Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
ప్రవక్తలు - రాజులు - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    19 - సమాధాన ప్రవక్త

    ప్రవక్తగా ఎలీషా పరిచర్య కొన్ని సందర్భాల్లో ఏలీయా పరిచర్యకన్నా వ్యత్యాస మైంది. ఏలీయాకి దేవుడు ఖండన, తీర్పుల వర్తమానాల్ని ఇచ్చాడు. అతడి స్వరం రాజుల్ని ప్రజల్ని తమ దుష్టమార్గాల నుంచి తొలగమంటూ నిర్భయంగా గద్దించిన స్వరం. ఎలీషాది ఎక్కువ భాగం సమాధాన కర్తవ్యం. అతడి సేవ ఏలీయా ప్రారంభించిన పనిని నిర్మించటం, బలపర్చటం ప్రజలకు ప్రభువు మార్గాన్ని బోధించటం. అతడు ప్రజలతో వ్యక్తిగత సంబంధాలు కలిగి ఉంటాడని, ప్రవక్తల శిష్యులు అతడి చుట్టూ ఉంటారని, తన సూచకక్రియల ద్వారాను, తన పరిచర్య ద్వారాను స్వస్తతను కూర్చి సంతోషానందాలు కలిగిస్తాడని లేఖనం చెబుతున్నది.PKTel 156.1

    ఎలీషా మృదు స్వభావి, కరుణాశీలి. కాగా అతడు కూడా కఠినంగా వ్యవహరించ గలడనటానికి అతడు బేతేలుకి వెళ్తునప్పుడు భక్తిమర్యాదలు లోపించిన యువకులు పట్టణంలోనుంచి బయటికివచ్చి తనను ఎగతాళి చేయగా అతడు తీసుకున్న చర్య ఒక నిదర్శనం. ఈ యువకులు ఏలీయా ఆరోహణాన్ని గురించి విని ఆ గంభీర ఘటనను తమ ఎగతాళికి అంశంగా చేసుకుని ఎలీషానుద్దేశించి “బోడివాడా ఎక్కిపొమ్ము, బోడివాడా ఎక్కిపొమ్ము” అని కేకలు వేశారు. ఆ ఎగతాళి మాటలు విని ప్రవక్త వెనక్కి చూసి దైవావేశం కింద వారి మీద శాపం పలికాడు. ఆ తర్వాత వచ్చిన తీర్పు దేవుని వలన కలిగింది. “అప్పుడు రెండు ఆడు ఎలుగుబంట్లు అడివిలో నుండి వచ్చి వారిలో నలువది. యిద్దరు బాలురను చీల్చివేసెను.” 2 రాజులు 2:23,24.PKTel 156.2

    ఎలీషా ఆ ఎగతాళిని పట్టించుకోకుండా విడిచిపెట్టి ఉంటే అల్లరి మూక అతణ్ని ఇంకా ఎగతాళి చేసి ఆటపట్టించేది. జాతి గొప్ప విపత్తును ఎదుర్కుంటున్న సమయంలో ఉపదేశించి రక్షించటమన్న తన కర్తవ్యం విఫలమయ్యేది. మిక్కిలి కాఠిన్యం ప్రదర్శితమైన ఈ ఒక్క సందర్భం తన జీవిత కాలమంతా గౌరవం పొందటానికి సరిపోయింది. నలభై సంవత్సరాలు బేతేలుకి రావటం పోవటం ఆ ప్రాంతంలో అటూ ఇటూ తిరగటం, ఒక పట్టణం నుంచి మరొక పట్టణానికి వెళ్లటం, జులాయి పిల్లల గుంపుల్ని దాటి వెళ్లటం జరిగింది. ఒక్కడు కూడా అతణ్ని ఎగతాళి చెయ్యటంగాని లేక దైవ ప్రవక్తగా అతడి అర్హతల్ని గురించి చులకనగా మాట్లాడటంగాని జరగలేదు.PKTel 156.3

    దయకు సయితం హద్దులుండాలి. అధికారాన్ని కాపాడటంలో కాఠిన్యం అవసరం. లేకపోతే అనేకులు అధికారాన్ని చులకనచేసి ధిక్కరిస్తారు. బాల్యంలో ఉన్న తమ పిల్లలపట్ల తల్లిదండ్రుల మమకారం వారి పట్ల తల్లిదండ్రుల బుజ్జగింపుధోరణి మెతక వైఖరి వారికి జరగగల అపకారాల్లో మిక్కిలి హానికరమైంది. ప్రతీ కుటుంబంలోను దృఢవైఖరి, నిర్దిష్టత, సానుకూల విధులు అత్యవసరం.PKTel 157.1

    ఎలీషాను ఎగతాళి చేసిన బాలురిలో లోపించిన గౌరవం, జాగ్రత్తగా అలవర్చుకోవాల్సిన సద్గుణం. దేవునిపట్ల పూజ్యభావం కలిగి ఉండాలని ప్రతీ బిడ్డకు నేర్పించాలి. దేవుని నామం గురించి చులకనగా మాట్లాడటంగాని అనాలోచితంగా మాట్లాడంగాని చెయ్యకూడదు. ఆ నామాన్ని ఉచ్చరించేటప్పుడు దేవదూతలు తమ ముఖాలు కప్పుకుంటారు. పడిపోయిన మనం, పాపులమైన మనం ఆ నామాన్ని ఉచ్చరించేటప్పుడు మరెంతగా భక్తి భావం ప్రదర్శించాలి!PKTel 157.2

    బోధకులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు దేవుని ప్రతినిధులు. వారిపట్ల గౌరవమర్యాదలు ప్రదర్శించాలి. వారు దేవుని స్థానంలో మాట్లాడటానికి వ్యవహరించటానికి పిలుపు పొందారు. వారిని గౌరవించటంలో దేవున్ని గౌరవించటం జరుగుతుంది.PKTel 157.3

    మర్యాద కూడా ఆత్మవలన కలిగే సద్గుణాల్లో ఒకటి. దాన్ని అందరూ అలవర్చు కోవాలి. దానికి స్వభావాల్ని మెత్తబర్చే శక్తి ఉంది. అది లేకపోతే అవి కఠినంగాను కరకుగాను పెరుగుతాయి. క్రీస్తు అనుచరులమని చెప్పుకుంటూ అదే సమయంలో కఠినంగా నిర్దయగా అమర్యాదగా ఉండేవారు యేసు వద్ద నేర్చుకున్నవారు కారు. వారికి చిత్తశుద్ది లేదనలేం. వారి నిజాయితీని ప్రశ్నించలేం. అయితే దయ మర్యాద లోటును చిత్తశుద్ధి నిజాయితీ పూడ్చలేవు.PKTel 157.4

    ఇశ్రాయేలులో అనేకులు జీవితాల్ని బలంగా ప్రభావితం చేసిన ఎలీషా దయా స్వభావాన్ని షూనేములో నివసిస్తున్న ఒక కుటుంబంతో అతడి సంబంధాల కథ వెల్లడిచేస్తున్నది. ఆ రాజ్యంలో అతడి రాకపోకల్లో “ఒక దినమందు ఎలీషా షూనేమునకు పోగా అచ్చట ఘనురాలైన యొక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతము చేసెను గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా ఆమె యింట భోజనము చేయుచువచ్చెను.” ఎలీషా “భక్తిగల దైవజనుడు” అది ఆ గృహిణి గ్రహించి తన భర్తతో ఇలా అంది, “మనము అతనికి గోడమీద ఒక చిన్నగది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము నుంచుదము, అతడు మన యొద్దకు వచ్చునప్పుడెల్ల అందులో బస చేయవచ్చును.” ఈ ఆశ్రయానికి ఎలీషా తరచుగా వచ్చేవాడు. అక్కడి ప్రశాంత వాతావరణాన్ని ఎంతో అభినందించాడు. దేవుడు ఆమె చూపిన దయను గుర్తించకపోలేదు. అది పిల్లలులేని గృహం. ప్రభువు ఆమె చూపిన దయకు ఆతిథ్యానికి ప్రతిఫలంగా ఒక కుమారుణ్ని ఇచ్చాడు.PKTel 157.5

    ఏళ్లు గడిచాయి. కుర్రాడు పొలం వెళ్లి కోతగాండ్రతో ఉండగల వయసుకు వచ్చాడు. ఒకరోజు బాగా ఎండదెబ్బ తగిలింది. “వాడు నా తల పోయెనే నా తల పోయెనే అని తండ్రితో చెప్పెను.” ఆ కుర్రాణ్ని తల్లివద్దకు మోసుకు వెళ్లమని ఒక యువకుణ్ని పిలిచిచెప్పాడు. “వాడు ఆ బాలుని ఎత్తికొని వాని తల్లియొద్దకు తీసుకొని పోయెను. పిల్లవాడు మధ్యాహ్నము వరకు తల్లితొడమీద పండుకొని యుండి చనిపోయెను. అప్పుడు ఆమె పిల్లవానిని దైవజనుని మంచముమీద పెట్టి తలుపువేసి బయటికివచ్చెను.”PKTel 158.1

    ఆ షూనేమియురాలు తన దుఃఖంలో సహాయంకోసం ఎలీషా వద్దకు వెళ్ళటానికి నిశ్చయించుకుంది. ప్రవక్త ఆ సమయంలో కర్మెలు పర్వతంపై ఉన్నాడు. ఆ స్త్రీ తన సేవకుణ్ని వెంట పెట్టుకుని వెంటనే బయలుదేరింది. “దైవజనుడు దూరము నుండి ఆమెను చూచి - అదిగో ఆ పనేమియురాలు, నీవు ఆమెను ఎదుర్కొనుటకై పరుగునపోయి - నీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖముగా ఉన్నారా అని అడుగుమని తన పనివాడైన గేహజీతో చెప్పి పంపెను.” సేవకుడు తన యజమానుడు చెప్పినట్లు చేశాడు. కాని దుఃఖాక్రాంతురాలైన ఆ తల్లి ఎలీషా వద్దకు వచ్చేవరకు తన దుఃఖానికి కారణాన్ని తెలియపర్చలేదు. ఆమె కుమారుడి మరణం గురించి విన్నప్పుడు ఎలీషా గేహజీని ఇలా ఆదేశించాడు, “నీ నడుము బిగించుకొని నా దండమును చేతపట్టుకొని పొమ్ము; ఎవరైనను నీకు ఎదురుపడినయెడల వారికి నమస్కరింపవద్దు; ఎవరైనను నీకు నమస్కరించిన యెడల వారికి ప్రతి మర్యాద చేయ్యవద్దు. అక్కడికిపోయి నా దండము ఆ బాలుని ముఖముమీద పెట్టుము.”PKTel 158.2

    కాని ఆ తల్లి ఎలీషా తనతో వచ్చేవరకూ తృప్తి చెందలేదు. ఆమె “యెహోవా జీవముతోడు నీ జీవముతోడు, నేను నిన్ను విడువనని చెప్పగా అతడు లేచి ఆమెతో కూడా పోయెను. గేహజీ వారికంటే ముందుగా పోయి ఆ దండమును బాలుని ముఖముమీద పెట్టెనుగాని యే శబ్దమును రాకపోయెను, ఏమియు వినవచ్చినట్లు కనబడలేదు గనుక వాడు ఎలీషాను ఎదుర్కొనవచ్చి - బాలుడు మేల్కొనలేదని చెప్పెను.”PKTel 158.3

    వారు ఇల్లు చేరాక ఎలీషా చనిపోయిన బాలుణ్ని ఉంచిన గదిలోకి వెళ్లి “వారిద్దరు లోపలనుండగా తలుపువేసి, యెహోవాకు ప్రార్ధన చేసి, మంచముమీద ఎక్కి బిడ్డమీద తన్ను చాచుకొని తన నోరు వానినోటి మిదను తన కండ్లు వాని కండ్లమిదను తన చేతులు వాని చేతులమీదను ఉంచి బిడ్డమీద పొడుగుగా పండుకొనగా ఆబిడ్డ ఒంటికి వెట్టపుట్టెను. తాను దిగి యింటిలో ఇవతల నుండి యవతలకు ఒకసారి తిరిగి నడచి, మరల మంచము మీద ఎక్కి వాని మిద పొడుగుగా పండుకొనగా బిడ్డ యేడుమారులు తుమ్మి కండ్లు తెరచెను.”PKTel 159.1

    ఎలీషా గేహజీని పిలిచి ఆ తల్లిని తన వద్దకు పంపమని చెప్పాడు. “ఆమె అతని యొద్దకు రాగా అతడు నీ కుమారుని యెత్తికొనుమని ఆమెతో చెప్పను. అంతట ఆమె లోపలికి వచ్చి అతని కాళ్ళమీద సాష్టాంగపడి లేచి తన కుమారుని ఎత్తికొనిపోయెను.”PKTel 159.2

    ఈ స్త్రీ విశ్వాసానికి ఈ విధంగా ప్రతిఫలం లభించింది. జీవానికి నాధుడైన క్రీస్తు ఈ స్త్రీకి తన కుమారుణ్ని ఇచ్చాడు. ఆయన వచ్చినప్పుడు మరణం కాటు తన శక్తిని, సమాధి, అది చెప్పుకుంటున్న తన విజయాన్ని కోల్పోయినప్పుడు ఆయన్ని విశ్వసించిన వారు ఇదే రీతిగా ప్రతిఫలం పొందుతారు. తన సేవకులు మరణం ద్వారా కోల్పోయిన తమ బిడ్డల్ని అప్పుడు వారికి పునరుద్దరిస్తాడు. “ఆలకించుడి, రామాలో అంగలార్పును మహారోదన ధ్వనియు వినబడుచున్నవి. రాహేలు తన పిల్లలను గూర్చి యేడ్చుచున్నది, ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గూర్చి ఓదార్పు పొందనొల్లకున్నది. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు - ఏడవక ఊరకొనుము, కన్నీళ్లు విడుచుట మానుము, నీ క్రియ సఫలమై, జనులు శత్రువుని దేశములో నుండి తిరిగి వచ్చెదరు. ఇదే యెహోవా వాక్కు” యిర్మీ. 31:15-17.PKTel 159.3

    మరణించినవారి నిమిత్తం దుఃఖించే మనల్ని యేసు ఈ నిరీక్షణతో ఓదార్చు తున్నాడు: “పాతాళ వశములోనుండి నేను వారిని విమోచింతును, మృత్యువునుండి వారిని రక్షింతును. ఓ మరణమా, నీ విజయమెక్కడ? ఓ మరణమా, నీ ముల్లెక్కడ? పశ్చాత్తాపమునాకు పుట్టదు.” హోషే 13:14. “నేను.... జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనైయున్నాడు. మరియు మరణము యొక్కయు పాతాళములోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి.” ప్రక 1:18. “ఆర్భాటముతోను, ప్రధానదూత శబ్దముతోను, దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును; క్రీస్తునందుండి మృతులైనవారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడ ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘములమీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడ ఉందుము” 1 థెస్స 4:16,17.PKTel 159.4

    మానవాళి రక్షకుడైన క్రీస్తులాగే ఆయనకు ఛాయారూపమైన ఎలీషా మనుషుల నడుమ తన పరిచర్యతో బోధతో స్వస్తత సేవను నిర్వహించాడు. సుదీర్ఘమైన, ఫలదాయకమైన సేవలో ప్రవక్తల పాఠశాలలు నిర్వహిస్తున్న ప్రాముఖ్యమైన విద్యాకృషిని వృద్ధి పర్చటానికి ఎలీషా నమ్మకంగాను అవిశ్రాంతగాను పనిచేశాడు. సమావేశమైన, చిత్తశుద్దిగల యువకులకు అతడి ఉపదేశోక్తులు దేవుని కృపలో పరిశుద్ధాత్మ చర్యవలన ధ్రువీకరణ పొందాయి. కొన్నిసార్లు స్పష్టమైన నిదర్శనాల ద్వారా యెహోవా సేవకుడుగా అతడి అధికారం ధ్రువపడింది.PKTel 160.1

    గిల్గాలులో స్థాపితమైన పాఠశాలను సందర్శించిన ఒక సందర్భంలో అతడు విషపూరితాహారాన్ని సరిచేశాడు. “ఆ దేశమందు క్షామము కలిగియుండెను. ప్రవక్తల శిష్యులు అతని సమక్షమునందు కూర్చుండియుండగా అతడు తన పని వానిని పిలిచి - పెద్దకుండ పొయ్యిమీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూరవంట చేయుమని సెలవిచ్చెను. అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలములోనికి పోయి వెట్టిద్రాక్ష చెట్టును చూచి దాని గుణమెరుగక దాని తీగెలు తెంపి ఒడినిండా నింపుకొని వచ్చి, వాటిని తరిగి కూరకుండలో వేసెను. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచిచూచి - దైవజనుడా, కుండలో విషమున్నదని కేకలు వేసి దానిని తినకమానిరి. అతడు - పిండి కొంత తెమ్మనెను. వారు తేగా - కుండలో దాని వేసి, జనులు భోజనము చేయుటకు వడ్డించుడని చెప్పెను. వడ్డింపగా కుండలో మరి ఏ జబ్బు కనిపించక పోయెను.”PKTel 160.2

    దేశంలో ఇంకా కరవుఉన్న కాలంలో “ఒకడు బయలాలిషా నుండి మొదటి పంట బాపతు యవల పిండితో చేయబడిన యిరువది రొట్టెలను, క్రొత్త గోధుమ వెన్నెలను” ఎలీషాకి కానుకగా తెచ్చాడు. తీవ్రమైన ఆకలితో ఉన్నవారు ప్రవక్తతో ఉన్నారు. ఆ కానుక వచ్చినప్పుడు అతడు సేవకునితో ఇలా అన్నాడు, “జనులు భోజనము చేయుటకు దాని వడ్డించుమనెను అయితే అతని పనివాడు - నూరు మందికి వడ్డించుటకు ఇవి ఎంతవని చెప్పగా అతడు - వారు తినగా మిగులునని యెహోవా సెలవిచ్చియున్నాడు గనుక జనులు భోజనము చేయునట్లు వడ్డించుమని మరల ఆజ్ఞ ఇచ్చెను. పనివాడు వారికి వడ్డింపగా యెహోవా సెలవిచ్చినట్లు అది. వారు తినిన తరువాత మిగిలిపోయెను.”PKTel 160.3

    ఆకలిని తీర్చటానికి తన సేవకునిద్వారా ఈ అద్భుతం చేయటంలో క్రీస్తు తన్నుతాను ఎంతగా తగ్గించుకున్నాడు! అప్పటినుంచి, ఎప్పుడూ అంత బహిర్గతంగాను ప్రజాకరకంగాను కాకపోయినా యేసు ప్రభువు మానవావసరాన్ని తీర్చటానికి మళ్లీ మళ్లీ సూచక క్రియలు చేశాడు. మనకు స్పష్టమైన ఆధ్మాత్మిక అవగాహన ఉంటే, మనుషులపట్ల దేవుడు కరుణా కటాక్షాలతో వ్యవహరిస్తున్నాడని మనం గుర్తిస్తాం.PKTel 160.4

    ఆ కొంచెం పై దేవుని దీవెన ఉన్నప్పుడు అది సర్వసమృద్ధమవుతుంది. దాన్ని దేవుని హస్తం వందరెట్లు చేయగలుగుతుంది. తన వనరుల నుంచి అరణ్యంలో ఆయన భోజనం సిద్దం చెయ్యగలడు. తన చేతి తాకిడి ద్వారా స్వల్ప దినుసుల్ని ఆయన అందరికీ సరిపెట్టగలడు. ప్రవక్తల శిష్యుల చేతుల్లోని రొట్టెల్ని సరిపోయేటంత ఎక్కువ చేసింది ఆయన శక్తే. PKTel 161.1

    ప్రవక్త ఎలీషా సేవకుడు “నూరు మందికి వడ్డించుటకు ఇవి యెంతవి?” అని అవిశ్వాసాన్ని కనపర్చినట్లే క్రీస్తు పరిచర్య చేసిన దినాల్లో జనసమూహానికి ఆహారం పెట్టటానికి ఇలాంటి సూచకక్రియనే ఆయన చేసినప్పుడు కూడా అవిశ్వాసాన్ని వ్యక్తం చెయ్యటం జరిగింది. జనసమూహానికి భోజనం పెట్టాల్సిందిగా యేసు శిష్యుల్ని ఆదేశించినప్పుడు వారిలా బదులు పలికారు, “మాయొద్ద అయిదు రొట్టెలును రెండు చేపలును తప్ప మరేమియులేదు, మేము వెళ్లి యీ ప్రజలందరి కొరకు భోజన పదార్ధములను కొనితెత్తుమా?” లూకా 9:13. అంతమందికి అది ఏమూల?PKTel 161.2

    ఇది ప్రతీయుగంలోను దేవుని బిడ్డలకు గొప్పపాఠం. చేయటానికి దేవుడు ఒక పని ఇచ్చినప్పుడు ఆ ఆదేశం హేతుబద్ధతను గురించి ఆరా తీయటానికిగాని లేదా దానికి విధేయులవ్వటం వల్ల కలిగే ఫలితాల గురించి విచారణ చెయ్యటానికిగాని మనుషులు ఆగకుందురుగాక. అవసరానికి చాలినంత సరఫరా వారి చేతుల్లో తరిగిపోవచ్చు. కాని ప్రభువు చేతుల్లో అది అవసరానికి మించిన సరఫరా అవుతుంది. రక్షకుడు “వారికి వడ్డించగా యెహోవా సెలవిచ్చినట్లు అది వారు తినిన తరువాత మిగిలిపోయెను.”PKTel 161.3

    కుమారుని రక్తంతో తాను కొన్నవారితో దేవుని సంబంధాన్ని గూర్చిన పూర్తి గుర్తింపు, లోకంలో ఆయన సేవ పురోగమనంపై మరింత విశ్వాసం - ఇదే నేడు సంఘానికున్న గొప్ప అవసరం. తమకు కనిపిస్తున్న వనరులు పరిమితంగానే ఉన్నాయని ఎవరూ చింతించకుందురుగాక. పైకి కనిపించే వనరులు నిరాశ కలిగించవచ్చు. కాని దేవుని శక్తి, ఆయన మీద నమ్మకం వనరుల్ని వృద్ధిపర్చుతాయి. శిష్యులికీ అలసిపోయి ఆకలిగా ఉన్న జనసమూహానికి ప్రభువు ఆహారాన్ని పెంపుచేసిన రీతిగా కృతజ్ఞతార్పణలతోను ఆయన దీవెనలకోసం ప్రార్థనతోను ఆయనకు సమర్పించే కానుకల్ని ఆయన పెంపు చేయగలడు.PKTel 161.4

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents