Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
స్వస్థత పరిచర్య - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    ఆహారం ఎంపిక

    శరీర నిర్మాణానికి అవసరమైన పదార్ధ ఆలను సరఫరా చేసే ఆహారాలను ఎంపిక చేసుకోవాలి. ఈ ఎంపికలో రుచి సురక్షితమైన మార్గదర్శి కాదు. తప్పుడు ఆహార అలవాట్ల ద్వారా రుచి వక్రమయ్యింది. అది శక్తినిచ్చేబడులు తరుచు ఆరోగ్యాన్ని పాడు చేసి బలహీనతను కలిగించే ఆహారాన్ని డిమాండు చేస్తుంది. సమాజం ఆచారాలు మనకు సురక్షితమైన మార్గదర్శి కాజాలవు. ప్రతీ చోటా దర్శనమిచ్చే వ్యాధి బాధలకు కారణం చాలావరకు ఆహారం విషయంలో ప్రబలుతున్న తప్పుడు ప్రజాభిప్రాయాలే.MHTel 252.2

    ఉత్తమ ఆహారాలేమిటో తెలుసుకోవటానికి మనం మానవుడి ఆహారానికి దేవుడు ఆదిలో ఇచ్చిన ప్రణాళికను అధ్యయనం చెయ్యలి. మానవుణ్ణి సృజించిన ఆయన అతడి అవసరాల్ని అవగాహన చేసుకునే ఆదాముకి అతడి ఆహారాన్ని నయమించాడు. “ఇదిగో భూమిమీద ఉన్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనములిచ్చు వృక్షఫలముగల ప్రతీ వృక్షమును మీకిచ్చియున్నాను. అవి మీకాహారమగును”. అదికాండము 1:29 పాప శాపం కింద భూమిని దున్ని తన జీవనోపాధి సంపాదించటానికి ఏదెను విడిచి పెట్టినప్పుడు “పొలములోన పంట తిందువు” అన్నాడు దేవుడు ఆదాముతో,అదికాండము 3:18MHTel 252.3

    గింజలు, పండ్లు పప్పులు, కూరగాయలు మన సృష్టికర్త మనకు ఎంపిక చేసిన ఆహారం. సాధ్యమైనంత సామన్యంగాను సహజంగాను తయారు చేసిన ఆహార పదార్థాలు ఆరోగ్యవంతమైన పౌష్టికమైన హారం. అవి మరింత క్లిష్టమైన, ఉద్రేకం పుట్టించే ఆహారం ఇవ్వలేని బలాన్ని సహనశక్తిని, మానసికశక్తిని ఇస్తాయి.MHTel 253.1

    కాని ఆరోగ్యదాయకమైన ఆహారాలన్ని మన అవసరాలకు అన్ని పరిస్థితుల్నోలు సరిపోవు. ఎంపకి చేసుకోవటంలో జాగ్రత్త తీసుకోవాలి. మన ఆహారం కాలానికి మనం నివసిస్తున్న శీతోష్ణ స్తితికి మనం అవలంభిస్నున్న వృత్తికి అనుకూలమైనదే ఉండాలి. ఓ కాలానికి శీతోష్ణస్తితికి సరిపవు. కనుక వివిధ వృత్తుల్లో ఉన్నవారికి వివిధ ఆహారాలున్నాయి. కఠిన శారీరక శ్రమ చేసేవారికి ప్రయోజనాన్నివ్వగల ఆహారం నీడను పనిచేసేవారికి లేక మొదడుతో పనిచేసేవారికి సరిపడదు. దేవుడు మనకు పలురకాల ఆరోగ్యదాకమైన ఆహార పదార్థాలిచ్చాడు. ప్రతీ వ్యక్తి తన అనుభవం సదాలోచన ప్రకారం తన అవసరాలకు సరిపడే ఆహారాన్ని ఎంచుకోవాలి.MHTel 253.2

    ప్రకృతి సరఫరా చేసే పండ్లు, పప్పులు, గింజలు సమృద్ధిగా ఉన్నాయి. రవాణా వసతులు అధికమవ్వటం వల్ల ఏటికేడాది అన్ని దేశాల ఉత్పత్తులు అందరికి మరింత విస్తృతంగా పంపిణీ అవుతున్నాయి. ఫలితంగా కొన్ని ఏళ్ళ కిందట ఖరీదైన విలాస వస్తువులుగా పరిగణించబడ్డ అనేక ఆహారపదార్ధాలు ఇప్పుడు అనుదినం ఉపయోగించే ఆహార పదార్ధాలుగా అందరి అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఎండబెట్ట క్యాన్ చెయ్యబడ్డ పండ్ల విషయంలో గింజలు, పప్పులతో తయారు చేసిన ఆహారపదార్ధాలు మంసాహార పదార్థాల స్థానంలో అధికంగా వినియోగంలోకి వస్తున్నాయి. పప్పులతో గింజలు, పండ్లు కొన్ని దుంపలను కలిపి ఆరోగ్యకరం, పౌష్టికం అయిన ఆహార పదార్థాల్ని తయారు చేయవచ్చు. పప్పులను ఎక్కువ నిష్పత్తిలో ఉయోగించకుండా జాగ్రత్త తీసుకోవాలి. పప్పులతో తయారు చేసిన ఆహారపదార్థాల్ని ఉపయోగించటం వల్ల కీడు సంభవిస్తున్నట్లు గుర్తించేవారు. ఈ ముందు జాగ్రత్తను పాటించటం ద్వారా దాన్ని తొలగించుకోవచ్చు. కొన్ని పప్పులు ఇతర పప్పలంత ఆరోగ్యదాయకం కావని సిఫార్సు చెయ్యాల్సి ఉంది. బాదం పప్పు వేరు సెనగపప్పుకన్నా శ్రేష్ఠం. కాని వేరుసెనగలు తక్కువ మొత్తాల్లోను గింజలతో కలపి వాడితే పౌష్టికతనిస్తాయి జీర్ణమౌతాయి.MHTel 253.3

    సరియైన విధంగా తయారు చేసుకున్నప్పుడు పప్పుల వలె ఒలీవలు బటర్ స్థానాన్ని మాసం పదార్థాల స్థానాన్ని అక్రమిస్తాయి. ఒలీవలోని నూనె జంతువు నూనెకన్నా లేక కొవ్వు కన్నా ఎంతో మంచిది. అది విరేచన కారిగా పనిచేస్తుంది. అది క్షయ రోగులకు మేలు చేస్తుంది. మంటవలన కమిలని జీర్ణకోశాన్ని స్వస్థపర్చుతుంది.MHTel 254.1

    విలాసవంతమైన, ఉద్రేకాన్ని పుట్టించే ఆహారానికి అలవాటు పడ్డ వ్యక్తులకు ఆస్వాభావిక రుచి ఉంటుంది. వారు వెంటనే సాధారణమైన సామాన్యమైన ఆహారాన్ని ఇష్టపడరు. రుచి సహజ మవ్వాటానికి , దుర్వినియోగమైన జీర్ణకోశం కోలుకోవటానికి సమయం పడుతుంది. అయితే ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఉపయోగించేవారు కొంతకాలమయిన తరువాత అది రుచిగా ఉన్నట్లు గ్రహిస్తారు. దాని సున్నితమైన కమ్మని రుచి ఇష్టమౌతుంది. ఎంతో చక్కని అనారోగ్యదాయక ఆహారం కన్నా దాన్ని ఎంతో ఇష్టంగా తినటం జరుగుతంది. ఆరోగ్యవంతమైన స్థితిలో ఉన్న, జ్వర పరిస్థితిలో గాని అధిక శ్రమకు లోనైగాని లేని జీర్ణకోశం దాని విధిని సరిగా నిర్వర్తించటానికి సిద్ధంగా ఉంటుంది.MHTel 254.2

    “పందెపు రంగమందు పరుగెత్తువారందరు పరుగెత్తుదురు గాని యొక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలె మీరు బహుమానము పొందునట్లుగా పరుగెత్తుడి”. 1 కొరింథీ 9:24MHTel 254.3

    ఆరోగ్యాన్ని కొనసాగించటానికి చాలినంత మంచి పౌష్టికాహారం అసవరం. వివేకంతో తయారు చేసుకుంటే ఆరోగ్యానికి ఏది సహాయపడుతుందో దాన్ని దాదాపు ప్రతీ దేశంలోను సంపాదించవచ్చు. వరి, గోధుమ, యవలు, చిక్కుళ్ళు, బఠాణీలు మొదలైన వాటితో తయారు చేసిన రకరాకాల ఆహార పదార్థాలు విదేశాల్లో అన్ని చోట్లకు పంపటం జరుగుతున్నది. స్థానికంగా లభించే లేక దిగుమతి అయ్యే పండ్లతోను, ప్రతీ స్థలంలో పండే రకరకాల కూరగాయలతోను సంపూర్ణ ఆహారాన్ని మాంసం లేకుండా తయారు చేసుకోవటానికి ఇవి అవకాశాన్నిస్తున్నాయి.MHTel 254.4

    పండ్లు పుష్కలంగా పండించటం సాధ్యమైన చోట్ల క్యాన్ చెయ్యటం లేక ఎండబెట్టటం ద్వారా చలికాలానికి సరఫరాలు నిల్వ చేసుకోవాలి. ద్రాక్షాలు, గూస్ బెరీలు, స్ట్రాబెరీలు, రేస్ మైరీలు, బ్లేకబెరీలు వంటి చిన్న పండ్లను ఎక్కడ తక్కువ ఉపయోగిస్తారో వాటి సేద్యాన్ని ఎక్కడ ఎక్కువ చేపట్టారో అక్కడ అనేక స్థలాల్లో వాటిని లాభసాటిగా పండించవచ్చు.MHTel 255.1

    ఇంట్లో వాడుకోవటానిక చేసే క్యానింగుకి టిన్ను కన్నా సాధ్యమైన చోట్ల గ్లాసు వాడటం మంచిది. క్యాన్ చెయ్యదలచేవి పండ్లు అయితే అవి మంచి స్థితిలో ఉండాలి, తక్కువ పంచదార వాడండి. పండ్లను చెడిపోకుండా ఉంచటానికి అవసరమైనంతమేరకు మాత్రమే ఉడకబెట్టలి. ఇలా సిద్ధం చేసినవి తాజా పండ్లకు మంచి ప్రత్యామ్నాయమౌతాయి.MHTel 255.2

    కిస్మిన్లు, ఫ్రూన్లు, యాపిల్ లు పేర్లు పీచు ఏప్రికాట ల వంటి ఎండు పండ్లు సరమైన ధరలకు ఎక్కడ లభిస్తాయో అక్కడ వాటిని ఆరోగ్యం శక్తి కోసం ఉత్తమ పలితాలినిచ్చే వాటిగా అన్ని తరగతుల పనివారు ప్రధాన ఆహారపదార్ధాంగా స్వేచ్ఛగా ఉపయోగించుకోవచ్చు.MHTel 255.3

    ఒకే భోజనంలో ఎక్కువ రకాలుండకూడదు. ఇది అతి తిండిని ప్రోత్సహించి అజీర్తి కలిగిస్తుంది. ఒకే భోజనంలో పండ్లు కూరగాయలు తినటం మంచిది కాదు, జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉంటే ఈ రెంటి వినియోగం తరుచు మానసిక శక్తి వినియోగంలో దురవస్థ అశక్తత సంభవిస్తాయి. ఒక పూట భోజనంలో పండ్లు మరోపూట భోజనంలో కూరగాయలు తినటం మంచిది.MHTel 255.4

    భోజనంలో మార్పు ఉండాలి. ఒకే విధముగా తయారు చేసిన అవే వంటకాలు ప్రతీరోజు ప్రతీ పూట భోజనబల్ల మీద ఉండకూడదు. ఆహారం రకరకాలుగా తయారు చేసి వడ్డించిప్పుడు దాన్ని ఎక్కువ ఇష్టంగా తినటం జరుగుతుంది. అది శరీర వ్యవస్థకు మెరుగైన పౌష్టికతను అందిస్తుంది.MHTel 255.5

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents