Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
ప్రవక్తలు - రాజులు - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    28 - హిజ్కియా

    ఆహాజు బాధ్యతారహిత పరిపాలనతో ఎంతో భేదించి ఉంది అతడి కుమారుడి అభ్యుదయ పరిపాలన. ఇతడి పరిపాలనలో దిద్దుబాటు చోటు చేసుకుంది. ఉత్తర రాజ్యానికి పట్టిన గతి యూదాకి పట్టకుండా శాయశక్తుల పాటుపడాలన్న కృత నిశ్చయంతో హిజ్కియా రాజ్యపాలన చేపట్టాడు. ప్రవక్తల వర్తమానాల సాఫల్యానికి అరకొర చర్యలు చాలవు. దేశంమీదికి రానున్న తీర్పుల్ని ఆపటానికి నిర్దిష్టమైన సంస్కరణ చేపట్టటం అవసరం.PKTel 225.1

    ఆ క్లిష్ట సమయంలో హిజ్కియా అవకాశాన్ని అందిపుచ్చుకుని వ్యవహరించే వ్యక్తిగా నిరూపించుకున్నాడు. సింహాసనానికి వచ్చిన వెంటనే అతడు ప్రణాళికలు రూపొందించి ఆచరణలో పెట్టటం ప్రారంభించాడు. మొదట ఎంతోకాలం నిర్లక్ష్యంచేసిన ఆలయ సేవల్ని పునరుద్దరించటంపై దృష్టిపెట్టాడు. ఈ కార్యసాధనకు తమ పిలుపుకు నమ్మకంగా నిలిచిన యాజకులు లేవీయుల బృందం సహకారాన్ని కోరాడు. వారు మద్దతు పలికి సహకరిస్తారన్న నమ్మకంతో తక్షణ సంస్కరణ చర్యలు చేపట్టాలన్న తన కోరిక గురించి వారితో స్వేచ్చగా మాట్లాడాడు. హిజ్కియా ఇలా అన్నాడు, “మన పితరులు ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతలు నడిచి ఆయనను విసర్జించి, ఆయన నివాసమునకు పెడముఖము పెట్టుకొని దానిని అలక్ష్యము చేసిరి.” “ఇప్పుడు మనమిదనున్న ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మహోగ్రత చల్లారునట్లు ఆయనతో మనము నిబంధన చేయవలెనని నా మనస్సులో అభిలాష పుట్టెను.” 2 దిన వృ. 29:6,10.PKTel 225.2

    తమ ముందున్న పరిస్థితుల్ని గురించి అనగా మూతపడ్డ దేవాలయం, నిలిచిపోయిన ఆలయ సేవలు; పట్టణ వీధుల్లోను, రాజ్యమంతటిలోను సాగుతున్న విగ్రహారాధక యూదానేతలు, నేతలు సవ్యమైన మాదిరిని చూపిఉంటే మతభ్రష్టులు కాకుండా నిలిచి ఉండే జనుల సమూహాలు; చుట్టూ ఉన్న జాతుల దృష్టిలో క్షీణించిన దేశం, దిగ జారిపోయిన దేశ గౌరవం - వీటన్నిటిని ఆచి తూచిన మాటల్లో రాజు సమీక్షించాడు. ఉత్తర రాజ్యం వేగంగా ముక్కచెక్కలవుతున్నది. అనేకులు కత్తివేటుకి బలిఅవుతున్నారు. చాలామందిని చెరగొనిపోవటం జరిగింది. ఇశ్రాయేలు రాజ్యం అపూరీయుల హస్తగత మవ్వటం, అది పూర్తిగా నాశనమవ్వటం స్వల్ప వ్యవధిలోనే జరగనుంది. దేవుడు తాను ఎన్నుకున్న ప్రతినిధులద్వారా బలంగా పనిచేస్తేనే తప్ప ఇదే పరిస్థితి యూదాకు కూడా సంభవించటం ఖాయం..PKTel 225.3

    తనతో చెయ్యికలిపి, అవసరమైన దిద్దుబాటు తేవటంలో తనకు సహకరించాల్సిందని హిజ్కియా యాజకులికి విజ్ఞప్తి చేశాడు. వారితో ఇలా అన్నాడు, “తనకు పరిచారకులైయుండి ధూపము వేయుచుండుటకును, తన సన్నిధిని నిలుచుటకును, తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మీరు అశ్రద్ధ చేయకుడి.” “ఇప్పుడు మిమ్మును మీరు ప్రతిష్టించుకొని, మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును” ప్రతిష్ఠించండి. 11,5 వచనాలు.PKTel 226.1

    అది తక్షణ చర్య తీసుకోవలసిన సమయం. యాజకులు తమ పని వెంటనే ప్రారంభించారు. ఈ సమావేశానికి హాజరు కాలేకపోయిన తమ సహచరుల సహకారంతో వారు ఆలయాన్ని శుభ్రపర్చి పరిశుద్ధ పర్చటానికి పూనుకున్నారు, సంవత్సరాలు తరబడి అపవిత్రీకరణకు అలక్ష్యానికి గురికావటంతో అనేక సమస్యలు తలెత్తాయి. యాజకులు లేవీయులు అవిశ్రాంతంగా కృషి చేసినందుకు అతి స్వల్ప వ్యవధిలోనే వారు తమ కర్తవ్యాన్ని పూర్తి చేసినట్లు నివేదించారు. ఆలయ ద్వారాల్ని బాగుచేసి మందిరాన్ని తెరిచారు. పరిశుద్ద ఉపకరణాల్ని పోగుచేసి వాటి వాటి స్థానాల్లో ఉంచారు. ఆలయ సేవల పునరుద్దరణకూ అంతా సిద్ధంగా ఉంది.PKTel 226.2

    మొదటగా ఏర్పాటైన ఆరాధనలో పట్టణ అధికారులు, హిజ్కియా రాజు, యాజకులు, లేవీయులతో ఏకమై తమ జాతి పాపాల నిమిత్తం దేవుణ్ని క్షమాపణ వేడుకున్నారు. “ఇశ్రాయేలీయులందరి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై” బలిపీఠముపై పాప పరిహారార్ధ బలులు అర్పించారు. వారు అర్పించుట ముగించిన తరువాత రాజును అతనితోకూడ నున్న వారందరును తమ తలలువంచి ఆరాధించిరి.” ఆలయ ఆవరణం స్తుతి పలుకులతో, ఆరాధనతో మళ్లీ ప్రతిధ్వనించింది. ఆరాధకులు తాము పాప దాస్యం నుంచి మతభ్రష్టతనుంచి విముక్తిపొందుతున్నామన్న గుర్తింపుతో దావీదు, ఆసాపుల కీర్తనలు ఆనందోత్సాహాలతో పాడారు. “ఈ కార్యము అప్పటికప్పుడే జరిగినందున దేవుడు జనులకు స్థిరపరచిన దానిని చూచి హిజ్కియాయును జనులందరును సంతోషించిరి.” 24,29,36 వచనాలు.PKTel 226.3

    మతభ్రష్టత వరదను నిలువరించటానికి నిర్దిష్టమైన సంస్కరణ ఉద్యమంలో నాయకత్వం వహించటానికిగాను యూదాలో ప్రధాన వ్యక్తుల హృదయాల్ని దేవుడు సిద్ధం చేశాడు. తాను ఎన్నుకున్న తన ప్రజలకు ఆయన తన ప్రవక్తలద్వారా విజ్ఞప్తి చేస్తూ వర్తమానం వెంట వర్తమానం పంపించాడు. ఇప్పుడు విరోధుల చేతుల్లో పడ్డ ఇశ్రాయేలీయుల పదిగోత్రాలవారు ఆ వర్తమానాల్ని తృణీకరించి తోసిపుచ్చారు. కాగా యూదాలో శేషించిన సజ్జనులు కొందరున్నారు. వీరికి ప్రవక్తలు తమ విజ్ఞప్తులు కొనసాగించారు. యెషయా విజ్ఞాపనను వినండి, “ఇశ్రాయేలులారా, మీరు ఎవరిమీద విశేషముగా తిరుగుబాటు చేసితిరో ఆయనవైపు తిరుగుడి.” యెష. 31:6. మికా ధైర్యంగా ప్రకటించటం వినండి, “అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవునికొరకు నేను కనిపెట్టియుందును, నా దేవుడు నా ప్రార్థన నాలకించును. నా శత్రువా, నామీద అతిశయింపవద్దు. నేను క్రింద పడినను, తిరిగి లేతును. నేను అంధకారమందు కూర్చున్నను యెహోవా నాకు వెలుగుగా నుండును. నేను యెహోవా దృష్టికి పాపము చేసితిని గనుక ఆయన నా పక్షమున వ్యాజ్యెమాడి నా పక్షమున న్యాయము తీర్చువరకు నేను ఆయన కోపాగ్నిని సహింతును. ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును. ఆయన నీతి నేను చూచెదను.” మికా 7:7-9.PKTel 227.1

    యధార్ధ హృదయంతో తన తట్టు తిరిగే వారందరిని క్షమించి అంగీకరించటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడని వెల్లడిచేసే ఈ వర్తమానాలు, ఇలాంటి ఇతర వర్తమానాలు, ఆలయ ద్వారాలు మూసిఉన్న చీకటి సంవత్సరాల్లో సోలిపోతున్న అనేక ఆత్మలకు నిరీక్షణను తెచ్చాయి. ఇప్పుడు నాయకులు దిద్దుబాటును చేపట్టగా పాపదాస్యంలో ఉన్న వేలమంది సానుకూలంగా స్పందించటానికి సిద్ధంగా ఉన్నారు.PKTel 227.2

    యెహోవా క్షమాపణను అర్ధిస్తూ ఆయనకు తమ విశ్వాసపాత్రతను నవీకరించుకోటానికి, ఆలయ ఆవరణంలో ప్రవేశించిన వారికి లేఖనాల్లోని ప్రవచన భాగాలు అద్భుతమైన ప్రోత్సాహాన్ని అందించాయి. అందరూ వింటుండగా విగ్రహారాధనకు వ్యతిరేకంగా మోషేద్వారా ప్రకటితమైన హెచ్చరికల వెనుక, మతభ్రష్టత సమయంలో తనను హృదయపూర్వకంగా వెదకేవారి మనవులు విని, వారికి క్షమాపణ అనుగ్రహిస్తానన్న ప్రవచనాలు వచ్చాయి. మోషే ఇలా అన్నాడు, “ఈ సంగతులన్నియు నీకు సంభవించిన తరువాత నీకు బాధ కలిగినప్పుడు అంత్య దినములలో నీవు నీ దేవుడైన యెహోవావైపు తిరిగి ఆయన మాట వినినయెడల నీ దేవుడైన యెహోవా కనికరముగల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు. నిన్ను నాశనము చేయడు, తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరచిపోడు.” ద్వితి. 4:30,31.PKTel 227.3

    హిజ్కియా అతడి అనుచరులు ఏ ఆలయ సేవల్ని పునరుద్దరించటానికి పూనుకున్నారో ఆ ఆలయ ప్రతిష్ట సమయంలో తన ప్రార్ధనలో సొలొమోను ఇలా అన్నాడు, “మరియు ఇశ్రాయేలీయులగు నీ జనులు నీకు విరోధముగా పాపము చేయుటచేత తమ శత్రువులయెదుట మెత్తబడినప్పుడు వారు నీ తట్టు తిరిగి నీ నామమును ఒప్పుకొని యీ మందిరమందు నిన్ను గూర్చి ప్రార్థన విన్నపములు చేయునప్పుడెల్ల నీవు ఆకాశమందు విని, ఇశ్రాయేలీయులగు నీ జనులు చేసిన పాపమును క్షమించి వారి పితరులకు నీవిచ్చిన దేశములోనికి వారిని తిరిగి రప్పించుము.” 1 రాజులు. 8:33,34. ఈ ప్రార్థనను దేవుడు అంగీకరించాడు. ఎందుకంటే దాని అంతంలో ఆకాశంనుంచి అగ్ని దిగివచ్చి దహనబలుల్ని ఇతర బలుల్ని దహించింది. దేవుని మహిమ దేవాలయాన్ని నింపింది. 2 దిన వృ. 7:1 చూడండి. తన ప్రార్థనను అంగీకరించానని అక్కడ ఆరాధించేవారికి దయ చూపిస్తానని చెప్పటానికి ఆ రాత్రి దేవుడు సొలొమోనుకి కనిపించాడు. ఆయన ఈ హామి ఇచ్చాడు : “నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన యెడల, ఆకాశమునుండి నేను వారి ప్రార్థనవిని, వారి పాపమును క్షమించి, వారి దేశమును స్వస్థపరచుదును.” 14వ వచనం.PKTel 228.1

    హిజ్కియా పాలనలోని సంస్కరణల కాలంలో ఈ వాగ్దానాలు నెరవేరాయి.PKTel 228.2

    ఆలయ పవిత్రీకరణ సమయంలో ప్రారంభమైన ఆ కార్యం తర్వాత ఒక విస్తృత ఉద్యమం బయలుదేరింది. అందులో ఇశ్రాయేలువారు యూదావారు పాలుపొందారు. ఆలయ పరిచర్య ప్రజలకు దీవెనకరంగా ఉండాలన్న కోరికతో ఇశ్రాయేలీయులందరిని పస్కా ఆచరణకు సమావేశపరచనున్న పురాతన ఆచారాన్ని హిజ్కియా పునఃప్రారంభించారు. PKTel 228.3

    జాతీయ పండుగగా పసాను అనేక సంవత్సరాలుగా ఆచరించలేదు. సొలొమోను ఏలుబడి ముగిసిన తర్వాత జరిగిన రాజ్య విభజనవల్ల ఇది ఆచరణ సాధ్యమనిపించలేదు. అయితే పదిగోత్రాలమీద పడుతున్న తీర్పుల దృష్ట్యా మెరుగైన పరిస్థితుల కోసం ప్రజల మనసుల్లో ఆశ ప్రబలమయ్యింది. ప్రవక్తల వర్తమానాలు ఫలదాయకం కానారంభించాయి. యెరూషలేములో జరగనున్న పస్కా పండుగకు ప్రజల్ని ఆహ్వానిస్తూ రాజు దూతలు విస్తృతంగా ‘జెబులూను. దేశము వరకును, ఎఫ్రాయిము మనషేల దేశములలోనున్న ప్రతి పట్టణమునకును” ప్రకటన చేశారు. ఈ ఆహ్వానాన్ని అందిస్తున్న దూతల్ని తరచు తరిమి వెయ్యటం జరిగింది. హృదయ పరివర్తన లేనివారు తరచు పక్కకు తొలగి వెళ్లిపోయారు. అయితే దేవుని చిత్తాన్ని మరింత స్పష్టంగా తెలుసుకోవాలని ఆశించిన కొందరు “కృంగిన మనస్సుతో యెరూషలేమునకు వచ్చిరి.” 2 దినవృ. 30:10,11.PKTel 228.4

    యూదాదేశంలో దీనికి చక్కని స్పందన వచ్చింది. ఎందుకంటే “యెహోవా ఆజ్ఞనుబట్టి రాజును అధిపతులును చేసిన నిర్ణయమును నెరవేర్చునట్లు”, “దేవుని హస్తము” వారిమీద ఉన్నది. ప్రవక్తలద్వారా వెల్లడైన దైవ చిత్రానికి అనుగుణంగా ఈ ఆజ్ఞ ఉన్నది. 12వ వచనం.PKTel 229.1

    సమావేశమైన జనసమూహానికి ఆ సమయం ఆధ్యాత్మికంగా అత్యంత లాభదాయకం. ఆహాజు పాలనలో అపవిత్రతకు స్థానమైన వీధులు ఇప్పుడు విగ్రహాలయాలు లేకుండా ఉన్నాయి. నిర్ణీత దినాన పస్కాను ఆచరించారు. ఆ వారమంతా ప్రజలు సమాధాన బలులు అర్పించటంలోను, దేవుని చిత్తాన్ననుసరించి పనులు చెయ్యటంలోను నిమగ్నులయ్యారు. “యెహోవా సేవయందు మంచి నేర్పరులైన” లేవీయులు దినదినం బోధించారు. దేవుని వెదకటానికి తమ హృదయాల్ని సంసిద్ధం చేసుకున్నవారికి క్షమాపణ లభించింది. ఆరాధిస్తున్న జన సమూహాల్లో ఆనందం వెల్లివిరిసింది. “లేవీయులును యాజకులును యెహోవాను ఘనపరచుచు ఉండిరి.” అందరు కృప కనికరములుగల ఆయనను స్తుతించటంలో ఏకమయ్యారు. 22,21 వచనాలు.PKTel 229.2

    పస్కాపండుగకు సామాన్యంగా నియమించే ఏడు దినాలూ ఇట్టే గడిచిపోయాయి. ప్రభువు మార్గాన్ని గూర్చి మరింత నేర్చుకోవాలన్న కోరికతో ఆరాధకులు ఇంకో ఏడు రోజులు పండుగను కొనసాగించాలని తీర్మానించారు. బోధించే యాజకులు తమ ఉపదేశ పరిచర్యను కొనసాగించారు. వారు ధర్మశాస్త్ర గ్రంథం నుంచి ఉపదేశించారు. ప్రజలు తమ కృతజ్ఞతలు స్తోత్రార్పణలు చెల్లించటానికి అనుదినం ఆలయంలో సమావేశమయ్యారు. ఆ మహాసభలు సమాప్తమయ్యేసరికి ద్రోహి అయిన యూదా పరివర్తనలోను, దేశాన్ని ముంచటానికి వస్తున్న విగ్రహారాధన వరదకు అడ్డుకట్ట వెయ్యటంలోను దేవుడు అద్భుత కార్యాలు చేశాడు. ప్రవక్తలు చేసిన హెచ్చరికలు వ్యర్థం కాలేదు. “యెరూషలేము కాపురస్తులకు మిక్కిలి ఆనందము కలిగెను. ఇశ్రాయేలు రాజును దావీదు కుమారుడైన సొలొమోను కాలమునకు తరువాత ఈలాగున జరిగి యుండలేదు.” 26వ వచనం.PKTel 229.3

    ఆరాధకులు తమతమ నివాసాలకు వెళ్లిపోవటానికి సమయం అయ్యింది. “అప్పుడు లేవీయులైన యాజకులు లేచి జనులను దీవింపగా వారిమాటలు వినబడెను. వారి ప్రార్థన ఆకాశముననున్న పరిశుద్ధ నివాసమునకు చేరెను.” 27వ వచనం. విరిగి నలిగిన హృదయంతో తమ పాపాలు ఒప్పుకుని స్థిరమనసుతో క్షమాపణకు సహాయానికి తనను ఆశ్రయించినవారిని దేవుడు అంగీకరించాడు.PKTel 230.1

    ఇప్పుడు తమ గృహాలికి తిరిగి వెళ్తున్నవారు పాలుపంచుకుని చేయాల్సిన ముఖ్యమైన పని ఒకటుంది. జరిగిన దిద్దుబాటు నిజమైనదని ఈ కార్యాచరణే నిరూపించాల్సి ఉన్నది. దాన్ని గురించిన దాఖలా ఇలా చెబుతున్నది: “అక్కడనున్న ఇశ్రాయేలువారందరును యూదా పట్టణములకు పోయి, యూదా దేశమంతటను, బెన్యామీను ఇఫ్రాయిము మనష్షే దేశములయందంతటను ఉన్న విగ్రహములను నిర్మూలము చేసి, దేవతా స్తంభములను ముక్కలుగా నరికి, ఉన్నత స్థలములను బలిపీఠములను పడగొట్టిరి. తరువాత ఇశ్రాయేలువారందరును తమతమ పట్టణములలో నున్న తమతమ స్వాస్థ్యములకు తిరిగివెళ్లిరి.” 2 దినవృ. 31:1.PKTel 230.2

    తమరాజ్యంలో ఆధ్మాత్మిక ఆసక్తుల్ని ఐహికపరమైన ఆసక్తుల్ని ప్రోది చెయ్యటానికి హిజ్కియా, అతడి సహచరులు వివిధ సంస్కరణలు ప్రవేశపెట్టాడు. “యూదా దేశమంతటను రాజు “ఈలాగున జరిగించి, తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యధార్ధముగాను నమ్మకముగాను పనిచేయుచు వచ్చెను .... తాను ఆరంభించిన ప్రతిపని అతడు హృదయ పూర్వకముగా జరిగించి వర్ధిల్లెను.” “అతడు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాయందు విశ్వాసముంచినవాడు... ఆయనను వెంబడించుటలో వెనుకదీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని గైకొను చుండెను. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. తాను వెళ్లిన చోటనెల్ల అతడు జయము పొందెను.” 20,21 వచనాలు; 2 రాజులు 18:5-7.PKTel 230.3

    హిజ్కియా పరిపాలన కాలంలో అద్భుతమైన దైవ ప్రసన్నతలు ప్రదర్శిత మయ్యాయి. ఇశ్రాయేలీయుల దేవుడు తన ప్రజలతో ఉన్నాడని వారిచుట్టూ ఉన్న రాజ్యాల ప్రజలకు అవి వెల్లడిచేశాయి. హిజ్కియా పరిపాలన ప్రారంభ సంవత్సరాల్లో అపూరీయులు షోమ్రోనును పట్టుకోటంలోను పదిగోత్రాల్లోను, శేషించి నిరుత్సాహం చెందిన ఆ చిన్న గుంపును ప్రపంచ జాతులమధ్యకు చెదరగొట్టటంలోను సాధించిన జయం హెబ్రీ ప్రజల దేవుని శక్తిని అనేకమంది ప్రశ్నించటానికి దారితీస్తున్నది. తమ విజయంవల్ల ధైర్యం తెచ్చుకుని నీనెవే ప్రజలు యోనా వర్తమానాన్ని తోసిపుచ్చి దేవుని సంకల్పాన్ని వ్యతిరేకించటంలో గట్టిగా నిలిచారు. షోమ్రోను పతనం జరిగిన కొన్ని సంవత్సరాల తర్వాత విజయవంతమైన ఆ సేనలు పాలస్తీనాలో మళ్లీ దర్శనమిచ్చాయి. ఈసారి అపూరీయులు తమ సేనల్ని యూదా ప్రాకార పట్టణాలపై దాడికి ఉపయోగించారు. కొంత విజయం సాధించారు కూడా. కాని తమ దేశంలో ఇతర ప్రాంతాల్లో సమస్యలు ఉత్పన్నమైనందువల్ల వారు కొంతకాలం తమ దాడిని నిలుపు చేశారు. అన్యజనుల దేవతలు తుదకు విజయం సాధించాల్సి ఉన్నారా అన్న విషయాన్ని విశదపర్చటం కొన్ని సంవత్సరాలు గడిచేవరకు అంటే హిజ్కియా ఏలుబడి ముగిసే సమయం వరకూ జరుగదు.PKTel 230.4

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents