Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
మహా సంఘర్షణ - Contents
 • Results
 • Related
 • Featured
No results found for: "".
 • Weighted Relevancy
 • Content Sequence
 • Relevancy
 • Earliest First
 • Latest First
  Larger font
  Smaller font
  Copy
  Print
  Contents

  అధ్యాయం 16—యాత్రిక పితరులు

  ఇంగ్లిష్ సంస్కర్తలు రోము మతతత్వ సిద్ధాంతాలను త్యజించినా ఆ మతాచారాల్లో చాలా వాటిని దాదిలిపెట్టలేదు. ఇలా రోము అధికారాల్ని, సంప్రదాయాల్ని విసర్జించినప్పటికీ దాని ఆచారాలు, కర్మకాండ చర్చ్ ఆఫ్ ఇంగ్లండ్ ఆరాధన విధానంలో స్థానం పొందాయి. ఇవి మనస్సాక్షికి సంబంధించిన అంశాలు కావని లేఖనాలు నిర్దిష్టంగా ఆదేశించటం లేదు గనుక అవి అవసరవిషయాలు కాకపోయినప్పటికీ వాటి విషయంలో నిషేధమేమీ లేదుగనుక ప్రస్తుతం అవి చెడ్డవి కావనే వారున్నారు. వాటిని ఆచరించటం వల్ల దిద్దుబాటు సంఘాలకు రోము మతానికి మధ్య ఉన్న దూరం తగ్గుతున్నదని, రోము మతవాదులు ప్రొటస్టాంట్ తత్వాన్ని అంగీకరించటానికి అవి తోడ్పడ్డాయని కొందరు అభిప్రాయపడ్డారు.GCTel 268.1

  సంప్రదాయ వాదులకు రాజీ ధోరణి గల వారికి ఈ వాదనలు గొప్ప వరంగా కనిపించాయి. ఆ దృక్పథంతో ఏకీభవించని ప్రజలు కొందరున్నారు. ఈ ఆచారాలు “రోము మతానికి దిద్దుబాటు విశ్వాసానికి మధ్య ఉన్న అగాధానికి వంతెన” కాగలవన్నదే వాటిని కొనసాగించకూడదన్న వాదనకు బలాన్నిస్తుందన్నది వారి అభిప్రాయం. (మార్టిన్, సం 5, పుటలు 22) వాటిని బానిసత్వ చిహ్నాలుగా వారు పరిగణించారు. వాటి నుంచి విడుదల పొందారు. తిరిగి వాటి జోలికి పోకూడదన్నది వారి నిశ్చితాభిప్రాయం. దేవుడు తన ఆరాధన విషయంలో తన వాక్యంలో నిబంధనలిచ్చాడని వాటికేదైనా కలపటానికి గాని, వాటిలో నుంచి దేనినైనా తీసివేయటానికి గాని మనుషులకు ఆధికారములేదని వారు వాదించారు. దైవాధికారానికి సంఘాధికారాన్ని అనుబంధ పర్చటానికి ప్రయత్నించటంతో మత భ్రష్టత ప్రారంభమయ్యింది. దేవుడు నిషేధించని దాన్ని రోము ఆదేశించటంతో ప్రారంభించి ఆయన స్పష్టంగా ఆజ్ఞాపించిన దాని నిషేధించటంతో ముగించింది.GCTel 268.2

  తొలిదినాల సంఘం సంతరించుకొన్న పవిత్రత, నిరాడంబరత కోసం అనేక మంది ఎంతో ఆశించారు. ఇంగ్లిష్ సంఘంలో స్థిరపడి ఉన్న అనేక ఆచారాల్ని వారు విగ్రహారాధన చిహ్నాలుగా పరిగణించారు. ఆరాధనల్లో పాల్గోటానికి వారికి మన సొప్పలేదు. అయితే పౌర అధికారం అజమాయిషీ కింద ఉన్న సంఘం తన ఆచారాల విషయంలో అసమ్మతిని అనుమతించలేదు. సంఘారాధనలకు అందరూ హాజరు కావాలని చట్టం శాసించింది. మతారాధనలకు అనధికారికంగా సమావేశమవ్వటం నిషిద్ధం. అందుకు శిక్ష చెరసాల, దేశబహిష్కృతి, మరణం.GCTel 269.1

  పదిహేడో శతాబ్ది ఆరంభంలో ఇంగ్లాండ్ సింహాసనానికి అప్పుడే వచ్చిన చక్రవర్తి ప్యూరిటన్లను “అనుసరింప జేయటమో లేదా దేశం నుంచి బహిష్కరించటమో లేదా... ఇంకా పెద్ద శిక్ష విధించటమో” చేస్తానని ప్రకటించాడు.- జార్జ్ బెన్ క్రాఫ్ట్, హిస్టరీ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, పిటి 1, అధ్యా 12, పేరా 6. జంతువుల మల్లే వేటకు, హింసకు, కారాగారవాసానికి గురి అయిన వారిలో భవిష్యత్తులో మంచి రోజులు వస్తాయన్న నమ్మకాన్ని కోల్పోయి తమ మనస్సాక్షి ప్రకారం అనేకమంది దేవున్ని ఆరాధించే వారికి “ఇంగ్లాండు ఇక సానుకూల స్థలం కాదన్న” నిర్ధారణకు వచ్చారు.- జె.జి.పెల్ ఫ్రే, హిస్టరీ ఆఫ్ న్యూ ఇంగ్లండ్, అధ్యా 3, పేరా 43. చివరికి కొందరు హాలెంలో ఆశ్రయం కోరారు. పర్యవసానంగా శ్రమలు, నష్టాలు, చెరసాల ఎదురయ్యాయి. ఈ దిశగా వారి ప్రయత్నాలకు గండి కొట్టారు. వారిని శత్రువుల చేతికప్పగించారు. కాగా కార్యదీక్ష పట్టుదల వారికి విజయాన్ని చేకూర్చాయి. డచ్ రిపబ్లిక్ లో వారికి హార్ధిక స్వాగతం ఆశ్రయం లభించాయి.GCTel 269.2

  వారు తమ ఇళ్లను, వస్తువులను, జీవనోపాధిని విడిచిపెట్టి వెళ్లిపోయారు. వేరే భాష. వేరే ఆచారాలు గల ప్రజల మధ్యకు వెళ్లి పరదేశులుగా నివసించారు. జీవించేందుకు కోసం పరిచయంలేని కొత్త వృత్తులు చేపట్టారు. వ్యవసాయ వృత్తిలో సగ జీవితం గడిపిన మధ్య వయస్కులు, యాంత్రిక వృత్తులు నేర్చుకొని చేపట్టాల్సి వచ్చింది. మారిన పరిస్థితిని వారు సంతోషంగా అంగీకరించారే తప్ప నిష్క్రియ నిస్పృహలకు తావీయలేదు. తరచు పేదరికం బాధించినా తాము పొందుతున్న దీవెనల నిమిత్తం దేవునికి కృతజ్ఞతలు తెలుపుకొంటూ అడ్డూ ఆపూలేని జీవితాలు జీవించారు. “తాము యాత్రికులమని తమ కష్టాలు, శ్రమలను గురించి ఎక్కువ పట్టించు కోకూడదని వారెరుగుదురు. అయితే వారు తమ అతిప్రియ దేశమైన పరలోకం వైపు కన్నులెత్తి చూస్తూ మనశ్శాంతి పొందారు. ” బ్రేన్ క్రాఫ్ట్, సిటి 1, అధ్యా 12, పేరా 15.GCTel 269.3

  పరాయి దేశంలో నివసిస్తున్నా, శ్రమలననుభవిస్తున్నా వారి విశ్వాసం బలో పేతమయ్యింది. వారి ప్రేమ స్వార్ధ రహితమయ్యింది. వారు దేవుని వాగ్దానాల్ని నమ్మారు. అవసరం ఏర్పడ్డప్పుడు ఆయన వారిని ఆదుకొన్నాడు. తాము ఒక దేశాన్ని స్థాపించుకొనేందుకుగాను సముద్రం ఆవతల ఉన్న ఒక భూభాగాన్ని దేవుని హస్తం చూపించినప్పుడు ఆయన చూపించిన మార్గంలో సంకోచించకుండా ముందుకు సాగారు.GCTel 270.1

  తన సంకల్పాన్ని నెరవేర్చేందుకు దేవుడు తన ప్రజలకు శ్రమలు రానిచ్చాడు. తన సంఘం ఉన్నత స్థాయికి చేరేందుకుగాను దాన్ని తక్కువ స్థాయికి దిగజారనిచ్చాడు. తనను నమ్ముకొన్న వారిని విడిచిపెట్టనని ప్రపంచానికి మరో నిదర్శనం ఇవ్వటానికి వారి పక్షంగా దేవుడు తన శక్తి ప్రభావాలను ప్రదర్శించటానికి సిద్ధంగా ఉన్నాడు. సాతాను ఉగ్రత, దుష్టుల దుస్తంత్రాలు తన మహిమను విస్తరింపజేసి తన ప్రజలను భద్రతగల స్థలానికి చేర్చేందుకుగాను ఆయన సంఘటనలను ఆపివేశాడు. హింస, బహిష్కృతి స్వేచ్చకు మార్గం సుగమం చేశాయి.GCTel 270.2

  ఇంగ్లీషు సంఘం నుంచి మొదటగా విడిపోవలసి వచ్చినప్పుడు దేవుని స్వేచ్ఛా ప్రజలుగా ఆయన తవుకు తెలియజేసిన , ముందు తెలియాల్సి ఉన్న “మార్గాలన్నింటిలోను కలిసి నడవటానికి ప్యూరిటన్లు అందరు కలసి పవిత్ర నిబంధన చేసుకొన్నారు.” జె.బ్రౌన్, ది పిల్ గ్రిమ్ ఫాదర్స్, పుట 74. ఇది వాస్తవమైన సంస్కరణ స్పూర్తి, ప్రధానమైన ప్రొటస్టాంట్ తత్వ సూత్రం. ఈ ఉద్దేశంతోనే యాత్రికులు హాలెండ్ విడిచిపెట్టి నూతన ప్రపంచంలో నివాసం ఏర్పరచుకోటానికి వెళ్లారు. వారి బోధకుడు జాన్ రాబిన్సన్. ఆయన యాత్రికులతో వెళ్లలేకపోయాడు. అది నిస్సందేహంగా దైవ చిత్తమే. తన వీడ్కోలు సందేశంలో ఆ బోధకుడు బహిష్కృతులనుద్దేశించి ఇలా అన్నాడు!GCTel 270.3

  “సోదరులారా, కాసేపటిలో మనం విడిపోతాం. మిమ్మల్ని మళ్లీ చూడగలనో లేనో ప్రభువుకే తెలుసు. ఇది ప్రభువు చిత్తమో కాదోగాని నేను క్రీస్తును ఏ మేరకు అనుసరిస్తున్నానో అంతకు మించి మీరు నన్ను అనుసరించాల్సిందని కోరటంలేదని దేవుని ఎదుట పరిశుద్ధదూతల ఎదుట మీకు తెలియజేస్తున్నాను. దేవుడు తన ఏ యితర సాధనం ద్వారానైనా ఏదైనా సత్యాన్ని మీకు బయలుపర్చితే నా సేవ ద్వారా సత్యాన్ని అంగీకరించినట్లే దాన్ని అంగీకరించటానికి సిద్ధంగా ఉండండి. ఆయన వాక్యంలో నుంచి ప్రకటించేందుకు ప్రభువు వద్ద ఎంతో సత్యం, ఎంతో వెలుగు ఉన్నాయి.” మార్టిన్, సం 5, పుట 70.GCTel 270.4

  “నా ముట్టుకు నేను దిద్దుబాటు సంఘాల పరిస్థితి గురించి ఎంతగానో విచారిస్తున్నాను. మతం విషయంలో అవి ఒక కాలావధికి వచ్చాయి. అవి వాటి దిద్దుబాటు సాధనాలను అధిగమించి పోలేవు. లూథర్‌ను లూథర్ దృక్పథాన్ని మించి పోలేరు. కేల్వినిస్టులు ఆ దైవ సేవకుడు వారితో ఉండి చూచిన దాన్నే పట్టుకొన్నారు. ఆయనకు అన్ని సత్యాలు బోధపడలేదు. ఇది శోచనీయమైన దుస్థితి, ఎందుకంటే వారు తమ కాలంలో కాంతివంతంగా వెలిగిన దీపాలు. వారు దైవ సత్యాన్ని సాకల్యంగా అవగతం చేసుకోలేదు. కాకపోతే వారు ఈ కాలంలో జీవించివుంటే తాము తొలుత సత్యాన్ని ఎలాఅందుకొన్నారో అలాగే అదనపు సత్యాన్ని అంగీకరించి ఉందురు.” డి నియల్, హిస్టరీ ఆఫ్ ది ఫ్యూరిటన్స్, సం 1, పుట 269.GCTel 271.1

  “మీ సంఘ నిబంధనను గుర్తుంచుకోండి. ప్రభువు మీకు తెలియజేసిన, ఇంకా తెలియజేయాల్సి ఉన్న మార్గాలన్నింటిలోను నడవటానికి ఆ నిబంధన ప్రకారం మీరు అంగీకరించారు. ఆయన లిఖిత వాక్యం నుంచి మీకు వచ్చే సత్యాన్ని స్వీకరిస్తామని దేవునితోను ఒకరితో ఒకరు మీరు చేసిన వాగ్దానాన్ని నిబంధనను జ్ఞాపకముంచుకోండి. కాని దానితో పాటు సత్యంగా మీరు స్వీకరించేదాని విషయంలో అప్రమత్తంగాGCTel 271.2

  ఉండాల్సిందిగా నా వినతి. సత్యాన్ని అంగీకరించక ముందు ఇతర లేఖన సత్యాలతో దాన్ని సరిపోల్చి ఆచితూచి అంగీకరించండి. ఎందుకంటే ఇంత తీవ్రమైన క్రైస్తవ వ్యతిరేక అంధకారంలో నుంచి పరిపూర్ణ సత్యజ్ఞానం ఒక్కసారిగా బైలుపడటం సాధ్యం కాదు.” -మార్టిన్, సం 5, పుటలు 90,91.GCTel 271.3

  ప్రమాదభరితమైన దీర్ఘ సముద్ర ప్రయాణానికి సాహసించటానికి, ఎన్నో శ్రమలు భరించి అడవులు దాటటానికి, తుదకు దేవుని ఆశీర్వాదాలతో అమెరికాతీరాన్ని చేరి అక్కడ ఒక శక్తిమంతమైన జాతికి పునాది వేయటానికి యాత్రిక పితరుల్ని నడిపించింది మనస్సాక్షి. స్వాతంత్ర్యం పట్ల వారికున్న ప్రగాఢ ఆకాంక్షే. అయినా చిత్తశుద్ధి దైవభక్తి గల యాత్రికులు మత స్వాతంత్ర్య సూత్రాన్ని ఇంకా అవగతం చేసుకోలేదు. ఏ స్వాతంత్ర్యం కోసం తాము ఎన్నో త్యాగాలు చేశారో, ఆ స్వాతంత్ర్యాన్ని ఇతరులకివ్వటానికి వారు సిద్ధంగా లేరు. “ఆలోచనా పరులు నీతి కోవిదులతో సహా పదిహేడో శతాబిలో చాలా తక్కువమంది మానవుల విశ్వాసాన్ని గూర్చి తీర్పు చెప్పేవాడు దేవుడు ఒక్కడే అన్న నూతన నిబంధన బోధ నుంచి వచ్చిన ఆ ఉదాత్త సూత్రాన్ని అవగాహన చేసుకోలేదు.” అదే పుస్తకం, సం 5, పుట 297. అంతరాత్మను అదుపుచేసి సిద్ధాంత వ్యతిరేకతను దండించే హక్కు దేవుడు సంఘానికిచ్చాడన్న సిద్ధాంతం పోపుల ఘోర తప్పిదాలు, దురంతాలకు బలమైన పునాది. సంస్కర్తలు రోము మత విశ్వాసాన్ని నిరాకరించినా దాని స్ఫూర్తికి, అసహనానికి స్వస్తి చెప్పలేదు. యుగాలు తరబడి సాగిన పోపుమత పాలనవల్ల క్రైస్తవ లోకాన్ని అలముకొన్న దట్టమైన చీకటి ఇంకా పూర్తిగా విడిపోలేదు. మేస చూసెట్స్ సముద్ర తీరాన ఉన్న వలస పాలనలోని ఒక బోధకుడిలా అన్నాడు, “మత సహనమే లోకాన్ని క్రైస్తవ వ్యతిరేకిగా మార్చింది. సిద్ధాంత వ్యతిరేకుల్ని దండించటం మూలంగా సంఘానికి హాని ఏ మాత్రం జరగలేదు.”- అదే పుస్తకం, సం 5, పుట 335. సంఘసభ్యులే దేశపరిపాలనలో హక్కులు కలిగి వుండాలని వలస ప్రజల సభ ఒక తీర్మానం చేసింది. ఫలితంగా ప్రభుత్వ ప్రాతినిధ్యంగల సంఘాన్ని స్థాపించారు. బోధక వర్గ పోషణార్ధం ప్రజలంతా విరాళాలివ్వటం తప్పనిసరి. సిద్ధాంత వ్యతిరేకతను అణచివేయటం మేజిస్ట్రేటుల బాధ్యత. స్వల్ప కాలవ్యవధిలోనే ఈ చర్యలు వాటి అనివార్య పర్యవసానమైన హింసకు దారితీశాయి.GCTel 271.4

  మొట్టమొదటి వలస ఏర్పడ్డ పదకొండు సంవత్సరాలకు రోజర్ విల్యమ్స్ నూతన ప్రపంచంలో అడుగు పెట్టాడు. తొలిదినాల యాత్రికులల్లే ఆయన కూడా మత స్వేచ్చను కోరి వచ్చాడు. వారిమల్లేకాక తన కాలంలో గ్రహించగలిగిన కొద్దిమందిలా కూడా కాక, మతం ఏదైనా స్వేచ్ఛ అన్నది ప్రజలందరి హక్కని రోజర్ నమ్మాడు. రాబిన్సన్మల్లే రోజర్ కూడా చిత్తశుద్ధిగల సత్యాన్వేషి, దైవ వాక్యంలోని సత్యమంతా బహిర్గతం కాలేదు కాజాలదు అన్నది ఆయన అభిప్రాయం. “స్వేచ్ఛా మనస్సాక్షి చట్టం ముందు అందరి అభిప్రాయాలు సమానం అన్న సిద్దాంతంపై నవీన క్రైస్తవ ప్రపంచంలో ప్రజా ప్రభుత్వాన్ని నెలకొల్పిన మొదటి వ్యక్తి విలియమ్స్” బేన్ క్రాఫ్ట్, పిటి 1, అధ్యా 15, పేరా 16. మేజిస్ట్రేట్ విధి నేరాన్ని అదుపుచేయటమేగాని మనస్సాక్షిని నియంత్రించటం కాదని ఆయన కుండ బద్దలు కొట్టాడు. “ప్రజలుగాని మేజిస్ట్రేట్లుగాని మనిషికి మనిషికి మధ్య సంబంధాలగురించి తీర్మానాలు చేయవచ్చు. కాని దేవుని విషయంలో మానవుడి విధులను నిర్దేశించటానికి ప్రయత్నించటం అసంబద్ధం. అది క్షేమంకాదుకూడా. ఎందుకంటే మేజిస్ట్రేట్ కి అధికారం ఉంటే అతడు ఈ రోజు ఒక రకమైన అభిప్రాయాలపై డిక్రీ ఇవ్వవచ్చు. రేపు ఇంకో రకమైన వాటిపై ఇవ్వవచ్చు. ఇంగ్లండ్ లో రాజులు రాణీలు రోమా సంఘంలో పోపులు వాళ్లు జరిపిన సభలు చేసింది ఇదే. ఫలితంగా విశ్వాసం అస్తవ్యస్తమౌతుంది. ” మార్టిన్, సం 5, పుట 340.GCTel 272.1

  అధికారిక సంఘారాధనలకు తప్పని సరిగా హాజరవ్వాలి. హాజరు కాని వారికి జరిమానా లేదా కారాగార శిక్ష విధించటం జరిగేది. “విలియమ్స్ ఆ చట్టాన్ని నిరసించాడు. పేరిష్ సంఘానికి తప్పక హాజరు కావాలి అన్న నిబంధన ఇంగ్లిష్ చట్టంలో అతిహీనమైన నిబంధన. విశ్వాసం విషయంలో భేదించిన వారితో ఏకమవ్వాలని ఒత్తిడి చేయటం వారి స్వాభావిక హక్కులను ఉల్లంఘించటమౌతుందని ఆయన అభిప్రాయ పడ్డాడు. మతాసక్తి లేని వారిని బహిరంగ ఆరాధనకు ఈడ్చుకు వెళ్లటం కపటనాటక మూడుమని ఒత్తిడి చేయటమౌతుంది... తన ఇష్టం లేకుండా ఆరాధించుముని ఆరాధన చేస్తున్నట్టు నటించుమని ఎవరినీ ఒత్తిడిచేయకూడదు.” అన్నాడు విలియమ్స్. ఆయన సూత్రాలను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ “ఏమిటి, పనివాడు జీతానికి అర్హుడు కాడా?” ప్రశ్నించారు. ఆయన ప్రత్యర్థులు “అర్హుడే. కాని అతణ్ణి పనిలో పెట్టుకొన్న వారి వద్దనుంచి” బదులు పలికాడు విలియమ్స్ బేన్ క్రాఫ్ట్, సిటి 1, అధ్యా 15, పేరా 2.GCTel 273.1

  రోజర్ విలియమ్స్ నమ్మకమైన సువార్త సేవకుడు. ఆయన ప్రజల అభిమానాన్ని చూరగొన్న వ్యక్తి. ఆయనకున్న సమర్ధతలు విలక్షణమైనవి. ఆయన కపటం లేని మనిషి, ఉదారబుద్ధి కలవాడు. అయినా సంఘం మీద మేజిస్ట్రేటులకు హక్కు లేదని నిత్యమూ ప్రకటించటం, మతస్వేచ్ఛ కావాలని డిమాండ్ చేయటం మత గురువులు సహించలేకపోయారు. ఈ నూతన సిద్ధాంతాన్ని అనుసరిస్తే “దేశానికి దేశ ప్రభుత్వానికి హాని కలుగుతుందని” వారు వాదించారు. అదే పుస్తకం, పిటి 1, అధ్యా 15, పేరా 10. వలసల నుంచి ఆయనను బహిష్కరించారు. చివరికి అరెస్టు తప్పించుకోటానికి చలికాలపు మంచు తుఫానుల మధ్య అడవుల్లోకి పారిపోవలసి వచ్చింది.GCTel 273.2

  తిండి నీడ లేకుండా తీవ్రమైన చలికాలంలో అటూ ఇటూ తిరుగాడుతూ ఆ అరణ్యంలో “నాకు కాకులు ఆహారమందించాయి.” అన్నాడాయన. తరచు చెట్ల తొర్రల్లో ఆయన తలదాచుకొన్నాడు- మార్టిన్, సం 5, పుటలు 349,350. ఆయన ఇలా మంచులో దారిలేని అడవుల్లో తన అజ్ఞాతవాసాన్ని గడిపాడు. చివరికి ఒక ఇండియన్ తెగవద్ద ఆశ్రయం పొంది వారికి సువార్త సత్యాన్ని బోధిస్తూ వారి ఆదరాభిమానాల్ని చూరగొన్నాడు.GCTel 273.3

  కొన్ని మాసాలపాటు మార్పులు, చేర్పులు చేసుకొంటూ సంచార జీవనం గడిపిన అనంతరం నరగన్సెట్ సముద్రతీరాన్ని చేరుకొని అక్కడ నవీన కాలంలో మత స్వాతంత్ర్యాన్ని హక్కుగా గుర్తించిన మొట్టమొదటి దేశానికి పునాది వేశాడు. “ప్రతీవ్యక్తి తన మనస్సాక్షి వికాసాన్ని బట్టి దేవునిని ఆరాధించే స్వాతంత్ర్యత కలిగి ఉండాలి అన్నది “రోజర్ విలియమ్స్ వలస ప్రాధమిక సూత్రం. ” అదే పుస్తకం, సం. 5, పుట 354. రోజర్ విలియమ్స్ చిన్న రాష్ట్రం అయినరోడ్ ఐలాండ్ బాధితులకు ఆశ్రయమయ్యింది. అది వృద్ధి చెంది భాగ్య వంతమయ్యింది. పౌర స్వాతంత్ర్యం మత స్వాతంత్ర్యం అన్న ఆ రాష్ట్ర ప్రాతిపదిక సూత్రాలు అమెరికా రిపబ్లిక్ కి మూలరాయి అయ్యాయి.GCTel 274.1

  మన పూర్వికులు తమ హక్కుల శాసనంగా- స్వాతంత్య ప్రకటన ప్రకటించుకొన్న ఆ గొప్ప పత్రంలో ఇలా ఉద్ఘాటించారు, “వీటిని ప్రత్యక్ష సత్యాలుగా మేము భావిస్తున్నాం. దేవుడు మనుషులందరిని సమానంగా సృష్టించాడు. సృష్టికర్త మనుషులందరికి కొన్ని మార్పులేని హక్కులు దఖలు పర్చాడు. వీటిలో కొన్ని జీవించే హక్కు, స్వాతంత్ర్యం హక్కు, సంతోషాన్ని అన్వేషించే హక్కు. ” మనస్సాక్షి అతిక్రమం జరగదన్న రాజ్యాంగం ఇలా అతి స్పష్టంగా హామీ ఇస్తున్నది, “అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఏ పదవికైనా అర్హతగా మత సంబంధమైన ఎలాంటి పరీక్ష ఉండదు” “మత సంస్థాపన విషయంలో గాని లేక మత స్వేచ్చపై ఆంక్షల విధింపు విషయంలోగాని కాంగ్రెస్ (విధానసభ) ఎలాంటి శాసనాన్ని చేయకూడదు.”GCTel 274.2

  దేవునితో మానవుడి సంబంధం మానవ శాసనానికి అతీతమైనది; మానవుడి మనస్సాక్షి హక్కులు మార్చరానివి అన్న సూత్రాన్ని రాజ్యాంగ రూపకర్తలు గుర్తించారు. ఇది సత్యమని చెప్పటానికి హేతువాదం అవసరం లేదు. అది మన హృదయాలకు తెలుసు. మానవ చట్టాలను ధిక్కరించిన ఈ మనస్సాక్షే అనేకమంది హతసాక్షుల్ని భగభగమండే మంటలలో ధైర్యంగా నిలబెట్టింది. దేవుని పట్ల తమవిధి మానవ చట్టాలకన్న ఉన్నతమైందని, మన మనస్సాక్షిపై మానవుడికి అధికారం లేదని వారు బోధించారు. అది వారిలో స్వభావ సిద్ధంగా ఉన్న నియమం. దాన్ని ఏదీ నిర్మూలించలేదు.” - కంగ్రెషనల్ డాక్యుమెంట్స్ (యు.ఎ. స్..) సీరియల్ నెం. 200, డాక్యుమెంట్ నెం. 271.GCTel 274.3

  ప్రతీవారు తమ కష్టార్జితాన్ని అనుభవించి తమ మనస్సాక్షి ప్రబోధం ప్రకారం జీవించగల దేశం ఉన్నదన్న వార్త ఐరోపాఖండ దేశాల్లో వ్యాపించటంతో నూతన ప్రపంచ తీరం ప్రజలతో కిటకిటలాడింది. వలసల సంఖ్య వేగంగా పెరిగింది. “యుద్ధాల నుంచి కరవుకాటకాల నుంచి తమకన్న ముందువచ్చి స్థిరపడ్డవారి వలన కలిగే హింస నుంచి విముక్తి నాశించి ఏ జాతి క్రైస్తవులైనా అట్లాంటిక్ మహాసముద్రం దాటి వస్తే వారికి ప్రభుత్వ ఖర్చుతో ఉచిత సహాయం ఏర్పాటుకు మెసిచూసెట్స్ రాష్ట్రం ప్రత్యేక చట్టం రూపొందించింది. కాందిశీకులకు పీడిత ప్రజలకు ఇలా చట్టబద్ధమైన అతిథులుగా కామన్వెల్త్ లో స్థానం లభించింది. ”- మార్టిన్, సం.5, పుట 417. మొట్టమొదటి యాత్రికులు ప్రిమత్ లో అడుగుపెట్టింది లగాయతు ఇరవై ఏళ్లలో ఇరవై వేలమంది యాత్రికులు న్యూఇంగ్లండ్ లో స్థిరపడ్డారు.GCTel 275.1

  తాము ఆశించిన లక్ష్యాన్ని సాధించేందుకుగాను “వారు మితవ్యయాన్ని శ్రమ జీవనాన్ని పాటించారు. కష్టించి పని చేసి మాత్రమే భూమినుంచి ఫలసాయం కోరారు. దీనికి మించి వారేమీ ఆశించలేదు. బంగారు కలలు కని దారి తప్పలేదు. సాంఘిక ప్రగతి పరంగా పరుగెత్తి పాలుతాగేకన్నా నిలబడి నీళ్లు తాగటం మేలని విశ్వసించారు. అరణ్యంలో లేమిని బాధలను ఓర్పుతో భరించారు. స్వేచ్ఛ అనే మొక్క ఆ దేశంలో లోతుగా వేరులు తన్నే వరకు దాన్ని కన్నీటితోను నుదుటి చెమటతోను తడిపారు.”GCTel 275.2

  విశ్వాసానికి పునాదిగా, జ్ఞానానికి నిధిగా, స్వేచ్ఛకు అధికార పక్షంగా బైబిలును పరిగణించారు. బైబిలు సూత్రాలను గృహాలలోను పాఠశాలల్లోను సంఘంలోను శ్రద్ధగా బోధించారు. మితవ్యయం, విజ్ఞత, పరిశుద్ధత ఆశనిగ్రహాలతో దాని ఫలాలు కనిపించాయి. ఒకడు ఒక ప్యూరిటన్ స్థావరంలో సంవత్సరాలు తరబడి జీవించినా “ఒక తాగుబోతును చూడటం, ఒకడు దుర్భాషలాడటం వినటం లేదా ముష్టివాణ్ణి కలవటం జరగదు”. బెన్ క్రాఫ్ట్, సిటి 1, అధ్యా 19, పేరా 25. జాతి ఔన్నత్యానికి రక్షణ బైబిలు సూత్రాలే అన్నది నిరూపితమయ్యింది. ఒంటరిగా బలహీనంగా ఉన్న వలసలు పెరిగి శక్తిమంతమైన రాష్ట్రాలుగా ఫెడరేషన్ గా పరిఢవిల్లాయి. “పోపులేని సంఘం, రాజులేని దేశం” సాధించిన శాంతిని అభివృద్ధిని ప్రపంచం విస్మయంతో గుర్తించింది.GCTel 275.3

  ప్రజలు పెద్ద సంఖ్యలో అమెరికాకు ఆకర్షితులవ్వటం కొనసాగింది. యాత్రిక పితరుల ఆశయాలకు భిన్నమైన ఆశయాలతో ప్రజలు వలస వెళ్లారు. సనాతన విశ్వాసం, పవిత్రత గొప్ప ప్రభావాన్ని చూపినా లౌకిక సుఖభోగాలు మాత్రమే ఆశించి వచ్చిన వారి సంఖ్య పెరిగిన కొద్దీ దాని ప్రభావం క్రమేపీ క్షీణించింది.GCTel 275.4

  సంఘ సభ్యులు మాత్రమే దేశపాలన వ్యవస్థలో పదవులు నిర్వహించటానికిగాని, ఓటు వేయటానికి గాని అర్హులన్న నిబంధనను తొలిదినాల వలస సభ్యులు అంగీకరించారు. ఆ విధానం ఘోరమైన పర్యవసానాలకు దారితీసింది. అది రాష్ట్ర పవిత్రను పరిరక్షించేందుకు చేపట్టిన చర్య. కాని అది సంఘం అవినీతితో నిండటానికి దోహద పడింది. ఓటు వేయటానికి హోదాను నిర్వహించటానికి ఒక మతాని అవలంబించటమన్న షరతుపై ఆధారపడి ఉన్నది. ఫలితంగా కేవలం లోకసంబంధమైన లబ్దినాశించి హృదయ పరివర్తన లేకుండా అనేకమంది సంఘంలో చేరారు. సంఘాలలో ఇలా చాలామట్టుకు మార్పులేని వ్యక్తులు ప్రవేశించారు. తప్పుడు సిద్ధాంతాలున్న వారేగాక పరిశుద్ధాత్మ నవీకరణ శక్తిని గూర్చిన అవగాహన లేని వ్యక్తులు బోధక వర్గంలోకి ప్రవేశించారు. కాన్ స్టెంటయిన్ దినాల నుంచి ఇప్పటివరకు సంఘ చరిత్రలో చోటు చేసుకొన్న దుష్పరిణామాలే మళ్లీ మనకు దర్శన మిస్తున్నాయి. రాజకీయ ప్రాబల్యంతో సంఘాన్ని బలోపేతం చేయటానికి ప్రయత్నించటం, “నా రాజ్యము ఇహలోక సంబంధమైనది కాదు” (యోహాను 16:36) అన్న ప్రభువు సువార్త, మద్దతుకోసం లౌకిక అధికారులకు విజ్ఞప్తి చేయటం అన్న దుష్పరిణామాలు మనం చూస్తున్నాం. సంఘం రాజకీయ ప్రభుత్వంతో ఏకమైనప్పుడు ఆ ఐక్యత లోకాన్ని సంఘానికి చేరువ చేసినట్లు కనిపించినా వాస్తవానికి అది సంఘాన్ని లోకానికి చేరువ చేస్తుంది. ఆ సామీప్యం కొద్దిపాటిది కాదు.GCTel 276.1

  సత్యం వృద్ధి చెందుతుందని దేవుని పరిశుద్ధ వాక్యం నుంచి ప్రకాశించే వెలుగు అంతటినీ అంగీకరించటానికి క్రైస్తవులు సంసిద్ధంగా ఉండాలని చెబుతూ రాబిన్సన్, రోజర్ విలియమ్స్ లు ప్రబోధించిన విశిష్ట సూత్రాన్ని తర్వాతి తరాలవారు విస్మరించారు. సంస్కరణను ప్రశస్త దీవెనగా స్వీకరించిన అమెరికాలోను యూరప్లోను ప్రొటస్టాంటు సంఘాలు సంస్కరణ మార్గంలో ముందుకు సాగటంలో విఫలమయ్యాయి. నూతన సత్యాన్ని ప్రకటించటానికి ఎండగట్టటానికి నమ్మకమైన వ్యక్తులు కొందరు అప్పుడప్పుడు లేచినప్పటికీ క్రీస్తు దినాల్లో యూదులమల్లే, లూథర్ దినాల్లో పోపుమతవాదులమల్లే అధిక సంఖ్యాకులు తమ తండ్రులు నమ్మినట్లే దీర్ఘకాలంగా ప్రబలుతున్న అసత్యాలను నమ్మారు. వారు జీవించినట్లే జీవించారు. కనుక మతం మళ్లీ ఆచార ప్రధాన్యత గల మతంగా తయారయ్యింది. దైవ వాక్యానుసారంగా సంఘం నడుచుకొని ఉంటే అది విసర్జించి ఉండే తప్పుడు బోధలు మూఢనమ్మకాల్ని అది శ్రద్ధగా కొనసాగించింది. సంస్కరణ రగిలించిన స్పూర్తి ఇలా చల్లారిపోయింది. లూథర్ కాలంలో రోమను సంఘంలో సంస్కరణకు ఏర్పడ్డ అవసరమే ప్రొటస్టాంటు సంఘాల్లోనూ ఏర్పడింది. అవే లోకాశలు, అదే ఆధ్యాత్మిక స్తబ్దత, మానవాభిప్రాయాల పట్ల అదే అభిమానం, దేవుని వాక్యబోధనల స్థానే మానవ సిద్ధాంతాల ప్రబోధం కనిపిస్తున్నాయి.GCTel 276.2

  పందొమ్మిదో శతాబ్బి ఆరంభ సంవత్సరాల్లో విరివిగా సాగిన బైబిలు ప్రచురణ, దాని ఫలితంగా ప్రపంచంపై ప్రకాశించిన ప్రచండమైన వెలుగుకు సమతూకంగా బైబిలు విపులపర్చిన సత్యజ్ఞానం పెరగటంగాని, మతం అనుభవంలోకి రావటంగాని జరుగలేదు. గతించిన యుగాలలోలాగే సాతాను దేవుని వాక్యాన్ని ప్రజలకు దూరం చేయలేక పోయాడు. వాక్యం ప్రజాబాహుళ్యం అందుబాటులోకి వచ్చింది. అయితే తన లక్ష్యాన్ని ఇంకా సాధించటానికిగాను బైబిలును ప్రాధాన్యం లేని గ్రంధంగా పరిగణించటానికి అనేకుల్ని నడిపించాడు సాతాను.లేఖనాల్ని పరిశోధించటం మనుషులు నిర్లక్ష్యం చేశారు. వారు తప్పుడు అర్ధాలనే నమ్మటం మొదలు పెట్టారు. GCTel 277.1

  బైబిలులో లేని సిద్ధాంతాలను ప్రేమించటం మొదలు పెట్టారు. హింస ద్వారా సత్యాన్ని నలగ దొక్కటానికి చేసిన ప్రయత్నాలు విఫలమవ్వటం గుర్తించి సాతాను మళ్లీ రాజీ ప్రణాళికను రూపొందించుకొన్నాడు. ఇది గొప్ప మత భ్రష్టతకు కథోలిక్ సంఘస్థాపనకు దారి తీసింది. ఇప్పుడు అన్యులతో కాక తమ లోకాసక్తుల ననుసరించి నిజమైన విగ్రహారాధకులుగా నిరూపించుకొన్న వారితో జత కట్టటానికి సాతాను క్రైస్తవుల్ని ప్రేరేపించాడు. ఈ సంయోగం ఫలితాలు పూర్వ యుగాలలోకన్న ఇప్పుడు తక్కువ ప్రమాదకరమని తలంచటానికి వీలులేదు. మతం ముసుగులో అహంకారం దుర్వ్యయం కొనసాగుతున్నాయి. సంఘాలు అవినీతిలో కూరుకు పోయాయి. సాతాను బైబిలు సిద్ధాంతాల్ని వక్రీకరించటం కొనసాగిస్తున్నాడు. లక్షలాది ప్రజల్ని నాశనం చేసే సంప్రదాయాలు లోతుగా వేరులు నాటుకొంటున్నాయి. “పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగించబడిన బోధ కోసం పోరాడేబదులు సంఘం ఈ సంప్రదాయాల్ని ఆమోదించి సమర్ధిస్తున్నది. ఏ సూత్రాల కోసం సంస్కర్తలు పాటుపడి ఎన్నో శ్రమలు బాధలు అనుభవించారో వాటిని ఇలా భ్రష్టు పట్టించారు.GCTel 277.2

  Larger font
  Smaller font
  Copy
  Print
  Contents