Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
మహా సంఘర్షణ - Contents
 • Results
 • Related
 • Featured
No results found for: "".
 • Weighted Relevancy
 • Content Sequence
 • Relevancy
 • Earliest First
 • Latest First

  అధ్యాయం 19—చీకటిలో వెలుగు

  దే వుని సేవ సందర్భంగా లోకంలో ప్రతీ యుగంలో ప్రతిగొప్ప దిద్దుబాటులో లేదా మత ఉద్యమంలో సారూప్యత కనిపిస్తుంది. మానవులతో దేవుడు వ్యవహరించటంలోని సూత్రాలు మార్పులేనివి. ప్రస్తుత కాలంలోని ముఖ్యమైన ఉద్యమాలు గతంలో వాటికి సమాంతరాలు. గతించిన యుగాల్లో సంఘానికి కలిగిన అనుభవాలు ఈనాటి మనకు విలువైన పాఠాలు నేర్పుతాయి.GCTel 319.1

  లోకంలో రక్షణ సేవా మహోద్యమ ప్రగతిలో దేవుడు భక్తులైన తన సేవకులను తన పరిశుదాత్మ ద్వారా నడిపిస్తాడున్నది బైబిలు విస్పష్టంగా బోధిస్తున్న సత్యం. మనుషులు దేవుని చేతిలో సాధనాలు. తన కృపాకార్యాల సాధనకు దేవుడు మనుషులను ఉపయోగిస్తాడు. ప్రతీ వారికి వారి వారి పాత్ర ఉంది. ఆయన ప్రతీ వ్యక్తికి కొంత వెలుగు నిస్తాడు. అది ఆ వ్యక్తి నివసిస్తున్న కాలానికి అనుగుణంగా రూపొంది తనకు దేవుడిచ్చిన కార్యాన్ని నిర్వహించటానికి అనువుగా వుంటుంది. ఏ మానవుడూ-అతడు దేవునికి ఎంత సన్నిహితుడైనా - రక్షణ ప్రణాళికను పరిపూర్ణంగా గ్రహించలేడు. తన కాలంలో జరుగుతున్న దైవసేవ పరమార్థాన్ని సైతం ఏ మానవుడూ పరిపూర్ణంగా అభినందించలేడు. తమకు నియమించిన కార్యం ద్వారా ఏ ఉద్దేశాన్ని దేవుడు నెరవేర్చ దలచుకొన్నాడో మనుషులు సంపూర్తిగా గ్రహించలేరు. ఆయన పేరిట తాము అందిస్తున్న వర్తమానాన్ని వారు సాకల్యంగా అవగాహన చేసుకోలేరు.GCTel 319.2

  “దేవుని గూఢాంశములను నీవు తెలిసికొన గలవా? సర్వశక్తుడగు దేవుని గూర్చి నీకు పరిజ్ఞానము కలుగునా?” “నా తలంపులు మీ తలంపులవంటివి కావు. మీ త్రోవలు నా త్రోవలవంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికిపైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. ” “చాల పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకము చేసికొనుడి. దేవుడను నేనే మరి ఏ దేవుడును లేడు. నేను దేవుడను నన్ను పోలిన వాడెవడును లేడు.” యోబు 11:7; యెషయా 55:8,9; 46:9,10. అతి ప్రత్యేక వికాసాన్నందుకొన్న ప్రవక్తలు సైతం దేవుడు తమ కనుగ్రహించిన ప్రత్యక్షతలను పూర్తిగా గ్రహించలేక పోయారు. వాటిలోని ఉపదేశం దైవ ప్రజలకు అవసరమవ్వటాన్ని బట్టి ఆయా యుగాల్లో వాటిని అవగాహన చేసుకోటం జరుగుతుంది.GCTel 319.3

  సువార్త ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ రక్షణను గూర్చి రాస్తూ పేతురిలా అంటున్నాడు, “మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు, తమయందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చియు, వాటి తరువాత కలుగబోవు మహిమను గూర్చియు ముందుగా సాక్ష్యమిచ్చినప్పుడు, ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచు వచ్చెనో దానిని విచారించి పరిశోధించిరి. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ పలస మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకిప్పుడు తెలుపబడిన యీ సంగతుల విషయమై తమ కొరకు కాదుగాని మీ కొరకే తాము పరిచర్య చేసిరను సంగతి వారికి బయలు పరచబడెను.” 1 పేతురు 1:10-12.GCTel 320.1

  అయినా, తమ దృష్టికి వచ్చిన సంగతులన్నింటినీ ప్రవక్తలు గ్రహించలేక పోయినా దేవుడు తమకు ప్రత్యక్షపర్చిన సంగతులపై సాధ్యమైనంత వికాసాన్ని పొందటానికి ప్రవక్తలు ప్రయత్నించారు. వారు “విచారణ చేశారు, పరిశోధించారు. తమలో ఉన్న క్రీస్తు ఆత్మ దేనిని ఏ విధంగా సూచించాడు అని పరిశోధించారు” ఎవరి ఉపకారార్ధం ఈ ప్రవచనాన్ని దైవ ప్రవక్తలు పొందారో అవి క్రైస్తవ యుగంలోని ఆ దైవ ప్రజలకు ఎంత గొప్ప పాఠం. “ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదుగాని మీ కొరకే తాము పరిచర్యచేసిరి”. ఇంకా జన్మపొందని తరాల వారికోసం తాము పొందిన ప్రత్యక్షతలను పరిశుద్ధ ప్రవక్తలు” ఎలా విచారించి పరిశోధించారో చూడండి. వారి ఉత్సాహోద్రేకాలకు అనంతర యుగాలలోని దైవ ప్రజలు ఈ దైవ వరం పట్ల చూపిస్తున్న నిరాసక్తతకూ మధ్య ఎంత వ్యత్యాసముంది! ప్రవచనాలను గ్రహించలేము అని తృప్తి చెందే సుఖలాలస, లౌకిక, ఉదాసీన వైఖరిని ఇది ఎంత తీవ్రంగా ఖండిస్తున్నది!GCTel 320.2

  పరిమిత జ్ఞానంగల మానవులు అనంత జ్ఞాని అయిన దేవుని ఆలోచనలను గ్రహించటం సాధ్యం కాకపోయినా లేదా ఆయన కార్యచరణ సరళిని పూర్తిగా అవగాహన చేసుకోలేకపోయినా తమ లోని ఏదో పొరపాటు వలనో లేక ఏదో అశ్రద్ధ వలనో దేవుని వర్తమానాన్ని స్పష్టంగా గ్రహించలేకపోతున్నారు. తరచు ప్రజల మనసులు - దైవ సేవకులు సహా - మానవుల అభిప్రాయాలు, సంప్రదాయాలు తప్పుడు బోధనలతో గుడివైనందున దేవుడు తన వాక్యంలో బయలుపర్చిన గొప్ప సంగతులను పాక్షికంగా మాత్రమే గ్రహించగలుగుతున్నారు. వ్యక్తిగతంగా రక్షకుడు వారితో ఉన్నప్పటికీ ఆయన శిష్యులకు జరిగింది ఇదే. మెస్సీయాలో సంబంధమైన రాజని ఇశ్రాయేలు దేశాన్ని ప్రపంచ సామ్రాజ్యంగా రూపుదిద్భుతాడని ప్రజలు నమ్మారు. ఈ ప్రజాభి ప్రాయాలతో శిష్యుల మనస్సులు నిండి ఉన్నందున తన శ్రమలను మరణాన్ని గూర్చి యేసు పలికిన మాటల భావాన్ని గ్రహించలేకపోయారు.GCTel 320.3

  క్రీస్తే వారిని ఈ వర్తమానంతో పంపాడు, “కాలము సంపూర్ణమైయున్నది. దేవుని రాజ్యము సమీపించియున్నది. మారుమనస్సు పొంది సువార్త నమ్ముడి” మార్కు 1:15. అది దానియేలు 9 పై ఆధారితమైన వర్తమానం. అరవై తొమ్మిది వారాలు “అభిషిక్తుడైన అధిపతి” వచ్చేవరకు సాగుతాయని దూత చెప్పాడు. ఉత్కంఠభరితమైన నిరీక్షణతో ఉప్పొంగుతున్న ఉత్సాహంతో ప్రపంచాన్ని పరిపాలించేందు కోసం యెరూషలేములో మెస్సీయా తన సింహాసనాన్ని స్థాపిస్తాడని శిష్యులు ఎదురుచూశారు. GCTel 321.1

  దాన్ని అపార్థం చేసుకొన్నా తమకు క్రీస్తు అప్పగించిన వర్తమానాన్ని శిష్యులు ప్రకటించారు. తమ ప్రకటన దానియేలు 9:25 మీద ఆధారితమై ఉన్నప్పటికీ అదే అధ్యాయం తర్వాత వచనంలో “అభిషిక్తుడు మరణిస్తాడు” అన్న విషయాన్ని వారు చూడలేదు. పుట్టినప్పటి నుంచి వారి మనసు క్రీస్తు స్తాపిస్తాడంటూ ప్రజలు ఎదురు చూస్తున్న రాజ్యం మీదే నిలిచి ఉంది. ప్రవచనం నిర్దేశిస్తున్న అంశాలను క్రీస్తు చెప్పిన మాటలను అవగాహన చేసుకోకుండా ఇది వారికి అంధత్వం కలిగించింది.GCTel 321.2

  యూదు జనాంగానికి కృపాహ్వానాన్ని అందించటంలో వారు తమ విధిని నెరవేర్చారు. అదే సమయంలో, తమ ప్రభువు దావీదు సింహాసనాన్ని అధిరోహిస్తాడని ఎదురు చూస్తుండగా నేరస్తుడిలా బంధించటం, కొరడాలో కొట్టటం, ఎగతాళి చేయటం, నేరస్తుడుగా తీర్మానించటం, కల్వరిపై సిలువ వేయటం చూశారు. తమ ప్రభువు సమాధిలో నిద్రిస్తుండగా శిష్యులు పొందిన హృదయవేదన అంతింతకాదు.GCTel 321.3

  ప్రవచనం నిర్దేశించిన సమయంలో ప్రవచనం పేర్కొన్న రీతిలో క్రీస్తు వచ్చాడు. ఆయన పరిచర్యలోని ప్రతి చిన్న విషయంలోనూ లేఖన సాక్ష్యం నెరవేరింది. ఆయన రక్షణ వర్తమానాన్ని చాటించాడు. “ఆయన మాట శక్తిమంతమైనది”. అది దైవ సంబంధమైనదని ఆయన శ్రోతలు గుర్తించారు. కుమారుని పరిచర్య దైవ సంబంధమైనదని వాక్యం సాక్షమిచ్చింది, దేవుని ఆత్మ సాక్షమిచ్చాడు.GCTel 321.4

  శిష్యులు మమతానురాగాలతో ప్రభువును ఇంకా హత్తుకొనే ఉన్నారు. కాకపోతే వారి మనసుల్లో అనిశ్చితి, సందేహం చోటుచేసుకొన్నాయి. భవిష్యత్తులో తనకు సంభవించనున్న శ్రమలను గురించి, మరణం గురించి క్రీస్తు చెప్పిన మాటలు వేదనలో ఉన్న శిష్యులకు గుర్తుకురాలేదు. నజరేతువాడైన యేసు నిజమైన మెస్సీయా అయివుంటే తమకు దుఃఖం, ఆశాభంగం ఇలా ఎందుకు సంభవిస్తాయి? యేసు మరణానికి పునరుత్థానానికి మధ్యవున్న సబ్బాతు ఘడియల్లో ఆయన సమాధిలో ఉండగా శిష్యుల హృదయాల్ని తొలిచివేస్తున్న ప్రశ్న ఇది.GCTel 322.1

  యేసు అనుచరులను దుఃఖాంధకారం ఆవరించినా వారు అనాధలు మాత్రం కారు. ప్రవక్త ఇలా అంటున్నాడు, “నేను క్రింద పడినను తిరిగి లేతును. నేను అంధకారముందు కూర్చున్నను యెహోవా నాకు వెలుగుగా నుండును”. “చీకటియైనను నీకు చీకటి కాకపోవును, రాత్రి పగటివలె నీకు వెలుగుగా ఉండును. చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి.” దేవుడన్నాడు, “యదారవంతులకు చీకటిలో వెలుగు పుట్టును” “వారెరుగని మార్గమున గ్రుడ్డివారిని తీసికొని వచ్చెదను. వారెరుగని త్రోవలలో వారిని నడిపింతును. వారి యెదుట చీకటిని వెలుగుగాను వంకర త్రోవలలో వారిని నడిపింతును. వారి యెదుట చీకటిని వెలుగుగాను, వంకరత్రోపలను చక్కగాను చేయుదును. నేను వారిని విడువక యీ కార్యములు చేయుదును.” మీకా 7:8; కీర్తనలు 139:12; 112:4; యెషయా 42:16.GCTel 322.2

  ప్రభువు పేరిట శిష్యులు చేసిన ప్రకటన ప్రతీ వివరంలోను నిజం. ఆ ప్రకటన పేర్కొన్న ఘటనలు అప్పుడు సంభవిస్తున్నవి. “కాలం సమాప్తమయ్యింది. దేవుని రాజ్యం సమీపంలో ఉన్నది.” అన్నదే వారి వర్తమానం. “కాలం” ముగిసిన పిమ్మట - “అభిషిక్తుడైన అధిపతి” వరకు కొనసాగే దానియేలు 9 వ అధ్యాయంలోని అరవైతొమ్మిది వారాలు - యోర్డాను సదిలో యోహాను వలన బాప్తిస్మం పొందిన అనంతరం-క్రీస్తు ఆత్మాభిషేకం పొందాడు. వారు నమ్మినట్లు ఈ రాజ్యం లోక సంబంధమైన రాజ్యంకాదు. “రాజ్యమును అధికారమును రాజ్యమహాత్మ్యమును మహోన్నతుని పరిశుదులకు” స్థాపితం కానున్న నిత్యరాజ్యం కూడా కాదది. ఆయన రాజ్యం నిత్యమూ నిలుస్తుంది. “అధికారులందరు దానికి దాసులై విధేయులగుదురు”. మన బలహీనతలయందు మనతో సహానుభవము గల దయ కనికరాలుగల మన ఉత్తరవాది అయిన క్రీస్తుకు మన గమనాన్ని తిప్పుతూ పౌలిలా అంటున్నాడు, “గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము నొద్దకు చేరుదము.” హెబ్రీ 4:15,16. కృపాసనం కృపారాజాన్ని సూచిస్తుంది. సింహాసనం రాజ్యం ఉనికిని చాటుతుంది. తన ఉపమానాలు చాలా వాటిలో క్రీస్తు “పరలోకరాజ్యం” అన్న పదబంధాన్ని వాడాడు. హృదయాల్లో దైవ కృప చేసే పనిని సూచించటానికి యేసు ఈ పదబంధాన్ని వాడాడు.GCTel 322.3

  మహిమ సింహాసనం, మహిమా రాజ్యాన్ని సూచిస్తుంది. రక్షకుని మాటలు ఈ రాజ్యం గురించి ప్రస్తావిస్తున్నాయి. “తన మహిమతో మనుష్యకుమారుడును, ఆయనతో కూడ సమస్త దూతలును వచ్చునప్పుడు ఆయన తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడైయుండును. అప్పుడు సమస్త జనములు ఆయన యెదుట పోగుచేయబడుదురు.” మత్తయి 25:31,32. ఈ రాజ్యం ముందున్నది. క్రీస్తు రెండో రాకడ వరకు ఇది స్థాపితం కాదు.GCTel 323.1

  మానవుడు పాపంలో పడ్డ వెంటనే కృపారాజ్యం ప్రారంభమయ్యింది. పాపంలో పడ్డ మానవ జాతి విమోచనకు ప్రణాళిక రూపొందింది. అప్పుడే అది దేవుని ఉద్దేశంలోను, వాగ్దానంలోను ఉన్నది. మనుషులు విశ్వాసం ద్వారా ఆ రాజ్యంలో సభ్యులయ్యారు. అయినా ఆ రాజ్యం క్రీస్తు మరణం వరకు స్థాపితం కాలేదు. తన ఇహలోక కర్తవ్యాన్ని ప్రారంభించిన తర్వాత కూడా మనుషుల కాఠిన్యంతో కృతఘ్నతతో విసిగి వేసారిన రక్షకుడు కల్వరిపై ప్రాణత్యాగం చేయకుండా వెనుదిరిగి వెళ్లిపోగలిగే వాడే. గెత్సేమనె తోటలో ఆయన చేతుల్లో దుఃఖపాత్ర వణికింది. ఆ తరుణంలో దైవ తనయుడు తన ముఖం మీది రక్తపు చెమటను తుడిచివేసుకొని పాపులైన మానవాళిని తమ కర్మకు విడిచిపెట్టి పరలోకానికి తిరిగి వెళ్ళిపోగలిగే వాడే. ఆయన ఇది చేసి ఉంటే పాప మానవులకు విముక్తి ఉండక పోయేది. కాని రక్షకుడు తన ప్రాణాన్ని ధారబోసి తన తుది శ్వాసతో “సమాప్త మాయెను” అన్నప్పుడు రక్షణ ప్రణాళిక నెరవేర్పు ధ్రువపడింది. ఏదెనులో నేరస్తులైన జంటకు దేవుడు వాగ్దానం చేసిన రక్షణ ధ్రువపడింది. క్రితంలో దేవుని వాగ్దానం వల్ల ఉనికిలో ఉన్న కృపారాజ్యం అప్పుడు స్థాపితమయ్యింది.GCTel 323.2

  తమ నిరీక్షణకు చరమగీతంగా శిష్యులు భావించిన క్రీస్తు మరణం అది నిత్యం అలాగే జరిగేలా పరిణమించింది. వారికి తీవ్ర ఆశాభంగం కలిగించినా తమ విశ్వాసం నిజమైన దనటానికి ఇది తిరుగులేని నిదర్శనం. వారికి భేదాన్ని నిస్పృహను మిగిల్చిన సంఘటనే ఆదాము ప్రతీ బిడ్డ హృదయంలోను నిరీక్షణకు తలుపు తెరిచింది. అన్ని యుగాల్లోని భక్తుల భావి జీవితం, నిత్యానందం దీనిపై కేంద్రీకృతమై ఉన్నాయి.GCTel 324.1

  శిష్యుల ఆశాభంగాల నడుమ సైతం అనంత కృపాసంకల్పాలు నెరవేరుతూనే ఉన్నాయి. “ఎవడును ఎన్నడును మాటలాడని” దైవ కృప వలనను, “ఎవడును ఎన్నడును మాటలాడ” నట్లు బోధించిన ఆయన శక్తి వల్లను వారి హృదయాలు ఆయనకు ఆకర్షితాలు అయినప్పటికినీ యేసు పట్ల తమకున్న ప్రేమ అనే స్వచ్ఛమైన బంగారంతో లౌకిక అహంకారం, స్వార్థాపేక్ష అనే చౌకబారు లోహం కలగాపులగ మయ్యింది. పస్కా గదిలో తమ అధినేత గెత్సేమనె నీడలో ప్రవేశిస్తున్న తరుణంలోనూ “తమలో ఎవడు గొప్ప వాడుగా ఎంచబడునో అన్న వివాదము” వారి మధ్య లేచింది. లూకా 22:24. పరాభవం, తోటలోని హృదయ వేదన, తీర్పుగది, కల్వరి సిలువ వారి ముందు ఉండగా, వారి మనసుల్ని ఆకట్టుకొంటున్నవి సింహాసం, కిరీటం, ప్రాపంచిక ప్రాభవం. శిష్యులు తమ దినాల్లో ప్రబలుతున్న తప్పుడు బోధనలను గట్టిగా నమ్మారు. తన రాజ్యం నిజ స్వభావం గురించి తనకు కలుగబోయే శ్రమలు మరణం గురించి ఆయన చెప్పిన మాటలను వారు లెక్కచేయలేదు. ఇందుకు కారణం వారి అహంకారం, లోకప్రతిష్ఠకోసం వారికున్న దాహమే. ఈ పొరపాట్లు విచారణకు దారితీశాయి. ఆ విచారణ వారి దిద్దుబాటు నిమిత్తం చోటుచేసుకొన్నదే. శిష్యులు తమ వర్తమాన భావాన్ని - అపార్ధం చేసుకొని తాము ఆశించినది సాధించలేక పోయినప్పటికీ దేవుడు తమకు అప్పగించిన హెచ్చరికను ప్రకటించారు. ప్రభువు వారి విశ్వాసానికి విధేయతకు ప్రతిఫలమిస్తాడు. తిరిగి లేచిన ప్రభువును గూర్చిన సువార్త ప్రచార బాధ్యతను వారు నిర్వహించాల్సి ఉన్నారు. ఈ కార్యభారం వహించటానికి శిష్యుల్ని సిద్ధం చేసేందుకే వారికి ఈ బాధాకరమైన అనుభవం కలిగింది.GCTel 324.2

  పునరుత్థానం అనంతరం ఎమ్మాయి మార్గంలో తన శిష్యులకు కనిపించి యేసు “మోషేయు సమస్త ప్రవక్తలును మొదలుకొని లేఖనములన్నింటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను” లూకా 24:27. శిష్యుల హృదయాలు చలించాయి. విశ్వాసం రగుల్కోన్నది. తానెవరో యేసు వారికి బయలు పర్చకముందే “వారిలో సజీవ నిరీక్షణ చోటు చేసుకొంది.” ఆయన ఉద్దేశం శిష్యుల అవగాహనను ఉత్తేజ పర్చి “స్థిరమైన ప్రవచన వాక్యము” పై వారి విశ్వాసాన్ని పాదుకొల్పాలన్నదే. తన వ్యక్తిగత సాక్ష్యాన్ని బట్టేగాక ధర్మశాస్త్రంలోని సంకేతాలు పాతనిబంధన ప్రవచనాల తిరుగులేని నిదర్శనాలను బట్టి సత్యం వారి మనస్సుల్లో బలంగా వేళ్లూనాలని యేసు ఉద్దేశించాడు. తమ వ్యక్తిగత విషయంలోను, క్రీస్తును గూర్చిన జ్ఞానాన్ని లోకానికి అందజేయటంలోను క్రీస్తు అనుచరులకు జ్ఞానయుక్తమైన విశ్వాసం అవసరం. ఈ జ్ఞానాన్ని ఆర్జించటంలో శిష్యుల గమనాన్ని ఆయన “మోషేపైకి ప్రవక్తలపైకి” తిప్పాడు, తిరిగి లేచిన రక్షకుడు పాతనిబంధన లేఖనాల విలువను ప్రాముఖ్యాన్ని గురించి అలాంటి సాక్ష్యం ఇచ్చాడు. శిష్యులు తమ ప్రియతమ నాయకుని ముఖాన్ని మరోసారి వీక్షించినప్పుడు వారి హృదయాల్లో కలిగిన పరివర్తన ఎంత గొప్పది! లూకా 24:32. క్రితంకన్నా మరెక్కువగాను సంపూర్ణంగాను వారు “ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలును ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను” కసుగొన్నారు. సందిగ్ధత, వేదన, నిస్పృహ మాయమై పరిపూర్ణ నిశ్చయత నిర్మల విశ్వాసం వారి హృదయాల్లో చోటుచేసుకున్నాయి. ఆయన ఆరోహణానంతరం వారు “ఎడతెగక దేవాలయములో ఉండి దేవునికి స్తోత్రము” చేయటంలో ఆశ్చర్యమేముంది? క్రీస్తు హీనమైన మరణం గురించి ఎరిగిన ప్రజలు శిష్యుల ముఖాల్లో దుఃఖం గందరగోళం పరాజయమే కనిపిస్తాయని చూశారు. అయితే వారి ముఖాల్లో ప్రజలకు కనిపించింది ఉత్సాహం, విజయం. తమ ముందున్న కార్యాన్ని నిర్వహించేందుకు శిష్యులు ఎంత చక్కని సిద్దబాటు పొందారు! తాము భరించగలిగినంత శ్రమను వారు భరించారు. మానవ దృష్టికి అంతా నాశనమైపోయినట్లు కనిపించిన తరుణంలో దేవుని వాక్యం విజయం సాధించటం వారు కళ్లారా చూశారు. ఇక వారి విశ్వాసాన్ని దెబ్బతీసేది వారి ప్రేమను చల్లార్చేది ఏముంది? ఎడతెగని దుఃఖంలో వారికి “బలమైన ధైర్యం” “ఆత్మకు లంగరువలె నుండు” నిశ్చలమైన, స్థిరమైన నిరీక్షణ ఉన్నాయి. హెబ్రీ 6:18, 19. వారు దేవుని వివేకానికి శక్తికి సాక్షులు. “మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవియైనను రాబోవునవియైనను అధికారులైనను ఎతై నను లోతైనను సృష్టించబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమనుండి ” తమను ఎడబాపనేరవని రూఢిగా నమ్మారు. వీటన్నిటిలో మనము... “అత్యధిక విజయము పొందుచున్నాము.” అన్నారు. రోమా 8:38, 39,37. “ప్రభువు వాక్యము ఎల్లప్పుడును నిలుచును” 1 పేతురు 1:24. “శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తుయేసే. అంతేకాదు. మృతులలో నుండి లేచిన వాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్న వాడును మన కొరకు విజ్ఞాపనము కూడ చేయువాడును ఆయనే.” రోమా 8:34.GCTel 324.3

  “నా జనులు ఇక నెన్నటికిని సిగ్గునొందరు” అంటున్నాడు ప్రభువు. యోవేలు 2:26. “సాయంకాలమున ఏడ్పు వచ్చి, రాత్రి యుండినను ఉదయమున సంతోషము కలుగును.” కీర్తనలు 30:5. పునరుత్థాన దినాన ఈ శిష్యులు రక్షకుని కలుసుకొన్నప్పుడు ఆయన చెప్పిన మాటలు వింటుండగా వారి హృదయాలు వారిలో మండినప్పుడు తమ నిమిత్తం గాయాలు పొందిన ఆయన శిరస్సు, చేతులు, పాదాలను చూచినప్పుడు, తన ఆరోహణానికి ముందు ఆయన వారిని బేతనీ వరకు తీసుకొని వెళ్లి చేతులెత్తి దీవిస్తూ, “మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి ” (మార్కు 16:15) ఇంకా “ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నానని” చెప్పినప్పుడు (మత్తయి 28:20) పెంతెకోస్తు దినాన వాగ్రత్త ఆదరణ కర్త దిగిరాగా పై నుంచి శక్తి రావటం, విశ్వాసుల హృదయాలు ఆరోహణుడైన ప్రభువు సాన్నిధ్య స్పృహతో ఉత్సహించటం జరిగినప్పుడు- అప్పుడు మార్గం నేనే అన్న ఆ ప్రభువు వారి మార్గం త్యాగంతో, ఆత్మాహుతితో నింపగా ఆయన రాక సమయంలో వారు తమ “కృపాసువార్తకు” ప్రతిగా “నీతి కిరీటాన్ని” పొందుతారు. క్రితం తమ శిష్యరికంలో వారు ఆశించిన భూలోక సింహాసనం స్థానే వారికి “నీతి కిరీటం” లభిస్తుంది. “మనము అడుగువాటన్నిటికంటెను, ఊహించువాటన్నిటికంటెను అత్యధికముగా చేయ శక్తిగల” ఆయన శ్రమలలో సహవాసంతో పాటు ఆయన ఆనందంలో సహవాసాన్ని అనగా “అనేక కుమారులను మహిమకు తెచ్చు” సహవాసాన్ని “నిత్యమైన మహిమ భారమును” “క్షణ మాత్రముండు మా చులకని శ్రమ”తో సరిపోల్చటానికి వీలు లేదంటున్నాడు పౌలు.GCTel 326.1

  క్రీస్తు మొదటిరాక సమయంలో “రాజ్యసువార్త” ప్రకటించిన శిష్యుల అనుభవం, రెండోరాక వర్తమానాన్ని ప్రకటించిన ప్రబోధకుల అనుభవం ఒకటే. “కాలం సమాప్త మయ్యింది, దేవుని రాజ్యం సమీపంలో ఉన్నది.” అంటూ శిష్యులు బోధించినట్లే బైబిలులోని అతి దీర్ఘమైన చివరి ప్రవచన కాల వ్యవధి అంతమొందటానికి సమయమయ్యిందని, తీర్పు ఘడియ వచ్చిందని దేవుని నిత్యరాజ్యం రావటానికి సిద్ధంగా ఉన్నదని మిల్లర్ ఆయన అనుచరులు ప్రకటించారు. కాలావధి గురించి శిష్యుల బోధ దానియేలు 9 వ అధ్యాయంలోని డెబ్బయి వారాల మీద ఆధారితమైంది. మిల్టర్ ఆయన సహచరులు దానియేలు 8:14 లోని 2300 దినాల పరిసమాప్తిని ప్రకటించారు. 2300 దినాల ప్రవచనంలో డెబ్బయి వారాలు ఒక భాగం. అప్పుడు శిష్యులు, ఇప్పుడు మిల్లర్, ఆయన సహచరులు ఒకే ప్రవచన కాలం గురించి బోధించారు. ఇరువర్గాలు సదరు ప్రవచన కాలంలోని వేర్వేరు భాగాల నెరవేర్పుపై దృ ష్టి సారించాయి.GCTel 326.2

  ఆది శిష్యులమల్లే విల్యమ్ మిల్లర్, ఆయన అనుచరులు తాము ప్రకటిస్తున్న వర్తమాన భాగాన్ని పూర్తిగా అవగాహన చేసుకోలేదు. సంఘంలో దీర్ఘకాలంగా స్థిరపడి ఉన్న పొరపాట్ల కారణంగా ప్రవచనంలోని ప్రాముఖ్యమైన భావాన్ని వారు గ్రహింలేకపోయారు. కనుక లోకానికి అందించే నిమిత్తం దేవుడు తమకు ఇచ్చిన వర్తమానాన్ని వారు ప్రకటించినప్పటికీ దాని భావాన్ని అపార్థం చేసుకొన్నందువల్ల వారు ఆశాభంగానికి గురి అయ్యారు. GCTel 327.1

  దానియేలు 8:14 లోని “రెండు వేల మూడువందల దినముల మట్టుకే...అప్పుడు ఆలయ పవిత్రతను గూర్చిన తీర్పు తీర్చబడును” అన్న ప్రవచనాన్ని విశదీకరించటంలో ఈ లోకమే ఆలయమని, ఆలయ పవిత్రత అంటే ప్రభువు రాక సమయంలో అగ్ని వలన లోకం పవిత్రపరచబడుటమనీ లోకంలో ప్రబలుతున్న అభిప్రాయాన్నే మిల్లర్ అంగీకరించాడు. 2300 దినాల అంతం కచ్చితంగా ప్రవచితమైంది గనుక, ఇది రెండోరాకడ సమయాన్ని తెలుపుతుందని మిల్లర్ భావించాడు. ఆలయమంటే ఏమిటి అన్న విషయమై ప్రజల నమ్మకాన్ని అంగీకరించటంవల్ల, ఆయన తప్పటడుగు వేశాడు.GCTel 327.2

  క్రీస్తు మరణానికి యాజకత్వానికి ఛాయ అయిన ఉపమానరూపక వ్యవస్థలో ప్రధాన యాజకుడు ఏటేటా జరిపిన సేవలలో ఆలయ పవిత్రత చివరిది. ఇశ్రాయేలు ప్రజల నుంచి పాపాల్ని తొలగించటం లేదా దూరంగా ఉంచటం ప్రాయశ్చిత్త ప్రక్రియలో చివరి కార్యం. పరలోకంలో మన ప్రధాన యాజకుడి సేవలో ఆఖరి కార్యం , పరలోక గ్రంథాల్లో నమోదైన దైవ ప్రజల పాపాల తొలగింపుకు లేదా తుడిచివేతకు ముంగురుతు. ఈ సేవలో దర్యాప్తు సంబంధిత కార్యాలు ఇమిడి ఉన్నాయి. మేఘారూఢుడై గొప్ప మహిమ ప్రభావాలతో క్రీస్తు రాకముందు ఈ తీర్పు జరుగుతుంది. ఆయన రాకకు ముందు ప్రతి వారి తీర్పు సమాప్తమవుతుంది. “ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వాని వాని క్రియల చొప్పున ప్రతివానికిచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నాయొద్ద ఉన్నది.” అని యేసంటున్నాడు. ప్రకటన 22:12. “దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి, ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చెను గనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగజేసిన వానికే నమస్కారము చేయుడి.” అని ప్రకటన 14:7 లో మొదటి దూత ప్రకటించిన తీర్పు ఇదే. ఇది రెండోరాకకు ముందు జరుగుతుంది.GCTel 327.3

  ఈ హెచ్చరికను ప్రకటించిన వారు సరైన వర్తమానాన్ని సరైన సమయంలో అందించారు. “కాలము సంపూర్ణమైయున్నది. దేవుని రాజ్యము సమీపించి యున్నది” అంటూ దానియేలు 9 లోని ప్రపచనంపై శిష్యులు బోధిస్తూ ఉన్నా, అదే లేఖనంలో క్రీస్తు మరణాన్ని గూర్చి కూడా ఉన్నట్లు వారు గ్రహించలేకపోయినట్లే మిల్లర్, ఆయన సహచరులు దానియేలు 8:14, ప్రకటన 14:7 పై వర్తమానాలు ప్రకటించినా ప్రకటన 14 లో ఇంకా ఇతర వర్తమానాలున్నట్లు రెండో రాకకు ముందు వాటిని ప్రకటించాల్సి ఉన్నట్లు వారు గ్రహించలేకపోయారు. డెబ్బయి వారాల అంతంలో స్థాపితం కానున్న రాజ్యాన్ని శిష్యులు అపార్థం చేసుకొన్నట్లే 2300 దినాల చివర సంభవించనున్న సంఘటనను ఆగమనవాదులు అపార్థం చేసుకొన్నారు. ఈ రెండు సందర్భాల్లోను ప్రజల్లో ఉన్న తప్పుడు అభిప్రాయాల్ని విశ్వసించి అనుసరించటం తద్వారా సత్యపరంగా వారికి అంధత్వం కలగటం జరిగింది. దేవుడు తమ కిచ్చిన వర్తమానాన్ని అందించటంలో ఇరువర్గాల వారు దేవుని చిత్తాన్ని నెరవేర్చారు. వర్తమానాన్ని అపార్థం చేసుకోటం ద్వారా ఇరు వర్గాల భక్తులు తీవ్ర ఆశాభంగానికి గురి అయ్యారు.GCTel 328.1

  అయినా తీర్పును గూర్చిన హెచ్చరికను ఆ రీతిగా ఇవ్వటానికి అనుమతించటంలో దేవుడు తన ప్రజాహిత ఉద్దేశాన్ని నెరవేర్చుకున్నాడు. ఆ మహాదినం సమీపంలోనే ఉంది. తమ హృదయాల్లో ఏమి ఉన్నదో వారికి బయలు పర్చే నిమిత్తం కచ్చితమైన సమయం విషయంలో వారికి పరీక్ష రావటం దైవ చిత్తాను సారంగా జరిగిన పనే. అది సంఘాన్ని పరీక్షించటానికి పరిశుద్ధ పర్చటానికి వచ్చిన వర్తమానం. తమ ఆశలు అనురాగాలు ఈ లోక భోగాలపై ఉన్నవా లేక క్రీస్తుపైన పరలోకం పైన ఉన్నాయా అని వారు ఆత్మశోధన చేసుకోవలసి ఉన్నారు. రక్షకుణ్ణి ప్రేమిస్తున్నట్లు వారు చెప్పుకొన్నారు. ఇప్పుడు దాన్ని నిరూపించుకోవలసి ఉన్నారు. లోక సంబంధమైన ఆశలు కోరికలు త్యజించి ప్రభువు రాకను ఆనందోత్సాహాలతో స్వాగతించటానికి వారు సర్వసన్నద్ధంగా ఉన్నారా? తమ యధార్ధ ఆధ్యాత్మిక స్థితిని వారు గ్రహించటానికి తోడ్పడేందుకే ఈ వర్తమానం రూపుదిద్దుకొన్నది. పశ్చాత్తాపంతోను వినయమనసుతోను ప్రభువును వెదకటానికే వారికీ వర్తమానం వచ్చింది. GCTel 328.2

  తాము ప్రకటించిన వర్తమానాన్ని తాము అపార్ధం చేసుకోవటం వల్ల తమకు ఆశాభంగం ఎదురైనా అది వారికి మేలే చేసింది. హెచ్చరికను అందుకొన్నామని చెప్పుకొనేవారి హృదయాల్ని అది పరీక్షించింది. తమకు కలిగిన ఆశాభంగం దృష్ట్యా వారు తొందరపడి తమ క్రైస్తవానుభవాన్ని త్యజించి దైవ వాక్యంపై తమ నమ్మకాన్ని వదులుకొంటారా? లేక ప్రవచన ప్రాముఖ్యాన్ని ఆవగాహన చేసుకోటంలో తాము ఎక్కడ పొరబడ్డారో తెలుసుకోటానికి వారు ప్రార్ధన పూర్వకంగా దీనమనసుతో ప్రయత్నిస్తారా? వారిలో ఎందరు భయంతో ఆవేశోద్రేకాలతో వ్యవహరించారు? ఎందరు అర్ధాం గీకారంతోఅపనమ్మకంతో తటపటాయించారు? వేవేల ప్రజలు ప్రభువు రాకను ఆకాంక్షిస్తున్నట్లు చెప్పుకొన్నారు. లోపల ఎగతాళి అపవాదు, జాప్యం, ఆశాభంగం అనే పరీక్షను భరించాల్సి వచ్చినప్పుడు వారు తమ విశ్వాసాన్ని వదులుకొంటారా? తమతో దేవుడు వ్యవహరించిన తీరును వెంటనే గ్రహించలేక పోయినందున వాక్యం స్పష్టంగా బోధిస్తున్న సత్యాలను తోసిపుచ్చుతారా?GCTel 329.1

  వాక్యోపదేశాన్ని దేవుని ఆత్మ ప్రబోధాన్ని ఎవరైతే నమ్మి అనుసరించారో వారి బలాన్ని ఈ పరీక్ష బయలు పర్చుతుంది. బైబిలుని దానికదే అర్ధం చెప్పుకోనీయటానికి బదులు మానవుల సిద్ధాంతాలను వ్యాఖ్యానాలను అంగీకరించటానికి అది దారితీసే ప్రమాదముంది. తమ దోషాల పర్యవసానంగా కలిగే ఆందోళన వేదన విశ్వాసులకు అగత్యమై దిద్దుబాటుగా పరిణమిస్తాయి. ప్రవచనాన్ని మరింత లోతుగా పరిశీలించటానికి అవి వారిని నడిపిస్తాయి. తమ విశ్వాసమౌలిక సూత్రాలను మరింత జాగ్రత్తగా పరీక్షించి లేఖన సత్యాల పునాదిపై ఆనుకొని సమస్తాన్ని - క్రైస్తవ లోకంలో దాని కెంతటి ఆమోదమున్నా! తోసిపుచ్చటానికి అవి వారికి దోహదపడ్డాయి.GCTel 329.2

  తొలిదినాల శిష్యులకు మల్లే ఈ విశ్వాసులకూ శ్రమల కాలంలో అస్పష్టంగా కనిపించిన అంశాలు తర్వాత స్పష్టంగా బోధపడ్డాయి. ప్రభువు చిత్తమేమిటో వారు చూడ గలిగినప్పుడు తమ తప్పిదాలవల్ల శ్రమ కలిగినప్పటికీ తమ పట్ల ఆయన ప్రేమ సంకల్పం నెరవేరుతూనే ఉన్నదని వారు గుర్తిస్తారు. ధన్యమైన అనుభవం ద్వారా ఆయన “ఎంతో కరుణ దయాదాక్షిణ్యాలు గలవాడని, ఆయన మార్గము ఆయన చేసిన నిబంధనను ఆయన నియమించిన శాసనములను గైకొను వారి విషయములో... కృపా సత్యములై యున్నవి.” అని వారు తెలుసుకొంటారు.GCTel 329.3