Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
మహా సంఘర్షణ - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    అధ్యాయం 38—చివరి హెచ్చరిక

    “అటు తరువాత మహాధికారము గల వేరొక దూత పరలోకమునుండి దిగి వచ్చుట చూచితిని. అతని మహిమ చేత భూమి ప్రకాశించెను. అతడు గొప్ప స్వరముతో ఆర్భటించి యిట్లనెను-- మహాబబులోను కూలిపోయెను, కూలిపోయెను. అది దయ్యములకు నివాస స్థలమును ప్రతి అపవిత్రాత్మకు ఉనికిపట్టును అపవిత్రమును అసహ్యమునైన ప్రతి పక్షికి ఉనికి పట్టును ఆయెను” “మరియు ఇంకొక స్వరము పరలోకమునుండి ఈ లాగు చెప్పగా వింటిని-- నా ప్రజలారా, మీరు దాని పాపములో పాలివారు కాకుండునట్లు, దాని తెగుళ్లలో ఏదియు మీకు ప్రాప్తింపకుండునట్లు దాని విడచి రండి.” ప్రకటన 18:1,2,4. బబులోను కూలటాన్ని గూర్చిన ప్రకటన 14:8 లో రెండో దూత ప్రకటన మొదటగా 1844 గ్రీష్మ కాలంలో వెలువడినప్పటి నుంచి బబులోనులో భాగంగా మారుతున్న వివిధ వ్యవస్థలు సంస్థల దుష్కృతాల్ని అదనంగా పేర్కొంటూ మళ్లీ ఇదే ప్రకటన భవిష్యత్తులో పునరావృతం కావలసి ఉన్న కాలాన్ని ఈ లేఖనం సూచిస్తున్నది. మత ప్రపంచంలో చోటుచేసుకొన్న భయంకర పరిస్థితిని కూడా ఇక్కడ వర్ణించటం జరిగింది. ప్రజలు సత్యాన్ని నిరాకరించినప్పుడల్లా వారి మనసుల్ని చీకటి కమ్ముతుంది. అవి బండ బారాయి. చివరకి వారు కరడు గట్టిన నాస్తికత్వంలో కూరుకుపోతారు. దేవుడు పంపిన హెచ్చరికల్ని లెక్కచేయకుండా పది ఆజ్ఞల ధర్మసూత్రాల్ని కొలరాస్తూ తుదకు ఆ సూత్రాల్ని భక్తిగా ఆచరించే వారిని హింసించటం మొదలు పెట్టారు. దేవుని వాక్యాన్ని ఆయన ప్రజల్ని ధిక్కరించి తిరస్కరించటం ద్వారా వారు క్రీస్తుని పక్కన పెడ్తారు. సంఘాలు భూత మత బోధనల్ని స్వీకరించే కొద్దీ ఐహిక హృదయంపై ఉంచిన నియంత్రణ ఉప సంహరించుకోటం జరుగుతుంది. మతవిశ్వాసం అతిఘోర దుష్కృతాల్ని కప్పిపుచ్చే వస్త్రంగా తయారవుతుంది. ఆధ్యాత్మిక ప్రదర్శనలపై నమ్మిక మోసపుచ్చే అపవిత్రాత్మలకు భూతమత సిద్ధాంతాలకు ద్వారం తెరుస్తుంది. ఈ రకంగా దుష్టదూతల ప్రభావం సంఘాల్లో కనిపిస్తుంది.GCTel 570.1

    ప్రవచనం ప్రస్తావిస్తున్న బబులోను గురించి ఇలా ఉంది: “దాని పాపము ఆకాశము నంటుచున్నది. దాని నేరములను దేవుడు జ్ఞాపకము చేసికొనియున్నాడు.” ప్రకటన 18:5 దాని నేరాల గిన్నె నిండింది. అది నశించటానికి సిద్ధంగా వుంది. అయితే బబులోనులో దేవుని ప్రజలున్నారు. దేవుని తీర్పులు దానిపై పడక పూర్వం ఆయనకు నమ్మకంగా ఉన్న ప్రజలు దాని పాపాల్లో పాలివారు కాకుండేందుకు దాని తెగుళ్లలో పాల్గొనకుండేందుకు” దాన్ని విడిచి బైటికి రావాల్సి ఉన్నారు. అందుకే పరలోకం నుంచి దూత వచ్చి తన మహిమతో భూమిని నింపి గొప్ప స్వరంతో బబులోను పాపాల్ని తెలియజేస్తున్నాడు. సంకేతాత్మక ఉద్యమం వచ్చింది. దూత వర్తమానం “నా ప్రజలారా... దానిని విడిచి రండి” అన్న పిలుపు నిస్తుంది. ఈ వర్తమానం మూడో దూత వర్తమానం రెండూ కలిసి లోక ప్రజలకు చివరి హెచ్చరికగా వస్తున్నది.GCTel 571.1

    ప్రపంచం అతిభయంకరమైన సమస్యను ఎదుర్కోవలసి ఉంది. ఈ లోక పరిపాలకులు దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా పోరాడటానికి ఏకమై “కొద్దివారుగాని గొప్పవారుగాని, ధనికులుగాని దరిద్రులుగాని స్వతంత్రులుగాని దాసులుగానిGCTel 571.2

    అందరును” (ప్రకటన 13:16.) తప్పుడు సబ్బాతు ఆచరణలో సంఘంతో కలసి రావాలని శాసనం జారీచేస్తారు. ఈ శాసనానికి విధేయులు కాని వారందరికి జరిమానాలు చివరికి మరణదండన విధిస్తారు. మరో పక్క సృష్టి కర్త విశ్రాంతి దినాచరణను కోరుతూ, దాన్ని అతిక్రమించేవారిపై దేవుని ఉగ్రత పడుతుందని దైవ ధర్మశాసనం ప్రకటిస్తున్నది.GCTel 571.3

    సమస్య ఈ రీతిగా తేటతెల్ల మవటంతో మానవ శాసనాన్ని ఆచరించే నిమిత్తం దైవధర్మశాసనాన్ని ఎవరైతే కాళ్లతో తొక్కుతారో వారు మృగం ముద్ర వేయించుకొంటారు. దేవునికి మారుగా ఏ అధికారానికి భక్తి శ్రద్దలు చూపుతారో ఆ అధికారానికి విశ్వసనీయత సూచక చిహ్నాన్ని పొందుతారు. దేవుని వద్ద నుంచి ఈ హెచ్చరిక వస్తున్నది, ఆ క్రూరమృగమునకుగాని దాని ప్రతిమకుగాని యెవడైనను నమస్కారము చేసి తన నొసటియందేమి చేతిమీదనేమి ఆ ముద్ర వేయించుకొనిన యెడల ఏమియు కలుపకుండ దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమను మద్యమును వాడు త్రాగును.” ప్రకటన 14:9,10.GCTel 571.4

    తనకు సత్యం లభించి దాన్ని గ్రహించి విసర్జించేంత వరకూ ఏ ఒక్క వ్యక్తి కూడా దేవుని ఉగ్రతకు లోనుకాడు. ఈ కాలానికి దేవుడు ఏర్పాటు చేసిన ప్రత్యేక సత్యాల్ని వినే అవకాశం దొరుకని వారు ఎందరో ఉన్నారు. నాల్గో ఆజ్ఞను విధిగా ఆచరించాలి అన్నది ఉచిత రీతిలో వారి దృష్టికి ఎన్నడూ రాలేదు. ప్రతీ హృదయాన్ని ఎరిగిన వాడు ప్రతీ ఉద్దేశాన్ని పరీక్షించే వాడు అయిన ప్రభువు సత్యాన్ని గ్రహించాలని కాంక్షించే ఏ వ్యక్తినీ ఈ మహా సంఘర్షణ సమస్యల సందర్భంగా మోసంలో పడటానికి విడిచిపెట్టడు. ప్రజలకు ఏమీ తెలియకుండా ఈ శాసనం రాకూడదు. ప్రతివారూ తమతమ తీర్మానాన్ని జ్ఞాన యుక్తంగా చేసుకొనేందుకోసం వారికి చాలినంత లేఖన కాంతి లభ్యమవ్వాలి.GCTel 572.1

    సబ్బాతు విశ్వసనీయతను నిగ్గుతేల్చే పరీక్ష, సంఘర్షణకు ముఖ్య కారణం సబ్బాతు సత్యమే అని తేలుతుంది. మనుషులకు ఈ చివరి పరీక్ష వచ్చినప్పుడు దేవుని సేవించే వారికి, సేవించని వారికి మధ్య భేదం కొట్టవచ్చినట్లు కనిపిస్తుంది. నాల్గో ఆజ్ఞకు విరుద్ధంగా దేశ శాసనాన్ననుసరించి జరిగే తప్పుడు సబ్బాతు ఆచరణ దైవ వ్యతిరేక అధికారానికి నమ్మకంగా ఉండటానికి సూచన అయితే, దైవ ధర్మశాస్త్రాను సారంగా నిజమైన సబ్బాతును ఆచరించటం సృష్టికర్త పట్ల విశ్వసనీయతకు సూచన. లౌకిక అధికారానికి లొంగుబాటును సూచించే చిహ్నాన్ని అంగీకరించటం ద్వారా ఒక తరగతి ప్రజలు మృగం ముద్రను పొందితే దైవాధికారాన్ని సూచించే చిహ్నాన్ని అంగీకరించే తక్కిన తరగతి ప్రజలు దేవుని ముద్రను పొందుతారు.GCTel 572.2

    మూడోదూత వర్తమాన సత్యాల్ని ప్రచారంచేసే బోధకుల్ని కేవలం భయవాదులుగా తరచు పరిగణించటం జరిగేది. అమెరికాలో మత అసహనం పెరుగుతుందని, సంఘం రాజ్యాధికారం ఏకమై దేవుని ఆజ్ఞలు కాపాడే ప్రజల్ని హింసిస్తారంటూ ముందుగా పలికిన మాటలు ఆధారం లేని మాటలు, అర్థంలేని మాటలు అన్నారు. ఈ దేశం ప్రస్తుతమున్నట్లే కొనసాగుతుంది తప్ప- మత స్వాంతంత్ర్యాన్ని కాపాడే దేశంగానే తప్ప - వేరే విధంగా మారదని ధీమా వ్యక్తం చేయటం జరుగుతుంది. కాగా ఆదివారాచరణ అమలు అంశం ప్రస్తుతం ప్రబలంగా ప్రస్తావనకు వస్తుండటంతో ఇంత కాలంగా సందిగ్ధంలోను అపనమ్మకంలోసు పడ్డ విషయం నెరవేర్పుకు దగ్గరలో ఉన్నట్లు ఈ మూడో దూత వర్తమానం ముందెన్నడూలేని ఫలితాన్ని కలిగించేటట్లు కనిపిస్తుంది.GCTel 572.3

    ప్రతీ తరంలోను పాపాన్ని గద్దించటానికి - అది లోకంలోనేగాని సంఘంలోనేగాని - దేవుడు తన సేవకుల్ని, పంపించాడు. అయితే ప్రజలకు కావలసింది మెత్తని మాటలు, పవిత్రమైన, కటువైన సత్యం కాదు. తమ కృషి ప్రారంభంలో అనేకమంది సంస్కర్తలు సంఘంలోని దేశంలోని పాపాల్ని వ్యతిరేకించేటప్పుడు ఎంతో విజ్ఞతను ఉపయోగించటానికి ప్రయత్నించారు. పరిశుద్ధ క్రైస్తవ జీవితాదర్శం ద్వారా ప్రజల్ని తిరిగి బైబిలు సిద్ధాంతాలకు నడిపించాలని ఆశించారు. అయితే దేవుని ఆత్మ ఏలీయా మీదికి వచ్చి దుర్మార్గపురాజు పాపాల్ని, భ్రష్ట ప్రజల పాపాల్ని గద్దించటానికి ఆయనను ప్రేరేపించిన రీతిగా వారిని దైవాత్మ ప్రేరేపించాడు. అప్పుడు తాము బోధించటానికి సందేహిస్తున్న సరళ బైబిలు సిద్ధాంతాల్ని బోధించకుండా వారు ఉండలేకపోయారు. సత్యాన్ని ఉద్రేకంతో ప్రకటించి ఆత్మల పరంగా పొంచి ఉన్న అపాయం గురించి హెచ్చరించారు. పర్యవసానాలకు భయపడకుండా ప్రభువిచ్చిన మాటలు పలికారు. ప్రజలు ఆ హెచ్చరికల్ని విన్నారు.GCTel 573.1

    మూడోదూత వర్తమానం అదే విధంగా ప్రకటితం కావాలి. వర్తమానాన్ని గొప్ప శక్తితో ప్రకటించటానికి సమయం వచ్చినప్పుడు దేవుడు సామాన్యుల ద్వారా పని చేస్తూ తన సేవకు తమ్మును తాము అంకితం చేసుకొన్న వారిని నడిపిస్తాడు. పని వారు సాహిత్య సంస్థల వలన గాక దైవాత్మ ప్రోక్షణ వల్ల అర్హత పొందుతారు. విశ్వాసం గల మనుషులు, ప్రార్థించే మనుషులు దేవుడు తమ కిచ్చిన మాటల్ని శుద్ధమైన ఉద్దేశంతో ప్రకటించటానికి ముందుకు వస్తారు. బబులోను పాపాల్ని బహిర్గతం చేస్తారు. ప్రభుత్వాధికారంతో సంఘాచారాల్ని అమలు పర్చటంవల్ల కలిగే దుష్పరిణామాల్ని, భూతమత విజృంభణను వేగం పుంజుకొంటున్న పోపుమత వ్యాప్తిని బట్టబయలు చేయటం జరుగుతుంది. ఈ గంభీర హెచ్చరికలు ప్రజలకు కనువిప్పు కలిగిస్తాయి. వేవేల ప్రజలు ఇంతకు ముందు వినిపించని ఈ మాటలు వింటారు. దేవుడు పంపిన సత్యాన్ని నిరాకరించినందుకు తన అపరాధాలు పాపాల కారణంగా కూలిన బబులోను ఎవరో కాదు సంఘమే అన్న సాక్ష్యాన్ని వారు విస్మయంతో వింటారు. ఈ సంగతులు నిజమా? అంటూ ప్రజలు తమ మాజీ బోధకుల్ని ప్రశ్నించినప్పుడు వారు కట్టుకథలు చెబుతూ వారి భయాల్ని, ఆందోళల్ని తొలగించటానికి తమ భవిష్యత్తుకు ధోకాలేదని నమ్మబలుకుతారు. కాని కేవలం మనుషుల అధికారాన్ని అంగీకరించకుండా “అని ప్రభువు సెలవిస్తున్నాడు” చూపించుమని చాలామంది కోరినప్పుడు పూర్వం పరిసయ్యులమల్లే ఆ ప్రఖ్యాత బోధకులు తమ అధికారాన్ని ప్రశ్నిస్తున్నందుకు ఆగ్రహిస్తూ ఆ వర్తమానం సాతాను వద్ద నుంచి వస్తుందని ఖండన మండనలకు దిగుతూ ఆ సత్యాన్ని ప్రకటించే బోధకుల్ని నిందించి హింసించటానికి, పాప ప్రజాసమూహాల్ని రెచ్చగొడ్తారు. సంఘర్షణ నూతన రంగాలకు విస్తరించి ఉదాసీనతకు గురి అయిన ప్రజల మనసులు ధర్మశాస్త్రంపై దృష్టి నిలుపుతుంటే సాతాను ఆందోళన చెందుతాడు. వర్తమానం బలోపేతం కావటం దాన్ని వ్యతిరేకించే వారిని కోపోద్రిక్తుల్ని చేస్తుంది. సత్యజ్యోతి వెలుగు తమ సభ్యులపై పడకుండేందుకుగాను దాన్ని దాచి పెట్టటానికి బోధకులు శాయశక్తుల కృషిచేస్తారు. ముఖ్యమైన ఈ అంశాలపై చర్చ జరగకుండా చూడటానికి తాము చేయగలిగినదంతా వారు చేస్తారు. సంఘం ప్రభుత్వాధికార సహాయాన్ని అర్ధిస్తుంది. ఈ విషయంలో పోపు మత వాదులు ప్రొటస్టాంట్లు ఏకమవుతారు. ఆదివారాచరణకు ఉద్యమం బలం పుంజుకొనే కొద్దీ ఆజ్ఞలు గైకొనే ప్రజలకు వ్యతిరేకంగా శాసనం అమలు చేస్తారు. వారిని జరిమానాలుతో, ఖైదుశిక్షలతో భయపెడ్తారు. కొందరికి హోదాలు, ఇతరులకు బహుమానాల ప్రలోభాలు వాగ్దానం చేసి తమ విశ్వాసాన్ని విడిచి పెట్టుమంటారు. కాని వారి సమాధానం ఎప్పుడూ ఇదే: “మా పొరపాటేంటో దైవ వాక్యం నుంచి చూపించండి. ” అవే పరిస్థితుల్లో లూథర్ చేసిన విజ్ఞప్తి కూడా ఇదే. తమ విశ్వాసం విషయమై న్యాయ స్థానాల ముందు సాక్ష్యమిచ్చేవారు సత్యం పక్షంగా బలమైన నిదర్శనం ఇస్తారు. వారి సాక్ష్యం వినే కొందరు ఆజల్ని గైకోటానికి తీర్మానించుకొంటారు. ఈ విధంగా వేలాదిమందికి సత్యం అందుతుంది. వీరికి వేరేవిధంగా సత్యం అందక పోవచ్చు. GCTel 573.2

    దేవుని వాక్యాన్ని మనస్సాక్షితో పాటిస్తే దాన్ని తిరుగుబాటుగా పరిగణిస్తారు. సాతాను కలుగజేసిన గుడ్డితనంలో తల్లిదండ్రులు నమ్ముతున్న బిడ్డల పట్ల కఠినంగా, నిర్దయగా వ్యవహరిస్తారు. యజమాని లేదా యజమానురాలు ఆజ్ఞల్ని గైకొంటున్న సేవకుణ్ణి హింసించటం జరుగుతుంది. ప్రజలు ప్రేమానురాగాల్ని మరచిపోతారు. పిల్లల్ని ఇంటిలో నుంచి తరిమివేస్తారు. పౌలు పలికిన ఈ మాటలు అక్షరాలా నెరవేరాయి, “క్రీస్తుయేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించు వారందరు హింస పొందుదురు” 2 థిమోతి 3:12. సత్యాన్ని సమర్ధించే వారు ఆదివార సబ్బాతును ఆచరించటానికి నిరాకరించగా కొందరిని ఖైదులో వేస్తారు. కొందరిని దేశం నుంచి బహిష్కరిస్తారు. కొందరిని బానిసలుగా మార్చుతారు. మానవ జానానికి ఇవన్నీ అసాధ్యమైన విషయాలుగా ఇప్పుడు కనిపించవచ్చు. కాని అదుపుచేసే తన ఆత్మను మనుషుల నుంచి దేవుడు ఉపసంహరించుకోవటం, దైవ నీతి విధులంటే కిట్టని సాతాను నియంత్రణ కిందికివారు వెళ్లటం, జరిగినప్పుడు విపరీత పరిణామాలు చోటుచేసుకొంటాయి. దైవభీతి, ప్రేమ హృదయంలో లేనప్పుడు హృదయం క్రూరంగా తయారవుతుంది.GCTel 574.1

    తుఫాను దగ్గరకు వచ్చే కొద్దీ మూడో దూత వర్తమానంపై విశ్వాసం ప్రకటించుకొన్నా ఆ సత్యానికి విధేయులై జీవించని వారు ఎందరో దాన్ని విడిచిపెట్టి వైరి పక్షంలో చేరారు. లోకంతో చేయి కలిపి లౌకిక స్వభావాన్ని కలిగి ఆ దృష్టితోనే సమస్త విషయాల్ని పరిగణిస్తారు. పరీక్ష వచ్చినప్పుడు వారు సులువైన ప్రజాసమ్మతమైన, పక్షాన్ని ఎంపిక చేసుకొంటారు. ఒకప్పుడు సత్యంలో ఉండి ఆనందించిన ప్రతిభావంతులు, వక్తలు అయిన వ్యక్తులు ఇప్పుడు ప్రజల్ని మోసగించి తప్పుడు దారి పట్టించటానికి తమ ప్రతిభాపాటవాల్ని ఉపయోగిస్తారు. తమ పూర్వ స్నేహితులు ఇప్పుడు వారికి బద్ధ శత్రువులవుతారు. సబ్బాతును ఆచరించే వారిని తమ విశ్వాసం విషయం ప్రశ్నించేందుకు న్యాయస్థానాల్లో హాజరు పరిచినప్పుడు ఈ భ్రష్ట విశ్వాసులు సాతాసుకు నమ్మిన బంటులుగా వ్యవహరిస్తూ తప్పుడు నివేదికలు నిందలు సృషించి అధికారుల్ని వారి మీదికి ఉసికొలుపుతారు.GCTel 575.1

    ఈ హింసాకాలంలో దైవ సేవకుల విశ్వాసం పరీక్షించబడుతుంది. దేవుని వంక చూస్తూ దైవ వాక్యాన్ని దృష్టిలో ఉంచుకొని వారు నమ్మకంగా హెచ్చరిక చేస్తారు. దేవుని ఆత్మ వారి హృదయాల్లో పనిచేసి మాట్లాడటానికి వారిని బలవంతం చేస్తాడు. దేవుడు తమ కిచ్చిన వాక్యాన్ని ప్రజలకు అందించటం వల్ల కలిగే పర్యవసానాల్ని లెక్క చేయకుండా వారు తమ సత్య ప్రచారసేవను పరిశుద్ధ ఉద్వేగంతో ప్రారంభించారు. తమ లౌకిక పురోగతిని పరిగణనలోకి తీసుకోలేదు. తమ పలుకుబడిని కాపాడుకోటానికి-- ఆ మాటకొస్తే తమ ప్రాణాల్ని కాపాడుకోటానికి--ప్రయత్నించలేదు. అయినా వ్యతిరేకత, నింద తుపానువలె తమపై విరుచుకు పడ్డప్పుడు విస్మయంతో కొంతమంది మా మాటలు ఇంత ప్రమాదం కలిగిస్తాయని ముందే తెలిసివుంటే మేము మాట్లాడే వాళ్లం కాదు” అంటూ సంతాపపడ్డారు. కష్టాలు వారిని చుట్టుముడతాయి. సాతాను వారిపై దుర్భర శోధనలతో దాడి చేస్తాడు. తాము చేపట్టిన కార్యం అసాధ్య కార్యంగా వారికి తోస్తుంది. నాశనం తథ్యం అన్న బెదరింపులు వారికి ఎదురవుతాయి. ఆదిలో వారికున్న ఉద్రేకం మాయమవుతుంది. అయినా వారు వెనక్కు తిరగలేరు. అప్పుడు వారు తపు బలము ఆశ్రయము అయిన ప్రభువు వద్దకు పరుగు పరుగున వెళ్లారు. తాము పలికిన మాటలు తమ మాటలు కావని అవి ఆయన పలుకమన్న హెచ్చరిక మాటలని వారు గుర్తుచేసుకొన్నారు. సత్యాన్ని దేవుడే తమ హృదయాల్లో పెట్టాడు. దాన్ని వారు ప్రకటించకుండా ఉండలేకపోయారు.GCTel 575.2

    గతించిన యుగాల్లో దైవ భక్తులు ఇవే శ్రమల్ని అనుభవించారు. బైబిలు గీటురాయిపై అన్ని సిద్ధాంతాన్ని పరీక్షించాలని బైబిలు ఖండించే సమస్తాన్ని తాము విసర్జిస్తామని విక్లిఫ్, హస్, లూథర్, టిండేల్, బాస్టర్ , వెస్టీలు ప్రబోధించారు. ఈ భక్తులు భయంకర హింసకు గురి అయ్యారు. అయినా సత్యాన్ని ప్రకటించటం మానలేదు. సంఘ చరిత్రలో వివిధ కాలాల్లో ఏదో ప్రత్యేకమైన సత్యం ఆ కాలంలోని దైవ ప్రజల అవసరాలను తీర్చటానికి బయలు పడటం జరిగింది. బయలు పడ్డ ప్రతీ నూతన సత్యం ద్వేషాన్నీ వైరుధ్యాన్ని వ్యతిరేకించింది. అ సత్యవికాసాన్ని పొందినవారు శోధనకు పరీక్షకు గురి అయ్యారు. అత్యవసర పరిస్థితిలో ప్రభువు తన ప్రజలకు ప్రత్యేక సత్యాన్ని అందిస్తాడు. దాన్ని ప్రకటించటానికి ఎవరు నిరాకరించటానికి సాహసిస్తారు? తన కృప చివరి ఆహ్వానాన్ని ప్రపంచానికి అందించుడంటూ ప్రభువు తన ప్రజల్ని ఆదేశిస్తున్నాడు. వారు నిష్కియాపరులై కూర్చొని ఉండరాదు. అదివారి ఆత్మలకు ముప్పు. క్రీస్తు రాయబారులకు పర్యవసానాలతో పనిలేదు. వారు తమ విధిని నిర్వహించి ఫలితాన్ని దేవునికి విడిచిపెట్టాల్సి ఉన్నారు. GCTel 576.1

    వ్యతిరేకత ఉద్ధృతమయ్యేకొద్దీ దైవ సేవకులు కంగారు పడ్డారు. దానికి తామే కారకులమని ఆందోళన చెందుతారు. తామవలంబిస్తున్న మార్గం సరైనదేనని తమ అంతరాత్మ ప్రబోధమూ దైవ వాక్యమూ వారికి సాంత్వన కలిగిస్తాయి. శ్రమలు కొనసాగినా వాటిని భరించటానికి అవసరమైన శక్తిని వారు పొందుతారు. సంఘర్షణ ఉదృతమౌతుంది. దానితోపాటు వారి విశ్వాసం ధైర్యం పెరుగుతాయి. వారు ఈ విధంగా సాక్ష్యమిస్తారు, “దైవధర్మశాస్త్రాన్ని విభజించి దానికి మార్పులు చేయం, లోకం మద్దతు కూడగట్టుకునేందుకు అందులో కొంత భాగం ప్రాముఖ్యమని కొంత భాగం ప్రాముఖ్యం లేనిదని నిర్దేశించం. మేము సేవిస్తున్న ప్రభువు మమ్మల్ని కాపాడాడు. క్రీస్తు లోకంలోని అధికారాన్ని జయించాడు. ఓడిపోయిన లోకానికి మేము భయపడాలా?”GCTel 576.2

    సాతాను ఉనికిలో ఉన్నంతకాలం క్రైస్తవ మతానికి ప్రాబల్యం ఉన్నంతకాలం నానా రూపాల్లోని హింసా సూత్రం కొనసాగుతుంది. అంధకార శక్తులకు వ్యతిరేకంగా పోరాడకుండా ఏ వ్యక్తి దేవునికి సేవలందించలేడు. తమకు దక్కాల్సిన పాపి అతని ప్రభావం వల్ల చేజారిపోతున్నాడన్న దుగ్ధతో ధూర్త దూతలు అతనిపై దాడి చేస్తారు. అతని ఆదర్శ జీవితం దుష్టులకు చెంప పెట్టుగా ఉంటుంది. ఆకర్షణీయమైన శోధనల ద్వారా అతన్ని దేవునికి దూరం చేయటానికి దుష్టులు ఏకమౌతారు. ఇవి విఫలమైనప్పుడు మనస్సాక్షిని ఒత్తిడి చేయటానికి నిర్బంధనాధికారాన్ని ప్రయోగిస్తారు.GCTel 576.3

    అయితే పరలోక గుడారంలో యేసు మానవుడి ఉత్తరవాదిగా ఉన్నంతకాలం పరిశుద్ధాత్మ నిరోధించే ప్రభావం పాలకులపైన ప్రజలపైన ప్రసరిస్తుంది. ఆ ప్రభావం కొంతవరకు దేశశాసనాల్ని ఇంకా అదుపుచేస్తూనే ఉన్నది. ఈ శాసన నియంత్రణే లేకపోతే ప్రపంచ పరిస్థితి ఇంకా ఎంతో దిగజారి పోయేది. మన పరిపాలకుల్లో చాలా మంది సాతాను ప్రతినిధులు కాగా దేశ అగ్రనాయకుల్లో దేవునికి కూడా ప్రతినిధులున్నారు. సాతాను తన అనుచరుల ద్వారా దేవుని పనికి అంతరాయం కలిగించటానికి కృషి చేస్తాడు. దేవునికి భయపడే రాజనీతిజ్ఞులు పరిశుద్ధ దూతల వల్ల ప్రభావితులై అలాంటి ప్రతిపాదనలను తిరుగులేని వాదనలతో వ్యతిరేకిస్తారు. ఈ రకంగా కొంతమంది వ్యక్తులు బలీయమైన దుర్మార్గతను అదుపులో ఉంచుతారు. మూడోదూత వర్తమానం ప్రకటితమయ్యేందుకుగాను సత్యవిరోధుల వ్యతిరేకత అదుపులో ఉంచటం జరుగుతుంది. చివరి హెచ్చరిక ప్రకటితమైనప్పుడు ప్రభువు ఇప్పుడు ఎవరి ద్వారా పని చేస్తున్నాడో ఆ రాజనీతిజ్ఞుల గమనాన్ని అది ఆకర్షిస్తుంది. వారిలో కొందరు ఆ హెచ్చరికను అంగీకరించి శ్రమలు కలిగే సమయంలో దైవ ప్రజలతో నిలబడ్డారు.GCTel 577.1

    మూడో దూత వర్తమానాన్ని ప్రకటించే దూత తన మహిమతోను వెలుగుతోను లోకాన్ని నింపవలసి ఉన్నాడు. ఈ వర్తమానంలో ప్రపంచవ్యాప్త సేవా పరిధి, అపూర్వ శక్తి ప్రవచితమయ్యా యి. 1840-44 లోని ఆగమన వర్తమాన ప్రకటన దేవుని మహాశక్తిని ప్రదర్శించింది. మొదటి దూత వర్తమానం లోకంలో ప్రతీ సువార్త కేంద్రానికీ చేరింది. కొన్ని దేశాల్లో గొప్ప మతాసక్తి రేకెత్తింది. సంస్కరణోద్యమం తర్వాత ఇలాంటి మతాసక్తి మరెన్నడూ కనిపించలేదు. కాగా మూడో దూత హెచ్చరికా వర్తమాన ఫలితంగా లేచే ఉద్యమం వీటన్నిటినీ మించిపోతుంది.GCTel 577.2

    ఈ కార్యం పెంతెకొస్తునాడు జరిగిన కార్యాన్ని పోలి ఉంటుంది. ఎంతో విలువైన విత్తనాలు మొలకెత్తేందుకు సువార్త ఆరంభంలో తొలకరి వర్షము” వచ్చినట్లు, సువార్త పరిసమాప్తి తరుణంలో పంటను కోతకు సిద్ధపర్చేందుకు “కడవరి వర్షము” వస్తుంది. “యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదము రండి. ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును. వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. ” హోషేయ 6:3. “సీయోను జనులారా, ఉత్సహించి మీ దేవుడైన యెహోవాయందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందువలె తొలకరి వర్షమును కడవరి వరమును మీకనుగ్రహించును” యోవేలు 2:23. “అంత్యదినముల యందు నేను మనుష్యులందరిమీద నా ఆత్మను కుమ్మరించెదను” “అప్పుడు ప్రభువు నామమునుబట్టి ప్రార్ధన చేయు వారందరును రక్షణ పొందుదురు” అ.కా. 2:17-21.GCTel 577.3

    సువార్తసేవ ఆరంభంలో ఎంత బ్రహ్మాండంగా దైవశక్తి ప్రదర్శితమయ్యిందో దాని అంతంలోనూ అంత బ్రహ్మాండంగా అది ప్రదర్శితం కానుంది. సువార్త సేవ ఆరంభంలో తొలకరి వర్షంతో నెరవేరిన ప్రవచనాలు సువార్త సమాప్తిలో కడవరి వర్షంతో మళ్లీ నెరవేరాయి. “ప్రభువు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చునట్లు మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనస్సునొంది తిరుగుడి” అంటూ పేతురు ప్రస్తావిస్తున్న “విశ్రాంతి కాలములు” ఇవే. అ.కా. 3:19, 20. పరిశుద్ధ సమర్పణతో ప్రకాశిస్తున్న ముఖాలతో దేవుని వంక చూస్తూ దేవుడు తమ కిచ్చిన వర్తమానాన్ని ప్రకటిస్తూ దైవ సేవకులు గ్రామాలు, పట్టణాలు తిరుగుతారు. భూమండలమంతా వేలాది గళాలు హెచ్చరికా వర్తమానం ప్రకటిస్తాయి. అద్భుతాలు చోటుచేసుకొంటాయి. రోగులు స్వస్తత పొందుతారు. ఎక్కడకు వెళ్లినా విశ్వాసులు సూచనలు అద్భుతాలు చూస్తారు. సాతాను కూడా మోసపూరితమైన గొప్ప అద్భుతాలు చేస్తాడు. మనుషులు చూస్తుండగా ఆకాశం నుంచి అగ్ని కురిపిస్తాడు. ప్రకటన 13:13. ఈ విధంగా భూనివాసులు తమ నిర్ణయం ఏమిటో తెల్సుకోవాల్సి ఉంది.GCTel 578.1

    ఈ వర్తమాన సాఫల్యం వాదన ద్వారా కాక దేవుని ఆత్మ పనిద్వారా కలిగే ప్రగాఢ విశ్వాసం ద్వారానే సాధ్యమౌతుంది. వాదనల వ్యక్తీకరణ జరిగింది. విత్తనం నాటటం జరిగింది. ఇప్పుడది మొలిచింది. ఫలాలు ఫలించాల్సి ఉంది. మిషనెరీ సేవలందించే పనివారు తమ ప్రభావాన్ని ప్రసరించారు. అయినా సత్యాన్ని విశ్వసించిన వారిలో చాలా మంది సత్యాన్ని అవగాహన చేసుకొని ఆచరించటానికి వచ్చే సరికి ఆటంకాలు అభ్యంతరాలు ఏర్పడుతున్నాయి. ఇప్పుడు సత్యకిరణాలు అన్నిచోట్లకు చొచ్చుకు పోతున్నాయి. సత్యం ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది. నిజాయితీ పరులైన దేవుని బిడ్డలు తమ చేతుల్ని బంధిస్తున్న శృంఖలాల్ని బద్దలు కొడారు. కుటుంబ బంధాలు, సంఘ సంబంధాలు వారిని ఇక ఆపలేవు. సత్యం అన్నిటికన్నా ప్రశస్తమవుతుంది. సత్యాన్ని వ్యతిరేకిస్తున్న శక్తులు సంఘటితమైనప్పటికీ పెద్ద సంఖ్యలో ప్రజలు దేవుని పక్క నిలబడటానికి నిశ్చయించుకొంటారు.GCTel 578.2

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents