Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
ప్రవక్తలు - రాజులు - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    2 - దేవాలయం - దాని ప్రతిష్ఠ

    దేవునికి ఒక ఆలయం నిర్మించాలని దీర్ఘకాలంగా దావీదు కన్న కలను సొలొమోను నెరవేర్చాడు. దీక్షగా పనిచేస్తున్న పనివారు యెరూషలేములో ఏడు సంవత్సరాలున్నారు. ఆలయానికి ఎంపికైన స్థలాన్ని చదును చెయ్యటం, విశాలమైన గోడల్ని నిర్మించటం, విశాలమైన పునాదులు వేయటం, “చెక్కిన రాళ్లతో వేయుటకు గొప్ప రాళ్లను మిక్కిలి వెలగల రాళ్లను’ తేవటం, లెబానోను అడవులనుంచి తెచ్చిన కలపను రూపుదిద్దటం - ఇలా ఆలయాన్ని నిర్మించటంలో వారు తలమునకలై ఉన్నారు. 1 రాజులు. 5:17. PKTel 10.1

    చెక్క రాయి తయారీతోపాటు ఆలయానికి చెక్క సామగ్రి తయారీ తూరువాడైన హూరాము నాయకత్వం కింద చురుకుగా సాగాయి. అతడు “బంగారముతోను, వెండితోను, ఇత్తడితోను, ఇనుముతోను, రాళ్లతోను, మానులతోను, ఊదా నూలుతోను, నీలినూలుతోను, సన్నపు నూలుతోను, ఎట్టి నూలుతోను పనిచేయగల నేర్పరి.” 2 దిన వృ. 2:13,14.PKTel 10.2

    మోరీయా పర్వతంమీద “ముందుగా సిద్దపరచి తెచ్చిన రాళ్లతో ... మందిరము కట్టు స్థలమున సుత్తె గొడ్డలి మొదలైన యినుప పనిముట్ల ధ్వని” లేకుండా ఇలా ఆలయం నిర్మాణమవుతుండగా, “దేవుని మందిరమునకు కావలసిన ఉపకరణము లన్నిటిని”, అందమైన అమరికల్ని దావీదు తన కుమారుడికి అందించిన నమూనా ప్రకారం తయారుచేశారు. 1 రాజులు. 6:7, 2 దిన వృ. 4:19. వీటిలో ధూపవేదిక, సముఖపు రొట్టెల బల్ల, దీపస్తంభం ప్రదీపాలు వాటితోపాటు పరిశుద్ధ స్థలంలో యాజకుల పరిచర్యకు సంబంధించిన “మేలిమి బంగారముతో చేసిన పాత్రలు, ఉపకరణాలు ఉన్నాయి. 2 దిన వృ. 4:21. కంచు ఉపకరణాలు - దహన బలిపీఠం, సముద్రపు తొటి. దానికింద ఉండే పన్నెండు ఎద్దులు, చిన్న చిన్న మట్లు వాటిమీద ఉండే తొట్లు “యోర్దాను మైదానమందు సుక్కోతునకును, జెరేదాతాకును మధ్యను జిగటమంటి భూమియందు రాజు వాటిని పోతపోయించెను.” 2 దిన వృ. 4:17. ఎలాంటి లోటు ఉండకుండేందుకు ఈ ఉపకరణాల్ని సమృద్ధిగా తయారు చేశారు.PKTel 10.3

    దేవుని ఆరాధన నిమిత్తం సొలొమోను అతడి అనుచరులు నిర్మించిన రమ్యమైన, దేదీప్యమానమైన దేవాలయం రాజ భవన వైభవాన్ని పుణికి పుచ్చుకున్నది. విలువైన ప్రశస్తమైన మణులు మాణిక్యాలతో అలంకరించబడి విశాలమైన ఆవరణాలు, దేవదారు వృక్షాల చిత్రాలు తళతళ మెరుస్తున్న బంగారం పొదిగిన ద్వారాలతో, నగిషీ అల్లికలు గలిగి వేలాడ్తున్న తెరలతో విలువైన ఉపకరణాలతో అలరారుతున్న దేవాలయ భవనం భూమిపై సజీవ దైవ సంఘానికి సరియైన చిహ్నం. ఈ సంఘం దేవుడిచ్చిన నమూనా ప్రకారం యుగాల పొడవున నిర్మాణమవుతున్నది. దాని నిర్మాణ వస్తువు “నగరునకై చెక్కబడిన మూలకంబములు,” “బంగారము, వెండి, వెలగల రాళ్ల”తో పోల్చబడుతున్నాయి. 1 కొరిం. 3:12, కీర్త. 144:12. ఈ ఆధ్మాత్మికాలయం క్రీస్తు “ముఖ్య మూలరాయియై యుండగా ... ఆయనలో చక్కగా అమర్చబడి, ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది.” ఎఫె. 2:20,21.PKTel 11.1

    కడకు దావీదు సంకల్పించిన, అతడి కుమారుడు సొలొమోను నిర్మించిన దేవాలయం పూర్తి అయ్యింది. “యెహోవా మందిరమందు ... తాను ఆలోచించిన దంతయు ఏ లోపమును లేకుండ (సొలొమోను) నెరవేర్చి పని ముగించెను.” 2 దినవృ. 7:11. ఇప్పుడు మోరీయా పర్వతానికి కిరీటంలా ఉన్న భవనం దావీదు ఆశించినట్లు “మనుష్యునికి కాదు దేవుడైన యెహోవాకే” (1 దిన వృ. 29:1) నివాస స్థలం అవ్వటానికి దాన్ని లాంఛనంగా యెహోవా ఆరాధన స్థలంగా ప్రతిష్ఠించటం మిగిలిఉంది.PKTel 11.2

    దేవాలయం నిర్మితమైన స్థలం చాలాకాలంగా పరిశుద్ధ స్థలంగా పరిగణన పొందింది. విశ్వాసులికి తండ్రి అయిన అబ్రహాము యెహోవా ఆజ్ఞానుసారంగా తన ఏకైక కుమారుణ్ని బలి ఇవ్వటానికి తన సంసిద్ధతను కనపర్చింది ఈ స్థలంలోనే. అబ్రహాముకి తన దీవెనను గూర్చిన నిబంధనను దేవుడు నవీకరించింది ఈ స్థలంలోనే. దైవకుమారుని ప్రాణత్యాగం ద్వారా మానవాళి విమోచన నిమిత్తం రానున్న మెస్సీయాను గూర్చిన వాగ్దానం ఆ నిబంధనలో నిక్షిప్తమై ఉంది. ఆది. 22:9, 16-18 చూడండి. మరణదూత ఖడ్గాన్ని తప్పించుకోటానికి దావీదు దహన బలిని, సమాధాన బలిని అర్పించినప్పుడు దేవుడు ఆకాశంనుంచి అతనికి అగ్నితో సమాధాన మిచ్చింది ఇక్కడే. 1 దిన వృ. 21 చూడండి. యెహోవా ఆరాధకులు తమ అర్పణలను సమర్పించుకోటానికి తమ విశ్వసనీయతను నవీకరించుకోటానికి తమ దేవుణ్ని ఇక్కడ మరోసారి కలవనున్నారు.PKTel 11.3

    ఆలయ ప్రతిష్టకు ఎంపిక చేసుకున్న సమయం మిక్కిలి అనుకూల సమయం. అది దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు పర్ణశాలల పండుగకు యెరూషలేములో సమావేశమయ్యే సమయం - ఏడోమాసం. ఇది ప్రధానంగా ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగ. పంటను కోసి కూర్చటం, పని ముగిసిపోవటం, కొత్త సంవత్సరం వ్యవసాయం ఇంకా ప్రారంభం కాకపోవటంతో ప్రజలు చింతలు లేకుండా పరిశుద్ధ విషయాలపై శ్రద్ధ చూపే సమయమది.PKTel 11.4

    నిర్ణీత సమయం అయినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు, విలువైన వస్త్రాలు ధరించిన అనేకమంది విదేశీ ప్రతినిధులు ఆలయం ఆవరణంలో సమావేశ మయ్యారు. ఆ దృశ్యం ఎంతో వైభవంగా ఉంది. ఇశ్రాయేలు పెద్దలతోను, పురజనుల్లో ప్రాధాన్యంగల వారితోను కలిసి పట్టణం మరో భాగంనుంచి సొలొమోను వచ్చాడు. అక్కడనుంచి వారు నిబంధన మందసం తీసుకువచ్చారు. “మందసమును సమాజపు గుడారమును గుడారమందుండు ప్రతిష్ఠితములగు ఉపకరణములన్నిటిని (2 దిన వృ. 5:6) గిబియోను ఉన్నత స్థలంలో ఉన్న గుడారంనుంచి తీసుకువచ్చారు.PKTel 12.1

    దేవుడు రాతి పలకలపై తన వేలితో రాసిన పది ఆజ్ఞలుగల పరిశుద్ధ మందసాన్ని దేవాలయానికి తీసుకురావటంలో సొలొమోను తన తండ్రి దావీదు మాదిరిని అనుసరించాడు. ప్రతీ ఆరు అడుగులికీ ఒక బలిని అర్పించాడు. పాటలతోను, సంగీతంతోను, నిష్టాగరిష్టమైన ఆచారంతోను “యాజకులు యెహోవా నిబంధన మందసమును తీసికొని గర్భాలయమగు అతిపరిశుద్ధ స్థలమందు ... ఉంచిరి.” 7వ వచనం. గర్భాలయంనుంచి బయటికి వచ్చేటప్పుడు వారు తమతమ నియమిత స్థానాల్లో ఉన్నారు. తెల్లని వస్త్రాలు ధరించి, తాళాలు, తంబురలు, వీణలతో లేవీయులు, పాటలు పాడేవారు బలిపీఠం తూర్పుకొనవద్ద నిలబడి ఉన్నారు. వారితో నూట ఇరవైమంది యాజకులు బూరలు ఊదుతూ నిలబడ్డారు. 12వ వచనం చూడండి.PKTel 12.2

    “బూరలు ఊదువారును, పాటకులును, ఏక స్వరముతో యెహోవాకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుచు గానము చేయగా యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయలువెళ్లి ఆ బూరలతోను, తాళములతోను, వాద్యములతోను కలిపి స్వరమెత్తి - యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని స్తోత్రము చేసిరి. అప్పుడొక మేఘము యెహోవా మందిరము నిండ నిండెను; యెహోవా తేజస్సుతో దేవుని మందిరము నిండుకొనగా సేవ చేయుటకు యాజకులు ఆ మేఘమున్నచోట నిలువలేకపోయిరి.” 13,14 వచనాలు.PKTel 12.3

    ఈ మేఘం ప్రాముఖ్యాన్ని గుర్తించి సొలొమోను ఇలా ప్రకటించాడు, “గాఢాంధ కారమందు నేను నివాసము చేయుదునని యెహోవా సెలవిచ్చి యున్నాడు. నీవు నిత్యము కాపురముండుటకై నిత్యనివాస స్థలముగా నేనొక ఘనమైన మందిరమును నీకు కట్టించి యున్నాను.” 2 దిన వృ. 6:1,2.PKTel 12.4

    “యెహోవా రాజ్యము చేయుచున్నాడు జనములు వణకును
    ఆయన కెరూబులమీద ఆసీనుడైయున్నాడు భూమి కదలును
    సీయోనులో యెహోవా మహోన్నతుడు
    జనములన్నిటిపైన ఆయన హెచ్చియున్నాడు
    భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించెదరు
    యెహోవా పరిశుద్దుడు ....
    “మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి
    ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడుడి
    ఆయన పరిశుద్దుడు.”
    PKTel 13.1

    కీర్తనలు 99:1-5.

    దేవాలయం “ముంగిటి ఆవరణమునందు” “అయిదు మూరల పొడవును అయిదు మూరల వెడల్పును మూడు మూరల యెత్తునుగల యిత్తడి చప్పరమును” లేక వేదికను నిర్మించారు. సొలొమోను దీనిమీద నిలబడి చేతులు పైకెత్తి తన ముందున్న విస్తారమైన ప్రజా సమూహాన్ని ఆశీర్వదించాడు. “ఇశ్రాయేలీయుల సమాజకు లందరును నిలిచుండి”. 2 దిన వృ. 6:13,3.PKTel 13.2

    సొలొమోను ఇలా అన్నాడు, “నా నామముండుటకై యొక మందిరమును కట్టింపవలెనని” “నా తండ్రియైన దావీదునకు మాట యిచ్చి, తానే స్వయముగా నెరవేర్చిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక.” 4-6 వచనాలు.PKTel 13.3

    అప్పుడు సొలొమోను వేదికపై మోకరించి ప్రజలందరికీ వినిపించేటట్లు ప్రతిష్ట ప్రార్థన చేశాడు. సభలోని వారందరు తలలువంచి కళ్లు మూసుకుని ఉండగా సొలొమోను తన చేతులు పైకెత్తి ఇలా విజ్ఞాపన చేశాడు, “యెహోవా, ఇశ్రాయేలీయుల దేవా, హృదయ పూర్వకముగా నిన్ను అనుసరించు నీ భక్తులకు నిబంధనను నెరవేర్చుచు కృపచూపుచునుండు నీవంటి దేవుడు ఆకాశమందైనను, భూమి యందైనను లేడు.”PKTel 13.4

    “మనుష్యులతో కలిసి దేవుడు భూమియందు నివాసము చేయునా? ఆకాశమును మహాకాశమును నిన్ను పట్టజాలవే; నేను కట్టిన యీ మందిరము నిన్ను పట్టునా? దేవా యెహోవా, నీ సేవకుడు నీ సన్నిధిని చేయు ప్రార్ధనయందును విన్నపమునందును లక్ష్యముంచి, నీ సేవకుడనైన నేను చేయు ప్రార్ధనను పెట్టు మొట్టను ఆలకించుము. నీ సేవకులు ఈ స్థలము తట్టు తిరిగి చేయు విన్నపము వినుటకై - నీ నామమును అచ్చట ఉంచెదనని నీవు సెలవిచ్చిన స్థలముననున్న యీ మందిరముమీద నీ కనుదృష్టి రాత్రింబగళ్లు నిలుచునుగాక. నీ సేవకుడును నీ జనులైన ఇశ్రాయేలీయులును ఈ స్థలము తట్టు తిరిగి చేయబోవు ప్రార్థనలను నీవు ఆలకించుము, ఆకాశముననున్న నీ నివాస స్థలమందు ఆలకించుము, ఆలకించునప్పుడు క్షమించుము....PKTel 13.5

    “నీ జనులైన ఇశ్రాయేలీయులు నీ దృష్టియెదుట పాపము చేసినవారై తమ శత్రువుల బలమునకు నిలువలేక పడిపోయినప్పుడు, వారు నీయొద్దకు తిరిగివచ్చి నీ నామమును ఒప్పుకొని, యీ మందిరమునందు నీ సన్నిధిని ప్రార్థించి విన్నపము చేసిన యెడల ఆకాశమందు నీవు విని, నీ జనులైన ఇశ్రాయేలీయులు చేసిన పాపమును క్షమించి, వారికిని వారి పితరులకును నీవిచ్చిన దేశమునకు వారిని మరల రప్పించుదువుగాక.PKTel 14.1

    “వారు నీ దృష్టి యెదుట పాపము చేసినందున ఆకాశము మూయబడి వాన కురియకున్నప్పుడు, వారు ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేసి నీ నామమును ఒప్పుకొని, నీవు వారిని శ్రమ పెట్టినప్పుడు వారు తమ పాపములను విడిచిపెట్టి తిరిగిన యెడల ఆకాశమందున్న నీవు ఆలకించి, నీ సేవకులు నీ జనులునగు ఇశ్రాయేలీయులు చేసిన పాపమును క్షమించి, వారు నడువవలసిన మంచి మార్గము వారికి బోధించి, నీవు నీ జనులకు స్వాస్థ్యముగా ఇచ్చిన నీ దేశమునకు వాన దయచేయుదువు గాక.PKTel 14.2

    “దేశమునందు కరువుగాని, తెగులుగాని కనబడినప్పుడైనను, గాలు దెబ్బగాని, చిత్తపట్టుటగాని తగిలినప్పుడైనను, మిడతలు గాని, చీడ పురుగులుగాని దండు దిగినప్పుడైనను, వారి శత్రువులు వారి దేశపు పట్టణములలో వారిని ముట్టడి వేసినప్పుడైనను, ఏ బాధగాని యే రోగముగాని వచ్చినప్పుడైనను, ఎవడైనను ఇశ్రాయేలీయులగు నీ జనులందరు కలిసియైనను, నొప్పిగాని కష్టముగాని అనుభవించుచు, ఈ మందిరము తట్టు చేతులు చాపి చేయు విన్నపములన్నియు, ప్రార్థనలన్నియు నీ నివాస స్థలమైన ఆకాశమునుండి నీవు ఆలకించి క్షమించి నీవు మా పితరుల కిచ్చిన దేశమందు వారు తమ జీవిత కాలమంతయు నీయందు భయభక్తులు కలిగి నీ మార్గములలో నడుచునట్లుగా వారివారి హృదయములను ఎరిగియున్న నీవు వారి సకల ప్రవర్తనకు తగినట్లు ప్రతిఫలమును దయచేయుదువు గాక.PKTel 14.3

    “మరియు నీ జనములైన ఇశ్రాయేలీయుల సంబంధులు కాని అన్యులు నీ ఘనమైన నామమునుగూర్చియు, చాచిన చేతులను గూర్చియు వినినవారై, దూర దేశమునుండి వచ్చి ఈ మందిరము తట్టు తిరిగి విన్నపము చేయునపుడు నీ నివాస స్థలమగు ఆకాశమునుండి నీవు వారి ప్రార్థన నంగీకరించి, నీ జనులగు ఇశ్రాయేలీయులు తెలిసికొనునట్లు భూజనులందరును నీ నామమును తెలిసికొని, నీయందు భయభక్తులు కలిగి నేను కట్టిన యీ మందిరమునకు నీ పేరు పెట్టబడెనని గ్రహించునట్లుగా ఆ అన్యులు నీకు మొఱ్ఱపెట్టిన దానిని నీవు దయచేయుదువుగాక.PKTel 14.4

    “నీ జనులు నీవు పంపిన మార్గమందు తమ శత్రువులతో యుద్ధము చేయుటకై బయలుదేరనుద్దేశించి, నీవు కోరుకొనిన యీ పట్టణము తట్టును నీ నామమునకు నేను కట్టించిన యీ మందిరము తట్టు తిరిగి విన్నపము చేసినయెడల ఆకాశము నుండి నీవు వారి విన్నపమును ప్రార్థనను ఆలకించి వారి కార్యమును నిర్వహించుదువు గాక.PKTel 15.1

    “పాపము చేయనివాడెవడును లేడు గనుక వారు నీ దృష్టి యెదుట పాపము చేసినప్పుడు నీవు వారిమీద ఆగ్రహించి, శత్రువుల చేతికి వారిని అప్పగింపగా, చెరపట్టువారు వారిని దూరమైనట్టిగాని సమిపమైనట్టిగాని తమ దేశమునకు పట్టుకొని పోగా వారు చెరపోయిన దేశమందు బుద్దితెచ్చుకొని మనస్సు త్రిప్పుకొని - మేము పాపము చేసితిమి, భక్తి హీనముగా నడచితిమి అని ఒప్పుకొని తాము చెరలోనున్న దేశమందు పూర్ణ హృదయముతోను, పూర్ణాత్మతోను నీయొద్దకు మళ్లుకొని, తమ పితరులకు నీవిచ్చిన తమ దేశము మీదికిని, నీవు కోరుకొనిన యీ పట్టణము మీదికిని, నీ నామ ఘనతకొరకు నేను కట్టించిన యీ మందిరము మిదికిని మనస్సు త్రిప్పి విన్నపము చేసినయెడల నీ నివాస స్థలమైన ఆకాశమునుండి నీవు వారి విన్నపమును, ప్రార్థనను ఆలకించి వారి కార్యమును నిర్వహించి నీ దృష్టి యెదుట పాపము చేసిన నీ జనులను క్షమించుదువుగాక.PKTel 15.2

    “నా దేవా, యీ స్థలమందు చేయబడు విన్నపముమిద నీ కనుదృష్టి యుంచుదువుగాక. నీ చెవులు దానిని ఆలకించునుగాక. నా దేవా, యెహోవా, బలమునకాధారమగు నీ మందసమును దృష్టించి లెమ్ము. నీ విశ్రాంతి స్థలమందు ప్రవేశించుము. దేవా, యెహోవా, నీ యాజకులు రక్షణ ధరించుకొందురుగాక, నీ భక్తులు నీ మేలునుబట్టి సంతోషించుదురుగాక. దేవా, యెహోవా, నీవు నీ చేత అభిషేకము నొందినవారికి పరాజ్మఖుడవై యుండకుము, నీవు నీభక్తుడైన దావీదునకు వాగ్దానము చేసిన కృపలను జ్ఞాపకము చేసికొనుము.” 14-42 వచనాలు. PKTel 15.3

    సొలొమోను ప్రార్ధన ముగించినప్పుడు “అగ్ని ఆకాశమునుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించెను.” “యెహోవా తేజస్సుతో మందిరము నిండినందున యాజకులు ఆలయంలో ప్రవేశించలేకపోయారు. “యెహోవా తేజస్సు మందిరముమీదికి దిగగా చూచి ఇశ్రాయేలీయులందరును సాష్టాంగ నమస్కారము చేసి-యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని చెప్పి ఆయనను ఆరాధించి స్తుతించిరి.”PKTel 15.4

    అంతట రాజు ప్రజలు ప్రభువుముందు బలులర్పించారు. “రాజును జనులందరును కూడా దేవుని మందిరమును ప్రతిష్టచేసిరి.” 2 దిన వృ. 7:1-5. “హామాతునకు పోవు మార్గము మొదలుకొని ఐగుపు నదివరకు” ఉన్న దేశంలో ప్రతీ ప్రాంతంనుంచి “గొప్ప జనసమూహము కూడివచ్చి” ఏడు దినాలు పండుగ ఆచరించారు. ఆ తర్వాత వారమంతా ఆ జనసమూహం పర్ణశాలల పండుగ ఆచరించారు. తమ్మును తాము దేవునికి పునరంకితం చేసుకుని ఆనందంగా గడిపిన ఆ సమయం ముగిసాక “దావీదునకును సొలొమోనునకును తన జనులైన ఇశ్రాయేలీయులకును యెహోవా చేసిన మేలుల విషయమై సంతోషించుచు” ప్రజలు తమ గృహాలికి తిరిగి వెళ్లిపోయారు. 8,10 వచనాలు. PKTel 16.1

    ఇశ్రాయేలు ప్రజలు దేవునికి నమ్మకంగా ఉండి ఉంటే మహిమాన్వితమైన ఈ ఆలయం నిత్యం నిలిచి ఉండేది. తన ప్రజలపట్ల దేవుని ప్రత్యేక శ్రద్ధకు నిత్య చిహ్నంగా కొనసాగేది. దేవుడిలా అన్నాడు, “విశ్రాంతి దినమును అపవిత్ర పరచకుండ ఆచరించుచు నా నిబంధనను ఆధారము చేసికొనుచు యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలెనని ఆయన పక్షమున చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చెదను. నా ప్రార్ధన మందిరములో వారిని ఆనందింప జేసెదను. నా బలిపీఠముమీద వారర్పించు దహన బలులును నాకు అంగీకారములగును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరమనబడును.” యెష. 56:6, 7.PKTel 16.2

    ఈ ఆమోద హామీల సందర్భంగా రాజుముందున్న మార్గాన్ని ప్రభువు విస్పష్టం చేశాడు. ఆయన ఇలా అన్నాడు, “నీ తండ్రియైన దావీదు నడచినట్లుగా నీవును నాకనుకూలవర్తనుడవై నడచి, నేను నీ కాజ్ఞాపించిన దానియంతటి ప్రకారముచేసి, నా కట్టడలను నా న్యాయవిధులను అనుసరించినయెడల ఇశ్రాయేలీయులను ఏలుటకు స్వసంతతివాడు ఒకడు నీకుండకపోడని నేను నీ తండ్రియైన దావీదుతో చేసియున్న నిబంధననుబట్టి నేను నీ రాజ్య సింహాసనమును స్థిరపరచుదును.” 2 దిన వృ. 7:17,18..PKTel 16.3

    సొలొమోను వినయ మనసుతో దైవ సేవను కొనసాగించిఉంటే, తన తండ్రి దావీదు సుపరిపాలనవల్ల, ప్రారంభ సంవత్సరాల్లో తన వివేకంవల్ల, గొప్ప కార్యాలవల్ల తన దేవునిపట్ల సుముఖంగా ఉన్న పరిసర రాజ్యాలపై అతడి పరిపాలన గొప్ప ప్రభావాన్ని చూపించేది. అభివృద్ది ఐహిక కీర్తి వెనక వచ్చే శోధనల్ని ముందు గ్రహించి, మతభ్రష్టతగురించి సొలొమోనుని హెచ్చరించి, పాప పర్యవసానాల్ని దేవుడు వివరించాడు. ఇశ్రాయేలీయుల్ని, “తమ పితరులను ఐగుపు దేశమునుండి రప్పించిన తమ దేవుడైన యెహోవాను” విసర్జించి విగ్రహారాధనలో కొనసాగితే అప్పుడే ప్రతిష్ఠ చేసిన ఆలయాన్ని సయితం “సమస్త జనములలో దానిని సామెత కాస్పదముగాను నిందకాస్పదముగాను” చేస్తాను అని హెచ్చరించాడు. 20,22 వచనాలు.PKTel 16.4

    ఇశ్రాయేలీయుల పక్షంగా తన ప్రార్థనను దేవుడు అంగీకరించాడన్న వర్తమానం సొలొమోను హృదయానికి ఎంతో బలం చేకూర్చింది. ఇప్పుడతడు తన పరిపాలనలో మిక్కిలి వైభవమైన ఘట్టంలో ప్రవేశిస్తున్నాడు. “దేవుడు సొలొమోనుయొక్క హృదయమందుంచిన జ్ఞానోక్తులు వినుటకై” “భూరాజు లందరును” అతడి సన్నిధిని అభిలషిస్తున్నారు. 2 దిన వృ. 9:23. అతడి పరిపాలనా విధానాన్ని పరిశీలించి సమస్యాత్మక విషయాల్ని ఎలా పరిష్కరించాలో అతడి ఉపదేశం పొందటానికి చాలామంది వచ్చారు.PKTel 17.1

    ఈ ప్రజలు సొలొమోనుని సందర్శించిన తరుణంలో సృష్టికర్త అయిన దేవుని గురించి వారికి అతడు బోధించాడు. ఇశ్రాయేలీయుల దేవుని గురించి సర్వమానవ జాతిపట్ల ఆయనకున్న ప్రేమనుగురించి స్పష్టమైన అభిప్రాయంతో వారు తిరిగి వెళ్లారు. ఇప్పుడు వారు ప్రకృతిలో దేవుని ప్రేమను ఆయన ప్రవర్తన ప్రత్యక్షతను చూశారు. అనేకులు ఆయన్ని తమ దేవుడుగా ఆరాధించారు.PKTel 17.2

    సొలొమోను దేశ పరిపాలనా భారాన్ని వహించటం మొదలు పెట్టినప్పుడు, “నేను బాలుడను” (1 రాజులు. 3:7) అని దేవుని ముందు ఒప్పుకున్నప్పుడు, దేవునిపట్ల అతడి విశేష ప్రేమ, దైవ విషయాలపట్ల అతడి ప్రగాఢ గౌరవం, అతడు తన్నుతాను నమ్ముకోకపోవటం, అతడు సృష్టికర్తను హెచ్చించటం - ఆచరణీయమైన ఈ గుణ లక్షణాలు ఆలయ నిర్మాణం పరిపూర్తితో సంబంధించిన సేవల్లోను ప్రతిష్ట సమయంలో మోకరించి ప్రార్థన చేసిన సమయంలోను ప్రదర్శితమయ్యాయి. నేడు క్రీస్తు అనుచరులు భక్తిభావాన్ని దైవ భీతిని విస్మరించే స్వభావానికి తావివ్వకుండా జాగ్రత్తపడాలి. మనుషులు తమ సృష్టికర్తను ఎలా సమీపించాలో లేఖనాలు బోధిస్తున్నాయి. వినయంతో, భయభీతులతో, విశ్వాసంతో దివ్య మధ్యవర్తిద్వారా మనం ఆయన సముఖంలోకి రావాలి. కీర్తనకారుడిలా అంటున్నాడు :PKTel 17.3

    “యెహోవా మహాదేవుడు
    దేవతలందరికి పైన మహాత్యముగల మహారాజు ....
    రండి నమస్కారము చేసి సాగిలపడుదము
    మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించు
    PKTel 17.4

    దము.” కీర్త. 95:3-6.

    బహిరంగ ఆరాధనలోను వ్యక్తిగత ఆరాధనలోను ఆయనకు మన విన్నపాల్ని తెలుపుకునేటప్పుడు మోకరించి వేడుకోటం మన ఆధిక్యత. యేసు మనకు ఆదర్శం. ఆయన “మోకాళ్లూని .... ప్రార్థించెను.” లూకా 22:14. వారు “మోకాళ్లూని ప్రార్ధన” చేశారని శిష్యులగురించి దాఖలా ఉంది. అ.కా. 9:40. పౌలు ఇలా అంటున్నాడు, “నేను మోకాళ్లూని .... ప్రార్థించుచున్నాను. ఎఫెసీ. 3:14. ఇశ్రాయేలీయుల పాపాల్ని దేవునిముందు ఒప్పుకుంటూ. ఎజ్రా మోకరించి ప్రార్థించాడు. ఎజ్రా 9:5. దానియేలు “ముమ్మారు మోకాళ్లూని ... తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను.” దాని. 6:10..PKTel 17.5

    దేవునిపట్ల నిజమైన భక్తిభావం ఆయన అనంత ఔన్నత్యం స్పృహవల్ల ఆయన సన్నిధి గుర్తింపువల్ల ఏర్పడుతుంది. అదృశ్యుడైన ఆ ప్రభువును గూర్చిన ఈ సృహతో ప్రతీ హృదయం ముద్రితం కావాలి. ప్రార్థన సమయం, ప్రార్థన స్థలం పరిశుద్ధమైనవి. అక్కడ దేవుని సముఖం ఉంటుంది. వైఖరిలోను, నడవడిలోను భక్తిభావం వ్యక్తమైనప్పుడు దాన్ని కలిగించే మనోభావన గాఢమౌతుంది. “ఆయన నామము పరిశుద్ధమైనది పూజింపదగినది.” కీర్త. 111:9. దేవదూతలు ఈ నామాన్ని ఉచ్చరించి నప్పుడు తమ ముఖాలు కప్పుకుంటారు. అలాగైనప్పుడు పతనమైన పాపులమైన మనం ఆ నామాన్ని ఉచ్చరించేటప్పుడు మరెంత జాగ్రత్తగా ఉండాలి!PKTel 18.1

    దేవుని ప్రత్యేక సముఖమున్న స్థలాన్ని ఎలా పరిగణించాలో తెలిపే ఈ లేఖన వాక్కుల్ని పెద్దలు, పిన్నలు అందరూ ధ్యానించటం మంచిది. మండుతున్న పొదవద్ద ఆయన మోషేని ఇలా ఆదేశించాడు, “నీ పాదములనుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచియున్న స్థలము పరిశుద్ధ ప్రదేశము.” నిర్గమ. 3:5. దేవదూతల దర్శనాన్ని చూసిన తర్వాత యాకోబు ఇలా అన్నాడు, “నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు. అది నాకు తెలియపోయెను ... ఇది దేవుని మందిరమేగాని వేరొకటి కాదు.” ఆది. 28:16,17.PKTel 18.2

    ఆలయ ప్రతిష్ట జరిగిన సమయంలో సొలొమోను ఏమి చెప్పాడో అది సృష్టి కర్తను గురించి అన్యుల మనసుల్లో ఉన్న మూఢ నమ్మకాల్ని తొలగించటానికి చెప్పాడు. అన్యుల దేవుళ్లలాగ హస్తకృతమైన ఆలయాల్లో పరలోక దేవుడు పరిమితమై ఉండడు. అయినా తన ఆరాధనకు ప్రతిష్టితమైన మందిరంలో సమావేశమయ్యే తన ప్రజలతో ఆయన తన ఆత్మద్వారా ఉంటాడు.PKTel 18.3

    శతాబ్దాల అనంతరం పౌలు ఇదే సత్యాన్ని ఈ మాటల్లో బోధించాడు : “జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును, భూమికిని ప్రభువై యున్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక తనకు ఏదైన కొదువ యున్నట్టు మనుష్యుల చేతులతో సేవింపబడువాడు కాడు ... వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందురేమోయని, తన్ను వెదకు నిమిత్తము నిర్ణయకాలమును వారి నివాస స్థలముయొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవరికిని దూరముగా ఉండువాడు కాడు. మనమాయన యందు బ్రదుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి యున్నాము.” అ.కా. 17:24-28..PKTel 18.4

    “యెహోవా తమకు దేవుడుగాగల జనులు ధన్యులు
    ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొను జనులు ధన్యులు
    యెహోవా ఆకాశములోనుండి కనిపెట్టుచున్నాడు
    ఆయన నరులందరిని దృష్టించుచున్నాడు
    తానున్న నివాస స్థలములోనుండి
    భూలోక నివాసులందరివైపు ఆయన చూచుచున్నాడు.”
    “యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరచియున్నాడు
    ఆయన అన్నిటిమిద రాజ్యపరిపాలన చేయుచున్నాడు.”
    “దేవా, నీ మార్గము పరిశుద్దమైనది
    దేవునివంటి మహాదేవుడు ఎక్కడనున్నాడు?
    ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే
    జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్ష పరచుకొని
    PKTel 19.1

    యున్నాడు.” కీర్త. 33:12-14; 103:19; 77:13,14

    మానవ హస్తాలతో నిర్మించిన ఆలయాల్లో దేవుడు నివసించకపోయినప్పటికీ ఆయన తన ప్రజల సమావేశాల్ని తన సన్నిధితో గౌరవిస్తాడు. వారు తమ పాపాల్ని ఒప్పుకోటానికి, ఒకరిగురించి ఒకరు ప్రార్థన చెయ్యటానికి సమావేశమైనప్పుడు తన ఆత్మద్వారా తమతో ఉంటానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఆయన్ని ఆరాధించటానికి సమావేశమైనవారు ప్రతీ చెడుగును విడిచి పెట్టాలి. పరిశుద్దాలంకారములగు ఆభరణములను ధరించుకొని ఆయనయెదుట సాగిలపడి ఆయన్ని ఆత్మతోను, సత్యంతోను ఆరాధిస్తేనేగాని వారు సమావేశమవ్వటం వ్యర్థం. అలాంటి వారి గురించి ప్రభువిలా అంటున్నాడు, “ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘన పరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది.” మత్త. 15:8,9. దేవుని ఆరాధించేవారు “ఆత్మతోను, సత్యముతోను” ఆరాధించాలి. “తన్ను ఆరాధించువారు అట్టివారే కావలెనని తండ్రి కోరుచున్నాడు.” యెహో. 4:23.PKTel 19.2

    “యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు, ఆయన సన్నిధిని లోకమంతయు మౌనముగా ఉండునుగాక.” హబ. 2:20.PKTel 19.3

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents