Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
ప్రవక్తలు - రాజులు - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    60 - భావి మహిమా దృశ్యమాలిక

    దుష్టతతో సంఘం సుదీర్ఘ సంఘర్షణ చీకటి దినాల్లో దేవుడు తన నిత్య సంకల్పాల్ని గురించిన ప్రత్యక్షతల్ని సంఘానికిచ్చాడు. ప్రస్తుత శ్రమల్ని అధిగమించి ముందున్న విజయాల్ని వీక్షించటానికి ఆయన తన ప్రజలికి అవకాశం ఇస్తున్నాడు. త్వరలో సంఘర్షణ అంతమవుతుంది. విమోచన పొందినవారు వాగ్దత్త దేశాన్ని, స్వంత్రించు కుంటారు. భవిష్యత్ మహిమను గూర్చిన ఈ దృశ్యాలు దేవుడే సమర్పించినవి. యుగాలుగా సాగుతూ వచ్చిన ఈ సంఘర్షణ సమాప్తమౌతున్నదన్న వాగ్దత్త దీవెనలు త్వరలో సంపూర్తిగా సాకారం కానున్నాయి. నేడు దేవుని సంఘానికి ఆ దృశ్యాలు ఎంతో ప్రియమైనవి! PKTel 510.1

    పూర్వ ప్రవక్తలద్వారా సంఘానికి ఎన్నో ఆదరణ వర్తమానాల్ని దేవుడు పంపాడు. “నా జనులను ఓదార్చుడి, ఓదార్చుడి” అన్నది యెషయాకు దేవుడిచ్చిన ఆదేశం. (యెష 40:1). ఈ ఆదేశంతోపాటు ఆ తర్వాతి యుగాల్లోని విశ్వాసులికి నిరీక్షణను ఉత్సాహాన్ని సూచించే దృశ్యాల్ని దేవుడిచ్చాడు. ప్రతీ యుగంలోను దేవుని ప్రజలు తృణీకారానికి, హింసకు, నిరాదరణకు గురి అవుతూ వస్తున్నారు. అయినా దేవుని వాగ్దానాలే వారిని నిలబెడ్తున్నాయి. “నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహు తరములకు సంతోషకారణముగాను చేసెదను” (యెష 60:15) అన్న వాగ్దానాన్ని సంఘపరంగా ప్రభువు నెరవేర్చే దినం కోసం వారు విశ్వాసంతో కనిపెడుతున్నారు. PKTel 510.2

    పోరాటంలో ఉన్న సంఘం తరచు శ్రమలు కష్టాలు భరించాల్సి ఉంటుంది. తీవ్ర సంఘర్షణ లేకుండా సంఘం విజయం సంపాదించలేదు. “శ్లేషాన్న పానములు” (యెష 30:20) అందరూ అనుభవించాల్సిందే. అయితే మహా విమోచకునిపై నమ్మిక ఉంచేవారెవరూ ఓడిపోరు. “యోకోబూ, నిన్ను సృజించినవాడగు యెహోవా, ఇశ్రాయేలూ నిన్ను నిర్మించిన వాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు - నేను నిన్ను విమోచించియున్నాను భయపడకుము, పేరుపెట్టి నిన్ను పిలిచియున్నాను. నీవు నా సొత్తు. నీవు జలములలోబడి దాటునప్పుడు నేను నీకు తోడైయుందును. నదులలోబడి వెళ్లునప్పుడు అవి నీ మీద పొర్లిపారవు. నీవు అగ్నిమధ్యను నడచునప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చవు. యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేను నిన్ను రక్షించువాడను. నీ ప్రాణ రక్షణ క్రయముగా ఐగుపును ఇచ్చియున్నాను. నీకు బదులుగా కూషును సెబాను ఇచ్చియున్నాను. నీవు నా దృష్టికి ప్రియమైనందున ఘనుడవైతివి. నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుష్యులను అప్పగించుచున్నాను.” యెష 43:1-4.PKTel 510.3

    దేవుడు క్షమా ప్రభువు. మన కోసం మరణించి తిరిగిలేచిన యేసు రక్తప్రభావం వల్ల దేవుడు మనల్ని సంపూర్తిగా నిస్సందేహంగా అంగీకరిస్తాడు. ప్రభువు తాను ఎంపికచేసుకున్న వారితో ఇలా అనటం యెషయా విన్నాడు, “నేను నేనే నా చిత్తానుసారముగా నీ యతిక్రమములను తుడిచివేయుచున్నాను. నేను నీ పాపములను జ్ఞాపకము చేసికొనను. నాకు జ్ఞాపకము చేయుము మనము కూడి వాదింతము. నీవు నీతిమందుడవుగా తీర్చబడునట్లు నీ వ్యాజ్యెమును వివరించుము.” “యెహోవానగు నేను నీ రక్షకుడననియు బహు పరాక్రమముగల యాకోబు దేవుడనగు విమోచకుడ ననియు నీకు తెలియబడును.” 25,26,60,61 వచనాలు.PKTel 511.1

    “భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును” అన్నాడు ప్రవక్త. “పరిశుద్ద ప్రజలనియు యెహోవా విమోచించినవారనియు వారికి పేరు పెట్ట బడును.” “బూడిదకు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. యెహోవా తన్ను మహిమపరచుకొనునట్లు నీతి అనుమస్తకి వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడను.”PKTel 511.2

    “సీయోనూ, లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకొనుము
    పరిశుద్ద పట్టణమైన యెరూషలేమా, నీ సుందర వస్త్ర
    ములను ధరించుకొనుము
    ఇక మీదట సున్నతి పొందని వాడొకడైనను
    అపవిత్రుడొకడైనను నీ లోపలికి రాడు

    “ధూళి దులుపుకొనుము యెరుషలేమా
    లేచి కూర్చుండుము చెరపట్టబడిన సీయోను కుమారీ,
    నీ మెడకట్లు విప్పివేసికొనుము

    “ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణలేక
    యున్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును
    నీలములతో నీ పునాదులను వేయుదును

    “మాణిక్యమణులతో నీ కోటకొమ్ములను
    సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును
    ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచు
    దును

    “నీ పిల్లలందరు యెహోవాచేత ఉపదేశము నొందుదురు
    నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును
    నీవు నీతిగలదానవై స్థాపించబడుదువు

    “నీవు భయపడనక్కరలేదు, బాధించువారు నీకు దూర
    ముగా నుందురు
    భీతి నీకు దూరముగా ఉండును
    అది నీ దగ్గరకు రానే రాదు
    జనులు గుంపుగూడినను వారు నావలన కూడరు
    నీకు విరోధముగా గుంపులు గూడువారు నీ పక్షపువారగు
    దురు....

    “నీకు విరోధముగా రూపింపబడిన యే ఆయుధమును
    వర్ధిల్లదు
    న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి
    వానికి నీవు నేరస్థాపన చేసెదవు
    యెహోవాయొక్క సేవకుల నీతి నా వలన కలుగు
    చున్నది. ఇది వారి స్వాస్థ్యము
    ఇదే యెహోవా వాక్కు”
    PKTel 511.3

    యెష 25:8, 62:12, 61:3, 52:1,2, 54:11-17.

    సంఘం క్రీస్తు నీతి అనే కవచం ధరించి తన చివరి పోరాటంలో ప్రవేశించాలి. “సంధ్యారాగము చూపట్టుచు, చంద్రబింబమంత అందముగలదై, సూర్యుని అంత స్వచ్చమును కళలును గలదై, వ్యూహిత సైన్య సమ భీకర రూపిణి” అయి స్వైర విహారం చేసుకుంటూ సంఘం లోకంలోకి వెళ్లాల్సి ఉంది. (పరమగీతము 6:10).PKTel 512.1

    దుష్ట శక్తులతో సంఘం పోరాటంలో మిక్కిలి అంధకార గడియ దాని అంతిమ విమోచనకు ముందటి దినమే. అయితే దేవునిపై విశ్వాసముంచే వారెవ్వరూ భయపడాల్సి అవసరంలేదు. ఎందుకంటే “భీకరుల ఊపిరి గోడను తగిలిన గాలివానవలె” ఉన్నప్పుడు దేవుడు తన సంఘానికి “గాలివాన తగులకుండ ఆశ్రయముగా” ఉంటాడు. యెష 25:3.PKTel 512.2

    ఆ రోజునే దేవుడు నీతిమంతులికి విమోచనను వాగ్దానం చేశాడు. “సీయోనులో నున్న పాపులు దిగులుపడుచున్నారు. వణకు భక్తిహీనులను పట్టెను. మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు? మనలో ఎవడు నిత్యము కాల్చుచున్న వాటితో నివసించును? నీతిని అనుసరించి నడచుచు యధార్ధముగా మాటలాడుచు నిర్బంధము వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు లంచము పుచ్చుకొనకుండ తన చేతులను మలుపుకొని హత్యయను మాట వినకుండ చెవులు మూసికొని చెడుతనము చూడకుండ కన్నులు మూసికొనువాడు ఉన్నత స్థలమున నివసించును. పర్వతములలోని శిలలు అతనికి కోటయగును.” యెష 33:14-16.PKTel 513.1

    నమ్మకమైన విశ్వాసులతో దేవుడిలా అంటాడు: “నా జనమా, ఇదిగో వారి దోషమును బట్టి భూనివాసులను రక్షించుటకు యెహోవా తన నివాసములో నుండి వెడలివచ్చుచున్నాడు.... నీవు వెళ్లి నీ తలుపులు మూసికొనుము. ఉగ్రత తీరిపోవువరకు కొంచెము సేపు దాగియుండుము.” యెష 26:20,21. PKTel 513.2

    తమ ప్రభువుని సమాధానంగా ఎదుర్కోటానికి సిద్దంగాలేని ప్రజల దిగ్ర్భాంతిని దైవావేశపూరితులైన ప్రవక్తలకు కలిగిన దర్శనాల్లో ఆయన చూచాయగా ప్రత్యక్షపర్చాడు.PKTel 513.3

    “యెహోవా దేశమును వట్టిదిగా చేయుచున్నాడు. ఆయన దాని పాడుగా చేసి కల్లోలపరచుచున్నాడు. దాని నివాసులను చెదరగొట్టుచున్నాడు.... లోకనివాసులు ధర్మశాసనములను అతిక్రమించియున్నారు కట్టడలను మార్చి నిత్యనిబంధనను మీరి యున్నారు... శాపము దేశమును నాశనము చేయుచున్నది. దాని నివాసులు శిక్షకు పాత్రులైరి.... ఉల్లసించువారి శబ్దము నిలిచిపోయెను, సితారాల యం పైన శబ్దము నిలిచిపోయెను.” యెష 24:1-8.PKTel 513.4

    “ఆహా, యెహోవా దినము వచ్చెనే అది ఎంత భయంకరమై దినము! అది ప్రళయమువలనే సర్వశక్తుని యొద్దనుండి వచ్చును.... విత్తనము మంటి పెద్దల క్రింద కుళ్లిపోవుచున్నది. పైరు మాడిపోయినందున ధాన్యపుకొట్లు వట్టివాయెను. కళ్ళపుకొట్లు నేలపడియున్నవి. మేతలేక పశువులు బహుగా మూల్గుచున్నవి. ఎడ్లు మందలుగా కూడి ఆకలికి అల్లాడుచున్నవి. గొఱ్ఱమందలు చెడిపోవుచున్నవి.” ద్రాక్షచెట్లు చెడిపోయెను, అంజూరపు చెట్లు వాడిపోయెను. దానిమ్మ చెట్లును ఈత చెట్లును జల్దరు చెట్లును తోట చెట్లన్నియు వాడిపోయినవి. నరులకు సంతోషమేమియు లేకపోయెను.” యోవేలు 1:15-18,12.PKTel 513.5

    లోక చరిత్ర అంతంలో చోటుచేసుకునే నాశన దృశ్యాల్ని చూస్తూ యిర్మీయా ప్రవక్త ఇలా స్పందించాడు, “నా అంతరంగములో నాకెంతో వేదనగా నున్నది. నా గుండె నరములు, నా గుండె కొట్టుకొనుచున్నది. తాళలేను, నా ప్రాణమా బాకానాదము వినబడుచున్నది గదా; యుద్ధ హోష నీకు వినబడుచున్నదిగదా? కీడు వెంట కీడు వచ్చుచున్నది, దేశమంతయు దోచుకొనబడుచున్నది.” యిర్మీ 4:19,20.PKTel 514.1

    దేవుని ఉగ్రత దీనం గురించి యెషయా ప్రవక్త ఇలా అంటున్నాడు, “అప్పుడు నరుల అహంకారము అణగదొక్కబడును మనుష్యుల గర్వము తగ్గించబడును. ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును. విగ్రహములు బొత్తిగా నశించి పోవును.... ఆ దినమున యెహోవా భూమిని గజగజ వణికింప లేచినప్పుడు ఆయన భీకర సన్నిధి నుండి ఆయన ప్రభావ మహాత్మ్యములనుండి కొండ గుహలలోను బండ బీటలలోను దూరవలెనన్న ఆశతో నరులు తాము పూజించుటకై చేయించుకొనిన వెండి విగ్రహములను సువర్ణ విగ్రహములను ఎలుకలకును గబ్బిలములకును పారవేయుదురు.” యెష 2:17-21.PKTel 514.2

    మానవుడి అహంకారం అణచబడనున్న ఆ సంధి కాలం గురించి యిర్మీయా ఇలా అంటున్నాడు: “నేను భూమిని చూడగా అది నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. ఆకాశము తట్టు చూడగా అచ్చట వెలుగు లేకపోయెను. పర్వతములను చూడగా అవి కంపించుచున్నవి కొండలన్నియు కదలుచున్నవి. నేను చూడగా నరుడొకడును లేకపోయెను, ఆకాశపక్షులన్నియు ఎగిరిపోయి యుండెను. నేను చూచుచుండగా ఫలవంతమైన భూమి ఎడారిగా ఆయెను. అందులోని పట్టణములన్నియు యెహోవా కోపాగ్నికి నిలువలేక ఆయన యెదుట నుండకుండ పడగొట్టబడియుండెను.” “అయ్యో, యెంత భయంకరమైన దినము! అట్టి దినము మరియొకటి రాదు. అది యాకోబు సంతతివారికి ఆపద తెచ్చుదినము. అయినను వారు దానిలో పడకుండ రక్షింపబడుదురు.” యిర్మీయా 4:23-26, 30-7.PKTel 514.3

    దేవుని శత్రువులకు ఉగ్రత దీనమైన ఆ దీనం దేవుని సంఘానికి చివరి విమోచన దినం. ప్రవక్త ఇలా అంటున్నాడు:PKTel 514.4

    “సడలిన చేతులను బలపరచుడి
    తొట్రిల్లు మోకాళ్లను దృఢపరచుడి
    తత్తరిల్లు హృదయములతో ఇట్లనుడి
    -భయపడక ధైర్యముగా ఉండుడి ప్రతిదండన చేయుటకై మా దేవుడు వచ్చుచున్నాడు
    ప్రతి దండనను దేవుడు చేయదగిన ప్రతికారమును
    ఆయన చేయును.”
    PKTel 514.5

    “మరెన్నడును ఉండకుండ మరణమును ఆయన మ్రింగి వేయును. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖముమీది బాష్పబిందువులను తుడిచివేయును. భూమి మిద నుండి తన జనుల నిందను తీసివేయును ఈలాగున జరుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడు.” యెష 35:3,4, 25:8. లోకంలోని జాతుల్లో నుంచి తన శేషించిన సంఘాన్ని పోగు చేసేందుకు తన పరిశుద్ద దూతలందరితో మహిమ ప్రభువు పరలోకం నుంచి దిగివస్తుండగా వేచి ఉన్న భక్తులు పరస్పరం కంఠాలు కలిపి ఉత్సాహ ఉద్వేగాలతో ఇలా అనటం ప్రవక్త విన్నాడు : PKTel 515.1

    “ఇదిగో మనలను రక్షించునని మనము కనిపెట్టుకొని
    యున్న మన దేవుడు
    మనము కనిపెట్టుకొనిన యెహోవా ఈయనే
    ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సహింతము.”
    PKTel 515.2

    యెష 25:9

    నిద్రిస్తున్న భక్తుల్ని లేవమంటూ దైవ కుమారుడు పిలవటం వినిపిస్తుంది. వారు మరణం బందీ గృహంలో నుంచి రావటం ప్రవక్త చూస్తున్నప్పుడు ఆశ్చర్యపోతూ ఇలా అంటాడు, “మృతులైన నీ వారు బ్రదుకుదురు, నా వారి శవములు సజీవములగును. మంటిలో పడియున్న వారలారా, మేల్కొని ఉత్సహించుడి నీ మంచు ప్రకాశమానమైన మంచు భూమి తనలోని ప్రేతలను సజీవులనుగా చేయును.”PKTel 515.3

    “గ్రుడ్డివారి కన్నులు తెరవబడును
    చెవిటివారి చెవులు విప్పబడును
    కుంటివాడు దుప్పివలె గంతులు వేయును
    మూగవారి నాలుకపాడును.”
    PKTel 515.4

    యెష 26:19, 35:5,6.

    పాపాన్ని మరణాన్ని జయించిన వారు ఇప్పుడు రక్షకుని సముఖంలో ఆనందంగా ఉన్నట్లు, ఆదిలో మానవుడు దేవునితో మాట్లాడిన రీతిగా ఆయనతో మాట్లాడ్తున్నట్లు తనకు వచ్చిన దర్శనాల్లో ప్రవక్త చూశాడు. ప్రభువు వారితో ఇలా అంటాడు, “నేను సృజించుచున్న దాని గూర్చి మీరు ఎల్లప్పుడు హర్షించి ఆనందించుడి. నిశ్చయముగా నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగాను ఆమె ప్రజలను హరించువారిగాను సృజించుచున్నాను. నేను యెరూషలేమును గూర్చి ఆనందించెదను. నా జనులను గూర్చి హర్షించెదను. రోదన ధ్వనియు విలాప ధ్వనియు వానిలో ఇకను వినబడదు.” “నాకు దేహములో బాగులేదని అందులో నివసించువాడెవడును అనడు. దానిలో నివసించు జనుల దోషము పరిహరింపబడును.”PKTel 515.5

    “అరణ్యములో నీళ్ళు ఉబుకును
    అడవిలో కాలువలు పారును
    ఎండమావులు మడుగులగును
    ఎండిన భూమిలో నీటి బుగ్గలు పుట్టును.” br/>
    “ముండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు మొలుచును
    దురదగొండి చెట్లకు బదులుగా గొంజి వృక్షములు ఎదుగును.”

    “అక్కడ దారిగానున్న రాజమార్గము ఏర్పడును
    అది పరిశుద్ధ మార్గమనబడును
    అది అపవిత్రులు పోకూడని మార్గము
    అది మార్గమున పోవువారికి ఏర్పరచబడును
    మూడులైనను దానిలో నడచుచు త్రోవను తప్పక
    PKTel 516.1

    యుందురు.”

    “నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి. యెరూషలేముతో ప్రేమగా మాటలాడుడి. ఆమె యుద్ధకాలము సమాప్తమయ్యెను. ఆమె దోష రుణము తీర్చబడెను. యెహోవా చేతివలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండింతలు పొందెనను సమాచారము ఆమెకు ప్రకటించుడి.” యెష 65:18,19; 33:24; 35:6,7; 55:13; 35:8; 40:2.PKTel 516.2

    విమోచన పొందిన జనులు పాపరహితులు శాప చిహ్నాలు లేనివారు అయి ఆనందంగా దేవుని పట్టణంలో నివసించటం తిలకిస్తూ ప్రవక్త ఉత్సాహంతో పొంగిపోతూ ఇలా అంటున్నాడు, “యెరూలేమును ప్రేమించువారలారా, మీరందరు ఆమెతో సంతోషించుడి, ఆనందించుడి.”PKTel 516.3

    “ఇకను నీ దేశమున బలాత్కారమను మాట వినబడదు
    నీ సరిహద్దులలో పాడు అనుమాటగాని నాశనము
    అనుమాటగాని వినబడదు
    రక్షణయే నీకు ప్రాకారములనియు ప్రఖ్యాతియే నీ గుమ్మములనియు నీవు చెప్పుకొందువు

    “ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశము వెలుగుగా
    ఉండదు
    నీకు వెలుగిచ్చుటకై చంద్రుడు ఇకను ప్రకాశింపడు
    యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును
    నీ దేవుడు నీకు భూషణముగా ఉండును

    “నీ సూర్యుడిక అస్తమింపడు
    నీ చంద్రుడు క్షీణింపడు
    యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును
    నీ దుఃఖ దినములు సమాప్తములగును

    “నీ జనులందరు నీతిమంతులై యుందురు
    నిన్ను నేను మహిమపరచుకొనునట్లు
    వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి
    దేశమును శాశ్వతముగా స్వతంత్రించుకొందురు.”
    PKTel 516.4

    యెష. 66:10; 60:18-21.

    అక్కడి సంగీతం ప్రవక్త చెవిని పడింది. దేవుని దర్శనాల్లో తప్ప అలాంటి సంగీతం, గానం ఏ మానవుడి చెవికి ఎన్నడూ వినిపించలేదు. ఏ మానవుడి మనసూ ఎన్నడూ ఊహించలేదు. “యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సీయోనునకు వచ్చెదరు. వారి తలల మీద నిత్యానందముండును. వారు ఆనంద సంతోషములుగలవారై వచ్చెదరు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును.” “ఆనంద సంతోషములును కృతజ్ఞతా స్తుతియు సంగీత గానమును దానిలో వినబడును.” “పాటలు పాడుచు వాద్యములు వాయించు” వారు అక్కడుంటారు. వారు “ఉత్సాహ ధ్వని చేయుదురు యెహోవా మహాత్మ్యమును బట్టి... కేకలు వేయుదురు.” యెష 35:9, 51:3, కీర్త 87:7, యెష 24:14. ఆదియందు ఆదాముకి అవ్వకు వినోదాన్ని ఉల్లాసానందాల్ని సమకూర్చిన వ్యాపకాల్నే విమోచన పొందిన ప్రజలు నూతన భూమిలో చేపడ్డారు. తోటలోను పొలంలోను పనిచేస్తూ ఏదెను జీవితం జీవిస్తారు. “జనులు ఇండ్లుకట్టుకొని వాటిలో కాపురముందురు. ద్రాక్షతోటలు నాటించుకొని వాటి ఫలముల ననుభవింతురు. వారు కట్టుకొన్న యిండ్లలో వేరొకరు కాపురముండరు. వారు నాటుకొన్నవాటిని వేరొకరు అనుభవింపరు. నా జనుల ఆయుష్యము వృక్షాయుష్యమంత యగును. నేను ఏర్పకచుకొనినవారు తాము చేసికొనిన దాని ఫలమును పూర్తిగా అనుభవింతురు.” యెష 65:21,22.PKTel 517.1

    మన శక్తులు అక్కడ వృద్ది చెందుతాయి. సామర్థ్యాలు పెరుగుతాయి. అక్కడ శ్రేష్ఠమైన ఉజ్వలమైన కార్యాలు నిత్యం సాగుతాయి. ఉత్తమమైన ఆశలు ఆశయాలు అభిలాషలు నెరవేరాయి. అయినా ఇంకా అందుకోవాల్సిన నూతన శిఖరాలు, అభినందిచాల్సిన నూతన వింతలు విశేషాలు అవగాహన చేసుకోవలసిన నూతన సత్యాలు, తాజా పఠనాంశాలు ఎన్నో ఉంటాయి. ఇవి శారీరక మానసిక ఆత్మపరమైన శక్తులికి సవాలుగా ఉంటాయి.PKTel 518.1

    ఏ ప్రవక్తలకు ఈ సన్నివేశాల్ని ప్రదర్శించటం జరిగిందో వారు వాటిని పూర్తిగా అవగాహన చేసుకోటానికి ప్రయత్నించారు. వారు వీటిని గూర్చి “పరిశీలించుచు, తమ యందున్న క్రీస్తు ఆత్మ.... యే కాలమును ఎట్టికాలమును సూచించుచు వచ్చెనో దానిని విచారించి పరిశోధించిరి.... మికిప్పుడు తెలుపబడిన యీ సంగతుల విషయమై, తమ కొరకు కాదు గాని మీ కొరకై తాము పరిచర్య చేసిరను సంగతి వారికి బయలు పరచబడెను.” 1 పేతురు 1:10-12. PKTel 518.2

    అవి నెరవేరే కాలం చిట్టచివర్లో ఉన్న మనకు ఆ ఘటనల వివరణ ఎంత ముఖ్యం! ఎంత ఆసక్తికరం! మన మొదటి తల్లిదండ్రులు ఏదెను వదిలి వెళ్లినప్పటి నుంచి, దేవుని బిడ్డలు మెలకువగా ఉండి ఆశతో ఎదురుచూస్తూ ప్రార్ధిస్తూ ఆశించిన ఘటనలు అవి.PKTel 518.3

    సాటి యాత్రిక మహాశయా, మనం ఇంకా కోలాహలం గందరగోళంతో కూడిన ఐహిక కార్యకలాపాల్లో తలమునకలై ఉన్నాం. విమోచనను విశ్రాంతిని ఇవ్వటానికి రక్షకుడు త్వరలో వస్తాడు. దేవుడు తానే చిత్రించిన ఆ బంగారు భావి దృశ్యాన్ని విశ్వాసమూలంగా వీక్షిద్దాం. లోక పాపాల నిమిత్తం మరణించిన ప్రభువు తనను విశ్వసించిన వారందరికి పరదైసు గుమ్మాల్ని తెరుస్తున్నాడు. త్వరలోనే సంఘర్షణ సమాప్తమౌతుంది. విజయం వస్తుంది. మన నిత్యజీవం ఆశలు ఎవరిమీదైతే ఉన్నాయో ఆ ప్రభువును మనం త్వరలో చూస్తాం. ఆయన సముఖంలో ఈ జీవితంలోని మన శ్రమలు బాధలు కష్టాలు లెక్కలోకి రానేరావు. మునుపటివి “మరుగునబడును జ్ఞాపకమునకు రావు.” మా ధైర్యమును విడిచిపెట్టకుడి. దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై, వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమైయున్నది. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది. వచ్చుచున్నవాడు ఆలస్యము చేయకవచ్చును.” “యెహోవా వలన ఇశ్రాయేలు నిత్యమైన రక్షణ పొందియున్నది. మీరు ఎన్నటెన్నటికి సిగ్గుపడకయు విస్మయ మొందకయు నుందురు.” యెష. 45:17.PKTel 518.4

    పైకి చూడండి, పైకి చూడండి. మా విశ్వాసాన్ని పెంచుకోండి. ఈ విశ్వాసం ఇరుకు మార్గం గుండా పట్టణం గుమ్మాల్లోకి విమోచన పొందినవారి మహిమతో నిండిన అనంత భవిష్యత్తులోకి మిమ్మల్ని నడపనివ్వండి. “సహోదరులారా, ప్రభువు రాకడవరకు ఓపిక కలిగియుండుడి, చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వరమును సమకూడువరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టునుగదా. ప్రభువు రాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగియుండుడి. మీ హృదయములను స్థిరపరచుకొనుడి.” యాకోబు 5:7,8.PKTel 519.1

    రక్షణ పొందిన జాతులకు పరలోక ధర్మశాస్త్రం తప్ప వేరే ధర్మశాస్త్రం ఉండదు. అందరూ ఏక కుటుంబ సభ్యులై ఆనందంగా జీవిస్తారు. స్తుతి కృతజ్ఞతార్పణ వస్త్రాలు ధరిస్తారు. ఆ దృశ్యంలో ఉదయ నక్షత్రాలు ఏకంగా కూడి పాడ్డాయి. దేవదూతలు ఉత్సాహానందాలతో కేకలు వేస్తారు. తండ్రి అయిన దేవుడూ క్రీస్తు కలిసి “పాపం ఇక ఉండదు మరణం ఇక ఉండదు” అని ప్రకటిస్తారు.PKTel 519.2

    “ప్రతి అమావాస్య దినమునను ప్రతి విశ్రాంతి దినమునను నా సన్నిధిని మొక్కుటకై సమస్త శరీరులు వచ్చెదరు” అని యెహోవా సెలవిస్తున్నాడు. “యెహోవా మహిమ బయలుపరచబడును ఒకడును తప్పకుండ సర్వశరీరులు దాని చూచెదరు.” “నిశ్చయముగా సమస్త జనులయెదుట ప్రభువుగు యెహోవా నీతిని స్తోత్రమును ఉజ్జీవింపజేయును.” “ఆ దినమున సైన్యములకధిపతియగు యెహోవా శేషించిన తన ప్రజలకు తానే భూషణ కిరణముగా నుండును. సౌందర్యముగల మకుటముగా ఉండును.”PKTel 519.3

    “యెహోవా సీయోనును ఆదరించుచున్నాడు. దాని పాడైన స్థలములన్నిటిని ఆదరించి దాని అరణ్యస్థలములను ఏదేనువలె చేయుచున్నాడు. దాని యెడారి భూములు యెహోవా తోటవలెనగునట్లు చేయుచున్నాడు.” “లెబానోను సౌందర్యము దానికి కలుగును కరెలు షారోనులకున్న సొగసు దానికుండును.” “విడువబడిన దానివని ఇక మీదట నీవనబడవు. పాడైనదని ఇకను నీ దేశమును గూర్చి చెప్పబడదు. హెప్సీబా అని నీకును బ్యూలా అని నీ భూమికిని పేళ్లు పెట్టబడును.... పెండ్లి కుమారుడు పెండ్లి కూతురిని చూచి సంతోషించునట్లు నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషించును.” యెష 66:23, 40:5, 61:11, 28:5, 51:3, 35:2, 62:4,5.PKTel 519.4

    *****

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents