Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
మహా సంఘర్షణ - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    అధ్యాయం 15—బైబిలు - ఫ్రెంచ్ విప్లవం

    పదహారో శతాబ్దంలో ప్రజలకు తెరచిన బైబిలుతో వచ్చిన సంస్కరణ ఐరోపా దేశాల్లో ప్రవేశింప చూసింది. కొన్ని దేశాలు సంస్కరణను దైవ వర్తమానంగా ఆహ్వానించాయి. తక్కిన దేశాల్లో పోపు అధికారం దాని ప్రవేశాన్ని అడ్డుకోటంలో చాలా పట్టుకు సఫలమయ్యింది. ఉత్తేజ పూరిత ప్రభావం గల బైబిలు పరిజ్ఞానానికి ఆ దేశాల్లో తావులేక పోయింది.ఒక దేశంలో బైబిలు వెలుగు ప్రవేశించినా చీకటి దాన్ని గ్రహించలేకపోయింది. శతాబ్దాలుగా సత్యం అసత్యాల మధ్య ఆధిపత్య పోరాటం సాగింది. చివరికి దుర్మార్గత గెలిచింది. దేవుని సత్యం నిషేధానికి గురి అయ్యింది. “వెలుగు లోకంలోనికి వచ్చెను గాని క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి” యోహాను 3:19. తాను అనుసరించిన మార్గాల ఫలితాన్ని ఆ దేశం అనుభవించింది. దేవుని కృపావరాన్ని తృణీకరించిన ప్రజల నుంచి తన ఆత్మ సంరక్షణను దేవుడు ఉపసంహరించుకొన్నాడు. దుర్మారత పరిపక్వానికి వచ్చింది. వెలుగును మొండిగా విసర్జించిన పర్యవసానాన్ని ప్రపంచ మంతా చూసింది.GCTel 246.1

    బైబిలుకు వ్యతిరేకంగా అనేక శతాబ్దాలుగా ఫ్రాన్స్ లో సాగిన పోరాటం విప్లవ సన్ని వేశాలతో పరాకాష్టకు చేరింది. ఆ భయంకర విప్లవం రోము లేఖనాల్ని అణచివేసినందు వల్ల కలిగిన ఫలితమే. పోపు పరిపాలనావిధానం ఎలాంటిదన్న దానికి అది చక్కని సాదృశ్యం. రోము సంఘం వెయ్యి సంవత్సరాలకు పైగా బోధిస్తున్న బోధనల ఫలితాలకు సాదృశ్యం.GCTel 246.2

    పోపుల ప్రాబల్య కాలంలో లేఖనాల అణచివేతపై ప్రవక్తలు ప్రవచించారు. “పాప పురుషుని” అధికారం వలన ప్రధానంగా ఫ్రానికి సంభవించనున్న భయంకర పర్యవసానాన్ని ప్రకటికుడు వివరిస్తున్నాడు.GCTel 246.3

    ప్రభువు దూత ఇలా అన్నాడు, “వారు నలుబది రెండు నెలలు పరిశుద్ధ పట్టణమును కాలితో తొక్కుదురు. నేను నా యిద్దరు సాక్షులకు అధికారము ఇచ్చెదను. వారు గోనెపట్ట ధరించుకొని వెయ్యిని రెండు వందల అరువది దినములు ప్రవచింతురు... వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే అగాధములో నుండి వచ్చు క్రూరమృగము వారితో యుద్ధముచేసి జయించి వారిని చంపును. వారి శవములు మహాపట్టణపు సంతవీధిలో పడియుండును. వారికి ఉపమాన రూపముగా సోదోము అనియు ఐగుప్తు అనియు పేరు. అచ్చట వారి ప్రభువుకూడ సిలువ వేయబడెను... ఈ ఇద్దరు ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారిగతి చూచి సంతోషించుచు, ఉత్సహించుచు ఒకని కొకడు కల్నములు పంపుకొందురు. అయితే ఆ మూడు దినములున్నర యైనపిమ్మట దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించెను. గనుక వారు పాదములు ఊని నిలిచిరి. వారిని చూచిన వారికి మిగుల భయము కలిగెను” ప్రకటన 11:211.GCTel 247.1

    “నలువది రెండు నెలలు” “వెయ్యిన్ని రెండువందల అరువది దినములు” అని ఇక్కడ పేర్కొన్న కాలావధులు రెండూ ఒకటే. క్రీస్తు సంఘం రోము పాలనకింద హింసననుభవించబోయే సమయాన్ని ఇవి సూచిస్తున్నవి. 1260 సంవత్సరాలు సాగిన పోపుల సర్వాధికారం క్రీ. శ.538 లో ప్రారంభమయ్యింది. కనుక అది 1798 లో అంతం కావలసి ఉన్నది. సరిగ్గా అదే సమయంలో ఫ్రెంచ్ సైన్యం రోములో ప్రవేశించి పోపును బంధించి చెరసాలలో వేసింది. అతడు చెరలోనే మరణించాడు. మరో పోపును ఎన్నుకోబం త్వరలో జరిగినా గతంలో ఉన్న అధికారప్రాబల్యం పోపులకు ఇక లభించలేదు.GCTel 247.2

    1260 సంవత్సరాలూ సంఘహింస సాగలేదు. కృపామయుడైన దేవుడు తన ప్రజల శ్రమ కాలాన్ని తగ్గించాడు.GCTel 247.3

    సంఘానికి రానున్న గొప్ప శ్రమను గురించి ప్రవచించినప్పుడు రక్షకుడిలా అన్నాడు, “ఆ దినములు తక్కువ చేయబడక పోయిన యెడల ఏ శరీరియు తప్పించుకొనడు. ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును” మత్తయి 24:22. సంస్కరణ ప్రభావం వల్ల 1798 కి ముందే హింస ముగిసింది.GCTel 247.4

    ఇద్దరు సాక్షుల గురించి ప్రవక్త ఇంకా ఇలా అంటున్నాడు, “వీరు భూలోకమునకు ప్రభువైన వాని యెదుట నిలుచుచున్న, రెండు ఒలీవ చెట్టును, దీపస్తంభములునై యున్నారు. ” “నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై యున్నది.” అన్నాడు కీర్తనకారుడు. ప్రకటన 1 1:4; కీర్తనలు 1 19:105. ఈ ఇద్దరు సాక్షులు పాతకొత్త నిబంధన లేఖనాలు. ఈ రెండూ ధర్మశాస్త్ర ఆరంభాన్ని, శాశ్వతత్వాన్ని ధ్రువపర్చే ముఖ్యమైన సాక్ష్యాలు. ఈ రెండూ రక్షణ ప్రణాళికను గూర్చిన సాక్ష్యాలు కూడా. పాత నిబంధనలోని ముంగుర్తులు, బల్యర్పణలు, ప్రవచనాలు రావాల్సి ఉన్న రక్షకుని సూచించాయి. ముంగుర్తులు, ప్రవచనాలు సూచించిన రీతిగానే వచ్చిన రక్షకుని గూర్చి నూతన నిబంధనలోని సువార్తలు, పత్రికలు వివరిస్తున్నాయి.GCTel 247.5

    “వారు గోనె పట్టలు ధరించుకొని వెయ్యిన్ని రెండువందల అరువది దినములు ప్రవచింతురు ” ఈకాలావధిలో ఎక్కువ భాగం దైవసాక్షులు చీకటిలో మిగిలిపోయారు. సత్యాన్ని ప్రజల నుంచి మరుగుపర్చి వాక్యం ఇచ్చే సాక్షాన్ని ఖండించటానికిగాను పోపులు దాన్ని దాచి పెట్టటానికి ప్రయత్నించారు. మత గురువులు, రాజ్యాధినేతలు బైబిలుని నిషేధించినప్పుడు బైబిలు సత్యాన్ని భష్టపర్చి ప్రజల మనసుల్ని వాటి నుంచి మళ్లించటానికి దురాత్ములు తాము చేయగలిగిన ప్రయత్నాలన్నీ చేసినప్పుడు,GCTel 248.1

    బైబిలులోని పవిత్ర సత్యాన్ని ప్రకటించటానికి ధైర్యంగా ముందుకు వచ్చిన వారిని జంతువులల్లే వేటాడటం, పట్టివ్వటం, హింసించటం, చీకటి కొట్లలో బంధించటం, తమ విశ్వాసం గురించి వారిని హతమార్చటం, లేదా కొండగుహల్లో తలదాచుకోటానికి వారిని తరిమి వేయటం చేసినప్పుడు వారు గోనెపట్ట ధరించి ప్రవచించారు. అయినా మానకుండా వారు ఆ 1260 సంవత్సర కాలమంతా తమ సాక్ష్యాన్ని కొనసాగించారు. కటిక చీకటి కమ్మిన కాలంలో సైతం దైవ వాక్యాన్ని అమితంగా ప్రేమించిన వారు, దేవుని గౌరవించటానికి ఉత్సాహంతో ఉప్పొంగిన వారు ఎందరో ఉన్నారు.ఈ కాలమంతటిలోను సత్యాన్ని ప్రకటించటానికి విశ్వాసపాత్రులైన ఈ సేవకులకు దేవుడు వివేకాన్ని, శక్తిని, అధికారాన్ని ఇచ్చాడు.GCTel 248.2

    “ఎవడైనను వారికి హానిచేయ నుద్దేశించిన యెడల వారి నోటినుండి అగ్ని బయలు వెడలి వారి శత్రువులను దహించివేయును. గనుక ఎవడైనను వారికి హాని చేయనుద్దేశించిన యెడల ఆలాగున నాడు చంపబడవలెను” ప్రకటన 11:5. మానవులు దైవ వాక్యాన్ని కాళ్లతో తొక్కి శిక్ష తప్పించుకోటం సాధ్యంకాదు. ఈ భయంకర ఖండన వివరణ ప్రకటన చివరి అధ్యాయంలో ఉంది. ” ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి నేను సాక్షమిచ్చునది ఏమనగా - ఎవడైనను వీటితో మరి ఏదైనను కలిపిన యెడల, ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్లు దేవుడు వానికి కలుగజేయును. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనను తీసివేసిన యెడల, దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండ చేయును” ప్రకటన 22:18,19.GCTel 248.3

    తాను బయలు పర్చిన వాటిని లేదా ఆజ్ఞాపించిన వాటిని ఏ రూపంలోనూ ఎవరూ మార్పు చేయకుండా కాపాండేందుకు దేవుడిచ్చిన హెచ్చరికలు తీవ్రమైనవి. దైవ ధర్మశాస్త్రాన్ని ప్రాముఖ్యం లేని విషయంగా పరిగణించటానికి ఎవరైతే ప్రజల్ని ప్రభావితం చేస్తారో వారికి ఈ గంభీర ఖండనలు వర్తిస్తాయి. ధర్మశాస్త్రాన్ని ఆచరించటం ఆచరించకపోటం ఏమంత పెద్ద విషయం కాదని లెక్కలేని తనంగా మాట్లాడే వారికి ఈ ఖండనలు భయమూ వణకు పుట్టించాలి. దైవ వాక్యం కన్న తమ అభిప్రాయాలే ఉన్నతమైనవన్నట్లు వ్యవహరించే వారు తమ సౌలభ్యం కోసమో లేక లోకం తీరును అనుసరించేందుకో లేఖనాలు బోధించే స్పష్టమైన సత్యాలను వక్రీకరించటానికి మార్పులు చేసే వారందరూ తమపై తాము అతి భయంకర బాధ్యతను వేసుకొంటున్నారు. లిఖిత రూపంలో ఉన్న ధర్మశాస్త్రం ప్రతీవారి ప్రవర్తనను తూకం వేస్తుంది. ఈ నిర్దిష్ట పరీక్ష ఎవరిని లోటుగా ఉన్నట్లు నిర్వర్తిస్తుందో వారందరికి శిక్ష విధిస్తుంది. “వారు సాక్ష్యము చెప్పుట ముగింపగనే ” గోనెపట్ట ధరించుకొని ఆ యిద్దరు సాక్షులు ప్రవచించిన కాలం 1798 లో ముగిసింది. వారు తమ పనిని అజ్ఞాతంగా ముగించే సమయం సమీపించగా ” అగాధంలోనుండి వచ్చు క్రూరమృగము” వారితో యుద్ధం చేస్తుంది. ఐరోపా ఖండంలో అనేక శతాబ్దాలుగా సంఘాన్ని దేశాన్ని అసుశాసించిన శక్తులను పోపుల ద్వారా సాతాను అదుపుచేశాడు. అయితే ఇక్కడ సాతాను శక్తి ఒక నూతన రూపంలో ప్రదర్శితమయ్యింది.GCTel 249.1

    పరిశుద్ధ బైబిలు గ్రంథ విషయంలో భక్తి గౌరవాలు చూపుతున్నామని చెప్పుకొంటూ దాన్ని అర్ధంకాని భాషలో బంధించి ప్రజలకు అందుబాటులో లేకుండా చేయటమన్నది రోము అవలంబించిన విధానం. రోము పరిపాలన కింద సాక్షులు గోనె పట్టలు ధరించుకొని ” ప్రవచించారు. కాని మరొకశక్తి అనగా “అగాధము నుండి వచ్చు క్రూరమృగము” దైవ వాక్యంపై సమరం సల్పటానికి లేవవలసి ఉన్నది.GCTel 249.2

    ఏ మహాపట్టణ వీధుల్లో సాక్షులు వద్దకు గురి అయ్యారో ఏ “మహాపట్టణం”లో వారి శవాలు పడి ఉన్నాయో అది “ఆధ్యాత్మికంగా” ఐగుపు, బైబిలు చరిత్రలో పేర్కొటం జరిగిన దేశాలన్నింటిలోను ఐగుప్తు దేవుని ఉనికిని తోసిపుచ్చి ఆయన ఆజ్ఞల్ని ప్రతిఘటించింది. దేవుని అధికారానికి వ్యతిరేకంగా తిరుగుబాటును ఐగుప్తురాజు ప్రోత్సహించినంతగా ఏరాజు ఎన్నడూ ప్రోత్సహించలేదు. మోషే ప్రభువు పేరట వర్తమానం తెచ్చినప్పుడు ఫరో దర్పంగా ఇలా సమాధానమిచ్చాడు, “నేను అతని మాట విని ఇశ్రాయేలీయులను పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను. ఇశ్రాయేలీయులను పోనీయను” నిర్గమ కాండము 5:2. ఇది నాస్తికత్వం. ఐగుపు సూచిస్తున్న దేశం ఆవిధంగానే సజీవుడైన దేవుని హక్కుని కాదని ఐగుప్తు మల్లే అవిశ్వాసాన్ని, ధిక్కారాన్ని ప్రదర్శిస్తుంది. ఆ “మహాపట్టణం” (6 ఆధ్యాత్మికంగా” సొదొమకు కూడా సరిసాటి. దైవ ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించి సొదొమ చేసిన ఘోర పాపం వ్యభిచారం. ఈ లేఖనాన్ని నెరవేర్చే దేశపు ప్రముఖ లక్షణం ఈ పాపం కూడా.GCTel 249.3

    కాబట్టి ప్రవక్త మాటల ప్రకారం 1798 కి కొంచెం ముందు సాతాను సంబంధమైన, సాతాను ప్రవర్తనను సంతరించుకొన్న ఒక శక్తి బైబిలుపై దాడి చేయటానికి ఆవిర్భవిస్తుంది. దేవుని ఈ ఇద్దరు సాక్షుల సాక్ష్యాలు ఏ దేశంలో మూగబోతాయో అక్కడ ఫరోనాస్తికత్వం సొదొమ వ్యభిచారం ప్రదర్శితమౌతాయి.GCTel 250.1

    ఈ ప్రవచనం ఫ్రాన్స్ చరిత్రలో కచ్చితంగా నెరవేరింది. 1793 లోని విప్లవ దినాల్లో జరిగిన సభలో విద్యావంతులు, గొప్ప సంస్కారం గలవారు, ఐరోపాలో అతి చక్కని దేశాన్ని పాలించే బాధ్యతలు నిర్వహిస్తున్న మహానుభావుల స్వరాలు మొట్టమొదటి సారిగా ప్రపంచానికి వినిపించాయి. మానవుడి ఆత్మ అందుకొనే అతి గంభీర సత్యాన్ని విసర్జించటానికి, దైవాన్ని విశ్వసించి ఆరాధించటాన్ని త్వజించటానికి, ఏకగ్రీవంగా అంగీకరించటానికి తీర్మానించారు. ”- సర్ వాల్టర్ స్కాట్, లైఫ్ ఆఫ్ నెపోలియన్, సం 1, అధ్యా 17. విశ్వ విధాతపై తిరుగుబాటు చేసిన రాజ్యంగా ఫ్రాన్సు మాత్రమే విశ్వసనీయ దాఖలాలు ఇంకా ఉనికిలో ఉన్నాయి. “ఇంగ్లాండు, జర్మనీ, స్పెయిన్GCTel 250.2

    మొదలైన దేశాల్లో దేవదూషకులు, నాస్తికులు అనేకులు గతంలో ఉన్నారు. ఇంకా ఉంటూనే ఉన్నారు. కాగా దేవుడు లేడని తన చట్టసభలో తీర్మానం తీసుకోటం రాజధానిలోని ప్రజలు ఇతరచోట్ల విశేష ప్రజానీకం ఆ ప్రకటనను గీత తాండవాలతో స్వాగతించటం జరిగిన దేశాల్లో ఫ్రాన్స్ ది ప్రపంచ చరిత్రలోనే ప్రత్యేక స్థానం” — బ్రేక్ ఉడ్స్ మేగజీన్, నవంబర్, 1870.GCTel 250.3

    సొదొమకు ప్రత్యేకతను కూర్చిన అవలక్షణాలు, దుర్గుణాలను ఫ్రాన్స్ కూడా కనపర్చింది. మైదానమందున్న పట్టణాల మీదికి నాశనాన్ని తెచ్చిన అనైతిక వర్తన అవినీతి లాంటి దుశ్శీలతే విప్లవ సమయంలో ప్రదర్శితమయ్యింది. ఫ్రాన్స్ లో పెచ్చరిల్లిన నాస్తికతను అడ్డు అదుపులేని దుర్నీతిని ప్రవచనంలో ఉన్నట్లుగానే చరిత్రకారుడు ఇలా వివరిస్తున్నాడు, “మతాన్ని నాశనం చేయటానికి ఉద్దేశించిన నిబంధనలతో దగ్గర సంబంధమున్న మరో నిబంధన వివాహ బాంధవ్యం. మనుషులు ఏర్పర్చుకోగల సహజ పటిష్ఠతకు బాటలు పరచగల బాంధవ్యాన్ని ఇద్దరు తమ మధ్య తాత్కాలికంగా ఏర్పాటు చేసుకొని ఇష్టం లేనప్పుడు వదులుకొనే వ్యవస్థగా దిగజార్చటం! కుటుంబ జీవితంలో ఏది ఆదర్శనీయమో, ఏది మనోహరమో, ఏది సత్యమో దాన్ని తిరుగులేకుండా ధ్వంసం చేయటానికి, తాము చేయతలచుకొన్న కీడు తరతరాలుగా కొనసాగుతుందన్న హామీ పొందటానికి దయ్యాలు కష్టపడి పని చేసి ఒక పద్ధతిని కనుగొని ఉన్నట్లయితే వివాహ వ్యవస్థను భ్రష్టు పట్టించటంకన్న మెరుగైన పథకాన్ని రూపొందించి ఉండేది కాదు... హాస్యరసం ఉట్టిపడే మాటలకు పేరు పొందిన నటి సోఫీ ఆర్‌ వివాహాన్ని “వ్యభిచార ప్రతిజ్ఞ”గా వర్ణించింది.”- స్కాట్ సం 1, అధ్యా 17. GCTel 250.4

    “అచ్చట వారి ప్రభువు కూడ సిలువ వేయబడెను” ఫ్రాన్స్ ఈ నిర్దిష్ట ప్రవచనాన్ని కూడా నెరవేర్చింది. క్రీస్తు పట్ల ఇంత శత్రుత్వాన్ని ఏ యితర దేశము కనపర్చలేదు. ఏ దేశంలోనూ సత్యానికి ఇంత తీవ్ర ప్రతిఘటన ఎదురుకాలేదు. సువార్తను స్వీకరించిన విశ్వాసుల్ని హింసించటం తద్వారా ఫ్రాన్స్ క్రీస్తును సిలువ వేసింది.GCTel 251.1

    శతాబ్దాల పొడవునా పరిశుద్ధులు తమ రక్తాన్ని చిందిస్తూనే ఉన్నారు. “వాక్యం కోసం యేసును గూర్చిన సాక్ష్యం కోసం” పైడ్మెంట్ పర్వతాలపై వాల్డెన్సీయులు తమ ప్రాణాలర్పించారు. తమ సహోదరులు ఫ్రాన్సకు చెందిన ఆ బిజిన్లు సత్యం నిమిత్తం అలాంటి సాక్ష్యాన్నే ఇచ్చారు. సంస్కరణ దినాల్లో సంస్కరణవాద విశ్వాసులు క్రూర మరణాలకు గురి అయ్యారు. రాజు, ఉన్నత పౌరులు, అగ్రజాతి మహిళలు, సున్నితమైన యువతులు, దేశానికి గర్వకారణమైన యుద్దశూరులు అందరి దృష్టి యేసు కోసం మరణిస్తున్న హతసాక్ష్యుల మీదే నిలిచింది. మానవ హృదయం మిక్కిలి పవిత్రంగా ఎంచే హక్కుల కోసం పోరాడున్న హూజినాట్లు అనేక పోరాటాలో తమ రక్తాన్ని ధారపోశారు. ప్రొటస్టాంటులను విద్రోహులుగా పరిగణించారు. వారిని పట్టి ఇచ్చిన వారికి పారితోషికాలు ప్రకటించారు. అడవి మృగాల్ని వేటాడినట్లు వారిని వేటాడారు.GCTel 251.2

    “ఎడారిలో సంఘం” వీరు పద్దెనిమిదో శతాబ్దంలో ఇంకా ఫ్రాన్స్ లో ఉండిపోయిన కొందరు ప్రాచీన క్రైస్తవుల సంతతివారు. దక్షిణాన ఉన్న పర్వతాల్లో రహస్యంగా ఉంటూ వీరు తమ తండ్రుల విశ్వాసాన్ని కాపాడుకొంటూ నివసించారు. కొండల పక్క, కొండల నడుమ, మైదానాల్లో వారు రాత్రులు సమావేశమైనప్పుడు సైనికులు వారిని తరిమి పట్టుకొని యుద్ధ నౌకలలో జీవితకాలం బానిసలుగా పని చేయటానికి లాక్కుపోయేవారు. ఫ్రెంచ్ వారిలో నిష్కళంకులు, మర్యాదస్తులు, జ్ఞానవంతుల్ని సంకెళ్లు వేసి దొంగలు, హంతకుల మధ్య ఉంచి చిత్రహింసకు గురిచేసేవారు.” విలీ, పుస్త 22, అధ్యా 6. చూడండి. ఇతరుల్ని క్రూరంగా కాల్చి చంపేవారు. నిరాయుధులు, అసహాయులు అయిన వారు మోకాళ్లపై నిల్చి ప్రార్ధించేవారు. తమ సమావేశ స్థలంలో వందలాది వృద్ధులు, అసహాయ మహిళలు, అమాయక చిన్నారులు అనేకులు మరణించి నేలమీద పడి ఉండేవారు. సాధారణంగా వారు సమావేశమయ్యే పర్వత ప్రాంతంలోను, అడవిలోను చూస్తే “ప్రతీ నాలుగు అడుగులకు శవాలు పడిపుండటం, చెట్ల కొమ్మలకు మృతదేహాలు వేళాడటం కనిపించేది” ఖడ్గంతో, గొడ్డలితో, మంటలతో వారి నివాస స్థలాలు “విశాలమైన చీకటిమయమైన అడవిలా మారాయి.” ఈ అకృత్యాలు చోటుచేసుకొన్నది... చీకటి యుగంలో కాదు, లూయిస్ XIV పరిపాలించిన నవీన శకంలో. అప్పుడు శాస్త్ర విజ్ఞానం వృద్ధి చెందుతున్నది. సాహిత్యం ప్రగతిపథాన సాగుతున్నది. ఆస్థానంలోను రాజధానిలోను ఉన్న మతగురువులు... విద్యాధికులు, గొప్ప వక్తలు, సాత్వికం, ప్రేమాది సుగుణాలున్నవారు” - అదే పుస్తకం, పుస్త 22, అధ్యా 7. GCTel 251.3

    నేరాల జాబితాలో అతిచెడ్డది, గతించిన భయంకర శతాబ్దాల్లో జరిగిన రాక్షస కృత్యాల్లో అతిక్రూరమైనదిగా చెప్పుకోతగ్గది భక్తుడు బర్తలోమియ సామూహిక హత్య, క్రూరమైన ఆ దృశ్యాన్ని జ్ఞాపకం చేసుకొంటే ప్రపంచానికి ఇప్పటికీ దడ వణుకు పుడతాయి.GCTel 252.1

    రోమీయ ప్రీస్టులు ప్రీలేటుల ప్రేరణ సహకారాలతో ఫ్రాన్స్ రాజు ఆ నరమేధానికి అనుమతి నిచ్చాడు. అర్ధరాత్రిలో మోగే గంట ఈ నరహత్యకు సంకేతం. రాజు గౌరవాన్ని అతడు సమకూర్చే భత్రతను నమ్ముకొని ప్రశాంతంగా తమ గృహాల్లో నిద్రించే వేలాది ప్రొటస్టాంటుల్ని హెచ్చరికలేకుండా బైటికిలాగి బాహాటంగా హత్య చేశారు.GCTel 252.2

    ఐగుపు దాస్యంలో క్రీస్తు తన ప్రజలకు అదృశ్య నాయకత్వం వహించినట్లు పెరుగుతున్న హతసాక్షుల మరణాలకు సాతాను అదృశ్యనేత. పేరిస్ నగరంలో ఏడు దినాలు హత్యాకాండ సాగింది. మొదటి మూడు దినాలు హింస తీవ్రంగా సాగింది. అది నగరానికే పరిమితం కాలేదు. రాజ భవనం నుంచి జారీ అయిన ఆదేశం మేరకు హింస ప్రొటస్టాంటులున్న రాష్ట్రాలకు, పట్టణాలకు విస్తరించింది. వయసునుగాని, ఆడమగ తేడాలనుగాని గౌరవించలేదు. అభం శుభం తెలియని పసికందుల్నిగాని, తల పండిన వృద్ధులనుగాని విడిచిపెట్టలేదు. ధనికుడు, దరిద్రుడు, వృద్ధుడు, బాలుడు, తల్లి బిడ్డ అందరూ ఊచకోతకు గురి అయ్యారు. దేశంలో ఉత్తములైన డెబ్బై వేలమంది హత్యకు గురి అయ్యారు,GCTel 252.3

    ఈ ఊచకోత వార్త రోముకు చేరగానే ప్రబోధక వర్గం ఆనందోత్సాహాలతో గంతులు వేసింది. ఆ వార్త చెప్పిన వ్యక్తికి లోరెన్ కార్డినల్ వెయ్యి క్రౌన్ల పారితోషికం ఇచ్చాడు. సంతోష సూచకంగా సెంట్ ఏంజిలో ఫిరంగి పేలింది. గుడిగోపురాల గంటలు మోగాయి. చలిమంటలు రాత్రిని పగలుగా మార్చాయి. కార్డినలు ఇతర సంఘాధికారులు తన వెంట పెద్ద ఊరేగింపుగా వెళ్లగా గ్రెగరీ XIII సెంట్ లూయిస్ ఆలయానికి వెళ్లాడు. అక్కడ కార్డినల్ లోరెన్ టి. డి. ఎమ్ పాడాడు... ఈ చిత్రవధ జ్ఞాపకార్థం ఒక మెడల్ వేశారు. వేటికలో ఇప్పటికి మూడవసారి గోడ చిత్రాలు కనిపించాయి. అవి రాజు కొలువుతీరి ఎడ్మిరల్ పై దాడికి, ఆ చిత్రవధకు వ్యూహరచన చేయటాన్నీ, జరిగిన ఆ చిత్రవథనూ వర్ణించే చిత్రాలు అవి. గ్రెగరీ చార్లెస్ కి బంగారు గులాబిని పంపాడు. ఆ సామూహిక వధ జరిగిన నాలుగు నెలలకు అతడు ఒక ప్రెంచ్ ప్రీస్ట్ ప్రసంగం విన్నాడు. ఆ ప్రీస్ట్ ఆ దినం గురించి ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా మాట్లాడాడు. అతి పరిశుద్ధుడైన ఆ ఫాదర్ ఆ వార్త వినగానే దేవునికి, సెంట్ లూయిస్ కి వందనాలు సమర్పించాడు” - హెన్రీ నైట్, ది మాసక్కర్ ఆఫ్ బర్తలోమియా, అధ్యా 14, పేరా 34.GCTel 253.1

    సెంట్ బర్తలోమియా నరమేధాన్ని ప్రేరేపించిన దురాత్మే విప్లవ సన్ని వేశాల్లోను నాయకత్వం వహించాడు. యేసుక్రీస్తును మోసగాడన్నారు. ఫ్రెంచ్ నాస్తిక వాదులు క్రీస్తునుద్దేశించి ఇచ్చిన నినాదం, “ఆ దుష్టుడిని అణగదొక్కండి.” దేవదూషణ, హేయమైన దుర్మార్గత ఏకమయ్యాయి. నీచాతినీచులు, క్రూరత్వానికి, దుష్టత్వానికి పేరుపొందిన వ్యక్తులను అభిమానించారు. దీనంతటిలోను సాతానుకు గొప్ప సన్మానం జరిగింది. సత్యం, పరిశుద్ధత, స్వార్ధరహిత ప్రేమ ఉట్టిపడే క్రీస్తును సిలువ వేశారు.GCTel 253.2

    “అగాధములో నుండి వచ్చు క్రూరమృగము వారితో యుద్ధముచేసి జయించి వారిని చంపును” విప్లవ కాలంలోను భయంకర పరిపాలన కాలంలోను ఫ్రాన్ను పాలించిన నాస్తికవాద పరిపాలకులు దేవునికి ఆయన వాక్యానికి వ్యతిరేకంగా అలాంటి భయంకర యుద్ధం సాగించారు. జాతీయ విధాన సభ శాసనం ద్వారా దైవారాధనను నిషేధించారు. బైబిళ్లను పోగుచేసి అవహేళన చేసి కాల్చివేశారు. దైవ ధర్మశాస్త్రాన్ని కాళ్లతో తొక్కారు. బైబిలు సంస్థలను రద్దు చేశారు. వారాంతపు విశ్రాంతి దినాన్ని పక్కన పెట్టారు. దానికి బదులు వినోదాలకు దేవదూషణకు ప్రతీ పదిరోజుల్లో ఒక రోజును ప్రత్యేకించారు. బాప్తిస్మాన్ని ప్రభుభోజన సంస్కారాన్ని నిషేధించారు. సమాధి స్థలాల్లో మరణం నిత్యనిద్ర అన్న ప్రకటనలు అంటించారు.GCTel 253.3

    దేవుని యందు భయభక్తులు వివేకానికి కాదు, బుద్ధిహీనతకు మూలమని బోధించారు. మతసంబంధమైన ఆరాధనల్ని నిషేధించారు. స్వేచ్ఛను దేశాన్ని ఆరాధించాలని ప్రబోధించారు. జాతీయ ప్రతినిధుల ముందు ఒక బుద్ధిహీనమైన బాగోతంలో ప్రధానపాత్ర వహించటానికి పేరిస్ బిషప్ ని తీసుకు వచ్చారు. తాను అనేక సంవత్సరాలు ప్రబోధించిన మతం కేవలం యాజకతంత్రమని దానికి చరిత్రలోగాని పవిత్ర సత్యంలోగాని ఎలాంటి పునాదీ లేదని సభకు ప్రకటించటానికి అతణ్ణి పెద్ద ఊరేగింపుతో తీసుకు వచ్చారు. తాను ఎవరి ఆరాధనకు ప్రతిష్ఠతమయ్యాడో ఆ దేవుడు ఉనికిలో లేడని గంభీరంగా, స్పష్టంగా ప్రకటించి భవిష్యత్తులో స్వేచ్ఛ, సమానత, సద్గుణం, నైతికతలకు తన్నుతాను అంకితం చేసుకొంటానని ఆ సభకు తెలియజేశాడు. ఆ తర్వాత తన యాజక అలంకరణలను బల్లమీద పెట్టి ఆ సభాపతి నుంచి ప్రేమపూర్వక కౌగిలింత అందుకొన్నాడు. ఈ ప్రిలేట్ మాదిరిని చాలావుంది భ్రష్ట ప్రీస్టులు అవలంబించారు.” - స్కాట్, సం 1, అధ్యా 17.GCTel 254.1

    ఈ యిద్దరు ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి గతిచూచి సంతోషించుచు, ఉత్సహించుచు ఒకనికొకడు కట్నములు పంపుకొందురు.” దేవుని ఇద్దరు సాక్షుల గద్దింపులు వినిపించకుండా వారి నోళ్లు మూసింది నాస్తిక ఫ్రాన్స్ సత్యం. ఫ్రాన్స్ వీధుల్లో చచ్చిపడి ఉన్నది. దైవ ధర్మశాస్త్ర ఆంక్షలను విధులను ద్వేషించిన వారంతా సంతోషించారు. ప్రజలు బహిరంగంగా పరలోక రాజును ధిక్కరించారు. గతంలోని పాపుల మాదిరిగా వారిలా కేకలు వేశారు, “దేవుడు ఎట్లు తెలిసికొనును? మహోన్నతునికి తెలివి యున్నదా?” కీర్తనలు 73:11.GCTel 254.2

    దేవదూషణతో నిండిన ధైర్యంతో నూతన పంథా ప్రీస్టు ఒకడిలా అన్నాడు, “దేవుడా నీవు జీవించివుంటే నీ నామానికి తగిలిన దెబ్బకు ప్రతీకారం తీర్చుకో, నిన్ను ధిక్కరిస్తున్నాను. నెమ్మదిగా ఉన్నావు, నీ ఉరుములు ప్రారంభించటానికి నీకు ధైర్యం లేదు. ఇంత జరిగాక నీవు ఉన్నావంటే ఎవరు నమ్ముతారు?” వేక్రిటెల్, హిస్టరి, సం 11, పుట 309. ఇన్ సర్ ఆర్చిబాల్డ్ ఏలిసన్, హిస్టరీ ఆఫ్ యూరఫ్, సం 1, అధ్యా 10. ఫరో పలికిన ఈ మాటలకు ఇది ఎంత స్పష్టమైన ప్రతిధ్వని! ‘నేను అతని మాటవిని ఇశ్రాయేలీయులను పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను?”GCTel 254.3

    “దేవుడులేడని బుద్దిహీనులు తమ హృదయములో అనుకొందురు” కీర్తనలు 14:1. సత్యాన్ని వక్రీకరించేవారిని గూర్చి ప్రభువిలా అంటున్నాడు, “వారి అవివేకము)... అందరికీ తేటపడును” 2తిమోతి 3:9. “మహాఘనుడు మహోన్నతుడును... నిత్య నివాసియునైన” సజీవ దేవుని ఆరాధనను ఫ్రాన్స్ త్యజించిన కొద్ది కాలంలోనే భ్రష్ట విగ్రహారాధనకు దిగజారిపోయింది. ఒక నీతి బాహ్యస్త్రీ రూపంలో జ్ఞానదేవతను ఆరాధించటం మొదలు పెట్టింది. ఇది జాతీయ విధానసభ. అత్యున్నత పౌర, రాజ్యాంగాధి కారాల సమ్మతితో జరిగింది. చరిత్రకారుడిలా అంటున్నాడు, ” కాలంలో ప్రబలిన ఆచారాల్లో ఒకటి అర్ధరహిత, ధర్మరహిత ఆచారంగా అపఖ్యాతి గడించింది. సభ తలుపులు సంగీత బృందానికి తెరచారు. సంగీత బృందానికి ముందు పురపాలక సంఘ సభ్యులు గంభీరమైన ఊరేగింపుతో ప్రవేశించారు. స్వేచ్ఛను ప్రశంసిస్తూ పాటపాడుతూ, భవిష్యత్తులో తమ ఆరాధన సూచకంగా ముసుగు వేసుకొన్న ఒక స్త్రీని జ్ఞానదేవత అంటూ తమతో సభలోకి తీసుకువచ్చారు. అక్కడ లాంఛనాలతో ఆమె ముసుగు తొలగించి ఆ సభకు అధ్యక్షుడి పక్క నిలబెట్టారు. అప్పుడు ఆమె ఆ సంగీత నాటకంలో నర్తకిగా గుర్తింపు పొందింది... తాము ఆరాధించే జానానికి అర్థవంతమైన ప్రతినిధిగా ఈ స్త్రీకి ఫ్రాన్స్ జాతీయ సభ శ్రద్ధాంజలి ఘటించింది.GCTel 255.1

    “భక్తిహీనం అర్థరహితం అయిన ఈ ఆచార కర్మతో కొంత శైలికూడా ఉంది. తమలో విప్లవ ఆశయాలు ఉన్నట్లు చెప్పుకోగోరే ప్రజలు ఎక్కడైతే ఉన్నారో ఆ స్థలాల్లో జ్ఞానదేవత ప్రతిష్టాపనను నవీకరించి దేశమంతటా ఆ ఆచారాలను అంగీకరించారు.” - స్కాట్, సం 1, అధ్యా 17. GCTel 255.2

    జానారాధనపై చర్చను ప్రారంభిస్తూ సభాపతి ఇలా అన్నాడు, “చట్టసభా సభ్యులారా, మత ఛాందసం స్థానాన్ని జానం ఆక్రమించింది. మసకబారిన దాని కళ్లు కాంతివంతమైన వెలుగును చూడలేవు. గాతిక్ నిర్మాణ కళతో సుందరంగా ఉన్న ఆ హాలులో ఈ రోజు పెద్ద సంఖ్యలో ప్రజలు సమావేశమయ్యారు. ప్రప్రథమంగా అక్కడ సత్యం ప్రతి ధ్వనిస్తున్నది. ఫ్రెంచి ప్రజలు అక్కడ నిజమైన ఒకే ఒక ఆరాధనను అనగా స్వేచ్ఛ, జ్ఞానం ఆరాధనను పండుగగా జరుపుకొంటున్నారు. ఫ్రెంచ్ రిపబ్లిక్ సౌభాగ్యానికి శుభాకాంక్షల్ని అక్కడ రూపొందించుకొంటున్నాం. జీవంలేని విగ్రహాలను విడిచిపెట్టి అక్కడ జ్ఞానాన్ని పొందుతున్నాం. జ్ఞానం జీవంతో నిండినది. అది ప్రకృతి చేసిన ఉత్తమ కృత్యం”- ఎమ్.ఎ. తీయర్స్, హిస్టరీ ఆఫ్ ది ఫ్రెంచ్ రివల్యూషన్, సం 2, పుటలు 370, 371.GCTel 255.3

    దేవత సభలోకి వచ్చినప్పుడు సభాపతి ఆమెను చేయిపట్టి నడిపిస్తూ సభ నుద్దేశించి ఇలా అన్నాడు, “మనుషులారా, మీ భయాలు సృష్టించిన దేవుడి ఉరుముల ముందు వణకటం మానేయండి. ఇక నుంచి జ్ఞానాన్ని తప్ప ఏ దేవుణ్ణి గుర్తించకండి. ఉదాత్తమైన, పవిత్రమైన జ్ఞానాన్ని మీ ముందుంచుతున్నాను. విగ్రహాలు కావలసివస్తే ఈ దేవత (జానం) ముందే అర్పణలు అర్పించండి... స్వేచ్ఛ అనే ఈ ప్రఖ్యాత సభ ముందు సాగిలపడండి. ఈ జ్ఞానదేవత ముందు సాగిల పడండి! GCTel 256.1

    “అధ్యక్షుడి కౌగలింత అనంతరం ఆ దేవతను అందమైన వాహన మెక్కించి జనసమూహం నడుమ వాహనం నడుపుతూ తన దేవతా స్థానాన్ని ఆక్రమించటానికి ఆమెను నాబ్రెడమ్ దేవాలయానికి తీసుకు వెళ్లారు. అక్కడ ఆమెను ఉన్నత బలిపీఠం మీద కూర్చో బెట్టారు. అంతట అక్కడున్న వారంతా ఆమెను పూజించారు. ” - ఏలిసన్, సం 1, అధ్యా 10.GCTel 256.2

    ఇది జరిగిన కొద్ది కాలానికే బైబిలును బహిరంగంగా కాల్చివేయటం జరిగింది. ఒకసారి “ది పాప్యులర్ సొసైటీ ఆఫ్ ది మ్యూజియమ్” (మ్యూజియం ప్రజాసమాజ సభ్యులు) (లీన్ లారీ జామ్” (జ్ఞానం జిందాబాద్) అని కేకలు వేస్తూ పురపాలక సంఘం హాలులో ప్రవేశించారు. ప్రార్థన పుస్తకాలు, పూజా పుస్తకాలు, కొత్త పాత నిబంధనలతో సహా సగం కాలిపోయిన అనేక పుస్తకాల్ని పొడవాటి కర్రకు తగిలించి మోసుకు వెళ్తుండగా “మానవులచేత బుద్దిహీనమైన పనులు చేయించినందుకు అగ్ని ద్వారా ప్రాయశ్చిత్తం చేసుకొన్న గ్రంధాలివి” అంటూ ఎగతాళి చేశాడా అధ్యక్షుడు. - జర్నల్ ఆఫ్ పేరిస్, 1793, నం. 318, కోటెడ్ ఇన్ బచ్చెజ్- రాక్స్, కలెక్షన్ ఆఫ్ పార్లిమెంటరీ హిస్టరీ, సం, 30, పుటలు 200, 201.GCTel 256.3

    పోపుల మతం ప్రారంభించిన దాన్ని నాస్తిక మతం పూర్తి జేస్తున్నది. సాంఘిక, రాజకీయ, మత సంబంధిత దుష్పరిణామాలకు రోము విధానమే కారణం. అవే ఫ్రాన్స్ ను నాశనం చేస్తున్నాయి. విప్లవకాలంలో చోటు చేసుకొన్న ఘోర కృత్యాలకు ఆ దేశపురాజు సంఘనేతలే బాధ్యులని రచయితలు అంటున్నారు. ఆ బాధ్యత పూర్తిగా సంఘానిదే అనటం న్యాయం. దిద్దుబాటు రాజు అధికారానికి శత్రువని, ఏ కొంచెం అసమ్మతి ఉన్నా అది శాంతి సామరస్యాలకు భంగకరమని పోపులు రాజులకు నూరిపోసి వారిలో ద్వేషాగ్ని రగిలించారు. ఈ విధంగా నేరుగా సింహాసనం నుంచే క్రూరమైన, బాధాకరమైన హింసను ప్రేరేపించటంలో రోము తన ప్రతిభను కనపర్చింది.GCTel 256.4

    వారి భయాందోళనలపై ఆజ్యం పోయటంలో రోము ఏమాత్రం జాప్యం చేయలేదు. 1525 లో ఫ్రాన్స్ సంరక్షకుడితో పోపు ఇలా అన్నాడు, “ఈ ఉన్మాదం (ప్రొటస్టాంట్) మతాన్ని గజిబిజి చేసి నాశనం చేయటమేగాకుండా, సకల రాష్ట్రాలను, ధనికవర్గాన్ని, చట్టాన్ని, క్రమాన్ని, హోదాని కూడా నాశనం చేస్తుంది.” బి డి, ఫెలీస్, హిస్టరీ ఆఫ్ ప్రొటస్టాంట్స్ ఆఫ్ ఫ్రాన్స్, పుస్త 1, అధ్యా 2, పేరా 8. కొన్నేళ్ల తర్వాత పోపు ప్రతినిధి రాజును ఇలా హెచ్చరించాడు, “అయ్యా మోసపోకండి. ప్రొటస్టాంటులు పౌరసమాజ క్రమాన్ని, మతపరమైన క్రమాన్ని నాశనం చేస్తారు. సింహాసనం బలిపీఠం రెండూ ప్రమాదంలో ఉన్నాయి. నూతన మత ప్రవేశం తప్పనిసరిగా నూతన ప్రభుత్వానికి నాంది పలుకుతుంది.”- డి అబినే, హిస్టరీ ఆఫ్ ది రిఫర్మేషన్ ఇన్ యూరఫ్ ఇన్ ది టైమ్ ఆఫ్ కెల్విన్, పుస్త 2, అధ్యా 36. ప్రొటస్టాంట్ సిద్ధాంతం మనుషుల్ని కొత్త వింతలకు బుద్దిహీనతకు ఆకర్షిస్తుందని, ప్రజలకు రాజుపట్ల గౌరవాభిమానాలు లేకుండా చేసి ఇటు సంఘాన్ని అటు రాజ్యాన్ని అతలాకుతలం చేస్తుందని హెచ్చరిస్తూ వేదాంత పండితులు రాజు ద్వేషాన్ని రెచ్చగొట్టారు. ఈ రీతిగా రోము ఫ్రాన్స్న సంస్కరణకు శత్రువుగా రూపుదిద్దటంలో విజయం సాధించింది. సింహాసనాన్ని కాపాడుకొనేందుకూ, సామంతుల్ని, ధనికుల్ని సంరక్షించు కొనేందుకూ చట్టాన్ని పరిరక్షించుకొనేందుకూ ఫ్రాన్స్ హింసా ఖడ్గాన్ని దూసింది” - విలీ, పుస్త 13, అధ్యా 4.GCTel 257.1

    తాము ఎంచుకొన్న ఆ విధానం పర్యవసానాల్ని ఆ దేశ పరిపాలకులు ఊహించి ఉండలేదు. జాతి అభ్యుదయానికి మూలరాయివంటి సూత్రాలు న్యాయం, మితానుభవం, సత్యం, సమానత్వం, దాతృత్వం. వీటిని బైబిలు బోధనే ప్రజల మనసులలో పాదుకొలిపి ఉండేది. “నీతి జనులు ఘనత కెక్కుటకు కారణము” అటు సింహాసనము స్థిరపరచబడును” సామెతలు 14:34;16:12. “నీతి సమాధానము కలుగజేయును” దాని వలన “నిత్యమును నిమ్మళము నిబ్బరము కలుగును” యెషయా 32:17 దైవ విధులను అనుసరించి జీవించే వ్యక్తి తన దేశ చట్టాలను గౌరవించి వాటి కనుగుణంగా జీవిస్తాడు. దేవుడంటే భయభక్తులు కలవాడు రాజును గౌరవించి న్యాయమైన చట్టబద్ధమైన అతని అధికారానికి లోబడి ఉంటాడు. కాకపోతే ఫ్రాన్స్ బైబిలును బైబిలు సూత్రాలను నిషేధించింది. ప్రతీ శతాబ్దంలోను నియమ నిబంధనలున్న వ్యక్తులు, ప్రతిభ పాటవాలు, నీతి నిజాయితీలు ఉన్న వ్యక్తులు, తమ నమ్మకాల్ని ధైర్యంగా వెలిబుచ్చ గలిగిన వ్యక్తులు, సత్యం కోసం శ్రమలనుభవించగల బలమైన విశ్వాసం గలిగిన వ్యక్తులు సజీవదహనాలకు గురి అయ్యారు. చీకటి బిలాల్లో మగ్గారు. శతాబ్దాలుగా ఓడలలో బానిసలుగా వెట్టిచాకిరి చేశారు. వేవేల ప్రజలు దేశం వదలి సురక్షిత పరదేశాలకు వలసపోయారు. దిద్దుబాటు మొదలైన అనంతరం 250 సంవత్సరాల పాటు విశ్వాసుల పలాయనం కొనసాగింది.GCTel 257.2

    ఆ దీర్ఘకాలంలో హింసకుడి దురాగ్రహం నుంచి తప్పించుకొని అనేకమంది సువార్త విశ్వాసులు పారిపోతూ తమకు ప్రావీణ్యమున్న వృత్తులలో తమ తెలివితేటల్ని, కళల్ని, పరిశ్రమను, క్రమాన్ని, తమకు ఆశ్రయమిచ్చిన దేశాలకు తీసుకుపోటం జరిగింది. ఫ్రెంచ్ వారిలో ప్రతీ తరంలోనూ ఈ ఘటనను చూడని వారుండరు. ఈ సామర్థ్యాలతో తాము వెళ్లిన దేశాలకు వారు చేకూర్చిన లాభం మేరకు తమ మాతృదేశానికి నష్టం కలిగింది. ఇప్పుడు పోగొట్టుకొన్నదంతా ఫ్రాన్స్ లోనే నిలుపుకోగలిగివుంటే, ఈ మూడు వందల సంవత్సరాలు వెలివేతకు గురి అయినవారి పారిశ్రామిక నైపుణ్యం ఆ దేశ వ్యవసాయ కృషికి చేయూతనిచ్చి ఉంటే, ఈ మూడు వందల సంవత్సరాలు బహిష్కృతుల కళానైపుణ్యం ఆ దేశ పారిశ్రామికోత్పత్తుల్ని మెరుగుపర్చటానికి తోడ్పడి ఉంటే, ఈ మూడువందల సంవత్సరాల్లోనూ వారి సృజనాత్మక శక్తి, విశ్లేషణా శక్తి ఆ దేశ సాహిత్యాన్ని సుసంపన్నం చేసి ఆదేశ శాస్త్ర సాంకేతికాభివృద్ధికి సాయపడి ఉంటే, వారి వివేకం ఆ దేశ సుఖాలకు మార్గదర్శకత్వం, వారి సాహసపటిమ యుద్ధాలు చేయటానికి, వారి నిష్పాక్షికత ఆ దేశ చట్టాల రూపకల్పనకు, వారి బైబిలు మతం ప్రజల మేధను బలోపేతం చేయటానికి, వారి మనస్సాక్షిని పాలించటానికి ఉపయోగించి ఉంటే, ఈ రోజు ఫ్రాన్స్ ప్రాభవం ఎంత ఉన్నతంగా ఉండి ఉండేది! ఫ్రాన్స్ ఎంతో సంపన్నమైన, ఆనందదాయకమైన ఆదర్శ ప్రాయమైన దేశంగా ఉండేది!GCTel 258.1

    “బోధకుల్ని క్రమజీవన పరిరక్షకుల్ని, సింహాసనానికి మద్దతు పలికే విశ్వాస పాత్రుల్ని, ఎందరినో మత దురభిమానం ఫ్రాన్స్ గడ్డ నుంచి తరిమివేసింది. తమ దేశాన్ని లోకంలో పేరెన్నికగన్న దేశంగా చేయగలిగి ఉండే వ్యక్తులతో మీకు సజీవ దహనం కావాలో దేశ బహిష్కరణ కావాలో మీరే ఎంపిక చేసుకోండి అన్నది ఆ మత దురభిమానం. చివరికి ఆ దేశానికి నాశనం మూడింది. బహిష్కరించటానికి మనస్సాక్షి ఇక మిగలలేదు. మంటల్లోకి ఈడ్చి కాల్చటానికి ఇక మతం మిగల్లేదు. బహిష్కరించటానికి ఇక దేశభక్తి మిగల్లేదు.” విలీ,పుస్త 13, అధ్యా 20. భయంకర ఘోరాలకు దౌర్జన్యాలకు కారణమైన విప్లవమే దాని పర్యవసానం.GCTel 258.2

    “హ్యూజీనాట్లు దేశం విడిచి పారిపోటంతో ఫ్రాన్స్ క్షీణదశకు చేరింది. ఉత్పత్తులకు ప్రసిద్ధిగాంచిన నగరాలు మరుగున పడిపోయాయి. గొప్ప ప్రగతి సాధించిన సంవత్సరాల వెనువెంటనే వైజానిక జడత్వం, నైతిక క్షీణత చోటుచేసుకొన్నాయి. పేరిస్ ఒక విశాల ముష్టి గృహంగా తయారయ్యింది. విప్లవం జరిగిన సమయంలో రెండు లక్షలమంది ముష్టి వాళ్లు రాజు దాతృత్వం మీద ఆధారపడి ఉన్నారు. క్షీణించి పోతున్న రాజ్యంలో జెసుఅయిట్లు మాత్రమే వృద్ధి చెందుతూ సంఘాలను, పాఠశాలలను, ఖైదులను వ్యాపార ఓడలను నిరంకుశంగా పరిపాలించారు. బోధక వర్గాన్ని, రాజును, శాసన మండలి సభ్యుల్ని, తికమక పెట్టి చివరికి దేశాన్ని అరాజకత్వంలోకి నెట్టి నాశనం చేసిన రాజకీయ సాంఘిక సమస్యలకు సువార్త ఫ్రాన్సు పరిష్కారాన్ని సమకూర్చేదే. కాని రోము అధికారం కింద ప్రభువు ప్రబోధించిన త్యాగశీలతను స్వార్ధరహిత ప్రేమను ఆచరించలేక పోయారు. ఇతరుల క్షేమంకోసం ఆత్మత్యాగ స్ఫూర్తికి దూరంగా ఉండి పోయారు. ధనవంతులు పేదలను హింసించినా గదించేవారు లేకపోయారు. గౌరవ హీనమైన సేవలు అందించే పేదలకు సహాయం లభించలేదు. ధనికులు, సమాజంలో పలుకుబడి ఉన్నవారు పేట్రేగిపోయి ప్రజలను హింసించనారంభించారు. శతాబ్దాలుగా ప్రబలుతున్న ధనిక వర్గపు దురాశ, నీతి బాహ్యతి పేద ప్రజలను వంచించి దోచుకోటానికి దారి తీశాయి. ధనిక వర్గం పేదలకు అన్యాయం చేసింది. పేదలు ధనికుల్ని ద్వేషించారు. GCTel 258.3

    అనేక రాష్ట్రాల్లో ఆస్థానాలు జమిందారుల కింద ఉండేవి. ఆస్థానాల్లో పని చేసే వారు పాలేళ్లు మాత్రమే. వాళ్లు యజమానుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి బతికేవారు. అధికారులకు అణిగిమణిగి ఉంటూ వారి అపరిమిత డిమాండుకు లొంగాల్సి వచ్చేది. సంఘాన్ని, రాష్ట్రాన్ని పోషించే కార్యభారం మధ్య తరగతి ప్రజలమీద బడుగు వర్గాలవారి మీద పడింది. ‘’జమిందారుల చిత్తమే ఉన్నత నిబంధన. తమను బాధించే అధికారులు అనుకొంటే రైతాంగం, శ్రామిక ప్రజలు ఆహారం లేకుండా మాడవచ్చు... ప్రతీ స్థాయిలోను ప్రజలు తమతమ జమిందారుల ప్రత్యేకాసక్తుల్ని పరిగణనలోకి తీసుకుతీరాలి. వ్యవసాయ కూలీలు తీరిక లేకుండ శ్రమించి దుర్భర శ్రమలనుభవించారు. వారికేవైనా ఫిర్యాదులుంటే వాటిని లెక్కచేయకుండా అధికారులు తలబిరుసుగా అవమానకరంగా మాట్లాడేవారు. ధనికుడు శ్రామికుడు న్యాయస్థానానికి వెళ్తే న్యాయాధిపతులు ఎప్పుడూ ధనికుడినే సమర్ధించేవారు. న్యాయాధిపతులు లంచాలు తీసుకునేవారు. దేశవ్యాప్తంగా ఆచరణలో ఉన్న అవినీతి విధానం వల్ల సంపన్నుల చాపల్యాలకు కూడా చట్టబద్ధత ఉండేది. ప్రభుత్వాధి కారులు సంఘ కార్యకర్తలు సామాన్య ప్రజానీకం నుంచి వసూలు చేసిన పన్నులో సగభాగం కూడా ప్రభుత్వ ఖజానాకు, సంఘ ఖజానాకు చేరేది కాదు. మిగిలిందంతా దుర్యసనాలకు స్వార్ధవిలాసాలకు ఖర్చు పెట్టుకొనేవారు. తోటి పౌరులను ఇలా పేదరికంలోకి నెట్టిన పెద్దమనుషులు పన్నులు చెల్లించాల్సిన అవసరం లేకపోయింది. పైగా వారికి ప్రభుత్వ ఉద్యోగాలు సంక్రమించటానికి చట్టం సాంప్రదాయం తోడ్పడ్డాయి. ప్రత్యేక హక్కుల తరగతికి చెందిన ప్రజలు ఒక లక్ష ఏభై వేలమంది ఉన్నారు. వారు విలాసంగా జీవించేందుకు లక్షలాది ప్రజలు నిరుపేదలుగా బతుకులు వెళ్లదీశారు.GCTel 259.1

    రాజు ఆస్తానంలోని ప్రజలు వినోదాలు విలాసాలలో తేలియాడారు. ప్రజలకు పరిపాలకుల మధ్య సామరస్యం లోపించింది. ప్రభుత్వ చర్యల పట్ల ప్రజలకు అనుమానాలు కలిగాయి. పాలకుల స్వార్థ ప్రయోజనాలకు ప్రతీకలుగా వాటిని పరిగణించారు. విప్లవానికి పూర్వం ఏభై సంవత్సరాలుగా లూయీస్ XV సింహాసనాన్ని అధిష్టించాడు. మంచి అన్నది కానరాని ఆ దినాల్లో సైతం లూయిస్ సోమరితనానికి, చాపల్యానికి, వ్యసనాలకు పేరు గడించాడు. క్రూరమైన సంపన్న వర్గంతో, పేదరికంతోను అజ్ఞానంతోను సతమతమౌతున్న జనసామాన్యంతో, ఆర్థికంగా చిక్కుల్లోవున్న ప్రభుత్వంతో విసిగి వేసారిపోతున్న ప్రజలతో ముంచుకొస్తున్న ఉపద్రవాన్ని చూడటానికి ప్రవక్త దూరదృష్టి అక్కరలేదు. సలహాదారుల హెచ్చరికలకు రాజు ఇలా సమాధానం చెప్పేవాడు, ‘’నేను బతికి ఉన్నంతకాలం పరిస్థితి ఇలాగే కొనసాగేటట్లు చూడండి. నా అనంతరం పరిస్థితి ఎలాగుంటే అలా ఉండనీయండి. ” పరిస్థితిని చక్కపర్చటానికి చేసిన ప్రయత్నాలు వ్యక్తమయ్యాయి. రాజు తన చుట్టూ ఉన్న అక్రమాలను దుర్మార్గతను చూశాడు. వాటిని ప్రతిఘటించటానికి అతడికి ధైర్యమూలేదు, శక్తి లేదు. ఫ్రాన్స్పి విరుచుకు పడబోతున్న విధ్వంసాన్ని రాజు పలికిన ఈ మాటల్ని బట్టి - (నా అనంతరం జలప్రళయం” ఊహించుకోవచ్చు.GCTel 260.1

    రాజులకు పాలక వర్గాలకు అనుమానం పుట్టించి తద్వారా ప్రజలను బానిసలుగా ఉంచేందుకు వారిని ప్రభావితం చేయటానికి రోము ప్రయత్నించింది. అలా జరిగినప్పుడు దేశం బలహీనపడుందని బలహీనతను సొమ్ము చేసుకొని వారిపై తమ పట్టు బిగించాలని రోము ఉద్దేశించింది. మనుషుల్ని వశపర్చుకోవాలంటే వారి ఆత్మలకు సంకెళ్లు వేయాలని తమ చెరలోనుంచి తప్పించుకోకుండా ఉంచే ఏకైక మార్గం వారికి స్వేచ్చలేకుండా చేయటమేనని దూరదృష్టితో కూడిన తమ విధానం వారికి నేర్పించింది. రోము అనుసరించిన విధాన ఫలితంగా కలిగిన శారీరక శ్రమలకన్న వందరెట్లు భయంకరమైన పరిణామం నైతిక పతనం. బైబిలును ప్రజలకు అందుబాటులో లేకుండా చేశారు. దురభిమానంతో స్వార్ధంతో కూడిన బోధనలను ప్రజల నెత్తిన రుద్దారు. అజ్ఞానం, మూఢనమ్మకాలు ప్రబలమయ్యాయి. ప్రజలు దుష్క్రియలు దుర్వర్తనలో మునిగిపోయి స్వపరిపాలనకు పూర్తిగా అనర్హులయ్యారు.GCTel 260.2

    కాగా ఇదంతా రోము ఉద్దేశించిన దానికన్నా భిన్నంగా జరుగుతున్నది. ప్రజలను తన సిద్ధాంతాలకు నిబద్దులుగా ఉంచే బదులు రోము చేసిన ప్రయత్నాలు ప్రజల్ని నాస్తికులుగాను, విప్లవకారులుగాను మార్చాయి.GCTel 261.1

    రోమను మతవాదాన్ని ప్రజలు ద్వేషించారు. తమ శ్రమలకు బాధ్యులైన వారిలో బోధకులు కూడా ఉన్నారని ప్రజలు నమ్మారు. వారెరిగిన ఒకే ఒక దేవుడు రోము. రోము ప్రబోధించిందే వారి మతం. దురాశ, క్రూరత్వం బైబిలు బోధన ఫలమని వారి అవగాహన. అది తమకు అవసరం లేదని నిర్ధారించుకొన్నారు.GCTel 261.2

    రోము దేవుని ప్రవర్తన విషయం తప్పుడు ప్రచారం చేసి ఆయన విధులను వక్రీకరించింది. పర్యవసానంగా ప్రజలు ఇప్పుడు బైబిలును దాని కర్త అయిన దేవునినీ విసర్జించారు. రోము తన సిద్ధాంతాన్ని ప్రజలు గుడ్డిగా నమ్మాలని కోరింది. తన సిద్ధాంతాలకు లేఖనాల మద్దతు ఉన్నట్లు నాటకమాడింది. అందుకు ప్రతి స్పందనగా వాల్టేర్ అతని అనుచరులు దైవ వాక్యాన్ని పూర్తిగా తోసిపుచ్చి ప్రతి చోటా నాస్తిక విషాన్ని వెదజల్లారు. రోము ఉక్కు పాదంతో ప్రజలను అణగదొక్కింది. నీచ ప్రవర్తనకు క్రూరత్వానికి గురి అయిన ప్రజలిప్పుడు ఆంక్షల్నీ నిషేధాన్ని పక్కన పెట్టి నిరంకుశత్వానికి ఎదురుతిరిగారు. అంతవరకు తాము అమితంగా గౌరవిస్తున్న తళుకు బెళుకుల వంచకుడిపై ఆగ్రహించి సత్యాన్ని అసత్యాన్ని కలిపి ప్రజలు విసర్జించారు. అడ్డూ ఆపూలేని వర్తనమే స్వేచ్ఛ అని అపార్థం చేసుకొన్న దుర్వర్తనులు ఉత్సహించారు. GCTel 261.3

    విప్లవం ఆరంభంలో రాజు ప్రజలకు ఒక రాయితీ ఇచ్చాడు. అది సంపన్న వర్గానికి, బోధక వర్గానికీ కలిపి ఉన్న ప్రాతినిధ్యం కన్న ప్రజలకు ఎక్కువ ప్రాతినిధ్యాన్ని ఏర్పాటు చేయటం. ఇలా ప్రాబల్యం సమతౌల్యం ప్రజల చేతుల్లో పడింది. అయితే వారు దాన్ని విజ్ఞత సంయమనాలతో ఉపయోగించేందుకు సిద్ధంగా లేరు. తమకు జరిగిన అన్యాయాలను చక్కదిద్దాలన్న తాపత్రయంతో సమాజ పునర్నిర్మాణాన్ని చేపట్టాలని నిశ్చయించుకొన్నారు. ప్రజలు కోపోద్రేకాలతో కదంతొక్కుతున్నారు. బాధాకరమైన, చాలాకాలంగా మనసును తొలిచి వేస్తున్న అన్యాయాల జ్ఞాపకాలు వారి మనసుల్ని నింపాయి. ఇక సహించలేని స్థితికి చేరిన శ్రమలపై విప్లవం తేవాలని తమ శ్రమలకు కారకులైన వారి మీద కక్ష సాధించాలని వారు కృతనిశ్చయంతో ఉన్నారు. నిరంకుశత్వం కింద తాము పొందిన శ్రమల్ని దృష్టిలో ఉంచుకొని తమను హింసించిన వారి పట్ల హింసకులయ్యారు.GCTel 261.4

    తాను విత్తిన పంటనే ఫ్రాన్స్ రక్తం చిందించి కోసింది. తాను రోము నియంత్రణకు లొంగినందువల్ల భయంకర పర్యవసానాలకు గురి అయ్యింది. రోము మత ప్రభావం కింద ప్రాన్స్ మొదటగా ఎక్కడ దహన స్తంభాన్ని నెలకొల్పిందో అక్కడే విప్లవకారులు మొట్టమొదటి (శిరచ్ఛేదన యంత్రం) గిలోటిన్ ని ఏర్పాటు చేశారు. పదహోరో శతాబ్దంలో మొట్టమొదటి ప్రొటస్టాంటు విశ్వాస హతసాక్షులు ఏ స్థలంలో సజీవ దహనానికి గురి అయ్యారో అదే స్థలంలో పద్దెనిదో శతాబ్దంలో మొట్టమొదటి బాధితులు గిలోటిన్ పై శిరచ్ఛేదనానికి గురి అయ్యారు. సువార్త ఫ్రాన్స్ కి స్వస్థతను చేకూర్చి ఉండేది. కాని సువార్తను విసర్జించటం ద్వారా ఫ్రాన్స్ అవిశ్వాసానికి వినాశానికి తలుపు తెరిచింది. దైవ ధర్మశాస్త్ర నిర్భంధాలను తోసిపుచ్చినప్పుడు శక్తిమంతమైన మానవావేశం వెల్లువను నిలువరించటానికి మానవ నిబంధనలు శక్తిహీనాలని వ్యక్తమయ్యింది. తిరుగుబాటు, అరాచకత్వం సంభవించే వరకు దేశం ముందుకు సాగుతూనే ఉన్నది. బైబిలుకి వ్యతిరేకంగా సాగిన పోరాటం ప్రపంచ చరిత్రలో భయంకర పరిపాలనా శకాన్ని ప్రారంభించింది. ప్రజల హృదయాల్లో నుంచి గృహాల్లో నుంచి శాంతి, ఆనందాలు బహిష్కృతమయ్యాయి. భద్రత కరవయ్యింది. నేడు విజయం సాధించిన వ్యక్తి రేపు అనుమానానికి శిక్షకు గురి అయ్యాడు. దౌర్జన్యం శరీరేచ్ఛలు పెచ్చరిల్లాయి.GCTel 262.1

    సమరోత్సాహంతో శివమెత్తిన ప్రజల దౌర్జన్యకాండకు రాజు, మతసేతలు, సంపన్నులు తలొగ్గవలసి వచ్చింది. వారి ప్రతీకార తృష్ణను పెంపు జేసింది. అతడి మరణాన్ని శాసించిన వారు అతడి వెంట వధ్యా స్థలానికి వెళ్లారు. విప్లవాన్ని అణచివేయటానికి ప్రయత్నించారన్న అనుమానం ఉన్న వారందరినీ ఊచకోతకోయాలని ఒక సామాన్య తీర్మానాన్ని తీసుకున్నారు. ఒక సమయంలో రెండు లక్షలకు పైగా బందీలను పట్టుకొని ఖైదులు నింపారు. దేశంలోని నగరాల్లో భయంకర సన్ని వేశాలు చోటుచేసుకున్నాయి. విప్లవకారుల్లో వర్గాలు ఏర్పడి పరస్పరం తలపడటంతో ఆవేశకావేషాలతో నిండి ఉగ్ర రూపం ధరించిన తండాలతో నిండిన విశాల ప్రాంగణంగా కన్పించింది ఫ్రాన్స్, “పేరిలో ఒకదాని వెంట ఒకటిగా గందరగోళాలు చోటుచేసు కొన్నాయి. ప్రజలు వర్గాలుగా విడిపోయారు. అవి ఒకరినొకరు చంపుకోటానికే ఎర్పడ్డట్లు కనిపించింది.” పులిమీద పుట్రలా ఐరోపాలో శక్తిమంతములైన దేశాలతో ఫ్రాన్స్ సుదీర్ఘమైన యుద్ధంలో ఇరుక్కు పోయింది. “దేశం దాదాపు దివాలా తీసింది. ప్రభుత్వం చెల్లించాల్సిన జీతాల బకాయిల కోసం సైన్యం ఆందోళనచేస్తున్నది. పేరిస్ ప్రజలు భోజనంలేక మల మల మాడుతున్నారు. దొంగల ముఠాలు రాష్ట్రాలను కొల్లగొడుతున్నాయి. అరాచకత్వం విచ్చలవిడి జీవనం నాగరికతను దాదాపు నాశనం చేశాయి.GCTel 262.2

    ఏమైనా క్రూరత్వం హింస గురించి రోము శ్రద్ధగా నేర్పిన పాఠాలు ప్రజలు చక్కగా నేర్చుకొన్నారు. కక్ష తీర్చుకొనే దినం చివరికి వచ్చింది. వారు చీకటి కొట్లలోకి తోసినవారు, దహన కొయ్యల పక్కకు ఈడ్చుకు వెళ్లిన వారు ఇప్పుడు యేసు అనుచరులు కాదు. వీరు ఎప్పుడో మరణించటం బహిష్కృతికి గురి అయి వెళ్లిపోటం జరిగింది. రక్తం చిందించటంలో తాను తర్బీతు చేసిన వారి క్రూర మారణ శక్తిని రోము ఇప్పుడు తెలుసుకొన్నది. అనేక సంవత్సరాలుగా ఫ్రాన్స్ బోధక వర్గం అనుసరించిన హింసా విధానం ఇప్పుడు తమ మీదికే తిరిగి వచ్చింది. ఉరికంబాలు ప్రీస్టుల రక్తంతో తడిసి ఎర్రబడ్డాయి. ఒకప్పుడు హూజినాట్లతో నిండిన చెరసాలలు, ఓడల్లోని బానిసల హింసకులతో ఇప్పుడు కిటకిటలాడున్నాయి. గొలుసులతో బల్లలకు బంధించి ఉంచినప్పుడు, తెడ్లు వేస్తూ ఓడలపై శ్రమించినప్పుడు రోమన్ కథోలిక్ బోధక వర్గం సిద్ధాంత వ్యతిరేకులకు తాము విధించిన శ్రమలను చవిచూశారు.GCTel 263.1

    “అంతట మిక్కిలి క్రూరమైన ట్రిబ్యూనల్ అతి క్రూరమైన నియమావళిని అమలు పర్చిన దినాలు వచ్చాయి. ఎవరూ తమ పొరుగువారిని పలకరించకూడదు. ప్రార్ధించకూడదు... అలా చేయటం మరణశిక్షను కోరి తెచ్చుకోటమే. ప్రతీ మూల గూడచారులు పొంచివుండేవారు. ఆ దినాల్లో గిలోటిన్ ప్రతీ ఉదయం చాలాసేపు పనిలో ఉండేది. చెరసాలలు బందీలతో క్రిక్కిరిసిపోయాయి. మురికి కాల్వలు రక్తంతో నిండి సైన్ నదిలో కలిశాయి... ప్రతి దినం వేగన్ల కొద్దీ చేరవేస్తున్న బాధితుల్ని పేరిస్ నగర వీధులగుండా వధా స్థలానికి తీసుకు వెళ్లగా శాఖలకు చక్రవర్తి కమిటీ పంపిన ప్రోకాస్యూలు రాజధాని నగరంలో కూడా లేని విలాసాల్లో మునిగితేలారు. గిలోటిన్ యంత్రంలోని కత్తి నెమ్మదిగా దాని పని అది చేసుకుపోతుంది. బారులు తీరివున్న బందీలు కత్తివేటుకు గురి అయి కూలారు. జనంతో నిండిన నావ అడుగున రంద్రాలు చేశారు. లయన్స్ నగరం ఎడారిగా మారింది. అర్రాస్ నగరంలో ఖైదీలకు త్వరిత మరణ భాగ్యం కూడా దక్కలేదు. లాయర్ నుంచి సామర్ సముద్రం దాకా ఒకదాన్నొకటి కౌగిలించుకొని పడి ఉన్న కళేబరాలపై పడి కాకులు, గద్దలు విందారగిస్తున్నాయి. అవి వయస్సును బట్టిగాని, లింగాన్ని బట్టిగాని దయ చూపించలేదు. హేయమైన ఆ ప్రభుత్వం హత్యచేసిన పదిహేడేళ్ల యువతీ యువకుల సంఖ్య వందల్లోనే లెక్క పెట్టాలి. పసికందులను తల్లి రొమ్ము నుంచి లాగి జకోబియన్ దుండగులు పట్టుకొని నిల్చిన బల్లెపు మొనలమీదికి విసిరేవారు. “పదేళ్ల స్వల్ప వ్యవధిలోనే వేవేల ప్రజలు మరణించారు.GCTel 263.2

    ఇది సాతానుకు అనుకూలమైన పరిణామం. దీనికోసమే యుగయుగాలుగా సాతాను కృషి చేశాడు. మోసమే ఆది నుంచి అంతం వరకు అతడి విధానం. మానవులకు దుఃఖం శ్రమలు కలిగించటం దేవుని సృష్టిని వికృతంచేసి అపవిత్ర పర్చటం, దాతృత్వం ప్రేమల పరమోద్దేశాన్ని నాశనం చేసి తద్వారా దేవునికి దుఃఖం కలిగించటమే అతడి నిత్య సంకల్పం. తన వంచక కళల ద్వారా మనుషుల మనసులకు గుడ్డితనం కలిగించి ఈ అనర్ధమంతా దైవ ప్రణాళిక పర్యవసానమే అన్నట్లు తన దుష్కార్యాలకు దేవునిపై నింద మోపటానికి వారిని నడిపిస్తాడు. అలాగే తన క్రూర శక్తివలన భ్రష్టులు దుర్మార్గులు అయిన వారు స్వతంత్రులైనప్పుడు హద్దుమీరి ప్రవర్తించటానికి అఘాయిత్యాలు చేయటానికి వారిని ప్రేరేపిస్తాడు. అడ్డూ ఆపూలేని ఈ ప్రవర్తన స్వేచ్ఛకు సాదృశ్యమని నియంతలు హింసకులు వాదిస్తారు.GCTel 264.1

    పొరపాటు ఒక రూపంలో బయలు పడినప్పుడు సాతాను దానికి ఇంకో రూపమిస్తాడు. మొదట్లోలాగే వేలాదిమంది దాన్ని, ఆతృతగా అనుసరిస్తారు. రోమను మతం మోసపూరితమని ప్రజలు కనుగొన్నప్పుడు ఈ సాధనం ద్వారా ధర్మశాస్త్ర ఉల్లంఘనకు ప్రజల్ని నడిపించటం సాధ్యపడనప్పుడు మతమే మోసాల పుట్ట అని బైబిలు ఒక కట్టుకథ అని పరిగణించటానికి వారిని నడిపిస్తాడు. దైవ విధుల్ని తోసిరాజని ప్రజలు విశృంఖల దుర్నీతికి పూనుకొంటారు.GCTel 264.2

    ఫ్రాన్స్ ప్రజలకు అంతటి దుస్థితి కలిగించిన ప్రాణాంతకమైన అపరాధం నిషేధాల్లోనే స్వేచ్చ ఉన్నదన్న మహత్తర సత్యాన్ని విస్మరించటమే. “నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన యెడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగములవలెను ఉండును” (దుష్టులకు నెమ్మది యుండదని యెహోవాGCTel 264.3

    సెలవిచ్చుచున్నాడు.” “నా ఉపదేశము నంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయములేక నెమ్మదిగా నుండును” యెషయా 48:18,22, సామెతలు 1:33.GCTel 264.4

    నాస్తికులు, అవిశ్వాసులు, మత భ్రష్టులు, ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకించి దూషిస్తారు. అయితే వారి ప్రభావ ఫలితాలు దైవ విధులకు మానవుని విధేయతతోనే అతడి సంక్షేమం ముడిపడి ఉన్నదని నిరూపిస్తున్నాయి. దైవ గ్రంధం నుంచి నేర్చుకోటానికి ఇష్టపడని వారు దానినే వివిధ దేశాల చరిత్రలో చదవ వలసిందిగా హితవు వస్తుంది.GCTel 264.5

    సాతాను రోమను సంఘం ద్వారా పని చేసి మనుషులు విధేయత చూపకుండా వారిని పెడదారి పట్టించినప్పుడు అతడి పాత్ర ఎవరికీ తెలియలేదు. అతడి కార్య కలాపాలు మరుగున సాగాయి. ఫలితంగా చోటుచేసుకొన్న భ్రష్టత కష్టాలు అతిక్రమ పర్యవసానాలుగా కనిపించలేదు. పరిశుద్ధాత్మ పని ద్వారా అతడి శక్తి నిర్వీర్యమయ్యింది. ఫలితంగా అతడి ఉద్దేశాలు సఫలం కాకుండా ఆటంకాలెదురయ్యాయి. ప్రజలు తమ కష్టాలకు హేతువేంటో కనుగోలేకపోయారు. కాగా విప్లవంతో జాతీయ సభ దైవధర్మశాస్త్రాన్ని బాహాటంగా విసర్జించింది. విప్లవం తర్వాత వచ్చిన భయంకర పరిపాలనా కాలంలో కార్యం దాని పర్యవసానం యావన్మందీ చూడగలిగారు.GCTel 265.1

    ఫ్రాన్స్ బాహాటంగా దేవుని విసర్జించి బైబిలును తోసిపుచ్చినప్పుడు దుర్మార్గులు, అంధకార అధికారులు ఎంతో కాలంగా తాము ఆశించినది పొందినందుకు అనగా దైవధర్మశాస్త్రం విధించే ఆంక్షలు లేని స్వేఛ్చా రాజ్యం సాధించినందుకు అమితంగా సంతోషించారు. దుష్క్రియలకు శిక్ష తక్షణమే అమలు కాలేదుగనుక మనుషులు (“హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు” ప్రసంగి 8:11. అయితే న్యాయమైన, నీతిమంతమైన ధర్మశాస్త్రాన్ని అతిక్రమించటం తప్పనిసరిగా దుఃఖాన్ని నాశనాన్ని కలిగించాయి. వెంటనే శిక్ష పడకపోయినా మనుషుల దుర్నీతి వారి నాశనానికి నడిపిస్తుంది. శతాబ్దాల కొద్దీ ఉన్న భ్రష్టత నేరం ఉగ్రతను శిక్షా దినం వరకు దాచి వుంచుతుంది. వారి పాపం పూర్తి అయినప్పుడు దేవుని ఓర్పును పోగొట్టటం భయంకరమైన విషయమని దేవదూషకులు ఆలస్యంగా తెలుసుకొంటారు. సాతాను శక్తిని అదుపులో ఉంచే దైవాత్మను చాలా మేర ఉపసంహరించుకోటం జరిగింది. ఎవరికి మానవ దుస్తితి ఆనందాన్నిస్తుందో ఆ సాతానుకు తన చిత్తాన్ని నెరవేర్చుకోటానికి అనుమతి లభించింది. వర్ణించలేనంత భయంకర నేరాలతో దేశం నిండేంతవరకు, తిరుగుబాటును ఎంపిక చేసుకొన్న వారు దాని ఫలితాలను అనుభవించేందుకు మిగిలి ఉన్నారు. ధ్వంసమైన రాష్ట్రాలు, నగరాల నుంచి హృదయ విదారకమైన రోధన వినిపిస్తుంది. అది వేదనతో కూడిన ఆక్రందన. భూకంపలాంటి ప్రకంపనలు ఫ్రాన్ను కుదిపేశాయి. దైవ ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా లేచిన అపవిత్ర హస్తం మతాన్ని, చట్టాన్ని, సాంఘిక వ్యవస్థను, కుటుంబాన్ని, దేశాన్ని, సంఘాన్ని.. సమస్తాన్ని నాశనం చేసింది. ఇలా గంటున్న జ్ఞాని నిజం పలికాడు, “భక్తిహీనుడు తన భక్తిహీనతచేతనే పడిపోవును” “పాపాత్ములు నూరుమారులు దుష్కార్యములుచేసి దీర్ఘాయుష్మంతులైనను దేవునియందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా నుందురనియు, శక్తినిహీనులు దేవుని సన్నిధిని భయపడరుగనుక వారికి క్షేమము కలుగదని వారు నీడవంటి దీర్ఘాయువును పొందకపోదురనియు నేనెరుగుదును” సామెతలు 11:5,ప్రసంగి 8:12, 13. ” జ్ఞానము వారికి అసహ్యమాయెను. యెహోవాయందు భయభక్తులు కలిగి యుండుట, వారికిష్టములేకపోయెను” (“కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము ననుభవించెదరు” సామెతలు 1:29,31.GCTel 265.2

    ““అగాధము నుండి వచ్చు” దేవదూషణ చేసే శక్తిని హతమార్చిన నమ్మకమైన విశ్వాసులు ఎక్కువ కాలం మౌనంగా ఉండాల్సిన పనిలేదు. “అయితే ఆ మూడు దినములన్నరయైన పిమ్మట దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించెను. గనుక వారు పాదములు ఊని నిలిచిరి. వారిని చూచిన వారికి మిగుల భయము కలిగెను” ప్రకటన 11:11. క్రైస్తవ మతాన్ని రద్దుచేస్తూ బైబిలును తోసిపుచ్చుతూ ఫ్రెంచ్ శాసన సభ 1793 లో డిగ్రీలు జారీచేసింది. మూడున్నర సంవత్సరాల అనంతరం అదే సభ ఈ డిక్రీలను రద్దుచేస్తూ లేఖనాల విషయంలో సహనం ప్రకటిస్తూ ఒక తీర్మానం చేసింది. పరిశుద్ధలేఖనాల్ని విసర్జించి మూటగట్టుకొన్న ఘోర పాపాల్ని చూసి ప్రపంచం తెల్లబోయింది. సద్గుణాలకు నీతి జీవితానికి పునాదిగా దైవ వాక్యాన్ని విశ్వసించటం అవసరమని మనుషులు గుర్తించారు. ప్రభువిలా అంటున్నాడు, “నీవు ఎవరిని తిరస్కరించితివి? ఎవరిని దూషించితివి? నీవు గర్వించి యెవరిని భయపెట్టితివి? ఇశ్రాయేలీయుల పరిశుద్ధ దేవునినేగదా?” యెషయా 37:23. (“కాబట్టి నా నామము యెహోవా అని వారు తెలిసికొనునట్లు నేను ఈ సారి వారికి అనుభవము కలుగజేతును. నా బలమును నా శౌర్యమును ఎంతటివో వారికి తెలియజేతును” యిర్మీయా 16:21.GCTel 266.1

    ఇద్దరు సాక్షులను గూర్చి ప్రవక్త ఇంకా ఇలాగంటున్నాడు, “అప్పుడు- ఇక్కడికి రండని పరలోకమునుండి గొప్ప స్వరము తమతో చెప్పుట వారు విని, మేఘారూఢులై పరలోకమునకు ఆరోహణమైరి. వారు పోవుచుండగా వారి శత్రువులు వారిని చూచిరి” ప్రకటన 11:12. దేవుని ఇద్దరు సాక్షులపై ఫ్రాన్స్ యుద్ధం సాగించింది. గనుక వారికి అమితమైన గౌరవం వచ్చింది. 1804లో బ్రిటిష్ అండ్ ఫారిస్ బైబిలు సొసైటీ ఏర్పడింది. ఆ తర్వాత ఇలాంటి సంస్థలు వాటికి ఉప సంస్తలు ఐరోపా ఖండంలో ఎన్నో ఏర్పడ్డాయి. 1816 లో ది అమెరికన్ బైబిల్ సొసైటీ స్థాపితమయ్యింది. బ్రిటిష్ సొసైటీ ఏర్పడ్డప్పుడు బైబిలు ఏభై భాషలలోకి అనువాదమయ్యింది. అప్పటి నుంచి అది వందలాది భాషలు, ఉపభాషల్లోకి అనువాదమయ్యింది.GCTel 266.2

    1792 కి ఏభై సంవత్సరాల పూర్వం విదేశ సువార్త సేవను గురించి ఎక్కువమంది ఆలోచించలేదు. కొత్త సమాఖ్యలు ఏర్పడలేదు. కొన్ని సంఘాలు మాత్రమే అన్యదేశాల్లో క్రైస్తవమత ప్రబోధానికి పూనుకొన్నాయి. పద్దెనిమిదో శతాబ్ది చివరి భాగంలో గొప్ప మార్పు చోటుచేసుకొంది. మనుషులు హేతువాద ఫలితాలతో అసంతృప్తి చెంది దైవ ప్రత్యక్షత, ప్రయోగాత్మకమతం అవసరమని గుర్తించారు. ఈ సమయం నుంచి విదేశ సువార్తసేవ వృద్ధి చెందింది.GCTel 267.1

    ముద్రణ రంగంలో చోటు చేసుకొన్న అభివృద్ధి బైబిలు ప్రాచుర్యానికి ఎంతగానో తోడ్పడింది. వివిధ దేశాల మధ్య ప్రచార సాధనాల సౌకర్యం, పక్షపాత ధోరణి, జాతీయతా వాదం వంటి అడ్డుగోడలు కూలటం, రోము మతాధినేత లౌకికాధికారాన్ని కోల్పోవటం, దైవ వాక్య ప్రాబల్యానికి మార్గం సుగమం చేశాయి. రోము నగరవీధుల్లో అడ్డూ ఆపు లేకుండా బైబిలు విక్రయాలు కొన్ని సంవత్సరాలుగా సాగాయి. ఇప్పుడు ప్రపంచంలో మనుషులు నివసిస్తున్న ప్రతీచోట బైబిలును అమ్మటం జరుగుతుంది.GCTel 267.2

    నాస్తికుడు వాల్టేర్ ఒకప్పుడు ఇలా అన్నాడు, “పన్నెండుమంది క్రైస్తవ మతాన్ని స్థాపించారని మనుషులు చెప్పగా వినటం బహు ఆయాసకరంగా ఉంది నాకు. దాన్ని కూలదోయటానికి ఒక్క వ్యక్తి సరిపోతాడని నిరూపించగలను” అతడి మరణం అనంతరం ఎన్నో తరాలు గతించాయి. బైబిలుపై యుద్ధంలో లక్షలాదిమంది పాల్గొన్నారు. అయినా బైబిలు నాశనం కాలేదు. వాల్ యేర్ కాలంలో వందల్లో ఉండగా నేడు బైబిలు ప్రతులు వేలు, లక్షల సంఖ్యలో ఉన్నాయి. క్రైస్తవ సంఘం గురించి ఒక ఆరంభ దినాల సంస్కర్త అన్న మాటలివి. “బైబిలు ఒక దాగలి, దానిమీద అనేక స్తుతులు అరిగి పోయాయి” ప్రభువంటున్నది వినండి. “నీకు విరోధముగా రూపింపబడిన యే ఆయుధమును వర్దిల్లదు. న్యాయవిమర్శలో నీకు దోషారోపణచేయు ప్రతివానికి నీవు నేరస్థాపన చేసెదవు” యెషయా 54:7.GCTel 267.3

    “మనదేవుని వాక్యము నిలుచును” “అయన శాసనములన్నియు నమ్మకమైనవి. అవి శాశ్వతముగా స్థాపించబడివి. సత్యముతోను యధార్ధముతోను అవి చేయబడి యున్నవి.”యెషయా 40:8, కీర్తనలు 111:7, 8. మానవాధికారంపై నిర్మితమైనదేదైనా కూలిపోతుంది. కాని మార్పులేని దేవుని వాక్యమనే బండమీద స్థాపితమైనదేదైనా నిత్యం నిలుస్తుంది.GCTel 267.4