Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
మహా సంఘర్షణ - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    అధ్యాయం 35—మనస్సాక్షి స్వేచ్ఛకు బెదరింపు

    ప్రొటస్టాంటులు రోమను మతం పట్ల క్రితంకన్న ఇప్పుడు ఎక్కువ సుముఖత ప్రదర్శిస్తున్నారు. కథోలిక్కు మతం ఏమంతగా ప్రగతి చెందని కారణంగా పాబల్యం సంపాదించటానికి పోపుమత గురువులు రాజీమార్గాన్ననుసరిస్తున్న దేశాల్లో దిద్దుబాటు సంఘాల్ని పోపుమత తత్వం నుంచి వేరుచేసే సిద్ధాంతాలపట్ల ఉదాసీనత పెరుగుతున్నది. ఏమైనా ముఖ్యమైన అంశాలపై మనమధ్య ఎక్కువ అభిప్రాయ భేదాలు లేవు. కొద్దిపాటి సర్దుబాట్లు చేసుకొన్నట్లయితే రోము మతంతో మనకు మంచి అవగాహన ఏర్పడుతుంది అన్న అభిప్రాయం బలం పుంజుకొంటున్నది. ఎన్నో త్యాగాలు చేసి సంపాదించిన మనస్సాక్షి స్వేచ్ఛకు ప్రొటస్టాంటులు ఒకప్పుడు ఎంతో విలువనిచ్చారు. పోపుల ఆధిపత్యాన్ని తిరస్కరించాలని తమ బిడ్డలకు నేర్పించి రోమును మతంతో సామరస్యాన్ని ఆశించటం దేవునికి ద్రోహం తలపెట్టటమే అని వారు నమ్మారు. అయితే ఇప్పుడు వారి మనోభావాల్లో ఎంత వ్యత్యాసం కనిపిస్తున్నది!GCTel 530.1

    పోపుల మతతత్వాన్ని సమర్ధించే వారు ఆ సంఘం నిందలకు అప్రతిష్ఠకు గురి అయ్యిందని ఆ విషయాన్ని ప్రొటస్టాంటు లోకం ఒప్పుకొంటోందని అంటున్నారు. అజ్ఞాన, అంధకార శతాబ్దాల్లో సంఘంలో చోటుచేసుకొన్న హేయమైన అర్ధరహితమైన కార్యాలను బట్టి ఈనాడు సంఘాన్ని విమర్శించటం సమంజసం కాదని అనేకులు అభిప్రాయపడున్నారు. సంఘం ప్రదర్శించిన భయంకర క్రూరత్వం ఆదినాల్లో ప్రబలిన ఆటవికత్వ పర్యవసానమన్న సాకు చెప్తూ ఆధునిక నాగరికత ప్రభావం సంఘ భావాలను మార్చివేస్తుందంటూ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.GCTel 530.2

    అహంకారంతో విర్రవీగిన ఈ పోపు వ్యవస్థ ఎనిమిది శతాబ్దాల పాటు తనది దోషరహిత నైజమని డప్పుకొట్టుకొన్న సంగతి ఈ వ్యక్తులు మర్చిపోయారా? ఈ అవాంఛనీయ వైఖరిని విడిచి పెట్టటం అటుంచి ఈ దోషరహితత్వ హక్కును క్రితం కన్నా బిగ్గరగా పందొమ్మిదో శతాబ్దిలో గంటాకంఠంగా చాటి చెప్పింది. “సంఘం ఎన్నడూ తప్పుచేయలేదు, లేఖనాల ప్రకారం తప్పుచేయదు కూడా” అని రోమను సంఘం ఉద్ఘాటిస్తుంది. (జాన్ ఎల్ వాన్ మోషేమ్, ఇన్స్టిట్యూంట్స్ ఆఫ్ ఎక్లీసియాస్టికల్ హిస్టరీ, బుక్ 3, సెంచురీ 11, పార్ట్ 2, చేప్టర్ 2, సెక్షన్ 9, నోట్ 17.) గతంలో తన కార్యా లకు ప్రాతిపదిక అయిన సూత్రాలను ఆ సంఘం ఎలా త్యజించగలదు.?GCTel 531.1

    తన దోషరహితత్వ హక్కును పోపుల సంఘం ఎన్నటికీ త్యజించదు. తన పిడివాదాల్ని అంగీకరించని వారందరిని హింసించటంలో తాను చేసిన దుష్కృతాలన్నీ మంచి పనులని తన వాదన. అవకాశం వచ్చినప్పుడు ఆ దుష్కృతాల్ని మళ్లీ చేయకుండా ఉంటుందా? లౌకిక వాద ప్రభుత్వాలు విధించిన ఆంక్షలు ఎత్తివేసి రోమను సంఘానికి యధాపూర్వ అధికారం మళ్లీ వస్తే ఆ సంఘ నిరంకుశపాలన, హింసాప్రవృత్తి పునరుజ్జీవం పొందటం ఖాయం.GCTel 531.2

    మనస్సాక్షి స్వేచ్ఛ గురించి, పోపు వ్యవస్థ విధాన సాఫల్యం వల్ల అమెరికా సంయుక్త రాష్ట్రాలకు ఏర్పడే ప్రమాదాల గురించి పోపులు ప్రదర్శించే వైఖరి విషయమై ఒక ప్రఖ్యాత రచయిత ఇలా అంటున్నాడు:GCTel 531.3

    “అమెరికాలో రోమన్ కథోలిక్ మతం మత మౌడ్యం ప్రదర్శించటం, కుర్రచేష్టలకు దిగటం జరుగదని నమ్మేవారు చాలామందే వున్నారు. మన స్వాతం త్యానికి సంబంధించిన సంస్థలకు వ్యతిరేకమైంది ఏమీ వారికి కనిపించదు. దాని పెరుగుదలలో ప్రమాదమున్నట్లు వారు గుర్తించరు. అందుచేత మన ప్రభుత్వ ప్రాధమిక సూత్రాన్ని కథోలిక్ సంఘ సూత్రాలతో ముందు పోల్చి చూద్దాం.GCTel 531.4

    “అమెరికా సంయుక్త రాష్ట్రాల రాజ్యాంగం మనస్సాక్షి స్వాతంత్ర్యానికి పూచీ ఇస్తున్నది. ఇది ఎంతో ప్రాధమికమైన విలువైన హక్కు. తన ఆగస్టు 15, 1854 ఎన్ సైకికిల్ ఉత్తరంలో పోప్ పియస్ IX ఇలా అన్నాడు: ‘మనస్సాక్షి స్వేచ్ఛకు సంబంధించిన అర్ధరహిత, దోషపూరిత సిద్ధాంతాలు లేదా పిచ్చికేకలు జాడ్యంలా ప్రమాదభరితమైన పొరపాటు, దేశానికి పట్టిన ప్రాణాంతకమైన చీడ. దేశం దీనికి ఎక్కువ భయపడాలి, ఈ పోపే డిసెంబరు 8,1864 ఎన్సైక్షికిల్ ఉత్తరం ద్వారా, మనస్సాక్షి స్వేచ్ఛను ఆరాధన స్వేచ్ఛను ‘కోరేవారిపై సంఘం ఎన్సైక్లికిల్ ఒత్తిడిని ఉపయోగించరాదు అనే వారిని బహిష్కరించాడు.’GCTel 531.5

    “అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో రోమను సంఘం ప్రదర్శిస్తున్న సమాధాన వైఖరి మారిన మనస్సుకు నిదర్శనం కాదు. తనకు బలం లేనిచోట సహనం పాటిస్తుంది... అంతే. బిషప్ ఓకనర్ ఇలా అంటున్నాడు, ‘కథోలిక్ ప్రపంచానికి హాని కలగకుండా ఉండేలా మతపరమైన ఒత్తిడి విధించేంతవరకు మత స్వేచ్ఛను సహించటం జరుగుతుంది. అంతే,...సెంబ్లూయిస్ ఆర్చిబిషప్ ఒకప్పుడు ఇలా అన్నాడు. ‘సంఘ సిద్ధాంత వ్యతిరేకత అవిశ్వాసం నేరాలు. ఉదాహరణకు క్రైస్తవ దేశాల్లో ప్రజలందరూ కథోలిక్ మతావలంబులు. కథోలిక్ మతం తమదేశ చట్టాల్లో ప్రధాన భాగం అయి ఉన్న ఇటలీ, స్పెయిన్ దేశాల్లోలా ఇతర నేరాలమల్లే వేరే మతాలంబన శిక్షార్హమైన నేరం...’GCTel 532.1

    “కథోలిక్ సంఘంలోని ప్రతీ కార్డినల్, ఆర్చిబిషప్, బిషప్ పోపుకి విశ్వాస పాత్రులమై ఉంటామని ప్రమాణం చేస్తారు. ఆ ప్రమాణంలో ఇలా ప్రమాణం చేస్తారు. ‘సిద్ధాంత వ్యతిరేకులు, మతభేదాలు సృష్టించేవారు, సదరు పోపుపైగాని ఆయన వారసులపైగాని తిరుగుబాటు చేసే వారిని తీవ్రంగా హింసిస్తాను, వ్యతిరేకిస్తాను’. ”- జొషయస్ట్రాంగ్, అవర్ కంట్రీ, అధ్యాయం 5, 2-4 పేరాలు. GCTel 532.2

    రోమన్ కథోలిక్ సంఘంలో యధార్థ క్రైస్తవులున్నారన్నది వాస్తవం. తమకు తెలిసిన సత్యం ప్రకారం జీవిస్తూ దేవునికి సేవచేసేవారు వేలాదిమంది ఆ సంఘంలో ఉన్నారు. దైవ వాక్యం పఠించే అవకాశం వారికి లేదు, అందుచేత వారికి సత్యం తెలియదు. హృదయంలో నుంచి పుట్టుకువచ్చే సేవాస్పూర్తికి, కేవలం ఆచారాలు కర్మకాండకు పరిమితమైన జీవితానికి మధ్య ఉన్న తేడాను వారు ఎన్నడూ చూడలేదు. అలాంటి మోసకరమైన, అసంతృప్తికరమైన విశ్వాసంలో పెరుగుతున్న వారిపట్ల దేవునికి అపారమైన దయ. అట్టి వారిని ఆవరించిన చీకటిని తొలగించి వారిచుట్టూ సత్యకిరణాలు నింపుతాడు. క్రీస్తులో ఉన్న సత్యాన్ని వారికి బయలు పర్చుతాడు. అనేకులు దైవ ప్రజలతో కలిసి సత్యాన్ని స్వీకరిస్తారు.GCTel 532.3

    అయితే కథోలిక్ మతం ఒక వ్యవస్థగా క్రీస్తు సువార్తతో గతంలో ఎన్నడూ ఏకీభవించలేదు. ఇప్పుడూ ఏకీ భవించటం లేదు. ప్రొటస్టాంట్ సంఘాలు గాఢాంధకారంలో ఉన్నాయి. లేకపోతే వారు కాల సూచనల్ని గుర్తించే వారే. రోమను సంఘ ప్రణాళికలు కార్యచరణ పద్ధతులు దీర్ఘకాలికమైనవి. లోకంపై తన అదుపును తిరిగి సాధించటానికి, హింసను పునఃప్రారంభించటానికి, ప్రొటస్టాంట్ షుతం సాధించిన ఫలితాల్ని రద్దు చేయటానికి తాను సల్పనున్న భీకరమైన పోరాటానికి సిద్ధబాటులో భాగంగా తన పలుకుబడిని బలాన్ని పెంచుకోటానికి కథోలిక్ సంఘం, సవాలక్ష కుతంత్రాలు పన్నుతున్నది. ప్రతీ చోటా కథోలిక్ మతం బలం పుంజుకొన్నది. ప్రొటస్టాంట్ దేశాల్లో తామరతంపరగా పెరుగుతున్న సంఘాలు ప్రార్థనాలయాలే ఇందుకు సాక్ష్యం. అమెరికాలో ఆ సంఘ కళాశాలలకు, సెమినరీలకు ప్రొటస్టాంట్ల మధ్య పెరుగుతున్న ఆదరణను పరిశీలించండి. ఇంగ్లండులో ఆచార తతంగాలపట్ల, కర్మకాండల పట్ల మోజు పెరగటం, కథోలిక్ సంఘంలోకి పోటెత్తుతున్న మత మార్పిడులు పరిగణించండి. పవిత్ర సువార్త సిద్ధాంతాలకు విలువనిచ్చే వారందరిలోను ఈ విషయాలు ఆందోళన పుట్టించాలి.GCTel 532.4

    ప్రొటస్టాంట్ లు పోపుల వుతంతో దోబూచులాడున్నారు. ఆ ముతాన్ని అభిమానిస్తున్నారు కూడా. వారు ఆ మతంతో రాజీపడూ దానికి రాయితీలిస్తున్నారు. ఈ వైఖరి పోపుమత వాదుల్ని విస్మయానికి గురిచేస్తున్నది. ఇది వారికే అర్ధం కావటం లేదు. రోమను మత నిజస్వరూపానికి, దాని ప్రాబల్యం వల్ల కలిగే ప్రమాదకర పరిణామాలకు మనుషులు కళ్లు మూసుకుంటున్నారు. పౌరస్వేచ్ఛకు మత స్వేచ్ఛకు ప్రమాదకరమైన ఈ శత్రువు పురోగమనాన్ని నిలువరించేందుకు ప్రజల్ని జాగృతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కథోలిక్ మతంలో ఆకర్షణలేదని దాని ఆరాధన క్రమం నిర్జీవ నిరుత్సాహ కర్మకాండతో కూడి అర్ధరహితంగా ఉంటుందని చాలా మంది ప్రొటస్టాంటుల భావన. ఇక్కడే వారు పొరపడున్నారు. రోమను మతం మోసం మీద ఆనుకొన్నదైనప్పటికీ అనాగరికమైన వంచన మాత్రం కాదు. రోమన్ కథోలిక్ సంఘ ఆరాధన పద్ధతి ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఇంపైన ప్రదర్శన గంభీరమైన ఆచార విధులు ప్రజలను ఆకట్టుకొని హేతువాద సామర్థ్యాన్ని మనస్సాక్షిని కడతేర్చుతుంది. అవి కంటికి ఎంతో ఇంపుగా ఉంటాయి. వైభవోపేతమైన దేవాలయాలు, బ్రహ్మాండమైన ఊరేగింపులు, చక్కగా అలంకరించబడ్డ పుణ్యసమాధులు, శ్రేష్ఠమైన చిత్రలేఖనాలు, అపురూప శిల్పాలు సౌందర్యపిపాసను తృప్తిపర్చుతాయి. వీనులకు విందుకూడా ఉంటుంది. సంగీతం సుమధురం. ఆ సంఘం బ్రహ్మాండమైన దేవాలయాల్లోని ఎత్తయిన స్తంభాల మధ్య గాయక బృందం గళాలు కలిపి పాడుతుంటే దానికి తోడుగా ఆర్గన్ నుంచి వెలువడే గంభీర సంగీత స్వరాలు కలిసినప్పుడు జాలువారే సంగీతం మనసును భక్తి పారవశ్యంతో నింపటం నిస్సందేహం.GCTel 533.1

    బాహ్యమైన ఈ ఆడంబరం, వైభవం, కర్మకాండ పాప రోగంతో బాధపడున్న ఆత్మ హృదయ వాంఛలను వెక్కిరిస్తుంటాయి. ఇది అంతరంగంలో పేరుకుపోతున్న దుర్నీతికి అద్దం పడుతున్నది. క్రీస్తుమతానికి అలాంటి ఆకర్షణలు అవసరం లేదు. సిలువ నుంచి ప్రకాశిస్తున్న వెలుగు పవిత్రమైంది. సుందరమైనది. బహిర్గత అలంకరణలు దాని విలువను పెంచలేవు. పరిశుద్ధ సౌందర్యం వినయ విధేయతలు గల హృదయానికి దేవుడు విలువనిస్తాడు.GCTel 534.1

    ప్రతిభ, భాషాశైలి, పవిత్ర, ఉదాత్త భావనకు సూచికలు కావు, కానక్కరలేదు. కళాత్మక భావనలు, సున్నితమైన అభిరుచులు, లోకాశలతో నిండిన మనసుల్లో తరచు చోటు చేసుకోటం జరుగుతుంది. వాటిని ఆసరాచేసుకొని ఆత్మ అవసరాలను విస్మరించటం, భవిష్యత్తులోని నిత్యజీవాన్ని పట్టించుకోకపోవటం, తము నిత్యసహాయకుడైన యేసుకు దూరంగా వెళ్లిపోయి కేవలం ఈ లోకానికే పరిమితమై నివసించటం సాతాను తరచు వినియోగించుకొనే సాధనాలు.GCTel 534.2

    మార్పు చెందని మనసును బాహ్యమైన మతం ఎంతగానో ఆకట్టుకొంటుంది. కథోలిక్ ఆరాధనలో ఆడంబరం ఆచారవిధుల్లో వంచించే మంత్రశక్తి ఉన్నవి. అవి అనేకుల్ని మోసపుచ్చు తున్నాయి. వారు రోమను సంఘాన్ని పరలోకానికి ద్వారంగా పరిగణిస్తుంటారు. సత్యమనే పునాదిపై బలంగా నిలిచి ఉండే వారు, పరిశుద్ధాత్మ ప్రభావం వలన సూతన హృదయాలు గలవారు పొందినవారు మాత్రమే దాని ప్రభావానికి ప్రతికూల సాక్ష్యులు కాగలరు. క్రీస్తును గూర్చి ప్రయోగాత్మక జ్ఞానం లేని వారు మాత్రమే శక్తి లోపించిన నామ మాత్రపు మతాన్ని అంగీకరిస్తారు. జనులకు కావలసింది అలాంటి మతమే.GCTel 534.3

    పాపాన్ని క్షమించే హక్కు తనకున్నదని సంఘం చేస్తున్న వాదన రోమను మత విశ్వాసులు పాపం చేయటానికి స్వేచ్ఛ గలవారన్న భావనను పుట్టిస్తుంది. పాపపు ఒప్పుకోలు లేకుండా క్షమాపణ ఉండదు. ఈ ఒప్పుకోలు పాపం చేయటానికి లైసెన్స్ గా పరిణమిస్తుంది. పాపమానవుడి ముందు మోకాళ్ళూని తన హృదయంలోని రహస్యాల్ని, రహస్య తలంపుల్ని ఒప్పుకోటం ద్వారా వ్యక్తి తన వ్యక్తిత్వాన్ని హీనపర్చుకొని తన ఆత్మలోని ప్రతీ సద్గుణాన్ని బలహీన పర్చుకొంటాడు. జీవితంలో తాను చేసిన పాపాల్ని యాజకుడితో ఒప్పుకొన్నప్పుడు వ్యక్తి ప్రవర్తనా ప్రమాణం దిగజారిపోతుంది. పర్యవసానంగా వ్యక్తి అపవిత్రుడవుతాడు. దేవుని గురించి అతని తలంపులు పాపమానవుడి తలంపుల రీతిగానే భ్రష్టమైన తలంపులవుతాయి. ఎందుకంటే యాజకుడు దేవుని ప్రతినిధి. మానవుడు ఇంకొక మానవుడితో ఈ హీనమైన రీతిగా ఒప్పుకోవటం నుంచే ప్రపంచాన్ని అపవిత్రపర్చుతున్న పాపం పుట్టి లోకాన్ని దాని చివరి శాసనానికి సమాయత్త పర్చుతున్నది. శరీరేచ్చల్ని ప్రేమించేవారికి దేవునితోకన్నా తోటి మానవుడితో తమ పాపాలు ఒప్పుకోవటమే ఆనందంగా ఉంటుంది. పాపాల్ని ఒప్పుకోవటంకన్నా ప్రాయశ్చిత్తం చెల్లించుకోవటమే మానవ నైజానికి ఎక్కువ సమ్మతంగా ఉంటుంది. శరీరాశల్ని సిలువవేయటంకన్నా, గోనె పట్టలతో, ముళ్ల గొలుసులతో వాటిని అదుపుచేయటం సులభమౌతుంది. క్రీస్తు కాడికన్నా ఐహిక సుఖాలు కోరే హృదయం మోయటానికి ఇష్టపడే కాడి ఎంతో బరువైనది. క్రీస్తు మొదటి రాక సమయంలో ఉన్న యూదు సంఘానికీ రోమను కథోలిక్ సంఘానికి చాలా దగ్గర పోలికలున్నాయి. యూదులు లోపాయకారిగా దైవ ధర్మశాస్త్ర సూత్రాల్లో ప్రతీదాన్ని కాలరాస్తూనే ధర్మశాస్త్రం బోధించే నీతి విధుల్ని బహిరంగంగా నిష్టగా పాటించే వారు. అలవిమాలిన ఆంక్షలతో దాని అనుసరణను భారభరితం బాధాకరం చేసేవారు. ధర్మశాస్త్రాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తున్నట్లు వారు చెప్పుకొన్నట్లే రోమను మతవాదులు సిలువకు ప్రాధాన్య మిస్తున్నట్లు చెప్పుకొంటున్నారు. క్రీస్తు శ్రమల్ని సూచించే చిహ్నాన్ని గౌరవిస్తారు. కాని తాము జీవించే జీవితం ద్వారా ఆ చిహ్నం ఏ ప్రభువును సూచిస్తుందో ఆయనను ఎరుగమని బొంకుతున్నారు.GCTel 534.4

    పోపు మతవాదులు తమ దేవాలయాలమీద, ప్రసంగ వేదికల మీద, దుస్తుల మీద, సిలువను ప్రతిష్ఠిస్తారు. సిలువ చిహ్నం ప్రతీ చోటా దర్శనమిస్తుంది. అయితే అర్ధం పర్ధంలేని సంప్రదాయాల కింద, తప్పుడు భాష్యాలకింద కఠోర ఆంక్షల కింద క్రీస్తు బోధనల్ని సమాధి చేస్తున్నారు. మతదురభిమానులైన యూదులనుద్దేశించి రక్షకుడన్న ఈ మాటలు రోమును కథోలిక్ నాయకులకు మరెక్కువగా వర్తిస్తాయి: “మోయ శక్యముకాని భారమైన బరువులు కట్టి మనుష్యుల భుజముల మీద వారు పెట్టుదురేగాని తమ వ్రేలితోనైనా వాటిని కదలింప నొల్లరు.” మత్తయి 23:4 తన బిడ్డల తప్పిదాల కారణంగా దేవుడు ఉగ్రుడై ఉన్నాడని బోధిస్తూ మనస్సాక్షిగల భక్తుల్ని నిత్యం భయభ్రాంతుల్ని చేస్తూ సంఘనేతలు మాత్రం విలాసాలు భోగాల్లో మునిగి తేల్తున్నారు.GCTel 535.1

    విగ్రహాల పూజ, మృతుల అవశేషాలపూజ, మరణించిన పరిశుద్ధులకు వేడుకోళ్లు, పోపును అగ్రస్థానంలో ఉంచటం - ఇవన్నీ ప్రజల దృష్టిని దేవునిమీద నుంచి ఆయన కుమారుని మీద నుంచి మళ్లించటానికి సాతాను పన్నే కుయుక్తులు. రక్షణ తాను మాత్రమే ఇవ్వగల క్రీస్తు పై నుంచి ప్రజల గమనాన్ని తిప్పి వారిని నాశనం చేయటానికి అతను కృషి చేస్తున్నాడు. ఈ మాటలు చెప్పిన ప్రభువుకు మారుగా నిలిచే ఏ వ్యక్తిని ఆశ్రయించటానికైనా వారిని నడిపిస్తాడు, “ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్తజనములారా నా యొద్దకు రండి. నేను మీకు విశ్రాంతి కలుగజేతును” మత్తయి 11:28.GCTel 535.2

    దేవుని శీలాన్ని, పాపం స్వభావ స్వరూపాల్ని, మహా సంఘర్షణలోని ముఖ్య సమస్యల్ని తప్పుగా చిత్రించటానికి సాతాను ప్రతి నిత్యం శ్రమిస్తున్నాడు. అతను బోధించే తత్వం ధర్మశాస్త్ర విధిని తగ్గించి పాపం చేయటానికి మనుషులకు లైసెన్స్ ఇస్తుంది. అదే సమయంలో వారు దేవుని గురించి తప్పుడు అవగాహనను కలిగి ఆయనను ప్రేమించటం కన్నా, ఆయన పట్ల భయాందోళనలు కలిగి ఉండేటట్లు చేస్తాడు. తన సొంత ప్రవర్తనలోని క్రూరత్వాన్ని సృష్టికర్తకు ఆరోపించాడు. అది మత వ్యవస్థలు ఆరాధన పద్ధతుల్లో వ్యక్తమవుతున్నది. ఈ విధంగా మనుషులకు అంధత్వం కలిగించి దేవునికి వ్యతిరేకంగా పోరాడేందుకు వారిని తన ప్రతినిధులుగా ఎంపికచేసుకొంటాడు. దేవుని గుణగణాలను గురించి దురభిప్రాయాలు పుట్టించి ఆయన అనుగ్రహం సంపాదించటానికి నరబలి అవసరమని మనుషుల్ని నమ్మించాడు. ఆయారూపాల్లో ఉన్న విగ్రహారాధన కింద ఘోర క్రూర కృత్యాలు చోటుచేసుకొన్నాయి. GCTel 536.1

    రోమను కథోలిక్ సంఘం అన్యమతాచారాల్ని క్రైస్తవ మత పద్ధతుల్ని అన్యమతం తీరులో కలిపి దేవుని ప్రవర్తనను తప్పుగా చిత్రించటంలో అనుసరించిన మార్గాలు అన్యుల మారాలకు ఏమీ తీసిపోలేదు. రోమనుసంఘం ఉన్నత దశలో ఉన్నప్పుడు తన సిద్ధాంతాలకు అంగీకారాన్ని ఒత్తిడి ద్వారా సంపాదించటానికి హింసా యంత్రాలుండేవి. తన మాట వినని వారికి దహన స్తంభం ఏర్పాటయ్యింది. పెద్ద సంఖ్యలో జనసంహారం జరిగింది. వారి సంఖ్య ఎంతో తీర్పునాడే బహిర్గతమవుతుంది. సాతాను అధినాయకత్వం కింద బాధితుల్ని చంపకుండా అతిభయంకర హింసకు గురిచేసే సాధనాలను రూపొందించటానికి సంఘనేతలు అధ్యయనాలు చేపట్టేవారు. అనేక సందర్భాల్లో పోరాటంలో ప్రకృతే చేతులెత్తేసి బాధితులు మరణమే ఆనందదాయకమైన విడుదలగా భావించేంతగా సహనం నశించేంతవరకు హింసాకాండ కొనసాగింది.GCTel 536.2

    రోమను సంఘ వ్యతిరేకుల దుర్గతి అలాంటిది. తన విశ్వాసులకు ఆ సంఘ క్రమశిక్షణ, కొరడా దెబ్బలు, నిరాహార శిక్ష, పలురకాల శారీరక శ్రమలు, విసుగు పుట్టించే ఆచార కర్మలు. దైవానుగ్రహం పొందటానికి భక్తులు ప్రకృతి చట్టాల్ని అతిక్రమించటం ద్వారా దైవ ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించారు. మానవుడి ఇహలోక యాత్రలో అతడికి సంతోషానందాలు కలిగించే బంధాల్ని తెంచుకోవాలని ఆ సంఘం బోధించింది. స్వాభావిక మమతాను రాగాలు చంపుకొనేందుకు, తోటి మానవులకు సానుభూతి కనపర్చాలన్న ప్రతీ తలంపూ దేవునికి హేయమైనదిగా భావించి దిగమింగేందుకు విఫలయత్నంలో తమ జీవితాలు గడిపిన లక్షలాది మందితో సంఘపు బందీ గృహాలు దొడ్డులు నిండి ఉండేవి.GCTel 536.3

    దేవుని పేరు ఎన్నడూ విని ఎరుగని ప్రజల మధ్యనేగాక క్రైస్తవ లోకం నడిబొడ్డున సువిశాల క్రైస్తవలోకమంతటా వందల సంవత్సరాలుగా ప్రదర్శితమౌతున్న సాతాను క్రూర దురంతాలను అవగాహన చేసుకోవాలని ఆశిస్తే, రోమను మతతత్వ చరిత్రను అవలోకిస్తే సరిపోతుంది. బ్రహ్మాండమైన ఈ వంచన వ్యవస్థ ద్వారా దేవునికి అపకీర్తిని మానవాళికి దుఃఖాలు బాధల్ని తేవాలన్న తన ఉద్దేశాల్ని ఈ దుష్ట ప్రపంచాధినేత నెరవేర్చు కొంటున్నాడు. మారువేషాలు ధరించిన మతనాయకుల ద్వారా తన కార్యాలను సాధించటంలో అతను ఎలా విజయం సాధిస్తున్నాడో కళ్లకు కడుతూ ఉండటంతో అతనికి బైబిలంటే ఎందుకు అంత కంటగింపో మనకు అర్థమవుతుంది. బైబిలు చదివిన వారికి దేవుని కృపావాత్సల్యాలు బయలు పడతాయి. మనుషులపై ఆయన ఎలాంటి భారమూ మోపడని అర్థమవుతుంది. ఆయన కోరిందల్లా విరిగినలిగిన హృదయం, వినయవిధేయతలు గల స్వభావం.GCTel 537.1

    పరలోక నివాసానికి అర్హత సంపాదించటానికి పురుషులు స్త్రీలు సన్యాసి మఠాల్లో తలుపులు మూసుకొని నివసించాలని క్రీస్తు ఎలాంటి సూచన ఇవ్వటం లేదు. ప్రేమను సానుభూతిని అణచివేయాలని ఆయన ఎన్నడూ ప్రబోధించలేదు. క్రీస్తు హృదయం ప్రేమానురాగాలతో పొంగిపొర్లింది. మానవుడు నైతిక పరిపూర్ణత్వానికి ఎంత దగ్గరైతే అతని మానసిక శక్తులకు అంత ఉత్తేజం కలుగుతుంది; తన పాప స్థితి అతనికి అంత స్పష్టమౌతుంది. శ్రమలనుభవించే వారిపట్ల అతని సానుభూతి అంత ప్రగాఢమౌతుంది. తాను క్రీస్తుకు ప్రత్యామ్నాయమని పోపు చెబుతాడు. అయితే రక్షకుడు క్రీస్తుతో పోల్చి చూసినప్పుడు అతని ప్రవర్తన ఎలా ఉంటుంది? పరలోక రాజుగా తనకు శ్రద్ధాంజలి ఘటించని వారిని ఆయన ఖైదులో వేసినట్లుగాని, శిరచ్ఛేదం చేసినట్లుగాని క్రీస్తుకు పేరుందా? తనను అంగీకరించని వారికి ఆయన మరణ దండన విధించటం ఎవరైనా విన్నారా? ఒక సమరయ గ్రామ ప్రజలు యేసును కించపరచటం చూసిన అపోస్తలుడు యోహాను కోపోద్రిక్తుడై “ప్రభువా, ఆకాశమునుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయునట్లు మేమజ్ఞాపించుట నీ కిష్టమా?” అన్నప్పుడు యేసు తన శిష్యులపంక జాలిగా చూసి అతనికఠిన స్వభావాన్ని ఖండిస్తూ ఇలా అన్నాడు, “రక్షించుటకేగాని నశింపజేయుటకు రాలేదు” లూకా 9:54. క్రీస్తు ప్రదర్శించిన స్వభావానికి ఆయనకు మారుగా వెలసినట్లు చెప్పుకొంటున్న పోపు ప్రదర్శిస్తున్న స్వభావానికి మధ్య ఎంత వ్యత్యాసముంది!GCTel 537.2

    క్రూరమైన అకృత్యాలతో నిండిన తన చరిత్రను క్షమాపణలతో కప్పిపుచ్చుకొంటూ రోమసు సంఘం లోకానికి ఇప్పుడు నగుమోము చూపిస్తున్నది. క్రీస్తుకు మల్లే దుస్తులు ధరిస్తున్నది. కాని ఆ సంఘంలో మార్పు మాత్రం పూజ్యం. గతించిన యుగాల్లో ఉన్న పోపుమత వాద సిద్ధాంతాలన్నీ ఇప్పుడూ చెక్కు చెదరకుండా వున్నాయి. మిక్కిలి చీకటి యుగాల్లో రూపుదిద్దుకున్న సిద్ధాంతాలే నేడూ ఆచరణలో ఉన్నాయి. ఎవ్వరూ మోసపోవాల్సినపనిలేదు. ప్రొటస్టాంట్లు ఇప్పుడు గౌరవించటానికి సిద్ధంగా ఉన్న పోపుమతం సంస్కరణోద్యమ కాలంలో లోకాన్ని శాసించినమతమే. ఆకాలంలో దైవజనులు తమ సొంత ప్రాణాలకు భయపడకుండా ఆ సంఘ దుర్మారతను బైటపెట్టారు. రాజులను యువరాజులను శాసిస్తూ దేవునికి మాత్రమే ఉన్న ఆధిక్యత తనకున్నట్లు చెప్పుకొన్న పోపు వ్యవస్థ ఇప్పుడు కూడా అదే అహంభావాన్ని దర్పాన్ని ప్రదర్శిస్తున్నది. మానవ స్వేచ్ఛను అణచివేసి మహాన్నతుని భక్తుల్ని వధించినప్పుడున్న క్రూర నిరంకుశ స్వభావమే ఆ సంఘానికి ఇప్పుడూ ఉన్నది.GCTel 538.1

    చివరిదినాల్లో మత భ్రష్టత సంభవిస్తుందని ప్రవచనం చెబుతున్నట్లే పోపు మతం ఉనికిలోకి వచ్చింది. 2 థెస్స 2:3,4. తన ఉద్దేశాల్ని ఏ పాత్ర నెరవేర్చగలదో ఆ పాత్ర పోషించటమే ఆ సంఘ విధానంలో ఒక భాగం. కాగా రంగులు మార్చే ఊసరవెల్లి లాంటి తత్వం వెనుక పాము విషం దాగివుంది. “సిద్దాంత స్యతిరేకుల్నిగాని, వ్యతిరేకులని అనుమానించే వారినిగాని నమ్మకూడదు” (లెస్ట్, సం 1, పుట 516) అంటుంది కథోలిక్ సంఘం. భక్తుల రక్తంతో వెయ్యి సంవత్సరాల చరిత్ర రాసుకొన్న ఈ మతం ఇప్పుడు క్రీస్తు సంఘంలో భాగంగా గుర్తింపు పొందాలా?GCTel 538.2

    ప్రొటస్టాంట్ మతానికి కథోలిక్ మతానికి మధ్య చెప్పుకోదగ్గ వ్యత్యాసం ఇప్పుడు లేదని ప్రొబస్టాంట్ దేశాల్లో వినవస్తున్న వాదనకు కారణం లేకపోలేదు. మార్పు చోటుచేసుకొన్నది. కాని ఆ మార్పు పోపుమతంలో కలిగిన మార్పుకాదు. ఇప్పుడున్న ప్రొబస్టాంట్ మతం దాదాపు కథోలిక్ మతంలాగే ఉన్నది. కారణమేంటంటే సంస్కర్తల కాలం నుంచి ప్రొబస్టాంట్ మతం క్షీణిస్తూ వచ్చింది.GCTel 538.3

    ప్రొటస్టాంట్ సంఘాలు లోకాభిమానం కోసం పాకులాడటంతో తప్పుడు ప్రేమ వాటికి అంధత్వం కలిగిస్తున్నది. చెడు అంతా మంచి అని నమ్మటం సరికాదని వారు గ్రహించారు. ఫలితంగా తుడకు మంచి అంతా చెడు అని నమ్ముతున్నారు. పూర్వం భక్తులకు అప్పగించబడ్డ విశ్వాసాన్ని సమర్థిస్తూ దాన్ని కాపాడే బదులు గతంలో ఆ సంఘం పట్ల తమ సంకుచిత అభిప్రాయాలకు దురభిమానానికి ప్రొటస్టాంట్ సంఘాలు ఇప్పుడు క్షమాపణ చెప్పుకొంటున్నాయి. GCTel 539.1

    రోమను మతమంటే ఏమంత అభిమానం లేని ప్రజాసమూహాలు కూడా ఆ సంఘాధికారం వల్ల దాని ప్రభావం వల్ల ప్రమాదమేమీ లేదని భావిస్తున్నాయి. మధ్య యుగాల్లో ప్రబలిన మానసిక సైతిక అంధకారం రోమను సంఘ సంకుచిత సిద్ధాంతాలకు మూఢ నమ్మకాలకు, హింసాప్రవృత్తికి దోహదపడిందని, నవీన కాలంలోని మేధాసంపత్తి, విజ్ఞాన విస్తరణ, మత పరంగా పెరుగుతున్న ఉదారత మత అసహనం, నిరంకుశత్వం పునరుజ్జీవించకుండ అడ్డుకట్టవేస్తాయని అనేకులు విజ్ఞాపన చేస్తున్నారు. జ్ఞానం అభివృద్ధి చెందుతున్న ఈ యుగంలో అట్టి పరిస్తితులు చోటు చేసుకొంటాయన్న ఆలోచన రాకూడదంటున్నారు కొందరు. ఈ తరం ప్రజలకు మానసికమైన, నైతికమైన, మతపరమైన వెలుగు ఉన్న మాట నిజమే. దేవుని పరిశుద్ధ లేఖనాల్లో పరలోకం నుంచి ప్రకాశిస్తున్న వెలుగు లోకాన్ని నింపుతున్నది. కాని ఎంత వెలుగు ప్రకాశిస్తుంటే దాన్ని వక్రీకరించి విసర్జించే వారి చీకటి అంత దట్టమౌతుంది. ఇది మర్చిపోకూడదు.GCTel 539.2

    ప్రొటస్టాంట్లు ప్రార్ధనపూర్వకంగా బైబిలును అధ్యయనం చేస్తే పోపు మత వాస్తవ స్వరూపం బయలు పడుంది. ఆ మతాన్ని వారు అసహ్యించుకొని విడిచిపెట్టటం ఖాయం. అయితే అనేకులు తవు దృష్టికి తామెంతో వివేకులు! సత్యం తెలుసుకునేందుకు వినయమనసుతో దేవునికి ప్రార్ధించటం అవసరమని వారు గుర్తించరు. విజ్ఞాన వికాసమున్న వారమని విర్రవీగుతున్నప్పటికీ లేఖన పరిజ్ఞానంలోను దైవశక్తి విషయంలోను వారు అజ్ఞానులు. తమ అంతరాత్మల్ని శాంతపర్చటానికి వారికి ఏదోసాధనం కావాలి. అందుకు వారు ఆధ్యాత్మికత లేని దాన్ని గౌరవ భంగం కలిగించే దాన్ని అన్వేషిస్తారు. వారు ఆకాంక్షించేది దేవుని మర్చిపోయే పద్ధతిని, అది దేవున్ని జ్ఞాపకముంచుకొనే పద్ధతిగా వారికి కనిపిస్తుంది. వీటన్నిటినీ ఏర్పాటు చేయటానికి అనువుగా పోపు వ్యవస్థ రూపకల్పన అయ్యింది. దాదాపు లోకమంతా చెదరివున్న రెండు వర్గాల మానవాళికి అది ఏర్పాటయ్యింది. - తమ సత్కియలపల్ల రక్షణ పొందే వారికి, తమ పాపాల్లో రక్షణ పొందే వారికి. దాని ప్రాబల్య రహస్యం ఇదే.GCTel 539.3

    పోపు మత విజయానికి గొప్ప మానసిక అంధకారం అనుకూలంగా ఉండేటట్లు వ్యక్తమౌతుంది. గొప్ప మానసిక వికాసం కూడా దాని విజయానికి దోహదపడుందన్నది ఇంకా తేలవలసివుంది. గతించిన యుగాల్లో మనుషులకు దైవ వాక్యంలోని సత్య జ్ఞానం లేనప్పుడు వారి కళ్లకు గంతలు పడ్డాయి. తమ పాదాలకు ఉచ్చులు అమర్చబడి ఉన్నవన్న సంగతి ఎరుగకుండా వేలాదిమంది ఆ ఉచ్చుల్లో చిక్కుకొన్నారు. “శాస్త్రమని తప్పుగా పేరుపడ్డ ” మానవ ఊహాగానాల తళుకు బెళుకులకు కళ్లు జిగేలుముని ఆకర్షితులవుతున్న వారు ఆ తరంలో అనేకులున్నారు. ఉచ్చు ఉన్న సంగతి గ్రహించకుండా కళ్లకు గంతలున్నట్లు వారు ఉచ్చులోకి నడిచి వెళ్తారు. మానవుడి మానసిక శక్తులు సృష్టికర్త ప్రసాదించిన వరంగా అతను పరిగణించి సత్యాన్ని నీతినీ ప్రకటించే సేవలో వాటిని ఉపయోగించాలన్నది దేవుని సంకల్పం. అయితే దురహంకారం దురాశ చోటుచేసుకొని మనుషులు తమ సొంత సిద్ధాంతాలకు దైవ వాక్యంకన్న ఉన్నత స్థానాన్నిచ్చినప్పుడు జ్ఞానం అజ్ఞానం కన్నా ఎక్కువ హాని కలిగిస్తుంది. జ్ఞానాభివృద్ధిని స్తంభింపచేయటం చీకటి యుగాల్లో పోపు వ్యవస్థ ఔన్నత్యానికి మార్గం ఎలా సుగమం చేసిందో అలాగే బైబిలు పై విశ్వాసాన్ని బలహీనపర్చే నేటి తప్పుడు శాస్త్ర పరిజ్ఞానం ఉత్సాహం కలిగించే ఆచారాలతో నిండిన పోపు వ్యవస్థను అంగీకరించటానికి మార్గం తెరవటంలో విజయం సాధిస్తున్నది.GCTel 540.1

    సంఘ సంస్థలు సేవలకు ప్రభుత్వ మద్దతు కోరుతూ ప్రస్తుతం సాగుతున్న ఉద్యమాలలో ప్రొటస్టాంట్లు పొపుమతవాదుల అడుగుల్లో అడుగులు వేస్తూ సాగుతున్నారు. అంతేకాదు. పాత కాలంలో ప్రొటస్టాంట్ అమెరికాలో ఆ సంఘం కోల్పోయిన ప్రాబల్యాన్ని తిరిగి సంపాదించుకోటానికి వారు పోపు వ్యవస్థల ద్వారాలు తెరుస్తున్నారు. ఈ ఉద్యమానికి మరింత ప్రాధాన్యాన్ని కూర్చేది ఆదివారాచరణను అమలుపర్చాలన్న లక్ష్యం. ఆదివారాచరణను రోమను సంఘం ప్రారంభించి తన అధికారానికి చిహ్నంగా దాన్ని పరిగణిస్తున్నది. పోపు వ్యవస్థ స్ఫూర్తి-లౌకిక ఆచారాలను అనుసరించే స్వభావం, దైవాజ్ఞల కన్నా మానవ సంప్రదాయాలను మిన్నగా భావించి గౌరవించే స్వభావం-ప్రొటస్టాంట్ సంఘాల్లో వ్యాపించి పోపు వ్యవస్థ మాదిరిగా అది ఆదివార ఔన్నత్యానికి కృషి చేసేటట్లు వాటిని నడిపిస్తున్నది.GCTel 540.2

    త్వరలో జరగనున్న పోరాటంలో పాలుపొందబోతున్న శక్తులు ఏవేవో పాఠకుడు తెలుసుకోగోరితే గతంలో అదే లక్ష్యసాధనకు రోమును సంఘం ఉపయోగించిన సాధనాల దాఖలాలు వెలికితీసి పరిశీలిస్తే అర్ధమౌతుంది. తమ హఠవాదాన్ని తోసిపుచ్చే వారితో పోపువుత వాదులు ప్రొటస్టాంట్లు ఏకమై ఎలా వ్యవహరిస్తారో పాఠకుడు తెలుసుకోవాలంటే సబ్బాతు విషయంలో దాన్ని సమర్ధించే వారిపట్ల రోమను సంఘం ప్రదర్శించిన వైఖరిని అతను పరిశీలించటం అవసరం. GCTel 541.1

    రాజుల డికీలు, సభల తీర్మానాలు, లౌకిక ప్రభుత్వాధికారం మద్దత్తుతో జారీ అయిన అత్యవసర ఆదేశాలు మాత్రమే అన్యమత పండుగలకు క్రైస్తవ లోకంలో గౌరవప్రద స్థానాన్ని ఇవ్వగలిగాయి. ఆదివారాచరణ అమలుకు బహిరంగంగా తీసుకొన్న మొట్ట మొదటి చర్య కాన్స్టాంటిన్ చేసిన చట్టం. (క్రీ.శ.321) పట్టణ ప్రజలు “పూజనీయ సూర్యుని దినము” న విశ్రమించాలని ఈ చట్టం ఆదేశించింది. కాని పల్లె ప్రజలు తమ వ్యవసాయ కార్యకార్యకలాపాలు కొనసాగించుకోటానికి ఈ చట్టం అనుమతించింది. నిజానికి అది లౌకిక రాజ్యమైనప్పటికీ చక్రవర్తి నామమాత్రంగా క్రైస్తవ మతాన్ని స్వీకరించాక దీన్ని అతను అమలు పర్చాడు.GCTel 541.2

    దైవాధికారానికి ప్రత్యామ్నాయంగా రాజు జారీ చేసిన చట్టంలో సరిఅయిన సమర్ధన లేనందున యువరాజుల ప్రాపకం కావలసిన వాడు, కాన్ స్టెంటీన్ ప్రత్యేక స్నేహితుడు, వందిమాగదుడు అయిన బిషప్ యుసెబియస్ సబ్బాతును క్రీస్తు ఆదివారానికి మార్చాడన్న సమర్ధనను జారీచేశాడు. ఈ కొత్త సిద్ధాంతానికి ఆధారంగా ఒక్క లేఖనం కూడా చూపించలేక పోయాడు. ఈ సిద్ధాంతం తప్పుడు సిద్ధాంతమని యుసెబియస్ అనాలోచితంగా ఒప్పుకొని ఆ మార్పుకు అసలు కారకుల్ని బయట పెట్టాడు. “సబ్బాతు నాడు ఏవేవి చేయటం మన విధో వాటన్నిటిని మేము ప్రభువు దినానికి మార్పిడి చేశాం” అంటున్నాడతను. - రాబర్ట్ కాక్స్ సీబత్ లాస్ అండ్ సేబత్ డ్యూటీస్, పుట 538. ఆధారాలేవీ లేకపోయినప్పటికినీ మనుషులు ప్రభువు సబ్బాతును కాల రాయటానికి ఆదివార వాధన తోడ్పడింది. లోక ప్రతిష్ఠను ఆశించిన వారందరూ ప్రసిద్ధి కెక్కిన ఈ పండుగ దినాన్ని అంగీకరించారు. పోపు వ్యవస్థ వేళ్లూని స్థిరపడిన కొద్దీ ఆదివార ప్రాధాన్యం కొనసాగింది. కొంత కాలం దాకా ప్రజలు వ్యవసాయ పనులు చేసుకొన్నారు. ఏడో దినం ఇంకా సబ్బాతుగానే పరిగణించబడింది. కాని క్రమేణా ఒక మార్పు వచ్చింది. పరిశుద్ధ హోదాలు అలంకరించి వారు ఆదివారం నాడు పౌరసంబంధ వివాదాల్లో తీర్పులు చెప్పటం నిషిద్ధమయ్యింది. తదనంతరం హోదాలతో నిమిత్తం లేకుండా అందరూ ఆ దినాన పనిచేయకూడదన్నది ఆదేశం. ఈ ఆదేశం అతిక్రమించిన స్వతంత్రులకు జరిమానా, బానిసలకు కొరడా దెబ్బలు చట్టం నిర్దేశించింది. అనంతరం ధనవంతులు తమ ఆస్తుల్లో సగభాగం శిక్షగా కోల్పోవాలన్న చట్టం వచ్చింది. చివరగా ఇంకా మొండిగా ప్రవర్తించేవారు బానిసలవ్వాలని తక్కువ తరగతుల ప్రజలు దేశబహిష్కృతి శిక్ష అనుభవించాలని చట్టం పేర్కొంది.GCTel 541.3

    సూచక క్రియలు కూడా రూపుదిద్దుకొన్నాయి. ఎన్నో అద్భుతాల్లో ఒకటి ఇది ఆదివారం నాడు పొలం దున్నటానికి సిద్ధపడున్న ఒక రైతు ఇనుప ముక్కతో నాగలి శుభ్రం చేసుకుంటున్నప్పుడు ఆ ఇనుపముక్క అరచేతికి అంటుకుపోయింది. రెండేళ్లు అది అలాగే ఉండిపోయి అతనికి “ఎంతో బాధను సిగ్గును కలిగించింది. ” ఫ్రేన్సిస్ వెస్ట్, హిస్టారికల్ అండ్ ప్రేక్టికల్ డిస్కోర్స్ ఆన్ ది లాడ్స్ డె, పుట 174.GCTel 542.1

    పేరిష్ ప్రీస్ట్ ఆదివారాన్ని ఆచరించని వారికి హితవు చెప్పి గుడికి వెళ్లి ప్రార్ధనలు వల్లించి తద్వారా తమకు తమ ఇరుగు పొరుగు వారికి విపత్తులు కలుగకుండా చూసుకోవలసిందిగా వారిని ఉపదేశించుమని పోపు అతనికి సూచించాడు. ఆదివారం నాడు పని చేస్తున్న వ్యక్తుల్ని మెరుపు మొత్తింది గనుక అది సబ్బాతు దినమై ఉండాలి అన్న వాదనను మతగురువుల సభ ప్రతిపాదించింది. నాటి నుంచి ఈ వాదనను ప్రొటస్టాంట్లతో సహా చాలా మంది ఉపయోగిస్తున్నారు. “వారు ఈ దినాన్ని నిర్లక్ష్యం చేసినందువల్ల దేవుని ఆగ్రహం ఎంతగా రేగిందో అర్ధమవుతున్నది.” అన్నారు ప్రిలేటులు. ప్రీస్టులు, ప్రబోధకులు, రాజులు, యువరాజులు, విశ్వాసులు ఈ దినానికున్న గౌరవాన్ని పునరుద్ధరించేందుకు క్రైస్తవ మత ప్రతిష్ఠ పెరిగేందుకు “తమ శక్తి మేరకు కృషి చేస్తూ జాగరూకత వహించి మున్ముందు ఈ దినాన్ని మరెక్కువ భక్తిశ్రద్ధలతో ఆచరించాలి.” అంటూ అనంతరం ఒక విజ్ఞప్తి చేశారు. తామస్ మరర్మ్ డిన్‌కోర్స్ ఆన్ సిక్స్ డయాలాగ్స్ ఆన్ ది నేమ్, నోషన్, అండ్ ఆబ్జర్వేషన్ ఆఫ్ ది లాడ్స్ డె, పుట 271.GCTel 542.2

    మత సభల డికీలకు అధికారం కొరవడినందున ప్రజలకు భయం పుట్టించి వారిని ఆదివారం పనిచేయకుండా నిలిపేసేటట్లు ప్రభుత్వాధికారులు డిక్రీ జారీ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేయటం జరిగింది. రోము నగరంలో జరిగిన సినాడ్ లో క్రితం చేసిన తీర్మానాలన్నింటిని ధ్రువీకరించారు. వాటిని మతపరమైన చట్టంలోచేర్చి క్రైస్తవ లోకమంతటా పౌర అధికారుల ద్వారా అమలు పర్చారు. (హేలిన్, హిస్టరీ ఆఫ్ ది సేబత్, పిటి 2, అధ్యా 5, సెక్షన్ 7 చూడండి.)GCTel 542.3

    ఇంకా ఆదివారాచరణకు లేఖనాధికారం లేకపోవటం గొప్ప ఇబ్బంది తెచ్చిపెట్టింది. “” ఏడవ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము” అంటూ యెహోవా స్పష్టంగా చెప్పిన మాటల్ని సూర్యుడి దినాన్ని గౌరవించేందుకు బోధకులు పక్కన పెట్టటానికి వారికేమి హక్కు ఉన్నదని ప్రజలు ప్రశ్నించారు. కొరవడ్డ లేఖన సాక్ష్యాన్ని చూపటానికి నిజంలా కనిపించే సమాచారం అవసరం. ఆదివారాన్ని గట్టిగా సమర్దించే వ్యక్తి పన్నెండో శతాబ్దం చివరలో ఇంగ్లండులోని సంఘాల్ని సందర్శించగా సత్యానికి నమ్మకంగా నిలిచిన విశ్వాసులు అతన్ని ప్రతిఘటించారు. తన ప్రయత్నాలు ఫలించకపోవటంతో కొంతకాలం ఆదేశం విడిచిపెట్టి తన బోధనల్ని అమలు పర్చటానికి కొరవడ్డ నిధుల్ని సేకరించటం మొదలుపెట్టాడు. అతను తిరిగి వచ్చినప్పుడు ఆ కొరత భర్తీ అయ్యింది. అనంతరం అతను చేసిన కృషి ఫలించింది. అతను తనతో కాగితం చుట్ట ఒకటి తెచ్చాడు. అది నేరుగా దేవుని వద్దనుంచి వచ్చిందని చెప్పాడు. అందులో ఆదివారాచరణకు అవసరమైన ఆజ్ఞ దానితో పాటు, అవిధేయుల్ని భయపెట్టటానికి భయంకరమైన బెదరింపులు ఉన్నాయి. అది సమర్ధిస్తున్న సిద్ధాంతమల్లే ఘోరమైన నకిలీ అయిన ఆ ప్రశస్త పత్రం పరలోకం నుంచి పడిందని, అది యెరూష లేములో గొలౌతాలోని షిమ్యోను బలిపీఠం మీద దొరికిందని ప్రచారమయ్యింది. కాని నిజానికది రోములోని పోపు రాజభవనం నుంచి వచ్చింది. సంఘాధికారాన్ని, సౌభాగ్యాన్నిGCTel 543.1

    పెంచటానికి మోసాలు, ఫోర్జరీలు న్యాయసమ్మతమైన కార్యాలని అన్ని యుగాల్లోను పోపు మత గురువుల నమ్మకం.GCTel 543.2

    శనివారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి సోమవారం సూర్యోదయం వరకు పనిచేయటాన్ని ఆ పత్రం నిషేధించింది. సంభవించిన అనేక మహత్కార్యాలు దాని అధికారాన్ని ధ్రువీకరిస్తున్నవని ప్రకటించారు. నిర్దిష్ట సమయానికి మించి పని చేసిన వ్యక్తులకు పక్షవాతం వచ్చినట్లు నివేదించారు. తన జొన్నలు పిండి ఆడుకోటానికి ప్రయత్నించిన పిండిమర యజమాని పిండికి బదులు రక్తం ధారగా పడటం, చక్రాన్ని తిప్పే నీటి ప్రవాహం బలంగా వున్నా మిలు చక్రం నిలిచిపోవటం చూశాడు. కలిపిన పిండి అవన్ లో పెట్టిన మహిళ దాన్ని బయటికి తీసినప్పుడు అవన్ వేడిగా ఉన్నప్పటికీ ఆ పిండి తడిగానే ఉంది. ఇంకొక మహిళ తొమ్మిదో గడియలో రొట్టె కాల్చటానికి కలిపిన పిండిని మరుసటిరోజు సోమవారం వరకు కాల్చకుండా ఉంచితే అది దైవశక్తి వల్ల కాల్చిన రొట్టెలయ్యింది. శనివారం తొమ్మిదో గడియ తర్వాత అవలో రొట్టె కాల్చిన ఒకవ్యక్తి మరుసటి ఉదయం దాన్ని విరచినప్పుడు అందులో నుంచి రక్తం వచ్చింది. అలాంటి అర్ధరహితమైన మూఢనమ్మకాలతో కూడిన కల్పనలతో ఆదివార ప్రబోధకులు ఆ దినం పరిశుద్ధతను నిరూపించ పూసుకొన్నారు.(రోజర్ డి హవెన్, ఏనల్స్, సం.2, పుటలు 528-530 చూడండి.)GCTel 543.3

    ఆదివారానికి ప్రాచీన సబ్బాతులోని కొంత భాగాన్ని కలపటం ద్వారా ఇంగ్లండులో మల్లే స్కాట్ లేండ్ లోనూ ఆదివారానికి గౌరవం పెరిగింది. కాని పరిశుద్ధంగా ఆచరించాల్సిన సమయంలో తేడాలున్నాయి. “శనివారం మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి పరిశుద్ధ సమయంగా ఎంచాలి” అని అప్పటి నుంచి సోమవారం ఉదయం వరకూ ఎవరూ లౌకిక వ్యాపారాలు చేపట్టకూడదని స్కాబ్లండ్ రాజు ఆజ్ఞ ఇచ్చాడు.. మరర్, పుటలు 290,291.GCTel 544.1

    ఆదివార పరిశుద్ధతను నిరూపించటానికి ఎన్నో ప్రయత్నాలు జరిగినప్పటికీ సబ్బాతు దేవుడు స్థాపించినదని దాని స్థానంలో ఏర్పాటైనది మానవ కల్పితమని పోపుమత వాదులే బహిరంగంగా ఒప్పుకొన్నారు. పదహారో శతాబ్దంలో పోపుమత సభ ఇలా స్పష్టంగా ప్రకటించింది: “క్రైస్తవులంతా జ్ఞాపకముంచుకోవాల్సింది ఏమిటంటే వారి సబ్బాతును క్రైస్తవులమైన మేము ప్రభువు దినంగా మార్చినప్పటికీ ఏడో దినం దేవుడు పరిశుద్ధపర్చిన దినమని దానిని యూదులు మాత్రమేగాక దేవుని ఆరాధిస్తున్నట్లు చెప్పుకొనే ఇతరులంతా అంగీకరించి ఆచరిస్తున్నారు.” అదే పుస్తకం, పుటలు 281,282. దైవ ధర్మశాస్త్రంతో ఆటలాడుతున్న వారు తాము చేస్తున్న పని ఏంటో ఎరుగకుండా చేయటం లేదు. వారు ఉద్దేశపూర్వకంగానే దేవుని కన్నా తమ్ముని తాము హెచ్చించుకొంటున్నారు.GCTel 544.2

    రోమును సంఘంతో ఏకీభవించని వారి పట్ల అది అనుసరించే విధానానికి వాల్డెన్ సీయుల సుదీర్ఘ రక్తసిక హింసాకాండ ఒక మచ్చుతునక. వారిలో కొందరు సబ్బాతును ఆచరించేవారు. నాల్గో ఆజ్ఞను నమ్మకంగా ఆచరించినందుకు ఇతరులు ఇలాగే శ్రమలను భరించారు. ఈ తియోపియ, అబిసీనియా చరిత్ర ప్రాధాన్యం సంతరించుకొన్నది. చీకటి యుగాల్లోని అంధకారంలో మధ్య ఆఫ్రికాలోని క్రైస్తవుల్ని ప్రపంచం మర్చిపోయింది. వారు అనేక శతాబ్దాలపాటు తమ విశ్వాసం విషయంలో స్వేచ్ఛనసుభవించారు. చివరికి వారి ఉనికిని గూర్చి రోమును గురువులకు తెలిసింది. అట్టే కాలం గడవకముందే అబిసినియా చక్రవర్తి పోపు మాయలో పడటం పోపును క్రీస్తు ప్రత్యామ్నాయంగా అంగీకరించటం జరిగింది. రాయితీలు ప్రారంభమయ్యాయి. కఠినాతి కఠిన శిక్షలతో సబ్బాతు ఆచరణను నిషేధిస్తూ రాజాజ్ఞ జారీ అయ్యింది. (మైకల్ గెడ్డీస్, చర్చ్ హిసలురి ఆఫ్ తియోపియ, పుటలు 311,312 చూడండి.) అయితే పోపు వ్యవస్థ నియంతృత్వం భారమైన కాడిగా తయారవ్వటంతో దాన్ని విడిపించు కోటానికి అబిసీనియనులు కృతనిశ్చయంతో ఉన్నారు. భయంకర పోరాటం అనంతరం రోమను తమ వాదులు ఆ రాజ్యం నుంచి బహిష్కుృతులయ్యారు. ప్రజలు తమ సనాతన విశ్వాసాన్ని తిరిగి సంపాదించుకొన్నారు. ఆ సంఘాలు తమ స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తూ ఆనందించాయి. రోమను సంఘం మోసాన్ని మత దురభిమాన్ని నిరంకుశాధికారాన్ని గురించి నేర్చుకొన్న పాఠాల్ని వారు ఎన్నడూ మర్చిపోలేదు. తమ ఒంటరి ప్రపంచంలో తక్కిన క్రైస్తవలోకానికి తెలియకుండా మిగిలి జీవించటంలోనే వారికి ఎంతో తృప్తి లభించింది.GCTel 544.3

    భ్రష్టతకు ముందు పోపు సంఘం సబ్బాతును ఆచరించిన రీతిగానే ఆఫ్రికా సంఘాలు సబ్బాతును ఆచరించాయి. దేవుని ఆజ్ఞాను సారంగా ఏడోదినాన్ని ఆచరిస్తూ సంఘాచారానికి అనుగుణంగా ఆదివారం పని నుంచి విశ్రమించాయి. సర్వాధికారం లభించిన తర్వాత రోమును మతం ఆదివారాన్ని ఘనపర్చేందుకు దేవుని సబ్బాతును కాళ్ల కింద తొక్కింది. అయితే, దాదాపు వెయ్యి సంవత్సరాలు మరుగున పడి ఉన్న ఆఫ్రికా సంఘాలు ఈ భ్రష్టతలోపాలు పంచుకోలేదు. రోమను సంఘ ప్రాబల్యానికి లోనైనప్పుడు యధార్ధ సబ్బాతును పక్కన పెట్టి నకిలీని ఘనపర్చటానికి ఒత్తిడి వచ్చింది. స్వాతంత్యం తిరిగి సంపాదించుకొన్న వెంటనే సబ్బాతు ఆచరణను పునఃప్రారంభించాయి.GCTel 545.1

    గతాన్ని గూర్చిన ఈ దాఖలాలు సబ్బాతుపట్ల దానికి మద్దతు పలికేవారిపట్ల రోమును సంఘ తీవ్ర వ్యతిరేకతను తాను సృష్టించిన సంస్థను ఘనపర్చేందుకు అది ఉపయోగిస్తున్న సాధనాలను స్పష్టంగా కనపర్చుతున్నాయి. ఆదివారాన్ని ఘనపర్చటానికి రోమను కథోలికు ప్రొటస్టాంట్లు చేతులు కలిపినప్పుడు, ఈ సన్నివేశాలు పునరావృ త్తం కావలసి ఉన్నాయని దైవ వాక్యం బోధిస్తున్నది.GCTel 545.2

    గొర్రెపిల్ల కొమ్మువంటి కొమ్ములుగల మృగం సూచిస్తున్న రాజ్యం “భూమియు దానిలో నివసించు వారుసు “చిరుతపులిని పోలియున్న” మృగం సూచిస్తున్న పోపు మతాన్ని అవలంబించేటట్లు చేస్తుందని ప్రకటన 13వ అధ్యాయంలోని ప్రవచనం వ్యక్తం చేస్తున్నది. రెండు కొమ్ములు గల మృగం “యీ క్రూరమృగమునకు ప్రతిమను చేయవలెనని అది భూనివాసులతో” చెప్పవలసి వుంది. అది ఇంకా కొద్దివారుగాని, గొప్పవారుగాని, ధనికులుగాని దరిద్రులుగాని, స్వతంత్రులుగాని దాసులుగాని” అందరూ మృగం ముద్ర వేయించుకోవాలని బలవంతం చేస్తుందని చెబుతుంది. ప్రకటన 13:1116. గొర్రెపిల్ల కొమ్ము వంటి కొమ్ములుగల క్రూరమృగం అమెరికా సంయుక్త రాష్ట్రాల్ని సూచిస్తుందని, తన సర్వాధికారం అంగీకారానికి చిహ్నంగా రోమను సంఘం పరిగణిస్తున్న ఆదివారాచరణనను అమెరికా అమలు పర్చినప్పుడు ఈ ప్రవచనం నెరవేరుతుందని వ్యక్తమౌతున్నది. పోపు మతానికి శ్రద్ధాంజలి ఘటించటంలో అమెరికా ఒక్కటే ఒంటరిగా నిలువదు. రోమను సంఘం ఆధిపత్యాన్ని ఒకప్పుడు అంగీకరించిన దేశాల్లో దాని ప్రభావం పూర్తిగా అంతమవ్వలేదు. దాని అధికారం పునరుద్ధరణ పొందుతుందని ప్రవచనం చెబుతున్నది. “దాని తలలలో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్టుండెను. అయితే ఆ చావుదెబ్బ మానిపోయెను గసుక భూజనులందరు మృగము వెంట వెళ్లుచు ఆశ్చర్యపడుచుండిరి” 3వ వచనం. చావుదెబ్బ 1798 లో పోపు అధికారం పడిపోవటాన్ని సూచిస్తుంది. దీని తర్వాత “ఆ చావుదెబ్బ మానిపోయెను గనుక భూజనులందరు మృగము వెంట వెళ్లుచు ఆశ్చర్యపడుచుండిరి” అంటున్నాడు ప్రవక్త. రెండో రాకడ వరకూ “పాపపురుషుడు” కొనసాగుతాడని పౌలు స్పష్టంగా చెబుతున్నాడు. 2 థెస్స 2:38. కాలం చివర వరకూ అతని వంచన కొనసాగుతూనే ఉంటుంది. ప్రకటన రచయిత అంటున్న ఈ మాటలు పోపు మతానికి కూడా వర్తిస్తాయి. ” భూనివాసులందరు...జీవగ్రంధమందు ఎవరిపేరు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు” ప్రకటన 13:8. కేవలం రోమను సంఘాధికారం మీదే ఆధారితమై ఉన్న ఆదివార వ్యవస్థకు పాత ప్రపంచం నూతన ప్రపంచం రెండూ అర్పించే నివాళిలో పోపు మతానికి నివాళి అర్పించటం జరుగుతుంది.GCTel 545.3

    పందొమ్మిదో శతాబ్ది మధ్యకాలం నుంచి అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని ప్రవచన విద్యార్ధులు లోకానికి అందిస్తున్న సాక్ష్యం ఇది. ఇప్పుడు చోటుచేసుకొంటున్న ఘటనల్లో మనకు కనిపిస్తున్న ప్రవచన నెరవేర్పు దిశగా పుంజుకొంటున్న వేగం ప్రొటస్టాంట్ బోధకులుకూడా ఆదివారాచరణకు దైవాధికార మంత్రాన్ని జపిస్తున్నారుగాని దేవుని ఆజ్ఞ స్థానాన్ని భర్తీ చేయటానికి అద్భుత కార్యాలను సృష్టించిన పోపు నేతలమల్లే లేఖన నిదర్శనం చూపించలేక పోతున్నారు. ఈ ఆదివార సబ్బాతాజ్ఞను మీరిన ప్రజలు దేవుని తీర్పులకు గురి అవుతారన్న మాటలు మళ్లీ మళ్లీ వినిపిస్తాయి. వినిపించటం ఇప్పుడే మొదలయ్యింది. ఆదివారాచరణ అమలుకు ఉద్యమం ఉదృతి వేగవంతం అవుతున్నది.GCTel 546.1

    రోమను సంఘం చతురత జిత్తుల మారితనం అమోఘం. ఏమి జరగబోతున్నదో దానికి బాగా తెలుసు. తప్పుడు సబ్బాతును అంగీకరించటంలో గతంలో దాని అమలుకు రోమన్ సంఘం ఏ సాధనాల్ని ఉపయోగించిందో వాటినే దాని అమలుకు ఉపయోగింటానికి ప్రొటస్టాంట్ సంఘాలు ప్రయత్నిస్తూ తనకు బ్రహ్మరధం పట్టటం చూస్తూ అనుకూల సమయం కోసం వేచి ఉన్నది. ప్రకాశిస్తున్న సత్యాన్ని తోసిపుచ్చే వారు ఈ స్వయం ప్రకటిత దోషరహిత సంఘ సహాయంతో అదే సృష్టించిన సంస్థను ఘనపర్చటానికి పూనుకొంటారు. ఈ కార్యాచరణలో ప్రొటస్టాంట్లకు చేయూత నివ్వటానికి అది ఎంత ఉత్సాహంగా ముందుకు వస్తుందో ఊహించటం కష్టం కాదు. రోమను సంఘానికి విధేయులుకాని వారితో వ్యవహరించటం ఏలాగో పోపు నేతలకు బాగా తెలుసు.GCTel 547.1

    శాఖోప శాఖలుగా లోకమంతా విస్తరించి ఉన్న రోవును కథోలిక్ సంఘం బ్రహ్మాండమైన వ్యవస్థగా ఏర్పడి పోపు నియంత్రణ కింద అతని ఆసక్తుల కనుగుణంగా నడుస్తుంటుంది. ప్రపంచ దేశాల్లో లక్షల కొద్దీ ఉన్న ఆ సంఘ ప్రతినిధులు పోపుకి నమ్మకంగా ఉంటాము అన్న వాగ్దానంపై పని చేస్తారు. తమ జాతీయత ప్రభుత్వం ఏవైనప్పటికీ తమ సంఘాధికారం అన్ని అధికారాలకన్న మిన్న అని వారు పరిగణించాల్సి ఉంది. తమ దేశానికి నమ్మకంగా ఉంటామన్న ప్రమాణం చేసినప్పటికీ దాని వెనుక రోమను సంఘానికి నమ్మకంగా ఉండటమన్న వాగ్దానం నిలిచి ఆ సంఘాసక్తులకు హానికరమైన ఏ వాగ్దాన్నాన్నైనా రద్దు పర్చుతుంది.GCTel 547.2

    ఆయా దేశాల ఆంతరంగిక వ్యవహారాల్లో వేలు పెట్టటానికి రోమును సంఘం చతురతలో పట్టువిడువకుండా కృషి చేస్తుందని అలా స్థానం సంపాదించి ప్రజలకూ పాలకులకూ హాని కలిగించినప్పటికీ తన పనులు చక్కపెటుకోటానికి పాటుపడుతుందని చరిత్ర సాక్ష్యమిస్తున్నది. 1204లో పోపు పయస్ III ఆరగన్ రాజు పీటర్ II తో ఈ ప్రమాణం చేయించుకొన్నాడు: “ఆరగోనియన్ల రాజునైన పీటర్ II అనే నేను నా ప్రభువైన పోపు ఇన్నోసెంట్ , ఆయన కథోలిక్ వారసులకు, రోమను కథోలిక్ సంఘానికి సర్వదా నమ్మకంగాను విధేయంగాను ఉంటానని, ఆయనకు విధేయుడిగా మెలగుతూ, నా రాజ్యాన్ని పరిరక్షించుకొంటూ, కథోలిక్ విశ్వాసాన్ని కాపాడుతూ సంఘ సిద్ధాంత వ్యతిరేకుల్ని హింసిస్తానని ప్రమాణం చేస్తున్నాను.” జాన్ డేలింగ్, ది హిస్టరి ఆఫ్ రోమనిజమ్, బుక్ 5, అధ్యా 6, సెక్షన్ 55. “తాను చక్రవర్తుల్ని తొలగించటం న్యాయసమ్మతమని” (’నీతి బాహ్యులైన రాజుల్ని, పాలకులకు నమ్మకంగా లేని పౌరుల్ని క్షమించే హక్కు తనకున్నదని రోమను మతగురువు పోపు అంటున్న మాటలకూ దీనికీ పొంతన ఉన్నది.” — మోషేమ్, బిస 3, సెస్ట్ 11, పిటి 2 చా 2, సెక్ 9, నోట్ 17.GCTel 547.3

    తనలో ఎన్నటికీ మార్పు ఉండదన్నది రోమను సంఘ ప్రగల్భం. ఇది జ్ఞాపకముంచు కోవాలి. గ్రెగరీ VII ఇన్నోసెంట్ III ప్రవేశ పెట్టిన నియమాలే రోమను కథోలిక్ సంఘనియమాలు. గత శతాబ్దాల్లో ఎంత కఠినంగా అమలు పర్చిందో తనకు తగిన అధికారం ఉంటే ఈనాడూ వాటిని అంత కఠినంగా అమలు పర్చేదే. ఆదివార సన్మాన ప్రక్రియలో రోమను సంఘ సహాయ సహకారాల్ని అంగీకరించటానికి సిద్ధపడున్న ప్రొటస్టాంట్లు తాము చేస్తున్న పనేమిటో గ్రహించలేక పోతున్నారు. తాము ఉద్దేశించిన కార్యాన్ని సాధించటంలో ప్రొటస్టాంట్లు తల మునకలై ఉండగా తన అధికారాన్ని ఆధిపత్యాన్ని పునరుద్ధరించుకోవాలని కథోలిక సంఘం ఆపసోపాలు పడున్నది. సంఘం ప్రభుత్వాధికారాన్ని ఉపయోగించుకోవచ్చునని లేదా పరిస్థితుల్ని అదుపు చేయవచ్చునని, ప్రభుత్వ చట్టం ద్వారా మత పరమైన ఆచారాలు అమలు పర్చవచ్చునని రోమను మతం అభిప్రాయం. సూక్ష్మంగా చెప్పాలంటే, అమెరికాలో సంఘాధికారమూ, దేశ రాజకీయాధికారమూ కలిసి మనస్సాక్షిని శాసించనివ్యండి. అప్పుడు ఈ దేశం (అమెరికా)లో రోమను సంఘ విజయం ఖాయం.GCTel 548.1

    పొంచి ఉన్న అపాయం గురించి దైవవాక్యం హెచ్చరిస్తున్నది. దీన్ని పట్టించుకోకపోతే రోము నిజమైన ఉద్దేశాలేంటో ఉచ్చులో నుంచి తప్పించుకోటానికి సమయంలేని పరిస్థితిల్లోనే ప్రొటస్టాంట్ లోకం తెలుసు కొంటుంది. సదరు సంఘం నిశబ్దంగా అధికారం సంపాదించు కొంటుంది. చట్ట సభల్లో, సంఘాల్లో మనుషుల హృదయాల్లో దాని సిద్ధాంతాలు వాటి ప్రభావం చూపుతున్నాయి. అది బ్రహ్మాండమైన కట్టడాలు నిర్మిస్తున్నది. వాటి రహస్య మందిరాల్లో గతంలో తాను పాల్పడ్డ హింసాకాండకు తిరిగి పాల్పడు తున్నది. చడీచప్పుడు లేకుండా ఎవరికీ అనుమానం రాకుండా సమయం వచ్చినప్పుడు దెబ్బతీయటానికి అది తన వనరుల్ని పటిష్ఠపర్చుకుంటుంది. తాను కోరుకుంటున్నదల్లా నిలబడటానికి స్థలం. దాన్ని సంపాదిస్తూనే ఉంది. రోమను సంఘ స్వభావమేంటో, ఉద్దేశాలేంటో మనం త్వరలోనే చూస్తాం. అనుభవ పూర్వకంగా తెలుసుకొంటాం. ఎవరైతే దైవవాక్యాన్ని నమ్మి ఆచరణలో పెడ్తారో ఆ కారణంగా వారు నిందకు హింసకు గురి అవుతారు.GCTel 548.2