Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
స్వస్థత పరిచర్య - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    19—ప్రకృతితో సంబంధం

    మన మొదటి తల్లితండ్రులకు వారి ఆరోగ్యనందాలకు అనువైన పరిసరాల్ని దేవుడు ఎంపిక చేశాడు వారిని రాజభవనంలో పెట్టలేదు లేక నేడు అనేకులు సంపాదించటానికి వెంపర్లాడే కృత్రిమ ఆభరణాలు విలాస వస్తువులను వారి చుట్టు ఉంచలేదు. వారిని ప్రకృతికి చేరువోల పరంలోకంలోని పరిశుద్దలతో సహవాసానికి సానుకూలమైన తావులో ఉంచాడు.MHTel 222.1

    తన బిడ్డలకు గృహంగా దేవుడు ఏర్పాటు చేసిన తోటలో ప్రతీ మలుపులో అందమైన పొదలు చక్కని పువ్వులు కన్నులకు విందుచేసాయి. అక్కడ అన్ని రకాల చెట్లు ఉన్నాయి. వాటిలో ఆలా చెట్లపై మధురమైన పండ్లు ఉన్నాయి. ఆ చెట్ల కొమ్మల పై పిట్టలపై తమ పాటలు పాడుతు న్నాయి. వాటి నీడలో భూమి మీది సకల జీవులు భయం లేకుండా అటలాడుకుంటున్నాయి.MHTel 222.2

    మచ్చలేని పవిత్రత ఉన్న ఆదాము అవ్వలు ఏదైనా దృశ్యాలు శబ్దాలతో ఎంతో ఉల్లసించారు. దేవుడు వరికి తోటలో తమ పనిని నియమించాడు. సేద్యపర్చుటకును దానిని కాచుటకును” అదికాండము 2:15 తాము ప్రతీరోజు చేసిన పని వారికి ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఇచ్చింది. దినం చల్లబడ్డ వేళ తమతో నడుస్తూ మాట్లాడానికి తమ సృష్టికర్తను ఆ జంట సంతోషముగా ఆహ్వానించేవారు. దేవుడు ప్రతీ రోజు వారికి పాఠాలు నేర్పించేవాడు.MHTel 222.3

    మన మొదటి తల్లితండ్రులకు దేవుడు నియమించిన జీవిత ప్రణాళికలో మనం నేర్చుకోవలసిన పాఠాలున్నాయి. పాపం నీడ భూమి పై పడ్డనప్పటికి తన బిడ్డలు తాను చేసిన కార్యాలలో సంతోషానందల్ని కనుగొవాలని దేవుడు అభిలాషిస్తున్నాడు. ఆయన నియమించిన జీవిత ప్రణాళికను మనం ఎంత నమ్మకంగా అనుసరిస్తే వ్యాధి భాధలతో తల్లడిల్లుతున్న మానవాళిని ఆయన అంత అద్భుతంగా పునరుద్ధరిస్తాడు. వ్యాధిగ్రస్తుల్ని ప్రకృతికి చేరువగా తీసుకురావలసిన అవసరం ఉంది. స్వాభావిక పరిసరాల నడుమ ఆరుబయట జీవితం అనేకమంది నిస్సహాయ, దాదాపు నిరీక్షణ లేని వికలాంగులకు అద్భుతాలు చేస్తుంది.MHTel 222.4

    నగరాల్లోని గోల, ఉద్రేకం, గందరగోళం, వాటిలోని క్రమబద్ద అస్వాభావిక జీవితం వ్యాధిగ్రస్తులకు విసుగు అలసట పుట్టిస్తాయి. పొగ ధూళి విషయవాయువులతోను, వ్యాధికారక క్రిములతోను నిండిన గాలి జీవితానికి ప్రమాదకరం.MHTel 223.1

    దినంలో ఎక్కువ భాగం నాలుగు గోడల మధ్య ఉండే వ్యాధిగ్రస్తులు తమ గదుల్లో ఖైదీలై ఉన్నట్లు భావించటం జరుగుతుంటుంది. ఇళ్ళు, రోడ్డు పక్క మనుషులు నడిచేదార్లు హడావుడిగా నడిచి వెళ్తున్న ప్రజల గుంపులనే వారు చూస్తారు. కాస్త నీలి ఆకాశంగాని, సూర్యకాంతిగాని, పచ్చని గడ్డిగాని, లేక ఓ పువ్వు ఓ చెట్టు గాని కనిపించదు. ఈరకంగా బందీయైన వీరు తమ బాధలు దు:ఖల గురంచి తలపోసుకొని తమ సొంత ఆలోచనలకు బలి అవుతారు.MHTel 223.2

    నైతిక శక్తి పరంగా బలహీనులైనవారికి నగరాలు ప్రమాదాలతో నిండి ఉంటాయి. అస్వాభావిక రుచులను నియత్రించాల్సిన రోగులు నగరాల్లో నిత్యం శోధనలకు గురి అవుతుంటారు. తమ ఆలోచనా ధోరణిని మార్చివేస్తే కొత్త పరిసరాల మధ్యకు వారిని మర్చటం అవసరం. తమ జీవితాల్ని నాశనం చేసిన ప్రభావాలకు వ్యత్యాసంగా ఉండే స్థలంలో వారిని పెట్టాలి. దేవుని నుంచి వేరు చేసే ప్రభావల నుండి వారిని తొలగించి కొంతకాలము పాటు పరిశుద్ధమైన వాతావరణంలో ఉండనివ్వండి.MHTel 223.3

    వ్యాధిగ్రస్తులకు వైద్య సేవల నిమిత్తం స్థాపితమయ్యే సంస్థలను పట్టణాలు నగరాలకు దూరంగా స్థాపిస్తే అవి ఎంతో జయప్రదమౌతాయి. ఆరోగ్యాన్ని తిరిగి పొందగోరేవారందరు సాధ్యమైనంత మేరకు ఆరుబయట జీవిత ప్రయోజనాన్ని పొందగల పల్లె వాతావరణంలో ఉండాలి. ప్రకృతి దేవుడిచ్చన వైద్యుడు. స్వచ్ఛమైన గాలి, సూర్యరశ్శి, పుష్పాలు, చెట్టు,పండ్ల తోటలు, ద్రాక్ష తోటలు, ఈ పరిసరాల నడుమ ఆరుబయట వ్యాయామం ఇవి ఆరోగ్యాన్ని జీవాన్ని ప్రోగు చేసేవి.MHTel 223.4

    వైద్యులు నర్సులు తమ రోగుల్ని ఎక్కువ ఆరుబయట ఉండటానికి ప్రోత్సహించాలి. ఎక్కువ కదలిక లేని రోగులకు ఆరుబయట జీవితం ఒక్కటే చికిత్స,. ఉద్రేకం వల్ల విల్లాస జీవితం వల్ల అనగా శరీరం మనసు ఆత్మ శక్తుల్ని బలహీనపర్చి నాశనం చేసే జీవనం ద్వారా సంభవించే రుగ్మతలను బాగు చేయ్యటానికి దానికి అద్భుతమైన శక్తి ఉంది.MHTel 224.1

    నగరం జీవితం, దీపాల కాంతి వీధుల్లోని గోలతో అలసిపోయిన రోగులు పల్లె ప్రాంతంలోని ప్రశాంతతకు స్వేచ్చకు ఎంత కృజమ్లాలు! వారు ప్రకృతి దృశ్యాలకు ఎంత ఆతురతో సప్రందిస్తారు! ఆరుబయట కూర్చుని సూర్యరశ్మిలో ఆనందించటానికి చెట్లు పువ్వుల సువాసనాల్ని అస్వాధించ టనికి వారు ఎంతో ఉత్సాహంగా ఉంటారు! దేవదారు చెట్టు నుండి వచ్చే కర్పూర తైలంలో ప్రాణాదాయక గుణాలున్నాయి. సీడారు, ఫర్ మొదలైన చెట్ల సువాసనలో ఆరోగ్యాన్ని పునరుద్ధరించే గుణాలున్నాయి.MHTel 224.2

    దీర్ఘవాధిగ్రస్తుల ఆరోగ్యానందాల పునరుద్ధరణకు పల్లె పరిసరాల్లో నివాసమంత సహాయకారి ఇంకొకటి ఉండదు. ఇక్కడ మిక్కిలి నిస్సహాయులు సూర్య రశ్మిలోనో లేక చెట్ల నీడలోనో కూర్చోవచ్చు లేక పండుకోవచ్చు. వారు కళ్లు తెరిచి పైకి చూడటం మాత్రమే చేస్తే మనోహరమైన గుబురు గుబరైన ఆకులు కనిపిస్తాయి. పిల్ల గాలులు గుసగుసలు వింటుంటే ప్రశాంతతనిచ్చి, సేదతీర్చే మధుర భావనలు వారిలో నెలకొంటాయి. దిగులు పోయి ఉత్సాహం వస్తుంది. క్షీణిస్తున్న శక్తి పంజుకుంటుంది. తనకు తెలియకుండానే మనసు ప్రశాంతమౌతుంది. జ్వరం తగ్గి నాడి సాధారణమౌతుంది. వ్యాధిగ్రస్తులు బలపడే కొద్ది ఈ లోకంలో వ్యాధి బాధలనుభావిస్తున్న దేవుని కుటుంబీకుల పట్ల ఆయన ప్రేమకు ప్రశస్త ప్రతీకలైన, మనోహర పుష్పాలను కోసుకోవటానికి ఒకటి రెండు అడుగులు వెయ్యటానికి వారు సాహసిస్తారు.MHTel 224.3

    రోగులను ఆరుబైట ఉంచేందుకు ప్రణాళికలు తయారు చెయ్యాలి. పని చెయ్యగలిగినవారికి ఆనందాన్నిచ్చే సులభమైన పనిని ఏర్పాటు చేయ్యాలి. ఈ ఆరుబయట పని ఎంత ఆనందదాయకంగా ప్రయోజన కరంగా ఉంటుందోవారికి చూపించండి.తాజా గాలిని పీల్చుకోవటానికి ప్రోత్సహించండి. లోతుగా ఊపిరి తీసుకోవటం వారికి నేర్పించండి,. శ్వాస తీసుకోవటంలోను, మాట్లాడటంలోను పొత్తి కడుపు కండరాలను వ్యాయామాన్విటం నేర్పించండి, ఇది వారికి ఎంతో విలువైన విద్య అవుతుంది.MHTel 224.4

    ఆరుబయట వ్యాయామం జీవితావసరంగా నిర్ధారించండి. అలాంటి వ్యాయామాలికి వస్తే సేద్యేం చెయ్యటం కన్నా మెరుగైంది లేదు. పూలమొక్కల నారుమళ్ళు పెంచటం లేక పండ్లతోటల్లో పని చెయ్యటం లేక కూరగాయలు పండించటం రోగుల్ని చెయ్యనివ్వకండి ఆరుబయట గాలిలో పూల మొక్కలు పెంచటానికి లేక ఇంకో తేలిక పనిచెయ్యటానికి ప్రోత్సహిస్తే వారి గమనం తమ నుండి తమ బాధల పై నుండి పక్కకు మళ్ళుతుంది.MHTel 225.1

    రోగిని ఆరుబయట ఎంత తక్కువగా ఉంచితే అతడి విషయంలో తీసుకోవాల్సిన శ్రద్ధ అంత తక్కువ అవసరమౌతుంది అతడి పరిసరాలు ఎంత ఉల్లాసంగా ఉంటే, అతడు అంత ఆనందంగా ఉంటాడు. ఎంత అందమైన వస్తువులు ఇంటిలో ఉన్నా, ఇంటిలోనే కదలకుండా ఉంటే, చింత అందోళన వ్యాకులత భావాలకు లోనవుతాడు. అతడి చుట్టు ప్రకృతిలోని అందమైన విషయాల్ని ఉంచండి. పెరుగుతున్న పువ్వులు చూడగల, పక్షుల గానం, వినగల స్థలంలో అతణ్ణి ఉంచండి. అప్పుడతడి హృదయం పక్షుల గానంతో శుృతి కలుపుతూ పాడుతుంది. శరీరానికి మనసుకు ఉపశమనం కలుగుతుంది. తెలివి మేల్కొంటుంది. ఆలోచన చురకువుతుంది. దేవుని వాక్య సౌందర్యాన్ని అభినందింటానికి మనము సిద్ధముగా ఉంటుంది.MHTel 225.2

    రోగుల గమనాన్ని ఆలోచనాల్ని తమ మీద నుండి దేవుని మీదకు మళ్ళించటానికి ప్రకృతిలో ఏదో ఒకటి ఉంటుంది. దేవుని ఆశ్చర్య కార్యాలు తన చుట్టు ఉండటంతో వారి దృష్టి కనిపించే వాటి నుండి దేవుని మీదకు అకర్షిమౌతుంది. సౌందర్యాన్ని పాడు చేసేది ఎక్కడ ఉండదో, వ్యాధిని మరణాన్ని కలిగించేది ఏదీ ఎక్కడ ఉండునో ఆ పరలోక గృహాన్ని గురించి ఆలోచించేట్లు వారిని నడిపిస్తుంది.MHTel 225.3

    దేవున్ని గురించి బోధించటానికి వైద్యులు నర్సులు ప్రకృతి నుండి పాఠాలు రూపొందించుకోవాలి. ఎవరి హస్తం వృక్షాల్ని గడ్డిని, పుష్పాల్ని చేసి ప్రతీ మొగ్గలోను పువ్వులోను, తన బిడ్డల పట్ల తన ప్రేమను వ్యక్తం చేస్తున్నదో ఆ దేవుని పై రోగుల దృష్టిని వారు ఆకర్షించాలి. పక్షుల్ని పుష్పాల్ని గూర్చిన శ్రద్ధ తీసుకునే ఆయన తన స్వరూపంలో తాను సృజించిన మానవుల విషయంలో శ్రద్ధ తీసుకుంటాడు.MHTel 226.1

    ఆరు బయట దేవుడు సృజించి సృష్టి కార్యాల నడుమ, తాజాతనం, ప్రాణదాయక శక్తి గల గాలిని పీల్చుకుంటున్నప్పుడు రోగికి క్రీస్తులోని నూతన జీవం గురించి చెప్పటం ఉత్తమం. ఇక్కడ దేవుని వాక్యం చదివి వినిపించవచ్చు. పాప చీకటితో నిండిన హృదయంలో క్రీస్తు నీతి ప్రకాశంచవచ్చుMHTel 226.2

    ఓ! దినదినం నేను నా దేవునికి సమీపంగా
    చేరగలిగితే ఎంత బాగుంటుంది!
    అప్పుడు ఆయన వాక్యంపై ఆను కుంటే
    గడియలు మధురంగా నడుస్తాయి

    ప్రభువా, నీతో నివసించాలన్న ఆశ నాది
    నూతనంగా దినందినం
    లోకం ఇవ్వలేని, లోకం తీసుకోలేనివి
    ఉత్సాహానందాలు నీవిచ్చేవి

    యేసు ప్రభువా, రా, నా హృదయాన్ని పాలించు
    చేయు నన్ను నీ వానిగా పూర్తిగా
    మరెన్నడూ నిన్ను విడవకుండేలా
    నీ దివ్య ప్రేమను మరెన్నడూ దు:ఖ పెట్టకకుండేలా
    MHTel 226.3

    - బెంజమిన్ క్లీవ్ లేండ్

    శారీరక ఆధ్యాత్మికమైన స్వస్థత అవసరమైన స్త్రీలు, పురుషులను తమ మాటలతోను క్రియలతోను క్రీస్తు వద్దకు ఎవరు తేగలరో వారితో సంబంధములోకి ఇలా తీసుకురావాలి. ఆత్మను శరీరాన్ని స్వస్థతపర్చగల ఆ గొప్ప వైద్య మిషనెరీ ఆయన యేసు ప్రభావం కిందకి వారిని తీసుకురావాలి. రక్షకుని ప్రేమ కథను తమ పాపాలు ఒప్పుకొని తన వద్దకు వచ్చేవారందరికి ఆయన ఇవ్వనున్న పాప క్షమాపణను గురించి వారు వినాలి,MHTel 226.4

    బాధ పీడితులు అనేకులు ఇటువంటి వారి ప్రభావం కింద జీవన విధానంలో పడతారు. వ్యాధి బాధల్లో ఉన్న అనేకులకు ప్రోత్సాహం, నిరీక్షణ సంతోష సమాధానాలు తేవటంతో మానవ సాధనాలతో దేవదూతలు సహకరిస్తారు. అలాంటి పరిస్థితుల మధ్య వ్యాధిగ్రస్తులు రెండంతలు దీవెన పొందుతారు. అనేకులు ఆరోగ్యవంతులవుతారు. బలహీనంగా పడుతున్న అడుగులు చలకీతనం పుంజుకుంటాయి. మందగించిన చూపు కాంతివంతమౌతుంది. ఆశలేని వారిలో జీవితాశ చిగురిస్తుంది. ఒకప్పుడు నిస్పృహతో నిస్తేజమైన ముఖం ఆనందంతో కళకళాడుతుంది. ఫిర్యాదు గల గళం ఆనందం, తృప్తి వెలిబుచ్చే మధుర స్వరమౌతుంది.MHTel 227.1

    శరీరారోగ్యం వృద్ధి పొందే కొద్ది రోగులైన పురుషులు స్త్రీలు ఆత్మ సంబంధమైన ఆరోగ్యాన్నిచ్చే విశ్వాసాన్ని క్రీస్తులో కనపర్చటానికి మరింత సమర్ధులవుతారు. క్షమించబడ్డ పాపాల స్పృహలో వర్ణించలేని సమాధానం సంతోషం. విశ్రాంతి ఉన్నాయి. మసకబారిన క్రైస్తవ నీరక్షణ కాంతివంత మౌతుంది. మాటలు విశ్వాసాన్ని వెలిబుచ్చుతాయి.MHTel 227.2

    “దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. అపత్కాలములో ఆయన నమ్ముకొన దగిన సహాయకుడు”. గాఢాంధకారపు లోయలో నేను సంచిరించను ఏ అపాయమునకు భయపడును. నీవు నాకు తొడైయుందువు నీ దుడు కఱ్ఱయు నీ దండమును నన్ను ఆదరించును”. “సొమ్మసిల్లువారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే”.MHTel 227.3

    కీర్తనలు 46:1, 23: 4 యెషయా 40:29MHTel 227.4

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents