Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
స్వస్థత పరిచర్య - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    సంతోషం

    తల్లి సంతోషకరమైన సంతృప్తితో కూడిన ఉత్సాహభరిమైన స్వభావాన్ని వృద్ధిపర్చుకోవాలి. ఈ దిశగా ప్రతీ ప్రయత్నానికి తన బిడ్డల శారీరకారోగ్యం లోను నైతిక ప్రవర్తనలోను గొప్ప ప్రతిఫలం పొందుతుంది, సంతోషకరమైన స్వభావం కుటుంబ సంతోషాన్ని వృద్ధిపర్చుతుంది. ఆమె ఆరోగ్యాన్ని బహుగా మెరుగుపర్చుతుంది.MHTel 321.3

    భర్త తన భార్యకు సానుభూతితో తను స్థిరమైన ప్రేమతోను సహాయం చెయ్యాలి. గృహంలో సూర్యరశ్మిలా ఉండేందుకు ఆమె తాజాగాను ఉ ల్లాసంగాను ఉండాలని అతడు కోరుకుంటే తన భారాలు భరించటంలో ఆమెకు చేయూతనివ్వాలి. అతడి దయ, ప్రేమతో కూడిన సౌజన్యం ఆమెకు ఎనలేని ప్రోత్సాహాన్నిస్తుంది. అతడు కలిగించే ఆనందం అతడి సొంత హృదయంలో ఉత్సాహానందాల్ని నింపుతుంది.MHTel 321.4

    కోపదారి, స్వార్ధపరుడు, అహంకారి అయిన భర్త అతడు తానే అసంతోషముగా ఉండటమే గాక తన గృహంలో ఉన్నవారందరిమీద చీకట్లు కప్పుతాడు. తన కోపిష్టి ప్రవర్తన ఫలితాన్ని తన భార్య నిరుత్సాహం లోను అనారోగ్యంలోను తన పిల్లల భ్రష్టతలోను చూస్తాడు.MHTel 321.5

    తల్లికి అవసరమైన ఆలనపాలన, సౌకర్యం ఆమెకు లేకపోతే అధిక శ్రమ ద్వారా లేక ఆందోళన విచారం వలన ఆమె అలసిపోతే, ఆమె ప్లిలలకు వారసత్వంగా రావలసినజీవశక్తి, మానిసక పటుత్వం ఉత్సాహకరమైన మనస్తత్వం ఉండవు. ఆమెకు ఏ లోటు లేకుండా బలహీనపర్చే శ్రమ వేదన కలిగించే చింతలు లేకుండా చెయ్యటానికి తన పిల్లలు తమ సొంత శక్తితో తమ జీవిత పోరాటాలు పోరాండేందుకు తల్లి జీవితాన్ని సంతోషానందాలతో నింపటం ముఖ్యంMHTel 322.1

    తండ్రుల మీద తల్లుల మీద గొప్ప గౌరవం బాధ్యత ఉంచటం జరిగింది. అదేమిటంటే వారు తమ బిడ్డలను దేవుని స్థానంలో ఉండాల్సిన బాధ్యత. వారి ప్రవర్తన, వారి అనుదిన జీవితం, వారి శిక్షణ పద్ధతులు తమ చిన్న పిల్లలకు దేవుని మాటల్ని విషదం చేస్తాయి. వారి ప్రభావం తమ బిడ్డలు ప్రభువు వాగ్దానాల్ని నమ్మేటట్లు చేస్తుంది. లేక విసర్జించేటట్లు చేస్తుంది.MHTel 322.2

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents