Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
స్వస్థత పరిచర్య - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    మోషే జీవితం నుంచి ఓ పాఠం

    మోషే అనభవాన్ని పరిగిణించండి. రాజు మనవడు సింహాసనానికి కానున్న వాసుడుగా అతడు ఐగుప్తులో పొందని విద్య చాలా ఉన్నతమైనది. ఐగుప్తీయులు వివేకాన్ని అర్ధం చేసుకున్న ప్రకారం, మోషేని వివేత ‘వంతుడుగా చెయ్యగల దేనీని తన విద్యపరంగా నిర్లక్ష్యం చెయ్యలేదు. అతడు ఉన్నతమైన పౌర, సైనిక శిక్షణను పొందాడు. ఇశ్రాయేలు ప్రజల్ని ధ్యాసం నుంచి విడిపించటానికి తాను పూర్తిగా సిద్ధ పడ్డానని భావించుకున్నాడు. కాని దేవుడు అలా తలంచలేదు. తన కృపలో ఆయన మో షేకి గొర్రెల కాపరిగా ఆరణ్యంలో నలభై సంవత్సరాల శిక్షణను నియమించాడు.MHTel 417.3

    ఐగుప్తులో మోషే పొందిన విద్య అనేక విధాలుగా తనకు తోడ్పడింది. కాని తన జీవిత కాలపు సేవకు అతిముఖ్యమైన సిద్ధబాటును కాపరిగి తాను చేసిన పనిలో పొందాడు. స్వాభావికంగా మోషే కోపదారి. ఐగుప్తులో జయప్రదమైన సైనిక నాయకుడు, రాజు ప్రేమను ప్రజల అదరాభిమానాల్ని పొందిన అతడు స్తుతికి పొగడ్తకు అలవాటు పడ్డాడు. ప్రజల్ని ఆకట్టు కున్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు దాస్య విమోచన కలిగించే కార్యాన్ని తన సొంత శిక్షణ ద్వారా సాధించగల ననుకున్నాడు. దేవుని ప్రతినిధిగా అతడు నేర్చుకోవలసిన పాఠాలు ఎంతో భిన్నముగా ఉన్నాయి. తన మందల్ని కొండ కోనల్లోకి, గడ్డి మైదానాల్లోకి నడిపిస్తున్నప్పుడు అతడు విశ్వాసం సాత్వికం, ఓర్పు, విధేయత, ఆత్మ విస్మరణ నేర్చుకున్నాడు. బలహీనంగా ఉన్నవాటిని సంరక్షించటం, వ్యాధిగ్రస్తమైన వాటికి సేవ చెయ్యటం, తప్పిపోయిన వాటి కోసం వెదకటం, అవిధేయమైన వాటి పట్ల సహనం ప్రదర్శించటం, గొర్రపిల్లల్ని దయగా సాకటం, వృద్ద బలహీన గొర్రెలకు శ్రద్ధ పోషణ నివ్వటం నేర్చుకున్నాడు.MHTel 417.4

    ఈ పనిలో మోషే ప్రధాన గొర్రెల కాపరిగా మరింత చేరువయ్యాడు. ఇశ్రాయేలు పరిశుద్ధునికి మరింత సన్నిహితుడు ఆత్మీయుడు అయ్యాడు. ఓ గొప్ప పని చెయ్యాలని ఇక ఆలోచించలేదు. తనకు అప్పగించబడ్డ పనిని దేవునికి చేసినట్లు నమ్మకంగా చెయ్యటానికి ప్రయత్నించాడు. తన పరిసరాల్లో దేవుని సముఖాన్ని గుర్తించాడు. అతడితో అదృశ్యుడైన ఆయన్ని గురించి ప్రకృతి మాట్లాడింది. దేవున్ని అతడు వ్యక్తిగత దేవుడుగా తెలుసుకు న్నాడు. ఆయన ప్రవర్తన గురించి ధ్యానించుటలో ఆయన సముఖాన్ని గూర్చి మరెక్కువ నేర్చకున్నాడు. నిరంతరమైన ఆయన హస్తాల్లో అతడు ఆశ్రయం కనుగొన్నాడు.MHTel 418.1

    ఈ అనుభవం తరువాత తన కాపరి కొంకి కర్రకు బదులు అధికార దండం చేపట్టటానికి, తన మందలను విడిచి పెట్టి ఇశ్రాయేలు ప్రజలనాయ కత్వాన్ని చేపట్టటానికి వచ్చిన పిలుపును విన్నాడు. దైవాజ్ఞ అతణ్ణి ఆత్మ విశ్వాసం లేనివాడిగా, నోటిమాంథ్యం గలవాడిగా, పిరికి వాడిగా తెలుసు కుంది. దేవుని తరపున వక్త కావటానికి తన అసమర్ధతా భావం తనను నింపింది. కాని తన సంపూర్ణ విశ్వాసాన్ని ప్రభువు పై ఉంచి ఆ బాధ్యత స్వీకరించాడు. అతడి మహాకార్య ఔన్నత్యం తన ఉత్తమ మానసిక శక్తుల వినియోగాన్ని కోరింది. అతడి సంసిద్ధతను, విధేయతను దేవుడు దీవిం చాడు. మానవుడికి అప్పగించబడ్డ కార్యాల్లో అత్యున్నత కార్యనిర్వహణకు అతడికి వాగ్దాటి, ఆశాభావం, ధైరం, ఇచ్చి ఆకార్యానికి అతణ్ణి సమర్ధుణ్ణి చేసాయి. అతణ్ణి గురించి లేఖనం ఇలా చెబుతున్నది.MHTel 418.2

    “యెహోవాను ముఖాముఖీగా ఎరిగిన మోషే వంటి యింకొక ప్రవక్త ఇశ్రాయేలీయులలో ఇది వరకు పుట్టలేదు”. ద్వితీయో 34:12.MHTel 419.1

    తూర్పునుండియైననున పడమటి నుండియైనను అరణ్యముండి యైనను హెచ్చు కలుగదు. దేవుడే తీర్పు తీర్చువాడు. ఆయన ఒకని తగ్గిం చును ఒకని హెచ్చించును ” కీర్తనలు 75:6,7.MHTel 419.2

    తమ పనిని ఎవరూ అభినందించటంలేదని బాధపడేవారు, గొప్ప బాధ్యత గల హోధాను ఆశించేవారు “తూర్పు నుంచియైనను పడమటి నుండియైనను అరణ్యమునుండియైనను హెచ్చు కలగదు. దేవుడే తీర్పు తీర్చువాడు. ఆయన ఒకని తగ్గించును ఒకని హెచ్చించును”. (కీర్తనలు 75: 6,7) అన్నదాన్ని పరిగణించాలి. దేవుని నిత్య ప్రణాళికలో ప్రతీ మనిషికి ఓ స్థానం ఉన్నది. మనం ఆ స్థానాన్ని అక్రమించగలమో లేమో మనం దేవునితో సహకరించటంలో నమ్మకంగా ఉండటంపై ఆధారపడి ఉంటుంది.MHTel 419.3

    స్వయం కనికరం గురించి జాగ్రత్తగా ఉండాలి. పొందాల్సి నంత గౌరవాన్ని మీరు పొందటం లేదని, మీ కృషికి గుర్తింపు లేదని, మీ పని చాలా కష్టమయ్యిందని ఎన్నాడూ తలంచకూడదు. క్రీస్తు మనకోసం ఎంత భరించాడో అన్నదాని జ్ఞాపకం ప్రతీ గొణుగుడి ఆలోచనను అణిచివెయ్యాలి. మన ప్రభువు కన్నా మనం మెరుగుగా గౌరవించబడుతున్నాం. “నీ నిమ్మితము నీవు గొప్పవాటిని వెదకుచున్నావా; వెదకవద్దు” యిర్మీయా 45:5 సిలువను మొయ్యటంకన్నా కిరిటాన్ని సంపాదించటానికి ఎక్కువ ఆశ చూపేవారికి దేవుని సేవలో చోటుండదు. తాము పొందాల్సిన ఫలలు అందుకోవటం పై కన్నా తమ విధి నిర్వహణ పై ఎక్కువ ఆసక్తి ఎవరు చూపిస్తారో ఆ మనుషులు పదోన్నతి కన్నా నియమపాలనకు ఎక్కువ ప్రాధన్యమిచ్చే మనుషులు కావాలని ఆయన కోరుతున్నాడు.MHTel 419.4

    దీన మనసు కలిగి తమ పనిని దేవుని నిమిత్తం చేసేటట్లు చేసేవారు హడావుడి చేస్తూ స్వీయ ప్రాధాన్యాన్ని చాటుకునేవారిలో గొప్ప ఆడంబరాన్ని ప్రదర్శించరు. గొప్ప ఆడంబరాన్ని ప్రదర్శించేవారు తరుచు ప్రజలకు దేవునికి మధ్య నిలబడి తమ మీదికే గమనాన్ని ఆకర్షిస్తారు. వారి సేవ నిష్పలమౌతుంది. “జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపాదన అంతయు ఇచ్చిన బుద్ది సంపాదించు కొనుము. దాని గొప్ప చేసిన యెడల అది నిన్ను హెచ్చంచును. దాని కౌగ లించినయెడల అది నీకు ఘనతను తెచ్చును. “సామెతలు 4:7,8MHTel 420.1

    దిద్దుబాటు చేసుకోవటానికి దృఢ సంకల్ప లేదు గనుక అనేకులు మార్పు లేకుండా అదే పంధాలో కొనాసాగుతుంటారు. ఇది ఇలాగే కొనసాగనక్కరలేదు. వారు తమ శక్తులను వృద్ధిపర్చుకుని ఉత్తమ సేవలు చెయ్యవచ్చు. అప్పుడు వారు నిత్యం నిపుణత గల పనివారై ఉంటారు. తమ విలువను బట్టి వారు ఆదరణ పొందుతారు. ఉన్నత హోదాలకు ఎవరైనా అర్హులైతే వారిమీదే కాక వారిని పరీక్షించే వారి మీద అర్హతను తెలిసిన వారి మీద, వారిని ముందుకి సాగమని ప్రోత్సహించేవారి మీద కూడా ప్రభువు భారాన్ని మోపుతాడు. తమకు నియమితమైన విధిని దిన దినం నమ్మకంగా నిర్వర్తించేవారు, దేవుడు ఏర్పర్చుకున్న సమయంలో “పై హోదాకి రండి” అన్న పిలుపు వింటారు.MHTel 420.2

    బేల్లెహేము కొండల్లో గొల్లలు తమ మందల్ని కాసుకుంటున్నప్పుడు పరలోకం నుంచి దూతలు వచ్చి వారిని సందర్శించారు. అలాగే నేడు వినయుడైన దేవుని సేవకుడు తన పనిని చేస్తున్నప్పుడు దేవ దూతలు అతడి పక్క నిలబడి అతడి మాటలు వింటారు. అతడి సేవ ఎలా జరుగుతన్నదో చూస్తారు. అతడికి ఉన్నత బాధ్యతలు ఇవ్వవచ్చునో లేదో పరిశీలిస్తారు.MHTel 420.3

    తమ భాగ్యాన్ని బట్టి, విద్యను బట్టి లేక తమ హోదానుబట్టి మనుషుల్ని దేవుడు అంచనా వెయ్యడు. వారి ఉద్దేశం పవిత్ర తను బట్టి, ప్రవర్తన సౌందర్యాన్ని బట్టి వారిని అంచాన వేస్తాడు. వారికి తన ఆత్మ ఎంత ఉన్నదో వారి జీవితాలు తన పోలికను ఎంత మేరకు వెల్లడి చేస్తున్నాయో తెలుసుకోవటానికి ఆయన ఎదురు చూస్తున్నాడు. దేవుని రాజ్యంలో గొప్పవారవ్వటమంటే విధేయతతో, విశ్వాస సామన్యతలో పవిత్ర ప్రేమలో చిన్న పిల్లల్లా ఉండటం.MHTel 420.4

    “అన్య జనులలో అధికారులు వారి మీద ప్రభుత్వము చేయుదు రనియు, వారిలో గొప్పవారు వారి మీద ప్రభుత్వము చేయుదురనియు, మీకు తెలియును. మీలో అలాగుండకూడదు; మీలో ఎవడు గొప్పవాడై యుండగోరునో వాడు మీ పరిచారకుడైయుండవలెను”మత్తయి 20:25,26MHTel 421.1

    మనుషులకు దేవుడివ్వగల వరాలన్నిటిలోను క్రీస్తుతో ఆయన శ్రమల్లో సహానం గొప్పధర్మనిధి, అత్యున్నత గౌరవం. చీకటి బిలంలో ఒంటరిగా నశించిన స్నానికుడైన యోహాను కన్నా గొప్పవారు లేక ఎక్కువ గౌరవానికి అర్హులు పరలోకానికి ఆరోహణమైన హనోక గాని, అగ్ని రథంలో పరలోకానికి ఎత్తబడ్డ ఏలీయాగాని కారు. “క్రీస్తు నందు విశ్వాసముంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహించబడెను. ” ఫిలిప్పీ 1:30MHTel 421.2

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents