Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
ప్రవక్తలు - రాజులు - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    44 - సింహాల గుహలో

    క్రితంలో బబులోను భూపాలురు ఆసీనులైన సింహాసనాన్ని మాదీయ రాజు దర్యావేషు హస్తగతం చేసుకున్న వెంటనే ప్రభుత్వాన్ని పునర్వవస్థీకరించటానికి పూను కున్నాడు. తన రాజ్యమంతటిపైన అధిపతులుగా ఉండుటకై నూట ఇరువది మంది యధిపతులును... వారిపైన ముగ్గురిని ప్రధానులుగా నియమించెను. ఆ ముగ్గురిలో దానియేలు ముఖ్యుడు. రాజునకు నష్టము కలుగకుండునట్లు ఆ యధిపతులు తప్పకుండ వీరికి లెక్కలు ఒప్పజెప్పవలెనని ఆజ్ఞ ఇచ్చెను. ఈ దానియేలు అతి శ్రేష్ఠమైన బుద్ధి గలవాడై ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నొందియుండెను గనుక రాజ్య మంతటిమిద అతని నియమింపవలెనని రాజుద్దేశించెను.”PKTel 376.1

    దానియేలు పొందుతున్న గౌరవాభిమానాలు ఆ రాజ్యంలోని ప్రధాన వ్యక్తులకు ఈర్ష్య పుట్టించాయి. దానియేలుపై ఫిర్యాదు చెయ్యటానికి అదనుకోసం కనిపెడ్తున్నారు. కాని వారికి ఏ అవకాశం దొరకలేదు. అతడు “నమ్మకస్తుడై యే నేరమైనను ఏ తప్ప యినను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పయినను లోపమైనను కనుగొన లేకపోయిరి.”PKTel 376.2

    దానియేలు నిందారహిత ప్రవర్తన శత్రువులు అతడిపై మరింత అసూయ పెంచు కోటానికి కారణమయ్యింది. “అందుకా మనుష్యులు - అతని దేవుని పద్దతి విషయమందేగాని మరి ఏ విషయమందును అతనిలో లోపము కనుగొనలేము” అని నిర్ధారించు కున్నారు.PKTel 376.3

    అంతట ప్రధానులు, అధిపతులు సమాలోచనలు జరుపుకుని ఓ పథకం రూపొందించారు. దానిద్వారా ప్రవక్తను నాశనం చెయ్యాలన్న తమ లక్ష్యాన్ని సాధించ వచ్చునని భావించారు. ముప్పయి రోజులపాటు ఆ రాజ్యంలోని ఏ వ్యక్తి అయినా ఎందు నిమిత్తమయినా రాజైన దర్యావేషుకు తప్ప ఏ దేవునికిగాని ఏ మానవుడికిగాని ప్రార్థించటం నిషిద్దమని ఆజ్ఞ తయారుచేసి, దానిపై రాజు సంతకం చెయ్యించి, దాన్ని జారీ చెయ్యాలని, ఆ ఆజ్ఞ ఉల్లంఘనకు సింహాల గుహలో పడేవేయటమన్న శిక్ష విధించాలని వారు నిర్ధారించారు.PKTel 376.4

    ఆ ప్రకారమే అధిపతులు ఓ డిక్రీ తయారుచేసి, దానిపై దర్యావేషు సంతకంకోసం అతడికి సమర్పించారు. అతణ్ని పొగడ్తలతోముంచి, ఈ ఆజ్ఞను అమలుపర్చటం తన ప్రతిష్ఠను అధికారాన్ని బాగా పెంచుతుందని చెప్పి, రాజును ఒప్పించారు. అధిపతుల దురుద్దేశాన్ని ఎరుగని రాజు ఆ ఆజ్ఞలో ఉన్న కుట్రను గ్రహించలేకపోయాడు. వారి మాటలు నమ్మి ఆ డిక్రీపై సంతకం పెట్టాడు.PKTel 377.1

    దానియేలు ప్రత్యర్థులు దర్యావేషు సముఖంలోనుంచి వెళ్లిపోయారు. యెహోవా సేవకుడికి తాము పన్నిన ఉచ్చునుగురించి ఎంతో ఆనందంగా ఉన్నారు. ఈ కుట్రలో సాతాను ప్రాముఖ్యమైన పాత్ర నిర్వహించాడు. ఆ రాజ్యంలో దానియేలు ఉన్నతాధికారం గలవాడు. అతడి ప్రభావం ఆ రాజ్యపాలకులపై తమ పట్టును బలహీన పర్చుతుందని దుష్టదూతలు భయపడ్డారు. అధిపతుల ఈర్ష్యను ద్వేషాన్ని రెచ్చగొట్టింది ఈ సాతాను వర్గాలే. దానియేలు నాశనానికి పథక రచనను ప్రోత్సహించింది వీరే. ఈ దుష్కృతానికి తమ్ముని తాము సాధనాలుగా సమర్పించుకుంటూ ఈ అధిపతులు దాన్ని ఆచరణలో పెట్టారు.PKTel 377.2

    తమ పథకం విజయవంతమవ్వటానికి ప్రవక్త తన నియమాల్ని ధృఢంగా ఆచరించటంపైనే అతడి ప్రత్యర్థులు ఆధారపడ్డారు. ఆ డిగ్రీని రూపొందించటంలో వారి దురుద్దేశాన్ని ప్రవక్త వెంటనే గ్రహించాడు. అయినా చిన్న విషయంలో సయితం అతడు తన పద్ధతిని మార్చుకోలేదు. తాను ఎక్కువగా ప్రార్థించాల్సినప్పుడు అతడు ప్రార్థించటం ఎందుకు మానాలి? దేవునిలో సహాయ నిరీక్షణల్ని వదులుకోవటం కన్నా అతడు తన ప్రాణాన్నే వదులుకుంటాడు. అధిపతుల్లో ముఖ్యుడుగా అతడు తన విధుల్ని ప్రశాంతంగా నెరవేర్చాడు. ప్రార్ధనకు సమయమైనప్పుడు తన గదిలోకి వెళ్లి, యెరూషలేము దిశగా కిటికీలు తెరచి తన అలవాటు ప్రకారం పరలోకమందున్న దేవునికి తన మనవులు విన్నవించు కున్నాడు. తన కార్యాన్ని దాచటానికి ప్రయత్నించలేదు. దేవునికి నమ్మకంగా ఉండటం ఎలాంటి పర్యవసానాలకు దారితీస్తుందో పూర్తిగా ఎరిగినప్పటికీ అతడి ఆత్మ తడబడలేదు. దేవునితో తన సంబంధం తెగిపోయినట్లు కనిపించటానికి సయితం తనను నాశనం చెయ్యటానికి కుట్రలు పన్నుతున్న వారిముందు అతడు ఒప్పుకోడు. రాజుకి ఆజ్ఞాపించే హక్కున్న సందర్బాలన్నిటిలోను దానియేలు రాజుకి విధేయుడయ్యాడు. కాని రాజులకు రాజైన దేవునికి విధేయత విషయంలో రాజుగాని రాజు డిక్రీగాని దానియేలుని కదల్చలేకపోటం జరిగింది.PKTel 377.3

    ప్రవక్త ఆత్మకూ దేవునికీ మధ్య నిలిచి, కలుగజేసుకునే హక్కు ఏ లోకాధికారానికీ లేదని ఇలా ధైర్యంగా, కాని నెమ్మదిగా, వినయంగా వెల్లడించాడు. అతడు విగ్రహారాధకుల నడుమ ఈ సత్యానికి నమ్మకమైన సాక్షిగా నిలబడ్డాడు. సత్యానికి నిర్భయంగా నిలబడిన అతడు ఆ అన్యరాజు ఆస్థానంలోని నైతిక అంధకారంలో ప్రకాశించే వెలుగులా ఉన్నాడు. క్రైస్తవ నిర్భయత్వానికి విశ్వసనీయతకు నేటి ప్రపంచం ముందు యోగ్యమైన ఆదర్శంగా నిలుస్తాడు. PKTel 377.4

    అధిపతులు ఒక దినమంతా దానియేలుని పరిశీలించారు. మూడుసార్లు అతడు తన గదిలోకి వెళ్లటం చూశారు. మూడుసార్లు అతడు తన స్వరమెత్తి దేవునికి ప్రార్థించటం విన్నారు. మరుసటి ఉదయం వారు తమ ఫిర్యాదును రాజుముందు పెట్టారు. తానెంతో అభిమానించి నిజాయితీపరుడైన రాజనీతిజ్ఞుడిగా గౌరవించే దానియేలు రాజు జారీ చేసిన డిక్రీని ధిక్కరించాడు. “రాజా, ముప్పది దినములవరకు నీకు తప్ప మరి ఏ దేవునికైనను మానవునికైనను ఎవడును ప్రార్థన చేయకూడదు; ఎవడైన చేసినయెడల వాడు సింహముల గుహలో పడద్రోయబడునని నీవు ఆజ్ఞ ఇయ్యలేదా?” అంటూ రాజుకి గుర్తు చేశారు.PKTel 378.1

    “మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతి ప్రకారము ఆ సంగతి స్థిరము; ఎవరును దాని రద్దు పరచలేరు” అని రాజన్నాడు.PKTel 378.2

    తనకు అత్యంత విశ్వాసపాత్రుడైన సలహాదారు ప్రవర్తన గురించి వారు రాజుకి తెలియపర్చారు. “చెరపట్టబడిన యూదులలో నున్న ఆ దానియేలు, నిన్నేగాని నీవు పుట్టించిన శాసనమునేగాని లక్ష్యపెట్టక, అనుదినము ముమ్మారు ప్రార్థన చేయుచు వచ్చుచున్నాడు” అన్నారు.PKTel 378.3

    రాజు ఈ మాటలు విన్నప్పుడు నమ్మకస్తుడైన తన సేవకుడికి వారు ఉచ్చును ఏర్పాటు చేశారని గ్రహించాడు. రాజు ఆజ్ఞ జారీకి వారి ప్రతిపాదన రాజుపై గౌరవాభిమానాల్ని బట్టి కాక దానియేలుపట్ల ఈర్ష్యను బట్టి అని రాజు నిర్ధారించు కున్నాడు. జరిగిన ఘోరంలో తనవంతు కీడుకు “బహుగా వ్యాకులపడి” తన మిత్రుణ్ని రక్షించటానికి “సూర్యుడస్తమించువరకు... ప్రయత్నము చేసెను.” రాజు ఇలాంటి ప్రయత్నం చేస్తాడని ముందే ఊహించిన అధిపతులు రాజువద్దకు వచ్చి “రాజా, రాజు సిద్దపరచిన యే శాసనముగాని తీర్మానముగాని యెవడును రద్దుపరచజాలడు; ఇది మాదీయులకును పారసీకులకును విధియని తమరు తెలిసికొనవలెను” అన్నారు. ఆ డిక్రీ దుందుడుకుగా జారీ చేసిందైనప్పటికీ దాన్ని మార్చటం అసాధ్యం. అది అమలు కావలసిందే.PKTel 378.4

    “అంతట రాజు ఆజ్ఞ ఇయ్యగా బంట్రోతులు దానియేలును పట్టుకొనిపోయి సింహముల గుహలో పడద్రోసిరి. పడద్రోయగా రాజు - నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పెను.” గుహ ద్వారాన్ని పెద్ద రాయితో మూశారు. “మరియు దానియేలును గూర్చి రాజుయొక్క తీర్మానము మారునేమోయని, రాజు ముద్రను అతని యధికారుల ముద్రను వేసి దాని ముద్రించిరి. అంతట రాజు తన నగరునకు వెళ్లి ఆ రాత్రి అంత ఉపవాసముండి నాట్య వాయిద్యములను జరుగనియ్యలేదు. అతనికి నిద్రపట్టకపోయెను.”PKTel 378.5

    దానియేలుని సింహాల గుహలో పడవేయకుండా అతడి ప్రత్యర్థుల్ని దేవుడు అడ్డుకోలేదు. దుష్ట దూతలు దుష్ట జనులు అప్పటివరకు తమ సంకల్పాన్ని నెరవేర్చు కోటానికి అనుమతించాడు. అయితే ఆయన అలా వ్యవహరించింది. తన సేవకుడి విమోచన అందరి దృష్టిని ఆకర్షించేందుకే. సత్యానికి నీతికి విరోధులైన వారి పరాజయాన్ని సంపూర్ణం చేసేందుకే. “నరుల ఆగ్రహము నిన్ను స్తుతించును.” అంటూ కీర్తనకారుడు సాక్ష్యమిస్తున్నాడు. (కీర్త. 76:10). సమయానుకూలంగా మెలగటం కన్నా సత్యానికి కట్టుబడి స్థిరంగా నిలిచిన ఈ ఒక్క మనిషి సాహసంద్వారా సాతాను పరాజయం పాలై దేవుని నామం ఘనత పొందాల్సి ఉంది.PKTel 379.1

    మరుసటి ఉదయం పెందలాడే లేచి దర్యావేషు రాజు గబగబ గుహవద్దకు వెళ్లి “దుఃఖముఖముతో “జీవముగల దేవుని సేవకుడైన దానియేలూ, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగెనా?” అని అడిగాడు.PKTel 379.2

    ప్రవక్త స్వరం ఇలా బదులు పలికింది : “రాజు చిరకాలము జీవించునుగాక. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని. గనుక ఆయన తన దూత నంపించి, సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసినవాడను కానుగదా?”PKTel 379.3

    రాజు ఇందును గూర్చి యతి సంతోషభరితుడై దానియేలును గుహలోనుండి పైకి తీయుడని ఆజ్ఞ ఇయ్యగా బంట్రోతులు దానియేలును బయటికి తీసిరి. అతడు తన దేవునియందు భక్తిగలవాడైనందున అతనికి ఏ హానియు కలుగలేదు.”PKTel 379.4

    “రాజు ఆజ్ఞ ఇయ్యగా దానియేలు మిద నిందమోపిన ఆ మనుష్యులను వారు తోడుకొని వచ్చి సింహముల గుహలో పడద్రోసిరి, వారిని వారి కుమారులను వారి భార్యలను పడద్రోసిరి. వారా గుహ అడుగునకు రాకమునుపే సింహముల పాలైరి. సింహములు వారి యెముకలను సహితము పగులగొరికి పొడిచేసెను.”PKTel 379.5

    దానియేలు దేవుడే నిజమైన దేవుడని ఘనపర్చుతూ ఓ అన్యరాజు ప్రకటన చెయ్యటం మరొకసారి జరిగింది. “రాజగు దర్యావేషు లోకమంతట నివసించు సకల జనులకును రాష్ట్రములకును ఆయా భాషలు మాటలాడు వారికిని ఈలాగు వ్రాయించెను - మికు క్షేమాభివృద్ధి కలుగునుగాక. నా సముఖమున నియమించిన దేమనగా - నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణకు చుండవలెను. ఆయనే జీవముగల దేవుడు. ఆయనే యుగయుగములుండువాడు; ఆయన రాజ్యము నాశనము కానేరదు. ఆయన ఆధిపత్యము తుదమట్టునకుండును. ఆయన విడిపించువాడును రక్షించువాడునై యుండి, పరమందును భూమిమీదను సూచక క్రియలను ఆశ్చర్య కార్యములను చేయువాడు. ఆయనే సింహముల నోటనుండి ఈ దానియేలును రక్షించెను.”PKTel 379.6

    దైవ సేవకుడికి ఆ దుష్టులనుంచి ఎదురైన వ్యతిరేకత పూర్తిగా నాశన మయ్యింది. “ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసీకుడగు కోరెషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లెను.” దానియేలుతో సహవాసం ద్వారా ఈ అన్యరాజులు అతడి దేవున్నే “జీవముగల దేవుడు ఆయనే యుగయుగము లుండువాడు, ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టునకుండును” అని గుర్తించారు.PKTel 380.1

    దైవప్రజలు తమ భవిష్యత్తు ఉజ్వలంగా తమ పరిసరాలు తమ హృదయ వాంఛలు కోరికలకు అనుగుణంగా ఉన్నట్లు కనిపించినప్పుడు ఎలా ఉన్నారో అలాగే శ్రమలు ఇక్కట్లు సంభవించినకాలంలోనూ ఉండాలని దానియేలు విమోచన కథనం నుంచి మనం నేర్చుకోవచ్చు. ఆ దేశ ప్రధానులలో ముఖ్యుడుగాను సర్వోన్నతుని ప్రవక్తగాను రాజుముందు నిలిచిన దానియేలే సింహాల గుహలో ఉన్న దానియేలు; దేవుని విషయంలో ఎవరి హృదయం అచంచలంగా స్థిరంగా ఉంటుందో ఆ వ్యక్తి దేవుని వెలుగు దేవుని ప్రసన్నత మానవుడి సహృదయత కలిగి సుఖంగా నివసిస్తున్నప్పుడూ అతి విషమ పరీక్ష వచ్చిన కష్టకాలంలోనూ ఒకేరీతిగా ఉంటాడు. విశ్వాసం దృశ్యం కాని వాటిని అందిపుచ్చుకుంటుంది. నిత్య సత్యాల్ని అవగతం చేసుకుంటుంది.PKTel 380.2

    నీతి విషయమై శ్రమలననుభవించే వారికి పరలోకం అతి సమీపంగా ఉంటుంది. నమ్మకమైన తన ప్రజల ఆసక్తులు క్రీస్తు ఆసక్తులు ఒకటవుతాయి. తన భక్తుల రూపంలో ఆయన శ్రమలననుభవిస్తాడు. ఆయన ఏర్పర్చుకున్నవారిని ఎవరు శ్రమ పెడతారో వారు ఆయన్ని శ్రమపెట్టిన వారవుతారు. శారీరక హానినీ దుఃఖాన్ని నివారించటానికి సమీపంగా ఉన్న శక్తి మరింత అపాయకరమైన కీడునుంచి రక్షించటానికి కూడా సమీపంగా ఉంటుంది. దైవ సేవకుడు అన్ని పరిస్థితుల్లోను తన విశ్వసనీయతను కొనసాగించటానికి దైవకృపద్వారా విజయం సాధించటానికి ఇది సాయపడ్తుంది.PKTel 380.3

    ఓ వ్యాపారి దురాలోచన పరుడు, మోసకారి కానక్కరలేదని కాని ప్రతీ విషయంలోను దేవుని ఉపదేశం పొందే వ్యక్తిగా మెలగవచ్చునని బబులోను మాదీయ పారసీక రాజ్యాల్లో రాజనీతిజ్ఞుడుగా దానియేలు అనుభవం బయలు పర్చుతున్నది. లోక రాజ్యాల్లో మిక్కిలి గొప్ప రాజ్యంలో ప్రధానమంత్రిగా సేవచేసిన దానియేలు అదే సమయంలో దేవుని ప్రవక్తగా ఉండి దైవావేశంతో నిండిన పరలోక వికాసాన్ని పొందుతూ ఉన్నాడు. మనవంటి స్వభావంగల మనుషుడే అయిన అతణ్ని ఆత్మావేశపూరిత లేఖనం దోషరహితుడుగా వర్ణిస్తున్నది. తన శత్రువులు జాగ్రత్తగా పరిశీలించినప్పుడు అతడి వ్యాపార వ్యహారాల్లో ఎలాంటి తప్పు పట్టుకోలేకపోయారు. హృదయంలో మార్పు కలిగి తన్నుతాను దేవునికి సమర్పించుకుని, దేవుని దృష్టికి న్యాయమైన ఉద్దేశాలు గల ప్రతీ వ్యాపారికీ దానియేలు ఓ ఆదర్శం.PKTel 380.4

    దేవుని ధర్మశాసనాల్ని నిష్టగా ఆచరించటంద్వారా లోక సంబంధమైన దీవెనలు ఆధ్మాత్మిక దీవెనలు పొందగలుగుతాం. దేవునికి నమ్మకంగా ఉండటంలో అచంచలంగా, ఆత్మ నిగ్రహం విషయంలో నిశ్చలంగా నిలిచిన దానియేలు తన ఉదాత్త నడతవల్ల, ధృఢ విశ్వసనీయతవల్ల తనపై నియమితుడైన అన్య అధికారి “కృపాకటాక్షములు” పొందగలిగాడు. దాని 1:9. తన అనంతర జీవితంలోనూ ఇవే లక్షణాలు కొనసాగాయి. బబులోను రాజ్యంలో ప్రధానమంత్రి హోదాకి త్వరత్వరగా ఎదిగాడు. వరుసగా వచ్చిన రాజుల ఏలుబడి కాలమంతా, జాతి పతన కాలమంతా, మరో ప్రపంచ సామ్రాజ్య సంస్థాపన కాలమంతా తన శత్రువులు సయితం అతడు నియమ నిబద్దుడు “నమ్మకస్తుడు... గనుక దానియేలులో తప్పయినను లోపమైనను కనబడలేదని ఒప్పుకున్నారు. అతడి వివేకం, రాజనీతిజ్ఞత, నేర్పు, వినయ విధేయతలు, నిష్కళంక సహృదయత, నియనిబద్ధత అలాంటివి.PKTel 381.1

    లోకాన్ని పరిపాలించిన గొప్ప రాజ్యాలు తమ ప్రభుత్వాల్లో ఉన్నత బాధ్యతల్ని తనకు ఇవ్వటం ద్వారా దేశ ఆంతరంగిక వ్యవహారాలు తనకు అప్పగించటం ద్వారా, మనుషులు దానియేలుని గౌరవించి అభిమానించగా, దేవుడు అతణ్ని తన రాయబారిగా ఎంపిక చేసుకుని గౌరవించాడు. రానున్న యుగాలకు సంబంధించిన మర్మాల్ని గురించి అనేక సంగతులను అతడికి వెల్లడించాడు. తన పేరుగల గ్రంథంలో ఏడునుంచి పన్నెండు అధ్యాయాల్లో దాఖలైన అద్భుతమైన అతడి ప్రవచనాలు తనకే పూర్తిగా అవగతం కాలేదు. కాకపోతే తన పరిచర్యకాలం అంతం కాకముందు అతడికి ఈ వాగ్దానం ఇవ్వటం జరిగింది. “అంత్యకాలము”లో, అనగా ఈ లోక చరిత్ర ముగిసే సమయంలో, అతడు మళ్లీ లేచి తన వంతులో నిలవటం జరుగుతుందన్నది ఆ వాగ్దానం. తన సంకల్పం గురించి దేవుడు తనకు బయలు పర్చిందంతా దానియేలు అవగాహన చేసుకోటం దేవుని చిత్తంకాదు. తన ప్రవచన రచనల విషయంలో అతడికి వచ్చిన ఆదేశం ఇది, “ఈ సంగతులు అంత్యకాలము వరకు మరుగున ఉండునట్లు ముద్రింప బడినవి.” నమ్మకమైన యెహోవా సేవకుణ్ని దూత మరోసారి ఇలా ఆదేశించాడు, “ఈ సంగతులు అంత్యకాలము వరకు మరుగుగా ఉండునట్లు ముద్రింపబడినవి గనుక, దానియేలూ, నీవు ఊరకుండుము. నీవు అంత్యమువరకు నిలకడగా ఉండిన యెడల విశ్రాంతినొంది కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు.” దాని. 12:4,9,13.PKTel 381.2

    మనం లోకచరిత్ర అంతాన్ని సమీపించేకొద్దీ దానియేలు దాఖలు చేసిన ప్రవచనాలు మనం నివసిస్తున్న ప్రస్తుత కాలానికి సంబంధించినవి కావటంతో వాటిని శ్రద్ధతో పరిశీలించటం అవసరం. వాటితో నూతన నిబంధనలోని చివరి గ్రంథ బోధనల్ని జతచేసి అధ్యయనం చెయ్యటం ఆగత్యం. దానియేలు ప్రకటన రచయిత యోహాను రాసిన ప్రవచన వాక్య భాగాల్ని అవగాహన చేసుకోలేమని నమ్మటానికి సాతాను అనేకుల్ని నడిపిస్తున్నాడు. ఈ ప్రవచనాల్ని అధ్యయనం చేసేవారికి ప్రత్యేక దీవెనలుంటాయని వాగ్దానం స్పష్టంగా చెబుతుంది. చివరి దినాల్లో ముద్రలు విప్పబడాల్సి ఉన్న దానియేలు దర్శనాల్ని “బుద్దిమంతులు గ్రహించెదరు” అని ఉంది. (10వ వచనం) శతాబ్దాల పొడవునా దైవ ప్రజల నడుపుదల నిమిత్తం తన సేవకుడు యోహానుకి క్రీస్తు ఇచ్చిన ప్రత్యక్షతను గురించిన వాగ్దానం ఇది, “సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును, వాటిని గైకొనువాడును ధన్యులు.” ప్రక. 1:8.PKTel 382.1

    దానియేలు, ప్రకటన గ్రంథాల్లో విశదం చెయ్యబడ్డట్లు కేవలం బహిర్గతమైన ఐహికమైన వైభవం ఎంత వ్యర్థమైందో రాజ్యాల ఉత్థాన పతనాలనుంచి మనం నేర్చుకోటం అవసరం. మన ప్రపంచం ఎన్నడూ కనివిని ఎరుగని అధికారం, వైభవంతో వర్ధిల్లిన బబులోను ఎలా పతనమై పూర్తిగా గతించిపోయింది! ఆ అధికారం ఆ వైబోగం ఆనాటి ప్రజల దృష్టికి ఎంత సుస్థిరంగా నిరంతరంగా కొనసాగేటట్లు కనిపించాయి! అవి “గడ్డి పువ్వువలె” నశించిపోయాయి. యాకో. 1:10. మాదీయ పారసీక రాజ్యం, గ్రీసు రాజ్యం, రోమా రాజ్యం అలాగే నశించిపోయాయి. దేవుడు దేనికి పునాదిగా లేడో అదంతా నశిస్తుంది. ఆయన సంకల్పంతో ఏది ముడిపడి ఉండి ఆయన ప్రవర్తనను కనపర్చుతుందో అది మాత్రమే నిలుస్తుంది. ఈ లోకం ఎరిగిన స్థిరమైన నియమాలు ఆయన ధర్మసూత్రాలు మాత్రమే.PKTel 382.2

    దేశాల చరిత్రలోను, రానున్న సంభవాల వెల్లడిలోను దేవుని ఉద్దేశం నెరవేర్పును జాగ్రత్తగా అధ్యయనం చేయటం, దృశ్యమైనవాటి, అదృశ్యమైన వాటి వాస్తవిక విలువను బేరీజు వేసుకోటానికి, జీవితం వాస్తవిక లక్ష్యం ఏమిటో తెలుసుకునేందుకు మనకు తోడ్పడుతుంది. నిత్యత్వం వెలుగులో కాలానికి సంబంధించిన విషయాల్ని ఇలా పరిశీలిస్తూ, దానియేలు అతడి సహచరుల్లా మనం ఏది వాస్తవమో ఏది ఉదాత్తమో ఏది నిత్యం నిలుస్తుందో దానికోసం నివసించవచ్చు. మన ప్రభువు రక్షకుడు అయిన ఆయన రాజ్య నియమాల్ని ఈ జీవితంలో నేర్చుకోటం ద్వారా, నిత్యం నిలిచే ఆ మహిమకరమైన రాజ్యంలో, మనం ఆయన వచ్చినప్పుడు ఆయనతో ప్రవేశించవచ్చు. దాన్ని స్వతంత్రించుకోవచ్చు.PKTel 382.3

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents