Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
స్వస్థత పరిచర్య - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    వృద్ధులు

    వృద్ధులకు కూడా కటుంబ సహాయక ప్రభావాలు అవసరమౌతాయి. తాము కోల్పోయిన గృహాన్ని క్రీస్తులో సహోదరులు సహోదరీల గృహాల్లో వారికి సమకూర్చవచ్చు. ఆ గృహ ఆసక్తులు వ్యాపకాల్లో పాలు పంచుకోవ టానికి ప్రోత్సహిస్తే తమ ప్రయోజకత్వం సమాప్తం కాలేదని వారు భావించ టనాకి తోడ్పడుతుంది. తమ సహాయం విలువైనదని, ఇతరులకు సేవచెయ్యటంలో తాము చెయ్యటానికి ఇంకా కొంత ఉన్నదని వారు భావించేటట్లు చెయ్యండి. అది వారి హృదయాల్లో ఉత్సాహాన్ని నింపి జీవితంలో వారికి ఆసక్తినిస్తుంది.MHTel 168.3

    సాధ్యపడినంత మేరకు ఎవరి తల తెల్లబడుతున్నదో అడుగులు మందగిల్లుతున్నాయో వారు సమాధికి సమీపమౌతున్నారని స్నేహితుల మధ్య సుపరిచిత సహావాసాల మధ్య మిగిలి ఉన్నారని సూచించనివ్వండి. ప్రేమించే చేతులు, దయగల చేతులు వారికి సేవలు చేసి వారిని గూర్చిన జాగ్రత్త తీసుకోనివ్వండి.MHTel 169.1

    ఇది చెయ్యటం. ఏ కటుంబులో సాధ్యమౌతుందో దానిలోకి వచ్చిన ఆ పెద్దవారికి ఆకుటుంబములోని వారందరూ పరిచర్య చెయ్యటం ఓ ప్రత్యేక తరుణంగా ఉండాలి. ఇది సాధ్యం కానప్పుడు, ఆ పని సంఘానికి చెందుతుంది. దాన్ని ఓ ఆదిక్యతగాను విధిగాను సంఘం స్వీకరించాలి. క్రీస్తు స్వభావం గల వారదరూ బలహీనులు పెద్ద వయసు గలవారు అయిన వృద్ధుల పట్ల జాలిగల పరిగణన కలిగి ఉంటారు.MHTel 169.2

    మన కుటుంబాల్లో నిస్సహాయులైన వీరిలో ఒకరి ఉనికి క్రీస్తుతో తన కారుణ్య పరిచర్యలో సహకరించటానికి, ఆయన వంటి గుణలక్షణాల్ని వృద్ధి చెయ్యటానికి విలువైన అవకాశాన్నిస్తుంది. వృద్ధులు యువజనుల సహావాసంలో ఆశీర్వాదమున్నది. యువత వృద్దుల హృదయాల్లోకి జీవితాల్లోకి ఉత్సాహనందల్ని తేవచ్చు. జీవితం పై పట్టు సడలుతున్న వృద్దులకు యువజనులతో సంబందం వారికి సహాయకత, ఉల్లాస ఉపకారాల్ని ఇస్తుంది. వృద్ధుల జ్ఞాన వివేకాలు అనుభవం యువజనులకు సహాయపడవచ్చు. మరీ ముఖ్యంగా వారు స్వార్ధరహిత పరిచర్య పాఠాన్ని నేర్చుకోవాలి. సాననుభూతి, సహనం, స్వార్ధత్యాగ ప్రేమ అవసరమైన ఒకరు అనేక గృహస్తులకు అమూల్య దీవెన. గృహ జీవితాన్ని అది మధురం సంస్కారవంత చేస్తుంది. తమను దివ్య సౌందర్యంతో రమ్యంగా చేసే, వాడబారని పరలోక ఐశ్వర్యంతో తమను భాగ్యవంతుల్ని చేసే క్రీస్తు వంటి సుగుణాలను అది పెద్దవారిలోను చిన్నవారిలోను కోరుతుంది.MHTel 169.3

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents