Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
మహా సంఘర్షణ - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    అధ్యాయం 6—హస్, జెరోమ్ లు

    సువార్త తొమ్మిదో శతాబ్దంలోనే బోహీమియాలో ప్రవేశించింది. బైబిలు ప్రజల భాషలోకి అనువాద మయ్యింది. ప్రజల ఆరాధన సమావేశాలు జరిగాయి. కాకపోతే పోపు అధికారం పెరగటంతో దైవవాక్య ప్రాధాన్యం తగ్గింది. గ్రెగరి VII రాజుల గర్వం అణచాలని పెట్టుకున్నాడు. ప్రజల్ని తన బానిసలు చేసుకోవాలన్నది అతని అభిమతం. కనుక బోహీమియా భాషలో బహిరంగ ఆరాధనలు జరపటాన్ని నిషేధిస్తూ బుల్ ప్రకటన జారీ చేశాడు. “ఆరాధనలు తెలియని భాషలోనే జరపటం సర్వశక్తిగల దేవునికి ఎంతో ఇష్టమని, ఈ నిబంధనను పాటించనందున ఎన్నో అనర్థాలు తప్పుడు బోధలు ప్రబలుతున్నాయని” పోపు ప్రకటించాడు. విలీ, పుస్త3, అధ్యా 1. ఈ విధంగా దైవ వాక్య దీపాన్ని ఆర్చివేసి ప్రజల్ని చీకటిలో బంధించి ఉంచాలని రోము ఆదేశించింది. కాగా సంఘాన్ని సంరక్షించటానికి దేవుడు ఇతర సాధనాల్ని ఏర్పాటు చేశాడు. హింసవల్ల ఫ్రాన్స్, ఇటలీ దేశాల్లోని తమ గృహాలు విడిచి ఇతర దేశాలకు వెళ్లిపోయిన అనేకమంది వాల్దెన్సీయులు, అల్జీజనులు, బోహీమియాకు వచ్చారు. బహిరంగంగా బోధించలేక పోయినా వారు రహస్యంగా ఎంతో ఉద్రేకంతో పని చేశారు. ఇలా శతాబ్దాల కొద్దీ యధార్ధ విశ్వాసం చెక్కు చెదరకుండా నిల్చింది.GCTel 78.1

    సంఘంలోని అవినీతిని ప్రజల దుర్వర్తనను ఖండించిన మనుషులు హస్ రోజులకు ముందే బోహేమియాలో ఉన్నారు. వారి కృషి ప్రజాదరణ పొందింది. రోము అధికారుల భయాల్ని రెచ్చగొట్టింది. ఫలితంగా సువార్త బోధకులను హింసించటం మొదలయ్యింది. నివాస ప్రదేశాలు విడిచి అడవుల్లోను కొండ కోనల్లోను ఆరాధనలు జరుపుకొంటున్న వారిని సైనికులు జంతువులల్లే వేటాడి చంపారు. కొంతకాలం తరువాత రోము ఆరాధన క్రమాన్ని అనుసరించని వారిని సజీవదహనం చేయాలని ఆదేశం జారీచేసింది. అయినా ప్రాణాల్ని విడిచిపెట్టే తరుణంలో క్రైస్తవులు తమ కార్యం సిద్ధించే సమయం వస్తుందని ఎదురుచూస్తూ మరణించారు. ” సిలువ అనుభవించిన రక్షకుని మీద విశ్వాసం వలన మాత్రమే రక్షణ కలుగుతుందని బోధించిన వారిలో ఒకడు మరణిస్తూ ఇలా ప్రకటించాడు. “సత్య విరోధుల ఉగత ప్రస్తుతం మాపై గెలుపు సాధిస్తున్నది గాని, అది నిరంతరం ఉండదు. సామాన్య ప్రజల మధ్యనుంచి ఖడ్గంగాని అధికారంగాని లేని వాడొకడు లేస్తాడు. ఆయనపై వారు జయం సాధించటం జరగదు.” అదే పుస్తకం 3, అధ్యా. 1. లూథర్ దినాలు ఇంకా ఎంతో దూరంలో ఉన్నాయి. కాని అప్పుడే ఒక వ్యక్తి సన్నద్ధమౌతున్నాడు. రోమును ఖండిస్తూ ఆయన ఇవ్వనున్న సాక్ష్యం జనాలను మేలుకొలపనున్నది. GCTel 78.2

    జాన్వాస్ బీదకుటుంబంలో జన్మించాడు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయాడు. తల్లి భక్తిపరురాలు. విద్యకి, దైవ భీతికి అత్యంత ప్రాముఖ్యాన్నిచ్చి తన కొడుక్కి ఈ వారసత్వాన్ని అందించాలని కృషి చేసింది. హస్ ప్రాంతీయ పాఠశాలలో విద్య నభ్యసించి అనంతరం ప్రాన్స్ నగరంలో వున్న విశ్వవిద్యాలయంలో ఉచిత విద్యార్థిగా ప్రవేశం పొందాడు.ప్రాగ్ నగర ప్రయాణంలో తల్లి ఆయనతో వెళ్లింది. వితంతువు, నిరుపేద. కుమారుడి కివ్వటానికి ఆమెకు ఏమీలేదు. ఆ మహానగరాన్ని సమీపిస్తుండగా ఆ తండ్రిలేని బిడ్డపక్క మోకరించి పరలోకమందున్న తండ్రి దీవెనలు తన కుమారుడిపై ఉండాలని ప్రార్ధించింది. తాను చేసిన ఆ ప్రార్థనకు జవాబు ఏ విధంగా రానున్నదో ఆ తల్లికి తెలియలేదు.GCTel 79.1

    కష్టపడి చదివి త్వరితాభివృద్ధి సాధించి హస్ విశ్వవిద్యాలయంలో పేరు ప్రతిష్టలు సంపాదించుకొన్నాడు. తన నిష్కళంక జీవితం తన వినయ విధేయతలు, సత్ప్రవర్తన వలన అందరి ప్రేమాదరాలను సంపాదించాడు. రోమును సంఘంలో హస్ నమ్మకమైన సభ్యుడు. ఆ సంఘం ఒనగూర్చుతానని చెప్పుకొంటున్న ఆధ్యాత్మిక దీవెనలను పొందాలని ఆత్రుతగా ఉన్న భక్తుడు. ఒక ఉత్సవ సమయంలో హస్ ఒక క్షమాపణ కార్యక్రమానికి హాజరై తన వద్ద ఉన్న చివరి కొన్ని నాణేల్ని చెల్లించి, వాగ్దాత్త క్షమాపణ పొందేందుకు ఊరేగింపులోకలిసి వెళ్లాడు. కళాశాల విద్య అనంతరం మత ప్రబోధ వృత్తిని స్వీకరించి స్వల్పకాలంలోనే ఖ్యాతి గడించి రాజు న్యాయస్థాన సంబంధమైన హోదాలో స్థిరపడ్డాడు. తాను విద్యనభ్యసించిన విశ్వవిద్యాలయంలో ఆచార్యుడుగాను దరిమిల అధ్యక్షుడు(రెక్టర్) గాను నియామకం పొందాడు. కొన్ని సంవత్సరాల్లోనే ఈ పేద ఉచితవిద్యార్థి తన దేశానికి గర్వకారణమై ఐరోపా ఖండంలో కీర్తి ప్రతిష్టలు గడించాడు.GCTel 79.2

    అయితే హస్ సంస్కరణ ఉద్యమాన్ని మరో భూభాగంలో ప్రారంభించాడు. మత ప్రబోధకుడి ఆదేశాల కింద అనేక సంవత్సరాలు పని చేశాక బేల్లెహేము ఆలయంలో బోధకుడుగా నియామించబడ్డాడు. ఈ ఆలయ సంస్థాపకుడు లేఖన బోధ ప్రజల భాషలో జరగాలన్నది ఎంతో ప్రాముఖ్య విషయంగా ప్రబోధించాడు. రాము అధికారులు దీనికి సముఖంగా లేకపోయినా బోహీమియాలో ఆ ఆచారం పూర్తిగా ఆగిపోలేదు. అయినా బైబిలు గురించి తెలిసిన వారు చాలా తక్కువమంది. అన్ని వర్గాల ప్రజల్లోనూ ఘోర దుర్గుణాలు రాజ్యమేలుతున్నాయి. వీటిని హస్ నిర్మొహమాటంగా ఖండిచాడు. దైవ వాక్యంలోని సత్యాన్ని పరిశుద్ధతను అనుసరించాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తూ వాటిని వారికి నేర్పించాడు.GCTel 80.1

    ప్రాగ్ నగర నివాసి, కొంత కాలం గడిచాక హస్ కు సన్నిహిత సహచరుడు అయిన జెరోమ్ ఇంగ్లాండు నుంచి స్వదేశానికి తిరిగి వచ్చేటప్పుడు తనతో విక్లిఫ్ రచనలు తెచ్చాడు. విక్లిఫ్ బోధనల్ని అంగీకరించి మార్పు చెందిన ఇంగ్లాండు దేశపు రాణి బోహీమియా యువరాణి. ఆమె ప్రభావ ఫలితంగా కూడ తన మాతృదేశమైన బోహీమియాలో సంస్కరణవాద విక్లిఫ్ రచనలు చాలా ప్రాచుర్యం పొందాయి. ఈ పుస్తకాన్ని హస్ అమితాశక్తితో అధ్యయనం చేశాడు. ఆ పుస్తక రచయిత నిజాయితీపరుడైన క్రైస్తవుడని నమ్మాడు. ఆ రచనల్లో ఆయన ప్రబోధించిన సంస్కరణలకు సానుకూలంగా స్పందించాడు. తనకు తెలియకపోయినా ఆప్పటికే రోముకు దూరంగా నడిపించే మార్గంలో హస్ ప్రస్థానం ఆరంభమయ్యింది.GCTel 80.2

    దాదాపు ఇదే సమయంలో ఇంగ్లాండు నుంచి వచ్చిన ఇద్దరు పరదేశులు ప్రాగ్ నగరానికి వచ్చారు. వీరు బాగా చదువుకున్న వారు. సత్యాన్ని నేర్చుకొని దూరాన ఉన్న ఈ దేశంలో దాన్ని ప్రకటించటానికి వచ్చారు. వారు పోపుల సర్వాధికారంపై మొదట దాడి మొదలు పెట్టారు. అధికారులు వారిని మాట్లాడకుండా చేయటంతో తాము తల పెట్టినకార్యాన్ని విడిచి పెట్టటం ఇష్టం లేక వారు ఇతర చర్యలకు పూనుకొన్నారు. వారు చిత్రకారులు, బోదకులుకూడా. వారు తమ కళాకౌశలాన్ని ప్రదర్శించటం మొదలు పెట్టారు. ఒక బహిరంగ స్థలంలో వారు రెండు బొమ్మలు గీశారు. ఒకటి యేసు యెరూషలేములో ప్రవేశించటం సూచిస్తున్న బొమ్మ-సాత్వికుడై గాడిదను ఎక్కి” (మత్తయి 21:5) వెళ్తుండగా ప్రయాణంవల్ల మాసిన వస్త్రాలతో వట్టికాళ్లతో శిష్యులు ఆయన వెంబడి నడుస్తున్నారు. ఇక రెండవది పోపుల ఊరేగింపును సూచిస్తున్న బొమ్మ. విలువైన దుస్తుల్లో తలపై మూడంతస్తుల కిరీటంతో అందమైన అలంకరణలతో ముస్తాబైన గుర్రం మీద కూర్చుండగా ముందు బాకాలు ఊదేవారు, వెనుక కార్డినర్లు, ప్రిలేటులు నడుస్తుండగా తళుకు బెళుకులతో సాగుతున్న పోపు ఊరేగింపు అది.GCTel 80.3

    అన్ని తరగతుల ప్రజల్ని ఆకట్టుకొన్న ప్రసంగమది. ప్రజలు తండోపతండాలుగా వచ్చి ఆ చిత్రాన్ని విరగబడి చూస్తున్నారు. వాటి నీతిని గ్రహించని వారు లేరు. క్రీస్తు ప్రభువు సాత్వీకానికి, విధేయతకు, ఆయన సేవకుడినని చెప్పుకుంటున్న పోపు గర్వానికి అహంకారానికి మధ్య గల వ్యత్యాసాన్ని గుర్తించి బాధపడని వారు లేరు. ప్రాగ్ నగరంలో గొప్ప గందరగోళం బయలు దేరింది. కొంతసేపు అయ్యాక తమ భద్రత దృష్టిలో ఉంచుకొని ఆ పరదేశులు ఆ నగరాన్ని విడిచి వెళ్లటం అవసరమని భావించారు. వారు బోధించిన పాఠం మాత్రం మరపురానిది. ఆ చిత్రాలు హస్ మనసును ఎంతగానో ఆకర్షించాయి. బైబిలుని విక్లిఫ్ రచనల్ని హస్ మరింత లోతుగా అధ్యయనం చేయటానికి అవి దారితీశాయి. విక్లిఫ్ ప్రబోధించిన సంస్కరణల్ని అంగీకరించటానికి ఇంకా సంసిద్ధంగా లేకపోయినా పోపుల నిజ స్వరూపాన్ని హస్ స్పష్టంగా చూడగలిగాడు. అధికారశ్రేణి దర్పాన్ని దురాశను అవినీతిని మరింత ఉత్సాహంతో నిరసించాడు.GCTel 81.1

    బోహీమియా నుంచి సత్యం జర్మనీకి విస్తరించింది. ప్రాగ్ విశ్వవిద్యాలయంలో చెలరేగిన అల్లర్ల కారణంగా వందలాది జర్మను విద్యార్థులు స్వదేశానికి తిరిగి వెళ్లిపోయారు. వారిలో అనేకమందికి హస్ బైబిలుని పరిచయం చేశాడు. వారు తమ స్వదేశానికి తిరిగి వెళ్లాక సువార్తను తమ దేశ ప్రజలకు ప్రకటించారు.GCTel 81.2

    ప్రాగ్ విశ్వవిద్యాలయ వార్తలు రోముకు చేరాయి. పోపు ముందు నిలువ వలసిందిగా హస్ కి ఆదేశాలు అందాయి. వాటిని శిరసావహించట మంటే మరణాన్ని కోరి తెచ్చుకోవటమే అవుతుంది. బోహీమియా రాజు, రాణి విశ్వ విద్యాలయ అధ్యాపకులు, సామంతులు, ప్రభుత్వాధికారులు హస్ ప్రాగ్ లోనే ఉండి ప్రతినిధి ద్వారా తనకు రోములో సమాధానం చెప్పటానికి అనుమతి ఇవ్వవలసిందిగా సంయుక్తంగా పోపుకు విజ్ఞప్తి చేశారు. ఆ వినతికి సమాధానం ఇవ్వకుండా పోపు విచారణను ప్రారంభించి ప్రాగ్ నగరాన్ని వెలివేస్తున్నట్లు ప్రకటించాడు.GCTel 81.3

    ఆ యుగంలో ఈ వాక్యాన్ని పలకటం ఎప్పుడైనా జరిగితే అది భయాందోళల్ని సృ పించేది. ఈ ప్రకటన అనంతరం చోటుచేసుకోనే కర్మకాండ పోపు దేవుని రాయబారి అని అతని చేతిలో పరలోకం నరకం తాళపు చెవులున్నాయని, లౌకికమైన తీర్పులు, ఆధ్యాత్మికమైన తీర్పులు ఇవ్వటానికి అతనికి శక్తి వున్నదని నమ్మే ప్రజల్లో భయం పుట్టించటానికే రూపుదిద్దుకొంటుంది. వెలివేతకు గురి అయిన దేశానికి లేక ప్రాంతానికి పరలోక ద్వారాలు మూసుకొని వుంటాయని, సదరు నిషేదాన్ని తొలగించటానికి పోపుకు మనసు కరిగే వరకు మృతులు తామున్న సంతోషానందాల తావుల నుంచి దూరమవుతారని ఒక నమ్మకం ఉండేది. ఈ భయంకర విషాదానికి సూచనగా మత సంబంధమైన కార్యక్రమాలు నిలిపివేసేవారు. దేవాలయాల్ని మూసివేసేవారు. వివాహాలు ఆలయాల్లోగాక ఆలయావరణాల్లో జరిపేవారు. మృతులకు ప్రతిష్ఠిత స్థలాల్లో సమాధి జరిగేది కాదు. వారిని సమాదుల్లో పూడ్చిపెట్టకుండా గుంటల్లోనో, పొలాల్లోనో భూస్థాపితం చేసేవారు. ఇలా మనసుకు నచ్చే చర్యల ద్వారా ప్రజల మనసాక్షిని రోము అదుపుచేసింది.GCTel 81.4

    ప్రాగ్ నగరంలో గంధరగోళం లేచింది. చాలామంది హస్ తమ విపత్తులకు కారణమని నిందించి ఆయనను రోము అధికారానికి అప్పగించాలని డిమాండు చేశారు. రేగుతున్న తుఫానును చల్లార్చటానికి సంస్కరణవాది హస్ తన గ్రామానికి వెళ్ళి అక్కడ కొంతకాలం ఉన్నాడు. ప్రాగ్ లో తాను వదలివచ్చిన మిత్రులకు రాస్తూ ఇలా అన్నాడు. “దుర్మార్గులు తమ మీదికి తాము నిత్యనాశనం తెచ్చుకోటానికి వారికి తావీయకుండేందుకు, భక్తులకు శ్రమలు, హింస కలగటానికి హేతువుకాకుండా వుండేందుకు, యేసుక్రీస్తు సూత్రాల్ని, ఆదర్శాన్ని అనుసరించి నేను మీ మధ్య నుంచి వెళ్లిపోయాను. భక్తిహీనులైన మతగురువులు మీ మధ్య వాక్య బోధను దీర్ఘకాలం నిషేధిస్తారన్న భయం వల్ల కూడా నేను వెళ్ళిపోయాను కాని దైవ సత్యాన్ని కాదనటానికి నేను మిమ్మల్ని విడిచి వెళ్ళలేదు. దేవుని సహాయంతో సత్యం కోసం మరణించటానికి సిద్ధంగా వున్నాను.”- బోనిక్కోజ్, ది రిపార్మర్స్ బిపోర్ ది రిఫర్మేషన్, సం 1,పుట 87. హస్ తన సువార్త సేవను ఆపలేదు. చుట్టుపట్ల ఉన్న గ్రామాలలో ఆసక్తితో వింటున్న జనసమూహాలకు సువార్త బోధించాడు. సువార్త వ్యాప్తిని అడ్డుకోటానికి పోపు తీసుకున్న చర్యలే అది ఎక్కువగా వ్యాపించటానికి ఈ రకంగా తోడ్పడ్డాయి. “మేము సత్యమునకు విరోధముగా ఏమియు చేయనేరముగాని సత్యము నిమిత్తమే సమస్తమును చేయుచున్నాము” 2 కొరింథీ. 13:8GCTel 82.1

    “తన సేవా జీవితంలోని ఈ దశలో హస్ మనసు బాధాకరమైన సంఘర్షణలో చిక్కుకున్నట్లు కనిపిస్తున్నది. సంఘం పిడుగులు కురిపిస్తూ తనను ముంచేయాలని ప్రయత్నిస్తున్నప్పటికీ హస్ దాని అధికారాన్ని తోసిపుచ్చలేదు. ఆయనకు రోమీయ సంఘం క్రీస్తు పెండ్లి కుమార్తెగానే ఇంకా ఉన్నది. పోపు దేవుని రాయబారిగా, ప్రతినిధిగా ఇంకా ఉన్నాడు. హస్ సంఘర్షణ ఆధికార దుర్వినియోగంతోను, సూత్రంతోను కాదు. తన అవగాహనపై ఏర్పడ్డ నమ్మకాలకు తన మనస్సాక్షి కి మధ్య ఇది తీవ్ర సంఘర్షణను తెచ్చింది. తాను విశ్వసిస్తున్నట్లు ఆ అధికారం న్యాయమైంది పొరపాటు చేయనిది. అయితే దాన్ని అతిక్రమించాలి అన్న బలీయమైన అభిప్రాయం తన కెలా కలిగింది? ఆచరించటం పాపమన్నట్లు కనిపించింది. పొరపాటు చేయని పరిశుద్ధ సంఘానికి విధేయత చూపటం ఇంత రాద్దాంతానికి ఎందుకు కారణమవ్వాలి.? ఇది తాను పరిష్కరించుకోలేని సమస్యగా పరిణమించింది. క్షణక్షణం ఆయనను వేధిస్తున్న సమస్య ఇది. దాదాపు పరిష్కారంలో హక్కు తోస్తున్నదేంటంటే రక్షకుడు నివసించిన రోజుల్లో ఒకసారి జరిగినట్లు, సంఘ గురువులు దుష్టులు, దుర్మార్గులు అయి న్యాయసమ్మతమైన తమ అధికారాన్ని అన్యాయ కార్యకలాపాలకు వాడుకోటం జరుగుతున్నది. మన అవగాహన ద్వారా మనకు వస్తున్న లేఖన ఉపదేశమే మన మనస్సాక్షి అనుసరించాల్సిన నియమం అన్న సూత్రం తన మేలుకోసం తన బోధనలు వింటున్న విశ్వాసుల మేలు కోసం హస్ అవలంబించాడు. ఇంకా చెప్పాలంటే బైబిలులోని దేవుని మాటలేతప్ప సంఘం ద్వారా మత గురువుల మాటలు పొరపాటుచేయని మార్గదర్శి కాదని భావించాడు. ” వినీ, పుస్త 3, అధ్యా 2.GCTel 82.2

    కొంతకాలం పిదప ప్రాగ్ లోని కోలాహలం సద్దుమణిగినప్పుడు దైవ వాక్యాన్ని మరింత ఉత్సాహంతోను ధైర్యంతోను ప్రకటించటానికి బెల్లెహేము ఆలయానికి తిరిగి వచ్చాడు. ఆయన ప్రత్యర్థులు చురుకుగా పని చేయటం మొదలు పెట్టారు. వారు ప్రాబల్యం గలవారు. కాగా ఇంగ్లాండు రాణి, అనేకమంది సామంతులు హస్ మిత్రులు, పెద్ద సంఖ్యలో ప్రజలు ఆయనకు బాసటగా నిలిచారు. ఆయన పవిత్ర సమున్నత బోధనల్ని పరిశుద్ధ జీవితాన్ని రోము మతవాదులు బోధిస్తున్న అంధవిశ్వాసంతోను వారి దురాశతోను, తాగుడు వ్యభిచారాలతోను పోల్చి చూసి, హస్ పక్క నిలువటం గొప్ప గౌరవమని అనేకులు పరిగణించారు.GCTel 83.1

    ఇంతవరకు హస్ తన కృషిలో ఏకాకిగానే నిలిచాడు. కాని ఇంగ్లాండులో నివసించిన కాలంలో విక్లిఫ్ బోధనలను అంగీకరించిన జెరోమ్ ఇప్పుడు సంస్కరణ ఉద్యమంలో హ తో చేతులు కలిపాడు. ఇకనుంచి ఈ ఇద్దరూ జీవితంలో కలసి ఉన్నారు. మరణంలోనూ వీరు విడిపోలేదు. అసాధారణ ప్రతిభ, వాగ్దాటి, జ్ఞానం, ప్రజాదరణ కలిగించే వరాలు - జెరోమ్ కి సమృద్ధిగా వున్నాయి. అయితే ప్రవర్తనకు నిజమైన శక్తినిచ్చే గుణగణాల విషయంలో హ దే పై చేయి. ఆయన వివేచన జెరోమ్ దుందుడుకుతనానికి కళ్లెంగా పని చేసింది. అణకువతో జెరోమ్ తన విలువ ఏమిటో గ్రహించి ఆయన హితవును స్వీకరించే వాడు. వారి సంయుక్త కృషి ఫలితంగా సంస్కరణ ముందంజ వేసింది.GCTel 83.2

    తాను ఎంపిక చేసుకొన్న ఈ వ్యక్తుల మనసులపై దేవుడు గొప్ప వెలుగు ప్రకాశింపజేశాడు. రోము నేతల అనేక దోషాల్ని వారికి బయలు పర్చాడు. కాని లోకానికి అందించాల్సిన వెలుగంతటినీ వారికి బయలు పర్చలేదు. రోవును మతాన్ని ముసురుతున్న చీకట్లనుంచి తన సేవకుల ద్వారా ప్రజల్ని బైటికి నడిపిస్తున్నాడు దేవుడు. వారు ఎదుర్కోవలసి ఉన్న జటిలమైన అనేక ఆటంకాలున్నాయి. వారు తాళగలిగినంతమట్టుకు వారిని ఒక్కొక్క మెట్టు చొప్పున నడిపించాడు. ఒక్కసారే వెలుగంతటినీ అందుకోటానికి వారు సిద్ధంగా లేరు. దీర్ఘకాలం చీకటిలో ఉన్న వారికి మధ్యాహ్న సూర్యుడి ప్రచండ తేజస్సుమల్లే వారికి ఆ వెలుగంతటినీ ఇవ్వటం జరిగితే అది వారిని దూరంగా తరిమివేసి ఉండేది. అందుకని ప్రజలు అందుకోగలిగిన పరిమాణంలో దేవుడు ఆ వెలుగును కొంచెం కొంచెంగా నాయకులకు ఇచ్చాడు. ప్రతి శతాబ్దంలోను నమ్మకమైన అనుచరులు అవసరమైవున్నారు. వారు ప్రజల్ని సంస్కరణ మార్గంలో ఇంకా ముందుకి నడిపించాల్సి ఉన్నారు.GCTel 84.1

    సంఘంలోని చీలిక ఇంకా కొనసాగింది. ఇప్పుడు ముగురు పోపులు ఆధిక్యం కోసం సిగపట్లు పడుతున్నారు. వారి మధ్య రేగిన వైరం క్రైస్తవ లోకాన్ని నేరంతోను అస్తవ్యస్త పరిస్థితులతోను నింపింది. వెలివేతలు రువ్వుకోటంతో తృప్తి చెందక వారు ఆయుధ వినియోగానికి దిగారు. వీరిలో ఒక్కొక్కరూ ఆయుధాలు కొనుగోలుచేయటంలోను సైనికుల్ని సంపాదించటంలోను తల మునకలయ్యారు. అందుకు డబ్బు అవసరం. ఇది సంపాదించటానికి బహుమతులు, హోదాలు, సంఘ ఆశీర్వాదాలు, అమ్మకానికి వచ్చిన సరకులయ్యాయి. తమ అధికారులను అనుకరిస్తూ మతగురువులు లంచాలకు తెగబడ్డారు. ప్రత్యర్థులను దెబ్బతీయటానికి, తమ అధికారాన్ని నిలుపుకోటానికి వారు యుద్దాలు చేశారు. మతం పేరుతో అధికారులు సాగిస్తున్న హేయ కార్యాలను ఖండిస్తూ హస్ దినదినం అధికమౌతున్న ధైర్యంతో గర్జించాడు. క్రైస్తవలోకాన్ని అతలాకుతలం చేస్తున్న ఈతి బాధలకు రోము నేతలే బాధ్యులని ప్రజలు బాహాటంగా నిందించారు.GCTel 84.2

    ప్రాగ్ నగరం భయంకర సంఘర్షణ అంచున మళ్లీ నిలిచినట్లు కనిపించింది. పూర్వయుగాల్లో మల్లే “ఇశ్రాయేలు వారిని శ్రమపెట్టువాడు. (2 రాజులు 18:17.) అని దైవ సేవకుణ్ణి నిందించారు. నగరం మళ్లీ వెలివేతకు గురయ్యింది. హస్ తాను పుట్టిన గ్రామానికి వెళ్లిపోయాడు. తనకు ప్రియమైన బేల్లెహేము ఆలయంలో వినిపించిన నమ్మకమైన సాక్ష్యం ముగిసింది. సత్యం తరపున సాక్షిగా ప్రాణాల్ని అర్పించటానికి ముందు ఇంకా విశాల వేదికమీద నుంచి క్రైస్తవ లోకంతో ఆయన మాట్లాడవలసి ఉన్నాడు.GCTel 84.3

    యూరపను ఏమార్చుతున్న వ్యసనాలను నివారించేందుకు కాన్ సైన్స్ లో ఒక సభ ఏర్పాటయ్యింది. చక్రవర్తి సిగ్మండ్ కోరికమేరకు ముగ్గురు పోపులలో ఒకడైన జాన్ XXIII ఆధ్వర్యంలో ఆ సభ జరిగింది. సభ జరగాలంటూ వచ్చిన డిమాండ్ పోపు జాన్ కి ససేమిరా ఇష్టం లేదు. పోపుజాన్ ప్రవర్తన, విధానం, దర్యాప్తుకు నిలబడలేవు. సంఘనాయకులు నైతికంగా ఎంత బలహీనులో అంతగా నైతికంగా దిగజారిన ప్రివేటులు ఆ దర్యాప్తు జరిపినా, పోపుజాన్ గట్టెక్కడు. అయినా సిగ్మండ ను వ్యతిరేకించటానికి ధైర్యం చాలలేదు.GCTel 85.1

    ఈ సభ ముఖ్యోద్దేశమేమిటంటే సంఘంలో చీలికను నివారించటం, సిద్ధాంత వ్యతిరేకతను నిర్మూలించటం. అందుచేత ప్రత్యర్థి పోపు లిద్దరిని కొత్త అభిప్రాయాన్ని ప్రబోదిస్తున్న జానా నన్ను ఆ సభకు హాజరు కావలసిందిగా ఆదేశించాడు. ఆ యిద్దరు పోపులు వ్యక్తిగత భద్రత దృష్ట్యా తమబదులు తమ ప్రతినిధులను పంపారు. ఈ సభకు నిర్వాహకుడుగా పైకి కనిపిస్తున్న పోపు జాన్ ఎన్నో అనుమానాలతో సభకు వచ్చాడు. చక్రవర్తి తనను పదవి నుంచి రహస్యంగా తొలగిస్తాడని అనుమానించాడు. కిరీటోత్సవాన్ని అభాసుపాలు చేసిన దుష్కృతాల నిమిత్తం దాన్ని సాధించటంలో జరిగిన నేరాల నిమిత్తం శిక్ష పడుతుందన్న భయం అతణ్ణి వేధించింది. అయినా ఉన్నతశ్రేణి మతగురువులతో, రాజభటులతో అతను కా న్స్ నగరానికి ఆడంబంరంగా వచ్చాడు. ఆ నగరంలోని బోధక వర్గం, పురప్రముఖులు, పురజనులు అతణ్ణి స్వాగతించటానికి బైటికి వెళ్లారు. నలుగురు న్యాయాధికారులు పట్టుకొని నడుస్తున్న బంగారు పందిరి అతని తలపై ఉండి నీడనిస్తున్నది. అతని ముందు ప్రభుభోజన రొట్టెను పట్టుకొని కొందరు నడిచారు. కార్డినళ్లు సామంతుల దుస్తులు చూపరులను ఆకట్టుకొన్నాయి. GCTel 85.2

    అంతలో మరో ప్రయాణికుడు కాస్టెన్స్ చేరుకొంటున్నాడు. తన ప్రాణానికి ముప్పు కలిగించే అపాయాలేంటో హస్ ఎరిగినవే. తమను మళ్లీ కలవనన్నట్లుగా హస్ తన మిత్రుల నుంచి సెలవు తీసుకుని తన ప్రయాణం సాగించాడు. అది తన సజీవదహన దండనకు నడిపే దారి అని భావించాడు. తన ప్రయాణం నుంచి సురక్షితంగా తిరిగివచ్చేందుకు బోహీమియా రాజు సుంచి, చక్రవర్తి సిగిస్ మండ్ నుంచి తనకు హామీలున్నప్పటికీ తన ప్రాణాలకు ముప్పు ఉన్నందున హస్ అన్ని ఏర్పాట్లు చేసుకొన్నాడు.GCTel 85.3

    ప్రాగ్ లో ఉన్న తన మిత్రులకు రాసిన ఉత్తరంలో ఆయన ఇలా అన్నాడు. “నా సహోదరులారా, నా బద్ద విరోధులు అనేకుల్ని కలవటానికి, క్షేమంగా తిరిగి రాక హామీతో నేను వెళ్తున్నాను. నా రక్షకుడు సర్వశక్తిగల దేవునిమీద నాకు పూర్తి విశ్వాసం ఉన్నది. ఆయన మీ ప్రార్ధనలు వింటాడని, తన చతురతను, వివేకాన్ని నాకిచ్చి వారిని ప్రతిఘటించటానికి తోడ్పడ్డాడని నేను శోధనలను, చెరసాలను అవసరమైతే క్రూర మరణాన్ని ధైర్యంగా ఎదుర్కొనేందుకు నన్ను బలపర్చటానికి పరిశుద్ధాత్మ నిస్తాడని విశ్వసిస్తున్నాను. తన ప్రియులకోసం యేసుక్రీస్తు శ్రమలు పొందాడు.మన రక్షణ నిమిత్తం వీటన్నిటిని సహనంతో భరించేందుకుగాను ఆయన తన ఆదర్శాన్ని విడిచి వెళ్ళినందుకు మనం విస్మయం చెందాలా? ఆయన దేవుడు. మనం ఆయన సృ జించిన మనుష్యులం. ఆయన ప్రభువు, మనం ఆయన బానిసలం. ఆయన ప్రపంచాధినేత. మనం పాప మానవులం. అయినా ఆయన శ్రమలు పొందాడు. మనం కూడా ఎందుకు శ్రమలు పొందకూడదు? ముఖ్యంగా శ్రమలు మనల్ని పవిత్ర పర్చేటపుడు కాబట్టి ప్రియులారా, నా మరణం ఆయనకు మహిమ తెచ్చేదైతే అతిత్వరగా రావాలని నా శ్రమలన్నింటినీ నేను స్థిరమనస్సుతో భరించటానికి నాకు శక్తినీయమని ప్రార్ధించండి. కాగా నేను తిరిగి మీ మధ్యకు రావటం జరిగితే నేను ఏ మచ్చా లేకుండా తిరిగి రాగలందులకు మనం ప్రార్ధిద్దాం. అంటే నా సహోదరులు అనుసరించటానికిగాను వారికి నేనొక మాదిరిని విడిచిపెట్టేందుకు సువార్త నుంచి ఒక పొల్లుకూడ నేను అణచివేయకుండా ఉండాలని ప్రార్ధిద్దాం. బహుశా మీరు నా ముఖాన్ని ప్రాగ్ లో ఎన్నడూ చూడక పోవచ్చు. అలాక్కాక, నేను మళ్లీ మీతో ఉండటం సర్వశక్తిగల దేవుని సంకల్పమైతే ఆయన ధర్మశాస్త్ర జ్ఞానంలోను, ఆయన ధర్మశాస్త్రాన్ని ప్రేమించటంలోను స్థిర చిత్తంతో ముందుకు సాగుదాం” ది బోనెక్కోస్ సం 1, పుటలు 147,148.GCTel 85.4

    సువార్తను అంగీకరించిన ఒక మతగురువుకు రాసిన మరో లేఖలో తన గత పొరపాట్లను గూర్చి హస్ ఎంతో వినయంగా ప్రస్తావించాడు. ఖరీదైన దుస్తులు ధరించటంలో ఆనందించానని, నిస్సార వ్యాపకాల్లో సమయం వ్యర్థం చేశానని తన్నుతాను నిందించుకొన్నాడు.” అనంతరం మనసును కదిలించే ఈ హిత వాక్యాలు రాశాడు, “దేవునికి మహిమ, ఆత్మల రక్షణ ఈ అంశాలతో నీ మనసునిండనీ, మళ్లు మాన్యాలు, ఆస్తిపాస్తుల సంపాదనతోకాదు. ఆత్మల రక్షణకన్న గృహాలంకరణ ఎక్కువ కాకుండా జాగ్రత్తపడు. అన్నింటికన్నా ఎక్కువగా ఆధ్యాత్మిక జీవనంపై శ్రద్ధ చూపి, బీదలతో భక్తిగా, వినయంగా వ్యవహరించాలి. నీ ఆస్తిని విందులతో హరించి వేయకు. నీ జీవితాన్ని మార్చుకొని అనవసరమైన వాటికి దూరంగా ఉండకపోతే నాకుమల్లే అపవిత్రమైన గద్దింపుకు గురిఅవుతావని నా భయం... నా సిద్ధాంతం నీకు తెలిసిందే. నీ బాల్యం నుంచి నా సిద్ధాంతాన్ని నీకు బోధించాను. దీన్ని గురించి ఎక్కువగా నీకు రాయటం నిరర్ధకం. నేను చేయటం నీవు చూసిన వ్యర్ధమైన పనుల్లో దేనిని చేయటంలో నీవు నన్ను అనుకరించకూడదని ప్రభువు కృపను బట్టి నిన్ను బతిమాలుతున్నాను.” అదే పుస్తకం సం 1, పుటలు 148, 149.GCTel 86.1

    తన సిద్ధాంతాల వ్యాప్తికి, తన సీవపట్ల ప్రజాదరణకు ఎన్నో సూచికలు హస్ కి తన ప్రయాణంలో కనిపించాయి. ఆయనను కలవటానికి ప్రజలు వెల్లువెత్తారు. కొన్ని పట్టణాల్లో న్యాయమూర్తులు తమతమ వీధులగుండా ఆయన వెంట నడిచి వెళ్లారు.GCTel 87.1

    కాన్స్టెన్స్ చేరిన అనంతరం హస్ కి పూర్తి స్వేచ్ఛ మంజూరయ్యింది. చక్రవర్తి ఇచ్చిన సురక్షిత ప్రయాణ హామీకి అదనంగా పోపు తన సంరక్షణ హామీ ఇచ్చాడు. కాని ఈ హామీ నిచ్చిన కొద్ది కాలంలోనే వీటికి విరుద్ధంగా సంస్కరణ వాది హస్ ను పోపు కార్డినళ్ల ఆదేశాల మేరకు అరెస్ట్ చేసి హేయమైన చీకటి కొట్టులో వేశాడు. దరిమిల రైనునది అవతల ఉన్న ఒక మేడలో ఆయనను బంధించి ఖైదీగా ఉంచాడు. పోపు తన నమ్మకద్రోహం వల్ల ఉపకారం పొందలేదు. అనతికాలంలోనే అతణ్ణి కూడా అదే ఖైదులో వేశారు. ఆదే పుస్త సం 1, పుట 247. హత్య, లంచం, వ్యభిచారం “ఉచ్చరించరాని పాపాల’తో పాటు మిక్కిలి ఘోరమైన నేరాలు అతను చేసినట్లు సభముందు రుజువయ్యింది. అది ఆ సబే ప్రకటింటింది. ఫలితంగా అతడు చివరగా తన కిరీటాన్ని కోల్పోయాడు. ఖైదులో ముగ్గాడు. ప్రత్యర్థి పోపులు కూడా పదవులు కోల్పోయారు. ఒక కొత్త పోపు ఎంపికయ్యాడు.GCTel 87.2

    హస్ ప్రీస్టులపై ఏ నేరాలు మోపి వాటి దిద్దుబాటుకు డిమాండ్ చేశాడో వాటికన్న ఘోరమైన నేరాలకు పోపు పాల్పడినప్పటికీ అతణ్ణి పదవినుంచి మాత్రమే తొలగించిన ఆ సభే సంస్కర్త హసను నలిపివేయటానికి పూనుకొన్నది. హసను నిర్బంధించటం బోహీమియాలో ఆవేశకావేషాల్ని రెచ్చగొట్టింది. ప్రాబల్యం గల సామంతులు ఈ చర్యను నిరసిస్తూ గళమెత్తారు. సురక్షిత ప్రయాణహామీ ఉల్లంఘనను గర్తించిన చక్రవర్తి హస్ పై తీసుకున్న చర్యను వ్యతిరేకించాడు. అయితే సంస్కర ప్రత్యర్థులు మాత్రం ద్వేషంతో నిండి పట్టుదలగా ఉన్నారు. చక్రవర్తిలో ప్రతికూల భావాన్ని, భయాందోళల్ని, సంఘం పట్ల ఉద్రేకాన్ని రెచ్చగొట్టారు. “చక్రవర్తులు, రాజులు సురక్షిత ప్రయాణహామీ లిచ్చినప్పటికీ, సిద్ధాంత వ్యతిరేకులు లేక సిద్ధాంతవ్యతిరేకులుగా అనుమానితుల విషయంలో ఆ హామీలను నెరవేర్చ వలసిన పనిలేదు.” అన్న వాదనల్ని వారు వినిపించారు. జేకప్ వెన్సెంట్, హిస్టరీ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ కాన్సెన్స్, సం 1, పుట 516. వాళ్లు ఇలా గెలుపు సాధించారు.GCTel 87.3

    చెరసాల పరిస్థితులవల్ల, అనారోగ్యం వల్ల శక్తి సన్నగిల్లటంతో చీకటి కొట్టులోని తేమతో నిండిన గాలి కారణంగా జ్వరం వచ్చి దాదాపు ఆయన ప్రాణాన్ని తీసింది. తుదకు హనను సభ ముందుకి తెచ్చారు. చక్రవర్తి ముందు సంకెళ్లు ధరించి నిలబడ్డాడు. తనను పరిరక్షిస్తానని తన గౌరవాన్ని, విశ్వసనీయతను పణంగా పెట్టి వాగ్దానం చేసిన చక్రవర్తి అతడు. సుదీర్ఘమైన దర్యాప్తులో తాను నమ్మిన సత్యాన్ని హస్ దృఢంగా కాపాడుకొన్నాడు. సమావేశమైన సంఘ అధికారులు దేశాధికారుల సమక్షంలో సంఘం అధికార వర్గాల్లో ప్రబలుతున్న అవినీతిని ఖండిస్తూ తన యధార్థ నిరసనను వెలిబుచ్చాడు. తన సిద్ధాంతాలను మార్చుకోటమో లేని పక్షంలో మరణించటమో రెంటిలో ఒకదాన్ని ఎన్నుకోమన్నప్పుడు హస్ హతసాక్షి కావటాన్ని ఎంపిక చేసుకొన్నాడు.GCTel 88.1

    దైవకృప ఆయనను సంరక్షించింది. చివరి తీర్పుకు ముందు వారాల్లో తాననుభవించిన శ్రమలలో దేవుని సమాధానం ఆయన ఆత్మను నింపింది. ” ఈ ఉత్తరాన్ని నా ఖైదు సంకెళ్లలో వున్న చేతులతో రాస్తున్నాను. నా మరణ తీర్పు రేపురావచ్చు...క్రీస్తు సహాయంతో భావి జీవితంలోని మనోహర సమాధానంలో మనం మళ్లీ కలుసుకొన్నప్పుడు, దేవుడు నాపట్ల ఎంత దయగా ఉన్నాడో, నాకు కలిగిన శోధనలలోను, శ్రమల్లోను ఆయన నన్ను ఎంత బలంగా ఆదుకొన్నాడో నీవు తెలుసుకొంటావు” అన్నాడాయన ఒక మిత్రునికి రాసిన ఉత్తరంలో- బోన్ కోస్, సం 2, పుట 67.GCTel 88.2

    భవిష్యత్తులో యధార్ధ విశ్వాసం సాధించే విజయాన్ని తన చీకటి కొట్టులో చూడగలిగాడు. తాను సువార్త బోధించిన ప్రాగ్ నగర ఆలయాన్ని గూర్చి కలలు కంటూ ఆలయం గోడలపై తాను చిత్రించిన క్రీస్తు పటాన్ని చెరిపి వేస్తున్నట్లు చూశాడు. ” ఈ దర్శనం ఆయనలో ఆందోళన రేపింది. ఆ మర్నాడు చాలా మంది చిత్రకారులు ఆ చిత్రాన్ని పుసరుద్దరించటం దాన్ని చక్కని రంగులతో తేజోవంతం చేయటం, మరిన్ని చిత్రాలు చిత్రించటం చూశాడు. ఆ పని ముగిసిన వెంటనే చుట్టూ మూగిన జనసమూహం మధ్య నిలిచి ఉన్న ఆ చిత్రకారులు ఇలా అన్నారు, ఇపుడు పోపులు, బిషప్పులను రానివ్వండి. వాటిని ఇక చెరిపివేయలేరు, తన కలను చెబుతూ సంస్కర్త అన్న మాటలివి. క్రీస్తు స్వరూపాన్ని చెరిపివేయటం ఎన్నటికీ సాధ్యం కాదన్నదే నా నమ్మిక. ఆ రూపాన్ని నాశనం చేయాలని వాళ్లు ప్రయత్నిస్తున్నారు గాని నాకన్న మెరుగైన బోధకులు దాన్ని అందరి హృదయాల్లోను చిత్రిస్తారు’ ది ఆబెనీ పుస్త.1 , అధ్యా. 6.GCTel 88.3

    చివరిసారిగా హస్ ని సభ ముందు నిలబెట్టారు. చక్రవర్తి, సామ్రాజ్య యువరాజులు, రాజ్యాధికారులు, కార్డినళ్లు, బిషప్పులు ప్రీస్టులతో అది బ్రహ్మాండమైన, ప్రకాశవంతమైన సభ. ఆ సభా కార్యాలను తిలకించటానికి పెద్దసంఖ్యంలో జనం విచ్చేశారు. అంతరాత్మ స్వాతంత్ర్యం కోసం సాగిన సుదీర్ఘ పోరాటంలో జరగబోతున్న ప్రథమ మహా బలియాగాన్ని వీక్షించేందుకు క్రైస్తవలోకం నలుమూలల నుంచి జనులు వచ్చారు.GCTel 89.1

    తన తుది నిర్ణయం వెలిబుచ్చటానికి పిలుపు వచ్చినప్పుడు హస్ తన నమ్మకాన్ని వదులుకోటానికి నిరాకరించాడు. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని అసమర్ధ చక్రవర్తిపై తీక్షణమైన తన దృష్టిని సారించి ఇలా అన్నాడు, “ఇక్కడ కొలువు తీరిన చక్రవర్తి ప్రజాపరిరక్షణ, విశ్వసనీయత కింద నేను ఈ సభకి హాజరవ్వాలని నాయిష్టపూర్వకంగా తీర్మానించుకొని వచ్చాను. ”- బొనెకోస్, సం.2, పుట 84. అక్కడున్న ప్రజల కళ్లు తనవేపు తిరగటంతో సిగీస్ మండ్ ముఖం సిగ్గుతో ఎర్ర బడింది.GCTel 89.2

    తీర్పు వెలువడిన తరువాత ఇక భ్రష్టత ఉత్సవం మొదలైంది. బిషప్పులు తమ ఖైదీకి మతాచార్యుడి అంగీని వేశారు. అది ధరించే తరుణంలో ఆయన “మన యేసుక్రీస్తు ప్రభువును హేరోదు పిలాతు ముందుకు పంపుతున్నప్పుడు ఆయనకు తెల్లని అంగీ ధరింపజేశారు.” అన్నాడు- అదే పుస్తకం సం.2, పుట. 86. తన నమ్మకాన్ని మార్చుకొంటానని చెప్పమన్నప్పుడు ప్రజల తట్టు తిరిగి “అయితే నేను పరలోకాన్ని ఏ ముఖంతో చూడగలను? నేను సువార్త బోధించిన వేలాదిమంది ప్రజల వంక ఎలా చూడటం? కాదు, ఇప్పుడు మరణానికి ఏర్పాటైన ఈ నీచ శరీరంకన్న వారి రక్షణ విలువైనదని భావిస్తున్నాను” అన్నాడు. ఒక్కో బిషప్పు ఆ కర్మకాండలో తన పాత్ర నిర్వహిస్తూ, ఒక శాపం ఉచ్చరిస్తూ ఉండగా ఒకటొకటిగా ఆయన మీది దుస్తులు తీసివేశారు. చివరగా ” ఆయన తలమీద కాగితపు టోపీని పెట్టారు. దానిపై భయం పుట్టించే భూతాల బొమ్మలు చిత్రించారు. ముందు భాగంలో బాగా కనిపించేటట్లు “ఆర్కెరిక్” అన్నమాట రాశారు. ‘నాకోసం ముళ్లకిరీటం ధరించిన ఓ యేసూ, నీ కోసం ఈ అవమానపు కిరీటాన్ని ఎంతో ఆనందంగా ధరిస్తాను” అన్నాడు హస్.GCTel 89.3

    ఆయనను ఈ తీరున ప్రదర్శిస్తూ ప్రిలేటులు ఇలా అన్నారు, “ఇప్పుడు నీ ఆత్మను సైతానుకు అర్పిస్తున్నాం ” కళ్లు ఆకాశం వేపుకు ఎత్తి. “నా ఆత్మ ఓ యేసు ప్రభువా, నీ చేతులకు అప్పగించుకొంటున్నాను. నన్ను విమోచించిన వాడవునీవే” అన్నాడు జాన్వాస్.GCTel 90.1

    ఆయనను ఇప్పుడు లౌకికాధికారులకు అప్పగించారు. వారు హను మరణ దండన స్థలానికి తీసుకువెళ్లారు. పెద్ద ఊరేగింపు మొదలైయ్యింది. వందలాది సైనికులు, ప్రీస్టులు ఖరీదైన అంగీలు ధరించిన బిషప్పులు, కాన్స్టెన్స్ పురజనులు అందులో పాల్గొన్నారు. దహన స్తంభానికి హస్ ని కట్టివేశారు. నిప్పు అంటించటానికి అంతా సిద్ధంగా ఉండగా తన తప్పుల్ని విడిచి పెడ్తానని ఒప్పుకోటంద్వారా తన్నుతాను రక్షించుకోవుంటూ మరోసారి హెచ్చరించారు. ఏ తప్పుల్ని నేను విడిచి పెట్టాలి? నేనే తప్పు చేయలేదని నాకు తెలుసు. నేను రాసింది బోధించింది పాపం నుంచి, నాశనం నుంచి ఆత్మలను రక్షించాలన్న దృష్టితో చేశాను. ఇందుకు సాక్షిగా దేవున్ని పిలుస్తున్నాను.” అని బదులు పలికాడు హస్. అదే పుస్తకం పుస్త.3, అధ్యా. 7. తన చుట్టూ మంటలు వేస్తున్నప్పుడు, “దావీదుకుమారుడా యేసూ నాపై దయ చూపు” అంటూ తన గొంతు మూగబోయేదాకా పాడాడు.GCTel 90.2

    తన వీరోచిత ప్రవర్తనకు ఆయన విరోధులు సయితం విస్మయం చెందారు. హస్, ఆయన వెనుక మరణించిన జెరోమ్ హతసాక్ష్యాన్ని వర్ణిస్తూ ఉత్సాహభరితుడైన ఒక పోపు మతవాది అన్నాడు, ఇద్దరూ తమ చివరి ఘడియ వచ్చినప్పుడు తొణకకుండా నిర్మల మనస్సుతో ఉన్నారు. పెళ్లికి సిద్ధపడేటట్లు వారు సజీవ దహనానికి సిద్ధపడ్డారు. బాధతో ఒక్కకేక కూడా వేయలేదు. ముంటలు లేచినప్పుడు పాటలు పాడనారంభించారు. మంటల తీవ్రత వారి గానాన్ని ఆపలేకపోయింది” అదే పుస్తకం, పుస్త.3, ఆధ్యా. 7.GCTel 90.3

    హస్ శరీరం పూర్తిగా కాలిపోయాక ఆయన బూడిదను దానితో పాటు అందున్న మన్నును పోగుచేసి వాటిని రైన్ నదిలో నిమజ్జనం చేశారు. అలా అది సముద్రంలో కలిసిపోయింది. ఆయన ప్రబోధించిన సత్యాల్ని నిర్మూలించామని ఆయనను హింసించిన వారు వ్యర్ధంగా ఊహించారు. సముద్రంలో కలసిపోవటానికి ఆ రోజు వారు నదిలో కలిపిన బూడిద లోకంలోని దేశాలన్నిటిలో చెదిరిపడే విత్తనాలని వారు ఊహించలేదు. ఇంకా తెలియని దేశాలలో సత్యాన్ని గూర్చిన సాక్ష్యంలో విస్తారమైన పంటపండుతుందని వారు ఊహించలేదు. కాన్స్టెన్స్ సభామందిరంలో వినిపించిన స్వరం బలహీన ప్రతిధ్వనులు వచ్చేయుగాలన్నింటిలో వినిపిస్తాయి. హస్ ఇక లేడు అయినా ఆయన ఏ సత్యాల కోసం మరణించాడో ఆ సత్యాలు ఎన్నడూ నాశనం కావు. విశ్వాసం, నిలకడ విషయాల్లో హస్ ఆదర్శం వేలాదిమంది ప్రజలు హింసలోను మరణాపాయంలోను సత్యానికి నిబడటానికి ధైర్యాన్నిస్తుంది. ఆయన మరణం రోము నాయకులు క్రూరత్వాన్ని లోకానికి ప్రదర్శించింది. తమకు తెలియక పోయినా సత్య విరోధులు తాము దేనినైతే నాశనం చేయటానికి వ్యర్ధప్రయత్నాలు చేశారో ఆ సత్యం పురోగమించటానికి వారు ఎంతో తోడ్పడ్డారు.GCTel 90.4

    కాసెస్టెన్స్ లో ఇంకో సజీవ దహనానికి రంగం సిద్ధమవుతున్నది. మరోసాక్షి రక్తం సత్యం పక్షంగా సాక్ష్యం ఇవాల్సివుంది. సభకు వెళ్తున్న హస్ కి వీడ్కోలు చెప్పిన పిదప ఏదైన అపాయం ఎదురైతే సహాయం అందించటానికి ఆగమేఘాలమీద వస్తానని చెబుతూ ధైర్యంగా, దృఢంగా ఉండమని జెరోమ్ హితవు పలికాడు. హసు ఖైదులో వేశారని విన్న వెంటనే విశ్వసనీయతగల ఈ శిష్యుడు తాను చేసిన వాగ్దానాన్ని నెరవేర్చటానికి సిద్ధమయ్యాడు. సురక్షిత ప్రయాణ హామీ లేకుండానే ఒక్క సహచరుడితో కాన్మెన్స్ సగరానికి పయనం కట్టాడు. అక్కడకు చేరిన తర్వాత తనకైతానే అపాయాన్ని కొనితెచ్చుకొంటున్నానని, హస్ విడుదల దిశ గా తాను చేయగలిగిందేమీలేదని జెరోమ్ గ్రహించాడు. ఆ నగరం నుంచి పారిపోయాడు. ఇంటికి వెళ్తుండగా ఆయనను బంధించి సంకెళ్లువేసి కొందరు సైనికుల కాపుదల కింద వెనక్కు తీసుకుని వెళ్లారు. మొదటిసారి జెరోమ్ సభముందు నిలిచి తన మీదికి వచ్చిన ఆరోపణలకు సమాధానం చెబుతుండగా “అతడితో పాటు మంటల్లోకి, మంటల్లోకి ” అన్న కేకలు వినిపించాయి. బోస్ స్ సం.1, పుట. 234. ఆయనను చీకటికొట్టులో వేసి ఎంతో బాధ కలిగించే విధంగా గొలుసులతో బంధించి రొట్టె నీళ్లు మాత్రమే ఇచ్చారు. కొన్ని మాసాలుగా క్రూర కారాగారం వల్ల జెరోమ్ వ్యాధికి గురి అయి మరణించటానికి సిద్ధమయ్యాడు. తప్పించుకొని పారిపోతా డేమోనన్న భయంతో తన శత్రువులు జెరోమను కొంచెం దయగా చూడటం మొదలు పెట్టారు. ఖైదులో ఆయన ఒక ఏడాది ఉన్నాడు.GCTel 91.1

    పోపు మతవాదులు అనుకున్నట్లు లేదు హస్ మరణ పర్యవసానం. హస్ కిచ్చిన సురక్షిత ప్రయాణ హామీ ఉల్లంఘన దేశంలో కోపోద్రేకాల తుఫాను రేపింది. కనుక జెరోమ్ ని సజీవదహనం చేసే బదులు తన నమ్మకాల్ని వదులుకుంటానని ఒప్పుకోటాని సాధ్యమైతే ఒత్తిడి చేద్దామని తీర్మానించుకొన్నారు. ఆయనను సభముందు తీసుకొనివచ్చి తన నమ్మకాలు తప్పని ఒప్పుకోటమో లేని పక్షంలో సజీవదహన దండను పొందటమో ఎంపికచేసుకోమన్నారు. తాననుభవించిన శ్రమలతో పోలిస్తే ఆదిలోనే మరణించటం గొప్పదయాకార్యమై ఉండేది. ఇప్పుడు వ్యాధివల్ల, కఠిమైన చెరసాల జీవితం వల్ల, ఆందోళన, ఉత్కంఠలు కలిగించే హింస, మిత్రులు దూరం కావటం, హస్ మరణం వల్ల చోటుచేసుకొన్న నిరుత్సాహం జెరోమ్ సైర్యాన్ని దెబ్బతీశాయి. సభకు లొంగిపోవటానికి సమ్మతించాడు. కథోలిక్ విశ్వాసానికి బద్దుడనై ఉంటానని వాగ్దానం చేశాడు.విక్లిఫ్, హస్ బోధించిన “పరిశుద్ధ సత్యాలు” తప్ప వారి ఇతర సిద్ధాంతాలను ఖండించాలని సభ చేసిన తీర్మానాన్ని అంగీకరించాడు. అదే పుస్తకం, సం. 2, పుట 141.GCTel 91.2

    ప్రయోజనకరమైన చర్య ద్వారా జెరోమ్ తన అంతరాత్మను సద్దణచి ప్రమాదం నుంచి తప్పించుకోజూశాడు. కాగా తన చీకటి కొట్టులో ఏకాంతంగా ఉన్నప్పుడు తాను చేసిన పనిని ఒకింత స్పష్టంగా చూశాడు. హస్ ధైర్యం గురించి, విశ్వాస పాత్రత గురించి దానికి విరుద్ధంగా సత్యాన్ని సత్యం కాదని స్వయంగా తాను చెప్పటం గురించి ఆలోచించాడు. ఎవరికి సేవ సేస్తానని తాను వాగ్దానం చేశాడో, ఎవరు తన నిమిత్తం సిలువ మరణం పొందాడో ఆ ప్రభువు గురించి ఆలోచించాడు. తన ఉపసంహరణకు పూర్వం తన శ్రమలన్నింటి నడుమ దేవుని ప్రేమావాగ్దానంలో ఓదార్పును పొందాడు. ఇప్పుడు ఆయన ఆత్మను దుఃఖం, సందేహాలు బాధిస్తున్నాయి. రోము అధికారులతో సమాధానంగా నివసించాలంటే తాను ఉపసంహరించుకోవలసినవి ఇంకా ఉన్నాయని ఆయనకు తెలుసు. తాను అడుగుపెడుతున్న మారం పరిపూర్ణ భ్రష్టతతోనే అంతమౌతాది. ఒక నిర్ధారణకు వచ్చాడు.స్వల్పకాలం బాధను తప్పించుకోటానికి తన ప్రభువును ఎరగనని బొంకకూడదని ఆయన తీర్మానించుకొన్నాడు.GCTel 92.1

    కొద్ది కాలంలోనే ఆయనను మళ్లీ సభ ముందుకు తీసుకొని వచ్చారు. ఆయన ఒప్పుకోలు న్యాయమూర్తులకు తృప్తికరంగా లేదు. హస్ మరణంతో ఇంకా బలీయమైన వారి రక్తదాహం తాజా బాధితుల కోసం వెంపర్లాడు తున్నది. మినహాయింపులేమీ లేకుండా సత్యానికి లొంగిపోటం ద్వారా మాత్రమే జెరోమ్ తన జీవాన్ని పరిరక్షించుకో గలడు. తన విశ్వాసాన్ని ప్రకటించుకొని తన సోదర హతసాక్షి వెంబడి మంటల్లోకి వెళ్లటానికి ఆయన నిర్ధారణ చేసుకొన్నాడు.GCTel 92.2

    క్రితం తప్పని తాను ఒప్పుకున్నదాన్ని ఉపసంహరించుకొన్నాడు. మరణిస్తున్న వ్యక్తిగా తన వాదనను వినిపించటానికి అవకాశాన్ని కోరాడు. ఆయన చెప్పబోతున్న మాటల ఫలితానికి భయపడి తనమీద మోపిన ఆరోపణలకు ఔను కాదు అని మాత్రమే సమాధానం చెప్పాలని ప్రిలేట్లు పట్టుపట్టారు. అది క్రూరం, అన్యాయం అని జెరోమ్ ప్రతిఘటించాడు. జెరోమ్ ఇలా స్పందించాడు, “భయంకరమైన ఖైదులో మురికిలో శబ్దాలు, దుర్వాసన మధ్య, వసతులు ఏమీలేకుండా మీరు నన్ను మూడు వందల నలభై రోజులు బంధించి ఉంచారు. అప్పుడు మీ ముందుకి నన్ను రప్పించారు. నా బద్ద విరోధుల మాటలు విని నేను మాట్లాడేందుకు అవకాశం ఇవ్వటం లేదు. నిజంగా మీరు వివేకవంతులైతే, లోకానికి వెలుగై న్యాయం విషయంలో పాపం చేయకుండా జాగ్రత్త పడండి. నా విషయ మంటారా, నేను దుర్భల మానవుణ్ణి. నా జీవితం ఏమంత ప్రాముఖ్యమైంది కాదు. అన్యాయపు తీర్పు తీర్చవద్దని నేను మీకు హితవు చెప్పేటప్పుడు నేను నాగురించి మాట్లాడటం లేదు. మీ గురించే ఎక్కువ మాట్లాడున్నాను.” అదే పుస్తకం, సం.2, పుటలు 146, 147. చివరగా ఆయన మనవిని అంగీకరించారు. జెరోమ్ న్యాయమూర్తుల సమక్షంలో మోకరించి ప్రార్థించాడు. తాను సత్యానికి విరుద్ధంగా లేకుండా తన ప్రభువుకు తల వంపులు తెచ్చే విధంగా మాట్లాడకుండా తన ఆలోచనల్ని, మాటల్ని దేవుని ఆత్మ అదుపుచేయవలసిందిగా ప్రార్ధించాడు. ప్రథమ శిష్యులకు దేవుడు చేసిన ఈ వాగ్దానం ఆ రోజు జెరోమ్ విషయంలో నెరవేరింది. “నా నిమిత్తము మీరు అధిపతుల యొద్దకును, రాజుల యొద్దకును తేబడుదురు. వారు మిమ్మును అప్పగించునప్పుడు ఏలాగు మాట్లాడుదుము? ఏమి చెప్పుదుము? అని చింతింపకుడి. మీరేమి చెప్పవలెనో అది ఆగడియలోనే మీకనుగ్రహింపబడును. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాటలాడుచున్నాడేగాని మాటలాడువారు మీరు కాదు” మత్తయి10:1820.GCTel 92.3

    జెరోమ్ మాటలు తన ప్రత్యర్థుల్లో సయితం ఉత్సాహభరిత విస్మయాన్ని పుట్టించి వారి ప్రసంశలను పొందాయి. ఆయనను ఒక ఏడాదిపాటు చీకటికొట్టులో ఉంచారు. ఏమీ చదువలేకపోయాడు. సరిగా చూడలేకపోయాడు. శారీరకంగాను, మానసికంగాను బాధను ఆందోళనను అనుభవించాడు. అయినప్పటికీ ఎలాంటి ఆటంకాలు లేకుండా అధ్యయనం చేసే అవకాశమున్న వ్యక్తి వాదనలమల్లే ఆయన వాదనలు స్పష్టంగా శక్తిమంతంగా సాగాయి. అన్యాయపు తీర్పులకు గురి అయిన పరిశుదుల చరిత్ర పొడవునా ఎందరో ఉన్నారని తన శ్రోతలకు గుర్తు చేశాడు. తమ తమ కాలాల్లో కొందరు వ్యక్తుల ఘనత కోసం కొందరిని ఆరోపణలకు, నిందలకు గురిచేసి వారిని అంతమొందించటం జరిగింది. తర్వాత కాలంలో వారు గౌరవార్డులని ప్రజలు గుర్తించారు. అంతెందుకు ఒక అపవిత్ర న్యాయపీఠం క్రీస్తు నేరస్తుడని తీర్పు ఇచ్చింది.GCTel 93.1

    తన విశ్వాస పరిత్యాగ ప్రకటన సమయంలో హస్ మరణదండన న్యాయమైనదే అని జెరోమ్ అంగీకరించాడు. ఇప్పుడు ఆ విషయమై తన పశ్చాత్తాపాన్ని ప్రకటించి హఠ సాక్షి హస్ నిరపరాధి అని సాక్ష్యమిచ్చాడు. “తన బాల్యం నుంచి ఆయనను నే నెరుగుదును. ఆయన పరమ ఉత్తముడు, యధార్ధవంతుడు, పరిశుద్దుడు. ఆయన నిరపరాధి అయినా దోషిగా ఎంచి మరణదండన విధించారు. నన్నుకూడా నేను మరణించటానికి సిద్ధంగా ఉన్నాను. నా కోసం శత్రువులు, అబద్ధ సాక్షులు సిద్ధంచేసిన హింసకు భయపడి వెనుదిరగను. ఆ శత్రువులు అబద్ద సాక్షులు. తమ వంచనల విషయంలో దేవుని ముందు ఒకనాడు లెక్క అప్పజెప్పవలసి ఉన్నారు. దేవున్ని ఎవరూ మోసం చేయలేరు, ఏదీ వంచించలేదు” అన్నాడు. బోనెకోస్, సం. 2, పుట 151.GCTel 94.1

    సత్యం విషయంలో బొంకినందుకు తన్నుతాను నిందించుకొంటూ జెరోమ్ ఇలా అన్నాడు, “నా యుక్త వయసు నుంచి నేను చేసిన పాపాలన్నింటిలోను నాకు ఎక్కువ వేదనను, దుఃఖాన్ని కలిగించింది ఏంటంటే విక్లిపై, నా గురుపు, మిత్రుడు, పరిశుద్ధ హతసాక్షి అయిన జాన్వాస్ పై మీరిచ్చిన అన్యాయపు తీర్పును ఈ ప్రాణాంతక స్థలంలో ఆమోదించటం ద్వారా నేను చేసిన పాపం. ఔను దాన్ని మనస్పూర్తిగా ఒప్పుకొంటు మరణముంటే భయపడి వారి సిద్ధాంతాల్ని ఖండించానని ఒప్పుకొంటున్నాను. కాబట్టి నా పాపాల్ని క్షమించుమని ముఖ్యంగా అతినీచమైన ఈ పాపాల్ని క్షమించుమని సర్వశక్తిగల దేవున్ని వేడుకొంటున్నాను” న్యాయాధికారుల వంక చూస్తూ” సంఘ సిద్ధాంతాలను కదిల్చివేసినందుకు కాదు గాని మత ప్రబోధక వర్గం దుష్కియలను దురాచారాలను విలాసాలను, వారి గర్వాన్ని, ప్రిలేట్లు, ఫ్రీస్టుల పాపాల్ని ఎండగట్టినందుకు విక్లిఫ్ ని జానాను మీరు దండించారు. వారు చెప్పిన విషయాలన్నీ కాదనలేని నిజాలు. వారి భావాలాంటివే నా భావాలూను. వారు ప్రకటించినటే నేను ప్రకటిస్తున్నాను.”GCTel 94.2

    ఆయన చెబుతున్న మాటలకు అడ్డు తగిలారు. కోపంతో వణుకుతూ ప్రిలేటులు, “ఇంతకన్నా రుజువేం కావాలి? మన కళ్లతోనే సిద్ధాంత వ్యతిరేకిని చూస్తున్నాం.” అని కేకలు వేశారు.GCTel 94.3

    రేగుతున్న తుఫానులో నిశ్చలంగా నిలిచి జెరోమ్ ఇలా అన్నాడు, “ఏమిటి, నాకు చావంటే భయమనుకొన్నారా? మరణం కన్న భయంకరమైన చీకటి కొట్టులో ఒక ఏడాది నన్ను బంధించి ఉంచారు. ఒక తురుష్కుడు, యూదుడూ లేదా అన్యుడు వ్యవహరించనంత క్రూరంగా మీరు నా యెడల ప్రవర్తించారు. నా ఎముకల మీద ఉన్న మాంసం వాస్తవంగా కుళ్లిపోయింది. అయినా నేను నోరు విప్పలేదు. దైవ సేవకుడు విలపించటం మంచిదికాదు. కాని ఒక క్రైస్తవుడి పట్ల కనుపర్చిన ఆటవికత్వానికి దిగ్ర్భాంతి వ్యక్తం చేయకుండా ఉండలేను” అదే పుస్తకం, సం 2, పుటలు 151-153.GCTel 94.4

    మళ్లీ ఆగ్రహ తుపాను విరుచుకు పడింది. జెరోమ్ ను హుటాహుటీగా ఖైదుకి తీసుకువెళ్లిపోయారు. జెరోమ్ పలికిన మాటలు హృదయాల్లో నాటుకు పోవటంతో ఆయన ప్రాణాన్ని కాపాడాలని కాంక్షించిన వ్యక్తులు ఆ సభలో కొందరున్నారు. సంఘాధికారులు కొందరు జెరోమ్ ను సందర్శించి తాను సభ అధికారానికి లొంగి పోవలసిందని విజ్ఞప్తి చేశారు. రోము అధికారానికి వ్యతిరేకతను విడనాడటం వల్ల తనకు కలిగే ప్రతి ఫలం ఉజ్వల భవిష్యత్తు అని ప్రలోభపెట్టారు. కాగా లోక మహిమను ఇవ్వజూచినప్పుడు తన ప్రభువు యేసుమల్లే జెరోమ్ నమ్మకంగా నిలిచాడు.GCTel 95.1

    నేను తప్పులో ఉన్నానని పరిశుద్ధ లేఖనాల నుంచి నిరూపించండి. అప్పుడు నా బాణి తప్పని ఒప్పుకొంటాను” అన్నాడు.GCTel 95.2

    పరిశుద్య లేఖనాలు! వాటిని బట్టి ప్రతీదాన్ని పరీక్షించాలా? సంఘం విశదపర్చేంతవరకు వాటిని ఎవరు గ్రహించగలిగారు?” ప్రశ్నించాడు ఒక శోధకుడు.GCTel 95.3

    “మన రక్షకుని సువార్త కన్నా మానవ సాంప్రదాయాల్నే మనం విశ్వసించటం సమంజసమా? తాను రాసిన పత్రికల్లో విశ్వాసులు మానవ సాంప్రదాయాల్ని విశ్వసించాలనలేదు. లేఖనాల్ని పరిశోధించండి ” అన్నాడు పౌలుGCTel 95.4

    “సిద్ధాంత వ్యతిరేకీ, ఇంతసేపు నీతో మాట్లాడినందుకు సంతాపపడున్నాను. నీవు సైతాను చెప్పుచేతల్లో ఉన్నావు.” అన్నదే వారి సమాధానం. విలీ, పుస్త.3,అధ్యా. 10.GCTel 95.5

    ఆయనకు మరణ దండన విధించారు. హస్ ఏ స్థలంలో తన ప్రాణాన్ని త్యాగం చేశాడో అక్కడికే జెరోమ్ ని తీసుకు వెళ్లారు. ఆయన దారి పొడవున పాడుకొంటూ వెళ్లాడు. ఆయన ముఖంపై ఆనందం, సమాధానం తాండవించాయి. ఆయన దృష్టి క్రీస్తుమీద నిలిచింది. మరణ భయం ఏకోశానా కనిపించలేదు. మంట వెలిగించే వాడు అడుగు వేసి తన వెనుకకు వెళ్లినప్పుడు హతసాక్షి కానున్న జెరోమ్ “ధైర్యంగా ముందుకు రా, మంట నా ముఖానికి అంటించు. భయపడి ఉండివుంటే ఇక్కడుండే వాళ్లే కాదు.” అన్నాడు.GCTel 95.6

    తన చుట్టూ మంటలు ఆవరిస్తుండగా ఆయన చివరి మాటలు ఒక ప్రార్ధన. ” ప్రభువా, మహాశక్తిగల తండ్రీ, నామీద దయ ఉంచి, నా పాపాలు క్షమించు. నేను ఎల్లపుడూ నీ సత్యాన్ని ప్రేమించానని నీకు తెలుసు”. బోనెకోస్, సం. 2, పుట 168. స్వరం మూగబోయింది. ప్రార్ధనలో వున్న పెదవులు మాత్రం కదులుతూనే ఉన్నాయి. అగ్ని పని పూర్తి అయ్యాక ఆయన బూడిదను అది ఉన్న మట్టిని పోగుచేసి హస్ చితాభస్మాన్ని పారేసినట్లు రైను నదిలో పారేశారు.GCTel 96.1

    విశ్వాస పాత్రులైన వాక్య ప్రబోధకులు అలా అంతమొందారు. అయితే వారు ప్రబోధించిన సత్యాలు ప్రసరించిన వెలుగును- సాహసోపేతమైన వారి ఆదర్శం విరజిమ్మిన వెలుగును- ఆర్పటం సాధ్యపడలేదు. అప్పటికే చీకట్లు చీల్చుకొంటూ బయటపడున్న ఉదయాన్ని ఆపేందుకు మనుషులు ప్రయత్నించటం పయనిస్తున్న సూర్యుణ్ణి వెనక్కు మళ్లించటానికి ప్రయత్నించటమే అవుతుంది.GCTel 96.2

    హస్ ని హతమార్చటం బోహీమియలో ఆగ్రహావేశాలను రగుల్కొలిపింది. హస్ ప్రీస్టుల దుర్బుద్ధికి చక్రవర్తి విశ్వాస ఘాతుకానికి బలి అయ్యాడని ఆదేశ ప్రజలంతా భావించారు. ఆయన సత్యాన్ని చిత్తశుద్ధితో బోధించిన అధ్యాపకుడనీ, ఆయన మరణాన్ని శాసించిన సభహత్యాపరాధం చేసిందని ప్రకటించారు. ఆయన సిద్ధాంతాలు క్రితంకన్న ఇప్పుడు ఎక్కువగా ప్రజల్ని ఆకర్షించాయి. విఫ్ రచనలు అగ్నికి ఆహుతి కావాలని పోపు శాసనాలు ఆదేశించాయి. ఈ విధ్వంసాన్ని తప్పించుకొన్న పుస్తకాలు ఇప్పుడు తమ రహస్య స్థలాలనుంచి బైటికి వచ్చాయి. వాటిని బైబిలుతోగాని తమకు అందుబాటులో ఉన్న బైబిలు ఖండికలతోగాని అనుసంధానపరిచి పఠించారు. అనేక మంది ఇలా సంస్కర్త బోధించిన విశ్వాసాన్ని స్వీకరించారు.GCTel 96.3

    హస్ కార్యం విజయాలు సాధించటాన్ని హస్ హంతకులు చూస్తూ కూర్చోలేదు. ఆ ఉద్యమాన్ని అణచివేయటానికి పోపు, చక్రవర్తి ఏకమయ్యారు. చక్రవర్తి సిగ్మండ్ సేనలు బోహీమియా మీద విరుచుకుపడ్డాయి.GCTel 96.4

    అయితే దేవుడు ఒక విమోచకుణ్ణి లేపాడు. యుద్ధం ఆరంభమైన వెంటనే జిస్కా గుడ్డివాడయ్యాడు. అయినా తన యుగంలోని మిక్కిలి సమర్ధులైన సేనాధిపతుల్లో జిస్కా ఒకడు. ఆయన బోహీమియా సేనానాయకుడు. దేవుని సహాయం తమకుంటుందన్న నమ్మకం, తమది నీతివంతమైన కార్యమన్న విశ్వాసం దండిగా ఉన్న ఆ ప్రజలు తమపైకి దండెత్తిన మిక్కిలి శక్తిమంతమైన సైన్యాన్ని ప్రతిఘటించ గలిగారు. తాజా సేనల్ని సమకూర్చుకొంటూ చక్రవర్తి బోహీమియా మీదికి మళ్లీ మళ్లీ దండెత్తాడు. ప్రతిసారీ వారిని బోహీమియా తిప్పి కొట్టటం జరిగింది. హస్ వాదులు మరణమంటే భయపడని వారు. వారికి ఏదీ అడ్డునిలువలేదు. యుద్ధం ఆరంభమైన కొన్ని సంవత్సరాలకు జిస్కా మరణించాడు. ఆయన స్థానంలో ప్రకోపియస్ నాయకుడయ్యాడు. ప్రకోపియస్ కూడా సాహసం, నైపుణ్యం గల సేనాని. కొన్ని విషయాల్లో ఇతడు జిస్కాకన్న ఎక్కువ సమర్థుడు.GCTel 96.5

    అంధ వీరుడు జిస్కా మరణించాడని తెలుసుకొన్న బోహీమియా ప్రజల శత్రువులు తాము కోల్పోయిన దంతా తిరిగి సంపాదించటానికి ఇదే అనువైన సమయమని భావించారు. పోపు ఇప్పుడు హస్ వాదులపై ధర్మయుద్ధం ప్రకటించాడు. మళ్లీ పెద్దసైన్యంతో బోహీమియాపై దాడి చేశాడు. కాని ఘోరపరాజయం పాలయ్యాడు. మరో ధర్మయుద్ధం ప్రకటించాడు పోపు. ఐరోపాలో పోపు ప్రాబల్యం ఉన్న దేశాల నుంచి యుద్ధానికి మనుషుల్ని, ద్రవ్యాన్ని ఆయుధాల్ని సమకూర్చుకొన్నాడు. ఎట్టకేలకు హస్ తత్వవాద అవిశ్వాసుల అంతం దగ్గర పడిందని భావించి వేలాదిమంది పోపు జండా కింద గుమి కూడారు. విజయం కలుగుతుందన్న ధీమాతో ప్రచండమైన సేన బోహీమియాలో ప్రవేశించింది. అదే ప్రజలు ఒకటై వారిని ఎదుర్కొన్నారు, ఇరుసైన్యాల మధ్య నది మాత్రమే ఉంది. “ధర్మయుద్భభటులు ఆధిక్యంలో ఉన్నారు. అయితే నదిని సరసర దాటి హస్ తన ప్రత్యర్థులతో తలపడే బదులు ఆవీరుల్ని చూస్తూ నిలబడిపోయాడు.” విలీ, పుస్త. 3 ఆధ్యా 17. అంతట హఠాత్తుగా ఆ సైన్యంలో భయం పుట్టింది. ఒక్క దెబ్బకూడా కొట్టకుండా ఏదో అదృశ్యశక్తి చెదరగొట్టినట్లు ఆ విశాల సేన చెల్లాచెదురైపోయింది. హతత్వవాద సైన్యం అనేకమందిని హతమార్చింది. పారిపోతున్న సేనల్ని వెంబడించి విజేతలు విశేషమైన దోపిడి సొమ్మును కైవసం చేసుకొన్నారు. ఆ యుద్ధం బోహీమియా ప్రజల్ని నిరుపేదలుగా మిగల్చటానికి బదులు ధనికుల్ని చేసింది.GCTel 97.1

    కొన్ని ఏళ్ల తర్వాత కొత్త పోపు ఆధ్వర్యంలో మరో ధర్మయుద్ధం జరిగింది. క్రితంలో చేసినట్లే ఐరోపాలో పోపు ప్రాబల్యం ఉన్న దేశాల నుంచి మనుషుల్ని నిధుల్ని పోపు సమకూర్చుకొన్నాడు. ప్రమాధభరితమైన ఈ కార్యంలో పాలుపంచుకునే వారికి పలు ఫ్రలోభాల ఎర చూపాడు. ధర్మయుద్ధ భటులు ప్రతివారికీ అతి ఘోరమైన నేరాలకు సంపూర్ణ క్షమాపణ వాగ్దానం చేశాడు. యుద్ధంలో మరణించిన వారందరికీ పరలోకంలో విలువైన ప్రతిఫలం ఉంటుందని హామీ ఇచ్చాడు. యుద్ధంలో గెలిచి జీవించినవారు గొప్ప గౌరవం యుద్ధరంగం నుంచి ధనం పొందుతారని ప్రలోభ పెట్టాడు. మళ్లీ పెద్ద సైన్యాన్ని సమకూర్చుకొని సరిహద్దులు దాటి బోహీమియాలో ప్రవేశించాడు. హస్ తత్వవాదుల సేనలు వారిముందు బలహీనత చూపి వెనుకంజ వేస్తూ వారిని దేశం లోపలికి రాబట్టారు. తద్వారా తమకు విజయం వచ్చేసిందని వారిని నమ్మించారు. చివరగా ప్రకోపియస్ నిలిచి శత్రువుల మీదకు విజృంభించి యుద్ధం చేస్తూ ముందుకుసాగాడు. తమ తప్పును గుర్తించిన ధర్మయుద్ధ భటులు యుద్ధం ప్రారంభానికి కనిపెడుతూ తమ శిబిరంలో ఉన్నారు. సైన్యం దగ్గరకు వస్తున్న శబ్దం వినిపించగానే హస్ తత్వవాద సైనికులు ఇంకా కనిపించకముందే ధర్మయుద్ధ భటులలో భయం పుట్టింది. యువరాజులు, సేనాపతులు, సామాన్య సైనికులు తము యుద్ధ కవచాలు పారేసి అన్ని దిక్కులకు పారిపోవటం మొదలు పెట్టారు. ఆ దండయాత్రకు నాయకత్వం వహించిన పోపు ప్రతినిధి భయభ్రాంతులతో గుండెలు చేతపట్టుకొన్న సైనికుల్ని పోగుచేయటానికి ప్రయత్నించాడు. అతడు ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది. వారితో పాటు అతడు కూడా పలాయనం చిత్తగించాడు. శత్రుసైన్యం సర్వనాశనమయ్యింది. విజేతలకు విస్తారమైన కొల్ల ధనం చేజిక్కింది. ఐరోపాలో మిక్కిలి శక్తిమంతమైన రాజ్యాలు తర్బీతుచేసి యుద్ధానికి సిద్ధంచేసిన సాహసికులు, శూరులతో కూడిన గొప్ప సైన్యం ఒక చిన్న బలహీన దేశాన్ని సంరక్షిస్తున్న వారిని ఒక దెబ్బకూడా కొట్టకుండా ఇలా రెండోసారి పారిపోజేయటం జరిగింది. ఇక్కడ దేవుని శక్తి ప్రదర్శితమయ్యింది. ముట్టడి దారులు మానవాతీతమైన భయాందోళనలకు గురి అయ్యారు. ఎర్ర సముద్రంలో ఫరో సైన్యాన్ని నాశనం చేసిన వాడు, గిద్యోను అతని మూడువందలమంది దాడిలో మిద్యానీయుల సైన్యాన్ని పారిపోజేసినవాడు, గర్వాంధులైన అపూరు సైన్యాల్ని ఒక రాత్రి కించపరచినవాడు అయిన ఆ ప్రభువు మళ్లీ తన చేయి చాపి హింసిస్తున్న ఆ శక్తిని మాడ్చివేశాడు. “భయకారణం లేని చోట వారు భయబ్రాంతులైరి. నన్ను ముట్టడి వేయు వారి ఎముకలను దేవుడు చెదరగొట్టియున్నాడు. దేవుడు వారిని ఉపేక్షించెను గనుక నీవు వారిని సిగ్గుపరచితివి” కీర్తనలు 53:5. బలప్రయోగం నిష్ప్రయోజనమని గుర్తించి పోపునేతలు రాజనీతిని ఆశ్రయించారు. ఒక రాజీ ఒప్పందం కుదుర్చుకొన్నారు. నేతలు బోహీమియన్లకు అంతరాత్మ స్వాతంత్ర్యాన్ని ఇస్తామని చెప్పుకొంటూ వాస్తవానికి వారిని రోము అధికారానికి అప్పగించారు. రోముతో శాంతికి బోహీమియన్లు నాలుగు షరతులు పెట్టారు. బైబిలు స్వేచ్చగా బోధించటం, ప్రభుభోజన సంస్కారంలో రొట్టెను, ద్రాక్షారసాన్ని సంఘం పొందే హక్కు, దైవారాధనలో మాతృభాష వినియోగం, లౌకిక హోదా నుంచి అధికారం నుంచి బోధక వర్గం మినహాయింపులు, నేరాల విషయంలో బోధకవర్గం, సభ్యులు అన్న భేదం లేకుండా అందరూ న్యాయస్థానాల తీర్పుకు లోనుకావటం. హస్ తత్వవాదులు ప్రతిపాదించిన నాలుగు నిబంధనలను పోపు నేతలు ఎట్టకేలకు అంగీకరించారు. అయితే వాటిని విశదపర్చే హక్కు సభకు చెందాలని షరతు పెట్టారు. అంటే ఆ హక్కు పోపుకు చక్రవర్తికి చెందాలని అర్ధం.విలీ పుస్త.3, అధ్యా. 8. ఈ ప్రాతిపదికన ఒక ఒప్పందం కుదిరింది. యుద్ధం ద్వారా సంపాదించటంలో విఫలమైన దాన్ని భావగోపనం ద్వారా రోము సంపాదించింది. హస్ తత్వవాదుల నిబంధనలకు బైబిలు సూత్రాలకుమల్లె తమ సొంత బాష్యం చెప్పటం ద్వారా రోమీయ సంఘం తనకనుకూలమైన అర్ధాన్ని చెప్పవచ్చు.GCTel 97.2

    ఆ ఒప్పందం తమ స్వాతంత్ర్యాన్ని వమ్ము చేస్తుందని విమర్శిస్తూ బోహీమియాలో ఒక పెద్ద తరగతి ప్రజలు దాన్ని అంగీకరించని ఫలితంగా భేదాలు చీలికలు ఏర్పడ్డాయి. వారి మధ్య యుద్ధం రక్తపాతం చోటుచేసుకొన్నాయి. ఈ యుద్ధంలో ప్రకోపియస్ నేల కూలాడు. బోహీమియా స్వాతంత్ర్యం అంతమొందింది. GCTel 99.1

    హస్ ను జెరోమ్ ను పట్టియిచ్చిన సిగి వుండ్ బోహీమియా రాజయ్యాడు. బోహీమియా ప్రజల హక్కులను పరిరక్షిస్తానని వాగ్దానం చేసినప్పటికీ పోపుల ఆధిపత్య స్థాపనకు అతడు దోహదం చేశాడు. రోముకు దాసోహమనటం వల్ల అతడికి ఒనగూడిన మేలేమీలేదు. ఇరవై సంవత్సరాలు అతడి జీవితం కష్టాలు శ్రమలతో నిండి దుర్భరమయ్యింది. అర్థం పర్థంలేని దీర్ఘ సంఘర్షణతో అతడి సైన్యం నశించింది. ధనాగారం ఖాళీ అయ్యింది. ఇప్పుడు ఒక ఏడాది పరిపాలన అనంతరం అతను మరణించాడు. దేశం అంతఃకలహం అంచున నిలిచింది. భావి తరాలకు అది విడిచి పెట్టిన స్వాస్థ్యం అపఖ్యాతి.GCTel 99.2

    అల్లర్లు, సంఘర్షణలు, రక్తపాతం చాలా కాలం కొనసాగాయి.విదేశ సైన్యాలు బోహీమియాపై దండెత్తాయి. అంతఃకలహాలు దేశాభివృద్ధికి విఘాతం కలిగించాయి. సువార్త ననునసరించి నివసించిన ప్రజలు రక్తపాతంతో కూడిన హింసకు గురి అయ్యారు.GCTel 99.3

    తమ పూర్వపు సహవిశ్వాసులు రోముతో ఒప్పందం చేసుకొని రోము పొరపాట్లనే కొనసాగిస్తున్నందున వారు సనాతన విశ్వాసాన్నే ఆచరిస్తూ ఒక ప్రత్యేక సంఘంగా ఏర్పడి “ఐక్య సహోదర” సంఘ మన్న పేరు పెట్టుకొన్నారు. ఈ క్రియవల్ల వారు అన్ని వర్గాల ప్రజల నిందలకు శాపనార్థాలకు గురి అయ్యారు. అయినా వారు చలించకుండా స్థిరంగా నిలిచారు. రోము ఒత్తిడికి తాళలేక వారు అడవుల్లోను, గుహల్లోను తలదాచుకొని వాక్యం పఠించటానికి దేవుని ఆరాధించటానికి సమావేశమయ్యేవారు.GCTel 100.1

    ఆయాదేశాల్లోకి రహస్యంగా దూతలను పంపించి “ఈ నగరంలో కొందరు, ఆ నగరంలో కొందరు తమ ప్రేమికులు ఉన్నారని తమ విశ్వాసమల్లేనే వారూ హింసలకు గురి అయ్యారని, ఆల్ఫ్ పర్వతాల నడుమ లేఖన పునాదిపై నిలిచిన పురాతన సంఘం ఒకటున్నదని అది రోము దుష్కృత్యాల్ని విగ్రహారాధనను ఖండిస్తున్నదని తెలుసు కొన్నారు. ” లిలీ, పుస్త 3, అధ్యా. 19. ఈ రహస్య సమాచారం వారికి అమితానందం కలిగించింది. వాల్టెన్సీయ క్రైస్తవులతో ఉత్తర ప్రత్యుత్తరాలు మొదలయ్యాయి.GCTel 100.2

    సువార్త విషయంలో దృఢంగా నిలిచిన బోహీమియ ప్రజలు భయంకర హింసను అనుభవించారు. “అది వారికి కాళరాత్రి. సూర్యోదయానికి కనిపెడుతున్న మనుషులకు మల్లే ఆ చీకటి ఘడియలో వారి కళ్లు సూర్యోదయం కోసం దీక్షగా చూస్తున్నాయి.” అవి వారికి దుర్దినాలు... ముందు హస్ ఆ తర్వాత జెరోమ్ తిరిగి పలికిన మాటలు వారికి గుర్తుకొచ్చాయి. ఆ దినం ఉదయించటానికి ఒక శతాబ్దకాలం గతించాలి అన్నారు వారు. బోహీమియన్ల (హస్ తత్వవాదుల)కు ఈ మాటలు దాస్య గృహంలో ఉన్న గోత్రాలకు యోసేపు పలికిన ఈ మాటల్లా ఉన్నాయి, ” నేను చనిపోవుచున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చి...మిమ్మును తీసుకొనిపోవును.” అదే పుస్తకం పుస్త.3, అధ్యా. 19. “పదిహేనో శతాబ్దం చివరి కాలంలో సహోదర సంఘాలు నెమ్మదిగా పెరిగాయి. కష్టాల్లో నుంచి పూర్తిగా బైట పడకపోయినప్పటికీ వారికి కొంత విశ్రాంతి లభించింది. పదహారో శతాబ్దం ఆరంభదినాల్లో బోహీమియాలోను మొలరేసియాలోను వారి సంఘాలు రెండు వందల దాకా ఉన్నాయి.- ఎజ్రాహాల్ గినెట్, లైఫ్ అండ్ టైమ్స్ ఆఫ్ జా హస్, సం 2, పుట 570. “భయంకర అగ్ని జ్వాలల్ని, ఖడ్గాన్ని తప్పించుకొని నమ్మకంగా నిలిచిన శేషించిన వారికి హస్ ప్రవచించిన ఆ దినాన్ని చూసే తరుణం లభించింది.” లిలి,పుస్త.3, అధ్యా. 19.GCTel 100.3