Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
మహా సంఘర్షణ - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    అధ్యాయం 21— తోసిపుచ్చిన హెచ్చరిక

    (ప్రజల్ని మేల్కొలిపి దేవుని తీర్పుకు వారిని సన్నద్ధ పరచటమున్న ఒకే ఒక ఉద్దేశంతో మిల్లర్, ఆయన అనుచరులు రెండో రాకడ సిద్ధాంతాన్ని ప్రబోధించారు. మతాన్ని ఆచారంగా అనుసరించే ప్రజలకు నిజమైన సంఘ నిరీక్షణ ఏమిటో వివరించి మరింత సన్నిహితమైన క్రైస్తవానుభవం అవసరమని ఉపదేశించటానికి వారు ప్రయత్నించారు. విశ్వసించని వారు మారుమనసు పొంది క్రీస్తును రక్షకుడుగా స్వీకరించేందుకు వారు కృషిచేశారు. మతపరంగా ఒక దళానికో వర్గానికో చెందటానికి మనుషుల్ని మార్చటానికి వారు ప్రయత్నించలేదు. కనుక అన్ని వర్గాలు దళాల మధ్య వారు పని చేశారు. వ్యవస్థ,,, క్రమశిక్షణ విషయాల్లో వారు జోక్యం కలిగించుకోలేదు”GCTel 349.1

    “ప్రస్తుతమున్న మత సంప్రదాయాలను విడిచిపెట్టి కొత్త సంప్రదాయాల్ని స్థాపించాలని గాని, లేక ఒక దానికి హాని కలిగే విధంగా మరోదానికి ఉపకారం చేయాలని గాని నా పరిచర్య అంతటిలోనూ ఎన్నడూ నేను ఆకాంక్షించలేదు. అందరికీ ఉపకరించాలన్నదే నా ఆలోచన. క్రీస్తు రాకడ విషయంలో క్రైస్తవులంతా ఉత్సాహంగా ఉంటారని, నా నమ్మకాల్ని అంగీకరించని కొందరు ఆగమన సిద్ధాంతాన్ని స్వీకరించిన వారిని ఆ కారణంగా ద్వేషించరని అనుకుంటే ప్రత్యేక సమావేశాల ఏర్పాటు అవసరం ఉండదని నా అభిప్రాయం. మనుషులకు దేవుని మీద నమ్మకం పుట్టించటం, రానున్న తీర్పును గూర్చి లోకాన్ని హెచ్చరించటం, దేవుని కలుసుకోటానికి అగత్యమైన హృదయశుద్ధి కోసం ప్రయాసపడవలసిందిగా నా సోదర మానవుల్ని ప్రోత్సహించటం - ఇదే నా ఏకైక లక్ష్యం. నా సువార్త పరిచర్య ఫలితంగా క్రీస్తును స్వీకరించిన వారిలో అధిక సంఖ్యాకులు ప్రస్తుతమున్న ఆయా సంఘాల్లో చేరారు” అన్నాడు మిల్లర్ - బ్లిస్, పుట 328.GCTel 349.2

    ఆయన పరిచర్య సంఘాల పెరుగుదలకు తోడ్పడటంతో కొంత కాలం అంతా బాగానే ఉంది. అయితే బోధకులు, మతనాయకులు ఆగమన సిద్ధాంతాన్ని వ్యతిరేకించటానికి నిశ్చయించుకొని ఆ అంశాన్ని చర్చించ కూడదని తీర్మానించారు. ఆగమన సిద్ధాంతాన్ని ప్రసంగ వేదిక నుంచి వ్యతిరేకించటం మాత్రమేగాక రెండో రాకడ గురించి ప్రసంగించే వారి సభలకు సభ్యులు హాజరు కాకుండ నిలువరించారు. అదీగాక సంఘ సాంఘిక సమావేశాల్లో సైతం తమ నిరీక్షణను గూర్చి మాట్లాడుకో కూడదని ఆంక్ష విధించారు. విశ్వాసులు ఇలా గొప్ప సంకట స్థితిలో పడి కొట్టుమిట్టాడారు. తమతమ సంఘాలపట్ల వారికి ప్రేమాభిమానాలు మెండు. మరో పక్క దేవుని వాక్యాన్ని అణచివేయటం, ప్రవచనాలను పరిశీలించటానికి తమకున్న హక్కును కాలరాయటం చూసినప్పుడు దేవునికే విధేయులై ఉండాలన్న స్పూర్తి వారిలో పెల్లుబికింది. నాయకులకు లోబడకూడదని తీర్మానించుకొన్నారు. దైవ వాక్యం ఇస్తున్న సాక్షాన్ని మరుగు పర్చటానికి ప్రయత్నించే వారు “సత్యమునకు స్తంభమును ఆధారమును” అయిన క్రీస్తు సంఘంలోని వారు కారని పరిగణించారు. కనుక వారు తమ పూర్వ సంఘం నుంచి వేరవ్వటం న్యాయమే అని భావించారు. 1844 గ్రీష్మ కాలంలో ఏభైవేలమంది తమతమ సంఘాలను విడిచిపెట్టి బైటికి వచ్చారు.GCTel 350.1

    ఇంచుమించు ఇదే సమయంలో అమెరికాలోని అనేక సంఘాలలో గొప్ప మార్పు కనిపించింది. లోక సంబంధమైన అభ్యాసాలకు ఆచారాలకు సంఘస్థులు క్రమేపీ ఆకర్షితులు కావటం, దానికి దీటుగా వాస్తవిక ఆధ్యాత్మిక జీవనంలో క్షీణత సంభవించటం జరిగింది. కాగా ఆ సంవత్సరం ఆ దేశంలోని అన్ని సంఘాల్లోను హఠాత్తుగా క్షీణత చోటుచేసుకొన్న నిదర్శనాలు కనిపించాయి. కారణం ఇది అని ఎవరూ నిర్దిష్టంగా చెప్పలేకపోయినా ఆ విషయాన్ని అందరూ గుర్తించటం పత్రికలు ప్రసంగవేదికలు దానిపై వ్యాఖ్యానించటం జరిగింది.GCTel 350.2

    ఫిలడల్ ఫియాకు చెందిన ఒక ప్రెస్ బిటరి సంఘ సమావేశంలో ఆ నగరం లోని ఒక ప్రముఖ సంఘ కాపరి, ప్రజాదరణగల వ్యాఖ్యాన రచయిత అయిన బర్నీస్ “సువార్త పరిచర్యలో తన ఇరవై ఏళ్ల అనుభవంలోను ఆ ప్రభుభోజన సంస్కారం వరకూ ప్రభు భోజనాన్ని ఏ సంఘంలోనూ ఇవ్వలేదని చెప్పాడు. ఇప్పుడైనా ఏ ఉజ్జీవమూ లేదు, ఏ మారు మనస్సులేదు. విశ్వాసులమనే వారిలో కృపలో పెరుగుదల లేనే లేదు. తమ రక్షణ నిమిత్తం ప్రభువుతో మాటలాడటానికి ఆయన పఠన మందిరంలోకి ఎవరూ వెళ్లరు. వ్యాపారం పెరగటంతో, వాణిజ్య ఉత్పత్తుల భవిష్యత్తు ఉజ్వల మవ్వటంతో లోకాశలు, ఆసక్తులు పెచ్చు పెరిగాయి. అన్ని సంఘాల పరిస్థితి ఇదే. ” కాంగ్రిగేషనల్ జర్నల్, మే 23, 1844.GCTel 350.3

    అదే ఏడాది ఫిబ్రవరి మాసంలో ఆబర్ 4న్ కళాశాల ఆచార్యుడు ఫిన్నీ ఇలా అన్నాడు, “మన దేశంలో ప్రొటస్టాంట్ సంఘాలు ఈ యుగంలో చోటుచేసుకొన్న నైతిక సంస్కరణలన్నిటిపట్ల ప్రాతికూల్యం ప్రదర్శించాయి. కొన్ని పాక్షిక మినహాయింపులున్నా అవి ఏమంత విశేషమైనవికావు. కాదనలేని ఇంకొక వాస్తవం ఏమిటంటే మన సంఘాల్లో ఉజ్జీవ ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా లోపించటం. ఆధ్యాత్మిక ఉదాసీనత అంతటా వ్యాపించింది. అందుకే మత పత్రికలు దేశాన్ని గూర్చి ఇలా సాక్ష్యమిస్తున్నాయి..., (సంఘ సభ్యులు పెద్ద ఎత్తున ‘ఫ్యాషన్’ భక్తులవుతున్నారు. విందులు, వినోదాల్లో, నాట్యం పండుగల్లో భక్తిహీనులతో చేతులు కలుపుతున్నారు. ఏమైనా, ఈ బాధాకరమైన అంశాన్ని ఎక్కువ ప్రస్తావించనక్కరలేదు. సంఘాలు నానాటికి దిగజారి పోతున్నాయనటానికి బోలెడు నిదర్శనలున్నాయి. సంఘాలు దేవునికి దూరమై పోతున్నాయి. దేవుడు వాటిని విడిచిపెట్టేశాడు.”GCTel 351.1

    “రిలిజియస్ టెలిస్కోప్” అనే పత్రికలో ఒక రచయిత ఇలా సాక్ష్యమిచ్చాడు, “మనం ప్రస్తుతం చూస్తున్న మత క్షీణత ముందెన్నడూ కనిపించలేదు. సంఘం కళ్లు తెరచి ఈ రుగ్మతకు కారణమేంటో వెదకి తెలుసుకోవాలి. సీయోనును ప్రేమించే వారంతా దీన్ని రుగ్మతగానే పరిగణించాలి. యధార్థంగా మారుమనసు పొందిన వారు ఎంత తక్కువమంది! పాపుల అహంభావం కాఠిన్యం ఎంత దుర్భరమైపోయాయో గుర్తు చేసుకొన్నప్పుడు మనం అప్రయత్నంగా ఇలా ఆశ్చర్యపడతాం, “దేవుడు దయ చూపటం మర్చిపోయాడా! లేదా కృపాద్వారం మూతపడిందా!”GCTel 351.2

    కారణం లేకుండా అలాంటి పరిస్థితి సంఘంలో ఎప్పుడూ తలెత్తదు. రాజ్యాలలోను సంఘాల్లోను వ్యక్తుల్లోను ఏర్పడే ఆధ్యాత్మిక అంధకారం దేవుడు తన కృపను నిరంకుశంగా ఉపసంహరించుకున్నందువల్ల కలిగింది కాదు. అది దేవుడు ఇవ్వనుద్దేశించిన వెలుగును మానవుడు నిర్లక్ష్యం చేయటంవల్ల లేక విసర్జించుటవల్ల ఏర్పడ్డ చీకటి. ఈ సత్యానికి చక్కటి ఉదాహరణ క్రీస్తు దినాల్లోని యూదుల చరిత్రలో ఉన్నది. లోక వైభోగాల్లో మునిగి తేలూ దేవున్ని, ఆయన వాక్యాన్ని మరచిపోయినందువల్ల వారి అవగాహన మసకబారింది. వారి హృదయాలు లోకాశలు శరీరేచ్ఛలతో నిండి ఉన్నాయి. అందువల్ల మెస్సీయా రాకను గూర్చి అజ్ఞానులై ఉన్నారు. గర్వం అవిశ్వాసంతో నిండి విమోచకుణ్ణి విసర్జించారు. దేవుడు అప్పుడు కూడా యూదా జనాంగానికి రక్షణ జ్ఞానాన్ని రక్షణ పొందే అవకాశాన్ని అందుబాటులో లేకుండా ఉపసంహరించు కోలేదు. కాకపోతే సత్యాన్ని విసర్జించిన ఆ ప్రజలు రక్షణ పట్ల ఆసక్తి చూపలేదు. వెలుగు చీకటిగా మారే వరకు వారు వెలుగు స్థానంలో చీకటిని, చీకటి స్థానంలో వెలుగును ఉంచారు.” ఆ చీకటి ఎంత దట్టమైనది!GCTel 351.3

    యధార్ధమైన దైవభక్తి లోపించినంతకాలం మనుషులు పైకి భక్తిగలవారిగా కనిపించటం సాతాను దుస్తంత్రానికి అనుకూలమైన విషయం. సువార్తను విసర్జించిన అనంతరం యూదులు తమ సనాతన ఆచారాల్ని నిష్టగా ఆచరించటం కొనసాగించారు. తమ జాతి ప్రత్యేకతను కాపాడుకొన్నారు. కాని దేవుని సముఖం ఇక ఏమాత్రం తమ మధ్య లేదని వారే ఒప్పుకొన్నారు. మెస్సీయా రాక సమయాన్ని దానియేలు ప్రవచనం నిర్దిష్టంగా సూచించింది. ఆయన మరణాన్ని విస్పష్టంగా ప్రవచించింది. అందుచేత వారు ప్రవచన పఠనాన్ని ప్రోత్సహించలేదు. చివరికి రాకడ కాలాన్ని లెక్కలు వేసేవారిని రబ్బీలు శపించారు. తర్వాతి శతాబ్దాల్లో ఇశ్రాయేలు ప్రజలు అంధులై మారుమనసులేని హృదయాలతో తమకు వచ్చిన రక్షణ ఆహ్వానాన్ని తృణీకరించారు. సువార్త అందించే దీవెనలను వారు గుర్తించలేదు. దేవుడు పంపిన వెలుగును తిరస్కరించటంలోని అపాయాన్ని గూర్చి హెచ్చరించే గంభీర, భయంకర హెచ్చరిక అది.GCTel 352.1

    కార్యం ఉన్న చోట కారణం ఉంటుంది. తన అభిమతానికి అడ్డు తగులుతుందన్న కారణంతో విధి విషయంలో తన దృఢ నమ్మకం గొంతునులిమే వ్యక్తి తుదకు సత్యాసత్యాల మధ్యగల తేడాను గుర్తించే విచక్షణను కోల్పోతాడు. అవగాహన మసక బారుతుంది. అంతరాత్మ మొద్దు బారుతుంది. హృదయం పాషాణమౌతుంది. ఆత్మ దేవునికి దూరమౌతుంది. దేవుని సత్యాన్ని తోసిపుచ్చటం లేదా ఆలక్ష్యం చేయటం ఎక్కడ జరుగుతుందో అక్కడ సంఘం చీకటిలో పడి కొట్టుమిట్టాడుతుంది. విశ్వాసం సన్నగిల్లుతుంది. ప్రేమ చల్లారుతుంది. విరోధం, విభేదం చోటుచేసుకుంటాయి. సంఘసభ్యుల ఆసక్తులు సామర్థ్యాలు లౌకికి వ్యవహారాలపై కేంద్రీకృతమౌతాయి. పాపులు పశ్చాత్తాపంలేని పాషాణ హృదయులవుతారు.GCTel 352.2

    దేవుని తీర్పు ఘడియ వచ్చిందని ప్రకటిస్తూ ఆయన పట్ల భయభక్తులు కలిగి ఆయనను ఆరాధించుడని మానవులకు ప్రకటన 14 లోని పిలుపు వస్తున్నా దైవ ప్రజలమని చెప్పుకొనే వారు మొదటి దూత వర్తమానం లోకంలో ప్రబలుతున్న దుష్ప్రభావాలకు దూరంగా ఉండటానికి లోకాశలు, ఆధ్యాత్మిక నిరాసక్తితో కూడిన తమ యధార్ధ పరిస్థితిని గ్రహించటానికి ఏర్పాటయింది. ఈ వర్తమానంలో దేవుడు తన సంఘానికి ఒక సందేశం పంపాడు. సంఘం దాన్ని అంగీకరించి ఉంటే సంఘాన్ని ఆయనకు దూరం చేస్తున్న దుష్ఫలితాలు దిద్దుబాటయ్యేవే. దేవుడిచ్చిన వర్తమానాన్ని వారు అనుసరించి దేవుని ముందు దీనమనస్కులై ఆయన సన్నిధిలో నిలబడటానికి అవసరమైన సిద్ధబాటును చిత్తశుద్ధితో ఆశించి వున్నట్లయితే దేవుని ఆత్మ దేవుని శక్తి వారి మధ్య ప్రదర్శితమై ఉండేది. అపోస్తలుల దినాల్లో కనిపించిన ఐక్యత, విశ్వాసం, ప్రేమ స్థాయికి సంఘం ఎదిగి ఉండేవి. “విశ్వాసులు ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ” (6 దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి”. అంతట “ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను” అ.కా. 4:31,32; 2:47.GCTel 353.1

    దైవ ప్రజలనిపించుకొనే వారు వాక్యం వెదజల్లే వెలుగును స్వీకరిస్తే క్రీస్తు ప్రార్ధించిన, “దీర్ఘ శాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనటం”. శరీర మొక్కటే. ఆత్మయు ఒక్కటే ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై యొక్కటే నిరీక్షణ యందుండుటకు పిలువబడితిరి. అపోస్తలుడు వివరించిన ఐక్యతను సాధించివుండే వారు. ప్రభువు ఒక్కడే, విశ్వాస మొక్కటే, బాప్తిస్మ మొక్కటే” అంటున్నాడు ప్రభువు. ఆగమన వర్తమానాల్ని అంగీకరించిన వారికి ఒనకూడిన శుభప్రదమైన ఉపకారాలు అలాంటివి. వారు ఆయా మత విశ్వాసాల నుంచి వచ్చారు. తమ తమ సంఘాల ఆంక్షలను లెక్కచేయకుండా వాటిని విడిచి వచ్చేశారు. వివిధమైన, పరస్పర విరుద్ధమైన ఆచారాలను తుంగలో తొక్కారు. లేఖనాల్లోని లౌకిక సహస్రాబ్ది సిద్ధాంతానికి నీల్గొదిలారు. రెండో రాకపై ఉన్న తప్పుడు అభిప్రాయాల్ని సరిదిద్దారు. గర్వాన్ని విడిచిపెట్టారు. లోకాశలకు స్వస్తి చెప్పారు. తప్పులను సరిచేసుకొన్నారు. మధుర క్రైస్తవ సహవాసంలో హృదయాలు ఏకమయ్యాయి. ప్రేమ సంతోషాలు వెల్లివిరిశాయి. ఈ సిద్ధాంతాన్ని అంగీకరించిన ఆ కొద్దిమందికి ఇంత మేలు కలిగితే దీన్ని అందరూ అంగీకరించి ఉంటే అందరికీ ఇదే మేలు ఒకకూడి ఉండేది.GCTel 353.2

    ఇలా ఉండగా సంఘాలు సామాన్యంగా ఈ హెచ్చరికను అంగీకరించలేదు. ” ఇశ్రాయేలు వంశస్థులకు” కావలి వారిగా ఉండి యేసు రాకడ సూచనల్ని గ్రహించటంలో మొదటి వారిగా ఉండాల్సిన వారి ప్రబోధకులు ప్రవక్తల సాక్ష్యాలనుంచి గాని కాల సూచనల్నుంచిగాని సత్యాన్ని, అవగాహన చేసుకోటంలో విఫలమయ్యారు. వారి హృదయాలు లోకాశలు కోరికలతో నిండాయి. దేవునిపట్ల ప్రేమ, దైవ వాక్యంపై విశ్వాసం సన్నగిల్లాయి. ఆగమన సిద్ధాంత బోధను విన్నప్పుడు అది వారి మనసుల్లో దురభిమానాన్ని, అవిశ్వాసాన్ని రేపింది. ఈ వర్తమాన ప్రబోధకుల్లో చాలా మంది స్వచ్ఛంద సువార్తికులన్న విషయం వర్తమానానికి వ్యతిరేకంగా వాదించటానికి ఉపయుక్తమయ్యింది. పూర్వంలాగే స్పష్టమైన దైవ వాక్య సాక్ష్యం గురించి ఇలా ప్రశ్నించటం జరిగింది. “ఎవరైనా రాజులుగాని , పరిసయ్యులుగాని నమ్మారా?” ప్రవక్తల కాలాలపై ఆధారితమైన వాదనల్ని ఎదుర్కోటం ఎంత కష్టమో ఎరిగిన అనేకమంది ప్రవచన గ్రంథాలు ముద్రితమై మూతపడ్డవని అవి మన అవగాహనకు అందనివని ప్రచారం చేస్తూ ప్రవచన పఠనాన్ని సిరుత్సాహపర్చారు. జనసమూహాలు ఈ బోధకులు చెప్పిన విషయాల్ని తు.చ. తప్పకుండా విశ్వసించి హెచ్చరికను పెడచెవిని పెట్టారు. కొందరు సత్యాన్ని నమ్మినా అది చెప్పటానికి ముందుకు రాలేకపోయారు. “సినగోగు నుంచి బహిష్కిృతుల మవుతామేమో” నన్నది వారిని పట్టి పీడించిన భయం క్రీస్తుపై కన్నా లోకం పై ఆశలు పెట్టుకొన్న. ప్రజల సంఖ్య ఎంత పెద్దదో సంఘాన్ని పరీక్షించి శుద్ధి చేయటానికి దేవుడు పంపిన వర్తమానం, కచ్చితంగా తేల్చి చెప్పింది. వారి ఐహిక బంధాలు పరలోకాకర్షణలకన్నా బలీయమైనవని తేలింది. లోక జ్ఞానానికి చెవి ఒగ్గి హృదయాన్ని పరిశోధించే సత్య వర్తమానాన్ని వారు అలక్ష్యం చేశారు.GCTel 354.1

    మొదటి దూత హెచ్చరికను తృణీకరించటంలో తమ పునరుద్ధరణకు దేవుడు ఏర్పాటు చేసిన సాధనాలను వారు నిరాకరించారు. తమకు దేవునికి మధ్య అగాధం సృష్టించిన దోషాలను సరిచేయగలిగిన దూతను తోసిపుచ్చి లోకంతో స్నేహ బంధాలు పెంచుకొనేందుకు వారు అమితాసక్తి ప్రదర్శించారు. 1844 లోని సంఘాల్లో గూడుకట్టుకొని ఉన్న లోకభోగాలు మతం పట్ల నిరాసక్తత, ఆధ్యాత్మిక మరణం. ఇవే ఆ భయంకర పరిస్థితికి కారణాలు.GCTel 354.2

    “మహోద్రేకముతో కూడిన తన వ్యభిచార మద్యమును సమస్త జనములకు త్రాగించిన యీ మహాబబులోను కూలిపోయెను కూలిపోయెను” అని ప్రకటిస్తున్న ప్రకటన 14 లో మొదటి దూతను రెండో దూత వెంబడించాడు. ప్రకటన 14:8. “బబులోను ” శబ్దం “బాబేలు” శబ్దం నుంచి వస్తున్నది. దీనికి గందరగోళం అని అర్ధం. ఆయా తప్పుడు లేదా భ్రష్ట మత విధానాలను వర్ణించటానికి లేఖనాల్లో ఈ శబ్దం ఉపయుక్తమయ్యింది. ప్రకటన 17 వ అధ్యాయంలో బబులలోను స్త్రీగా వ్యవహరించటం జరిగింది. స్త్రీ అన్న శబ్దాన్ని సంఘానికి సంకేతంగా బైబిలులో ఉపయోగించటం జరిగింది. పవిత్ర స్త్రీ పరిశుద్ధ సంఘాన్ని సూచిస్తుండగా జారస్త్రీ భ్రష్ట సంఘాన్ని సూచిస్తుండగా. క్రీస్తుకు సంఘానికి మధ్య ఉన్న పవిత్ర బాంధవ్యానికి వివాహం సంకేతం. పవిత్ర నిబంధన ద్వారా తన ప్రజలను ప్రభువు తనతో జత పర్చుకొన్నాడు. తాను వారికి దేవుడై ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు. వారు ఆయనకు కేవలం ఆయనకే చెంది ఉంటామని బాసచేస్తున్నారు. ప్రభువిలా అంటున్నాడు, “నీవు నిత్యము నా కుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను, దయాదాక్షిణ్యములు చూపుట వలనను నిన్ను ప్రదానము చేసికొందును” హోషేయ 2:19 మళ్లీ ‘ నేను మీ యజమానుడను” అంటున్నాడు. యిర్మీయా 3:14 “పవిత్రురాలైన కన్యకనుగా... క్రీస్తుకు సమర్పించవలెనని మిమ్మును ప్రదానము చేసితిని” (2 కొరింథి 11:2.) అన్నప్పుడు పౌలు కొత్త నిబంధనలో ఇదే సంకేతాన్ని ఉపయోగిస్తున్నాడు.GCTel 354.3

    తన విశ్వసనీయతను ఆత్మీయతను క్రీస్తు మీద నుంచి మరల్చుకోటానికి లోకాశలతో ఆత్మను నింపటానికి సంఘం అనుమతించటం ద్వారా క్రీస్తుపట్ల అపనమ్మకంగా వ్యవహరించటం పెళ్లి ప్రమాణాల్ని అతిక్రమించి వ్యవహరించటంతో సమానం. ప్రభువుని విడిచిపెట్టి ఇశ్రాయేలు ప్రజలు చేసిన పాపాల్ని ఈ విధంగా వారు తృణీకరించిన దేవుని అమోఘాను రాగాన్ని ఈ సంకేతం సూచిస్తున్నది. “నిన్ను పెండి చేసుకొని నీతో నిబంధన చేసుకొనగా నీవు నాదానవైతివి. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు” (“నీవు మిక్కిలి సౌందర్యవతివై రాణియగునంతగా అభివృద్ధి నొందితివి. నేను నీ కనుగ్రహించిన ప్రభావము చేత నీ సౌందర్యము పరిపూర్ణము కాగా అన్యజనులు దాని చూచి నీ కీర్తి ప్రశంసించుచు వచ్చిరి... అయితే నీ సౌందర్యమును నీవు ఆధారము చేసుకొని నీకు కీర్తి వచ్చినందున నీవు వేశ్యవై దారిని పోవు ప్రతివానితో బహుగా వ్యభిచరించుచు పచ్చితివి” “స్త్రీ తన పురుషునికి విశ్వాస ఘాతుకురాలగునట్లుగా ఇశ్రాయేలు వంశస్తులారా నిశ్చయముగా మీరును నాకువిశ్వాస ఘాతకులైరి. ఇదే యెహోవా వాక్కు. యెహేజ్కేలు 16:8, 1315, 32; యిర్మీయా 3:20.GCTel 355.1

    దైవ కటాక్షం కన్నా లోక స్నేహాన్నే ఎక్కువగా ఎంచే నామమాత్రపు క్రైస్తవులను ఉద్దేశించి నూతన నిబంధనలో ఇలాంటి భాష ఉపయోగించటం జరిగింది. అపోస్తలుడు యాకోబు ఇలా అంటున్నాడు, “వ్యభిచారిణులారా, యీలోక స్నేహము దేవునితో వైరమని మీ రెరుగరా? కాబట్టి యెవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును.”GCTel 356.1

    ప్రకటన 17 లోని స్త్రీ (బబులోను) ధూమ్రరక్త వర్ణముగల వస్త్రము ధరించుకొని, బంగారముతోను రత్నములతోను ముత్యములతోను అలంకరించుకొని ఏహ్య కార్యములతో...నిండిన యొక సువర్ణ పాత్రను తన చేతపట్టుకొని యుండెను. దాని నొసట దాని పేరు ఈలాగు వ్రాయబడియుండెను. “మర్మము, వేశ్యకును భూమిలోని ఏహ్యామైన వాటికిని తల్లియైన మహాబబులోను”గా అభివర్ణించబడింది. ప్రవక్త ఇలా అంటున్నాడు. ఆ స్త్రీ పరిశుద్దుల రక్తము చేతను యేసుయొక్క హతసాక్షుల రక్తము చేతను మత్తిల్లి యుండుట చూచితిని” బబులోను “భూరాజుల నేలు... మహా పట్టణము”గా చిత్రీకరించబడుతున్నది. ప్రకటన 17:4-6. ఎన్నో శతాబ్దాలుగా క్రైస్తవ లోకంలోని చక్రవర్తులపై నిరంకుశాధికారం చెలాయించిన శక్తి ఈ రోము మతాధికారం. వంగ, ఎరుపు వర్ణాలు, బంగారం, వజ్రాలు, ముత్యాలు గర్వాంధుడైన రోము మతాధినేత వైభవాన్ని రాజ భోగాల్ని స్పష్టంగా సూచిస్తున్నాయి. “పరిశుదుల రక్తము చేత మత్తిల్లినట్లు” చెప్పదగ్గ అధికారం, క్రీస్తు అనుచరులను నిర్దాక్షిణ్యంగా హింసించింది. ఆ సంఘం తప్ప ఇంకే అధికారం కాదు. “లోక రాజులతో అక్రమ సంబంధమన్న పాపం కూడా బబులోనుపై పడింది. ప్రభువును విడిచి పెట్టి అన్యులతో జతకట్టడం ద్వారా యూదు సంఘం వేశ్య అయ్యింది. లోకరాజుల సహాయ సహకారాలను ఆర్ధించటం ద్వారా ఇదే విధంగా తన్నుతాను అవినీతిలోకి దిగజార్పుకొన్న రోము కూడా ఇలాంటి శిక్షనే పొందుతుంది.GCTel 356.2

    బబులోను “వేశ్యలకు తల్లిగా” వ్యవహరించబడుతున్నది. ఆమె కుమార్తెలు ఆమె సిద్ధాంతాలకు సంప్రదాయాలకు కట్టుబడి ఉండి, లోకంతో అక్రమ సంబంధం కలిగిఉండేందుకు సత్యాన్ని దేవుని ఆమోదాన్ని త్యాగం చేసిన ఆమె ఆదర్శాన్ని అనుసరించే సంఘాలకు ప్రతీకలు. ప్రకటన 14 లో బబులోను పతనాన్ని ప్రకటిస్తున్న వర్తమానం ఒకప్పుడు పవిత్రంగా జీవించి క్రమేపీ భ్రష్టమైన సంఘాలకు వర్తిస్తుంది. ఈ వర్తమానం తీర్పును గూర్చిన హెచ్చరిక వెంబడి వస్తున్నది గనుక ఇది చివరి దినాల్లో ప్రకటించవలసిన వర్తమానం. కనుక ఇది రోమను సంఘానికి మాత్రమే సంబంధించింది కాదు. ఎందుకంటే ఆ సంఘం అనేక శతాబ్దాలుగా పతన స్తితిలో ఉంది. ఇంకా చెప్పాలంటే ప్రకటన పద్దెనిమిదో అధ్యాయంలో బబులోను నుంచి దైవ ప్రజలు బైటికి రావలసిందిగా పిలుపు ఉన్నది. ఈ లేఖనం ప్రకారం దైవ ప్రజల్లో అనేకమంది ఇంకా బబులోనులో ఉండాలి. క్రీస్తు అనుచరుల్లో అధికశాతం ఇప్పుడు ఏ సంఘాల్లో ఉంటారు? నిస్సందేహంగా ప్రొటస్టాంట్ విశ్వాసాన్ని అనుసరిస్తున్న ఆయా సంఘాల్లోనే ఉంటారు. తమ ఉత్థాన సమయంలో ఈ సంఘాలు దేవుని విషయంలోను సత్యం విషయంలోను అనుకూల వైఖరి ప్రదర్శించాయి. ఆ సంఘాల్ని ఆయన బహుగా దీవించాడు. సువార్త సూత్రాలను అనుసరించటం వల్ల కలిగిన దీవెనలను అవిశ్వాస ప్రపంచం సైతం గుర్తించింది. ఇశ్రాయేలు ప్రజలతో ప్రవక్త అన్న మాటలు ఇవి, “నేను నీ కనుగ్రహించిన నా ప్రభావము చేతనే నీ సౌందర్యము పరిపూర్ణము కాగా అన్యజనులు దాని చూచి నీ కీర్తి ప్రశంసించుచు వచ్చిరి. ఇదే యెహోవా వాక్కు”. అయితే ఇశ్రాయేలు ప్రజలు ఏ కోరికవల్ల పాపానికి నాశనానికి గురి అయ్యారో వారూ దానివల్లే పతన మయ్యారు. అది భక్తిహీనుల ఆచారాన్ని సాంప్రదాయాల్ని ఆచరించాలన్న కోరిక. వారితో స్నేహాన్ని పెంచుకోవాలన్న తపన. “అయితే నీ సౌందర్యమును నీవు ఆధారము చేసుకొని, నీకు కీర్తి వచ్చినందున నీవు వేశ్యవై దారిని పోవు ప్రతి వానితో బహుగా వ్యభిచరించుచు వచ్చితివి, పిలిచిన వారితోనెల్ల పోతివి”. యెహేజ్కేలు 16:14, 15.GCTel 356.3

    ప్రొటస్టాంట్ సంఘాల్లో చాలా మట్టుకు “లోక రాజులతో ” న్యాయవిరుద్ధమైన సంబంధం కలిగి ఉండటంలో రోము ఒరవడిని అనుసరిస్తున్నాయి. రాష్ట్ర సంఘా లౌకిక ప్రభుత్వాలతో సంబంధం కలిగి ఉండటం ద్వారా, తక్కిన సంఘాలు లోకం మెప్పును ఆశించటం ద్వారా బబులోను అన్న శబ్దార్ధం, గందరగోళం ఈ సంఘాల్ని చక్కగా వర్ణిస్తున్నది. ఈ సంఘాలన్నీ తమ సిద్ధాంతాలకు ఆధారం బైబిలే అని చెప్పుకొంటాయి. అయినా అవి లెక్కకు మించినన్ని శాఖలు ఉపశాఖలుగా విడిపోయాయి. వీటన్నిటికీ వేర్వేరు సంప్రదాయాలు సిద్ధాంతాలు ఉన్నాయి. GCTel 357.1

    రోముతో విడిపోయిన సంఘాలు లోకంతో పాపపూరిత స్నేహాన్ని పెంచుకోటమేగాక ఆ సంఘంలోని ఇతర అవలక్షణాల్ని పంచుకొని ప్రదర్శిస్తున్నాయి.GCTel 357.2

    “రోము సంఘం పరిశుద్ధులకు సంబంధించినంత వరకు విగ్రహారాధన పాపాల్ని ఒడిగట్టుకుంటున్నదంటే ఆ సంఘం ముద్దుల కూతురు చర్చ్ ఆఫ్ ఇంగ్లండు కూడా అవే పాపాల్ని చేస్తున్నది. అది ఒక సంఘాన్ని క్రీస్తుకు ప్రతిష్ఠిస్తే పది సంఘాల్ని మరియమ్మకు ప్రతిపిస్తున్నది” అని వాదిస్తుందొక రోమను కథోలిక్ రచన - రిచర్డ్ కలోనర్, ది కేథలిక్ క్రిష్టియన్ ఇన్స్ట్రక్టెడ్, ఫ్రీఫేస్, పుటలు 21, 22.GCTel 357.3

    “ఎట్రేటిస్ ఆన్ ది మిలీనియమ్” సహస్రాబ్ది (సిద్ధాంత గ్రంధంలో) డా|| హాప్కిన్స్ ఇలా అంటున్నాడు, “క్రైస్తవ వ్యతిరేక వైఖరి ఆచారాలు రోము సంఘానికే పరిమితమవ్వటానికి హేతువులేదు. ప్రొబస్టాంట్ సంఘాల్లో క్రీస్తు వ్యతిరేకత ఎక్కువ మోతాదులోనే ఉన్నది. ఆ సంఘాల్లోని అవినీతి దుర్మార్గత పూర్తిగా దిద్దుబాటు కాలేదు” సేమ్యుల్ హాప్ కిన్స్, వర్క్స్, సం 2, పుట 328.GCTel 358.1

    ప్రెస్ బిటేరియన్ సంఘం రోముతో తెగతెంపులు చేసుకోటంపై డా. గుత్రీ ఇలా రాస్తున్నాడు, “తన ధ్వజంపై తెరచిన బైబిలుతోను ‘లేఖనాలను పరిశోధించండి’ అన్న ధర్మసూత్రాలతోను మూడువందల ఏళ్ల కిందట మా సంఘం రోము గుమ్మాలు విడిచి బైటికి వెళ్లింది”. అనంతరం ఆయన ఒక చక్కని ప్రశ్న వేస్తున్నాడు, “వారు బబులోను నుంచి పరిశుద్ధులుగా భైటికి వచ్చారా?” తామస్ గుత్రి, ది గా పుల్ ఇన్ ఎజేకియేల్, పుట 237.GCTel 358.2

    స్పర్జన్ ఇలా అంటున్నాడు, “పవిత్ర సంస్కార ఛాందసం చర్చ్ ఆఫ్ ఇంగ్లండును పూర్తిగా కబళించివేసింది. అయితే సాంప్రదాయ వ్యతిరేకత కూడా ఇలాగే తాత్వికపరమైన నమ్మకద్రోహంతో తూట్లు పొడిచింది. మనం ఎవరిని గురించి మంచివారని తలంచామో వారు విశ్వాస ప్రాధమిక సూత్రాలను ఒకదాని తర్వాత ఒకదాన్ని విడిచి పెడున్నారు. గర్హనీయమైన ఆ విశ్వాసం ఇంగ్లండు హృదయాన్ని తేనె తుట్టెలా పట్టి వేలాడున్నదని నా దృఢ విశ్వాసం. అది ప్రసంగ వేదికను అధిష్టించి క్రైస్తవుడిగా తన్నుతాను పిలుచుకొంటున్నది.”GCTel 358.3

    ఈ మత భ్రష్టతకు ఆరంభం ఏమిటి? నిరాడంబరమైన సువార్తను సంఘం మొదట విడిచిపెట్టడం ఎలా జరిగింది? అన్యులు క్రైస్తవమతాన్ని స్వీకరించేందుకుగాను అన్యమతాచారాలను ఆచరించటంద్వారా ఇది సంభవించింది. తాను జీవించిన కాలంలో సైతం అపోస్తలుడైన పౌలు ఇలా ఉద్ఘాటించాడు, “ధర్మవిరోధసంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది.” 2 థెస్స. 2:7. అపొస్తలులు జీవించి ఉన్న కాలంలో చాలామట్టుకు సంఘం పవిత్రంగా జీవించింది. అయితే రెండో శతాబ్దం ఉత్తరార్ధంలో చాలా సంఘాలు కొత్త రూపాన్ని సంతరించుకొన్నాయి. తొలి దినాల్లోని నిరాడంబరత మాయమయ్యింది. వృద్ధులైన శిష్యులు మరణించగా వారి పిల్లలు నూతన విశ్వాసులు కలిసి ముందుకు వచ్చి పరిచర్యకు నూతన రూపురేఖలు దిద్దారు”. రాబర్ట్ రాబిన్సన్, ఎక్లీషియా స్టికల్ రిసర్చేస్, అధ్యా. 6, పేరా 17, పుట 51. విశ్వాసుల్ని ఆకట్టుకోటానికి క్రైస్తవమత ఉన్నత ప్రమాణాల్ని తగ్గించారు. పర్యవసానంగా “అన్యమతం సంఘంలోకి వరదవలె వచ్చి తన ఆచారాల్ని, అలవాట్లను విగ్రహాల్ని ప్రవేశపెట్టింది. ”- గనాజి లెక్చర్స్, పుట 278. క్రైస్తవ మతానికి లౌకిక పరిపాలకుల ఆదరాభిమానాలు, అండదండలు లభించటంతో జనులు గుంపులు గుంపులుగా క్రైస్తవమతాన్ని నామమాత్రంగా స్వీకరించారు. పైకి క్రైస్తవులుగా కనిపించినా అనేకమంది నిజంగా అన్యులుగానే మిగిలి ఉన్నారు. తమ విగ్రహారాధనను వారు రహస్యంగా కొనసాగించారు.”- అదే పుస్తకం, పుట 278.GCTel 358.4

    ప్రొటస్టాంట్ అనిపించుకొనే ప్రతి సంఘంలో ఇదే ప్రక్రియ పునరావృతమవుతూ రాలేదా? నిజమైన దిద్దుబాటు స్వభావంతో కృషి చేసిన ఆద్యులు గతించటంతో వారి అనువంశీకులు రంగ ప్రవేశం చేసి పరిచర్యకు “నూతన రూపురేఖలు దిద్దుతున్నారు.” తమ తండ్రుల విశ్వాసాన్ని పట్టుకొని వేళాడూ తమకు తెలియని నూతన సత్యాన్ని తోసిపుచ్చుతూ సంస్కర్తల పిల్లలు అణకువకు ఆత్మనిరసనకు లోకభోగాల త్యాగానికి ప్రతీకలైన వారి ఆదర్శం నుంచి తొలగిపోయారు. ” ఆ మొదటి నిరాడంబరత ఇలా మాయమయ్యింది. ” సంఘంలోకి ప్రవహించిన లౌకికత అనే వరద “దాని ఆచారాల్ని, అలవాట్లను విగ్రహారాధనను ప్రవేశపెట్టింది.”GCTel 359.1

    అయ్యో, “దేవునితో వైరము” అయిన ఈలోక స్నేహాన్ని క్రీస్తు అనుచరులమని చెప్పకొనేవారు ఎంతగా ప్రేమిస్తున్నారు! క్రైస్తవ లోకంలోని సంఘాలన్నీ అణకువ, ఆత్మనిరసన, నిరాడంబరత దైవభక్తి విషయాల్లో బైబిలు ప్రమాణానికి ఎంత దూరమై పోయాయి! ద్రవ్యాన్ని సవ్యంగా వినియోగించటం గురించి ప్రస్తావిస్తూ జాన్ వెస్లీ ఈ మాటలన్నాడు! “అనవసరమైన లేదా ఖరీదైన దుస్తులు లేదా అనవసరమైన ఆభరణాలు కొనుగోలు చేసి మీ నేత్రాశను తీర్చుకోటంలో ఎంతో విలువైన వనరులో ఏ కొద్ది భాగాన్నీ వ్యర్థం చేయకండి. దానిలో ఏ కొంచెం కూడా మీ గృహాలంకరణకు వ్యర్థం చేయకండి. ఖరీదైన సామాగ్రిని, చిత్రపటాల్ని, కొనుగోలు చేయటంలో వ్యర్ధపుచ్చకండి... జీవపు డంబాన్ని తృప్తి పరచటానికిగాని, మనుషుల మెప్పు, పొగడ్తలను అందుకోటానికిగాని ఏమీ ఖర్చు చేయకండి... మీరు మంచి స్థితిలో ఉన్నంతకాలం మనుషులు మిమ్మల్ని గూర్చి చక్కగా మాట్లాడారు”. “మీరు చక్కని వలువలు ధరించి’ అనుదినమూ సుఖజీవనం జీవించినంతసేపు అనేకులు మీ సంస్కారాన్ని, ఔదార్యాన్ని, ఆతిథ్యాన్ని ప్రశంసిస్తారు. ఆ ప్రశంసలకు పడిపోకండి, దేవుని వద్దనుంచి వచ్చే ఆదరాన్ని పొందటం ముఖ్యమని ఎంచండి. ”-వెస్లీ,వర్క్స్, సెర్మన్ 50. “ది యూజ్ ఆఫ్ మనీ”. అయితే నేడు అనేక సంఘాల్లో ఇలాంటి బోధకు విలువలేదు.GCTel 359.2

    నామ మాత్రపు మతానికి లోకంలో ఆదరణ ఉన్నది. పరిపాల కులు, రాజ కీయులు, న్యాయవాదులు, డాక్టర్లు, వ్యాపారస్తులు సమాజంలో గౌరవ మర్యాదల కోసం లోక సంబంధమైన లబ్దికోసం సంఘంలో చేరుతున్నారు. తమ అనీతి కార్యాలను ఇలా నామమాత్రపు క్రైస్తవం ముసుగు కింద దాచటానికి ప్రయత్నిస్తారు. బాప్తిస్మం పొందినGCTel 360.1

    ఈ లోక ప్రియుల సంపద పలుకు బడిలతో బలోపేతమైన ఆయా సంఘాలు మరింత జనాదరణ కోసం ఒక దానితో ఒకటి పోటీపడున్నాయి. నగరాల నడిబొడ్డున విలాసవంతంగా నిర్మితి అయిన బ్రహ్మాండమైన ఆలయాలు వెలుస్తాయి. ఆరాధకులు ఖరీదైన వస్త్రాలు ధరించి గుడికి వెళ్తారు. ప్రజల్ని ఆకట్టుకొనేందుకు పెద్ద జీతం ఇచ్చి సామర్థ్యంగల బోధకుల్ని నియమిస్తారు. ప్రసంగం సమాజంలో దోబూచులాడున్న పాపాల్ని, స్పృశించకూడదు. చెవులకు ఇంపుగా వుండేందుకు అది సాఫీగా, హృదయ రంజకంగా ఉండాలి. ఇలా సంఘపు పుస్తకాల్లో శైలిగల పాపుల పేర్లు నమోదవుతాయి. శైలుగా చేసే పాపాలు కపట భక్తి ముసుగు కింద రద్దవుతాయి.GCTel 360.2

    ప్రపంచం పట్ల క్రైస్తవులమని చెప్పుకొనే వారి వైఖరిపై వ్యాఖ్యానిస్తూ ఒక ప్రఖ్యాత మాసపత్రిక ఇలా అంటున్నది, “తనకు తెలియకుండగనే సంఘం కాల ప్రభావానికి లొంగిపోయి ఆధునిక అవసరాలకు అనుగుణంగా తన ఆరాధన పద్దతుల్ని మల్చుకొంటున్నది.” “మతాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు ఉపయోగపడే సాధనాలన్నింటిని సంఘం ఇప్పుడు వినియోగిస్తున్నది. ” “ది న్యూ ఆర్క్ ఇండిపెండెస్ట్” అన్న పత్రికలో మెథడిస్ట్ మతం గురించి ఒక రచయిత ఇలా అంటున్నాడు, “భక్తిపరులు భక్తిహీనుల మధ్య గల తేడా మాయమవుతున్నది. రెండుపక్కల ఉన్న వారు తమ క్రియలు వినోదాల మధ్య ఉన్న భేదాన్ని తుడిచివేయటానికి దీక్షగా కృషి చేస్తున్నారు.” “మతం విధుల్ని నిర్వర్తించకుండా దాని పలుకుబడి ఉపకారాలు పొందాలని ఆశించే వారి సంఖ్యను ఇబ్బడి ముబ్బడిగా పెంచటానికి మతం దోహదపడుతుంది”.GCTel 360.3

    హవర్డ్ కాస్ట్ ఇలా అంటున్నాడు, “ప్రభువు ఉద్దేశాలను నెరవేర్చటంలో క్రీస్తు సంఘం ఏ మాత్రం ఆసక్తి చూపకపోవటం ఆందోళనకరం. పూర్వం యూదులు విగ్రహారాధకులతో సాన్నిహిత్యం పెంచుకోవటం దేవునిపై ప్రేమను కోల్పోటానికి ఎలా కారణమయ్యిందో అలాగే ఈనాడు సంఘం అవిశ్వాసులతో జతకట్టడం, యధార్ధ జీవనానికి దేవుని విధానాలను అవలంబించకపోటం, క్రీస్తును అనుసరించని సమాజపు అభ్యాసాలలో పాలిభాగస్తులు కావటం, దేవుని కృపలో పెరగటానికి ప్రతిబంధకాలుగా నిలిచేవాదనలను అభిప్రాయాలను ఉపయోగించటం ద్వారా ఆయన ప్రేమకు దూరమవ్వటానికి దారితీస్తున్నాయి.” ది హెల్త్ క్రిస్టియన్, ఏన్ అపీల్ టు ది చర్చ్, పుటలు 141,142.GCTel 361.1

    లోకాశలు లౌకిక సుఖభోగాలు అన్న ఈ ఉప్పెనలో క్రీస్తు నిమిత్తం ఆత్మనిరసన, ఆత్మత్యాగం అన్నవి పూర్తిగా నశించిపోయాయి. ఇప్పుడు మన సంఘాల్లో క్రియా శీలంగా ఉన్న కొద్దిమంది పురుషులు, స్త్రీలు క్రీస్తు సేవను చేయటానికి లేదా క్రీస్తు కోసం ఏమైనా త్యాగం చేయటానికి చిన్నతనంలో శిక్షణ పొందిన వారే”. ఇప్పుడైతే నిధులు అవసరమైనప్పుడు... ఇవ్వుమని ఎవరినీ అడగకూడదు. ఉహూ, అలా చేయకూడదు. ఒక ప్రదర్శనో, నాటికో, ఉత్తుత్తి విచారణో, పురాతన విందు భోజనమో లేదా ఓ తినే పదార్ధమో, ప్రజలకు వినోదం కూర్చే ఏదో ఒకటి ఏర్పాటు చేయాలి”.GCTel 361.2

    పద్దెనిమిది వందల డెబ్బయి మూడు జనవరి 9 న విస్కానసు చెందిన గవర్నర్ వాష్ బర్న్ తన సాంవత్సరిక వర్తమానంలో ఇలా అన్నాడు, “జూదగాళ్ళను తయారుచేసే విద్యాలయాల్ని విచ్ఛిన్నం చేయటానికి ఒక చట్టం అవసరమనిపిస్తుంది. ఇవి అన్ని చోట్లా ఉన్నాయి. కొన్ని సార్లు సంఘం సైతం (నిస్సందేహంగా తెలియకుండానే) సాతాను కార్యాల్ని నిర్వహించటం జరుగుతుంది. బహుశా కచేరీలు, బహుమతి ప్రధానాలు, విక్రయాలు, కొన్ని సార్లు మత సంబంధిత కార్యాల సహాయార్ధం లాటరీలు, బహుమతి బంగీలు- ఇవన్నీ శ్రమపడకుండా డబ్బు సంపాదించే సాధనాలు. శ్రమించకుండా ద్రవ్య సంపాదన లేదా ఆస్తి సంపాదన అన్నది ఉత్సాహాన్ని, మత్తును కలిగిస్తుంది. ముఖ్యంగా యువతకు, ఈ ద్రవ్యం మంచి కార్యానికి వినియోగ మవుతుందని తమ అంతరాత్మను శాంతపర్చుకొంటూ ఇలా శ్రమపడకుండా ద్రవ్యం సంపాదించే పెద్ద మనుషులుండటంతో దేశంలోని యువత అపాయకరమైన క్రీడలకు ఆకర్షితులవటం తథ్యం .”GCTel 361.3

    లోకానికి అనుగుణంగా నివసించాలి అన్న స్వభావం క్రైస్తవ లోకంలోని సంఘా లన్నింటిలోను ప్రబలమౌతున్నది. ఇంగ్లండులో చోటుచేసుకొన్న ఆధ్యాత్మిక క్షీణతను గురించి రాబర్ట్ ఏట్కిన్స్ లండన్ లో చేసిన ఒక ప్రసంగంలో ఇలా అన్నాడు, “లోకంలో నిజమైన నీతిమంతులు తగ్గిపోతున్నారు. దాన్ని ఎవరూ పట్టించుకోవటం లేదు. ప్రతి సంఘంలోను నేటి మతాన్ని అవలంబిస్తునట్లు చెప్పుకొనే వారందరూ లోకాన్ని ప్రేమిస్తున్న వారే, లోకాన్ని పోలి నిషసిస్తున్నవారే, వ్యక్తి సుఖభోగాలను అభిలషిస్తున్నవారే. గౌరవ ప్రతిష్ఠలు ఆకాంక్షిస్తున్నవారే. క్రీస్తుతో శ్రమలను భరించటానికి వారికి పిలుపు వస్తున్నది గాని నిందను భరించటానికి సైతం వారు వెనుకాడుతున్నారు... ప్రతి సంఘ ద్వారం పైనా మతభ్రష్టత, మతభ్రష్టత, మత భ్రష్టత లిఖితమై ఉంది. అయితే అది వారికి తెలుసా? దాన్ని గురించి వారు బాధపడుతున్నారా? అది జరిగితే వారికి నిరీక్షణ ఉండవచ్చు. కాని మేము ధనవంతులం, ధనవృద్ధి చేసుకొన్నాం. మాకేమీ కొదువలేదు.” అని వారు కేకలు వేస్తున్నారు. ”-సెకండ్ ఎడ్వంట్ లైబ్రరీ, ట్రాక్ట్ నం 39.GCTel 362.1

    బబులోను మూట కట్టుకొన్న మహాపాపం “మోహోద్రేకముతో కూడిన తన వ్యభిచార మద్యమును సమస్త జనములకు త్రాగించ టం. ఆమె లోకానికందిస్తున్న మధుపాత్ర లోకంలోని గొప్పవారితో తన అక్రమసంబంధం ఫలితంగా తాను అంగీకరించిన తప్పుడు సిద్ధాంతాలను సూచిస్తున్నది. లోకంతో మైత్రి ఆమె విశ్వాసాన్ని కలుషితం చేస్తున్నది. ఫలితంగా పరిశుద్ధ లేఖనాల్లోని విస్పష్ట బోధనలకు విరుద్ధమైన సిద్ధాంతాలను బోధించటం ద్వారా ఆమె తన దుష్ప్రభావాన్ని లోకంపై ప్రసరింప జేస్తున్నది.GCTel 362.2

    రోము బైబిలును ప్రజలకు అందుబాటులో లేకుండా చేసి దాని స్థానే ప్రజలు తన బోధల్ని అంగీకరించాలని ఒత్తిడి చేసింది. మనుషులకు దైవ వాక్యాన్ని పునరుద్ధరించటమే సంస్కరణోద్యమ పరమోద్దేశం. అయితే మన కాలంలో మన సంఘాల్లో మనుషులు లేఖన బోధలకన్న తమతమ సంఘబోధలపైన సంప్రదాయలపైన నమ్మకముంచాలన్నGCTel 362.3

    బోధ సాగుతుందన్నది వాస్తవం కాదా? ప్రొటస్టాంట్ సంఘాలగురించి మాట్లాడూ చార్లెస్ బీదల్ ఇలా అంటున్నాడు, “పరిశుద్ధులు, హతసాక్షుల పూజకు వ్యతిరేకంగా పలికిన ఒక్క కఠినమైన మాటనూ పరిశుద్ధ ఫాదర్లు ఎలా సహించరో అలాగే సంప్రదాయాలకు వ్యతిరేకంగా పలికిన ఒక్క కటువైన మాటను కూడా వారు సహించరు... ప్రొబస్టాంట్ సువార్తిక సంఘాలు తమ ఆచారాలు సంప్రదాయాలతో తమను తమ సభ్యులను ఎంతగా బంధించివేశాయంటే, బైబిలుగాక, ఇంకో పుస్తకాన్ని అంగీకరిస్తేనేగాని ఒక వ్యక్తి బోధకుడవ్వటం సాధ్యం కాదు... రోము చతురంగా చేసినట్లు ఇప్పుడు సంప్రదాయశక్తి బైబిలును నిషేధించటం మొదలుపెట్టింది.”- సెర్మన్ ఆన్ ది బైబిల్ ఏ సఫిషెంట్ క్రీడ్” ఫారస్ట్ సేన, ఇండియానాలో ఫిబ్రవరి 22, 1846లో చేసినది.GCTel 362.4

    విశ్వసనీయ ప్రబోధకులు, దైవవాక్యాన్ని వివరించినప్పుడు తమకు లేఖనావగాహన ఉన్నదని చెప్పుకునే విద్యాధికులు, సువార్తికులు లేస్తారు. వారు మంచి సిద్ధాంతాలను తప్పుడు బోధలని విమర్శించి తద్వారా సత్యాన్ని వెదకే వారిని తరిమివేస్తారు. ప్రపంచం బబులోను మద్యం తాగి మత్తులో పడివుండకపోతే దైవ వాక్యంలోని స్పష్టమైన వాడి అయిన సత్యాలు వేలాది ప్రజల్లో మారుమనసు పుట్టించేవే. అయితే దైవ వాక్యం అస్తవ్యస్తంగా పొంతన లేనట్లు కనిపించటంతో ఏది సత్యమని నమ్మాలో తెలియక ప్రజలు తికమక పడ్డారు. లోకం మారుమనసు పొందటం లేదంటే ఆ పాపం సంఘానిదే. ప్రకటన 14 లోని రెండవ దూత వర్తమానం 1844 ఎండాకాలంలో ప్రకటితమయ్యింది. అది అప్పటిలో అమెరికాలోని సంఘాలకు ప్రత్యక్షంగా వర్తించింది. తీర్పును గూర్చిన హెచ్చరికా వర్తమాసం బహుళంగా ప్రకటితమవ్వటం, సర్వసాధారణంగా అది తిరస్కరించబడటం సంఘాలు వేగంగా పతన మవ్వటం అక్కడే సంభవించింది. కాగా రెండోదూత వర్తమానం 1844 లో పూర్తిగా నెరవేరలేదు. రాకడ వర్తమానం తిరస్కృతి పర్యవసానంగా అప్పటి సంఘాలు ఆధ్యాత్మిక పతనానికి గురి అయ్యాయి. అయితే ఆ పతనం సంపూర్తికాలేదు. ఆనాటి ప్రత్యేక సత్యాలను తిరస్కరిస్తూ పోగా వారి నైతిక స్థితి నానాటికి దిగజారిపోయింది. తన వ్యభిచార మద్యమును సమస్త జనములకు త్రాగించిన యీ మహా బబులోను కూలిపోయెను” అని ఇంకా అనలేం. సమస్త జనములచేత బబులోను ఈ కార్యం ఇంకా చేయించలేదు. లోకాన్ని అనుకరించే స్పూర్తి, మన దినాలకు సంబంధించిన సత్యాలను గూర్చి ఉదాసీనత చోటు చేసుకొని క్రైస్తవ లోకమంతటా ఉన్న ప్రొటస్టాంట్ సంఘాల్లో బలం పుంజుకొంటున్నది. రెండోదూత ఉచ్చరిస్తున్న భయంకర ఖండన ఈ సంఘాలకు కూడా వర్తిస్తుంది. ఏమైనా మత భ్రష్టత ఇంకా పరాకాష్టకు చేరలేదు.GCTel 363.1

    ప్రభువు రాకకు ముందు ““నానావిధములైన సూచక క్రియలతోను మహత్కార్యములతోను, దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను” సాతాను పని చేస్తాడని “సత్యమును నమ్మక దుర్నీతియందు అభిలాషగల వారందరును శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు” మిగిలి ఉంటారని బైబిలు ఉదోషిస్తున్నది. 2 థెస్స 2:911. ఈ పరిస్థితి వచ్చే వరకు, క్రైస్తవ లోకమంతటా సంఘానికి లోకానికి మధ్య సంపూర్ణ ఐక్యత ఏర్పడేవరకు బబులోను కూలటం పూర్తికాదు. ఇది క్రమక్రమంగా చోటు చేసుకొనే మార్పు. ప్రకటన 14:8 నెరవేర్పు భవిష్యత్తులో జరిగే సంభవం.GCTel 364.1

    బబులోనులో భాగమైన సంఘాల్ని ఆధ్యాత్మిక అంధకారం అలముకొన్నా, అవి దేవుని విడిచి దూరంగా వెళ్ళిపోయినా, ఆ సంఘాలలో క్రీస్తును యధార్ధంగా నమ్మిన అనుచరులెందరో వున్నారు. ఈ నాటి ప్రత్యేక సత్యాలు తెలియని వారు వీరిలో ఎందరో వున్నారు. తమ ప్రస్తుత ఆధ్యాత్మిక స్థితితో తృప్తి చెందక స్పష్టమైన సత్యకాంతిని ఆకాంక్షించే వారెందరో ఉన్నారు. ప్రస్తుతం తామున్న సంఘాల్లో క్రీస్తు స్వరూపం కోసం వారు వ్యర్ధంగా అన్వేషిస్తున్నారు. ఈ సంఘాలు రోజు రోజుకి సత్యానికి దూరమైపోయి లోకంతో అనుబంధం పెంచుకోటంతో ఈ రెండు తరగతులకు మధ్య అంతరం పెరిగి చివరకి వారు విడిపోవటం జరుగుతుంది. “దేవునికంటె సుఖానుభవము నెక్కువగా ప్రేమించువారు, పైకి భక్తిగల వారివలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని” వారి సహవాసంలో యధార్ధంగా దేవుని ప్రేమించే వారు ఉండలేని సమయం వస్తుంది.GCTel 364.2

    ప్రకటన 14:612 లోని హెచ్చరికను తృణీకరించిన ఫలితంగా రెండో దూత ప్రవచించిన పరిస్థితికి సంఘం చేరుకొంటుంది. ఆ సమయాన్ని ప్రకటన 18 సూచిస్తున్నది. ఇంకా బబులోనులోనే ఉన్న దైవ ప్రజలకు దాని సహవాసం విడిచి రావలసిందిగా పిలుపు వస్తుంది. లోకానికి వచ్చే చివరి వర్తమానం ఇదే. అది దాని పని పూర్తిచేసుకొంటుంది. “సత్యమును నమ్మక దుర్నీతియందు అభిలాషగలవారు” బలమైన మోసానికి గురి అయి అబద్దాన్ని నమ్మటానికి విడువబడ్డప్పుడు ఎవరి హృదయ ద్వారాలు సత్యాన్ని స్వీకరించటానికి ద్వారాలు తెరచుకొని ఉంటాయో వారికి సత్యం స్పష్టంగా కనిపిస్తుంది. బబులోనులో మిగిలిపోయిన దైవ ప్రజలందరూ ‘‘నా ప్రజలారా, ... దానిని విడిచి రండి” అన్న పిలుపు విని సానుకూలంగా స్పందిస్తారు. (ప్రకటన 18:4)GCTel 364.3