Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
మహా సంఘర్షణ - Contents
 • Results
 • Related
 • Featured
No results found for: "".
 • Weighted Relevancy
 • Content Sequence
 • Relevancy
 • Earliest First
 • Latest First

  అధ్యాయం 41—జనులులేని భూమి

  “దాని పాపములు ఆకాశము నంటుచున్నవి. దాని నేరములు దేవుడు జ్ఞాపకము చేసికొని యున్నాడు... అది కలిపిన పాత్రలో దాని కొరకు రెండంతలు కలిపి పెట్టుడి. అది--నేను రాణినిగా కూర్చుండు దానను, నేను విధవరాలను కాను, దుఃఖము చూడనే చూడనని తన మనస్సులో అనుకొనెను గనుక, అది తన్నుతాను ఎంతగా గొప్ప చేసికొని సుఖభోగములను అనుభవించెనో అంతగా వేదనను దుఃఖమును దానికి కలుగజేయుడి. అందుచేత ఒక్క దినముననే దాని తెగుళ్ళు అనగా మరణమును దుఃఖమును కరవును వచ్చును. దానికి తీర్పు తీర్చుచున్న దేవుడైన ప్రభువు బలిష్టుడు గనుక అగ్నిచేత బొత్తిగా కాల్చివేయబడును. దానితో వ్యభిచారము చేసి సుఖభోగములను అనుభవించిన భూరాజులు దాని బాధ చూచి... దాని విషయమై రొమ్ము కొట్టుకొనుచు ఏడ్చుచు- అయ్యో, అయ్యో బబులోను మహాపట్టణమా, బలమైన పట్టణమా, ఒక్క గడియలోనే సీకు తీర్పు వచ్చెను గదా అని చెప్పుకొందురు” ప్రకటన 18:510.GCTel 618.1

  “పట్టణము చేత ధనవంతులైన యీ సరకుల వర్తకులు ఏడ్చుచు, దుఃఖపడుచుఅయ్యో, అయ్యో, సన్నపు నారబట్టలను, ధూమ్ర, రక్తవర్ణపు వస్త్రములను ధరించుకొని, బంగారముతోను, రత్నములతోను, ముత్యములతోను అలంకరింపబడిన మహా పట్టణమా, యింత ఐశ్వర్యము ఒక్క గడియలోనే పాడైపోయెనే అని చెప్పుకొనుచు దాని బాధను చూచి భయాక్రాంతులై దూరముగా నిలుచుందురు” ప్రకటన 18:15,16.GCTel 618.2

  దేవుని ఉగ్రత ప్రదర్శితమయ్యే దినాన బబులోను మీద పడే దేవుని తీర్పులు అలాంటివి. అది తన దుర్మార్గ పాత్రను నింపుకొంటున్నది. దాని సమయం వచ్చింది. అది నాశనానికి సిద్ధంగా ఉంది.GCTel 618.3

  తన ప్రజల చెర దేవుని స్వరంతో విడిపోయినప్పుడు జీవిత సంఘర్షణలో సర్వస్వాన్ని కోల్పోయిన వారికి గొప్ప మేల్కొలుపు కలుగుతుంది. కృపకాలం కొనసాగినప్పట్లో వారు సాతాను మోసాలవల్ల కన్నుగానక ఉన్నారు. తమ పాప మార్గాన్ని సమర్ధించుకొన్నారు. ఉన్న వారు లేనివారిపై ఆధిపత్యం చెలాయించారు. అయితే వారి ధనం దైవ ధర్మశాస్త్రాన్ని మార్చి సంపాదించిందే. అన్నం లేనివారికి అన్నం పెట్టటం, బట్టలు లేనివారికి బట్టలివ్వటం, న్యాయంగా వ్యవహరించటం, దయ కనికరాలు చూపించటం వారు నిర్లక్ష్యం చేశారు. తమను తాము హెచ్చించుకొని సాటిమానవులతో బ్రహ్మరధం పట్టించుకోటానికి తాపత్రయ పడ్డారు. ఇప్పుడు తమను గొప్ప చేసినదంతా పోయింది. వారిప్పుడు పేదలు, అనాధలు. సృష్టికర్తకన్నా తాము ఎక్కువగా ఎంచుకొన్న విగ్రహాలు నాశనం కావటాన్ని చూసి భయకంపితులవుతారు. ధనం కోసం లౌకిక సుఖ భోగాలకోసం వారు తమ ఆత్మల్ని అమ్ముకొన్నారు. దేవుని సంగతులవిషయంలో వారు ధనవంతులు కాలేదు. ఫలితంగా వారి బతుకులు పరాజయం పాలయ్యాయి. వారి విలాసాలిప్పుడు చేదు అనుభవాలయ్యాయి. వారి ధనం క్షీణించి పోయింది. జీవితకాలమంతా కూడబెట్టిన దంతా కృటిలో మాయమయ్యింది. భాగ్యవంతులు నాశనమైన తమ విలాస గృహాల గురించి చింతిస్తారు. తాము కోల్పోయిన వెండి బంగారాల కోసం విలపిస్తారు. తమ విగ్రహాలతో పాటు తావమూ నాశనమవ్వటం ఖాయవుని గ్రహించినప్పుడు వారి విలాసాలు ఆగిపోతాయి.GCTel 619.1

  దుష్టుల్లో సంతాపం కనిపిస్తుంది. అది దేవుని నిర్లక్ష్యం చేసినందుకు గాని తోటి మానవుల్ని లక్ష్యపెట్టనందుకుగాని కాదు. దేవుడు గెల్చినందుకు దాని ఫలితం గురించి సంతాపపడ్డారు. తమ దుర్మార్గతను గురించి సంతాపపడరు. జయం సాధించటానికి ఏ నూతన మారాన్నైనా అవలంబించటానికి వెనకాడరు. తెగులు, తుపాను, భూకంపం సంభవించినప్పుడు తాము ఏ వర్గం ప్రజల్ని ఎగతాళి చేసి దూషించి నిర్మూలించగోరారో ఆ ప్రజలకు ఏ హాని కలగకపోవటం లోకం చూస్తుంది. తన ధర్మశాస్త్రాన్ని అతిక్రమించే వారికి ఎవరు దహించే అగ్నివంటివాడో ఆ ప్రభువు తన ప్రజలకు సురక్షిత పర్ణశాలై ఉంటాడు.GCTel 619.2

  మనుషుల మెప్పు పొందటానికి సత్యాన్ని బలి ఇచ్చిన బోధకుడు తన బోధల దుష్ప్రభావాన్ని ఇప్పుడు గ్రహిస్తాడు. అతను ప్రసంగ వేదికపై నిలబడ్డప్పుడు, వీధుల్లో నడిచినప్పుడు బతుకు బాటలో ఆయావ్యక్తులతో కలిసి తిరిగినప్పుడు సర్వజ్ఞుడైన దేవుని కన్ను అతన్ని వెంబడిస్తున్నదన్నది స్పష్టం.GCTel 619.3

  ప్రతీ ఉద్రేకం, రాసిన ప్రతీ వాక్యం, పలికిన ప్రతీమాట, అబద్ధంలో ఆశ్రయం పొందటానికి నడిపించే ప్రతీ క్రియ దాని విత్తనాన్ని వెదజల్లుతుంది. ఇప్పుడు తన చుట్టూ పడి ఉన్న ఆత్మలలో అది దాని పంటను అది బయలుపర్చుతుంది.GCTel 620.1

  ప్రభువిలా అంటున్నాడు, “సమాధానము లేని సమయమున- సమాధానము సమాధానము అని వారు చెప్పుచు జనుల గాయమును పైపైన మాత్రమే బాగుచేయుదురు”. “నేను దుఃఖపరచని నీతిమంతుని మనస్సును అబద్ధములచేత మీరు దుఃఖింపజేయుదురు, దుర్మార్గులు తమ దుష్ప్రవర్తన విడిచి తమ ప్రాణములను రక్షించుకొనకుండ మీరు వారిని ధైర్యపరతురు” యిర్మీయా 8:11; యెహేజ్కేలు 13:20.GCTel 620.2

  “నామందలో చేరిన గొట్టెలను నశింపజేయుచు చెదరగొట్టు కాపరులకు శ్రమ... ఇదిగో మీ దుష్క్రియలను బట్టి మిమ్మును శిక్షింపబోవుచున్నాను”, “మంద కాపరులారా, గోలలెత్తుడి, మొఱ్ఱపెట్టుడి, మందలో ప్రధానులారా, బూడిద చల్లుకొనుడి. మీరు మరణము నొందుటకై దినములు పూర్తియాయెను. నేను మిమ్మును చెదరగొట్టెదను... మందకాపరుల మొట్ట వినబడుచున్నది, మందలోని ప్రధానుల గోల వినబడుచున్నది.” యిర్మీయా 23:1,2; 25:34,35.GCTel 620.3

  తమకు దేవునితో సరియైన సంబంధం లేదని బోధకులు ప్రజలు గ్రహిస్తారు. న్యాయచట్టాలకు, నీతి శాసనాలకు కర్త అయిన దేవునికి తాము ఎదురు తిరుగుతున్నట్లు గుర్తిస్తారు. దేవుని నీతిసూత్రాలను తోసిరాజనటం వల్లమాలిన దుర్మారతకు, అసమ్మతికి, విద్వేషానికి, అన్యాయానికి దారి తీసి లోకాన్ని యుద్ధభూమిగాను అవినీతి కాసారంగాను మార్చివేస్తున్నది. సత్యాన్ని తిరస్కరించి అసత్యాన్ని ప్రేమించటానికి నిర్ణయించుకొన్న వారు ఈ దృక్పథం కలిగి ఉన్నట్లు కనిపిస్తున్నది. తాము చేజేతులా పోగొట్టుకొన్న నిత్య జీవం కోసం అవిధేయులు అపనమకస్తులు ఎంతగా ఆశిస్తారో వర్ణించటం సాధ్యం కాదు. తమ ప్రతిభా పాటవాల్ని వాక్చాతుర్యాన్ని ఇప్పుడు చిత్తశుద్ధితో పరిగణిస్తారు. దేవుని ధర్మశాసనాల్ని అతిక్రమించినందున తాము పోగొట్టుకొన్నదేంటో తెలుసుకొంటారు. తాము ఎవరి భక్తి విశ్వాసాల్ని చులకన చేసి గేలిచేశారో ఆ భక్తుల పాదాలపై పడి దేవుడు తమను ప్రేమిస్తున్నాడని ఒప్పుకొంటారు.GCTel 620.4

  తాము మోసపోయినట్లు ప్రజలు గ్రహిస్తారు. మీరు మమ్మల్ని నాశనం చేశారంటే మీరు మమ్మల్ని నాశనం చేశారని వారు పరస్పరం నిందించుకొంటారు. అయితే అందరూ కలిసి తమ తమ బోధకుల్ని తీవ్రంగా అభిశంసిస్తారు. తప్పుడు పాదుర్లు అంతా సవ్యంగా ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు. దైవ ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించటానికి, దాన్ని పరిశుద్ధంగా ఆచరించే ప్రజలను హింసించటానికి ఆ పాదుర్లు వారిని నడిపించారు. ఇప్పుడు ఈ బోధకులు తాము చేసిన మోసాన్ని ప్రపంచం ఎదుట ఒప్పుకొంటారు. ప్రజలు కోపోద్రిక్తులవుతారు. “మేము నశించిపోతున్నాము, మా నాశనానికి మీరే హేతువు” అంటూ అబద్ధ కాపరులపై తిరగబడ్డారు. ఒకప్పుడు తమను ఎంతో అభిమానించిన ప్రజలే వారిపై భయంకర శాపాలు ప్రకటిస్తారు. ఒకప్పుడు తమకు కీర్తి కిరీటం తొడగటానికి ఎత్తిన చేతులే ఇప్పుడు వారిని మొత్తటానికి పైకిలేస్తాయి. దైవ ప్రజల్ని చంపటానికి ఏర్పాటైన కత్తులు వారి శత్రువుల్ని నిర్మూలించటానికి ఇప్పుడు ఉపయుక్తమౌతున్నాయి. ఎక్కడ చూసినా పోరాటమే. ఎక్కడ చూసినా రక్తపాతమే.GCTel 621.1

  “భూమ్యంతము వరకు సందడి వినబడును. యెహోవా జనములతో వ్యాజ్యెమాడు చున్నాడు. శరీరులందరితో ఆయన వ్యాజ్యెమాడు చున్నాడు. ఆయన దుష్టులను ఖడమునకు అప్పగించుచున్నాడు.” యిర్మీయా 25:31. ఈ అపూర్వ సంఘర్షణ ఆరువేల ఏళ్లుగా జరుగుతున్నది. మానవుల్ని హెచ్చరించి, చైతన్యపర్చి, రక్షించటానికి గాను దైవ కుమారుడు పరలోక దూతలు సాతానుతో తలపడి పోరాడుతున్నారు. ఇప్పుడు అందరూ తమ తీర్మానాలు చేసుకొన్నారు. దేవునితో సాతాను చేస్తున్న సమరంలో దుర్మారులు సాతానుతో చేయి కలిపి పోరాడున్నారు. కాళ్లతో తొక్కబడున్న తన ధర్మశాస్త్రాన్ని దేవుడు ధ్రువీకరించటానికి సమయం వచ్చింది. ఈ మహాసంఘర్షణ సాతానుతో మాత్రమే కాదు. మనుషులతో కూడా. “యెహోవా జనములతో వ్యాజ్యెమాడు చున్నాడు.”GCTel 621.2

  “జరిగిన హేయ కృత్యములను గూర్చి మూల్గులిడుచు ప్రలాపించుచున్న వారి” పై విడుదల ముద్రపడుతుంది. యెహేజ్కేలు దర్శనంలో హతం చేసే ఆయుధాలు ధరించిన మనుషులు మరణ దూతను సూచిస్తున్నారు. ఇప్పుడు ఆ మరణ దూత ఈ ఆదేశంతో బయలుదేరతాడు. “నా పరిశుద్ధ స్థలము దగ్గర మొదలుపెట్టి అందరు నశించునట్లు ఎవరిని విడిచిపెట్టక, పెద్దవారిని, చిన్నవారిని, కన్యకలను, పిల్లలను, స్త్రీలను చంపవలెను గాని ఆ గురుతు ఎవరి కుండునో వారిని ముట్టకూడదు”. ప్రవక్త ఇలా అంటున్నాడు, “వారు మందిరము ముందరనున్న పెద్దలను హతము చేయ మొదలు” పెట్టారు. యెహేజ్కేలు 9:16. సంహరణ ప్రక్రియ ప్రజల ఆధ్మాత్మిక సంఘర్షకులుగా చెప్పుకొనే వారితో ప్రారంభమౌతుంది. అబద్ధబోధకులు ముందు కూలిపోతారు. దయచూపాల్సిన వారూ, విడిచిపెట్టాల్సిన వారూ ఎవరూ ఉండరు. పురుషులు, స్త్రీలు, కన్యలు, చిన్నపిల్లలు అందరూ కలిసి నశిస్తారు.GCTel 621.3

  “వారి దోషమును బట్టి భూనివాసులను శిక్షించుటకు యెహోవా తన నివాసములో నుండి వెడలి వచ్చుచున్నాడు. భూమి తన మీద చంపబడిన వారిని ఇకను కప్పకుండ తాను త్రాగిన రక్తమును బయలు పరచును” యెషయా 26:20. “మరియు యెహోవా తెగుళ్ళు పుట్టించి యెరూషలేము మీద యుద్ధము చేసిన జనములందరిని ఈ లాగున మొత్తును. వారు నిలిచియున్న పాటుననే వారి దేహములు కుళ్లిపోవును, వారి కన్నులు కను తొజ్జలలో నుండియే కుళ్ళిపోవును. వారి నాలుకలు నోళ్లలో నుండియే కుళ్ళిపోవును. ఆ దినమున యెహోవా వారిలో గొప్ప కల్లోలము పుట్టింపగా వారందరు ఒకరికొకరు విరోధులై ఒకరిమీద నొకరు పడుదురు.” జెకర్యా 14:12,13. రెచ్చిపోయిన తమ పిచ్చి ఉద్రేకాలతోను దేవుని ప్రచండమైన ఉగ్రత కుమ్మరింపుతోను జరిగే పోరాటంలో లోకంలోని దుర్మారులు-- యాజకులు, పరిపాలకులు, ప్రజలు, ధనికులు, దరిద్రులు, అధికులు, అధములు-- అందరూ నేలకూలతారు. “ఆ దినమున యెహోవా చేత హతులైన వారు ఈ దేశము యొక్క యీ దిశనుండి ఆ దిశవరకు కనబడుదురు. ఎవరును వారిని గూర్చి అంగలార్చరు, వారిని సమకూర్చరు, పాతిపెట్టరు” యిర్మీయా 25:33.GCTel 622.1

  యేసు రాక సమయంలో దుష్టులు ఇక భూమి మీద లేకుండా సర్వనాశనమౌతారు. ఆయన నోటి ఊపిరివల్ల ఆయన మహిమా ప్రకాశత వల్ల నాశనమౌతారు. క్రీస్తు తన ప్రజల్ని దేవుని పట్టణానికి తీసుకు వెళ్తాడు. ఇక భూమిమీద మనుషులుండరు. “యెహోవా దేశమును వట్టిదిగా చేయుచున్నాడు. ఆయన దాని పాడుచేసి కల్లోల పరచుచున్నాడు. దాని నివాసులను చెదరగొట్టుచున్నాడు.” “దేశము కేవలము వట్టిదిగా చేయబడును. అది కేవలము కొల్లసొమ్మగును. యెహోవా ఈలాగు సెలవిచ్చి యున్నాడు.” “లోకవాసులు ధర్మశాసనములను అతిక్రమించి యున్నారు. కట్టడను మార్చి నిత్యనిబంధనను మరియున్నారు. దాని నివాసులచేత లోకము అపవిత్రమాయెను. శాపము దేశమును నాశనము చేయుచున్నది. దాని నివాసులు శిక్షకు పాత్రులైరి దేశ నివాసులు కాలిపోయిరి. శేషించిన మనుష్యులు కొద్దిగానే యున్నారు.” యెషయా 24:1,3,5,6. GCTel 622.2

  భూమి జనులులేక అరణ్యంలా ఉంటుంది. భూకంపం వల్ల ధ్వంసమైన నగరాలు, గ్రామాలు, వేరులతో ఊడిపడి ఉన్న చెట్లు, సముద్రం విసిరిపడేసిన కరకు రాతిబండలు భూమి అంతటా చెదరిపడి ఉంటాయి. పునాదులతో లేచిపడ్డ పర్వతాల కుదుళ్ళలో విస్తారమైన సొరంగాలు ఏర్పడ్డాయి.GCTel 623.1

  ప్రాయశ్చిత్తార దినాన జరిగిన చివరి గంభీర పరిచర్యకు ఛాయ అయిన సంఘటన ఇప్పుడు జరుగుతుంది. అతిపరిశుద్ధ స్థలంలోని పరిచర్య పూర్తి అయిన మీదట పాపపరిహారార్ధ బలి ద్వారా ఇశ్రాయేలీయుల పాపాల్ని గుడారంలో నుంచి తొలగించిన తర్వాత విడిచిపెట్టబడే మేకను ప్రధాన యాజకుడు దేవుని సమక్షంలోకి సజీవంగా తెచ్చేవాడు. అంతట ప్రధాన యాజకుడు సమాజం సమక్షంలో దాని మీద పాపాలు ఒప్పుకొని “ఇశ్రాయేలీయుల పాపములన్నియు అనగా వారి దోషములన్నియు వారి అతిక్రమములన్నియు... ఆ మేక తలమీద” మోపేవాడు. లేవీ కాండము 6:21. అదే విధంగా పరలోక గుడారంలోని పరిచర్య ముగియగానే దేవుని సమక్షంలోనూ పరలోక దూతల సమక్షంలోను విమోచన పొందినవారి సమక్షంలోనూ దైవ ప్రజల పాపాలు సాతానుమీద మోపటం జరుగుతుంది. వారు చేసిన పాపాలన్నింటికీ కారకుడు అతనే అని సౌతానుని అపరాధిగా ప్రకటించటం జరుగుతుంది. విడిచిపెట్టే మేకను అరణ్యంలో విడిచి పెట్టిన రీతిగా సాతాను జనులులేని భూభాగానికి బహిష్కృ తుడవుతాడు.GCTel 623.2

  ప్రకటన గ్రంధ రచయిత సాతాను బహిష్కృతిని గురించి ఈ భూమికి సంభవించే అస్తవ్యస్త, జనరహిత, అరణ్య సదృశ పరిస్థితి గురించి ముందే వివరించాడు. ఈ పరిస్థితి వెయ్యి సంవత్సరాలపాటు ఉంటుందని అంటున్నాడు. ప్రభువు రెండోరాకడ, దుష్టుల నాశన సన్నివేశాలను చిత్రించిన తర్వాత ప్రవచనం ఇంకా ఇలా వచిస్తున్నది. “మరియు పెద్ద సంకెళ్లను చేతపట్టుకొని అగాధము యొక్క తాళపు చెవి గల యొక దూత పరలోకమునుండి దిగివచ్చుట చూచితిని. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘటసర్పమును పట్టుకొని వెయ్యి సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి ఆ వెయ్యి సంవత్సరములు గడచువరకు ఇక జనులను మోసపరచ కుండునట్లు అగాధమును మూసి దానికి ముద్రవేసెను. అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచి పెట్టబడవలెసు” ప్రకటన 20:1-3.GCTel 623.3

  ఈ “అగాధం” అస్తవ్యస్త పరిస్థితిలో చీకటి కోనగా మిగిలే భూమిని సూచిస్తున్నట్లు ఇతర లేఖనాలు చెబుతున్నాయి. భూమి పరిస్థితి గురించి అది “నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలములపైన కమ్మియుండెను” అని బైబిలు చెబుతున్నది. ఆదికాండము 1:2. భూమి మళ్లీ ఈ స్థితికి వస్తుందని-- కనీసం పాక్షికంగానైనా-- ప్రవచనం వచిస్తున్నది. దేవుని మహాదినం కోసం ఎదురు చూస్తూ యిర్మీయా ప్రవక్త ఇలా అంటున్నాడు, “నేను భూమిని చూడగా అది నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, ఆకాశము తట్టు చూడగా అచ్చట వెలుగు లేకపోయెను. పర్వతములను చూడగా అవి కంపించుచున్నవి. కొండలన్నియు కదులు చున్నవి. నేను చూడగా నరుడొకడును లేకపోయెను, ఆకాశపక్షులన్నియు ఎగిరిపోయి యుండెను. నేను చూచుచుండగా ఫలవంతమైన భూమి ఎడారి ఆయెను. అందులోని పట్టణములన్నియు యెహోవా కోపాగ్నికి నిలువలేక ఆయన యెదుట నుండకుండ పడగొట్టబడి యుండెను.” యిర్మీయా 4:23-26.GCTel 624.1

  సాతానుకూ అతని దుష్టదూతలకు వెయ్యి సంవత్సరాలు ఇదే నివాసస్థలం కాబోతుంది. భూమికే పరిమితం కావటం వల్ల పాపంలో పడకుండా ఉన్న ఇతర లోకాలకు ఇతర లోకాలకు వెళ్లి వారిని శోధించటానికి బాధించటానికి అతనికి అవకాశం ఉండదు. అతను బందీ కావటం ఈ అర్ధంలో.. తన శక్తియుక్తుల్ని ఉపయోగించి మోసగించటానికి ఎవరూ ఉండరు. యుగయుగాలు తనకెంతో ఆనందాన్నిచ్చిన వంచన కార్యకలాపాలు ఇక సాగవు. వాటికి తెరపడుతుంది.GCTel 624.2

  సాతాను వినాశన సమయానికి గంపెడు ఆశతో ఎదురుచూస్తూ యెషయా ప్రవక్త ఇలా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాడు, “తేజోనక్షత్రమా, వేకువ చుక్కా, నీవెట్లు ఆకాశమునుండి పడితివి? జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లు నరకబడితివి? నేను ఆకాశమున కెక్కిపోయెదను దేవుని నక్షత్రమునకు పైగా నా సింహాసనమును హెచ్చింతును...మహోన్నతునితో నన్ను సమానునిగా చేసికొందును. అని నీవు నీ మనస్సులో అనుకొంటివి గదా? నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే, నిన్ను చూచువారు, నిన్ను నిదానించి చూచి ఇట్లు తలపోయుదురుః భూమిని కంపింపజేసి రాజ్యములను వణకించిన వాడు ఇతడేనా? లోకమును అడవిగాచేసి దాని పట్టణములను పాడుచేసిన వాడు ఇతడేనా? తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలమునకు పోనియ్యని వాడు ఇతడేనా?” యెషయా 14:12-17.GCTel 624.3

  ఆరువేల సంవత్సరాలుగా సాతాను తిరుగుబాటు కార్యాలు “భూమిని కంపింప” జేస్తున్నాయి. అతను “లోకమును అడవిగాచేసి దాని పట్టణములను పాడు” చేస్తున్నాడు. “తాను చెరపట్టినవారిని తమ నివాస స్థలమునకు పోనియ్య” టంలేదు. ఆరువేల సంవత్సరాలుగా అతని చెరసాల దైవ ప్రజల్ని బందీలు చేస్తూ వచ్చింది. వారిని నిత్యమూ బందీలుగా ఉంచటమే అతని సంకల్పం. అయితే క్రీస్తు అతని చెర నుంచి బందీలను విడిపిస్తాడు.GCTel 625.1

  ఇప్పుడు దుష్టులు సైతం సాతాను వశంలో ఉండరు. తాను తన దూతలు మాత్రమే మిగిలి ఉంటారు. పాపం తెచ్చిన శాపపర్యవసాల్ని గ్రహిస్తూ ఉంటారు. “జనముల రాజు లందరు ఘనత వహించినవారై తమ తమ నగరులయందు నిద్రించుచున్నారు. నీవు సమాధి పొందక పారవేయబడిన కొమ్మనలె నున్నావు...నీవు నీ దేశమును పాడుచేసి నీ ప్రజలను హతమార్చితివి. నీవు సమాధిలో వారితో కూడ కలిసియుందువు” యెషయా 14:18-20.GCTel 625.2

  దైవ ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా తాను చేసిన తిరుగుబాటు ఫలితాల్ని వీక్షించటానికి ఈ నిర్జన భూగోళంపై సాతాను వెయ్యి సంవత్సరాలు ఇటూ అటూ సంచరిస్తాడు. ఈ కాలంలో అతని శ్రమలు తీవ్రంగా ఉంటాయి. పాపంలో పడిన నాటి నుంచి సాతాను సాగించిన అవిశ్రాంత ఉద్యమం ఆలోచించుకోటానికి అతనికి సమయం మిగల్చలేదు. ఇప్పుడు అతనికి అధికారం లేదు. దైవ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు ప్రారంభించిన నాటినుంచి తాను నిర్వహించిన పాత్రను గురించి తన ముందున్న భయంకర భవిషత్తును తాను చేసిన చెడు అంతటికి తాను చేయించిన పాపాలన్నింటికీ అనుభవించవలసిన శిక్షను గురించి దీర్ఘంగా ఆలోచించటానికి ఇప్పుడతనికి కావలసినంత సమయం ఉంటుంది.GCTel 625.3

  సాతాను బందీ కాపటం దైవ ప్రజలకు ఉత్సాహానందాలు కలిగిస్తుంది. ప్రవక్త ఇలా అంటున్నాడు, “నీ బాధను, నీ ప్రయాసమును నీచేత చేయింపబడిన కఠిన దాస్యమును కొట్టివేసి యెహోవా నిన్ను విశ్రమింపజేయు దినమున నీవు బబులోను రాజునుగూర్చి అపహాస్య గీతము... పాడుదువు...దుష్టుల దుడ్డుకట్టను మాసని హత్యచేత జనులను క్రూరముగా కొట్టిన ఏలికల రాజదండమును యెహోవా విరుగగొట్టియున్నాడు. వారు ఆగ్రహపడి మానని బలాత్కారము చేత జనములను లోపరచిరి” 3-6 వచనాలు ఆర్.వి.GCTel 625.4

  మొదటి పునరుత్థానం రెండో పునరుత్థానం మధ్య ఉన్న వెయ్యేళ్ల కాలంలో దుర్మార్గుల తీర్పు జరుగుతుంది. ఈ తీర్పును రెండోరాక వెనుక జరిగే సంభవంగా అపోస్తలుడైన పౌలు సూచిస్తున్నాడు. “సమయము రాక మునుపు ప్రభువు వచ్చువరకు, దేనిని గూర్చియు తీర్పు తీర్చకుడి. ఆయన అంధకార మందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరచునప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును.” 1కొరింథి 4:5. ఆ మహావృద్ధుడు వచ్చినప్పుడు “మహోన్నతుని పరిశుద్దుల విషయములో తీర్పు” తీర్చబడుతుంది అని దానియేలు వ్యక్తం చేస్తున్నాడు. దానియేలు 7:22. ఈ సమయంలో నీతిమంతులు రాజులు యాజకులుగా పరిపాలన చేస్తారు. ప్రకటనలో యోహానిలా అంటున్నాడు, “అంతట సింహాసనములను చూచితిని, వాటిమీద ఆసీనులై యుండువారికి విమర్శ చేయుటకు అధికారమియ్యబడెను. వీరు “దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడ వెయ్యి సంవత్సరములు రాజ్యము చేయుదురు.” ప్రకటన 20:46. పౌలు ప్రవచించిన రీతిగా ఈ సమయంలో పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురు.” 1 కొరింథి 6:2. వారు క్రీస్తుతో కలసి దుష్టులకు తీర్పు తీర్చుతారు. అనంతరం దుష్టులు పొందవలసిన శిక్షను వారి వారి క్రియలను బట్టి నిర్ణయిస్తారు. దానిని మరణ గ్రంథంలో వారి పేరులకు ఎదురుగా దాఖలు చేస్తారు.GCTel 626.1

  సాతానుకు అతని దుష్టదూతలకు క్రీస్తు ఆయన పరిశుద్ధ ప్రజలు తీర్పు తీర్చుతారు. “మనము దేవదూతలకు తీర్పుతీర్చుదుమని ఎరుగరా?” అంటున్నాడు పౌలు. 3 వ వచనం. “తమ నివాసస్థలమును విడిచిన దేవదూతలను మహదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్యపాశముతో ఆయన బంధించి భద్రముచేసెను” అంటున్నాడు భక్తుడు యూదా. యూదా 6.GCTel 626.2

  వెయ్యేండ్ల కాలం పూర్తి అయిన వెంటనే రెండో పునరుత్థానం జరుగుతుంది. అప్పుడు దుర్మార్గులు సమాధులలో నుంచి లేస్తారు. పుస్తకాల్లో దాఖలైన తీర్పును పొందటానికి వారు దేవుని ముందు నిలబడ్డారు. పరిశుద్ధుల పునరుత్సానాన్ని వర్ణించిన అనంతరం ప్రకటన రచయిత ఇలా అంటున్నాడు, “ఆ వెయ్యి సంవత్సరములు గడచువరకు కడమ మృతులు బ్రతుకలేదు” ప్రకటన 20:5. దుర్మార్గుల్ని గూర్చి యెషయా ఇలా అంటున్నాడు, “చెరపట్టబడినవారు గోతిలో చేర్చబడునట్లుగా వారు చేర్చబడి చెఱసాలలో వేయబడుదురు. బహు దినములైన తరువాత వారు దర్శింపబడుదురు” యెషయా 24:22.GCTel 626.3