Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
స్వస్థత పరిచర్య - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    శ్వాసక్రియ

    మంచి రక్తం కోసం మనం బాగా గాలి పీల్చుకోవాలి. గాలి ఊపరి తిత్తులను ప్రాణ వాయువుతో నింపుతుంది. దీర్ఘంగా లోతుగా గాలి లోపలికి పీల్చినప్పుడు రక్తాన్ని శుద్ధి చేస్తాయి. అవి రక్తానికి తేజస్సు గల రంగునిచ్చి దాన్ని ప్రాణాదాయక విద్యుత్తుగా శరీరంలోని ప్రతీ భాగానికి పంపుతాయి. మంచి శ్వాస క్రియ నరాలను శాంతపర్చుతుంది. అది ఆకలి పుట్టించి జీర్ణక్రియ పరిపూర్ణగా జరగటానికి తోడ్పడుతుంది. సుఖ నిద్రను కలిగిస్తుంది.MHTel 230.1

    ఊపిరితిత్తులకు సాధ్యమైనంత స్వేచ్ఛ ఇవ్వటం అవసరం. స్వేచ్చా చర్య వల్ల వాటి సామర్ధ్యం వృద్ధి చెందుతుంది. అవి చిన్నగా కుదించుకు పోయి ఉంటే వాటి సామర్ధ్యం తగ్గిపోతుంది. దాని దుష్ఫలితాలు ముఖ్యంగా వంగి పనిచేసే ఆఫీసు పనివారిలో కనిపిస్తాయి. ఇలా వంటిని చెయ్యటంలో లోతుగా గాలి పీల్చుకోవటం అసాధ్యం. లోతులేని శ్వాస క్రియ త్వరలో అలవాటుగా మారుతుంది. ఊపిరితిత్తులు విశాలమయ్యే శక్తిని కోల్పోతాయి. గట్టిగా బిగించే బట్టలు వేసుకోవటం ఇలాంటి ఫలితాల్నే ఉత్పత్తి చేస్తుంది. ఛాతి కింది భాగానికి చాలినంత స్థలం లభించదు. శ్వాసక్రియలో సహకరించటానికి రూపకల్పన చెయ్యబడ్డ పొత్తి కడుపు కండరాలు పూర్తిగా పనిచెయ్యలేవు. కనుక ఊపిరితిత్తుల చర్య పరిమితమౌతుంది.MHTel 230.2

    ఇలా సరిపోని ప్రాణవాయువు అందుతుంది. రక్తం మందకొడిగా కదులుతుంది. గాలి విడవటం ద్వారా ఊపిరితిత్తుల న ంచి విసర్జించ బడలాల్సిన వ్యర్ధాలు,విష పదార్థం ఉండిపోతాయి. రక్తం చెడు రక్తమౌతుంది. ఊపిరితిత్తులే కాదు పొట్ట, కాలేయం, మెదుడు కూడా ప్రభావితమౌతాయి. మనసు వ్యాకులతకు గురి అవుతుంది. మెదడు మసకబారుతుంది. ఆలోచనలు గజిబిజి అవుతాయి. దు:ఖ వైఖరి ఏర్పడుతుంది. శరీర వ్యవస్థంతా విచారగ్రస్తమై, మందగిల్లి, సులువుగా వ్యాధి భారిన పడుతుంది.MHTel 230.3

    ఊపరితిత్తులు నిత్యం కాలుష్యాలను విసర్జిస్తూ ఉంటాయి. వాటికి నిత్యం తాజా గాలి సరఫరా అవసరం. అవసరమైన ప్రాణ వాయువును కలుషితమైన గాలి సరఫరా చెయ్యలేదు. కనుక రక్తం శుద్ది కాకుండానే మెదడకు ఇతర అవయవాలకు వెళ్తుంది అందుకే పూర్తి వాయ ప్రసరణ చాలా అవరం. దగ్గర దగ్గరగా ఉన్న గాలి సరిగా లేని గదుల్లో నివసించటం శరీర వ్యవస్థ అంతటిని బలహీనపర్చుతుంది. అది ప్రత్యేకించి జలుబుకు సులువగా లొంగుతుంది. కాస్త గాలి తగిలితే వ్యాధికి మార్గం ఏర్పడు తుంది. ఇంటిలో ఉండటానికే పరిమితమైయ్యే అనేకమంది మహిళల్ని అది పాలిపోయి బహీనులయ్యేటట్లు చేస్తుంది. వారు అదే గాలిని, అది ఊపిరి తిత్తులు చర్మ రంధ్రాల ద్వారా బహిష్కరించబడ్డ విష పదార్థాలతో నిండే వరుకూ,పీల్చుకుంటారు, ఈ విధంగా కాలుష్యాలు తిరిగి రక్తంలోకి వెళ్తాయి.MHTel 230.4

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents