Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
ప్రవక్తలు - రాజులు - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    40 - నెబుకద్నెజరు కన్నకల

    దానియేలు అతడి సహచరులు బబులోను రాజు ప్రభుత్వంలో పని ప్రారంభించిన కొద్దికాలం అనంతరం ఇశ్రాయేలు దేవుని శక్తిని విశ్వసనీయతను ఆ విగ్రహారాధక ప్రజలకు వెల్లడి చేసే సంఘటనలు చోటు చేసుకున్నాయి. నెబుకద్నెజరు ఒక అద్భుతమైన కల కన్నాడు. “అందునుగురించి ఆయన మనస్సు కలతపడగా ఆయనకు నిద్ర పట్ట కుండెను.” అది రాజు మనసును అమితంగా ఆకట్టుకున్నా అతడు నిద్ర లేచినప్పుడు కల వివరాలు గుర్తు రావటం లేదు.PKTel 342.1

    ఆ మానసిక గందరగోళ స్థితిలో నెబుకద్నెజరు తన జ్ఞానులందరిని - శకున గాండ్రిని, గారడీవాళ్లని, మాంత్రికుల్ని - పిలిపించి వారి సహాయాన్ని కోరాడు. రాజు “నేనొక కలకంటిని, ఆ కల భావము తెలిసికొనవలెనని నేను మనోవ్యాకుల మొందియున్నాను” అన్నాడు. తన ఆందోళనను వివరించిన మీదట తన మనసుకు శాంతిని కలిగించే ఆ విషయాన్ని తనకు తెలియజేయవలసిందని వారిని కోరాడు.PKTel 342.2

    దీనికి ఆ జ్ఞానులు “రాజు చిరకాలము జీవించునుగాక. తమరి దాసులకు కల సెలవియ్యుడి; మేము దాని భావమును తెలియజేసెదము.” అని బదులు పలికారు.PKTel 342.3

    వారి అస్పష్ట సమాధానంతో రాజు అసంతృప్తి చెందాడు. అతడికి అనుమానం కలిగింది కూడా. ఎందుకంటే, మనుషుల రహస్యాలు, మర్మాలు బట్టబయలు చేయగలమని చెప్పుకున్నా రాజుకోరిన సహాయాన్ని అందించటానికి వారు సమ్మతంగా లేనట్లు కనిపించారు. కనుక రాజు ఆ జ్ఞానులికి ఒకపక్క ధనం గౌరవం వాగ్దానం చేస్తూ మరోపక్క బెదిరింపులు మరణ దండన ప్రకటించి తనకు ఆ కల మాత్రమే కాదు దాని భావాన్ని కూడా చెప్పాల్సిందిగా ఆజ్ఞాపించాడు. రాజు వారితో ఇలా అన్నాడు, “నేను దాని మరచిపోతినిగాని, కలను దాని భావమును మీరు తెలియజేయని యెడల మీరు తుత్తునియలుగా చేయబడుదురు; మా యిండ్లు పెంటకుప్పగా చేయబడును. కలను దాని భావమును తెలియజేసిన యెడల దానములును బహుమానములును మహా ఘనతయు నా సముఖములో నొందుదురు.”PKTel 342.4

    ఇంకా ఆ జ్ఞానులిస్తున్న సమాధానం ఇదే, “రాజు ఆ కలను తమరి దాసులమైన మాకు చెప్పినయెడల మేము దాని భావమును తెలియజేసెదము.”PKTel 343.1

    తాను ఎంతగానో నమ్మినవారే దగా చేశారని భావించి ఉద్రిక్తుడు ఉగ్రుడు అయి నెబుకద్నెజరు ఇలా అన్నాడు : “నేను మరచియుండుట మీరు చూచి కాలహరణము చేయవలెనని మీరు కనిపెట్టుచున్నట్లు నేను బాగుగా గ్రహించుచున్నాను. కాలము ఉపాయముగా గడపవలెనని అబద్ధమును మోసపు మాటలను నా యెదుట పలుక నుద్దేశించియున్నారు. మీరు కలను చెప్పలేక పోయిన యెడల నేను చెప్పిన మాట ఖండితము గనుక కలను నాకు చెప్పుడి అప్పుడు దాని భావము తెలియ జేయుటకు మీకు సామర్ధ్యము కలదని నేను తెలిసికొందును.”PKTel 343.2

    తమ వైఫల్య పర్యవసానాలకు భయంతోనిండిన మాంత్రికులు అతడి కోరిక సహేతుకమైంది కాదని, అతడు తమకు పెట్టిన పరీక్ష ఏ మానవుడూ ఎన్నడూ ఎదుర్కోని పరీక్ష అని రాజుకి చెప్పటానికి ప్రయత్నించారు. వారిలా బదులు పలికారు, “భూమి మీద ఏ మనుష్యుడును రాజు అడిగిన సంగతి చెప్పజాలడు, ఏ చక్రవర్తియు అధికారియు శకునగానియొద్దను గారడీవిద్యగలవాని యొద్దను కల్గియునియొద్దను ఇట్టి సంగతి విచారింపలేదు. రాజు విచారించిన సంగతి బహు అసాధారమైనది, దేవతలు కాక మరెవరును ఈ సంగతి తెలియజెప్ప జాలరు; దేవతల నివాసములు శరీరుల మధ్య ఉండవుగదా!”PKTel 343.3

    అందుకు “రాజు కోపము తెచ్చుకొని అత్యాగ్రహము గలవాడై బబులోనులోని జ్ఞానులందరిని సంహరింపవలెనని యాజ్ఞ ఇచ్చెను.”PKTel 343.4

    రాజాజ్ఞ అమలుకు ఆయత్తమౌతున్న అధికారులు వెదకుతున్నవారిలో దానియేలు అతడి మిత్రులు ఉన్నారు. రాజాజ్ఞ ప్రకారం తాముకూడా మరణించవలసి ఉంటుందని చెప్పినప్పుడు దానియేలు రాజు అంగరక్షకుల అధిపతి అయిన ఆర్యోకు దగ్గరకు పోయి, “రాజు నొద్దనుండి ఈ యాజ్ఞ యింత త్వరితముగా వచ్చుట ఏమి?” అని “జ్ఞానయుక్తముగా” అడిగాడు. రాజు కన్నకల విషయమై ఇప్పటిదాకా రాజు సంపూర్తిగా నమ్మినవారు సహాయం అందించలేకపోటం గురించి రాజు ఆందోళనచెందిన ఉదంతాన్ని ఆర్యోకు అతడికి చెప్పాడు. ఇది విన్న వెంటనే దానియేలు ప్రాణాలు చేతబట్టుకుని, రాజు సముఖంలోకి వెళ్లి, ఆ కలను దాని భావాన్ని తెలియపర్చవలసిందిగా తన దేవుణ్ని వేడుకోటానికి తనకు సమయం ఇవ్వవలసిందంటూ మనవి చేసుకున్నాడు.PKTel 343.5

    ఈ మనవిని రాజు అంగీకరించాడు. అప్పుడు దానియేలు తన యింటికిపోయి తన స్నేహితులైన హనన్యాకును మిషాయేలునకును అజర్యాకును సంగతి” తెలిపాడు. వారు కలిసి జ్ఞానంకోసం వెలుగుకి జ్ఞానానికి మూలమైన ఆ ప్రభువుకి ప్రార్థన చేశారు. తమను ఆ స్థలంలో దేవుడే ఉంచాడని, తాము ఆయన సేవచేస్తూ తమవిధుల్ని నిర్వర్తిస్తున్నామని వారు బలంగా నమ్మారు. అపాయం ఆందోళనతో నిండిన సమయాల్లో, మార్గ నిర్దేశానికి సంరక్షణకు ఆయనమీద ఆధారపడ్డారు. ఆయన వారికి ఎల్లప్పుడు కొండంత అండగా నిలిచాడు. ఇప్పుడు పశ్చాత్తాపంతో నిండిన హృదయాలతో ఆ సర్వలోక న్యాయాధిపతికి తమ్ముని తాము నూతనంగా సమర్పించుకున్నారు. తమకు కలిగిన ఈ ఆపదలో విడుదల కలిగించాల్సిందని విజ్ఞాపన సల్పారు. వారి విజ్ఞాపన వ్యర్ధం కాలేదు. వారు ఘనపర్చుతూ వచ్చిన దేవుడు ఇప్పుడు వారిని ఘనపర్చాడు. దేవుని ఆత్మ వారిమీదికి రాగా “రాత్రియందు దర్శనము”లో దానియేలుకి ఆ కలను దాని భావాన్ని దేవుడు వెల్లడి చేశాడు.PKTel 344.1

    రాజు కలను దాని భావాన్ని తెలియపర్చినందుకు దానియేలు మొదటగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. అతడు దేవున్ని ఇలా కొనియాడాడు, “దేవుడు జ్ఞాన బలములు కలవాడు; యుగములన్నిటను దేవుని నామము స్తుతింపబడునుగాక. ఆయన కాలములను సమయములను మార్చువాడైయుండి, రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునై యున్నాడు. ఆయన మరుగు మాటలను మర్మములను బయలు పరచును, అంధకారములోని సంగతులు ఆయనకు తెలియును; వెలుగుయొక్క నివాస స్థలము ఆయనయొద్ద నున్నది. మా పితరుల దేవా, నీవు వివేకమును బలమును నాకనుగ్రహించియున్నావు; మేమడిగిన యీ సంగతి ఇప్పుడు నాకు తెలియజేసి యున్నావు గనుక నేను నిన్ను స్తుతించుచు ఘనపరచుచున్నాను. ఏలయనగా రాజు యొక్క సంగతి నీవే మాకు తెలియజేసితివి.”PKTel 344.2

    జ్ఞానుల్ని సంహరించాల్సిందని ఎవరికి రాజు ఆజ్ఞాపించాడో ఆ ఆర్యోకు వద్దకు దానియేలు వెంటనే వెళ్లి ఇలా అన్నాడు, “బబులోను లోని జ్ఞానులను నశింపజేయవద్దు, నన్ను రాజు సముఖమునకు తోడుకొని పొమ్ము. నేను ఆ కల భావమును రాజునకు తెలియజేసెదను.” ఆ అధికారి దానియేలుని గబగబ రాజు సముఖంలోకి ఈ మాటలతో ప్రవేశపెట్టాడు, “రాజునకు భావము తెలియజెప్పగల యొక మనుష్యుని చెరపట్టబడిన యూదులలో నేను కనుగొంటిని.”PKTel 344.3

    ప్రపంచంలో మిక్కిలి శక్తిమంతమైన సామ్రాజ్యాన్ని పరిపాలించే మహారాజు సముఖంలో ప్రశాంతంగా తొణకని కుండలా నిండుగా నిలిచి ఉన్న యూదు బానిసను వీక్షించండి. తన మొదటి మాటల్లో తన గొప్పతనం చాటుకోకుండా సమస్త జ్ఞానానికి మూలమైన దేవున్ని ఘనపర్చాడు. “నేను చూచిన కలయు దాని భావమును తెలియజెప్పుట నీకు శక్యమా?” అన్న రాజు ప్రశ్నకు దానియేలు ఇలా బదులు పలికాడు: “రాజడిగిన యీ మర్మము జ్ఞానులైనను గారడీ విద్యగలవారైనను శకునగాండ్రయినను, జ్యోతిష్యులైనను తెలియజెప్పజాలరు. అయితే మర్మములను బయలు పరచగల దేవుడొకడు పరలోకమందున్నాడు. అంత్యదినములయందు కలుగబోవు దానిని ఆయన రాజగు నెబుకద్నెజరునకు తెలియజేసెను.”PKTel 344.4

    “తాము పడకమీద పరుండగా తమరి మనస్సులో కలిగిన స్వప్న దర్శనములు ఏవనగా, రాజా, ప్రస్తుత కాలము గడచిన పిమ్మట ఏమి జరుగునో అనుకొని తాము పడకమీద పరుండి మనోచింత గలవారై యుండగా మర్మములను బయలుపరచువాడు కలుగబోవు దానిని తమరికి తెలియజేసెను. ఇతర మనుష్యులందరికంటే నాకు విశేష జ్ఞానముండుట వలన ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు. రాజునకు దాని భావమును తెలియజేయు నిమిత్తమును, తమరి మనస్సుయొక్క ఆలోచనలు తాము తెలిసికొను నిమిత్తమును అది బయలుపరచబడెను. PKTel 345.1

    “రాజా, తాము చూచుచుండగా బ్రహ్మాండమగు ఒక ప్రతిమ కనబడెనుగదా, ఈ గొప్ప ప్రతిమ మహా ప్రకాశమును, భయంకరమునైన రూపముగలదై తమరియెదుట నిలిచెను. ఆ ప్రతిమయొక్క శిరస్సు మేలిమి బంగారుమయ మైనదియు, దాని రొమ్మును భుజములును వెండివియు, దాని ఉదరమును తొడలును ఇత్తడివియు, దాని మోకాళ్లు ఇనుపవియు, దాని పాదములలో ఒక భాగము ఇనుపదియు ఒక భాగము మట్టిదియునై యుండెను.”PKTel 345.2

    “మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి, యినుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమయొక్క పాదములమీద పడి దాని పాదములను తుత్తునియలుగా విరుగగొట్టినట్టు తమకు కనబడెను. అంతట ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారమును ఏకముగా దంచబడి కళ్లములోని చెత్తవలె కాగా వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండ గాలి వాటిని కొట్టుకొనిపోయెను. ప్రతిమను విరుగగొట్టిన ఆ రాయి సర్వ భూతలమంత మహాపర్వతమాయెను.PKTel 345.3

    “తాము కనిక కల యిదే” అని ధైర్యంగా చెప్పాడు దానియేలు. రాజు ప్రతీ వివరాన్ని దీక్షగా విన్నాడు. తనకు వచ్చిన కల ఎంతో ఆందోళనను కలిగించిన కల అదే. దాని భావాన్ని అంగీకరించటానికి ఈ రీతిగా అతడి మనసును సిద్ధం చెయ్యటం జరిగింది. రాజులకు రాజు బబులోను చక్రవర్తికి గొప్ప సత్యాన్ని అందించటానికి సిద్ధంగా ఉన్నాడు. లోక రాజ్యాలపై తనకు అధికారం ఉందని, రాజుల్ని సింహాసనం ఎక్కించటానికి సింహాసనంనుంచి దించటానికి తనకు అధికారముందని దేవుడు బయలు పర్చుతున్నాడు. తాను దేవునికి జవాబు దారినన్న స్పృహను కలిగి ఉండటానికి నెబుకద్నెజరు మనసును మేల్కొలపాలి. లోకాంతం వరకు చోటుచేసుకోనున్న భావి సంభవాలు అతడికి ఆవిషృతం కావలసి ఉన్నాయి.PKTel 345.4

    దానియేలు ఇంకా ఇలా అన్నాడు, “రాజా, పరలోకమందున్న దేవుడు రాజ్యమును అధికారమును బలమును ఘనతయు తమరికి అనుగ్రహించి యున్నాడు; తమరు రాజులకు రాజైయున్నారు. ఆయన మనుష్యులు నివసించు ప్రతి స్థలమందును, మనుష్యులనేమి భూజంతువులనేమి ఆకాశ పక్షులనేమి అన్నిటిని ఆయన తమరి చేతికప్పగించి యున్నాడు; తామే ఆ బంగారపు శిరస్సు.”PKTel 346.1

    “తాము చనిపోయిన తరువాత తమరి రాజ్యముకంటే తక్కువదైన రాజ్యమొకటి లేచును. అటు తరువాత లోకమంత యేలునట్టి మూడవ రాజ్యమొకటి లేచును. అది యిత్తడి వంటిదగును.”PKTel 346.2

    “పిమ్మట నాలుగవ రాజ్యమొకటి లేచును. అది ఇనుమువలె బలముగా ఉండును. ఇనుము సమస్తమైన వాటిని దంచి విరుగగొట్టునది గదా; ఇనుము పగులగొట్టునట్లు అది రాజ్యములన్నిటిని పగులగొట్టి పొడి చేయును.”PKTel 346.3

    “పాదములును వ్రేళ్లును కొంతమట్టునకు కుమ్మరి మట్టిదిగాను కొంతమట్టునకు ఇనుపదిగా నున్నట్టు తమరికి కనబడెను గనుక ఆ రాజ్యములలో భేదములుండును. అయితే ఇనుము బురదతో కలిసియున్నట్లు కనబడెను. గనుక ఆ రాజ్యములో ఆలాగు నుండును; ఆ రాజ్యము ఇనుమువంటి బలము గలదైయుండును. పాదముల వ్రేళ్లు కొంతమట్టునకు మట్టివిగాను ఉన్నట్లు ఆ రాజ్యము ఒక విషయములో బలముగాను ఒక విషయములో నీరసముగాను ఉండును. ఇనుమును బురదయు మిళితమై యుండుట తమరికి కనబడెను; అటువలె మనుష్య జాతులు మిళితములై యినుము మట్టితో అతకనట్లు వారు ఒకరితో ఒకరు పొసగక యుందురు.”PKTel 346.4

    “ఆ రాజుల కాలములో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును. దానికెన్నటికిని నాశనము కలుగదు, ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక మరెవరికిని చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పగులగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగయుగములవరకు నిలుచును. చేతి సహాయము లేక పర్వతము నుండి తియ్యబడిన ఆ రాయి యినుమును ఇత్తడిని మట్టిని వెండిని బంగారమును పగులగొట్టగా తమరు చూచితిరే; యిందువలన మహా దేవుడు ముందు జరుగబోవు సంగతి రాజునకు తెలియజేసియున్నాడు; కల నిశ్చయము, దాని భావము నమ్మదగినది.”PKTel 346.5

    ఆ కల భావం వాస్తవమని రాజు నమ్మాడు. అంతట రాజు వినయంగా “సాష్టాంగ నమస్కారము చేసి... పూజించి” “నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచువాడునై యున్నాడని చెప్పాడు. PKTel 347.1

    జ్ఞానుల్ని నాశనం చెయ్యాల్సిందిగా తాను జారీ చేసిన ఆజ్ఞను నెబుకద్నెజరు రద్దుచేశాడు. రహస్యాలు బయలుపర్చే దేవునితో దానియేలుకున్న అనుబంధం ద్వారా వారి ప్రాణాలు దక్కాయి. అప్పుడు “రాజు దానియేలును బహుగా హెచ్చించి, అనేక గొప్ప దానములిచ్చి, అతనిని బబులోనులోను సంస్థానమంతటి మిదను అధిపతిగాను బబులోను జ్ఞానులందరిలోను ప్రధానునిగాను నియమించెను. అంతట దానియేలు రాజునొద్ద మనవి చేసికొనగా రాజు షద్రకు మేషాకు అబేద్నెగోయను వారిని బబులోను సంస్థానముమీద విచారణకర్తలుగా నియమించెను. అయితే దానియేలు రాజు సన్నిధిలో ఉండెను.”PKTel 347.2

    మానవ చరిత్రలో సామ్రాజ్యాల పెరుగుదల, ఉత్థాన పతనాలు మానవుడి శక్తి సామర్ధ్యాలమీద ఆధారపడి ఉన్నట్లు కనిపిస్తుంది. పరిస్థితుల పరిణామం చాలమట్టుకు మానవుడి శక్తి, ఆశ లేదా చాపల్యాన్నిబట్టి చోటుచేసుకునేటట్లు పైకి కనిపిస్తుంది. అయిదే దేవుని వాక్యంలో అడ్డు తెర తొలగింపు జరిగింది. మానవ ఆసక్తి, అధికారం, ఆవేశకావేషాలలకు పైగా, వాటి వెనుక, వాటి గుండా నడిచే నాటకం అంతర్నాటక మంతటా కృపానిధి అయిన దేవుని సాధనాల్ని చూస్తాం. అవి చడీచప్పుడి లేకుండా ఆయన చిత్తాన్ని సంకల్పాన్ని నెరవేర్చుతూ ఉంటాయి.PKTel 347.3

    వివిధ ప్రజల్ని జాతుల్ని సృజించి వారిని ఆయా ప్రాంతాల్లో నివసింప జెయ్యటంలో దేవుని ఉద్దేశాన్ని మధురమైన సున్నితమైన మాటల్లో ఏథెన్స్ జ్ఞానులముందు పెడుతూ అపొస్తలుడైన పౌలు ఇలా అంటున్నాడు, “జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై యున్నందున హస్తకృత్యములైన ఆలయములలో నివసింపడు. ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక తనకు ఏదైనను కొదువయున్నట్లు మనుష్యుల చేతులతో సేవింపబడువాడు కాడు. మరియు యావద్భూమి మిద కాపురముండుటకు ఆయన యొకనినుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి, వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొందురేమోయని, తన్నువెదకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలముయొక్క పొలిమేరలను ఏర్పరచెను.” అ.కా. 17:24-27.PKTel 347.4

    ఇష్టం చూపేవారు “నిబంధనకు లోబడ” వచ్చునని దేవుడు స్పష్టం చేశాడు. యెహె. 20:37. భూమిపై ప్రజలు నివసించాలని, వారి జీవితం తమకు తోటి ప్రజలకు దీవెనగాను సృష్టికర్తకు ఘనత తెచ్చేదిగాను ఉండాలని దేవుడు ఉద్దేశించాడు. ఇష్టపడే వారందరూ ఈ కార్యాచరణలో పాలు పొందవచ్చు. వారిని గురించి ఇలా చెప్పటం జరిగింది, “నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు.” యెష. 43:21. PKTel 348.1

    దేవుడు తన ధర్మశాస్త్రంలో జాతులు వ్యక్తుల తాలూకు అభివృద్దికి ఆధారమైన సూత్రాల్ని వివరించాడు. ఈ ధర్మశాస్త్రం గురించి మోషే ఇశ్రాయేలీయులికి ఇలా ప్రకటించాడు : “అదే మాకు జ్ఞానము, అదే మాకు వివేకము” “ఇది మాకు నిరర్ధకమైన మాటకాదు, ఇది మీకు జీవమే.” ద్వితి. 4:6; 32:47. ఇశ్రాయేలుకి దేవుడిలా వాగ్దానం చేసిన దీవెనలు అదే షరతుల పైన అదే పరిమాణంలో ప్రతీ జాతికి ప్రతీ వ్యక్తికి వాగ్దానం చేయబడ్తున్నాయి.PKTel 348.2

    కొన్ని రాజ్యాలు కార్యరంగంలోకి రావటానికి వందల సంవత్సరాలుముందే సర్వజ్ఞాని అయిన దేవుడు భవిష్య యుగాల్లోకి చూసి లోక రాజ్యాల ఉత్థాన పతనాల్ని ప్రవచించాడు. బబులోను రాజ్యం పతనమౌతుందని, రెండో రాజ్యం లేస్తుందని, అది కూడా కొంతకాలం సాగి పతనమౌతుందని దేవుడు నెబుకద్నెజరుకి తెలిపాడు. నిజమైన దేవున్ని మహిమ పర్చటంలో విఫలమైనందున దాని ప్రాభవం గతించిపోయింది. దాని స్థానాన్ని మూడో రాజ్యం ఆక్రమిస్తుంది. ఇదికూడా గతించి పోతుంది. ఇనుములా బలమైన నాల్లో రాజ్యం వచ్చి లోక రాజ్యాలన్నిటిని జయించి లోపరుచుకుంటుంది.PKTel 348.3

    లోక రాజ్యాలన్నిటిలోను భాగ్యవంతమైన బబులోను తాలూకు రాజులు ఎల్లప్పుడూ యెహోవాకు భయపడి నివసించిఉంటే, వారికి వివేకాన్ని అవగాహనను ఆయన ఇచ్చేవాడు. అవి వారిని ఆయనకు దగ్గరగా ఉంచి వారిని శక్తిమంతులుగా ఉంచేవి. కాని వారు కష్టాలకు ఆందోళనకు గురి అయినప్పుడు మాత్రమే దేవున్ని ఆశ్రయించారు. అట్టి పరిస్థితుల్లో తమకున్న ఘనులనుంచి సహాయం లభించనప్పుడు దానియేలు వంటి మనుషుల సహాయాన్ని అర్ధించారు. వారు దేవుణ్ని ఘనపర్చిన వ్యక్తులు. దేవుడు వారిని ఘనపర్చాడు. దేవుని మర్మ విషయాల్ని వివరించాల్సిందిగా వారు ఈ మనుషుల్ని అర్ధించారు. బబులోను పరిపాలకులు గొప్ప ప్రతిభగల వ్యక్తులైనప్పటికీ తమ అతిక్రమాల వలన వారు దేవునికి దూరమయ్యారు. అందుకే వారు భవిష్యత్తునుగూర్చిన ప్రత్యక్షతల్ని హెచ్చరికల్ని అవగాహన చేసుకోలేకపోయారు.PKTel 348.4

    దైవ ప్రవచనాలు దేశాల చరిత్రలో అక్షరాలా నెరవేరినట్లు లేఖన విద్యార్ధి కనుగొంటాడు. బబులోను చితికిపోయి విచ్చిన్నమై చివరికి గతించిపోయింది. కారణమేమిటంటే అది ఉచ్చ స్థితిలో ఉన్నకాలంలో దాని పరిపాలకులు తాము స్వతంత్రులమని తాము దేవునిమీద ఆధారపడాల్సిన అవసరంలేదని భావించారు. తమ రాజ్య ప్రాభవం మానవ కృషివల్ల సాధ్యపడిందని తలంచారు. మాదీయ పారసీకులు దేవుని ధర్మశాస్త్రాన్ని కాలరాచారు గనుక ఆ రాజ్యంపై దేవుని ఉగ్రత రగులుకుంది. అధిక సంఖ్యాక ప్రజల హృదయాల్లో దైవ భీతి లేకపోయింది. దుష్టత్వం, దేవదూషణ, దుర్నీతి పేట్రేగిపోయాయి. దాని తర్వాత లేచిన రాజ్యాలు దుర్మార్గంలో దాన్ని మించి పోయాయి. నైతిక విలువ పరంగా ఇవి అధోగతికి దిగజారిపోయాయి.PKTel 349.1

    లోకంలో ప్రతీ పరిపాలకుడు చెలాయించే అధికారం దేవుడిచ్చిందే. ఆ అధికారాన్ని అతడు ఎలా వినియోగిస్తాడో దానిమీద అతడి జయం ఆధారపడి ఉంటుంది. ఆ దివ్య పరిశీలకుడు ప్రతీవారితోను ఇలా అంటున్నాడు, “నీవు నన్ను ఎరుగకుండి నప్పటికిని నీకు బిరుదులిచ్చితిని” యెష. 45:5. పూర్వం నెబుకద్నెజర్ని ఉద్దేశించి అన్న ఈ మాటలు ప్రతీవారి జీవితానికి ఓ పాఠం, “నీ పాపములు మాని నీతి న్యాయముల ననుసరించి, నీవు బాధపెట్టినవారియందు కరుణ చూపించిన యెడల నీకున్న క్షేమము నీకికమీదట నుండును.” దాని. 4:27.PKTel 349.2

    వీటిని గ్రహించటం - “నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము” అని, “నీతి వలన సింహాసనము స్థిరపరచబడును.” అని, “కృపవలన అతడు... స్థిరపరచు కొనును” అని గ్రహించటం, “రాజులను త్రోసివేయుచు నియమించుచు” ఉండే ప్రభువు శక్తి ప్రదర్శనలోని నియమాల పనిని గుర్తించటం - అంటే చరిత్ర తత్వాన్ని గ్రహించటం. సామె. 14:34; 16:12; 20:28; దాని. 2:21. PKTel 349.3

    దేవుని వాక్యంలోనే దీన్ని స్పష్టంగా వివరించటం జరిగింది. దేశాల్ని వ్యక్తుల్ని అజేయులుగా చేస్తున్నట్లు కనిపించే శక్తి అవకాశాల్లోగాని లేదా వసతుల్లో గాని లేదని ఇక్కడ ప్రదర్శితమవుతుంది. అది మనుషులు అతిశయంగా చెప్పుకునే గొప్పతనంలోనూ లేదు. దేవుని సంకల్పాన్ని వారు ఎంత నమ్మకంగా నెరవేర్చుతారో అన్నదే దాని కొలమానం.PKTel 349.4

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents