Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
స్వస్థత పరిచర్య - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    17—పరిహరాత్మక సాధనాల వినియోగం

    వ్యాధి కారణం లేకుండా రాదు. ఆరోగ్య నియమాల నిర్లక్ష్యం వల్ల మార్గం సుగమమై వ్యాధికి స్వాగత లభిస్తుంది. చాలా మంది తమ తల్లితండ్రుల ఉల్లంఘన ఫలితంగా బాధ అనుభవిస్తారు. తల్లితండ్రులు చేసినవాటికి వారు బాధ్యులు కాకపోయినా, ఏది ఆరోగ్య నియమాల అతిక్రమమో ఏది కాదో తెలుసుకపోటం వారి విధి. తమ తల్లితండ్రుల దురభ్యాసాల్ని నేర్చుకోకుండా సరియైన జీవన విధానం ద్వారా తమకు మెరుగైన పరిస్థితులను వారు సృష్టించుకోవాలి.MHTel 196.1

    ఏది ఏమైనా ఎక్కువ మంది తమ సొంత చెడు కార్యాల వలన బాధకు గురి అవుతారు. తినటం, తాటం వస్త్రాలు ధరించటం, పని చెయ్య టంలో వారు ఆరోగ్య నియమాల్ని లెక్కచెయ్యరు. ప్రకృతి చట్టాల ఉల్లంఘన ఖచ్చితమైన తమ ఫలితాల్ని వెల్లడి చేస్తుంది వ్యాధి సంభవించి నపుడు అనేకులు తమ బాధకు నిజమైన కారణాన్ని గుర్తించకుండా దానికి దేవుని మీద సణుగుకుంటారు. కాగా ప్రకృతి చట్టాల ఉల్లంఘన వల్ల వచ్చే బాధకు దేవుడు బాధ్యుడు కాడు.,MHTel 196.2

    దేవుడు మనకు కొంత జీవశక్తిని అనుగ్రహించాడు. జీవిత వివిధ విధులను నిర్వర్తించటానికి తగిన అవయవాలను కూడా ఆయన నిర్మించాడు. ఈ అవయవాలు ఒకదానితో ఒకటి కలసి పని చేసేందుకు ఏర్పాటు చేసాడు. జీవశక్తిని మనం జాగ్రత్తగా పరిరక్షించుకొని సున్నితమైన శరీర యంత్రాంగాన్ని కాపడుకుంటే, ఫలితంగా ఆరోగ్యం లభిస్తుంది. కాని జీవ శక్తికి అతి వేగంగా అలసట కలిగిస్తే ప్రస్తుత వినియోగానికి నాడీ వ్యవస్థ తన శక్తి వనరుల నుండి శక్తిని అప్పు తీసకుంటుంది. ఒక అవయం గాయపడితే అవయవాలన్నీ ప్రభావితమౌతాయి. ఈ పరిస్థితులను సరిచెయ్యటానికి దాని కృసి తరుచు జ్వరం ఇంకా ఇతర రకాల అనారోగ్య రూపాల్లో కనిపిస్తుంది.MHTel 196.3

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents