Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
ప్రవక్తలు - రాజులు - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    23 - అష్షూరు చెర

    ఇశ్రాయేలు రాజ్యం చివరి సంవత్సరాలు దౌర్జన్యంతోను రక్తపాతంతోను నిండిఉన్నాయి. ఇలాంటి దౌర్జన్యం రక్తపాతం అహాబు అతడి వంశీయులు పరిపాలన కాలంలోని సంఘర్షణలు అశాంతి సమయాల్లో సైతం చోటు చేసుకోలేదు. రెండు శతాబ్దాలకు పైగా పదిగోత్రాల రాజులు గాలిని విత్తుతూ వచ్చారు. ఇప్పుడు వారు సుడిగాలిని కోస్తున్నారు. సింహాసనం కోసం రాజులు ఒకడి తర్వాత ఒకడు హత్యకు గురిఅయ్యారు. దేవుడు లేని అపహర్తల్ని నాకు అనుకూలులు కాని రాజులను వారు నియమించుకొనియున్నారు. నేనెరుగని అధిపతులను తమకుంచుకొనియున్నారు.” హోషే 8:4. వారు ప్రతీ న్యాయసూత్రాన్నీ పక్కన పెట్టారు. దైవ కృపకు ధర్మకర్తలుగా లోక రాజ్యాలముందు నిలబడవలసినవారు “యెహోవాకు విశ్వాసఘాతకులు” ఒకరి పట్ల ఒకరు విశ్వాస ఘాతకులు అయ్యారు. హోషే 5:7. PKTel 186.1

    పశ్చాత్తాపంలేని ఆ జాతికి రానున్న అపాయాన్ని పూర్తి నాశనాన్ని గూర్చి తీవ్ర మందలింపులద్వారా గుర్తింపు కలిగించటానికి ఆ జాతిని మేల్కొల్పటానికి దేవుడు ప్రయత్నించాడు. హో షేయ, ఆమోసులద్వారా పదిగోత్రాలకు దేవుడు వర్తమానం పంపించి పశ్చాత్తాపపడాల్సిందిగా విజ్ఞప్తి చేసి, తమ అతిక్రమాల్ని కొనసాగిస్తే గొప్ప ప్రమాదం సంభవిస్తుందని హెచ్చరించాడు. హోషేయ ఇలా ప్రకటన చేశాడు, “నీ ప్రవర్తన నాధారము చేసికొని నీ బలాఢ్యులను నమ్ముకొని నీవు చెడుతనపు పంటకై దున్నితివి గనుక మీరు పాపమను కోతకోసి యున్నారు. నీ జనులమిదికి అల్లరి వచ్చును.... ప్రాకారములుగల నీ పట్టణములన్నియు పాడగును... ఉదయకాలమున ఇశ్రాయేలు రాజు కొట్టబడి నిర్మూలమగును.” హోషే 10:13-15.PKTel 186.2

    ఎఫ్రాయిము గురించి ప్రవక్త ఇలా అంటున్నాడు, “అన్యజనులు అతని బలమును మ్రింగివేసినను అది అతనికి తెలియకపోయెను. తన తలమీద నెరసిన వెండ్రుకలు కనబడుచున్నను అది అతనికి తెలియదు.” (ఇశ్రాయేలు గోత్రాల మతభ్రష్టతకు నాయకుడైన ఎఫ్రాయిమును మతభ్రష్ట జాతికి చిహ్నంగా హోషేయ తరచు ప్రస్తావించాడు) “ఇశ్రాయేలీయులు సన్మార్గమును విసర్జించిరి.” “వారు శిక్షింపబడి హింస నొందుదురు.” తమ చెడుతనపు మార్గాల తీవ్ర పర్యవసానాల్ని గ్రహించలేదు గనుక” వారు దేశము విడిచి అన్యజనులలో తిరుగుదురు.” హోషే 7:9; 8:3; 5:11; 9:17.PKTel 186.3

    ఇశ్రాయేలులో నాయకులు కొందరు తమ పరువు ప్రతిష్టలు పోయాయని వాటిని తిరిగి సంపాదించటం అవసరమని భావించారు. అయితే ఆ రాజ్యాన్ని బలహీన పర్చిన ఆచారాలు అభ్యాసాలనుంచి వైదొలగేబదులు తమ దుర్వర్తనలోనే కొనసాగుతూ, తరుణం వచ్చినప్పుడు అన్యులతో చెయ్యి కలిపి రాజ్యాధికారాన్ని హస్త గతం చేసుకో గలమని వారు అతిశయంగా చెప్పుకున్నారు. “తాను రోగి యవుట ఎఫ్రాయిము చూచెను, తనకు పుండుకలుగుట యూదా చూచెను అప్పుడు ఎఫ్రాయిము అషూరీయుల యొద్దకు పోయెను.” “ఎఫ్రాయిము బుద్ధిలేని పిరికి గుండెగల గువ్వయాయెను. వారు ఐగుప్తీయులను పిలుచుకొందురు. అషూరీయులయొద్దకు పోవుదురు.” “జనులు అపూరీయులతో సంధి చేసెదరు.” హోషే 5:13; 7:11; 12:1.PKTel 187.1

    బేతేలు బలిపీఠం ముందు ప్రత్యక్షమైన దైవజనుడి ద్వారా ఏలీయాద్వారా ఎలీషా ద్వారా ఆమోసు హోషేయాల ద్వారా అవిధేయతవల్ల కలిగే దుష్పరిణామాల్ని పదిగోత్రాల ముందు దేవుడు మళ్లీ మళ్లీ ఉంచాడు. అయినా దేవుడు ఎన్ని మందలింపులు ఎన్ని విజ్ఞప్తులు పంపినా ఇశ్రాయేలు ప్రజలు మతభ్రష్టతలో కూరుకుపోయారు. “పెయ్య మొండితనము చూపునట్లు ఇశ్రాయేలువారు మొండితనము చూపియున్నారు.” కనుక “నన్ను విసర్జింపవలెనని నా జనులు తీర్మానము చేసికొనియున్నారు.” అని ప్రభువన్నాడు. హోషే 4:16; 11:7.PKTel 187.2

    తిరుగుబాటుదారులపైకి దేవుడు కఠినమైన తీర్పులు పంపిన దినాలున్నాయి. దేవుడిలా అన్నాడు, “కాబట్టి నేను చేసిన తీర్పులు వెలుగువలె ప్రకాశించునట్లు ప్రవక్తల చేత నేను వారిని కొట్టి బద్దలు చేసియున్నాను, నా నోటిమాటలచేత వారిని వధించి యున్నాను. నేను బలిని కోరనుగాని కనికరమునే కోరుచున్నాను, దహన బలికంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకిష్టమైనది. ఆదాము నిబంధన మిరినట్లు వారు నా యెడల విశ్వాస ఘాతకులైనా నిబంధనను మిరియున్నారు.” హోషే 6:5-7.PKTel 187.3

    “ఇశ్రాయేలువారలారా, యెహోవా మాట ఆలకించుడి.... నీవు నీ దేవుని ధర్మశాస్త్రము మరచితివి గనుక నేనును నీ కుమారులను మరతును. తమకు కలిమి కలిగినకొలది వారు నాయెడల అధిక పాపము చేసిరి గనుక వారి ఘనతను నీచస్థితికి మార్చుదురు.... వారి ప్రవర్తననుబట్టి నేను వారిని శిక్షింతును, వారి క్రియలనుబట్టి వారికి ప్రతీకారము చేతును.” హోషే 4:1, 6-9.PKTel 187.4

    అషూరీయ చెరకు ముందటి శతాబ్దంలోని ద్వితీయార్ధంలో నోవహు దినాల్లోలాగ, దేవున్ని విసర్జించి పూర్తిగా దుర్మార్గాన్ని అనుసరించిన ఇతర యుగాల్లోని ప్రజల్లోలాగ ఇశ్రాయేలీయుల్లో పాపం ప్రబలింది. ప్రకృతిని చేసిన దేవునికి పైగా ప్రకృతిని ఘనపర్చటం, సృష్టికర్తను గాక సృష్టాన్ని పూజించటం నికృష్ట పాపాలికి దారితీసింది. ఇశ్రాయేలు ప్రజలు ఇలా బయలు, అష్టారోతు దేవతల్ని పూజించటంలో ప్రకృతి శక్తులికి సర్వోన్నత గౌరవం చెల్లించినప్పుడు, వారు సమున్నతమైన ఉదాత్తమైన సమస్తమైన వాటినుంచి తమ సంబంధాన్ని తెంచుకుని శోధనలో పడ్డారు. ఆత్మకున్న భద్రతలు నాశనం కావటంతో మోసపోయిన ఆ ఆరాధకులు అడ్డుఅదుపులేకుండా పాపం చేస్తూ తమ హృదయాల్లోని దురావేశాలకు పూర్తిగా లొంగిపోయారు.PKTel 188.1

    తమ యుగంలో ప్రబలిన చిత్రహింసకు, అన్యాయానికి, విలాసాలకి, దుర్మార్గానికి తిని తప్ప తాగటానికి, విచ్చలవిడి వర్తనకి, వ్యభిచారానికి వ్యతిరేకంగా ప్రవక్తలు గళమెత్తారు. కాని వారి నిరసనలు నిరర్థకమయ్యాయి. వారు పాపాన్ని ఖండించటం వ్యర్ధమయ్యింది. “గుమ్మములో నిలిచి బుద్ది చెప్పువారి మీద జనులు పగపట్టుదురు.... యధార్ధముగా మాటలాడు వారిని అసహ్యించుకొందురు.” “దరిద్రులయొద్ద పంట మోపులను పుచ్చుకొనుచు_మీరు వారిని అణగదొక్కుదురు.” ఆమో. 5:10, 12.PKTel 188.2

    యెరొబాము ప్రతిష్టించిన రెండు బంగారు దూడలవల్ల కలిగిన ఫలితాలు అలాంటివి. స్థిరపడ్డ ఆరాధన క్రమంనుంచి మొదటిసారి తొలగటం మరింత నీచమైన విగ్రహారాధనకు నాంది పలికి తుదకు ఆ దేశ ప్రజలందరూ ప్రకృతి ఆరాధనకు పూర్తిగా అంకితం కావటానికి దారితీసింది. ఇశ్రాయేలీయులు తమ సృష్టికర్తను మర్చిపోయి “బహు దుర్మార్గులైరి” హోషే 9:9.PKTel 188.3

    ప్రవక్తలు ఈ చెడుగుల్ని నిరసించి సత్రియలు చేయవలసిందిగా ప్రజలికి విజ్ఞప్తి చేశారు. హోషేయ ఇలా విజ్ఞప్తి చేశాడు, “నీతి ఫలించునట్లు మీరు విత్తనము వేయుడి ప్రేమయను కోత మిరు కోయుడి, యెహోవాను వెదకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మిమీద నీతి వర్షము కురిపించునట్లు ఇది వరకెన్నడును దున్నని బీడు భూమి దున్నుడి.” “నీవు నీ దేవునితట్టు తిరుగవలెను. కనికరమును న్యాయమును అనుసరించుచు ఎడతెగక నీ దేవునియందు నమ్మికనుంచుము.” “ఇశ్రాయేలూ, నీ పాపముచేత నీవు కూలితివి గనుక నీదేవుడైన యెహోవాతట్టుకు తిరుగుము.... మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా - మా పాపములన్నిటని పరిహరింపుము” హోష 10:12; 12:6; 14:1,2.PKTel 188.4

    అతిక్రమాలు చేసినవారికి పశ్చాత్తాపపడటానికి అనేక అవకాశాలు ఇవ్వటం జరిగింది. వారు తీవ్ర మతభ్రష్టతలోను గొప్ప ఆధ్యాత్మిక అవసరంలోను ఉన్నప్పుడు వారికి దేవుడు క్షమాపణ, నిరీక్షణ వర్తమానం పంపాడు. ఆయన అన్నాడు, “ఇశ్రాయేలూ, నీ సహజకర్తనగు నాకు నీవు విరోధివై నిన్ను నీవే నిర్మూలము చేసికొనుచున్నావు. నీ పట్టణములలో దేనియందును నీకు సహాయము చేయకుండ నీ రాజు ఏమాయెను? రాజును అధిపతులను నామీద నియమించుమని నీవు మనవి చేసికొంటివిగదా, నీ అధిపతులు ఏమైరి?” హోషే 13:9,10. PKTel 189.1

    ప్రవక్త ఇలా విజ్ఞాపన చేశాడు, “మనము యెహోవా యొద్దకు మరలుదము రండి, ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును. ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బ్రదికించును. మనము ఆయన సముఖమందు బ్రదుకునట్లు మూడవ దినము ఆయన మనలను స్థిరపరచును. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొందము రండి, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదము రండి, ఉదయము తప్పక వచ్చురీతిని ఆయన ఉదయించును. వర్షమువలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడుపునట్టి తొలకరి వర్పము కడవరి వరమువలె ఆయన మన యొద్దకు వచ్చును.” హోషే 6:1-3.PKTel 189.2

    సాతాను వలలో చిక్కిన పాపుల విమోచనకు యుగాలుగా వస్తున్న ప్రణాళికను విస్మరించిన వారికి ప్రభువు పునరుద్దరణను సమాధానాన్ని ఇస్తానంటున్నాడు. “వారు విశ్వాస ఘాతకులు కాకుండ నేను వారిని గుణపరచుదును. వారి మీదనున్న నా కోపము చల్లారెను, మనస్పూర్తిగా వారిని స్నేహింతును. చెట్టునకు మంచున్నట్లు నేనతనికుందును. తామరపుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధినొందును. లెబానోను పర్వతము దాని వేళ్ళు తన్నునట్లు వారు తమ వేళ్లు తన్నుదురు. అతని కొమ్మలు విశాలముగా పెరుగును, ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును, లెబానోనుకున్నంత సువాసన అతనికుండును. అతని నీడయందు నివసించువారు మరలివత్తురు. ధాన్యమువలె వారు తిరిగి మొలుతురు ద్రాక్షచెట్టువలె వారు వికసింతురు. లెబానోను ద్రాక్షరసము వాసనవలె వారు పరిమళింతురు. ఎఫ్రాయిమూ - బొమ్మలతో నాకిక నిమిత్తమేమి? నేనే ఆలకించుచున్నాను, నేనే ఎఫ్రాయిమూను. గూర్చి విచారణ చేయుచున్నాను, నేను చిగురు పెట్టు సరళవృక్షము వంటి వాడను. నావలననే నీకు ఫలము కలుగును.PKTel 189.3

    “జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు, బుద్ధిమంతులు వాటిని
    గ్రహింతురు
    ఏలయనగా యెహోవా మార్గములు చక్కనివి
    నీతిమంతులు దానిననుసరించి నడచుకొందుదురు
    గాని తిరుగుబాటు చేయువారికి అది అడ్డము గనుక
    తొట్రిల్లుదురు.”
    PKTel 190.1

    హోషే 14:4-9.

    దేవుని వెదకి ఉపకారాలు పొందాల్సిందిగా విజ్ఞప్తి చెయ్యటం జరిగింది. ప్రభువు ఇలా ఆహ్వానించాడు, “నన్నాశ్రయించుడి, నన్నాశ్రయించినయెడల మీరు బ్రదుకుదురు. బేతేలును ఆశ్రయింపకుడి, గిల్గాలులో ప్రవేశింపకుడి, బెయేరెబాకు వెళ్లకుడి, గిల్గాలు అవశ్యముగా చెరపట్టబడిపోవును, బేతేలు శూన్యమగును.”PKTel 190.2

    “మీరు బ్రదుకునట్లు కీడు విడిచి మేలు వెదకుడి; ఆలాగు చేసినయెడల మీరను కొనుచొప్పున దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా మీకు తోడుగా నుండును. కీడును ద్వేషించి మేలును ప్రేమించుచు, గుమ్మములలో న్యాయము స్థిర పరచుడి; ఒకవేళ దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా యోసేపు సంతతిలో శేషించినవారియందు కనికరించును.” ఆమోసు. 5:4,5,14,15.PKTel 190.3

    ఈ ఆహ్వానాలిని విన్నవారిలో ఎక్కువమంది వాటినంగీకరించి లబ్ది పొందటానికి నిరాకరించారు. దైవ సేవకుల మాటలు పశ్చాత్తాపంలేని వారి కోరికలకు భిన్నంగా ఉన్నాయి. గనుక బేతేలులో ఉన్న విగ్రహారాధక యాజకుడు ఇశ్రాయేలు రాజుకి ఈ వర్తమానం పంపాడు, “ఇశ్రాయేలీయులమధ్య ఆమోసు నీ మీద కుట్ర చేయుచున్నాడు... అతని మాటలు దేశము సహింపజాలదు.” ఆమోసు. 7:10.PKTel 190.4

    హోషేయ ద్వారా ప్రభువు ఇలా ప్రకటించాడు, “నేను ఇశ్రాయేలువారికి స్వస్థత కలుగజేయదలంచగా ఎఫ్రాయిము దోషమును షోమ్రోను చెడుతనమును బయలు పడుచున్నది.” “ఇశ్రాయేలుకున్న అతిశయాస్పదము అతనిమీద సాక్ష్యము పలుకును. ఇంత జరిగినను వారు తమ దేవుడైన యెహోవా యొద్దకు తిరుగక యున్నారు. ఆయనను వెదకకయున్నారు.” హోషే 7:1,10.PKTel 190.5

    తరాలు తరబడి ప్రభువు తన అవిధేయ ప్రజలపట్ల సహనం పాటిస్తున్నాడు. ఇప్పుడు సయితం తిరుగుబాటు జరుగుతున్నప్పటికీ రక్షించటానికి సిద్దంగా ఉన్నవానిగా వారికి తన్నుతాను ప్రత్యక్ష పర్చుకోవాలని ఆయన ఇంకా ఆకాంక్షిస్తున్నాడు. ఆయన ఇలా అన్నాడు, “ఎఫ్రాయిమూ, నిన్ను నేనేమి చేతును? యూదా నిన్ను నేనేమి చేతును? తెల్లవారగానే కనబడు మేఘము ఎగిరి పోవునట్లును, ప్రాతఃకాలమున పడు మంచు ఆరిపోవునట్లును మి భక్తి నిలువకపోవును.” హోషే. 6:4.PKTel 190.6

    దేశంలో ప్రబలిన పాపాలు అంతులేనివి. కనుక ఇశ్రాయేలుపై భయంకర తీర్పు ఇది : “ఎఫ్రాయిము విగ్రహములతో కలిసికొనెను, వానిని ఆలాగుననే యుండనిమ్ము.” “శిక్షా దినములు వచ్చేయున్నవి; ప్రతీకార దినములు వచ్చేయున్నవి.... ఇశ్రాయేలు వారు తెలిసికొందురు.” హోషే 4:17; 9:7.PKTel 191.1

    బేతేలులోను దానులోను అన్య బలిపీఠాలు నిర్మించటంతో ప్రారంభమైన మతభ్రష్టత ఫలాల్ని ఇశ్రాయేలు పదిగోత్రాలవారు ఇప్పుడు అనుభవించనున్నారు. వారికి దేవుడు పంపిన వర్తమానం ఇది : “షోమ్రోనూ, ఆయన నీ దూడను (విగ్రహము) విసర్జించెను. నా కోపము వారిమీదికి రగులుకొనెను. ఎంతకాలము వారు పవిత్రత నొందజాలకుందురు? అది ఇశ్రాయేలువారిచేతి పనియేగదా? కంసాలి దానిని చేసెను, అది దైవము కాదుగదా? షోమ్రోను చేసికొనిన యీ దూడ ఛిన్నాభిన్నములగును.” “బేతావెనులోనున్న దూడ విషయమై షోమ్రోను నివాసులు భయపడుదురు, దాని ప్రభావము పోయెనని ప్రజలును, సంతోషించుచుండిన దాని అర్చకులును దుఃఖింతురు.... అది అష్షూరు దేశములోనికి కొనిపోబడి రాజైన యారేబునకు (సనెరీబుకు) కానుకగా ఇయ్యబడును.” హోషే. 8:5,6; 10:5,6.PKTel 191.2

    “ప్రభువైన యెహోవా కన్ను ఈ పాపిష్టి రాజ్యము మిదనున్నది. దానిని భూమి మీద ఉండకుండ నాశనము చేతును. అయితే యాకోబు సంతతివారిని సర్వనాశనము చేయ విడిచిపెట్టుదును; ఇదే యెహోవా వాక్కు నేనాజ్ఞ ఇయ్యగా ఒకడు ధాన్యము జల్లెడతో జల్లించినట్లు ఇశ్రాయేలీయులను అన్యజనులందరిలో జల్లింతును గాని యొక చిన్న గింజైన నేలరాలదు. - ఆ కీడు మనలను తరిమిపట్టదు, మనయొద్దకు రాదు అని నా జనులలో అనుకొను పాపాత్ము లందరును ఖడ్గముచేత చత్తురు.PKTel 191.3

    దంతపు నగరులును లయగమును; బహు నగరులు పాడగును; ఇదే యెహోవా వాక్కు” “ఆయన సైన్యములకధిపతియగు యెహోవా, ఆయన భూమిని మొత్తగా అది కరిగిపోవును. అందులోని నివాసులందరును ప్రలాపింతురు.” “నీ కుమారులును కుమార్తెలును ఖడ్గముచేత కూలుదురు. నీ భూమి నూలుచేత విభాగింపబడును, నీవు అపవిత్రమైన దేశమందు చత్తువు; అవశ్యముగా ఇశ్రాయేలీయులు తమ దేశము విడిచి చెరగొనబడుదురు.” “మియెడల నేనీలాగునే చేయుదును గనుక ఇశ్రాయేలీయులారా, మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్దపడుడి.” ఆమోసు. 9:8-10; 3:15; 9:5; 7:17; 4:12.PKTel 191.4

    ప్రవచితమైన ఈ తీర్పుల అమలును కొంతకాలంవరకు నిలుపు చెయ్యటం జరిగింది. రెండో యరొబాము దీర్ఘ పరిపాలన కాలంలో ఇశ్రాయేలు సైన్యాలు విశేష విజయాలు సాధించాయి. అయితే ఈ అభ్యుదయ నిదర్శనం పశ్చాత్తాపంలేని ఆ ప్రజల హృదయాల్లో మార్పు కలిగించలేదు. కనుక చివరికి “యరొబాము ఖడ్గముచేత చచ్చుననియు ఇశ్రాయేలీయులు తమ దేశమును విడిచి చెరలోనికి పోవుదురనియు” దేవుని ఆదేశమయ్యింది. ఆమోసు. 7:11.PKTel 192.1

    ప్రవక్త నిర్భయంగా చేసిన ఈ ప్రకటన రాజుల్లోగాని ప్రజల్లోగాని ఎలాంటి మార్పు కలిగించలేదు. పశ్చాత్తాపంలేని వారి హృదయాలు అంత బండబారి పోయాయి. బేతేలులోని విగ్రహారాధక యాజకుల నాయకుడైన అమజ్యా తమ జాతికీ తమ రాజుకీ వ్యతిరేకంగా ఆమోసు పలికిన మాటలకి ఉద్రిక్తుడై ఆమోసుతో ఇలా అన్నాడు, “దీర్ఘదర్శీ, తప్పించుకొని యూదా దేశమునకు పారిపొమ్ము. అచ్చటనే బత్తెము సంపాదించుకొనుము. అచ్చటనే నీవార్త ప్రకటించుము. బేతేలు, రాజుయొక్క ప్రతిష్ఠిత స్థలము రాజధాని పట్టణమైయున్నందున నీవికను దానిలో నీవార్త ప్రకటన చేయకూడదు.” 12,13 వచనాలు.PKTel 192.2

    దీనికి ప్రవక్త తీవ్రంగా స్పందించాడు : “ఆవశ్యముగా ఇశ్రాయేలీయులు తమ దేశము విడిచి చెరగొనబడుదురు.” 17వ వచనం.PKTel 192.3

    భ్రష్ట గోత్రాల గురించి ప్రవక్త పలికిన మాటలు అక్షరాల నెరవేరాయి. అయినా ఆ రాజ్య వినాశనం క్రమక్రమంగా జరిగింది. తీర్పు అమలులో ప్రభువు కనికరాన్ని మర్చిపోలేదు. మొదట “అష్షూరు రాజైన పూలు దేశముమీదికి” వచ్చినప్పుడు ఇశ్రాయేలు రాజైన మెన హేముని చెరపట్టలేదు. అతణ్ని సింహాసనంపైనే ఉంచి అషూరుకి బానిసరాజుగా కొనసాగనిచ్చాడు. “మెనహేము ఇశ్రాయేలులో భాగ్యవంతులైన గొప్పవారిలో ప్రతి మనిషి యొద్దను ఏబదేసి తులముల వెండి వసూలుచేసి యీ ద్రవ్యమును అష్షూరు రాజునకిచ్చెను.” 2 రాజులు 15:19,20. పదిగోత్రాల గర్వం అణచివేసిన మిదట అషూరీయులు కొంతకాలంపాటు తమ దేశానికి తిరిగి వెళ్లారు.PKTel 192.4

    తన రాజ్యాన్ని నాశనంచేసిన పాపానికి పశ్చాత్తాపపడకుండా మినహేము “ఇశ్రాయేలువారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపములను” కొనసాగించాడు. అతడి తర్వాత పాలకులు పెకహ్య, పెకహులు కూడా “యెహోవా దృష్టికి చెడుతనము” జరిగించారు. 18,24,28 వచనాలు. ఇరవై సంవత్సరాలు పరిపాలించిన “పెకహు దినములలో) అష్పూరు రాజైన తిగ్గతిలేసరు ఇశ్రాయేలు మీదికి దండెత్తి, గలిలయలోను, యోర్దానుకు తూర్పు ప్రాంతంలోను నివసిస్తున్న గోత్రాలలోనుంచి అనేకమందిని బానిసలుగా చెరపట్టుకుపోయాడు. “రూబేనీయులను గాదీయులను మనష్షే అర్ధగోత్రపువారిని” వారితోపాటు “గిలాదు... గలిలయ... నఫాలి” దేశాలనుంచి అనేకమందిని చెరగా తీసుకుపోయాడు. వారు పాలస్తీనాకు దూరంగా ఉన్న ఆయా అన్యదేశాలకు చెదరిపోయారు.PKTel 192.5

    ఉత్తరరాజ్యం ఈ దెబ్బనుంచి ఎన్నడూ కోల్కోలేదు. బలహీనులై మిగిలి ఉన్నవారు ఇక ఏ మాత్రం అధికారం లేకపోయినా ప్రభుత్వ పాలన తతంగాన్ని కొనసాగించారు. పెకహు తర్వాత హో షేయ అనే ఒక్క రోజు మాత్రమే ఏలాల్సి ఉంది. ఆ తర్వాత ఆ రాజ్యం ఇక ఎన్నడూ లేకుండ తుడుచుకుపోవాల్సి ఉంది. ఆ దుఃఖకాలంలో దేవుడు వారిపై జాలిపడ్డాడు. విగ్రహారాధన నుంచి వెనుదిరగటానికి వారికి మరో తరుణం ఇచ్చాడు. హో షేయ పరిపాలన మూడో సంవత్సరంలో దైవభక్తిగల హిజ్కియా యూదాను పరిపాలించటం మొదలుపెట్టాడు. యెరూషలేము దేవాలయ సేనల్లో దిద్దుబాటు తేవటానికి హిజ్కియా సాధ్యమైనంత త్వరగా పూనుకున్నాడు. పస్కాపండుగ జరపటానికి ఏర్పాట్లు చేశాడు. హిజ్కియా తన ఏలుబడికింద ఉన్న యూదా బైన్యామిను గోత్రాల్నే గాక ఉత్తర రాజ్యంలోని గోత్రాలన్నిటిని ఈ పండుగకు ఆహ్వానించాడు. “బహుకాలము నుండి వారు వ్రాయబడిన ప్రకారము ఇంత ఘనముగా నాచరింపకుండుట చూచి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు యెరూషలేములో పస్కాపండుగ ఆచరించుటకై రావలసినదని బెయేరెబా మొదలుకొని దాను వరకు ఇశ్రాయేలీయులుండు దేశమంతటను చాటింపవలెనని” నిర్ణయించారు.PKTel 193.1

    “కావున అంచెవాండ్రు రాజునొద్దను అతని అధిపతులయొద్దను తాకీదులు తీసికొని, యూదా ఇశ్రాయేలు దేశములందంతట సంచరించి రాజాజ్ఞను ఈలాగు ప్రచురము చేసిరి - ఇశ్రాయేలువారలారా, అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలు దేవుడైన యెహోవావైపు తిరుగుడి. మీరు తిరిగినయెడల మీలో అష్పూరు రాజుల చేతిలోనుండి తప్పించుకొని శేషించినవారివైపు ఆయన తిరుగును. మీరు యెహోవావైపు తిరిగిన యెడల మీ సహోదరులయెడలను మీ పిల్లల యెడలను చెరతీసికొనిపోయిన వారికి కనికరము పుట్టును. వారు మీ దేశమునకు తిరిగి వచ్చెదరు. మీ దేవుడైన యెహోవా కరుణా కటాక్షములు గలవాడు గనుక మీరు ఆయనవైపు తిరిగినయెడల ఆయన మీయందు ప్రసన్నుడగును.” 2 దిన వృ. 30:5-9.PKTel 193.2

    “జెబూలూను దేశమువరకును, ఎయిము మనషేల దేశములలోనున్న ప్రతి పట్టణమునకును” హిజ్కియా పంపిన ఆహ్వానాన్ని అంచెగాండ్రు అందించారు. పశ్చాత్తాపపడి దేవుని తట్టుకి తిరగటానికి విజ్ఞప్తిని ఈ ఆహ్వానంలో ఇశ్రాయేలువారు చూడాల్సింది. ఒకప్పుడు వృద్ధిలో ఉన్న ఉత్తర రాజ్యంలో ఇంకా నివసిస్తూ ఉన్న పదిగోత్రాల్లో శేషించిన ప్రజలు యూదానుంచి వచ్చిన రాజు దూతలపట్ల ఉదాసీనంగా, ధిక్కార వైఖరితో వ్యవహరించారు. “అచ్చటివారు ఎగతాళి చేసివారిని అపహసించిరి.” కాగా కొందరు సంతోషంగా ప్రతిస్పందించారు. “అయినను ఆషేరు మనష్షే జేబులూను దేశముల వారిలో నుండి కొందరు కృంగిన మనస్సుతో యెరూషలేమునకు వచ్చిరి.... పులియని రొట్టెల పండుగ ఆచరించుటకై” వచ్చారు. 10-13 వచనాలు.PKTel 193.3

    సుమారు రెండు సంవత్సరాల తర్వాత అష్షూరు రాజైన షల్మనే సెరు సైన్యం షోమ్రోను పైకి దండెత్తింది. అప్పుడు జరిగిన ముట్టడిలో ఆకలివల్ల వ్యాధివల్ల ఖడ్గంవల్ల వేలప్రజలు మరణించారు. ఆ పట్టణం ఆ జాతి పతనమయ్యాయి. పదిగోత్రాల్లోని శేషించిన ప్రజల్ని చెరగా తీసుకుపోయారు. వారు అష్పూరు. రాజ్యంలోని ఆయా ప్రాంతాలకు చెదిరిపోయారు.PKTel 194.1

    ఉత్తర రాజ్యానికి సంభవించిన నాశనం దేవుడు విధించిన ప్రత్యక్ష శిక్ష. తన కార్యాన్ని నెరవేర్చటానికి దేవుడు అషూరీయుల్ని తన సాధనంగా వినియోగించు కున్నాడు. షోమ్రోను పతనానికి కొంచెం ముందు తన ప్రవచన పరిచర్యను ప్రారంభించిన యెషయా ద్వారా ప్రభువు అపూరీయుల సైన్యాన్ని “నా కోపమునకు సాధనమైన దండము”గా ప్రస్తావించాడు. “వారి చేతిలోని దుడ్డుకర్ర” “నా ఉగ్రత”గా వ్యవహరించాడు. యెష. 10:5.PKTel 194.2

    ఇశ్రాయేలీయులు తమ దేవుడైన యెహోవా దృష్టికి పాపము” చేసి “చెడుతనము జరిగించారు. వారు విననివారై.... ఆయన కట్టడలను, తమ పితరులతో ఆయన చేసిన నిబంధనను, ఆయన తమకు నిర్ణయించిన ధర్మశాస్త్రమును” విసర్జించారు. వారు “తమ దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నిటిని అనుసరింపక పోత విగ్రహములైన రెండు దూడలను చేసి దేవతా స్తంభములను నిలిపి ఆకాశ సమూహమునకు నమస్కరించి బయలు దేవతను పూజించి పశ్చాత్తాప పడటానికి నిరాకరించారు గనుక తన సేవకులైన ప్రవక్తలద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఆయన “వారిని శ్రమపెట్టి దోపుడుగాండ్ల చేతికప్పగించి, వారిని తన సముఖమునుండి వెళ్లగొట్టెను.”PKTel 194.3

    “తమ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట విననివారై ఆయన నిబంధనకును ఆయన సేవకుడైన మోషే ఆజ్ఞాపించిన దానికంతటికిని లోబడక అతిక్రమించి యుండిరి.” గనుక “వారు తమ స్వదేశములోనుండి అష్షూరు దేశములోనికి చేరగొని పోబడిరి.” 2 రాజులు. 17:7,11,14-16, 20,23; 18:11.PKTel 194.4

    పదిగోత్రాలపై విధించిన భయంకర తీర్పుల్లో దేవునికి జ్ఞానంతోను కరుణతోను నిండిన ఉద్దేశం ఉంది. తమ పితరుల దేశంలో వారిద్వారా ఏ పనిని ఇక నిర్వహించలేడో దాన్ని అన్యులమధ్యకు వారిని చెదరగొట్టటంద్వారా నిర్వహించటానికి ఆయన పూను కుంటాడు. మానవాళి రక్షకుడైన క్రీస్తుద్వారా పాప క్షమాపణ పొందగోరే వారందరి రక్షణకు ఆయన రూపొందించిన రక్షణ ప్రణాళిక ఇంకా నెరవేరాల్సి ఉంది. ఇశ్రాయేలు వారికి కలిగించిన శ్రమల్లో, లోకానికి తన మహిమ వెల్లడి కావటానికి ఆయన మార్గం సిద్దం చేస్తున్నాడు. చెరకు గురి అయిన వారందరూ పశ్చాత్తాపం లేనివారు కారు. వారిలో కొందరు దేవునికి నమ్మకంగా ఉన్నారు. ఇతరులు ఆయన ముందు తమ్మును తాము తగ్గించుకుని ఆయనకి విధేయులయ్యారు. “జీవముగల దేవుని కుమారులైన” వీరిద్వారా (హోషే 1:10). అష్షూరు రాజ్యంలో వేలమంది ఆయన ప్రవర్తనను, గుణ లక్షణాల్ని గూర్చిన జ్ఞానం, ఆయన ధర్మశాస్త్రం చేసే ఉపకారాన్ని గూర్చిన జ్ఞానం పొందనున్నారు.PKTel 195.1