యం, సిరియా రాజ్యం త్వరలో అంతంకానున్నాయని ప్రవక్త చెప్పాడు. “మీరు నమ్మకుండినయెడల స్థిరపడకయుందురు” అన్నాడు ప్రవక్త. 4-7,9 వచనాలు.PKTel 223.1

    ఆహాజు ఈ వర్తమానాన్ని దేవుని వద్దనుంచి వచ్చినట్లు అంగీకరించి ఉంటే యూదారాజ్యం క్షేమంగా ఉండేది. కాని అతడు మానవశక్తిని నమ్ముకుని దేవుని సాయాన్ని కోరాడు. నిరుత్సాహపడి అష్షూరు రాజైన తిగ్గతిలేసరుకి ఈ వర్తమానం పంపాడు, “నేను నీ దాసుడను నీ కుమారుడనై యున్నాను గనుక నీవువచ్చి నా మీదికి లేచిన సిరియా రాజు చేతిలోనుండియు ఇశ్రాయేలు రాజు చేతిలోనుండియు నన్ను రక్షింపవలెను.” 2 రాజులు 16:7. ఆ మనవితో రాజు ధనాగారంనుంచి దేవాలయ ధనాగారంనుంచి గొప్ప నజరానాను తగ్గతిలేసరుకి పంపాడు.PKTel 223.2

    ఆహాజు కోరిన సహాయం వచ్చింది. రాజుకి తాత్కాలిక ఉపశమనం లభించింది. కాని దానికి యూదా చెల్లించాల్సిన మూల్యం ఎంత పెద్దది! ఆహాజు పంపిన నజరానా అపూరీయుల్లో దురాశను రేకెత్తించింది. కొద్దికాలంలోనే ఆ విశ్వాసఘాతుక దేశం యూదాపైకి దండెత్తి దాన్ని దోచుకోటానికి సిద్దమయ్యింది. ఆహాజు అతడి ప్రజలు ఇప్పుడు క్రూరులైన అపూరీయుల చేతుల్లో పూర్తిగా చిక్కిపోతామని భయపడ్డారు.PKTel 223.3

    మానకుండా కొనసాగిస్తున్న అతిక్రమాల్నిబట్టి ప్రభువు “యూదావారిని హీనపరచెను.” శిక్షపొందుతున్న కాలంలో ఆహాజు పశ్చాత్తాపపడే బదులు “యెహోవా దృష్టికి మరి యధికముగా అతిక్రమములు జరిగించెను.” “సిరియా రాజుల దేవతలు వారికి సహాయము చేయుచున్నవి.” “గనుక వాటి సహాయము నాకును కలుగునట్లు నేను వాటికి బలులు అర్పించెదననుకొని తన్ను ఓడించిన దమస్కువారి దేవతలకు బలులు” అర్పిస్తాను అన్నాడు. 2 దినవృ. 28:19,22,23. PKTel 223.4

    మతభ్రష్టుడైన రాజు పరిపాలన అంతం సమీపించినప్పుడు అతడు దేవాలయం తలుపులు మూయించాడు. పరిశుద్ధ ఆలయాచారాలకు అంతరాయం ఏర్పడింది. బలిపీఠం ముందు దీపస్తంభం ఇక వెలగటం లేదు. ప్రజలనిమిత్తం పాప పరిహారార్థ బలులు ఇకలేవు. ఉదయ సాయంకాల బల్యర్పణ సమయంలో ధూపం పైకిలేవటం ఇకలేదు. దేవాలయం ఆవరణం విడిచిపెట్టి, ఆలయం తలుపులు భద్రంగా మూసివేసి దేవుడులేని ఆ పట్టణ నివాసులు యెరూషలేము పట్టణవీధుల మూలల్లో అన్యదేవతల ఆరాధనకు బలిపీఠాలు నిర్మించారు. అన్యమతం గెలుపు సాధించినట్లు కనిపించింది. చీకటి శక్తులు దాదాపు విజయవంతమయ్యాయి.PKTel 223.5

    కాగా యెహోవాకు నమ్మకంగా నిలిచినవారు విగ్రహాలికి మొక్కటానికి స్థిరంగా నిరాకరిస్తూ వచ్చినవారు కొందరున్నారు. ఆరోజు చివరి సంవత్సరాల్లో జరిగిన నాశనాన్ని పరిశీలించేటప్పుడు యెషయా, మికా, వారి సహచరులు వీరిమీద తమ ఆశలు నిరీక్షణల్ని పెట్టుకున్నారు. వారి ఆలయం మూతపడింది. కాని నమ్మకమైన విశ్వాసులికి ఈ హామి ఉంది : “దేవుడు మాతోనున్నాడు.” “సైన్యములకధిపతియగు యెహోవాయే పరిశుద్ధుడనుకొనుడి. మీరు భయపడవలసినవాడు ఆయనే, ఆయన కోసరమే దిగులు పడవలెను. అప్పుడాయన మీకు పరిశుద్ధ స్థలముగా నుండును.” యెష. 8:10, 13.PKTel 224.1

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents