Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
స్వస్థత పరిచర్య - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    దివ్య ఆలోచన కర్త

    కష్టాల్లో ఉన్నప్పుడు అనేకులు ఎవరో లోక మిత్రుడుకి తమ ఆందోళనలను చెప్పుకొని సహాయం చెయ్యమని బతిమిలడతారు. క్లిష్ట పరిస్థితుల్లో వారి హృదయాల్ని అవిశ్వాసం నింపుతుంది. మార్గం చీకటి మాయమౌతుంది. వారి పక్క ఎప్పుడు యుగయుగాల మహా ఆలోచనకర్త తనపై తమ నమ్మకాన్ని ఉంచవలసినదిగా వారిని ఆహ్వనిస్తూ నిలబడి ఉంటాడు. భారాన్ని మోసే యేసు ఇలా అంటున్నాడు “నా వద్దకు రండి, మీకు విశ్రాంతి నిస్తాను” ఆయనను విడిచి పెట్టి నిశ్చయత లేని మనలాగే దేవుని మీద ఆధారపడే మానవుల పక్కకు తిరుగుదామా?MHTel 455.4

    మీరు మీ ప్రవర్తనలోని లోపాల్ని గురించి, పనితాలూకు విస్తారతతో పోల్చినపుడు మీ అల్పతను గురించి బాధపడవచ్చు. కాని మానవుడికి దేవుడిచ్చిన మేధ పరంగా మీకు మిక్కిలి గొప్ప ప్రతిభ ఉంటే అది మీ పనికి చాలదు. “నాకు వేరుగా ఉండి మీరేమియే చేయలేరు” అంటున్నాడు ప్రభువు. యోహాను 15:5 మనం చేసే అంతటి ఫలితం ప్రభువు చేతుల్లో ఉంది. ఏమి జరిగినా ఆయన హస్తాన్ని నిలకడగా దృడమైన నమ్మకంతో పట్టుకోండి.MHTel 455.5

    మీ వ్యాపారంలోకి ఖాళీ సమయాల్లో స్నేహాల్లోకి జీవిత బాంధవ్యాల్లోకి, మీ స్నేహ సంబంధాలన్నటిలోకి మన:పూర్వక ప్రార్ధనతతో ప్రవేశించండి. మీరు దేవున్ని ఘనపర్చతారని దేవుడు మిమ్మల్ని ఘనపర్చుతాడని అలాచూపిస్తారు. బలహీన హృదయులైనప్పుడు ప్రార్ధించండి. అధైర్యపడతు న్నప్పుడు మనుషులతో మాట్లాడకండి. ఇతరుల మార్గంలో నీడలు నింపకండి. కాని మీకున్న సమస్యల్ని యేసుకు చెప్పండి,. సహాయం కోసం చేతులు పైకి చాపండి. మీ బలహీనతలో ఆయన అనంత శక్తి పై ఆధారపడండి. దేవుని వెలుగులో వెలుగును చూసేందుకు ఆయన ప్రేమలో ఆనందించేందుకు వినయం, వివేకం, ధైర్యం, అధిక విశ్వాసం కోసం ప్రార్ధించండి.MHTel 456.1

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents