Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
స్వస్థత పరిచర్య - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    స్వార్ధరహిత సేవలో ఆనందం

    మీ అంతట మీరే ఏకాంతంగా ఉండి, మీరు మీ ప్రేమంతా ఒకరి పై ఒకరు ఒలకబోసుకోవటంతో తృప్తి చెందుతూ కాలం గడపటంలో ఆనందం లేదని గుర్తుంచుకోండి. మీ చుట్టుపట్ల ఉన్నవారి సంతోషానికి తోడ్పడటానికి ప్రతీ తరుణాన్ని అందిపుచ్చుకోండి వాస్తవికమైన ఆనందం స్వార్ధరహిత సేవలోనే ఉన్నదని జ్ఞాపకముంచుకోండి. క్రీస్తులో నూతన జీవితాలు జీవించేవారందరికి మాటల్లో పనుల్లో సహనం నిస్వార్ధతత కనిపిస్తాయి. స్వార్ధాన్ని స్వార్ధపరత్వాన్ని జయించటానికి అవసరంలో ఉన్న ఇతరులకు పరిచర్య చేస్తూ ఆయన జీవితం జీవించటానికి మీరు ప్రయత్నిస్తుండగా మీరు జయం వెంట జయం సాధిస్తారు. ఇలా మీ ప్రభావం లోకానికి మేలురకంగా ఉంటుంది. పరుషులు స్త్రీలు క్రీస్తును తమ సహాయకుడుగా తీసుకుంటే తమకు దేవుడు ఏర్పర్చి ఆదర్శాన్ని సాధించగలుగుతారు. ఎవరు ఆయనను విశ్వసింత తమను తాము ఆయనను అప్పగించుకుంటారో వారికి మానవ వివేకం ఏమి సాధించలేదో దాన్ని కృప సాధిస్తుంది. ఆయన కృప హృదయాల్ని పారలౌకికమైన బంధాలతో ఏకం చెయ్యగులుగుతుంది. ప్రేమ కేవలం మెత్తని ఉబ్బించే, మాటలు పలకటం కాదు. పరలోకపు మగ్గాల నేత లోకంలోని మగ్గాలు నేసే పేక పడుగు నేత కన్నా మిక్కిలి సున్నితమైనది. దాని ఫలితంగా వచ్చేది అల్పమైన సన్నని వస్త్రం కాదు గాని మన్నిక కలిగి కాలపరీక్షకు తట్టుకోగల నాణ్యత గల వస్త్రం. స్థిరమైన ప్రేమ అనే బంగరు తాడుతో హృదయం హృదయంతో బంధింపబడుతుంది.MHTel 310.4

    సమాధానం గల గృహం బంగరు కన్నా మెరుగు
    చలి మంట పక్కన వరాలు పంట
    అది ప్రేమ మందిరం మన పరలోక నిలయం
    తల్లి లేక సోదరీ అఏక భార్య ఉనికిచే పవిత్రం
    అది ఎంత సాదా సీదా గృహమౌనా
    పరలోకం అనుమతితో ఎంత దు:ఖభరితమైనా
    అది నెలవు అది అపరంజి కన్నా మెరుగు -తెలియని కర్త
    MHTel 311.1

    *****

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents