Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
మహా సంఘర్షణ - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    అధ్యాయం 25—మార్పులేని దైవ ధర్మశాస్త్రం

    “పరలోకమందు దేవుని ఆలయము తెరువబడగా దేవుని నిబంధన మందసము కనబడెను” ప్రకటన 11:19. దేవుని నిబంధన మందసం గుడారంలోని రెండో విభాగమైన అతిపరిశుద్ధ స్థలంలో ఉన్నది “పరలోక సంబంధమగు వస్తువుల ఛాయారూపకమైన” భూలోక గుడార సేవలో ఈ విభాగాన్ని ప్రాయశ్చిత్తార దినం నాడే శుద్ధీకరణ నిమిత్తం తెరచేవారు. కనుక పరలోకంలో దేవుని ఆలయం తెరువబడినట్లు దేవుని నిబంధన మందసం కనబడగా చేసిన ప్రకటన చివరి ప్రాయశ్చిత్త కార్యాన్ని నిర్వహించేందుకు 1844 లో పరలోక గుడారంలోని అతిపరిశుద్ధ స్థలంలో క్రీస్తు ప్రవేశించటాన్ని సూచిస్తున్నది. తమ ప్రధాన యాజకుడు క్రీస్తు అతిపరిశుద్ధ స్థలంలో ప్రవేశించటాన్ని సూచిస్తున్నది. తమ ప్రధాన యాజకుడు అతిపరిశుద్ధ స్థలంలో తన పరిచర్యను మొదలు పెట్టటానికి ప్రవేశించినప్పుడు విశ్వాసమూలంగా ఆయనను అనుసరించినవారు ఆయన నిబంధన మందసాన్ని వీక్షించారు. గుడారాంశాన్ని అధ్యయనం చేసినప్పుడు రక్షకుని పరిచర్యలోని మార్పును వారు గ్రహించారు. ఆయన ఇప్పుడు దేవుని మందసం ముందు పాపుల పక్షంగా తన రక్తాన్ని చిందించానంటూ విజ్ఞాపన సల్పుతూ సేవ చేస్తున్నట్లు గ్రహించారు.GCTel 405.1

    భూలోక గుడారంలోని మందసంలో రెండు రాతి పలకలు వాటిపై లిఖితమైన దేవుని ధర్మశాస్త్ర సూత్రాలు ఉన్నాయి. మందసం ధర్మశాస్త్రం ఉన్న రాతిపలకలను ఉంచిన పెట్టె. దైవ ధర్మసూత్రాల ఉనికివల్ల మందసం విలువను పరిశుద్ధతను సంతరించుకొన్నది. పరలోకంలో దేవుని ఆలయం తెరువబడ్డప్పుడు దేవుని నిబంధన మందసం కనబడింది. పరలోక గుడారంలోని అతిపరిశుద్ధ స్థలంలో దేవుని పరిశుద్ధ ధర్మశాస్త్రం ప్రతిష్టితమైంది. సీనాయి పర్వతంపై నిలిచి ఉరుముల మధ్య స్వయాన దేవుడే ఉచ్చరించి రాతిపలకల మీద తన సొంత వేలితో లిఖించిన ధర్మశాస్త్రం అది.GCTel 405.2

    పరలోక గుడారంలో ఉన్నది అసలు ధర్మశాస్త్రం. రాతిపలకలపై లిఖితమైన పెంటటూ లో మోషే నమోదు చేసినది. దానికి నిర్దుష్టమైన నకలు. ప్రాముఖ్యమైన ఈ విషయాన్ని అవగాహన చేసుకొన్నవారు దైవ ధర్మశాస్త్రం తాలూకు పవిత్రమైన, మార్పులేని స్వభావాన్ని గుర్తించగలిగారు “ఆకాశమును భూమియు గతించి పోయిననేగాని ధర్మశాస్త్రముంతయు నెరవేరువరకు దాని నుండి యొక పొల్లయినను సున్నయైనను తప్పిపోదు” మత్తయి 5:18 అంటూ రక్షకుడు పలికిన ఈ మాటల శక్తిని వారు తెలుసుకొన్నారు: దైవచిత్తాన్ని ప్రకటిస్తున్న దేవుని ప్రవర్తనకు నకలు అయిన ధర్మశాస్త్రం “మింటనుండు సాక్షి నమ్మకముగా ఉన్నట్లు” నిత్యం నిలవాలి. ఒక్క ఆజ్ఞకూడా రద్దుకాదు. ఒక్క పొల్లుగాని సున్నాగాని మారదు. కీర్తనకారుడు ఇలా అంటున్నాడు, “యెహోవా, నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా నున్నది.” “ఆయన చేతి కార్యములు సత్యమైనవి న్యాయమైనవి. అవి శాశ్వతముగా స్థాపించబడియున్నవి. ” కీర్తనలు 119:89; కీర్తనలు 111:7, 8.GCTel 405.3

    పది ఆజ్ఞల హృదయంలో నాల్గో ఆజ్ఞ నిక్షిప్తమై ఉన్నది. అది మొదట ఎలా ప్రకటిత మయ్యిందో అలాగే ఉంది. “విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జాపకముంచుకొనుము, ఆరు దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. ఏడవ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తెయైనను నీ దాసుడైనను నీ దాసియైనను ఏపనియు చేయకూడదు. ఆరు దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి యేడవ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాని పరిశుద్ధపరచెను.” నిర్గమకాండము 20:811.GCTel 406.1

    దైవ వాక్యాన్ని అధ్యయనం చేసిన విద్యార్థుల మనసుల్ని దేవుని ఆత్మ ప్రభావితం చేశాడు. సృష్టికర్త ఇచ్చిన విశ్రాంతి దినాన్ని పట్టించుకోకపోటం వల్ల అజ్ఞానంగా ఈ ఆజ్ఞను అతిక్రమించామన్న స్పృహ వారికి కలిగింది. దేవుడు పవిత్రపర్చిన దినాన్ని ఆచరించేబదులు మొదటి రోజును ఆచరించటానికి గల కారణాల్ని సమీక్షించటం మొదలు పెట్టారు. నాల్గో ఆజ్ఞ రద్దయినట్లుగాని సబ్బాతు మారినట్లుగాని లేఖనాల్లో ఎక్కడా ఏ నిదర్శనం కనిపించలేదు. ఏడోదినం మీద ఉన్న దీవెనను, పరిశుద్ధతను ఎవరూ ఎన్నడూ తీసివేయలేరు. దేవుని చిత్తాన్ని తెలుసుకొని దాన్ని నమ్మకంగా ఆచరించటానికి వారు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు తాము దైవధర్మశాస్త్రాన్ని అతిక్రమించినట్లు కనిపించటంతో వారి హృదయాలు సంతాపంతో నిండాయి. సబ్బాతును పరిశుద్ధంగా ఆచరించటం ద్వారా దేవునిపై తమకున్న భక్తి విశ్వాసాల్ని ప్రదర్శించుకొన్నారు.GCTel 406.2

    వారి విశ్వాసాన్ని కూలదోయటానికి తీవ్ర ప్రయత్నాలెన్నో జరిగాయి. ఇహలోక గుడారం పరలోక గుడారపు ఛాయారూపకం లేదా నమూనా అయితే ఇహలోక గుడారంలోని మందసంలో ఉన్న ధర్మశాస్త్రం పరలోక గుడారంలోని ధర్మశాస్త్రానికి కచ్చితమైన నకలు అని పరలోక గుడారాన్ని గూర్చిన సత్యాన్ని అంగీకరించటం దైవ ధర్మశాస్త్రం అధికారాన్ని నాల్గో ఆజ్ఞలోని సబ్బాతు ఆచరణ విధిని గుర్తించటమే అని గ్రహించలేని వారుండరు. పరలోక గుడారంలో క్రీస్తు చేస్తున్న పరిచర్యను వివరించే లేఖనాల వెల్లడికి తీవ్ర వ్యతిరేకత తలెత్తటానికి గల రహస్యం ఇదే. దేవుడు తెరచిన తలుపును మూయటానికి దేవుడు మూసిన తలుపును తెరవటానికి మనుషులు ప్రయత్నించారు. అయితే “ఎవడును వేయలేకుండ తీయువాడును, ఎవడును తీయలేకుండ వేయువాడును అయిన సత్యస్వరూపి” ఇలా అన్నాడు. “ఇదిగో తలుపు నీ యెదుట తీసియుంచి యున్నాను. దానిని ఎవడును వేయనేరడు” ప్రకటన 3:7,8. క్రీస్తు తలుపు తెరిచాడు. లేదా అతిపరిశుద్ధ స్థలంలో పరిచర్యను ప్రారంభించాడు. పరలోక గుడారపు తెరువబడ్డ ద్వారం నుంచి వెలుగు ప్రకాశిస్తున్నది. గుడారంలో ఉన్న ధర్మశాస్త్రంలో నాల్గో ఆజ్ఞ కలిసి ఉన్నట్లు, సూచించటం జరిగింది. దేవుడు స్థాపించిన దాన్ని ఏ మానవుడు కూల దోయలేడు.GCTel 407.1

    క్రీస్తు మధ్యవర్తిత్వ సేవను, ధర్మశాస్త్రం నిత్యత్వాన్ని అంగీకరించినవారు ఈ సత్యాలు ప్రకటన 14లో ఉన్నట్లు కనుగొన్నారు. ఈ అధ్యాయంలోని వర్తమానాల్లో త్రివిధ హెచ్చరిక ఉన్నది. దాని ఉద్దేశం లోక ప్రజలను ప్రభువు రెండో రాకకు సన్నద్ధం చేయటమే. “ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చెను” అన్న ప్రకటన మానవ రక్షణ నిమిత్తం క్రీస్తు చేస్తున్న పరిచర్య తుది ఘట్టాలుని సూచిస్తున్నది. మన రక్షకుని విజ్ఞాపన సేవ పూర్తి అయ్యి ఆయన తన ప్రజలను తన వద్దకు తీసుకొని వెళ్ళటానికి భూమికి తిరిగి వచ్చేంత వరకు ప్రకటితం కావలసిన ఒక సత్యాన్ని అది ప్రకటిస్తున్నది. 1844 లో ప్రారంభమైన తీర్పు జీవించివున్న వారు మరణించిన వారి కేసులు తీర్మానమయ్యేవరకూ తీర్పు కొనసాగాల్సిందే. కనుక మానవులకు కృపకాలం ముగిసేవరకూ అది కొనసాగుతుంది. తీర్పుకు నిలిచేందుకు సిద్ధపడటానికి గాను “దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి, ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగజేసిన వానికే నమస్కారము చేయుడి” అంటూ ఆ వర్తమానం ఆదేశిస్తున్నది. ఆ ధర్మశాస్త్రమే తీర్పులో ప్రవర్తనకు ప్రామాణికం కాబోతున్నది. అపోస్తలుడైన పౌలు ఇలా అంటున్నాడు. “ధర్మశాస్త్రము కలిగినవారై పాపము చేసిన వారందరు ధర్మశాస్త్రాను సారముగా తీర్పు నొందుదురు. దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనుష్యుల రహస్యములను విమర్శించు దినమందు ఈలాగు జరుగును” “ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుదురు.” అంటున్నాడు పౌలు. రోమా 2:1216. దైవ ధర్మశాస్త్రాన్ని ఆచరించటానికి విశ్వాసం ప్రాముఖ్యం. ఎందుకంటే ‘‘విశ్వాసము లేకుండ దేవునికి ఇష్టుడై యుండుట అసాధ్యము.” హెబ్రీ 11:6; రోమా 14:23.GCTel 407.2

    “దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి.” “భూమ్యాకాశాల సృష్టి కర్తగా ఆయననే ఆరాధించండి” అంటూ మొదటిదూత మనుష్యులకు పిలుపు నిచ్చాడు. ఇది చెయ్యాలంటే వారు ఆయన ధర్మశాస్త్రాన్ననుసరించి నివసించాలి.GCTel 408.1

    జ్ఞాని ఇలా హితవు పలుకుతున్నాడు, “దేవునియందు భయభక్తులు కలిగి యుండి ఆయన కట్టడల ననుసరించి నడుచుకొనవలెను. మానవకోటికి ఇదియే విధి”. దేవుని ఆజ్ఞలు గైకొనకుండా చేసే ఆరాధన దేవునికి హేయం. “మన మాయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట”. “ధర్మశాస్త్రము వినకుండ చెవిని తొలగించుకొనువాని ప్రార్ధన హేయము” 1 యోహాను 5:1; సామెతలు 28:9.GCTel 408.2

    దైవారాధన విధి దేవుడు మన సృష్టికర్త, సకలప్రాణుల సృష్టికర్త అన్నదానిమీద ఆధారపడి ఉన్నది. అన్యదేవుళ్లనుగాక ఆయననే సన్మానించి ఆరాధించటానికి బైబిలులో ఎక్కడ పిలుపు వస్తున్నదో అక్కడ ఆయన సృజన శక్తికి నిదర్శనం చూపటం జరుగుతున్నది. “జనముల దేవతలందరు వట్టి విగ్రహములే. యెహోవా ఆకాశ విశాలమును సృజించిన వాడు” కీర్తనలు 96:5. “నీవు ఇతనితో సమానుడవని మీరు నన్నెవనికి సాటిచేయుదురు?” అని ఆ పరిశుదుడు అడుగుచున్నాడు. “మీ కన్నులు పైకెత్తి చూడుడి. వీటిని ఎవరు సృజించెను?” “ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు. ఆయన భూమిని కలుగజేసి దాని సిద్ధపరచి స్థిరపరచెను... ఆయన సెలవిచ్చున దేమనగా యెహోవాను నేనే, మరి ఏ దేవుడును లేడు.”యెషయా 40:25,26; 45:18. కీర్తనకారుడిలా అంటున్నాడు.: “యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించెను. మనము ఆయన వారము.” “రండి నమస్కారముచేసి సాగిలపడుదము” కీర్తనలు 100:3;95:6. పరలోకంలో దేవుని పూజించే పరిశుద్ధ జీవులు తాము దేవునికి మహిమ ఘనత చెల్లించటానికి దీన్ని కారణంగా తెలుపుతున్నారు, “ప్రభువా, మా దేవా, నీవు సమస్తమును సృజించితివి... గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవు ” ప్రకటన 4:11.GCTel 408.3

    ప్రకటన 14 వ అధ్యాయంలో సృష్టికర్తను ఆరాధించవలసిందిగా మనుషులకు పిలుపు వస్తుంది. ఈ త్రివిధ వర్తమానం ఫలితంగా దేవుని ఆజ్ఞలను ఆచరించే ఒక తరగతి ప్రజలను ఈ ప్రవచనం మన ముందుంచుతుంది. నాల్గో ఆజ్ఞ ఇలా ప్రకటిస్తున్నది, “ఏడవ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము... ఆరు దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి యేడవ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాని పరిశుద్ధపరచెను” నిర్గమకాండము 20:10,11. సబ్బాతును గురించి ప్రభువింకా ఇలా అంటున్నాడు, “నేను మీ దేవుడనైన యెహోవానని మీరు తెలిసికొనునట్లు” “నాకును మీకును మధ్యను సూచనగా ఉండును” యెహెజ్కేలు 20:20. ఆయన ఇస్తున్న కారణం ఇది, “ఆరు దినములు యెహోవా భూమ్యాకాశములను సృజించి యేడవదినమున పని మాని విశ్రమించెను” నిర్గమకాండము 31:17.GCTel 409.1

    సృష్టి జ్ఞాపకార్థ చిహ్నంగా సబ్బాతుకున్న ప్రాధాన్యం ఏమిటంటే దేవుడు పూజార్హుడు ఎందుకో అన్నదానికి నిజమైన కారణాన్ని అది మన ముందుంచుతుంది; ఆయన సృష్టికర్త, మనమాయన సృజించినవారం. “కనుక సబ్బాతు దైవారాధనకు పునాది! ఎందుకనంటే ఈ గొప్ప సత్యాన్ని సబ్బాతు ఎంతో చక్కగా బోధిస్తున్నది. ఏ యితర వ్యవస్థ ఈ పని చేయటం లేదు. దైవారాధనకు నిజమైన ప్రాతిపదిక కేవలం ఏడో దినాన జరిగే ఆరాధనకే కాక, సకల ఆరాధనకు ప్రాతిపదిక ఆయన సృష్టికర్త, మనం సృష్టము అన్న భేదమే. ఈ మహత్తర సత్యం ఎన్నటికీ పాతబడదు. దీన్ని ఎన్నడూ విస్మరించకూడదు.” జె ఎన్ ఏండ్రూస్, హిస్టరీ ఆఫ్ ది సేబత్, అధ్యా 27. దేవుడు సబ్బాతును ఏదెనులో స్థాపించటంలోని ఉద్దేశం ఈ సత్యాన్ని మనుషుల మనసుల్లో నిత్యమూ ఉంచటమన్నదే. ఆయన మన సృష్టికర్త కాబట్టి ఆయనను ఆరాధిస్తున్నాం అన్నది ఎంత కాలం కారణంగా ఉంటుందో అంతకాలం సబ్బాతు గుర్తుగాను జ్ఞాపకార్ధ చిహ్నంగాను ఉంటుంది. లోకమంతా సబ్బాతును ఆచరించి ఉన్నట్లయితే సృష్టికర్తనే మానవుడు ఆరాధించి గౌరవించి తన ఆలోచనల్ని ప్రేమానురాగాల్ని ఆయనపైనే నిలిపేవాడు. ఒక్క విగ్రహారాధకుడుగాని, నాస్తికుడుగాని, అవిశ్వాసిగాని ఉండేవాడు కాదు. “ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగజేసిన” నిజమైన దేవుని పట్ల విశ్వసనీయతకు సబ్బాతు గురుతు. దేవునికి నమస్కారంచేసి ఆయన ఆజ్ఞలు గైకోవాలని అన్న ఆజ్ఞ ప్రధానంగా నాలో ఆజ్ఞను గైకోటానికి వచ్చే ఆజ్ఞ.GCTel 409.2

    దేవుని ఆజ్ఞలను యేసునుగూర్చిన విశ్వాసాన్ని గైకొనే ప్రజలకు భిన్నంగా మూడోదూత మరో తరగతి ప్రజల్ని, పేర్కొంటున్నాడు. వారి దోషాల్ని గర్జిస్తూ ఈ భయంకర హెచ్చరిక చేస్తున్నాడు, “ఆ క్రూర మృగమునకుగాని, దాని ప్రతిమకుగాని యెవడైనను నమస్కారము చేసి తన నొసటి యందేమి, చేతిమీదనేమి ఆ ముద్ర వేయించుకొనిన యెడల... దేవుని కోపమను మద్యమును వాడు త్రాగును” ప్రకటన 14:9. ఈ వర్తమానాన్ని అవగాహన చేసుకోటానికి ఇక్కడ ఉపయోగించిన గుర్తుల్ని నిరుష్టంగా అర్ధం చేసుకోటం అవసరం. మృగమూ, ప్రతిమ, ముద్రల భావం ఏమిటి?GCTel 410.1

    ఈ చిహ్నాలుగల ప్రవచనం ప్రకటన 12 తో ప్రారంభమవుతున్నది. క్రీస్తు పుట్టినప్పుడు ఆయనను నాశనం చేయటానికి ప్రయత్నించిన ఘటసర్పం అది. ఆ ఘటసర్పం సాతానే. ప్రకటన 12:9. రక్షకుణ్ని చంపటానికి హేరోదును ప్రోత్సహించిన వాడు సాతానే. అయితే క్రైస్తవశకంలోని తొలియుగాల్లో క్రీస్తుకూ క్రీస్తు ప్రజలకూ వ్యతిరేకంగా పోరాటం సాగించటానికి సాతాను ఏర్పర్చుకొన్న, ప్రతినిధి రోమా సామ్రాజ్యం. ఆ రాజ్యంలో అన్యమతమే ప్రధాన మతం. ఇలా ఘటసర్పం ప్రాధమికంగా సౌతానుని సూచించినా అది మరో విధంగా అన్యమతోన్మాది అయిన రోముకు సంకేతం.GCTel 410.2

    పదమూడో ఆధ్యాయం 1-10 వచనాలలో వేరొక మృగం ఉంది. “ఆ మృగము చిరుతపులిని పోలియుండెను.” దానికి ఆ ఘటసర్పం తన “బలమును, తన సింహాసనమును గొప్ప అధికారమును” ఇచ్చింది. పలువురు ప్రొటస్టాంటులు విశ్వసిస్తున్నట్లు ఈ చిహ్నం ఒకప్పుడు రోమా సామ్రాజ్యం కలిగిన బలాన్ని, చెలాయించిన అధికారాన్ని కైవసం చేసుకొన్న పోపుల అధికారాన్ని సూచిస్తుంది. చిరుతపులిని పోలిన మృగం గురించి ఇలా ఉన్నది: “డంబపుమాటలను, దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఇయ్యబడెను... దేవుని దూషించుటకును, ఆయన నామమును, ఆయన గుడారమును పరలోక వాసులను దూషించుటకును అది తననోరు తెరచెను. మరియు పరిశుదులతో యుద్ధము చేయను వారిని యింపను దానికి అధికారమియ్యబడెను. ప్రతి వంశము మీదను ప్రతి ప్రజమీదను ఆయా భాషలు మాట్లాడు వారిమీదను ప్రతి జనము మీదను అధికారము దానికియ్యబడెను”. దానియేలు 7 వ అధ్యాయములోని చిన్న కొమ్ము వర్ణనను పోలివున్న ఈ ప్రవచనం పోపుల అధికారాన్ని సూచిస్తుందనటానికి సందేహమేలేదు.GCTel 410.3

    “మరియు నలువది రెండు నెలలు తన కార్యము జరుపుటకు అధికారము దానికి ఏర్పాటాయెను”. “దాని తలలలో ఒకదానికి చావుదెబ్బ తగిలినట్లుండెను” అంటున్నాడు ప్రవక్త. ప్రవక్త ఇంకా ఇలా అంటున్నాడు, “ఎవడైనను చెరపట్టవలెననియున్న యెడల వాడు చెరలోనికిపోవును, ఎవడైనను ఖడ్గము చేత చంపిన యెడల వాడు ఖడముచేత చంపబడవలెను.” నలబైరెండు వారాలు, దానియేలు 7 లోని “కాలము కాలములు అర్ధకాలము”, మూడున్నర సంవత్సరాలు లేదా 1260 దినాలు ఒకటే. ఈ కాలవ్యవధిలో పోపుల అధికారం కింద దైవప్రజలు హింస అనుభవించారు. కిందటి అధ్యాయంలో చెప్పినట్లు ఈ హింసాకాలం క్రీ.శ. 538 లో ప్రారంభమై 1798 లో అంతమయ్యింది. ఆ సమయంలో పోపు ఫ్రెంచ్ సైన్యం చేతిలో చిక్కుకున్నాడు. పోపుల అధికారానికి చావుదెబ్బ తగిలింది. “ఎవడైనను, చెరపట్టవలెననియున్న యెడల వాడు చెరలోనికి పోవలెను” అన్నదాన్ని ఈ సంఘటన నెరవేర్చింది.GCTel 411.1

    ఇక్కడ ఇంకొక చిహ్నం దర్శనమిస్తున్నది. ప్రవక్త ఇలా అంటున్నాడు, “మరియు భూమిలోనుండి మరియొక క్రూరమృగము పైకి వచ్చుట చూచితిని. గొఱ్ఱపిల్ల కొమ్మువంటి రెండు కొమ్ములు దానికుండెను.” 11 వచనం. ఈ మృగం ఆకృతి దాని ఉతాన విధానాన్నిబట్టి చూస్తుంటే అది సూచించే రాజ్యం ఇంతకు ముందు చిహ్నాలు సూచించిన రాజ్యం వంటిది కాదని బోధపడుతున్నది. ప్రపంచాన్ని పాలించిన మహారాజ్యాలు దానియేలు ప్రవక్తకు క్రూరమృగాలుగా ప్రదర్శితమయ్యాయి. “ఆకాశపు నలుదిక్కుల నుండి సముద్రము మీద గాలి విసరుట”తో అవి లేచాయి. దానియేలు 7:2. జలాలు “ప్రజలను, జనసమూహములను, ఆయా భాషలు మాట్లాడువారిని” సూచిస్తున్నట్లు ప్రకటన 17 లో దూత వివరించాడు. ప్రకటన 17:15. గాలులు యులకు సంకేతం. సముద్రంపై సంఘర్షణ పడుతున్న నాలుగు గాలులు దాడులు విప్లవాలో రాజ్యాధికారాన్ని చేజిక్కించుకొన్న నాలుగు రాజ్యాల్ని సూచిస్తున్నాయి.GCTel 411.2

    గొర్రెపిల్ల కొమ్మువంటి కొమ్ములుగల మృగం “భూమిలో నుండి పైకి ” రావటం కనిపించింది. తన్నుతాను స్థిరపర్చుకొనేందుకు ఇతర రాజ్యాల్ని కూలదోసేకన్నా ఈ రాజ్యం క్రితంలో ఎవరి ఆధీనంలోనూ లేని ప్రదేశం నుంచి ఉత్పన్నమై క్రమేపీ శాంతియుతంగా పెరగాల్సి ఉన్నది. కనుక పెరుగుతున్న జనాభాతో సతమతమౌతున్న ప్రాచీన ప్రపంచంనుంచి జరుగలేదు. దీని ఉత్థానం. ప్రజలు, జనసమూహాలు, ఆయాభాషలు మాట్లాడే వారితో కల్లోలితమైన సముద్రం నుంచి కాదు. అది పశ్చిమ ఖండం నుంచి రావలసి ఉంది.GCTel 411.3

    ఏ రాజ్యం 1798 లో నవ ప్రపంచంలో అధికారంలోకి వచ్చి భవిష్యత్తులో గొప్ప శక్తిగా ప్రపంచ దృష్టిని ఆకర్షించింది? ఈ చిహ్నం వర్తింపులో ఎలాంటి సందేహానికి తావులేదు. ఈ ప్రవచనంలోని వైనాల్ని ఒకే ఒక దేశం నెరవేర్చుతుంది. ఇది కచ్చితంగా అమెరికా సంయుక్త రాష్ట్రాలనే సూచిస్తున్నది. ఈ రాజ్యం ఉత్థాన ప్రస్థానాలను వివరించటంలో వక్తలు చరిత్రకారులు పరిశుద్ధ లేఖన రచయిత భావాన్ని మాటల్ని తమకు తెలియకుండానే పదేపదే ఉపయోగించటం జరుగుతున్నది. మృగం “భూమిలో నుండి... పైకి వచ్చుట” కనిపించింది. “ పైకివచ్చుట” అన్నమాట “మొక్కలా పెరగటం” అన్న భావాన్ని స్పందిస్తుందంటున్నారు అనువాదకులు. క్రితం ఏమీలేని “భూభాగం నుంచి ఈ రాజ్యం ఉనికిలోకి రావాలని మనం తెలుసుకున్నాం. అమెరికా సంయుక్త రాష్ట్రాల ఉత్థానాన్ని ” ఖాళీస్థలం నుంచి అది పైకిలేచిన మర్మం”గా ప్రస్తావిస్తూ ఒక ప్రఖ్యాత రచయిత ఇలా అంటున్నాడు, “విత్తనంలా చడీచప్పుడులేకుండా మనం ఒక సామ్రాజ్యంగా ఎదిగాం.” జి ఎ టవున్ సెండ్, ది న్యూవల్డ్ కంపేర్డ్ విత్ ది ఓల్డ్, పుట 462. అమెరికా సంయుక్త రాష్ట్రాల్ని “భూమి మీద రాజ్యమేలుతున్న నిశ్శబ్ధంలో నుంచి దినదినం పెరుగుతూ అధికారాన్ని హూందాతనాన్ని సంతరించుకొంటున్న చక్కని సామ్రాజ్యంగా అభివర్ణించింది 1850లో ఒక ఐరోపా పత్రిక” - ది డబ్లిన్ నేషన్. ఈ రాజ్యం తాలూకు యాత్రిక సంస్థాపకుల్ని గురించి ప్రసంగిస్తూ ఎడ్వర్డ్ ఎనరెట్ ఇలా అన్నాడు. “విశ్రాంతి స్థలాన్ని, ఓ మూలన ఉన్న ఆజ్ఞాత ప్రదేశాన్ని దూరంగా ఉన్నందువల్ల సురక్షిత ప్రాంతాన్ని వారు అన్వేషించారా, తమ చిన్న లేడేన్ సంఘం మనస్సాక్షి స్వాతంత్ర్యాన్ని కలిగి నివసించటానికి? వారు సిలువపతాకాన్ని ఎగురవేసి శాంతియుతంగా జయించిన శక్తిమంతమైన భూభాగాన్ని కన్నులెత్తి చూడండి.” స్విచ్ డెలివర్డ్ ఎట్ ఫ్లిమత్, మేసచూసెట్స్, డిసెంబరు 22, 1824, పుటలు 11.GCTel 412.1

    “గొట్టెపిల్ల కొమ్మువంటి రెండు కొమ్ములు దాని కుండెను” గొర్రెపిల్ల కొమ్మువంటి కొమ్ములు యౌవనం, అమాయకత్వం, సాధుత్వాల్ని సూచిస్తున్నాయి. 1798 లో అమెరికా “పైకి వచ్చుట’ను ప్రవక్త చూసినప్పుడు ఈ గుణగణాలు అమెరికా ప్రవర్తనను చక్కగా సూచించాయి. రాజు వల్ల కలిగిన హింస, మతగురువుల అపహాస్యం కారణంగా అమెరికాకు పారిపోయిన బహిష్కృత క్రైస్తవుల్లో అనేకులు పౌరస్వేచ్ఛ, మత స్వేచ్ఛ పునాదిపై ప్రభుత్వాన్ని నెలకొల్పాలని తీర్మానించుకొన్నారు. వారి అభిప్రాయాలు స్వాతంత్ర్య ప్రకటనలో దృఢమైన స్థానం పొందాయి. ఇందులో వ్యక్తమైన గొప్ప సత్యం “మనుషులందరు సమానులుగా సృష్టించబడి” “జీవించటానికి, స్వాతంత్ర్యానికి సంతోషాన్ని అన్వేషించటానికి మార్పులేని పరిపాలనా హక్కును రాజ్యాంగం ప్రజలకు ఇస్తున్నది. ప్రజల ఓటు ద్వారా ఎన్నికైన ప్రతినిధులు చట్టాలను రూపొందించి, వాటిని అమలు చేస్తారని రాజ్యాంగం నిర్దేశిస్తున్నది. మత విశ్వాస పరంగా ప్రజలకు స్వాతంత్ర్యం కలిగింది. ప్రతి వ్యక్తికీ తన మనస్సాక్షి ప్రకారం దేవున్ని ఆరాధించే హక్కు దఖలుపడింది. గణతంత్ర పరిపాలనా విధానం, ప్రొటస్టాంట్ మత విశ్వాసం జాతి ప్రాధమిక సూత్రాలయ్యాయి. దేశం శక్తిమంతం కావటానికి, ప్రగతి సాధించటానికి వెనుక ఉన్న రహస్యం ఈ సూత్రాలే. క్రైస్తవ ప్రపంచంలోని పీడితులు అట్టడుగు ప్రజలు ఆశతో నిరీక్షణతో ఈ దేశం తట్టు తిరిగారు. లక్షలాది ప్రజలు ఈ దేశ తీరాలు చేరుకొన్నారు. అమెరికా ప్రపంచ దేశాల్లో మిక్కిలి శక్తిమంతమైన దేశంగా ఎదిగింది.GCTel 412.2

    అయితే గొర్రెపిల్ల కొమ్మువంటి కొమ్ములుగల మృగం “ఘటసర్పం వలె మాటలాడు చుండెను. అది మొదటి క్రూరమృగముకున్న అధికారపు చేపలన్నియు దాని యెదుట చేయుచున్నది. మరియు చావు దెబ్బ తగిలి బాగుపడి యున్న ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించువారును నమస్కారము చేయునట్లు అది బలవంతము చేయుచున్నది... కత్తిదెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూరమృగమునకు ప్రతిమ చేయవలెనని అది భూనివాసులతో చెప్పుచు”న్నది. ప్రకటన 13:11-14. గొర్రెపిల్ల కొమ్ము వంటి కొమ్ములు ఘటసర్ప స్వరమూ గల ఈ సంకేతం సూచించే రాజ్యం మాటలకు చేతలకు మధ్య ఉన్న తీవ్ర వైరుధ్యాన్ని సూచిస్తున్నది. ఈ దేశం “మాటలాడట” మంటే దానికున్న శాసనపరమైన న్యాయపరమైన అధికారాలు, తన విధానానికి పునాదిగా తాను చెప్పిన ఉదార శాంతియుత సూత్రాల ఆచరణ దాన్ని బూటకం చేస్తున్నది. అది “ఘటసర్పం వలె మాటలాడుచు” “ఆ మొదటి క్రూర మృగముకున్న అధికారము” చెలాయిస్తుందన్న ప్రవచనం ఘటసర్పం, చిరుతపులి వంటి మృగం ఏ దేశాలకు సంకేతాలుగా ఉన్నాయో ఆ దేశాలు ప్రదర్శించే, అపహాసాన్ని గూర్చి కలుగజేసే హింసను గూర్చి స్పష్టంగా చెబుతున్నది. ఆ రెండు కొమ్ముల మృగం ” మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించువారును నమస్కారము చేయునట్లు బలవంతము చేయును” అన్న మాట పోపుల ఆధిపత్యాన్ని గుర్తించే ఒకానొక ఆచారాన్ని అమలు పర్చటానికి ఆ దేశపు అధికారం వినియుక్తం కాబోతున్నదని సూచిస్తున్నది.GCTel 413.1

    అట్టిచర్య ఈ ప్రభుత్వ సూత్రాలకు, దాని స్వతంత్ర సంస్థల విధానాలకు, స్వాతంత్ర్య ప్రకటనకు, ప్రత్యక్ష గంభీర ప్రమాణాలకు, రాజ్యాంగానికి బద్ద విరుద్ధం. సంఘం రాజకీయాధికారాన్ని వినియోగించరాదని తీర్మానించటంలో దేశనిర్మాతలు విజ్ఞతతో వ్యవహరించారు. లేకుంటే దాని ఫలితంగా అసహనం హింస తప్పవు. “మత సంస్థాపన గురించిగాని, మత స్వేచ్ఛను నిషేధించటం గురించిగాని కాంగ్రెస్ (విధాన సభ) ఎలాంటి చట్టమూ చేయరాదని, అమెరికాలో ఏ పదవికైనా అర్హతగా మత సంబంధమైన ఏ పరీక్షా నిర్దేశించటంగాని” చేయరాదని రాజ్యాంగం ఆదేశిస్తున్నది. ప్రజా పాలకులు మత సంబంధమైన ఆచారాల్ని అమలుపర్చుటం దేశ స్వాతంత్ర్యాన్ని పరిరక్షించే సూత్రాలను అతిక్రమించటం ద్వారా సాధ్యపడుంది. అయితే అట్టి చర్య అసంబద్ధత ఆ సంకేతంలోనే కనిపిస్తున్నది. అది గొర్రెపిల్ల కొమ్మువంటి కొమ్ములున్న మృగంపైకి పవిత్రమైనది, సాధుగుణం కలది, హాని తలపెట్టనిది కాని ఘటసర్పం లాగ మాట్లాడుతుంది.GCTel 414.1

    “ఈ క్రూరమృగమునకు ప్రతిమను చేయవలెనని అది భూనివాసులతో చెప్పుచు”న్నది. ఇక్కడ మన దృష్టికి ఒక ప్రభుత్వం వస్తున్నది, దాని శాసనాధికారం ప్రజల చేతుల్లో ఉంటుందన్నప్పుడు ఇది అమెరికా సంయుక్త రాష్ట్రాల్ని నిర్దేశిస్తున్న దనటానికి ప్రవచనం బలమైన నిదర్శనం.GCTel 414.2

    ఇకపోతే “క్రూరమృగమునకు ప్రతిము” ఏమిటి? దాన్ని చేయటం ఎలా? ప్రతిమను రెండు కొమ్ముల మృగం చేస్తుంది. అది మృగానికి చేసే ప్రతివు. అందుకే ప్రతిమ ఎలా ఉంటుంది? అది ఎలా రూపొందుతుంది అన్న విషయాలు తెలుసుకోటానికి ఆ మృగం లేదా, పోపు వ్యవస్థ విలక్షణాల్ని అధ్యయనం చేయాలి.GCTel 414.3

    తొలి దినాల సంఘం సరళ సువార్త ప్రబోధాన్ని విడిచి పెట్టినందువల్ల భ్రష్టమైనప్పుడు అది దేవుని ఆత్మను దేవుని శక్తిని పోగొట్టుకొన్నది. కాబట్టి ప్రజల మనస్సాక్షుల్ని అదుపుచేయటానికి సంఘం లౌకిక అధికారుల అండదండలను ఆశ్రయించింది. ఫలితంగా పోపులవ్యవస్థ రూపు దాల్చింది. పోపుల సంఘం రాజకీయ ప్రభుత్వ అధికారాన్ని అదుపుచేసి దాన్ని తన ఉద్దేశాలు నెరవేర్పు కోసం ముఖ్యంగా “సంఘ సిద్ధాంత వ్యతిరేకతను” శిక్షించటానికి ఉపయోగించింది. సంయుక్త రాష్ట్రాలు మృగం విగ్రహాన్ని చేయాలంటే మతాధికారం, రాజకీయ ప్రభుత్వాధికారాల్ని అదుపుచేయాలి. ఇలా సంఘం తన ధ్యేయాల్ని సాధించటానికి రాజ్యాధికారాన్ని కూడా ఉపయోగించుకో వచ్చు .GCTel 414.4

    సంఘం ఎప్పుడైతే లౌకిక ప్రభుత్వాధికారాన్ని చేజిక్కించుకోగలిగిందో అప్పుడు తన సిద్ధాంతాలను వ్యతిరేకించినవారిని శిక్షించటానికి ఆ అధికారాన్ని ఉపయోగించు కొన్నది. లౌకిక శక్తులతో పొత్తు కుదుర్చుకోటం ద్వారా రోమను మతగురువుల అడుగుజాడల్ని అనుసరించి ప్రొటస్టాంట్ సంఘాలుకూడా మనస్సాక్షి స్వాతంత్ర్యాన్ని అదుపుచేసే తత్వాన్నే ప్రదర్శించాయి. అసమ్మతివాదుల్ని దీర్గకాలంగా హింసించిన చర్చ్ ఆఫ్ ఇంగ్లండు ఇందుకు చక్కని ఉదాహరణ. పదహారు పదిహేడు శతాబ్దాలలో వేలాది అసమ్మతి ప్రబోధకులు, సభికులు ఇరువర్గాలవారు జరిమానా విధింపుకు, ఖైదు శిక్షకు, హింసకు, శిరచ్ఛేదనకు గురి అయ్యేవారు.GCTel 415.1

    తొలి రోజుల్లోని మతభ్రష్టత లౌకిక ప్రభుత్వం ఆసరాసు ఆశ్రయించటానికి దారి తీసింది. ఇది పోపు వ్యవస్థ ఉత్థానానికి నాంది ప్రస్తావన పలికింది. పౌలిలా అన్నాడు, “భ్రష్టత్వము సంభవించి... పాప పురుషుడు బయలుపడతాడు. 2 థెస్సలో 2:3. కాబట్టి సంఘంలోని భ్రష్టత మృగం ప్రతిమను చేయటానికి మార్గం సుగమం చేస్తుంది.GCTel 415.2

    ప్రభువు రాకకు ముందు మతం క్షీణదశకు చేరుకుంటుందని బైబిలు చెబుతున్నది. అది తొలి శతాబ్దాలలోని క్షీణత మాదిరిగా ఉంటుంది. “అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలిసికొనుము. ఏలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు అహంకారులు తలిదండ్రులకు అవిధేయులు, కృష్ణతలేనివారు, అపవిత్రులు, అనురాగ రహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్తులు, గర్వాంధులు, దేవునికంటే సుఖానుభవము నెక్కువ ప్రేమించువారు, పైకి భక్తిగల వారివలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించనివారునై యుందురు.” 2 తిమోథి 3:1 5. “అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికులు వేషధారణవలన మోసపరచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాసభ్రష్టులగుదురు” 1 తిమోథి 4:1. సాతాను “అబద్ద విషయమైన సమస్త బలముతోను నానావిధములైన సూచక క్రియలతోను మహాత్కార్యములతోను దుర్నీతిని పుట్టించు సమస్తGCTel 415.3

    మోసముతోను” పని చేస్తాడు. “సత్యమును నమ్మక దుర్నీతియందు అభిలాష గలవారందరును” “అబద్ధమును నమ్మునట్లు మోసముచేయు శక్తి’కి వారిని విడిచి పెట్టటం జరుగుతుంది. 2 థెస్స2:9-11. భక్తిహీనత పరాకాష్టకు చేరుకొన్నప్పుడు తొలి శతాబ్దాల్లోని ఫలితాలే పునరావృతమౌతాయి.GCTel 415.4

    ప్రొటస్టాంట్ సంఘాల మధ్య ఉన్న విశ్వాసపరమైన భేదాలే ఒత్తిడి ద్వారా ఏకరూపత సాధించటానికి ఎంతటి కృషి జరిగినా అది ఫలించదనటానికి నిదర్శనమని అనేకుల అభిప్రాయం. అయితే ప్రొటస్టాంట్ విశ్వాసంగల సంఘాల మధ్య సిద్ధాంతపరమైన ఉమ్మడి అంశాల ప్రాతిపదికన ఐక్యత సాధించటానికి అనేక సంవత్సరాలుగా కృషి జరుగుతున్నది. అట్టి ఐక్యత సాధించటానికిగాను అందరూ ఏకీభవించని అంశాలపై - బైబిలు దృష్ట్యా అవి ఎంత ప్రాముఖ్యాంశాలైనా — చర్చ తప్పని సరిగా విడిచిపెట్టాలి.GCTel 416.1

    1846 వ సంవత్సరంలో చార్లెస్ బీచర్ తాను చేసిన ఒక ప్రసంగంలో “సువార్తిక ప్రొటస్టాంట్ సంఘాల ప్రబోధక వర్గం” కేవలం మానవుడికి భయంవల్ల తీవ్ర ఒత్తిడి కింద ఏర్పడటం మాత్రమేగాక సత్యాన్ని అణచివేసి, మతభ్రష్ట శక్తుల ముందు మోకాలు వంచి, దుర్మారత దుర్నీతితో నిండిన వాతావరణంలో నివసించటం, చలించటం, గాలి పీల్చుకోవటం సాగిస్తూ, తమ నీచ స్వభావాన్ని ప్రతి ఘడియ తృప్తి పరచు కొంటున్నారు” అంటూ వాపోయాడు.GCTel 416.2

    చార్లెస్ బీచర్ రోము విషయంలోనూ ఇలాంటి పరిణామాలే చోటు చేసుకోలేదా? రోము జీవితాన్ని మనం మళ్లీ జీవించటం లేదా? మన ముందు మనకేమి కనిపిస్తున్నది? ఇంకొక సర్వసభ్య సభ, ప్రపంచ సమావేశం, సువార్తికమైత్రి, సార్వజనీన మత విశ్వాసం”. సెర్మన్ ఆన్ ది బైబిల్ ఎ సఫిసెంట్ క్రీడ్, ఫోర్ట్ వేన్, ఇండియానా 1844 ఫిబ్రవరి 22 న చేసినది. ఇది సాధించటం జరిగితే అప్పుడు పూర్తి ఏకరూపత సాధించటానికి చేసే కృషిలో ఒత్తిడి చోటుచేసుకోవటం ఖాయం.GCTel 416.3

    ఉమ్మడి సిద్ధాంతాల ప్రాతిపదికన అమెరికాలోని ప్రముఖ సంఘాలు ఏకమై తమ నిర్ణయాన్ని అమలుపర్చటానికి, తమ సంస్థలను ఆదుకోటానికి, ప్రభుత్వాన్ని ప్రభావితం చేసినప్పుడు, ప్రొటస్టాంట్ అమెరికా రోము మతాధికారానికి ప్రతిమను చేయటం జరుగుతుంది. పర్యవసానంగా అసమ్మతివాదులకు శిక్షలు విధించటం తప్పనిసరి అవుతుంది.GCTel 416.4

    రెండు కొమ్ములుగల మృగం కొద్దివారుగాని, గొప్పవారుగాని, ధనికులుగాని, దరిద్రులుగాని, స్వతంత్రులుగాని, దాసులుగాని అందరును తమ కుడిచేతిమీదనైనను తమ నొసటియందైనను ముద్ర వేయించుకొనునట్లును, ఆ ముద్ర అనగా, ఆ మృగము పేరైనను, దాని పేరిట సంఖ్యయైనను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి యెవనికిని అధికారము లేకుండునట్లును... బలవంతము చేయుచున్నది.” ప్రకటన 13:16, 17. మూడోదూత ఇలా హెచ్చరించాడు: “ఆ క్రూర మృగమునకుగాని దాని ప్రతిమకుగాని యెవడైనను నమస్కారము చేసి తన నొసటియందేమి, చేతిమీదనేమి ఆ ముద్రను వేయించుకొనిన యెడల ఏమియు కలుపబడకుండ దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమను మద్యమును వాడు త్రాగును” ఈ వర్తమానంలో “క్రూరమృగము” మొదటి మృగం లేదా ప్రకటన 13 లోని చిరుతపులివంటి మృగం - పోపులవ్యవస్థ. దీనికి నమస్కారం చేయుమని రెండు కొమ్ములు గల మృగం బలవంతం చేస్తుంది. “క్రూరమృగమునకు ప్రతిమ” గ్రష్ట ప్రొటస్టాంట్ మతానికి సంకేతం. ప్రొటస్టాంట్ సంఘాలు తమ సిద్ధాంతాల అమలుకు రాజకీయ ప్రభుత్వ సహాయ సహకారాల్ని ఆశ్రయించినప్పుడు ఈ భ్రష్ట ప్రొటస్టాంట్ మతం ఏర్పడుంది. “మృగము ముద్ర” నిర్వచనం మున్ముందు వస్తుంది. మృ గానికిగాని, దాని ప్రతిమకుగాని నమస్కారం చేయటాన్ని గురించి హెచ్చరించిన మీదట ప్రవచనం ఇలా చెబుతున్నది, “దేవుని ఆజ్ఞలను యేసునుగూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును” మృగానికి దాని ప్రతిమకు నమస్కరించి దాని ముద్రను వేయించుకునే వారివలేగాక దేవుని ఆజ్ఞలు గైకొనేవారు ప్రత్యేకంగా ఉన్నారు. కనుక దేవుని ఆజ్ఞలు గైకొనేవారు ఆయనను ఆరాధించేవారని దేవుని ఆజ్ఞలను అతిక్రమించేవారు మృగానికి నమస్కరించే వారని వేర్పాటుగా కనిపిస్తారు.GCTel 416.5

    మృగం ప్రత్యేక లక్షణం దేవుని ఆజ్ఞలను అతిక్రమించటమే. పోపు వ్యవస్థను సూచిస్తున్న చిన్న కొమ్మును గురించి దానియేలు ఇలా అంటున్నాడు: “అతడు కాలాలను ధర్మశాస్త్రాన్ని మార్చటానికి యోచన చేస్తాడు” (దానియేలు 7:25, ఆర్.వి.). ఇదే అధికారాన్ని పౌలు “పాపపురుషుడు” అని వ్యవహరిస్తూ దేవునికన్నా తాను అధికుడనని అతడు చెప్పుకొంటాడు అంటున్నాడు. అతడు ఇలా మార్చిన ధర్మశాస్త్రాన్ని ఎవరు ఆచరిస్తారో, వారు మార్పుచేసిన అధికారాన్ని అందలం ఎక్కిస్తున్న వారవుతారు. పోపుల శాసనాలను గైకోవటం దేవునికి మారుగా పోపుకు భక్తి శ్రద్ధలు చూపించట మవుతుంది.GCTel 417.1

    పోపు వ్యవస్థ దైవధర్మశాస్త్రాన్ని మార్చటానికి ప్రయత్నిస్తూ వచ్చింది. విగ్రహారాధనను నిషేధించే రెండో ఆజ్ఞను ఆజ్ఞల్లో నుంచి తీసివేసింది. ఏడోదిన సబ్బాతు బదులు మొదటి దినాన్ని ఆచరించటానికి వీలుగా నాలో ఆజ్ఞను మార్చింది. కాగా రెండో ఆజ్ఞను తొలగించటానికి కారణం అది మొదటి ఆజ్ఞలో కలసి ఉండటం. అది అనవసరమని మనం గ్రహించటానికి దేవుడు ఏర్పాటుచేసిన విధంగా తాము దానిని అందిస్తున్నామని పోపుమతవాదుల వాదన. ప్రవచనం పేర్కొంటున్న మార్పు ఇదికాదు. ఉద్దేశపూర్వకం బాహాటం అయిన మార్పును ఇక్కడ సూచించటం జరిగింది. “అతడు పండుగ కాలములను న్యాయపద్దతులను నివారణచేయ బూనుకొనును”. నాలో ఆజ్ఞలోని మార్పు ప్రవచనాన్ని కచ్చితంగా నెరవేర్చుతున్నది. ఈ మార్పుకు తమకున్న హక్కు సంఘాధికారమట. ఇక్కడ పోపు అధికారం దేవునికి పైగా తన్ను తాను హెచ్చించు కొంటున్నది.GCTel 417.2

    నాల్లో ఆజ్ఞ దేవుని సృజన శక్తికి చిహ్నం గనుక, మానవుడి పూజకు శ్రద్ధాంజలికి ఆయనకున్న హక్కుకు అది సాక్ష్యం గనుక, దేవుని ఆరాధించే వారు నాల్గో ఆజ్ఞను గౌరవిస్తూ తమ్మును తాము ప్రత్యేకించు కొంటుంటే, మృగానికి నమస్కరించే వారు సృష్టికర్త స్మారక చిహ్నాన్ని నాశనం చేసే కృషి ద్వారా రోము వ్యవస్థను ఘనపర్చుతూ తమ్మును తాము ప్రత్యేకించు కొంటున్నారు. పోపు వ్యవస్థ ప్రథమంగా తనకు హక్కులున్నాయంటూ ఆదివారం సందర్భంగా వ్యక్తం చేసింది. ఆదివారాన్ని - “ప్రభువు దినము”గా ఆచరించటానికి ఒత్తిడితేవటంలో ప్రథమంగా రాజకీయ ప్రభుత్వాధికారాన్ని ఆశ్రయించింది. అయినా ఆదివారాన్ని కాదు ఏడోదినాన్ని “ప్రభువు దినము”గా బైబిలు పేర్కొంటున్నది. “మనుష్యకుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువునైయున్నాడు.” అన్నాడు క్రీస్తు: “ఏడవ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము” అని నాల్గో ఆజ్ఞ ప్రకటిస్తున్నది. అది “నాకు ప్రతిష్ఠితమైన దినము” అని యెషయా ప్రవక్త ద్వారా ప్రభువు అంటున్నాడు. యెషయా 53:13.GCTel 418.1

    సబ్బాతును క్రీస్తే మార్చాడు అంటూ తరచుగా వినిపిస్తున్న వాదన అసత్యమని ఆయన మాటలే నిరూపిస్తున్నాయి. కొండమీద ప్రసంగంలో ఆయన ఇలా అన్నాడు: “ధర్మశాస్త్రము నైనను ప్రవక్తల ప్రవచనములనైనను కొట్టివేయ వచ్చితినని తలంచవద్దు. నెరవేర్చుటకేగాని కొట్టివేయుటకు నేను రాలేదు. ఆకాశమును భూమియు గతించి పోయిననేగాని ధర్మశాస్త్ర మంతయు నెరవేరువరకు దాని నుండి యొక పొల్లయినను ఒక సున్నయైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. కాబట్టి యీ ఆజ్ఞలలో మిగుల అల్పమైన యొకదానినైనను మీరి మనుష్యులకు ఆలాగున చేయ బోధించువాడెవడో వాడు పరలోకరాజ్యములో మిగుల అల్పుడనబడును. అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో గొప్పవాడనబడును.” మత్తయి 5:719.GCTel 418.2

    సబ్బాతు మార్పుకు లేఖనాధికారం లేదన్నది సత్యమని ప్రొటస్టాంట్లు ఒప్పుకొంటున్నారు. అమెరికా ట్రాక్ట్ సొసైటీవారు, అమెరికన్ సండేస్కూలు యూనియన్ వారు ప్రచురించిన పత్రికల్లో ఈ విషయాన్ని వ్యక్తం చేశారు: “సబ్బాతు (ఆదివారం వారంలో మొదటి దినం) గురించిగాని, దాని ఆచరణ విషయంలో నిర్దిష్ట నియమ నిబంధనల విషయంలో గాని నూతన నిబంధన ఎక్కడా ఏమీ చెప్పటంలేదు” అని ఈ పత్రికల్లో ఒకటి ఒప్పుకొంటుంది. - జార్జి ఎలియట్, ది ఎ బైడింగ్ సేఒత్, పుట 184.GCTel 419.1

    ఇంకొక ప్రచురణ ఇలా అంటుంది: “క్రీస్తు మరణించిన సమయం వరకు ఆ దినంలో మార్పు జరగలేదు.” “రికార్డుల మేరకు ఏడోదిన సబ్బాతును విడిచి పెట్టాల్సిందిగా కచ్చితమైన ఆజ్ఞగాని సబ్బాతును వారంలో మొదటి రోజున ఆచరించాల్సిందిగా ఆదేశంగాని శిష్యులు ఇచ్చినట్లులేదు” - ఎ.ఇ.వాఫల్, ది లాడ్స్ డె, పుటలు 186,188. GCTel 419.2

    సబ్బాతు మార్పును తామే చేసినట్లు, రోమను కథోలిక్ సంఘనేతలు ఒప్పు కొంటున్నారు. ఆదివారాన్ని ఆచరించటం ద్వారా ప్రొబస్టాంట్లు తమ అధికారాన్ని గుర్తిస్తున్నారని ఎద్దేవా చేస్తున్నారు. ‘’కేథలిక్ కేటకిజమ్ ఆఫ్ క్రిష్టియన్ రిలిజన్” అన్న పుస్తకంలో నాలో ఆజ్ఞ ననుసరించి ఆచరించాల్సిన దినం ఏదన్న ప్రశ్నకు ఈ సమాధానం ఉన్నది, “ప్రాచీన ధర్మశాస్త్ర కాలంలో శనివారం పరిశుద్ధపర్చబడ్డ దినం. అయితే యేసుక్రీస్తు ఉపదేశానుసారం, పరిశుద్ధాత్మ ఆదేశం ప్రకారం సంఘం శనివారానికి మారుగా ఆదివారాన్ని నిలిపింది. కాబట్టి ఇప్పుడు మేము మొదటి రోజును పరిశుద్ధ పర్చుతున్నాం. ఏడోరోజును కాదు. ఆదివారమంటే ప్రభువు దినం. ఇప్పుడు ప్రభువు దినం ఆదివారమే.”GCTel 419.3

    కథోలిక్ సంఘానికి అధికారం ఉన్నదనటానికి మద్దతుగా కథోలిక్ రచయితలు ‘‘సబ్బాతును ఆదివారానికి మార్చటాన్ని ఆ మార్పును ప్రొటస్టాంట్లు అనుమతించటాన్ని ఉటంకిస్తున్నారు. ఎందుకంటే ఆదివారాన్ని ఆచరించటం ద్వారా పండుగ దినాలు ఏర్పర్చటానికి, పాపం చేసినప్పుడు తమను ఆదేశించటానికి సంఘానికి అధికారమున్నదని వారు అంగీకరిస్తున్నారు.” - హెన్రీ టూబర్ విల్, ఏన్ ఎబ్రిడ్జిమెంట్ ఆఫ్ ది క్రిస్టియన్ డాక్ట్రిన్, పుట 58. సబ్బాతు మార్పు అంటే రోమను కథోలిక్ సంఘాధికార సూచన లేక ముద్ర - “మృగము ముద్ర”GCTel 419.4

    తనకు సర్వోన్నత అధికారమున్నదని కథోలిక్ సంఘం ఇంకా నమ్ముతున్నది. లోకము ప్రొటస్టాంట్ సంఘాలు తాను సృష్టించిన సబ్బాతును అంగీకరించి బైబిలు సబ్బాతును తిరస్కరించినాడు ఆ సంఘం ఊహించుకొంటున్నదాన్ని వారు అంగీకరించినట్లే. ఈ మార్పుకి ఆధారంగా సంప్రదాయాన్ని ఫాదర అధికారాన్ని వారు చూపవచ్చును గాక. అలా చేయటంలో తమను రోము నుంచి వేరుచేసిన నియమాన్ని వారు విస్మరిస్తున్నారు. తమ్మును తాము వంచించుకొంటున్నట్లు, సత్యాలను చూడకుండా కావాలని కళ్లుమూసు కొంటున్నట్లు “బైబిలు-బైబిలు మాత్రమే అన్నది ప్రొటస్టాంట్ మతం” అన్న నియమం విషయంలో పోపు చూడగలుగుతాడు. ఆదివారాచరణకు ఉద్యమం బలం పుంజుకొన్నప్పుడు అతడు ఉత్సహిస్తాడు. త్వరలో ప్రొటస్టాంట్ లోకం రోమనుమత పతాకం కిందకు తప్పక వస్తుందని ఎదురు చూస్తాడు. ఆదివారాన్ని ఆచరించటంద్వారా ప్రొటస్టాంట్లు తమకు ఇష్టం లేకపోయినా కథోలిక్ సంఘాధికారానికి నివాళులర్పిస్తున్నారని రోమను మత వాదులు ప్రకటిస్తున్నారు.” - ఎమ్ జిఆర్ సెగూర్, ప్లెయిన్ టాక్ ఎబౌట్ ది ప్రొటస్టాంటిజమ్ టు డే, పుట 21 3. ప్రొటస్టాంట్ సంఘాలు ఆదివారాచరణను అమలు పర్చటం పోపు మతానికి అనగా మృగానికి నమస్కరించటాన్ని అమలు పర్చటమే. నాల్గో ఆజ్ఞ కోరుతున్నదేంటో అవగాహన కలిగి ఉండి కూడా నిజమైన సబ్బాతు బదులు అబద్ధ సబ్బాతును ఆచరించటానికి ఎంపిక చేసుకొనే వారు ఏ అధికారమైతే దాన్ని ఆదేశించిందో ఆ పోపుల అధికారానికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. లౌకిక అధికారం మత పరమైన విధిని అమలుపర్చటం ద్వారా సంఘాలు స్వయంగా మృగం విగ్రహాన్ని చేస్తున్నాయి. కనుక అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఆదివారాచరణ అమలు వాస్తవంలో మృగము దాని ప్రతిమ ఆరాధన అమలే అనాలి.GCTel 420.1

    అయితే గతించిన కాలాల్లో క్రైస్తవులు బైబిలు సబ్బాతునే ఆచరిస్తున్నామన్న భావనతో ఆదివారాన్ని ఆచరించారు. కథోలిక్ సంఘంలో సహా ప్రతి సంఘంలోనూ దేవుడు నియమించిన సబ్బాతు దినం ఆదివారమే అని చిత్తశుద్ధితో నమ్మేవారు ఉంటారు. వారి భక్తిని యధార్ధతను దేవుడు అంగీకరిస్తాడు. కాకపోతే ఆదివారాచరణను చట్టం ద్వారా అమలు పర్చినప్పుడు యధార్ధ సబ్బాతును గూర్చి లోకమంతా చైతన్యవంతం అయినప్పుడు రోము అధికారం కన్న ఉన్నతమైన దేవుని ఆజ్ఞను ఎవరు మీరతారో వారు ఆ విధంగా దేవుని గాక పోపు అధికారాన్ని గౌరవించినవారవుతారు. వారు రోమును, రోము ఏర్పాటుచేసిన వ్యవస్థను అమలుపర్చే అధికారానికి పాదాభివందనం చేస్తున్నవారవుతారు. వారు ఆ క్రూరమృగానికి దాని ప్రతిమకు సమస్కారం చేస్తున్నారు. తన అధికారానికి చిహ్నంగా దేవుడు నిర్దేశించిన వ్యవస్థను మనుషులు తోసిపుచ్చి దానికి మారుగా రోము తన అధికారానికి గుర్తుగా ఎంపిక చేసుకొన్న దాన్ని గౌరవిస్తూ ఆ క్రియవలన వారు రోముకి విశ్వాసపాత్రులై “మృగము ముద్ర”ను పొందుతారు. సమస్య ఈ విధంగా స్పష్టంగా ప్రజల ముందుకువచ్చి వారు దేవుని ఆజ్ఞలనో మనుషులు కల్పించిన ఆజ్ఞలనో ఎంపికచేసుకొనే వరకు అజ్ఞాతిక్రమంలో జీవిస్తున్న ప్రజలు “మృగము ముద్ర’ను పొందరు.GCTel 420.2

    మానవులను ఉద్దేశించి వస్తున్న అతిభయంకరమైన బెదరింపు మూడో దూత వర్తమానంలో ఉన్నది. కృప కలుపకుండా దేవుని ఉగ్రత కుమ్మరింపుకు కారణమైన పాపం భయంకర పాపమయి ఉండాలి. ముఖ్యమైన ఈ అంశంపై మానపులు చీకటిలో కొట్టుమిట్టాడాల్సిన అవసరం లేదు. లోకంపై దేవుని తీర్పులు పడకముందు తమకు శ్రమలు ఎందుకు వస్తాయో అందరూ తెలుసుకొని వాటి నుంచి తప్పించుకొనే అవకాశం కలిగివుం డేందుకుగాను ఈ పాపాన్ని గూర్చిన హెచ్చరిక వస్తుంది. మొదటి దూత తన ప్రకటనను “ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషలు మాట్లాడు వారికిని” ప్రకటన చేస్తున్నట్లు ప్రవచనం చెబుతున్నది. మూడో దూత చేసే హెచ్చరిక కూడా ఈ త్రివిధ వర్తమానంలో భాగమే. అది కూడా విస్తృతంగా ప్రకటితం కావలసివుంది. ఆకాశ మధ్యంలో ఎగురుతున్న దూత గొప్ప స్వరంతో ఆ వర్తమానాన్ని ప్రకటిస్తున్నట్లు ప్రవచనం చిత్రిస్తున్నది. ఆ వర్తమానం ప్రపంచం దృష్టిని ఆకర్షించనుంది.GCTel 421.1

    ఈ అంశంపై పోటీలో క్రైస్తవ లోకమంతా రెండు వర్గాలుగా ఏర్పడుతుంది. దేవుని ఆజ్ఞలను యేసుని గూర్చిన విశ్వాసాన్ని కాపాడే వారు ఒకవర్గం. ఆ క్రూరమృగానికి దాని ప్రతిపకు నమస్కరించి దాని ముద్రను పొందేవారు ఇంకోవర్గం.. “కొద్దివారుగాని గొప్పవారుగాని, ధనికులుగాని దరిద్రులుగాని స్వతంత్రులుగాని దాసులుగాని అందరు” ప్రకటన 13:17. “మృగము ముద్ర” పొందటానికి సంఘము రాజకీయ ప్రభుత్వం ఏకమై తమ అధికారాన్ని ఉపయోగించి ఒత్తిడి చేసినా దేవుని ప్రజలు ఆ ముద్రను వేయించుకోరు. “ఆ క్రూరమృగమునకును దాని ప్రతిమకును దాని పేరుగల సంఖ్యకును లోబడక వాటిని జయించినవారు దేవుని వీణిలుగలవారై ఆ స్పటికపు సముద్రము నొద్ద నిలిచియుండుడి” మోషే పాట గొర్రెపిల్ల పాట పాడటం పత్మాసు ప్రవక్త యోహాను చూశాడు. ప్రకటన 15:2,3.GCTel 421.2

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents