Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
ప్రవక్తలు - రాజులు - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    35 - ముంచుకొస్తున్న ముప్ప

    యెహోయాకీము ఏలుబడి తొలి సంవత్సరాలు ముంచుకొస్తున్న ముప్పును గూర్చిన హెచ్చరికలతో నిండి ఉన్నాయి. దేవుడు తన ప్రవక్తల నోట పలికిన ప్రవచన వాక్కులు నెరవేరటానికి సిద్దంగా ఉన్నాయి. ఉత్తరాన ఎంతోకాలంగా ప్రబలశక్తిగా ఉన్న అషూరు రాజ్యం ఆధిపత్యం ఇక కొనసాగబోదు. దక్షిణాన ఉన్న ఐగుప్తు రాజ్యంపై యూదరాజు ఆశలు పెట్టుకుని ఉన్నాడు. త్వరలో ఆ రాజ్య ప్రాబల్యానికి అడ్డుకట్ట పడనున్నది. తూర్పున బబులోను సామ్రాజ్యం అనే ఓ నూతన ప్రపంచ శక్తి ఉదయించి అనతికాలంలోనే ఇతర జాతులన్నిటిపై ఆధిక్యం ప్రాబల్యం సంపాదించింది.PKTel 294.1

    పశ్చాత్తాపంలేని యూదాపై తన ఆగ్రహానికి సాధనంగా దేవుడు బబులోను రాజును కొద్ది సంవత్సరాల్లోనే వినియోగించుకున్నాడు. నెబుకద్నెజరు సేనలు యెరూషలేమును మళ్లీ మళ్లీ ముట్టడించి ఆ పట్టణంలో ప్రవేశించనున్నాయి. గుంపులు గుంపులుగా - మొదట కొందరు మాత్రమే కాని అనంతరం వేలు పదివేల సంఖ్యలో - ప్రజల్ని బానిసలుగా షీనారు దేశానికి తరలించనున్నాయి. “వారు అక్కడ నిర్బంధ ప్రవాసంలో నివసించాల్సి ఉన్నారు. యెహోయాకీము, యెహోయాకీను, సిద్కియా - ఈ యూదు రాజులందరూ బబులోను పాలకులకు దాసులు కావలసి ఉన్నారు. వీరందరూ కాలక్రమంలో తిరుగుబాటు చేయాల్సి ఉన్నారు. తిరుగుబాటు చేసే జాతులపై ఉక్కుపాదం మోపి, చివరికి ఆ దేశాన్ని నిర్మానుష్యం చేయాల్సి ఉంది. యెరూషలేము అగ్నికి ఆహుతి అయి శిధిలాల కుప్పగా మిగలనుంది. సొలొమోను నిర్మించిన దేవాలయం నాశనం కానుంది. యూదా రాజ్యం పతనం కానుంది. భూరాజ్యాల్లో అది ఎన్నడు తన పూర్వ స్థానాన్ని సంపాదించటం జరగదు.PKTel 294.2

    మార్పు చోటుచేసుకున్న దినాలు ఇశ్రాయేలు జాతికి ప్రమాదంతో నిండిన దినాలు. ఆ సమయాల్లో యిర్మీయా ద్వారా దేవుడు ఎన్నో వర్తమానాలు ఆ ప్రజలకి పంపాడు. ఐగుపుతో మైత్రీ సంబంధాల మూలంగా బబులోను పాలకులతో విరోధం పెంచుకోకుండా జాగ్రత్త పడేందుకు ప్రభువు యూదా ప్రజలకు అవకాశం ఇచ్చాడు. ఆ ముప్పు దగ్గరపడుతున్న కొద్దీ ఉపమానాల్ని నాటక రూపంలో ప్రదర్శించటంద్వారా వారికి యిర్మీయా బోధించాడు. ఇలా వారిని దేవునికి విధేయుల్ని చెయ్యాలని బబులోను పాలకులతో స్నేహ సంబంధాలు కలిగి మెలిగేటట్లు ప్రోత్సహించాలని ప్రయత్నించాడు.PKTel 294.3

    దైవ నిబంధనలికి తిరుగులేని విధేయత చూపించటం ప్రాముఖ్యమని ఉదాహరించటానికి యిర్మీయా రేకాబీయుల్ని దేవాలయం గదిలో సమావేశపర్చి, వారి ముందు మద్యం ఉంచి తాగాల్సిందిగా ఆహ్వానించాడు. తాననుకున్నట్లుగానే వారు అందుకు ససేమిరా ఒప్పుకోలేదు. “వారు - మా పితరుడగు రేకాబు కుమారుడైన యెహోవాదాబు - మీరైనను మీ సంతతివారైనను ఎప్పుడును ద్రాక్షారసము త్రాగ కూడదని మాకాజ్ఞాపించెను గనుక మేము ద్రాక్షారసము త్రాగము” అని కరాకండిగా చెప్పారు.PKTel 295.1

    “అంతట యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను - ఇశ్రాయేలు దేవుడగు యెహోవా సెలవిచ్చునదేమనగా - నీవు వెళ్లి యూదావారికిని యెరూషలేము నివాసులకును ఈ మాట ప్రకటింపుము - యెహోవా వాక్కు ఇదే - మిరు శిక్షకు లోబడి నా మాటలను ఆలకింపరా? యిదే యెహోవా వాక్కు, ద్రాక్షారసము త్రాగవద్దని రేకాబు కుమారుడైన యెహోనాదాబు తన కుమారుల కాజ్ఞాపించిన మాటలు స్థిరముగా ఉన్నవి, నేటివరకు తమ పితరుని ఆజ్ఞకు విధేయులై వారు ద్రాక్షారసము త్రాగకున్నారు. అయితే నేను పెందలకడలేచి మితో బహు శ్రద్దగా మాటలాడినను మీరు నా మాటలు వినకున్నారు.” యిర్మీ. 35:6; 12-14. PKTel 295.2

    రేకాబీయుల విధేయతకు తన ప్రజల అవిధేయతకు మధ్యగల భేదాన్ని ఇలా ఎత్తి చూపించటానికి దేవుడు ప్రయత్నించాడు. రేకాబీయులు తమ తండ్రి ఆజ్ఞను ఆచరించారు. ఇప్పుడు వారు శోధనకు లొంగలేదు. అతిక్రమానికి పాల్పడలేదు. అయితే యూదా జనులు ప్రభువు మాటను వినలేదు. పర్యవసానంగా వారు దేవుని కఠినాతి కఠినమైన తీర్పుల్ని పొందటానికి సిద్ధంగా ఉన్నారు.PKTel 295.3

    “ద్రాక్షారసము త్రాగదవని రేకాబు కుమారుడైన యెహోవాదాబు తన కుమారుల కాజ్ఞాపించిన మాటలు స్థిరముగా ఉన్నవి, నేటివరకు తమ పితరుని ఆజ్ఞకు విధేయులై వారు ద్రాక్షారసము త్రాగకున్నారు. అయితే నేను పెందలకడ లేచి మితో బహు శ్రద్దగా మాటలాడినను మీరు నా మాట వినకున్నారు. మరియు పెందలకడ లేచి ప్రవక్తలైన నా సేవకులందరిని మియొద్దకు పంపుచు - ప్రతివాడును తన దుర్మార్ధతను విడిచి మీ క్రియలను చక్కపరచుకొనినయెడలను, అన్య దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు నుండిన యెడలను, నేను మీకును మీ పితరులకును ఇచ్చిన దేశములో మీరు నివసింతురని నేను ప్రకటించితినిగాని మీరు చెవియొగ్గక నా మాట వినకపోతిరి. రేకాబు కుమారుడైన యెహోదాబు కుమారులు తమ తండ్రి తమకిచ్చిన ఆజ్ఞను నెరవేర్చిరి గాని యీ ప్రజలు నామాట వినకయున్నారు. కాబట్టి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియగు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు - నేను వారితో మాటలాడితినిగాని వారు ప్రత్యుత్తరమియ్యకపోయిరి గనుక యూదా వారందరి మిదికిని యెరూషలేము నివాసులందరి మీదికిని రప్పించెదనని నేను చెప్పిన కీడంతయు వారిమీదికి రప్పించుచున్నాను.” 14-17 వచనాలు.PKTel 295.4

    పరిశుద్ధాత్మ ప్రభావంవల్ల మనుషుల హృదయాలు మెత్తబడి లొంగినప్పుడు అవి సలహాకు ఉపదేశానికి చెవినిస్తాయి. అయితే వారు తమ హృదయాలు మొద్దుబారి కఠినమయ్యేంతరవకూ ఉపదేశాన్ని పెడచెవిని పెడితే వారిని ఇతర ప్రభావాలు నడిపించ టానికి ప్రభువు వారిని విడిచిపెడ్తాడు. వారు సత్యాన్ని తోసిపుచ్చి అసత్యాన్ని స్వీకరిస్తారు. ఇలా తమ సొంత నాశనాన్ని కొని తెచ్చుకుంటారు.PKTel 296.1

    తనకు కోపం పుట్టించవద్దంటూ ప్రభువు యూదాకు విజ్ఞప్తి చేశాడు. వారు వినలేదు. చివరికి వారికి వ్యతిరేకంగా తీర్పు వెలువడింది. వారు బబులోనుచే బానిసలుగా చెరపట్టబడనున్నారు. అవిధేయులైన తన బిడ్డల్ని శిక్షించటంలో కల్దీయులు దేవుని సాధనం కానున్నారు. యూదా ప్రజలు అనుభవించాల్సి ఉన్న శ్రమలు, వారు తృణీకరించి విసర్జించిన వెలుగు, హెచ్చరికల దామాషాలో ఉంటాయి. దేవుడు తన తీర్పుల్ని చాలాకాలంగా నిలుపు చేశాడు. అయితే వారి దుర్మార్ధతను నిలువరించటానికి తన చివరి ప్రయత్నంగా ఇప్పుడు వారిపై తన ఆగ్రహాన్ని ప్రదర్శిస్తున్నాడు.PKTel 296.2

    రేకాబీయుల వంశానికి ఎడతెగని దీవెనలు ప్రకటించాడు దేవుడు. ప్రవక్త ఇలా పలికాడు, “ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చు చున్నాడు - మీరు మీ తండ్రియైన యెహోవాదాబు ఆజ్ఞకు విధేయులై అతని విధులన్నిటిని గైకొని అతడు మోకాజ్ఞాపించిన సమస్తమును ఆచరించుచున్నారు. కాబట్టి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా సెలవిచ్చునదేమనగా - నా సన్నిధిలో నిలుచుటకు రేకాబు కుమారుడైన యెహోనాదాబునకు సంతతివాడు ఎన్నడునుండక మానడు.” 18,19 వచనాలు. రేకాబు సంతతివారు తమ తండ్రి ఆజ్ఞకు విధేయులైనందుకు దీవెనలు పొందినట్లే, యధార్ధత విధేయతల వలన యూదా ప్రజలు దీవెనలు పొందగలరని దేవుడు ఇలా తన ప్రజలకు బోధించాడు. PKTel 296.3

    ఇది మనకు ఉద్దేశించిన పాఠం కూడా. మితంమారి తినటం తాగటంవల్ల కలిగే పర్యవసానాలనుంచి తన సంతానాన్ని కాపాడేందుకు ఒక తండ్రి ఉపదేశించిన నియమ నిబంధనలు అచంచల విధేయతకు అరమైనవైతే, దేవుని అధికారాన్ని మనం మరెంత ఘనపర్చి గౌరవించాలి? ఎందుకంటే ఆయన మానవుడికన్నా ఎంతో పరిశుద్దుడు. అధికారం విషయంలో అవధులు లేనివాడు, తీర్చు విషయంలో భయంకరుడు అయిన మన సృష్టికర, మన సేనాధిపతి మనుషులు తమ పాపాల్ని గుర్తించి వాటి నిమిత్తం పశ్చాత్తాపం పొందేటట్లు చెయ్యటానికి అన్నివిధాలా ప్రయత్నిస్తాడు. ఆయన కృప మూలంగానే ఆయన ప్రజలు సుఖసౌఖ్యాలతో వర్ధిల్లుతారు. తాను ఏర్పాటుచేసిన సాధనాల ద్వారా వారిని జాగ్రత్తగా కాపాడాడు దేవుడు. తన హితవును తోసిపుచ్చి తన గద్దింపుల్ని పెడచెవిని పెట్టేవారిని ఆయన కాపాడడు. కొంతకాలం తన తీర్పుల్ని నిలుపుచేయవచ్చు. అలాగని వాటిని ఎల్లప్పుడు ఆపు చెయ్యలేదు.PKTel 296.4

    ఎవరిగురించి దేవుడు “మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురు.” (నిర్గమ. 19:6) అన్నాడో వారిలో యూదా ప్రజలు లెక్కించబడ్డారు. యిర్మీయా తన పరిచర్య అంతటిలో జీవితంలోని వివిధ సంబంధ బాంధ్యవ్యాల్లో మరీముఖ్యంగా సర్వోన్నత దేవుని సేవలో హృదయ పరిశుద్దత ప్రాముఖ్యాన్ని విస్మరించలేదు. ఆ రాజ్య పతనాన్నీ, యూదా ప్రజలు లోకంలోని పలు దేశాల్లోకి చెదిరిపోవటాన్నీ అతడు ముందే చూశాడు. అయినా అతడు విశ్వాస నేత్రంతో దీని అనంతరం రానున్న పునరుద్ధరణ సమయానికి ఎదురుచూశాడు. అతడి చెవుల్లో ఈ దైవ వాగ్దానం గింగురుమంటున్నది : “మరియు నేను వాటిని తోలివేసిన దేశము లన్నిటిలోనుండి నా గొఱ్ఱల శేషమును సమకూర్చి తమ దొడ్లకు వాటిని రప్పించెదను... రాబోవు దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను. అతడు రాజై పరిపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును, భూమిమీద నీతి న్యాయములను జరిగించును. అతని దినములలో యూదా రక్షణ నొందును; ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును. యెహోవా మన నీతియని అతనికి పేరు పెట్టబడును.” యిర్మీ. 23:3-6.PKTel 297.1

    రానున్న శిక్షనుగూర్చిన ప్రవచనాలు, మహిమాన్వితమైన విడుదలను గూర్చిన వాగ్దానాలతో ఈవిధంగా సమ్మిళితమయ్యాయి. దేవునితో సమాధానపడి, ప్రబలుతున్న మతభ్రష్టత నడుమ పరిశుద్దంగా నివసించటానికి ఎంపిక చేసుకునేవారు ప్రతీ శ్రమను భరించటానికి శక్తిని పొంది గొప్ప శక్తితో ఆయన్ని గురించి సాక్ష్యమివ్వటానికి సమర్థత పొందుతారు. ముందున్న యుగాల్లో దేవుడు వారిపక్షంగా నిర్వహించనున్న విడుదల నిర్గమనం సమయంలో ఇశ్రాయేలీయులికి కలిగిన విముక్తిని మించి ఉంటుంది. “జనులు ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశములోనుండి రప్పించిన యెహోవా జీవము తోడని యిక ప్రమాణము చేయక ఉత్తర దేశములోనుండియు, నేను వారిని చెదర గొట్టిన దేశములన్నిటిలోనుండియు వారిని రప్పించిన యెహోవానగు నాతోడని ప్రమాణము” చేసే దినాలు వస్తున్నాయని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికాడు. 7,8 వచనాలు. బబులోనీయులు ప్రపంచ పరిపాలనకు సంసిద్దమవుతుండగా వారి సైన్యాలు సీయోనును ముట్టడివేస్తున్నప్పుడు, యూదా చరిత్ర అంతమౌతున్న సంవత్సరాల్లో యిర్మీయా ప్రవక్త ప్రవచించిన అద్భుత ప్రవచనాలివి.PKTel 297.2

    విడుదలను గూర్చిన ఈ ప్రవచనాలు యెహోవాను చిత్తశుద్ధితో ఆరాధించిన వారి చెవులికి మధుర సంగీతంలా వినిపించాయి. నిబంధనను కాపాడే దేవుని ఉపదేశాన్ని గౌరవించేవారి గృహాల్లో ప్రవక్త మాటల్ని పదేపదే మననం చేసుకోటం జరిగింది. చిన్న పిల్లలు సయితం ఉత్తేజితులయ్యారు. ఇవి వారి మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నాయి.PKTel 298.1

    పరిశుద్ధ లేఖన ఆజ్ఞల్ని చిత్తశుద్ధితో ఆచరించటంవల్లనే యిర్మీయా పరిచర్య దినాల్లో దానియేలు అతడి సహచరులు లోక రాజ్యాల ముందు యదార్ధ దేవుణ్ని ఘనపర్చటానికి మార్గం ఏర్పడింది. ఈ హెబ్రీ బిడ్డలికి వారి తలిదండ్రులు ఇచ్చిన శిక్షణ వారిని విశ్వాసంలో బలోపేతుల్ని చేసి భూమ్యాకాశాల సృష్టికర్త అయిన సజీవ దేవుని సేవలో స్థిరంగా నిలవటానికి దోహదపడింది. యెహోయాకీము పరిపాలన ప్రారంభ దినాల్లో నెలకద్నెజరు మొట్టమొదటిసారిగా యెరూషలేమును ముట్టడించి, బబులోను ఆస్థానంలో సేవలకు ప్రత్యేకంగా ఎంపిక చేసుకుని దానియేలుని అతడి సహచరుల్ని మరికొందర్ని చెరపట్టి తీసుకుపోయినప్పుడు, ఈ హెబ్రీ బందీల విశ్వాసం తీవ్ర పరీక్షకు గురి అయ్యింది. అయితే దేవుని వాగ్దానాలపై నమ్మిక ఉంచినవారు ఆ పరదేశంలో తమ సంచార కాలమంతటిలో తాము పొందనున్న ప్రతీ అనుభవానికీ ఈ వాగ్దానాలు సర్వసమృద్దంగా ఉన్నట్లు గుర్తించారు. లేఖనాలు వారికి మార్గదర్శిగాను బాసటగాను నిలిచాయి.PKTel 298.2

    యూదాపై పడటం ప్రారంభిస్తున్న తీర్పులపై వ్యాఖ్యాతగా యిర్మీయా దేవుని తీర్పుల న్యాయశీలతను, కఠిన శిక్షలో సయితం ఆయన కృపాపూరిత సంకల్పాలను సమర్థిస్తూ ఉదాత్తంగా నిలిచాడు. ప్రవక్త అవిశ్రాంతంగా కృషి చేశాడు. అన్నివర్గాల ప్రజల్ని చేరాలన్న అభిలాషతో తన పరిచర్య పరిధిని యెరూషలేమునుదాటి పరిసర జిల్లాలకి విస్తరించి ఆ రాజ్యంలోని ఆయా ప్రాంతాల్ని తరచుగా సందర్శించాడు.PKTel 298.3

    సంఘానికి తానిచ్చిన ఉపదేశాల్లో యోషీయా పరిపాలనలో ఎంతో ఆదరణను ఘనతను పొందిన ధర్మశాస్త్ర గ్రంథ బోధనల్ని యిర్మీయా ప్రస్తావించాడు. సీనాయి పర్వతం పైనుంచి పది ఆజ్ఞల్ని పలికిన కృపామయుడు దయ కనికరాలుగల దేవునితో నిబంధన బాంధవ్యాన్ని కలిగి ఉండటం ప్రాముఖ్యమని నూతనంగా నొక్కి వక్కాణించాడు. యిర్మీయా చేసిన హెచ్చరికలు, విజ్ఞాపనలు దేశం నలుమూలలా వినిపించాయి. ఆ దేశ ప్రజలగురించి దేవుని చిత్తం ఏంటో తెలుసుకునేందుకు అందరికీ అవకాశం లభించింది. “తాము నరమాత్రులమని జనులు తెలిసి”కోటానికి (కీర్త. 9:20) మన పరమ జనకుడు తన తీర్పుల్ని మనమిదికి రప్పిస్తాడని ప్రవక్త స్పష్టంగా చెబుతున్నాడు. “మీరు నా మాట విననొల్లక నాకు విరోధముగా నడిచినయెడల, ... జనములలోనికి మిమ్మును చెదరగొట్టి మీవెంట కత్తి దూసెదను, మా దేశము పాడై పోవును, మీ పట్టణములు పాడుపడును.” లేవీ. 26:21,23.PKTel 298.4

    ముంచుకొస్తున్న ముప్పును గూర్చిన హెచ్చరికలు అదే సమయంలో రాజ్యాధి పతులకు, ప్రజలకు వారి రాజు యెహోయాకీముకు అందించటం జరిగింది. రాజైన యెహోయాకీము విజ్ఞతగల ఆధ్యాత్మిక నాయకుడుగా వ్యవహరించి, పాపం ఒప్పుకోటంలోను దీదుబాటులోను సత్ర్కియలలోను ప్రధముడుగా ఉండాల్సింది. కాని అతడు వినోదాలు సుఖభోగాల్లో తల మునకలై ఉన్నాడు. అతడు “విశాలమైన మేడ గదులుగల గొప్ప మందిరమును కట్టించుకొందును.” అని ఆలోచించాడు. “దేవదారు పలకలను దానికి సరంజీవేయుచు ఇంగిలీకముతో రంగు” వేయటానికి పూనుకున్నాడు. (యిర్మీ. 22:14). దాన్ని అన్యాయంగా సంపాదించిన డబ్బును ప్రజల్ని బాధించి దోచుకున్న శ్రమతోను కట్టాడు.PKTel 299.1

    ప్రవక్త ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అపనమ్మకస్తుడైన రాజుపై తీర్పు ప్రకటించాడు : “నీతితప్పి తన నగరును స్థాపించువానికి శ్రమ, న్యాయము తప్పి తన మేడ గదులను కట్టించుకొనుచు, జీతమియ్యక తన పొరుగువానిచేత ఊరకయే కొలువు చేయించుకొనువానికి శ్రమ.... నీవు అతిశయపడి దేవదారు పలకల గృహమును కట్టించుకొనుటచేత రాజవగుదువా? నీ తండ్రి అన్నపానములు కలిగి నీతి న్యాయముల ననుసరించుచు క్షేమముగా ఉండలేదా? అతడు దీనులకును దరిద్రులకును న్యాయము తీర్చుచు సుఖముగా బ్రదికెను. ఆలాగు చేయుట నన్ను తెలిసికొనుట కాదా? ఇదే యెహోవా వాక్కు అయితే నీ దృష్టియు నీ కోరికయు అన్యాయముగా లాభము సంపాదించుకొనుట యందే, నిరపరాధుల రక్తము ఒలికించుటయందే నిలిచియున్నది.PKTel 299.2

    “కావున యోషీయా కుమారుడైన యెహోయాకీమను యూదా రాజునుగూర్చి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు - జనులు అయ్యో నా సహోదరుడా, అయ్యో నా సహోదరి, అని అతనిని గూర్చి అంగలార్చరు, అయ్యో నా యేలినవాడా, అయ్యో శోభావంతుడా, అని అతని కొరకు అంగలార్చరు. అతడు యెరూషలేము గుమ్మముల ఆవలికి ఈడువబడి పారవేయబడి గాడిద పాతిపెట్టబడు రీతిగా పాతిపెట్టబడును.” 13-19 వచనాలు.PKTel 299.3

    కొద్ది సంవత్సరాల్లోనే భయంకర తీర్పులు యెహోయాకీము మీదికి రానున్నాయి. అయితే పశ్చాత్తాపమన్నది లేని ఆ దేశానికి ముందు తన ఉద్దేశాన్ని దేవుడు తెలియపర్చాడు. యెహోయాకీము రాజ్యపాలన నాల్లో సంవత్సరంలో ప్రవక్తయైన యిర్మీయా యూదా ప్రజలందరితోను యెరూషలేము నివాసులందరితోను, “యోషీయా పదమూడవ సంవత్సరము మొదలుకొని నేటివరకు” రక్షించాలన్నది దేవుని కోరికని తాను అందుకు సాక్షినని అయితే తన వర్తమానాల్ని తాము తృణీకరిస్తూ వచ్చారని ఇరవై సంవత్సరాలకు పైగా చెప్పాడు. యిర్మీ. 25:2,3. ఇక ఇప్పుడు వారికి వచ్చిన దైవ వాక్కు ఇది :PKTel 300.1

    “సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు - మీరు నా మాటను ఆలకింపకపోతిరి గనుక నేను ఉత్తర దేశములోనున్న సర్వజనములను నా సేవకుడైన నెబుకద్నెజరను బబులోను రాజును పిలువనంపించుచున్నాను; ఈ దేశము మీదికిని దీని నివాసుల మిదికిని చుట్టునున్న యీ జనులందరి మిదికిని వారిని రప్పించుచున్నాను. ఈ జనులను శాపగ్రస్తులుగాను విస్మయాస్పదముగాను అపహాస్యాస్పదముగాను ఎప్పటికిని పాడుగాను ఉండజేసెదను. ఈ దేశమంతయు పాడుగాను నిర్జనముగాను ఉండును; ఈ జనులు డెబ్బది సంవత్సరములు బబులోను రాజునకు దాసులుగా ఉందురు.” 8-11 వచనాలు.PKTel 300.2

    నాశన తీర్పు స్పష్టంగా ప్రకటితమైనప్పటికీ దాన్ని విన్న జన సమూహాలు దాని తీవ్రతను ప్రాముఖ్యాన్ని అవగతం చేసుకోలేదు. ప్రవక్త పలికిన మాటలభావం వారి మనసుల్లో నాటుకునేందుకుగాను ప్రభువు ఒక ఉదాహరణను ఇచ్చాడు. దేవుని ఉగ్రత పాత్రలోని మద్యాన్ని ఒక్క బొట్టు కూడా మిగలకుండా పానం చెయ్యటంతో వారి దుర్గతిని సరిపోల్చవలసిందిగా యిర్మీయాను ప్రభువు ఆదేశించాడు. ఈ దుఃఖ పాత్రలోని పానీయాన్ని ప్రథమంగా తాగింది. “యెరూషలేము, యూదా పట్టణాలు, రాజులు.” “ఇతరులు అనగా ఐగుప్తు రాజు ఫరో, అతడి సేవకులు, అతడి సామంత రాజులు, ప్రజలు”, లోకంలోని అనేక ఇతర ప్రజలు. దేవుని ఉద్దేశం నెరవేరేవరకు ఇది కొనసాగుతుంది. యిర్మీయా 25వ అధ్యాయం చూడండి.PKTel 300.3

    త్వరలోరానున్న తీర్పు ఎలాంటిదో విపుల పర్చటానికి దేవుడు ప్రవక్త నిలా ఆదేశించాడు, “నీవు వెళ్లి కుమ్మరి చేయు మంటి కూజాను కొని, జనుల పెద్దలలో కొందరిని యాజకుల పెద్దలలో కొందరిని పిలుచుకొనిపోయి, హర్సీతు గుమ్మపు ద్వారామునకు ఎదురుగా నున్న బెన్హిన్నోము లోయలోనికిపోయి”, తాను ఎవరి సేవకుడో ఆ యెహోవా పక్షంగా “మరల బాగు చేయ నశక్యమైన కుమ్మరి పాత్రను ఒకడు పగుల గొట్టినట్లు నేను ఈ జనమును ఈ పట్టణమును పగులగొట్ట బోవుచున్నాను” అని అతడు చెప్పాల్సిందిగా ఆదేశించాడు. యూదా మతభ్రష్టత చరిత్రను సమీక్షించిన మీదట దీన్ని చెప్పాలని దేవుడు ఆదేశించాడు.PKTel 300.4

    దేవుని ఆదేశం మేరకు ప్రవక్త వ్యవహరించాడు. అనంతరం పట్టణానికి తిరిగి వచ్చి ఆలయ ఆవరణలో నిలబడి ప్రజలికి వినిపించేటట్లు ఇలా ప్రకటించాడు, “సైన్యములకధిపతియు ఇశ్రాయేలు దేవుడునగు యెహోవా ఈ మాటలు సెలవిచ్చు చున్నాడు - ఈ జనులు నా మాటలు వినకుండ మొండికి తిరిగియున్నారు గనుక ఈ పట్టణమునుగూర్చి నేను చెప్పిన కీడంతయు దాని మిదికిని దానితో సంబంధించిన పట్టణములన్నిటిమిదికిని రప్పించుచున్నాను.” యిర్మీయా 19 చూడండి.PKTel 301.1

    ప్రవక్త పలికిన మాటలు పాపపు ఒప్పుకోలుకి పశ్చాత్తాపానికి నడిపించే బదులు ఉన్నతాధికారుల్లో ఆగ్రహాన్ని ఆవేశాల్ని సృష్టించాయి. పర్యవసానంగా యిర్మీయా తన స్వేచ్ఛను కోల్పోయాడు. ప్రవక్తకు అరదండలు వేసి ఖైదులో పెట్టారు. అయినా ప్రవక్త దైవ వర్తమానాల్ని ప్రజలికి అందిస్తూనే ఉన్నాడు. హింసతో అతడి నోరు ముయ్యించ లేకపోయారు. సత్యవాక్కు “నా హృదయములో అగ్నివలె మండుచు నా యెముకలలోనే మూయబడియున్నట్లున్నది” అన్నాడు యిర్మీయా. యిర్మీ. 20:9.PKTel 301.2

    ఎవరి రక్షణకోసం తన హృదయం పరితపిస్తున్నదో ఆ దైవ ప్రజలికి తానందించే వర్తమానాల్ని లిఖించాల్సిందిగా ఈ సమయంలో అతణ్ని ప్రభువిలా ఆదేశించాడు, “నీవు పుస్తకపు చుట్టను తీసికొని నేను నీతో మాటలాడిన దినము మొదలుకొని, అనగా యోషీయా కాలము మొదలుకొని నేటివరకు ఇశ్రాయేలు వారిని గూర్చియు యూదావారిని గూర్చియు సమస్త జనములను గూర్చియు నేను నీతో పలికిన మాటలన్నిటిని దానిలో వ్రాయుము. నేను యూదావారికి చేయనుద్దేశించు కీడంతటిని గూర్చి వారు విని నేను వారి దోషమును వారి పాపములను క్షమించునట్లు తమ దుర్మార్ధతను విడిచి పశ్చాత్తాపపడుదురేమో.” యిర్మీ. 36:2,3.PKTel 301.3

    ఈ ఆదేశానికి విధేయుడై యిర్మీయా తన సహాయకుడు నేస్తం లేఖికుడు అయిన బారూకును తనకు సాయం చెయ్యటానికి పిలిచాడు. అతడు “యెహోవా యిర్మీయాతో చెప్పిన మాటలన్నిటిని యిర్మీయా నోటి మాటలనుబట్టి ఆ పుస్తకములో వ్రాసెను.” 4వ వచనం. ఈ మాటల్ని తోలు గ్రంథపు చుట్టలో అతడు జాగ్రత్తగా రాశాడు. అవి పాపాన్ని తీవ్రంగా మందలించాయి. అడ్డూ అదుపులేని మతభ్రష్టతనుగూర్చి తీవ్రంగా హెచ్చరించాయి. సకల దుష్టతను త్యజించాల్సిందిగా విజ్ఞప్తి చేశాయి.PKTel 301.4

    రాయటం పూర్తి అయిన తర్వాత, ఇంకా ఖైదులోనే ఉన్న యిర్మీయా “యూదా రాజైన యోషీయా కుమారుడగు యెహోయాకీము ఏలుబడియందు అయిదవ సంవత్సరము తొమ్మిదవ నెలను” దేవాలయంలో సమావేశమౌతున్న జనసమూహాలకు ఆ గ్రంథపు చుట్టను చదివి వినిపించటానికి బారూకును పంపాడు. “ఒకవేళ వారి విన్నపములు యెహోవా దృష్టికి అనుకూలమగునేమో ఒకవేళ వారు తమ చెడుమార్గము విడుతురేమో, నిజముగా ఈ ప్రజలమీదికి ఉగ్రతయు మహా కోపమును వచ్చునని యెహోవా ప్రకటించుచున్నాడు” అని ప్రవక్త తలపోశాడు. 9,7 వచనాలు..PKTel 302.1

    ఆ ప్రకారమే బారూకు యూదా ప్రజలముందు ఆ గ్రంథపు చుట్టను చదివాడు. అనంతరం ఆ మాటలు చదవటానికి ఆ లేఖికుణ్ని అధిపతుల ముందుకి పిలిచారు. ఆ మాటల్ని ప్రధానులు అతి శ్రద్దగా విని తాము విన్నదంతా రాజుకి తెలుపుతామని వాగ్దానం చేశారు. అయితే వారు రాజు ఆ వర్తమానాన్ని తిరస్కరిస్తాడని దాన్ని సిద్ధం చేసి అందించిన వారిని వధిస్తాడన్న భయం తమకున్నది గనుక తాను ఎక్కడైన దాగి ఉండటం మంచిదని ఆ లేఖికుడికి హితవు పలికారు.PKTel 302.2

    బారూకు తమకు గ్రంథపు చుట్టలోనుంచి చదివి వినిపించిన సంగతుల్ని ప్రధానులు రాజుతో ప్రస్తావించగా ఆ గ్రంథపు చుట్టను తెచ్చి తనకు చదివి వినిపించాల్సిందిగా రాజు ఆజ్ఞాపించాడు. యెహూ అనే రాజభటుడు ఆ గ్రంథపు చుట్టను తెచ్చి గద్దింపు హెచ్చరికలతోనిండిన ఆ మాటల్ని చదవనారంభించాడు. అది శీతాకాలం. రాజు, అతడి ప్రభుత్వాధికారులు, యూదా ప్రధానులు చలిమంట చుట్టూ కూర్చుని ఉన్నారు. ఆ గ్రంథపు చుట్టలోనుంచి కొంచెం మాత్రమే చదవటం జరిగింది. తనమీదికి తన ప్రజలమీదికి విరుచుకు పడనున్న ప్రమాదం గురించి భయంతో వణికే బదులు రాజు ఆగ్రహోదగ్రుడై, ఆ గ్రంథపు చుట్టను లాక్కొని “చాకుతో దాని కోసి కుంపటిలో వేయగా ఆ కుంపటిలోనున్న అగ్నిచేత అది బొత్తిగా కాలిపోయెను.” 23వ వచనం.PKTel 302.3

    రాజుగాని అతడి అధిపతులుగాని భయపడలేదు. “తమ బట్టలు చింపుకొనలేదు.” అధిపతుల్లో కొందరు “గ్రంథమును కాల్చవద్దని... మనవి చేయగా అతడు వారి విజ్ఞాపనము వినకపోయెను.” గ్రంథాన్ని దగ్ధంచేసిన తర్వాత దుష్టుడైన రాజు ఉగ్రత యిర్మీయా బారూకులమిదికి తిరిగింది. వెంటనే వారిని చెరసాలలలోనుంచి బయటికి తీసుకు రావలసిందిగా ఆజ్ఞాపించాడు. కాని యెహోవా వారిని దాచెను.” 24-26 వచనాలు.PKTel 302.4

    ఆ దివ్య గ్రంథపు చుట్టలో దాఖలై ఉన్న ఉపదేశాన్ని ఆలయంలోని ఆరాధకులు, అధిపతులు, రాజు దృష్టికి తేవటంలో దేవుడు యూదా ప్రజలకు మేలు చెయ్యాలనే ప్రయత్నిస్తున్నాడు. “నేను యూదా వారికి చేయనుద్దేశించు కీడంతటిని గూర్చి వారు విని నేను వారి దోషమును వారి పాపములను క్షమించునట్లు తమ దుర్మార్ధతను విడిచి పశ్చాత్తాపపడుదురేమో” అనుకున్నాడు. 3వ వచనం. వక్రబుద్దివల్ల అంధులై కష్టాలను అనుభవించే వారిపట్ల దేవునికెంతో కనికరం. అత్యధికులు తమ అజ్ఞానాన్ని గుర్తించి తమ దోషాల నిమిత్తం సంతాపం చెందటానికి ఉద్దేశించిన మందలింపుల్ని బెదిరింపుల్ని పంపించటంద్వారా మంచి అవగాహనను కలిగించటానికి ఆయన కృషి చేస్తాడు. వ్యర్థమైన తమ సాధనలతో తృప్తి చెందేవారు వాటితోనే తృప్తి చెందకుండా ఉండేందుకు దేవునితో సాన్నిహిత్యం ద్వారా ఆధ్యాత్మిక ప్రయోజనం పొందటానికి తోడ్పడేందుకు ఆయన కృషి చేస్తాడు.PKTel 302.5

    పాపుల్ని పొగడి ప్రసన్నుల్ని చెయ్యటానికి దూతల్ని పంపటం దేవుని సంకల్పం కాదు. పవిత్రులు కానివారిని బుజ్జగించటానికి ఆయన ఎలాంటి శాంతి వర్తమానం అందించడు. దానికి బదులు అపరాధి మనస్సాక్షిమీద పెద్ద బరువుమోపి అతడి ఆత్మను వాడిగల విశ్వాస బాణాలతో చీల్చుతాడు. తన అవసరం ఏంటో గ్రహించటానికీ, “రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను?” (అ.కా. 16:30) అన్న ఆవేదనను కలిగించ టానికీ పరిచర్యచేసే దూతలు దేవుని భయంకర తీర్పుల్ని అతడికి వివరిస్తారు. మట్టి కరిపించే హస్తమే, పాపాన్ని మందలించి, గర్వాన్ని, అత్యాశను సిగ్గుపర్చే హస్తమే, విరిగి నలిగిన హృదయంతో పశ్చాత్తాపపడే వాణ్ని పైకి లేవదీసే హస్తం. శిక్ష విధింపును అనుమతించే ఆ ప్రభువు “నీకు నేను ఏమి చెయ్యాలని కోరుతున్నావు?” అని ప్రగాఢ సానుభూతితో అడుగుతాడు. PKTel 303.1

    పరిశుద్దుడు కరుణామయుడైన దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు మానవుడు చిత్తశుద్ధితో పశ్చాత్తాపపడి కన్నీటితో వేదనతో తన దోషాల్ని ఒప్పుకోటమే సముదాత్త మార్గం. దేవుడు కోరుతున్నది ఇదే. విరిగి నలిగిన హృదయమే ఆయనకు అంగీకృతం. అయితే రాజైన యెహోయాకీము అతడి అధిపతులు గర్వాంధులై దేవుడిచ్చిన ఆహ్వానాన్ని తిరస్కరించారు. హెచ్చరికను ఆలకించి పశ్చాత్తాపపడలేదు. పరిశుద్ధ గ్రంధపు చుట్టను కాల్చుతున్నప్పుడు వారికి దేవుడిచ్చిన తరుణమే చివరిది. ఆ సమయంలో తన స్వరాన్ని తోసిపుచ్చితే వారికి భయంకర శిక్ష వేస్తానని దేవుడు ప్రకటించాడు. వారు ఆయన మాట వినలేదు. కనుక యూదాపై ఆయన తన చివరి తీర్పులు ప్రకటించాడు. గర్విష్ణుడై సర్వశక్తునిపై తిరుగుబాటు చేసిన వ్యక్తిపై ఆయన తన ప్రత్యేక ఉగ్రతను ప్రదర్శిస్తాడు.PKTel 303.2

    “అందుచేతను యూదరాజైన యెహోయాకీమునుగూర్చి యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు - దావీదుయొక్క సింహాసనముమీద ఆసీనుడగుటకు అతనికి ఎవడును లేకపోవును, అతని శవము పగలు ఎండపాలు రాత్రి మంచుపాలు నగును. నేను వారి దోషమునుబట్టి అతనిని అతని సంతతిని అతని సేవకులను శిక్షించుచున్నాను. నేను వారినిగూర్చి చెప్పిన కీడంతయు వారి మీదికిని యెరూషలేము నివాసుల మీదికిని యూదా నివాసుల మీదికిని రప్పించుచున్నాను. అయినను వారు వినినవారుకారు.” యిర్మీ. 36:30,31.PKTel 303.3

    గ్రంథపు చుట్టను కాల్చివేయటంతో ఆ విషయం అంతం కాలేదు. ఆ మాటలు అందిస్తున్న మందలింపు హెచ్చరికలకన్నా లిఖిత రూపంలో ఉన్న ఆ మాటల్ని తిరుగు బాటుదారులైన ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ప్రకటించిన శిక్షను వారు సులభంగా నాశనం చేశారు. అయినా ఆ లిఖిత గ్రంథపు చుట్టను సయితం పునరుత్పత్తి చెయ్యటం జరిగింది. “గ్రంథము తీసికొని యూదరాజైన యెహోయాకీము కాల్చిన మొదటి గ్రంథములో వ్రాయబడిన మాటలన్నిటిని దానిలో వ్రాయుము.” యూదా యెరూషలేముల్ని గూర్చిన ప్రవచనాల్ని కాల్చివేయటం జరిగింది. కాని ఆ మాటలు ఇంకా యిర్మీయా హృదయంలో “అగ్నివలె మండుచున్నవి.” వాటిని పునరుత్పత్తి చెయ్యటానికి దేవుడు అనుమతించాడు. నాశనం చేసినట్లు కనిపించిందాన్ని మానవుడికోసం పునరుత్పత్తి చెయ్యటానికి దేవుడు అనుమతించాడు.PKTel 304.1

    ఇంకొక పుస్తకం చుట్ట తీసుకుని యిర్మీయా దాన్ని బారూకుకి ఇచ్చాడు. “అతడు యిర్మీయా నోటిమాటలనుబట్టి యూదా రాజైన యెహోయాకీము అగ్నిలో కాల్చిన గ్రంథపు మాటలన్నిటిని వ్రాసెను మరియు ఆ మాటలుకాక అట్టివి అనేకములు అతడు వాటిలో కూర్చెను.” 28,32 వచనాలు. మానవుడి ఆక్రోశం దైవ సేవకుడి కృషిని అడ్డుకోటానికి ప్రయత్నించింది. అయితే యెహోవా సేవకుణ్ని అడ్డుకోడానికి యెహోయాకీము ఏ సాధనం వినియోగించాడో అదే సాధనం దైవ విధుల్ని మరింత తేటతెల్లం చెయ్యటానికి ఇంకా గొప్ప తరుణాన్ని ఇచ్చింది.PKTel 304.2

    మందలింపును జీర్ణించుకోలేని స్వభావం యిర్మీయాను హింసించటానికి చెరసాలలో వేయటానికి నడిపించింది. అదే స్వభావం ఈ రోజునా ఉంది. అనేకులు పదే పదే వస్తున్న హెచ్చరికల్ని తోసిపుచ్చుతారు. తమ దురభిమానాన్ని పొగడి తమ దురాగతాల్ని ఉపేక్షించే అబద్ధ బోధకుల్ని నమ్ముతారు. శ్రమకాలంలో వారికి ఆశ్రయం ఉండదు. దేవుని వద్దనుంచి సహాయం లభించదు. దేవుడు ఎంపిక చేసుకున్న సేవకులు నిందలద్వారా, ఉదాసీనతద్వారా, అబద్ద ప్రచారంద్వారా కలిగే శ్రమల్ని, బాధల్ని ధైర్యంతో ఎదుర్కోవాలి. తమకు దేవుడు నియమించిన పనిని నమ్మకంగా చెయ్యాలి. పూర్వం ప్రవక్తలు లోక రక్షకుడు ఆయన అపోస్తలులు సత్యం నిమిత్తం నిందలు భరించారని హింసననుభవించారని జ్ఞాపకముంచుకోవాలి.PKTel 304.3

    యెహోయాకీము యిర్మీయా హెచ్చరికల్ని పాటించటం ద్వారా నెబుకద్నెజరు సహృదయతను సంపాదించి తద్వారా కష్టాలు శ్రమలనుంచి తప్పించుకోవాలన్నది దేవుని ఉద్దేశం. యువకుడైన రాజు బబులోను రాజుకు విధేయతను విశ్వసనీయతను ప్రకటించుకున్నాడు. ఆ ప్రకారంగా అతడు నమ్మకంగా నిలిచి ఉంటే, అతడు ఆ అన్య రాజు అభిమానాన్ని చూరగొని ఉండేవాడు. ఆత్మలు యెహోవాను నమ్మటానికి ఇది మంచి అవకాశాల్ని ఒనగూర్చేది.PKTel 305.1

    తనకు వచ్చిన అపురూప తరుణాల్ని తోసిరాజని యూదా రాజు తన సొంత మార్గాన్నే అవలంబించాడు. బబులోను రాజుకి తానిచ్చిన మాటను అతిక్రమించి తిరుగుబాటు చేశాడు. ఇది తనకు తన ప్రజలికి గొప్ప ముప్పు తెచ్చి పెట్టింది. అతడి మీదికి “కల్దీయుల సైన్యములను సిరియనుల సైన్యములను మోయాబీయుల సైన్యములను అమ్మోనీయుల సైన్యములను” పంపటం జరిగింది. ఈ సైన్యాల నుంచి తన రాజ్యాన్ని కాపాడుకోటానికి అతడివల్ల కాలేదు. 2 రాజులు. 24:2.PKTel 305.2

    అపకీర్తి మూటకట్టుకున్న అతడి పరిపాలన కొద్ది సంవత్సరాల్లోనే అంతమొందింది. దేవుడు అతణ్ని విడిచిపెట్టాడు. ప్రజలు అతణ్ని ద్వేషించారు. తాను ఎవరికి నమ్మక ద్రోహం చేశాడో ఆ బబులోను పాలక శ్రేణి అతణ్ని తృణీకరించింది. దేవుడు తన సేవకుడి ద్వారా బయలుపరచిన ఉద్దేశంనుంచి వైదొలగటమన్న ప్రాణాంతక దోషం పర్యవసానంగానే ఇదంతా జరిగింది.PKTel 305.3

    (యెకోనియా, కోనియా అన్నపేర్లు కూడాగల) యోహోయాకీను తన తండ్రి యెహోయాకీము మరణించిన మూడు నెలల పదిరోజులకే అతడి సింహాసనం మీద ఆసీనుడయ్యాడు. అప్పుడు కల్దీయుల సేనలకు లొంగిపోయాడు. యూదరాజు తిరుగుబాటు చేసినందువల్ల కల్దీయులు మళ్లీ ఆ పట్టణాన్ని ముట్టడించారు. ఈ తరుణంలో నెబుకద్నెజరు “యెహోయాకీనును రాజు తల్లిని భార్యలను అతని పరివారమును దేశములోని గొప్పవారిని చెరపట్టి యెరూషలేము నుండి బబులోను పురమునకు తీసికొనిపోయెను.” వారు వేలలో ఉన్నారు. వారితోపాటు “వెయ్యిమంది కంసాలివారిని కమ్మరివారిని” తీసుకుపోయాడు. వీరినేగాక అతడు “యెహోవా మందిరపు ధననిధిలోనున్న పదార్ధములను, రాజు ఖజానాలోనున్న సొమ్మును” తీసుకుపోయాడు. 2 రాజులు. 24:15,16,13.PKTel 305.4

    అధికారం కోల్పోయినా ప్రజలు ధనం విషయంలో శక్తి నశించినా యూదా రాజ్య ప్రత్యేక ప్రభుత్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. నెబుకద్నెజరు యోషీయా చిన్న కుమారుడైన మత్తన్యాకి సిద్కియా అని పేరు పెట్టి అతణ్ని రాజుగా నియమించాడు.PKTel 305.5

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents